David Beckham
-
డేవిడ్ బెక్హాంకు అంబానీ అదిరిపోయే ట్రీట్..!
-
అంబానీ యాంటిలియాలో ఫుట్‌బాల్ లెజెండ్ 'బెక్‌హామ్' - ఫోటోలు వైరల్
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ముఖేష్ అంబానీ' ఇటీవల ఫుట్‌బాల్ లెజెండ్ 'డేవిడ్ బెక్‌హామ్'కు తన యాంటిలియాలో ఆతిధ్యమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై గట్టి విజయం సాధించిన తర్వాత డేవిడ్ బెక్‌హామ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను కలిశాడు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్టేడియంలో థ్రిల్లర్ మ్యాచ్‌ను వీక్షించారు. డేవిడ్ బెక్‌హామ్‌కు అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం, యాంటిలియాలో ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో నీతా అంబానీ, కుమార్తె ఇషా, కుమారుడు ఆకాష్‌తో కలిసి శ్లోకా మెహతా, రాధికా మర్చంట్ కూడా ఉన్నారు. వాంఖడే స్టేడియంలో ఆకాష్ అంబానీ, డేవిడ్ బెక్‌హామ్ కలిసి మ్యాచ్ వీక్షించారు. నటులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్ ఇక్కడ హాజరయ్యారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్‌తో 265 కిమీ రేంజ్! బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా డేవిడ్ బెక్‌హామ్‌కి వారి ముంబై నివాసంలో వెల్కమ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి అనిల్ కపూర్, ఫర్హాన్ అక్తర్, కరిష్మా కపూర్లతో సహా పలువురు బాలీవుడ్ తారలు మిస్టర్ బెక్‌హామ్‌తో హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) -
Sonam Kapoor Latest Photos: వరల్డ్ కప్ కోసం వచ్చిన డేవిడ్ బెక్‌హామ్‌కు విందుపార్టీ ఇచ్చిన హీరోయిన్ (ఫోటోలు)
-
దిగ్గజాలు కలిసిన వేళ.. సచిన్, విరాట్లతో ముచ్చటించిన డేవిడ్ బెక్‌హమ్
భారత్, న్యూజిలాండ్ మధ్య నిన్న జరిగిన వరల్డ్‌కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్‌కు ఎంతో మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బెక్‌హమ్ యూనిసెఫ్ ప్రతినిధి హోదాలో ఇండియాలో పర్యటిస్తున్నాడు. షెడ్యూల్లో భాగంగా అతను వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా బెక్‌హమ్.. క్రికెట్ గాడ్, యూనిసెఫ్ ప్రతినిథి అయిన సచిన్ టెండూల్కర్‌ను కలిసాడు. వీరిద్దరు చాలా సేపు ముచ్చటించారు. సచిన్ ఫుట్‌బాల్‌కు వీరాభిమాని కావడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరింది. సచిన్, బెక్హమ్లు క్రికెట్, ఫుట్‌బాల్‌కు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకున్నారు. సచిన్ బెక్‌హమ్‌ను ముంబై ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వాంఖడే స్టేడియం మొత్తం తిప్పాడు. యూనిసెఫ్ ప్రతినిధి హోదాలో బెక్‌హమ్‌కు ఐసీసీ గౌరవ వందనం తెలుపుతూ మ్యాచ్‌కు ముందు మైదానంలోకి ఆహ్వానించింది. Fantastic footage 👍 https://t.co/Uh8hM4GFsS — Michael Vaughan (@MichaelVaughan) November 15, 2023 అనంతరం టీమిండియా, కివీస్ క్రికెటర్లంతా బెక్‌హమ్‌ను పరిచయం చేసుకున్నారు. బెక్‌హమ్ కింగ్ విరాట్ కోహ్లితో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్‌మీడియాలో షేర్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ దాన్ని రీట్వీట్ చేశాడు. ఈ వీడియో నిన్నటి నుంచి నెట్టింట హల్చల్ చేస్తుంది. కాగా, బెక్‌హమ్ ప్రస్తుతం ఇంటర్ మయామీ అనే ఫుట్‌బాల్ క్లబ్‌కు కో ఓనర్‌గా ఉన్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్‌తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. -
ఫుట్‌బాల్‌ను తాకిన క్రికెట్ ఫీవర్.. భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్‌కు విశిష్ట అతిథులు
క్రికెట్ ఫీవర్ యూనివర్సల్ గేమ్ ఫుట్‌బాల్‌ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్,న్యూజిలాండ్ వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్ హాజరుకానున్నాడని తెలుస్తుంది. బెక్‌హమ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు క్యూ కట్టనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, తలైవా రజినీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంకు తరలిరానున్నారని ప్రచారం జరుగుతుంది. బెక్‌హమ్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ స్టైలిష్ ఫుట్‌బాలర్, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను గతంలో చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. అలాగే బెక్‌హమ్‌కు ఇండియా అన్న ఈ దేశ క్రికెటర్లన్నా ప్రత్యేకమైన అభిమానం. ఓ సందర్భంలో అతను విరాట్ కోహ్లి పేరు ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటగాడిగా ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక పలు క్లబ్‌లకు కోచ్‌గా సేవలందించిన బెక్‌హమ్.. ప్రస్తుతం ఇంటర్ మయామీ ఫుట్‌బాల్ క్లబ్ కో ఓనర్‌గా ఉన్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. #WATCH | Tamil Nadu: Actor Rajinikanth leaves from Chennai airport to witness the World Cup semi-finals scheduled to be played at Wankhede Stadium in Mumbai. "I am going to see the match..," says Actor Rajinikanth pic.twitter.com/yWg1WpRHXX— ANI (@ANI) November 14, 2023 -
కొనసాగుతున్న మెస్సీ మేనియా.. కళ్లు చెదిరే గోల్ చేసిన ఫుట్‌బాల్ దిగ్గజం
పీఎస్జీని వీడి డేవిడ్ బెక్‌హమ్ ఇంటర్ మయామీ క్లబ్లో చేరిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. ఈ అమెరికన్ క్లబ్ తరఫున తన గోల్స్ పరంపరను కొనసాగిస్తున్నాడు. లీగ్స్ కప్‌లో భాగంగా ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఓ కళ్లు చెదిరే గోల్‌తో మెరిశాడు. What can't he do?! 🐐 Make it NINE goals in six games for Leo Messi. pic.twitter.com/HLf3zBFTmV — Major League Soccer (@MLS) August 15, 2023 మ్యాచ్ 20వ నిమిషంలో పెనాల్టీ ఏరియా బయట 36 గజాల దూరం నుంచి మెస్సీ చేసిన గోల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్‌లో మయామీ ఆటగాళ్లు మార్టినెజ్, జోర్డీ అల్బా, డేవిడ్ రూయిజ్ కూడా గోల్స్ చేసినప్పటికీ.. మెస్సీ చేసిన గోలే మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. మెస్సీ కెరీర్లో ఇది సెకండ్ లాంగెస్ట్ గోల్ కావడం విశేషం. ఈ గోల్‌తో మెస్సీ ఇంటర్ మియామీ తరఫున తన గోల్స్ సంఖ్యను 9కి పెంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. మెస్సీ, మార్టినెజ్, జోర్డీ, రూయిజ్ గోల్స్ చేయడంతో మయామీ.. ఫిలడెల్ఫియాపై 4-1 గోల్స్ తేడాతో గెలుపొంది, లీగ్స్ కప్ ఫైనల్స్‌కు చేరింది. ఫిలడెల్ఫియా తరఫున అలెజాండ్రో బెడోయా ఏకైక గోల్ చేశాడు. కాగా, మెస్సీ ఇంటర్ మయామీ తరఫున బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ గోల్ చేశాడు. మాయమీ తరఫున ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ మొత్తం 9 గోల్స్ చేశాడు. తద్వారా మయామీ తరఫున ఆరు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. మెస్సీకి ముందు గొంజాలో హిగ్వేన్ (29), లియోనార్డో కంపానా (16) ఉన్నారు. -
అనన్య ఫ్యాన్‌గర్ల్ మూమెంట్.. ‘ఆయన నాకు చేయి ఊపారు’
ఎట్టకేలకు తన చిరకాల నేరవేరిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే. ఈమేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేస్తూ ఫ్యాన్‌గర్ల్ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తుంది. తన అభిమాన ఆటగాడు డేవిడ్ బెక్హాంను కలుసుకున్నానంటూ ఆమె మురిసిపోయింది. కాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ సెమిఫైనల్స్ చూసేందుకు అనన్య హజరైంది. ఈ సందర్భంగా తన అభిమాన ఆటగాడు, మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బేక్హాంను ఆమె కలుసుకుంది. డ్రెస్సింగ్ రూం వద్ద ఫార్మల్ సూట్లో ఉన్న డేవిడ్‌ను స్టేడియంలో ఉన్న అనన్య ఆయనను చూసింది. డేవిడ్ తన ఫ్యాన్స్‌కి చేయి ఊపాడు. అదే సమయంలో అనన్య తన అభిమాన ఆటగాడిని తన ఫోన్ కెమెరాలో క్లిక్ మనిపించింది. ఇక ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఓకే.. ఐ యామ్ డన్.. ఇది నా చిరకాల కోరిక.. డేవిడ్ బేక్హాం పూర్తిగా నావైపే చేయి ఉపారు’ అంటూ అనన్య మురిసిపోయింది. డిసెంబర్ 14న సెమిఫైనల్స్లో తలపడిన అర్జెంటీనా వర్సెస్ క్రొయేషియా మ్యాచ్ చూసేందుకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్ కపూర్, చుంకీ పాండే, ఆదిత్య రాయ్ కపూర్‌తో తదితరలు హాజరయ్యారు. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సోదరితో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించారు. 🤩Popular Bollywood actors Sanjay Kapoor, Aditya Roy Kapur & Chunky Panday, tennis star Sania Mirza and other personalities spotted at Nammos, Al Maha Island! #ILoveQatar #Qatar #Qatar2022 #WorldCupQatar2022 #almahaisland pic.twitter.com/yLJFFyxAov — ILoveQatar - Live (@ILQLive) December 13, 2022 చదవండి: ‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్, అవేంటంటే.. మహేశ్-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్డేట్! సూపర్ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్ నటుడు? -
