వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్‌గా సాకర్ వీరుడు! | David Beckham Named People Magazine's 'Sexiest Man Alive' | Sakshi
Sakshi News home page

వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్‌గా సాకర్ వీరుడు!

Published Wed, Nov 18 2015 3:22 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్‌గా సాకర్ వీరుడు! - Sakshi

వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్‌గా సాకర్ వీరుడు!

లాస్‌ఏజింల్స్: బ్రిటిష్‌ సాకర్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్‌ మరో ఘనత సొంతం చేసుకున్నారు. ఆన్‌ ఫీల్డ్‌లోనూ ఆఫ్‌ ఫీల్డ్‌లోనూ అంతర్జాతీయ సెలబ్రిటీగా పేరొందిన ఆయనను పీపుల్ మ్యాగజీన్ ప్రపంచంలోనే జీవించి ఉన్న వ్యక్తల్లో సుకుమారుడిగా (సెక్సీయెస్ట్ మ్యాన్‌ అలైవ్) ఎంపిక చేసింది. మ్యాగజీన్ 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ టైటిల్‌ను అందుకున్న 40 ఏళ్ల బెక్‌హామ్‌ మాట్లాడుతూ ఈ పురస్కారం అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు, ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నట్టు తెలిపాడు.

రిటైర్డ్ ఫుట్‌బాల్ ఆటగాడైన డేవిడ్ బెక్‌హామ్ సతీమణి విక్టోరియా బెక్‌హామ్ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్‌. దీంతో ఆయన అందంగా కనిపించేందుకు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సహజంగా అందగాడు, ప్రముఖ ఆటగాడు అయిన బెక్‌హామ్ పెప్సీ, ఆడిదాస్ వంటి ప్రముఖ వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. జార్జియో ఆర్మానీ అండర్‌వేర్‌లకు మోడల్‌గా వ్యవహరించాడు. నలుగురు పిల్లలకు తండ్రి అయిన బెక్‌హామ్‌ పీపుల్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. తను అందంగా, ఆకర్షణీయంగా, సెక్సీ పర్సన్‌గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపాడు. 41 ఏళ్ల తన భార్య విక్టోరియా మద్దతుతోనే ఈ టైటిల్ లభించిందని అభినందనగా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement