FIFA-2014
-
20 ఏళ్ల అనంతరం జర్మనీకి అగ్రస్థానం
జెనీవా: ఫిఫా ప్రపంచకప్‌ను దక్కించుకున్న జర్మనీ జట్టు ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దాదాపు 20 ఏళ్ల అనంతరం ఈ జట్టు టాప్ ర్యాంకుకు చేరడం విశేషం. అలాగే రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానం దక్కించుకుంది. మూడో స్థానంలో హాలెండ్ నిలువగా ఇంగ్లండ్ పదో స్థానం నుంచి ఏకంగా 20వ స్థానానికి దిగజారింది. బ్రెజిల్ ఏడుకు, స్పెయిన్ టాప్ ర్యాంకు నుంచి ఎనిమిదికి పడిపోయాయి. -
సంబరాల్లో జర్మనీ!
-
జగజ్జేతలకు జేజేలు
జర్మనీ హీరోలకు స్వదేశంలో ఘనస్వాగతం విజయోత్సవాల్లో 5 లక్షల మంది ఒకటి కాదు.. రెండు కాదు.. 24 ఏళ్ల కల.. ప్రపంచకప్ నిరీక్షణకు ఫిలిప్ లామ్ సేన ఆదివారం తెరదించడంతో జర్మనీలో ఎటు చూసిన పండగ వాతావరణమే. ఇక ట్రోఫీతో జర్మనీ జట్టు స్వదేశానికి తిరిగి వచ్చిన వేళ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. జగజ్జేతలకు ఎర్రతివాచీతో ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ఆటగాళ్లూ అభిమానుల్లా మారిపోయి సందడి చేశారు. బెర్లిన్: రెండు పుష్కరాల తర్వాత సాకర్ ప్రపంచకప్ సాధించి కోట్ల మంది అభిమానుల ఆశల్ని నిలిపిన జర్మనీ జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. రియో డి జనీరో నుంచి మంగళవారం బెర్లిన్ చేరుకున్న ప్రపంచకప్ హీరోలకు లక్షల మంది అభిమానులు జేజేలు పలికారు. బెర్లిన్‌లోని టెగెల్ ఎయిర్‌పోర్టులో జట్టు విమానం ‘ఫన్హాన్సా’ దిగడమే ఆలస్యం బెర్లిన్‌లో సంబరాలు మొదలయ్యాయి. జర్మనీ జట్టు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓపెన్ టాప్ ట్రక్‌లో ఎయిర్‌పోర్టు నుంచి జర్మనీ ఐక్యతకు గుర్తయిన బ్రాండెన్‌బర్గ్ గేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా అశేష అభిమానులు జయజయధ్వానాలు పలికారు. కెప్టెన్ ఫిలిప్ లామ్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లంతా ప్రపంచకప్ ట్రోఫీని చేతబూని, విజయ సంకేతాలతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. కొందరు ప్లేయర్లు వినోదాత్మక గీతాలు ఆలపిస్తూ సంబరాల్లో జోష్ పెంచారు. మరికొందరు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, ఫ్యాన్స్‌తో చేతులు కలుపుతూ ఆనందాన్ని పంచుకున్నారు. స్టేజ్‌పై ఆటా పాట ప్రపంచకప్ విజయోత్సవాల్లో జర్మనీ ప్లేయర్లు సందడి చేశారు. వేలాది మంది అభిమానులు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన చోటైన ‘బ్రాండెన్‌బర్గ్ గేట్’ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్‌పై ట్రోఫీని ప్రదర్శించి, ఆ తర్వాత జట్టుగా ఫోటోలకు పోజులిచ్చారు. ఇక కొందరు ఆటగాళ్లు స్టేజ్‌పై ‘దిస్ ఈజ్ హౌ ద జర్మన్స్ విన్’ అంటూ ఆడి పాడారు. చేతిలోని సాకర్ బంతులను అభిమానులకు విసిరారు. వీటిని అందుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇక ప్రపంచకప్ సంబరాల్లో ఆటగాళ్లు ఉద్వేగానికి లోనయ్యారు. చేతిలో ట్రోఫీని పట్టుకున్న కెప్టెన్ ఫిలిప్ లామ్ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘ఇది నా చిన్ననాటి కల. ఇప్పుడిది నెరవేరింది. ప్రపంచకప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని లామ్ చెప్పాడు. ‘ఈ టైటిల్ మీదే. మీరు లేకుంటే ఇక్కడ ఉండేవాళ్లమే కాదు. అందరం చాంపియన్లమే’అని కోచ్ జోకిమ్ అన్నాడు. ప్రపంచకప్ విక్టరీ స్టాంప్ 2014 ప్రపంచకప్ విజయానికి గుర్తుగా జర్మనీ ప్రభుత్వం ప్రత్యేకంగా 50 లక్షల తపాలా బిళ్లలను ముద్రించింది. అయితే ఈ స్టాంప్‌లను ప్రపంచకప్ ఫైనల్‌కు ముందే ముద్రించడం విశేషం. ఈ సారి ఎలాగైనా జర్మనీ విజేతగా నిలుస్తుందన్న నమ్మకంతోనే స్టాంపులను ముందుగానే ముద్రించామని జర్మనీ ఆర్థిక మంత్రి వోల్ఫ్‌గాంగ్ చెప్పారు. జర్మనీ జట్టు తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 60 సెంట్ల విలువైన ఈ స్టాంప్ గురువారం నుంచి అమ్మనున్నారు. అంతకంటే ముందు ఈ స్టాంప్‌లను కోచ్ జోకిమ్తో పాటు ఆటగాళ్లకు అందజేస్తారు. -
బెర్లిన్ చేరుకున్న వరల్డ్‌కప్ హీరోస్
-
ఫైనల్లో అర్జెంటీనాపై జర్మనీ విజయం
-
2014 ఫిఫా వరల్డ్ చాంప్ జర్మనీ
-
జగజ్జేత జర్మనీ
ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో గెలుపు ఎక్స్ట్రా టైమ్‌లో గాట్జె అద్భుత గోల్ నిరాశపరచిన అర్జెంటీనా స్టార్ మెస్సీ ప్రైజ్‌మనీ విజేత జర్మనీ- రూ. 210 కోట్లు రన్నరప్ అర్జెంటీనా- రూ. 150 కోట్లు మూడో స్థానం (నెదర్లాండ్స్) - రూ. 132 కోట్లు నాలుగో స్థానం (బ్రెజిల్)- రూ.. 120 కోట్లు జర్మనీ సాధించింది... 24 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.... 8 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ... నాలుగోసారి సాకర్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. గత మూడు ప్రపంచకప్‌లలో సెమీస్‌కు చేరినా టైటిల్‌ను అందుకోలేకపోయిన కరువును ఎట్టకేలకు తీర్చుకుంది. ఫైనల్లో అర్జెంటీనాను ఓడించి జగజ్జేతగా అవిర్భవించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అదనపు సమయంలో గాట్జె గోల్ చేసి జర్మనీకి ‘గాడ్’గా అవతరించాడు. రియో డి జనీరో: ఊహించినట్లుగానే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ హోరాహోరీగా సాగింది. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మారియో గాట్జె ఎక్స్ట్రా టైమ్ (113వ నిమిషం)లో ఏకైక గోల్ చేయడంతో... భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. నాలుగోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సగర్వంగా అందుకుంది. జర్మనీ ఆటగాళ్లు పదేపదే దాడులు చేసినా అర్జెంటీనా డిఫెండర్లు సమర్థంగా నిలువరించడంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి. అయితే రెండో ఎక్స్ట్రా టైమ్‌లో షుర్లే ఇచ్చిన క్రాస్ పాస్‌ను గాట్జె ఎదతో అద్భుతంగా అదుపు చేస్తూ బలమైన కిక్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ప్రత్యర్థి గోల్ కీపర్ రొమెరో నిలువరించే ప్రయత్నం చేసినా బంతి అప్పటికే నెట్లోకి దూసుకుపోయింది. అంతే ఒక్కసారిగా జర్మనీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలితే.. అర్జెంటీనా అభిమానులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. గాట్జెకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సెమీస్‌లో బ్రెజిల్ మీద దాడికి దిగినట్లుగానే జర్మనీ ఆరంభం నుంచే అటాకింగ్ మొదలుపెట్టింది. బంతిని ఎక్కువగా ఆధీనంలోకి తీసుకుంటూ పదేపదే ప్రత్యర్థి రక్షణ శ్రేణి ఛేదించే ప్రయత్నాలు చేసింది. ఫలితంగా 4వ నిమిషంలో ఐదుగురు ఆటగాళ్లు బంతిని అదుపు చేస్తూ తొలి అటాకింగ్‌గా క్రూస్కు పాస్ ఇచ్చారు. అతను నెట్లోకి పంపినా మధ్యలో రోజో (అర్జెంటీనా) అడ్డుకున్నాడు. ఆ వెంటనే రొమెరో ఏరియాలోనే ముల్లర్ (జర్మనీ) ఎదురుదాడులు చేసినా అర్జెంటీనా అడ్డుకుంది. 10 నిమిషంలో క్రామెర్ (జర్మనీ) కొట్టిన ఫ్రీ కిక్ వృథా అయ్యింది. అదే పనిగా దాడులు చేసిన జర్మనీ 16వ నిమిషంలో క్రూస్ (జర్మనీ) కొట్టిన కార్నర్ కిక్కు సహచరులు సరిగా స్పందించలేకపోయారు. అర్జెంటీనాకు గోల్ చేసే అవకాశం 21 నిమిషంలో లభించినా హిగుయాన్ దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యాడు. 28వ నిమిషంలో రొమెరో... ముల్లర్ షాట్‌ను సమర్థంగా తిప్పికొట్టాడు. వెంటనే ముల్లర్ ఎల్లో కార్డుకు గురయ్యాడు. 30వ నిమిషంలో హిగుయాన్ (అర్జెంటీనా) దాదాపుగా గోల్ చేశాడు. జర్మనీ రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ వచ్చి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. కానీ లైన్ అంపైర్ ఆఫ్‌సైడ్‌గా తేల్చడంతో జర్మనీ ఊపిరి పీల్చుకుంది. 37వ నిమిషంలో ముల్లర్ ఇచ్చిన సెంటర్ పాస్‌ను షుర్లే గోల్ కొట్టే ప్రయత్నం చేసినా రొమెరో అడ్డుకున్నాడు. 43వ నిమిషంలో మరో షాట్‌ను ఇదే తరహాలో నిలువరించాడు. 45వ నిమిషంలో క్రూస్ కొట్టిన కార్నర్ కిక్‌ను బెనెడిక్ట్ హోవెడస్ హెడర్‌గా మల్చాడు. అయితే బంతి గోల్‌పోస్ట్‌ను తాకి రీబౌండ్ అయ్యింది. అక్కడే ఉన్న ముల్లర్ వెంటనే బంతిని మళ్లీ నెట్లోకి పంపినా రొమెరో అడ్డుకోవడంతో అర్జెంటీనా సంబరాలు చేసుకుంది. ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 63 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న జర్మనీ గోల్స్ కోసం నాలుగు ప్రయత్నాలు చేసింది. అర్జెంటీనా మూడుసార్లు ప్రయత్నించి విఫలమైంది. దాడుల్లో పదును పెంచేందుకు రెండో అర్ధభాగంలో లావెజ్జీ స్థానంలో అగుయెరో (అర్జెంటీనా)ను రంగంలోకి తెచ్చింది. వెంటనే 47వ నిమిషంలో మెస్సీ చేసిన ప్రయత్నం విఫలమైంది. 59వ నిమిషంలో క్లోజ్ కొట్టిన షాట్‌ను రొమెరో మరోసారి నిలువరించాడు. 64వ నిమిషంలో క్లోజ్ ఫౌల్కు మస్కరెనో ఫ్రీకిక్ సంధించాడు. గోల్స్ చేసే అవకాశాలు రాకపోవడంతో నిరాశ చెందిన అర్జెంటీనా ఆటగాళ్లు ప్రత్యర్థులకు కాస్త దాడులకు దిగారు. దీంతో నిమిషం (64, 65వ నిమిషం) వ్యవధిలో ఇద్దరు ఎల్లో కార్డుకు గురయ్యారు. 75వ నిమిషంలో మెస్సీ కొట్టిన బంతి వైడ్‌గా వెళ్లింది. మరో 2 నిమిషాలకు మస్కరెనో ఫౌల్కు షుర్లే ఫ్రీ కిక్ కొట్టినా ప్రయోజనం లేకపోయింది. లాహిమ్, ఓజిల్ మంచి సమన్వయంతో బంతిని తీసుకొచ్చి 82వ నిమిషంలో క్రూస్కు అందించారు. అంతే వేగంతో స్పందించిన అతను నేర్పుగా నెట్ వైపు పంపినా తృటిలో పక్కకు పోయింది. ఓవరాల్‌గా రెండో అర్ధభాగం కూడా గోల్స్ లేకుండానే ముగిసింది. అదనపు సమయంలో జర్మనీ వ్యూహాన్ని మార్చింది. ఆరంభంలోనే షుర్లే కొట్టిన బలమైన రొమెరో అడ్డుకోవడంతో మరోసారి అర్జెంటీనా గట్టెక్కింది. 