కడసారి చూపులకు 13 గంటలు నిరీక్షించిన మాజీ కెప్టెన్
గతవారం ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాణి ఎలిజబెత్ పార్థివదేహం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంది. సోమవారం(సెప్టెంబర్ 19 వరకు) ఉదయం 6:30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. కాగా 72 ఏళ్లు ఇంగ్లండ్‌ను పాలించిన ఎలిజబెత్‌ను కడసారి చూడడం కోసం జనాలు బారులు తీరారు. వారిలో ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హమ్ కూడా ఉన్నాడు. అయితే అతను కావాలనుకుంటే సెలబ్రిటీ హోదాలో రాణి ఎలిజబెత్‌ను వీఐపీ స్లాట్‌లో డైరెక్ట్‌గా చూడొచ్చు. కానీ బెక్‌హమ్ అలా చేయలేదు. ప్రొటోకాల్ పాటిస్తూ దాదపు 13 గంటల పాటు సామాన్యులతో కలసి క్యూ లైన్లో నిల్చున్న బెక్‌హమ్ శుక్రవారం సాయంత్రం క్వీన్ ఎలిజబెత్‌కు కడసారి నివాళి అర్పించాడు. బెక్‌హమ్ చర్యపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే విషయమై రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బెక్‌హమ్ మాట్లాడాడు. ''మనందరం కలిసి రాణి ఎలిజబెత్-2ను కడసారి చూడడానికి వచ్చాం.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవాలనుకున్నాం.. ఇలాంటి సమయంలో సెలబ్రిటీ హోదా కన్న ఒక మాములు వ్యక్తిగా చూద్దామనుకున్నా. అందుకే ప్రొటోకాల్ పాటిస్తూ 13 గంటల పాటు క్యూలైన్లో నిల్చొన్నా. ఇలా చేసినందుకు నాకు బాధ లేదు.. ఎందుకంటే మనం ఒకరిని కడసారి చూసేందుకు వెళుతున్నాం. అందుకే రాణి దర్శనం కోసం ఎన్ని గంటలైనా సరే నిరీక్షించాలని అనుకున్నా. చివరికి ఆమెకు కడసారి నివాళి అర్పించా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాణి ఎలిజబెత్-2 శవపేటికను ఉంచిన వెస్ట్‌మినిస్టర్ హాల్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇప్పటివరకు దాదాపు 750,000 మంది రాణి ఎలిజబెత్‌ను కడసారి చూడడానికి పోటెత్తారు. Absolute kudos to David Beckham who queued with other members of the public for 12 hours. pic.twitter.com/famWJIlNet — Dan Wootton (@danwootton) September 16, 2022 చదవండి: కొంప ముంచిన వికెట్ కీపర్ హెల్మెట్ -
ఇప్పటికీ ఉంది
అమ్మాయి బాగుంది! చూడగానే గుండె క్షణమాగి కొట్టుకుంది. పేరడగాలి. భయం. పేరే అడగలేనప్పుడు ఫోన్ నెంబర్ ఏమడుగుతాం! ఇరవై మూడేళ్ల క్రితం విక్టోరియా అనే అమ్మాయిని చూడగానే డేవిడ్ బెక్‌హామ్‌కి కూడా ఇలాగే భయం వేసింది. అయితే అతడికి పేరు అడిగే అవసరం రాలేదు. విక్టోరియా అప్పటికే విశ్వవిఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, సింగర్. బెక్‌హామ్‌కి ఆమెను ఫోన్ నెంబర్ అడగాలని ఉంది. నెంబర్ తీసుకుని రోజూ మాట్లాడాలని ఉంది. అప్పటికే అతడు కూడా పేరున్న ఫుట్‌బాల్ ప్లేయర్. పైగా ఇంగ్లండ్ జట్టుకు అప్పుడే కెప్టెన్ అయ్యాడు. అయినా విక్టోరియా నెంబర్ అడగడానికి ధైర్యం సరిపోలేదు. ఏదో పార్టీలో చూశాడు ఆమెను. ధైర్యం కోసం ఇలాంటి అబ్బాయిలు ఆల్కహాల్ సేవిస్తారు. అయితే బెక్హోమ్.. ఆ అమ్మాయి ఆల్కహాల్ సేవించే వరకు ఆగాడు. మరికొంచెం తీసుకునే వరకు ఆగాడు. ఇంకొంచెం తాగనిచ్చాడు. అప్పుడు వెళ్లి ఫోన్ నెంబర్ అడిగాడు! విక్టోరియా నవ్వింది. పెన్ కోసం పక్కకు చూసింది. ‘‘నా దగ్గర ఉంది’’ అని.. తను కూడా ఎక్కడో పక్కనుంచి తీసుకున్న పెన్ని ఆమెకు ఇచ్చాడు. విక్టోరియా దగ్గర కాగితం లేదు. హ్యాండ్‌బ్యాగ్‌లో వెతికి ట్రెయిన్ టిక్కెట్ ఉంటే తీసి, దానిమీద తన ఫోన్ నెంబర్ రాసి బెక్‌హామ్‌కి ఇచ్చింది. ‘‘ఇప్పటికీ ఆ టిక్కెట్ నా దగ్గర ఉంది’’ అని గురువారం జిమ్మీఫాలెన్ లేట్ నైట్ షోలో చెప్పాడు బెకహామ్. మంచి భర్తే. -
డేవిడ్ బెక్‌హమ్ కోసం సెర్చ్ చేస్తే.. సస్పెండ్ చేశారు!
లండన్: భారత సంతతికి చెందిన ఓ పోలీస్ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగ పరచినందుకుగాను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. దీనికి కారణం.. అతను ఆఫీస్‌లోని కంప్యూటర్లో దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్హమ్లకు సంబంధించిన సమాచారాన్ని వెతకడమే. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని లీసెస్టర్‌షైర్ ప్రాంతానికి చెందిన పోలీసు విభాగంలో అజిత్ సింగ్(48) పనిచేస్తున్నాడు. అయితే విధుల్లో ఉండి, అధికారాన్ని దుర్వినియోగపరచి బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్‌హమ్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతకడంతో పోలీస్ విభాగ అధికారులు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అజిత్ సింగ్ 2002, 2018 సంవత్సరాల్లో కంప్యూటర్లో సమాచారాన్ని దుర్వినియోగపరచాడని తేటతెల్లమైంది. లీసెస్టర్‌లోని మాన్స్ఫీల్డ్ హౌస్ పోలీస్ స్టేషన్లో అజిత్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కంప్యూటర్ను ఉపయోగించి మొత్తం 146 సార్లు పోలీస్ డేటాబేస్‌ను అనాధికారికంగా వినియోగించాడని రుజువైంది. అందులో ఎక్కువగా డేవిడ్ బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్‌హమ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, ఆస్తి పాస్తులను గూర్చి ఎక్కువగా వివరాలను సేకరించే ప్రయత్నం చేశాడని రుజువైంది. ఇందుకుగాను లీసెస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం దుష్ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన కింద మూడు నెలల జైలు శిక్షతో పాటు ఎటువంటి విధులు నిర్వర్తించకుండా సంవత్సరంపాటు సస్పెండ్ చేసింది. అంతేకాక చట్టపరమైన ఖర్చులకు 300 పౌండ్లు, బాధితులకు సర్‌చార్జీ కింద 115 పౌండ్లు చెల్లించాలని ఆదేశించారు. కాగా అజిత్ సింగ్ (48) ప్రస్తుతం అనారోగ్య సెలవుపై ఉన్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జూలియన్ లెస్టర్ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రవర్తన పోలీసు శాఖలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నేరారోపణలు రుజువైన పక్షంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అజిత్ సింగ్‌కు ఇతరులకు ఎటువంటి హానిచేసే ఉద్దేశం లేదని, కంప్యూటర్‌తో తను శోధించిన సమాచరంతో తనకు చిల్లిగవ్వంత ఆస్తి కూడా సంపాదించలేదని అతని తరపున లాయర్ అలెగ్జాండర్ బార్బర్ కోర్టుకు విన్నవించారు. -
ఫైనల్.. ఆ రెండు జట్లు ఆడితేనే మజా!
