buster
-
దీన్ని చంపాలా? వద్దా?
లండన్: బ్రిటన్‌లో ఒక కుక్క జీవితం గాలిలో దీపంలా ఉంది. చనిపోయిన యజమానిని తిన్నట్టు భావిస్తున్న సదరు శునకాన్ని హతమార్చాలని పోలీసులు, వద్దని జంతుహక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు. స్టఫోర్డ్‌షైర్ బుల్ టెరీర్ జాతికి చెందిన ఈ తొమ్మిదేళ్ల కుక్క పేరు ‘బస్టర్’ అని, ‘బుచ్’ అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘బస్టర్’ సెప్టెంబర్‌లో లివర్‌పూల్‌లో తన యజమాని మృతదేహం వద్ద కనిపించింది. అప్పుడు అది ఆకలితో ఉండడం, మృతదేహంపై గాయాలు ఉండడంతో యజమానిని తిన్నదని భావిస్తున్నారు. ఆయన మృతికి కుక్క కారణమా, కాదా అన్న విషయంలో దర్యాప్తులో తేలలేదు. ‘బస్టర్’తో ప్రజలకు ముప్పు ఉందని, చంపేయడమే మంచిదని కుటుంబం చెబుతోంది. చంపేందుకు అనుమతివ్వాలన్న పోలీసుల వినతిపై వచ్చే నెల కోర్టు విచారణ జరపనుంది. బస్టర్‌ను చంపొద్దని ఫ్రెష్ఫీల్డ్ యానిమల్స్ రెస్క్యూ సెంటర్, జంతుహక్కుల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. చాలారోజులు ఆకలితో ఉన్న జంతువులు చనిపోయిన వ్యక్తులను తినడం అసాధారణమేమీ కాదని కోర్టులో వాదించనున్నాయి. -
కుమారుడి పేరు టాటూ వేయించుకున్నాడు
లాస్ ఏంజిల్స్ : ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెకహామ్ తన కుమారునిపై ప్రేమతో ఓ టాటూ వేయించుకున్నాడు. పెద్ద కుమారుడి కోసం 'బస్టర్' అనే పేరుతో మెడపై టాటూ వేయించుకుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. మెడపై వేయించుకున్న టాటూను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బ్రూక్లిన్ బెకహామ్ డేవిడ్ బెకహామ్ పెద్ద కొడుకు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి అతడిని బస్టర్ అని తాను పిలుస్తానని చెప్పుకొచ్చాడు. ఈ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రోమియో(12), క్రూజ్(10), హార్పర్(4)లు డేవిడ్ మిగతా సంతానం. డేవిడ్ బెకహామ్ విక్టోరియాను వివాహం చేసుకున్న విషయం విదితమే. గత నెలలో తన చిన్నారి కూతురు హార్పర్ పేరును టాటూ వేయించుకున్న నెల రోజుల్లోనే మరో టాటూ వేయించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే పిల్లలంటే బెకహామ్కు ఎంత ప్రేమన్నది మనకు తెలుస్తోంది. గతంలో ఆయన ఇంగ్లండ్ జట్టుకు విశేష సేవలు అందించడంతో పాటు అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లలో టాప్ టెన్ స్థానంలో ఉండేవాడు.