97వ నిమిషంలో జర్మనీ గోల్ పోస్ట్ ముందర పలాసియో ఊహించని రీతిలో షాట్ కొట్టాడు. కానీ గోల్ కీపర్ నెయర్ తేరుకునేలోపు బంతి ఎత్తులో బయటకు వెళ్లింది. 105వ నిమిషంలో మెస్సీ, అగుయెరా మద్దతుతో పలాసియో కౌంటర్ అటాక్ చేసిన పెద్దగా పని చేయలేదు. రికార్డులు ప్రపంచకప్‌లో జర్మనీకిది 4వ టైటిల్. నాలుగు ప్రపంచకప్‌లతో జర్మనీ.. ఇటలీ సరసన చేరింది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ బ్రెజిల్(5) గెలిచింది. జర్మనీ 1954, 1974, 1990, 2014లో జగజ్జేతగా నిలిచింది. జర్మనీ తొలిసారి యూరోప్ బయట ప్రపంచకప్ సాధించింది. ఎనిమిదోసారి ఫైనల్ ఆడిన జర్మనీ 4వసారి చాంపియన్ అయింది. అర్జెంటీనాతో ఫైనల్లో మూడోసారి తలపడి రెండుసార్లు నెగ్గింది. యూరోప్, దక్షిణ అమెరికా జట్లు పదోసారి ఫైనల్లో తలపడగా.. యూరోప్ జట్లకిది మూడో టెటిల్. ఓ యూరోప్ జట్టు(జర్మనీ)అమెరికా ఖండాల్లో చాంపియన్‌గా నిలవడం ఇదే మొదటిసారి. వరుసగా మూడో ప్రపంచకప్‌లో జర్మనీ నాకౌట్ దశలో అర్జెంటీనాను చిత్తు చేసింది. జర్మనీ ఏడు దశాబ్దాల్లో ఏడు సార్లు ఫైనల్‌కు చేరి నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచింది. -
‘పీడకల’ ముగిసింది!
బ్రెజిల్‌కు మళ్లీ నిరాశ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 0-3తో పరాజయం నెదర్లాండ్స్‌కు మూడో స్థానం వరుసగా తొమ్మిదోసారి యూరోప్ జట్టుకే ఈ ఘనత ఇలా జరుగుతుందనుకుంటే... బ్రెజిల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చేది కాదేమో! ఇలా ఆడతారనుకుంటే... కోట్లాది మంది నిరసనలను కాదని 90 వేల కోట్లు ఖర్చు చేసేవారు కాదేమో! ఆతిథ్యం పరంగా ప్రపంచంతో శెభాష్ అనిపించుకున్న బ్రెజిల్... ఆట పరంగా అథఃపాతాళానికి పడిపోయింది. కప్ గెలవడం తప్ప మరేం చేసినా తక్కువే అని ఆశించిన బ్రెజిల్ అభిమానికి ‘గుండె’ పగిలింది. సెమీస్‌లో జర్మనీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన దృశ్యం కళ్ల ముందు మెదులుతుండగానే... నెదర్లాండ్స్ చేతిలోనూ చావుదెబ్బ తింది. మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతున్నంతసేపు... ఈ నరకయాతన ఎప్పుడు ముగుస్తుందా? అని చూడాల్సిన స్థితి. ఫుట్‌బాల్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే బ్రెజిల్ కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో..! బ్రెజీలియా: స్వదేశంలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ బ్రెజిల్ జట్టుకు చేదు జ్ఞాపకంగా నిలిచింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అత్యంత చెత్త ఆటతీరును ప్రదర్శించి అభిమానులకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది. కనీసం ఊరట విజయాన్నైనా దక్కించుకుని పరువు నిలబెట్టుకుందామని ఆశించిన బ్రెజిల్‌కు నెదర్లాండ్స్ చేతిలోనూ నగుబాటు తప్పలేదు. శనివారం అర్ధరాత్రి మూడో స్థానం కోసం జరిగిన ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌లో బ్రెజిల్ 0-3తో ఓడి అవమాన భారంతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 1940 తర్వాత సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం బ్రెజిల్కిదే తొలిసారి. ఆట ప్రారంభం నుంచే విరుచుకుపడిన నెదర్లాండ్స్ దూకుడును అడ్డుకోవడంలో ఆతిథ్య జట్టు పూర్తిగా విఫలమైంది. తొలి 17 నిమిషాల్లోనే రెండు గోల్స్ సమర్పించుకోవడంతో మరోసారి జట్టుపై గోల్స్ వర్షం ఖాయమనిపించినా ఎలాగోలా ఆ ‘దారుణాన్ని’ అడ్డుకోగలిగింది. డచ్ తరఫున రాబిన్ వాన్ పెర్సీ, డేలీ బ్లైండ్, జియార్జినో విజ్నాల్డమ్ గోల్స్ సాధించారు. వార్మప్‌లో తొడ కండరాలు పట్టేయడంతో హాలెండ్ మిడ్‌ఫీల్డర్ స్నైడర్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. 