బీజింగ్: ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచాన్ని ఇప్పుడు ఊపేస్తోంది. ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్‌లు.. యువఆటగాళ్ల మెరుపు గోల్స్... సీనియర్లు నిరుత్సాహపరచటం... ఇలా ఊహించని పరిణామాలు ప్రేక్షకులకు మజాను పంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌పై ఫుట్‌బాల్ ఐకాన్, ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హమ్(43) స్పందించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్ జరగాలన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. చైనాలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న బెక్‌హమ్.. ఇంగ్లాండ్ తొలివిజయంపై(ట్యూనీషియాపై 2-1 తేడాతో) స్పందిస్తూ... ‘ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకోవాలి. అక్కడ అర్జెంటీనాతో తలపడాలి. ఆ రెండూ పోటాపోటీగా ఆడుతుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇందుకోసం ఇంగ్లాండ్ టీం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ దఫా చాలా బలమైన జట్లు కనిపిస్తున్నాయి. కానీ, నేను కోరుకునేది మాత్రం ఫైనల్లో ఈ రెండు జట్టు ఆడాలనే. ఎందుకంటే ఇంగ్లాండ్ నా జట్టు కాబట్టి’ అని బెక్‌హమ్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో యువ సభ్యులే ఎక్కువగా ఉన్నారని, పైగా వారిలో చాలా మందికి ప్రపంచ కప్ ఆడిన అనుభవం కూడా లేదని ఆయన అంటున్నాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దని, కఠోరశ్రమతో ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఈ దిగ్గజం చెబుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు 1966లో ఫిఫా కప్‌ను గెల్చుకున్న ఇంగ్లాండ్ టీం ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శనను కొనసాగించలేదు. చివరిసారిగా బెక్‌హమ్ సారథ్యంలోనే ఇంగ్లాండ్ 2006 ఫిఫా వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్లగలిగింది. అయితే అర్జెంటీనాతో బెక్‌హమ్ ఆడిన ఓ రెండు మ్యాచ్‌లు మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. 1998లో ఫ్రాన్స్‌లో జరిగిన ఫిఫా టోర్నీలో అర్జెంటీనా-ఇంగ్లాండ్ మ్యాచ్ సందర్భంగా రెడ్ కార్డ్ ద్వారా బెక్‌హమ్ మైదానం వీడాల్సి వచ్చింది. అయితే 2002 ఫిఫా టోర్నీ మ్యాచ్‌లో మాత్రం పెనాల్టీ గోల్ ద్వారా ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించిన అర్జెంటీనాపై బెక్‌హమ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. -
భారత్‌లో ఆడనున్న బెక్‌హామ్?
అంతా అనుకున్నట్లుగా జరిగితే ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ వచ్చే ఏడాది భారత్‌లో ఫుట్‌బాల్ ఆడనున్నాడు. 2017 మార్చిలో జరిగే ఫుట్సాల్ లీగ్ రెండో సీజన్లో ఆడేందుకు బెక్‌హామ్‌తో పాటు కాకా (బ్రెజిల్) కూడా ఆసక్తి చూపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది ఈ లీగ్ తొలి సీజన్ ఆరు జట్లతో జరిగింది. వచ్చే ఏడాది ఎనిమిది జట్లతో లీగ్‌ను నిర్వహించనున్నారు. -
కొడుకు డేటింగ్‌పై తల్లి ఆందోళన!
లండన్: ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బేక్హమ్, ఫ్యాషన్ ఐకాన్ విక్టోరియా బేక్‌హామ్ దంపతుల పెద్ద కొడుకు బ్రూక్లిన్ అప్పుడే ప్రేమలో మునిగిపోయాడు. 16 ఏళ్ల ఈ కుర్రాడు ఫ్రెంచ్ మోడల్ సొనియా బెన్ అమ్మర్ (16)తో డేటింగ్ చేస్తున్నాడు. బీచ్‌లో వారిద్దరు ప్రణయసల్లాపాలు సాగిస్తున్న ఫొటోలను తాజాగా బ్రూక్లిన్ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. అంతేకాకుండా 'ద ఫిఫ్త్ వేవ్' నటి కోల్ గ్రేస్ మోరెట్జ్ తోనూ సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ భామ గతవారం లండన్‌లో తన సినిమా ప్రమోషన్‌కు వచ్చినప్పుడు ఈ ఇద్దరు కలుసుకున్నారు. సహజంగానే తన కొడుకు డేటింగ్ వ్యవహారం తల్లి విక్టోరియాకు ఆందోళన కలిగిస్తున్నదని డేవిడ్ పేర్కొన్నాడు. 'వయస్సులో చిన్నవాడైన కొడుకు బయటకు వెళ్లి డేటింగ్ చేయడాన్ని చూడటం నా కన్నా తల్లికే కష్టంగా ఉంది' అని ఓ టీవీ షోలో ఆయన పేర్కొన్నాడు. తమ కూతురు పెద్దదై.. తను కూడా డేటింగ్ చేస్తుందన్న ఆలోచనే తమకు భరించడం కష్టంగా ఉందని ఆయన అన్నాడు. అప్పటికీ తమ దృక్పథంలో మార్పు రావచ్చునని చెప్పాడు. -
వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్‌గా సాకర్ వీరుడు!
లాస్ఏజింల్స్: బ్రిటిష్ సాకర్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్ మరో ఘనత సొంతం చేసుకున్నారు. ఆన్ ఫీల్డ్‌లోనూ ఆఫ్ ఫీల్డ్‌లోనూ అంతర్జాతీయ సెలబ్రిటీగా పేరొందిన ఆయనను పీపుల్ మ్యాగజీన్ ప్రపంచంలోనే జీవించి ఉన్న వ్యక్తల్లో సుకుమారుడిగా (సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్) ఎంపిక చేసింది. మ్యాగజీన్ 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ టైటిల్‌ను అందుకున్న 40 ఏళ్ల బెక్‌హామ్ మాట్లాడుతూ ఈ పురస్కారం అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు, ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నట్టు తెలిపాడు. రిటైర్డ్ ఫుట్‌బాల్ ఆటగాడైన డేవిడ్ బెక్‌హామ్ సతీమణి విక్టోరియా బెక్‌హామ్ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్. దీంతో ఆయన అందంగా కనిపించేందుకు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సహజంగా అందగాడు, ప్రముఖ ఆటగాడు అయిన బెక్‌హామ్ పెప్సీ, ఆడిదాస్ వంటి ప్రముఖ వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. జార్జియో ఆర్మానీ అండర్వేర్లకు మోడల్‌గా వ్యవహరించాడు. నలుగురు పిల్లలకు తండ్రి అయిన బెక్‌హామ్ పీపుల్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. తను అందంగా, ఆకర్షణీయంగా, సెక్సీ పర్సన్‌గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపాడు. 41 ఏళ్ల తన భార్య విక్టోరియా మద్దతుతోనే ఈ టైటిల్ లభించిందని అభినందనగా చెప్పాడు. -
'మేకప్ వేసుకునేందుకు నేను రెడీ'
లండన్ : నటన చాలా కష్టమైన వృత్తి అని ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెకహామ్ అన్నాడు. ఇప్పటికే అతడు గయ్ రిచీ మూవీ 'నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్' లో ఓ పాత్రకు తన గొంతు అరువిచ్చిన విషయం విదితమే. త్వరలో పూర్తిస్థాయి నటుడు అనిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేకప్ వేసుకుని తెరపై కనిపించేందుకు తాను నిర్ణయించుకున్నట్లు ప్రటించేశాడు. వచ్చే ఏడాది ఆ మూవీ విడుదలవుతుంది. ఈ ప్రముఖ ఆటగాడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొందరికి మాత్రమే తెలుసు. మోడలింగ్ నుంచి ఛారిటీ ట్రస్ట్ వరకు పలు రంగాలలో అపార అనుభవం అతడి సొంతం. అయితే, తన టాలెంట్‌కు హద్దులు లేవని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు మరి. సినిమాలలో నటించాలనుకున్నట్లు ఇటీవలే తెలిపాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రఖ్యాత ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేసిన విషయం విదితమే. 'నటన అనేది చాలా టఫ్ జాబ్' అని తనకు తెలుసునని బెకహామ్ అన్నాడు. అయితే, చాలా మంది క్రీడాకారులు నటన వైపు అడుగులేసి చేతులు కాల్చుకున్నారనీ, ఎందుకంటే నటించడం అనేది నైపుణ్యం, క్రమశిక్షణతో కూడుకున్న పని అంటూ చెప్పుకొచ్చాడు. నటనలో ఓనమాలు నేర్చుకుని శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ రంగంలోకి అడుగుపెడతానని పేర్కొన్నాడు. 'నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్' దర్శకుడు బెకహామ్ డబ్బింగ్ చెప్పడంపై ప్రశంసల జల్లులు కురిపించాడట. ఇప్పటివరకు చాలా రంగాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, గుర్తింపు ఉన్న వ్యక్తిని అవడంతో విమర్శలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. -
కుమారుడి పేరు టాటూ వేయించుకున్నాడు
లాస్ ఏంజిల్స్ : ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెకహామ్ తన కుమారునిపై ప్రేమతో ఓ టాటూ వేయించుకున్నాడు. పెద్ద కుమారుడి కోసం 'బస్టర్' అనే పేరుతో మెడపై టాటూ వేయించుకుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. మెడపై వేయించుకున్న టాటూను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బ్రూక్లిన్ బెకహామ్ డేవిడ్ బెకహామ్ పెద్ద కొడుకు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి అతడిని బస్టర్ అని తాను పిలుస్తానని చెప్పుకొచ్చాడు. ఈ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రోమియో(12), క్రూజ్(10), హార్పర్(4)లు డేవిడ్ మిగతా సంతానం. డేవిడ్ బెకహామ్ విక్టోరియాను వివాహం చేసుకున్న విషయం విదితమే. గత నెలలో తన చిన్నారి కూతురు హార్పర్ పేరును టాటూ వేయించుకున్న నెల రోజుల్లోనే మరో టాటూ వేయించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే పిల్లలంటే బెకహామ్కు ఎంత ప్రేమన్నది మనకు తెలుస్తోంది. గతంలో ఆయన ఇంగ్లండ్ జట్టుకు విశేష సేవలు అందించడంతో పాటు అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లలో టాప్ టెన్ స్థానంలో ఉండేవాడు. -
సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
లండన్: డేవిడ్ బెక్ హామ్ బంతిని క్యాచ్ పట్టాడు. అయితే పట్టుకున్నది ఫుట్ బాల్ కాదు, టెన్నిస్ బంతి. ఈ ఇంగ్లీషు ఫుల్ బాట్ సూపర్ స్టార్ వింబుల్డన్ లో బాల్ బాయ్ అవతారమెత్తాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బెక్ హామ్ ఈ ఫీట్ చేశాడు. జమీ ముర్రే- జాన్ పీర్స్, జొనాథన్ ఎర్లిచ్-ఫిలిప్ మధ్య జరిగిన మ్యాచ్ ను రాయల్ బాక్స్ లో కూర్చుని బెక్ హామ్ వీక్షించాడు. ఈ సందర్భంగా తనవైపు దూసుకొచ్చిన టెన్నిస్ బంతిని చాకచక్యంగా అందుకుని అందరినీ సంభ్యమాశ్చరాల్లో ముంచెత్తాడు. మెరుపు క్యాచ్ అందుకుని సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. స్పెషల్ క్యాచ్ పట్టిన మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ప్లేయర్ వీక్షకులు, ఆటగాళ్లు ప్రశంసలతో ముంచెత్తారు. 'మా బంతిని మాకు తిరిగిచ్చేస్తారా' అంటూ వింబుల్డన్ ట్విటర్ లో పేజీలో సరదాగా పోస్ట్ చేశారు. -
'ముద్దుకు గెడ్డం అడ్డమంది అందుకే...'
లాస్ ఏంజిల్స్ : మాజీ పుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్ హమ్ కొత్త అవతారం ఎత్తాడు. ఎప్పుడు గెడ్డంతో ఉండే అతడు ఈ సారి న్యూ లుక్‌లో కనిపించాడు. ఎంతో ముచ్చటగా లైట్‌గా గెడ్డం పెంచుకునే బెక్ హమ్ ఇప్పుడా గెడ్డాన్ని తీసి నున్నగా తయారైయ్యాడు. ఇదేమి చెప్మా అంటే అసలు విషయాన్ని బాబుగారు సిగ్గు పడుతూ సెలవిచ్చాడు. భార్యామణి విక్టోరియాను బెక్ హమ్ ఓ ముద్దు ఇవ్వమని కోరాడంటా. అందుకు ఆమె ససేమిరా అంది. ఎందుకని అడిగితే గెడ్డం అడ్డంగా ఉందని బదులిచ్చిందట. అంతేకాకుండా గెడ్డం తీసే వరకు ముద్దు పెట్టనని కరాఖండిగా చెప్పిందట. దాంతో భార్య ముద్దు కోసం డేవిడ్ బెక్ హమ్ గెడ్డం త్యాగం చేసేశాడు. అంతేకాకుండా పనిలో పనిగా భార్య విక్టోరియాను ఆకాశానికి ఎత్తేశాడు. ఆమె చాలా నిజాయితీగా ఉంటుందని చెప్పాడు. తన భార్య ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెబుతుందని మురిసిపోతున్నాడు. ఆమె తనకు ఇచ్చే సలహాలు ఎంతో దార్శనికతో కూడి ఉంటాయని పొగడ్తలు కురిపించాడు. విక్టోరియా వ్యాపార రంగంలో దూసుకుపోతుందని సంబరపడుతున్నాడు. ఆమె చెప్పే సలహాలు 99 శాతం పాటిస్తానని బెక్ హమ్ మురిసిపోతు చెప్పటం విశేషం. -
నగ్నంగా ఫోజిచ్చిన డేవిడ్ బెక్ హమ్!
లాస్ ఎంజెలెస్: 'టాప్ లెస్' మహిళా మోడల్స్, సినీ తారలతో మాజీ పుట్ బాల్ స్టార్ డేవిడ్ బెక్ హమ్ పోటికి దిగారు. నగ్నంగా ఫోటో షూట్ లతో సంచలనం రేపుతున్న మోడల్స్, సినీ తారలకు ధీటుగా ఫుట్ బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్ హమ్ ఇటీవల నగ్నంగా ఫోటో షూట్ చేయడం సంచలనం రేపుతోంది. అమెరికాలోని హల్లో మ్యాగజైన్ ప్రచారం కోసం ఒంటి నిండా టాటూలను పొడిపించుకుని ఫోటోషూట్ లో పాల్గొన్నారు. లోదుస్తుల ప్రచారం కోసం హెచ్ ఎం చేపట్టిన పోటోషూట్ లో ఎనర్జీ ఉందని బెక్ హమ్ వ్యాఖ్యానించారు. హెచ్ ఫోటో షూట్ ను తాను ఎంజాయ్ చేశానని.. ప్రజలకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాని బెక్ అన్నారు.Follow @sakshinews -
ఇన్వెస్ట్ ఇట్ లైక్ బెక్హాం..
