Ananya Pandey, Aditya Roy Kapoor Confirm Dating Rumours? - Sakshi
Sakshi News home page

Ananya Pandey: అనుకోకుండా బయటపెట్టింది! వాటేసుకుని మరీ

Published Wed, Jul 12 2023 3:38 PM | Last Updated on Wed, Jul 12 2023 3:52 PM

Ananya Pandey Aditya Roy Kapoor Dating Confirm - Sakshi

Ananya Pandey Aditya Roy Kapoor: టాలీవుడ్‌లో తక్కువ గానీ బాలీవుడ్‌లో మాత్రం హీరోయిన్లు డేటింగ్, బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ముందుంటారు. ఇప్పుడున్న స్టార్ హీరో హీరోయిన్లు దాదాపుగా డేటింగ్-రిలేషన్ లాంటి వాటిలో ఉండి వచ్చినవాళ్లే. వాళ్ల గురించి ఇప్పుడేం చెప్పట్లేదు. హీరోయిన్ అనన్య పాండే మాత్రం ప్రస్తుతం ఓ హీరోతో సీరియస్ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని బయటపెట్టేసింది కూడా.

హీరోయిన్‌గా నో హిట్
సాధారణంగా హీరోయిన్ అయిన తర్వాత ఒకటి కాకపోతే మరో సినిమాతో అయినా హిట్ కొడతారు. అందుకోసం ప్రయత్నిస్తారు. కానీ అనన్య పాండేని చూస్తే అలా అస్సలు అనిపించదు. ఎందుకంటే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్  2' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో, కాలీ పీలీ, గెహ్రాయాన్, లైగర్ చిత్రాల్లో నటించింది. కానీ వీటిలో ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు.

(ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)

రెండో బాయ్ ఫ్రెండ్
తండ్రి చుంకీ పాండే నటుడు కావడంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనన్య పాండే.. సక్సెస్ కంటే డేటింగ్ రూమర్స్‌తోనే ఎక్కువ పాపులర్ అయింది. గతంలో హీరో ఇషాన్ కట్టర్ తో 'కాలీ పీలీ' సినిమా చేసింది. షూటింగ్ సమయంలో వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు, ఆ తర్వాత విడిపోయారని సమాచారం. ఇప్పుడు హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.

స్పెయిన్‌లో హగ్గులు
గతేడాది దీపావళి సందర్భంగా హీరోయిన్ కృతిసనన్ పార్టీ ఇచ్చింది. అప్పుడు లీక్ అయిన ఓ ఫొటో వల్ల అనన్య-ఆదిత్య డేటింగ్ విషయం బయటపడింది. ఇప్పుడు వీళ్లిద్దరూ స్పెయిన్‌లోని ఓ కన్సర్ట్ చూడటానికి వెళ్లారు. ముంబయి నుంచి విడివిడిగానే వెళ్లినప్పటికీ ఇన్ స్టాలో స్టోరీలు పోస్ట్ చేయడంతో ఒకేచోట ఉన్నారని అందరికీ అర్థమైంది. అలానే ఓ బ్రిడ్జిపై హగ్ చేసుకున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్ల డేటింగ్ నిజమని తేలిపోయింది. 

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌ వల్లే నాకు విడాకులు.. ఎప్పటికీ తనని క్షమించను: సింగర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement