అర్ధాంగులతో శృంగారంపై ఫుట్ బాల్ దే పైచేయి!
అర్ధాంగులతో శృంగారంపై ఫుట్ బాల్ దే పైచేయి!
Published Fri, Jun 13 2014 6:29 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫీవర్ వెంటాడుతోంది. అర్ధరాత్రి ఫుట్ బాల్ ప్రసారాలను టెలివిజన్ తెరలపై చూసేందుకు పురుషులు శృంగారానికి తాత్కాలికంగా గుడ్ బై చెబుతున్నారని సర్వేల్లో వెల్లడైంది. 'నేను ఫుట్ బాల్ చూడాలి' అంటూ మగజీవులు తమ అర్ధాంగిలకు విన్నవించుకుంటున్నారట.
40 శాతం మంది పురుషులు శృంగారానికంటే ఫుట్ బాల్ కే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ఫుట్ బాల్ మ్యాచ్ లను ఇష్టంగా చూసేందుకు అనారోగ్యం, గాయాలు తదితర కారణాలను చూపి శృంగారానికి దూరంగా ఉంటున్నట్టు సర్వేలో తెలిసింది.
అంతేకాకుండా .. 'వెన్నునొప్పిగా ఉంది', 'విపరీతంగా అలసిపోయాను', 'తల నొప్పిగా ఉంది' లాంటి కారణాలను పురుషులు ఎంచుకుంటున్నట్టు తెలిసింది. 2 వేల మంది బ్రిటిష్ పౌరులను డ్యూరెక్స్ అనే సంస్థ సర్వే చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా తొందరగా శృంగార కార్యక్రమాన్ని ముగించేస్తున్నారట.
టెలివిజన్ సెట్లను అందుబాటులో ఉంచితే.. శృంగారానికి సై అని పురుషులు తమ భాగస్వాములతో బెట్ చేస్తున్నారట. పుట్ బాల్ ఫీవర్ తో తమ భాగస్వాములతో శృంగారానికి దూరం కావడం పెద్ద చిక్కుగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement
Advertisement