కుప్పతెప్పలుగా గోల్స్.. గోల్డెన్ బాల్స్ నిక్‌నేమ్‌తో పేరొందాడు ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హాం. ఫుట్‌బాల్ మైదానంలోనే కాదు వ్యాపారం, పెట్టుబడుల బరిలోనూ అదే మెళకువలు పాటిస్తూ, రాణిస్తున్నాడు. బెక్హాం సంపద విలువ సుమారు 300 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 38 ఏళ్ల వయస్సులో ఇటీవలే రిటైరయిన బెక్హాం ఒకవైపు ఫుట్‌బాలర్‌గా సంపాదిస్తూనే మరోవైపు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ సంపద విలువను మరింత పెంచుకుంటున్నాడు. ఉదాహరణకు.. ఎప్పుడో 1999లో 3.2 మిలియన్ డాలర్లు పెట్టి బెక్హాం కొనుక్కున్న ఇల్లు ఇప్పుడు ఏకంగా 29.3 మిలియన్ డాలర్లు పలుకుతోంది. రిటైర్ అయినప్పటికీ.. ఫ్యాషన్, కాస్మెటిక్స్ కంపెనీలు బెక్హాంను విడిచిపెట్టేయలేదు. అతనికి ఇప్పటికీ సింహభాగం ఆదాయం వీటి నుంచే వస్తోంది. తన పేరు మీద బెక్హాం ఇన్స్టింక్ట్ పేరిట ఈ మధ్యే అమెరికాలో ఒక ఆఫ్టర్షేవ్ను ప్రవేశపెట్టేందుకు 13.7 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ల జోరు మరికాస్త పెంచాడు. ఒక సాకర్ ఫ్రాంచైజీని కొంటున్నాడు. మరోవైపు, కరీబియన్ దీవుల్లో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టాడు. హైతీలో పెద్ద ఎత్తున స్థలం కొనబోతున్నాడు. బెక్హాంతో స్ఫూర్తి పొందిన మన దేశీ డెరైక్టర్ ఒకరు బెండ్ ఇట్ లైక్ బెక్హాం అనే సినిమా కూడా తీశారు. బెక్హాం తరహాలోనే మరో ఫుట్‌బాలర్ లీ జాన్సన్ కూడా పెట్టుబడుల విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తాడు. అయిదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ధైర్యం చేసి 1.5 మిలియన్ డాలర్లకు ఓ ఇంటిని కొన్నాడు. దానికి మరికొన్ని హంగులు అద్ది.. పరిస్థితులు కాస్త మెరుగుపడగానే 2 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. మాంద్యం సమయంలో కూడా అర మిలియన్ డాలర్ల లాభం జేబులో వేసుకున్నాడు. ఇదే ఊపుమీద మరో ఇరవై ప్రాపర్టీలు కొనేసేందుకు సిద్ధమవుతున్నాడు. -
ఈ బీమా చూశారా..
జీవిత బీమా అంటే చాలామందికి తెలిసిందొకటే! జీవితాన్ని బీమా చేయటం. దానికి కొన్ని రైడర్స్. అంతే!! ఇదంతా మనకు చాలా కామన్. ఇలానే విదేశాల్లో వివిధ అవయవాలను ప్రత్యేకంగా బీమా చేయించటం చాలా కామన్. కాళ్లు, దంతాలు, మీసాలు... ఆఖరికి ఛాతీపై వెంట్రుకలనూ భారీ మొత్తాలకు బీమా చేయించారు కొందరు. ఎవరికి ఏది ప్లస్సయితే దాన్ని బీమా చేయించారన్న మాట. అలాంటి కొందరి గురించి తెలుసుకుందాం... మారియా కెరే: ఆటపాటలతో కుర్రకారును ఉర్రూతలూగించే అమెరికా నటి, గాయని మారియా కెరే తన కాళ్లను 100 కోట్ల డాలర్లకు బీమా చేయించారు. మెర్వ్ హ్యూస్: 1985-94 మధ్యకాలంలో ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడైన మెర్వ్ హ్యూస్ తన మీసాన్ని 3.70 లక్షల డాలర్ల మేర ఇన్సూర్ చేయించారు. డేవిడ్ బెక్‌హామ్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తన కాళ్లు, పాదాలను 7 కోట్ల డాలర్లకు బీమా చేయించారు. టామ్ జోన్స్: ఐదు దశాబ్దాలకు పైగా తన గాత్రంతో బ్రిటన్, అమెరికా వాసులను మైమరపిస్తున్న టామ్ జోన్స్ తన ఛాతీపై వెంట్రుకలను 70 లక్షల డాలర్లకు బీమా చేయించారు. డేవిడ్ లీ రోత్: అమెరికాకు చెందిన నటుడు, గీత రచయిత, డాన్సర్. తన వీర్యాన్ని 10 లక్షల డాలర్లకు బీమా చేయించారు. ఈయనగారి స్పెర్మ్‌తో ఎవరూ గర్భం దాల్చకూడదనేది బీమా కంపెనీకి పెట్టిన నిబంధన. అమెరికా ఫెరీరా: ఉత్తమ నటిగా పలు అవార్డులు అందుకున్న ఫెరీరా... తనకు నవ్వే ప్లస్ కాబట్టి దంతాలను కోటి డాలర్లకు ఇన్సూర్ చేయించింది.