పీఎస్‌జీని వీడి డేవిడ్ బెక్‌హమ్ ఇంటర్ మయామీ క్లబ్‌లో చేరిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. ఈ అమెరికన్ క్లబ్ తరఫున తన గోల్స్ పరంపరను కొనసాగిస్తున్నాడు. లీగ్స్ కప్‌లో భాగంగా ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఓ కళ్లు చెదిరే గోల్‌తో మెరిశాడు.
What can't he do?! 🐐
— Major League Soccer (@MLS) August 15, 2023
Make it NINE goals in six games for Leo Messi. pic.twitter.com/HLf3zBFTmV
మ్యాచ్ 20వ నిమిషంలో పెనాల్టీ ఏరియా బయట 36 గజాల దూరం నుంచి మెస్సీ చేసిన గోల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్‌లో మయామీ ఆటగాళ్లు మార్టినెజ్, జోర్డీ అల్బా, డేవిడ్ రూయిజ్ కూడా గోల్స్ చేసినప్పటికీ.. మెస్సీ చేసిన గోలే మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.
మెస్సీ కెరీర్‌లో ఇది సెకండ్ లాంగెస్ట్ గోల్ కావడం విశేషం. ఈ గోల్‌తో మెస్సీ ఇంటర్ మియామీ తరఫున తన గోల్స్ సంఖ్యను 9కి పెంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. మెస్సీ, మార్టినెజ్, జోర్డీ, రూయిజ్ గోల్స్ చేయడంతో మయామీ.. ఫిలడెల్ఫియాపై 4-1 గోల్స్ తేడాతో గెలుపొంది, లీగ్స్ కప్ ఫైనల్స్‌కు చేరింది. ఫిలడెల్ఫియా తరఫున అలెజాండ్రో బెడోయా ఏకైక గోల్ చేశాడు.
కాగా, మెస్సీ ఇంటర్ మయామీ తరఫున బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ గోల్ చేశాడు. మాయమీ తరఫున ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ మొత్తం 9 గోల్స్ చేశాడు. తద్వారా మయామీ తరఫున ఆరు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. మెస్సీకి ముందు గొంజాలో హిగ్వేన్ (29), లియోనార్డో కంపానా (16) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment