కుమారుడి పేరు టాటూ వేయించుకున్నాడు | David Beckham dedicates new tattoo to son | Sakshi
Sakshi News home page

కుమారుడి పేరు టాటూ వేయించుకున్నాడు

Published Tue, Sep 1 2015 11:41 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

కుమారుడి పేరు టాటూ వేయించుకున్నాడు

కుమారుడి పేరు టాటూ వేయించుకున్నాడు

లాస్ ఏంజిల్స్ : ఇంగ్లండ్ మాజీ ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెకహామ్ తన కుమారునిపై ప్రేమతో ఓ టాటూ వేయించుకున్నాడు. పెద్ద కుమారుడి కోసం 'బస్టర్' అనే పేరుతో మెడపై టాటూ వేయించుకుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. మెడపై వేయించుకున్న టాటూను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బ్రూక్లిన్ బెకహామ్ డేవిడ్ బెకహామ్ పెద్ద కొడుకు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి అతడిని బస్టర్ అని తాను పిలుస్తానని చెప్పుకొచ్చాడు. ఈ విషయాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. రోమియో(12), క్రూజ్(10), హార్పర్(4)లు డేవిడ్ మిగతా సంతానం.

డేవిడ్ బెకహామ్ విక్టోరియాను వివాహం చేసుకున్న విషయం విదితమే. గత నెలలో తన చిన్నారి కూతురు హార్పర్ పేరును టాటూ వేయించుకున్న నెల రోజుల్లోనే మరో టాటూ వేయించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే పిల్లలంటే బెకహామ్కు ఎంత ప్రేమన్నది మనకు తెలుస్తోంది. గతంలో ఆయన ఇంగ్లండ్ జట్టుకు విశేష సేవలు అందించడంతో పాటు అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లలో టాప్ టెన్ స్థానంలో ఉండేవాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement