
సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్పులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలైతే పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.

హీరోయిన్‌తో పార్టీ !
దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించనేలేదు. ఇంతలో ఆదిత్య రాయ్ కపూర్ మరో హీరోయిన్‌తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సారా అలీ ఖాన్‌తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్ ఢిల్లీ అనే సినిమా సెట్స్‌లో డైరెక్టర్ అనురాగ్ బసు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.

అది సహజమే..
ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్‌తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు.
#SaraAliKhan and #AdityaRoyKapur celebrating #AnuragBasu sir's bday on the sets of #MetroInDino 🥹💕 pic.twitter.com/pab1vBwa68
— sakt` (@SarTikFied) May 8, 2024