జీవిత బీమా అంటే చాలామందికి తెలిసిందొకటే! జీవితాన్ని బీమా చేయటం. దానికి కొన్ని రైడర్స్. అంతే!! ఇదంతా మనకు చాలా కామన్. ఇలానే విదేశాల్లో వివిధ అవయవాలను ప్రత్యేకంగా బీమా చేయించటం చాలా కామన్. కాళ్లు, దంతాలు, మీసాలు... ఆఖరికి ఛాతీపై వెంట్రుకలనూ భారీ మొత్తాలకు బీమా చేయించారు కొందరు. ఎవరికి ఏది ప్లస్సయితే దాన్ని బీమా చేయించారన్న మాట. అలాంటి కొందరి గురించి తెలుసుకుందాం...
మారియా కెరే: ఆటపాటలతో కుర్రకారును ఉర్రూతలూగించే అమెరికా నటి, గాయని మారియా కెరే తన కాళ్లను 100 కోట్ల డాలర్లకు బీమా చేయించారు.
మెర్వ్ హ్యూస్: 1985-94 మధ్యకాలంలో ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడైన మెర్వ్ హ్యూస్ తన మీసాన్ని 3.70 లక్షల డాలర్ల మేర ఇన్సూర్ చేయించారు.
డేవిడ్ బెక్‌హామ్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తన కాళ్లు, పాదాలను 7 కోట్ల డాలర్లకు బీమా చేయించారు.
టామ్ జోన్స్: ఐదు దశాబ్దాలకు పైగా తన గాత్రంతో బ్రిటన్, అమెరికా వాసులను మైమరపిస్తున్న టామ్ జోన్స్ తన ఛాతీపై వెంట్రుకలను 70 లక్షల డాలర్లకు బీమా చేయించారు.
డేవిడ్ లీ రోత్: అమెరికాకు చెందిన నటుడు, గీత రచయిత, డాన్సర్. తన వీర్యాన్ని 10 లక్షల డాలర్లకు బీమా చేయించారు. ఈయనగారి స్పెర్మ్‌తో ఎవరూ గర్భం దాల్చకూడదనేది బీమా కంపెనీకి పెట్టిన నిబంధన.
అమెరికా ఫెరీరా: ఉత్తమ నటిగా పలు అవార్డులు అందుకున్న ఫెరీరా... తనకు నవ్వే ప్లస్ కాబట్టి దంతాలను కోటి డాలర్లకు ఇన్సూర్ చేయించింది.
ఈ బీమా చూశారా..
Published Fri, Feb 28 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement