ఎట్టకేలకు తన చిరకాల నేరవేరిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే. ఈమేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేస్తూ ఫ్యాన్‌గర్ల్ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తుంది. తన అభిమాన ఆటగాడు డేవిడ్ బెక్‌హాంను కలుసుకున్నానంటూ ఆమె మురిసిపోయింది. కాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ సెమిఫైనల్స్ చూసేందుకు అనన్య హజరైంది. ఈ సందర్భంగా తన అభిమాన ఆటగాడు, మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బేక్‌హాంను ఆమె కలుసుకుంది.
డ్రెస్సింగ్ రూం వద్ద ఫార్మల్ సూట్‌లో ఉన్న డేవిడ్‌ను స్టేడియంలో ఉన్న అనన్య ఆయనను చూసింది. డేవిడ్ తన ఫ్యాన్స్‌కి చేయి ఊపాడు. అదే సమయంలో అనన్య తన అభిమాన ఆటగాడిని తన ఫోన్ కెమెరాలో క్లిక్ మనిపించింది. ఇక ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఓకే.. ఐ యామ్ డన్.. ఇది నా చిరకాల కోరిక.. డేవిడ్ బేక్‌హాం పూర్తిగా నావైపే చేయి ఉపారు’ అంటూ అనన్య మురిసిపోయింది. డిసెంబర్ 14న సెమిఫైనల్స్‌లో తలపడిన అర్జెంటీనా వర్సెస్ క్రొయేషియా మ్యాచ్ చూసేందుకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్ కపూర్, చుంకీ పాండే, ఆదిత్య రాయ్ కపూర్‌తో తదితరలు హాజరయ్యారు. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సోదరితో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించారు.
🤩Popular Bollywood actors Sanjay Kapoor, Aditya Roy Kapur & Chunky Panday, tennis star Sania Mirza and other personalities spotted at Nammos, Al Maha Island! #ILoveQatar #Qatar #Qatar2022 #WorldCupQatar2022 #almahaisland pic.twitter.com/yLJFFyxAov
— ILoveQatar - Live (@ILQLive) December 13, 2022
చదవండి:
‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్, అవేంటంటే..
మహేశ్-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్! సూపర్ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్ నటుడు?
Comments
Please login to add a commentAdd a comment