2002 అనంతరం అతను లేకుండా ప్రపంచకప్ ఆడడం జట్టుకిదే తొలిసారి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా అర్జెన్ రాబెన్ నిలిచాడు. నెదర్లాండ్స్ విజయంతో వరుసగా తొమ్మిదో ప్రపంచకప్‌లోనూ యూరోప్ జట్టుకే మూడో స్థానం లభించింది. ఏమాత్రం ఆత్మవిశ్వాసం లేకుండా కనిపించిన బ్రెజిల్ ఆటగాళ్లపై ప్రారంభంలోనే నెదర్లాండ్స్ పైచేయి సాధించింది. ఫలితంగా మూడో నిమిషంలోనే ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది. 2వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాడు రాబెన్ నుంచి బంతి తీసుకునే క్రమంలో బ్రెజిల్ కెప్టెన్ థియాగో సిల్వా అతడిని దురుసుగా తోసేశాడు. దీంతో రిఫరీ సిల్వాకు యెల్లో కార్డు చూపించడంతో పాటు డచ్‌కు పెనాల్టీ కిక్ అవకాశం ఇచ్చారు. దీన్ని వాన్ పెర్సీ గోల్‌గా మలిచి జట్టును 1-0 ఆధిక్యంలోకి చేర్చాడు. ఆ తర్వాత 17వ నిమిషంలోనే డచ్‌కు ఆధిక్యం పెంచుకునే అవకాశం దొరికింది. గోల్ పోస్టు ఎడమ వైపు నుంచి నెదర్లాండ్స్ ఆటగాడు కొట్టిన కిక్‌ను గాల్లోకి ఎగిరి డేవిడ్ లూయిజ్ (బ్రెజిల్) హెడర్‌తో దారి మళ్లించినా అది నేరుగా డచ్ డిఫెండర్ డేలీ బ్ల్రైండ్ ముందుకెళ్లింది. వెంటనే దాన్ని అతడు గోల్‌గా మలిచాడు. 21వ నిమిషంలో ఆస్కార్ షాట్‌ను నెదర్లాండ్స్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ద్వితీయార్ధంలో బ్రెజిల్ కాస్త మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. గోల్ కోసం తీవ్రంగానే ప్రయత్నించి ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి పదే పదే దాడులకు దిగినా ఫలితం లేకపోయింది. 59వ నిమిషంలో బ్రెజిల్ మిడ్‌ఫీల్డర్ రామిరెస్ కొట్టిన షాట్ వైడ్‌గా వెళ్లింది. ఆ తర్వాత హల్క్ కొట్టిన బంతి కూడా గోల్ బార్ పై నుంచి వెళ్లింది. ఇక మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా బ్రెజిల్‌పై మరో దెబ్బ పడింది. ఇంజ్యూరీ సమయం (90+1)లో డిఫెండర్ జారిల్ జన్‌మాత్ నుంచి అందుకున్న పాస్‌ను మిడ్‌ఫీల్డర్ విజ్నాల్డమ్ నేరుగా గోల్‌పోస్టులోకి పంపి డచ్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. విశేషాలు 14ఈ ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు సమర్పించుకున్న గోల్స్. ఓ టోర్నీలో ఇన్ని గోల్స్ ఇప్పటిదాకా ఏ జట్టు ఇవ్వలేదు 3 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఐదు సార్లు తలపడగా నెదర్లాండ్స్ మూడు సార్లు నెగ్గింది. 3 మూడో స్థానం కోసం నాలుగు సార్లు ఆడిన బ్రెజిల్ మూడు సార్లు ఓడింది. 9 గత తొమ్మిది ప్రపంచకప్‌ల్లో మూడో స్థానం యూరోప్ జట్టుకే దక్కింది. 3 వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో టాప్-3లో నిలిచిన జట్టుగా హాలెండ్ (గతంలో రన్నరప్). -
బై... బై... బ్రెజిల్!
నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ముగిసింది. బ్రెజిల్ అద్భుతంగా ఆతిథ్యమిచ్చిన టోర్నీకి రియో డి జనీరోలో ఆదివారం ముగింపు కార్యక్రమం జరిగింది. అట్టహాసంగా కాకపోయినా ఫైనల్ మ్యాచ్‌కు ముందు 15 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమం అభిమానులకు ఆహ్లాదాన్ని పంచింది. ఆరంభంలో ఈ ప్రపంచకప్‌లో పాల్గొన్న 32 జట్లకు చెందిన పతాకాలు చేతబూని సాంబా కళాకారిణులు నృత్యంతో అలరించారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరా తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పటికే ఉర్రూతలూగించిన లా.. లా.. లా.. అనే ప్రపంచకప్ గీతాన్ని మరోసారి పాడి బెల్లీ డ్యాన్స్‌తో స్టేడియాన్ని వేడెక్కించింది. అలాగే సింగర్స్ వెక్లైఫ్ జీన్, కార్లోస్ సాంటానా, అలెగ్జాండర్ పైర్స్ (బ్రెజిల్) అధికారిక ప్రపంచకప్ గీతం ‘డార్ ఉమ్ జీటో’ పాడారు. గ్రామీ అవార్డు విజేత ఇవెటో సాంగాలో బ్రెజిల్‌కు సంబంధించిన గీతాలను ఆలపించగా రియో డి జనీరోకు చెందిన స్కూల్ విద్యార్థులు సాంబా నృత్యంతో ఆకట్టుకున్నారు. తర్వాతి ప్రపంచకప్ 2018లో రష్యాలో జరుగుతుంది. -
అవార్డు రేస్‌లో నెయ్మార్
రియో డి జనీరో: గాయం కారణంగా ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లకు దూరమైన బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్మార్.. ఈ ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాళ్ల జాబితాలో పేరు దక్కించుకున్నాడు. శుక్రవారం ఫిఫా ఈ ఆటగాళ్ల పేర్లను విడుదల చేసింది. నాలుగు గోల్స్ సాధించిన నెయ్‌మార్‌తో పాటు అర్జెంటీనా నుంచి మెస్సీ, జేవియర్ మస్కెరానో, డి మారియా కూడా జాబితాలో ఉన్నారు. అలాగే జర్మనీ నుంచి కెప్టెన్ ఫిలిప్ లామ్, థామస్ ముల్లర్, టోనీ క్రూస్, మాట్స్ హమ్మెల్, అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), జేమ్స్ రోడ్రిగేజ్(కొలంబియా) ఉన్నారు. వీరిలో ఒకరికి ఉత్తమ ఆటగాడు అవార్డు దక్కుతుంది. గోల్డెన్‌బాల్ రేసులో జేమ్స్ రోడ్రిగేజ్ అందరికంటే ఎక్కువగా ఆరు గోల్స్‌తో ముందున్నాడు. క్రితం సారి ఈ అవార్డును ఉరుగ్వే ఆటగాడు డీగో ఫోర్లాన్ గెలుచుకున్నాడు. టాప్ గోల్ కీపర్ రేసులో నవాస్ (కోస్టారికా), మాన్యువల్ న్యూర్ (జర్మనీ), సెర్గియో రొమెరో (అర్జెంటీనా) ఉన్నారు. ఉత్తమ యువ ఆటగాడి కోసం డిపే (హాలెండ్), పోగ్బా, వరానే (ఫ్రాన్స్) పోటీ పడుతున్నారు. -
పిల్లా.. నా బావనిస్త!
రియో డి జనీరో: ఇది అర్జెంటీనా గోల్‌కీపర్ రొమెరో భార్య ఎలియానా గెర్సియో.. అమెరికా పాప్‌సింగర్ రిహన్నాకు ఇస్తున్న బంపర్ ఆఫర్! అర్జెంటీనా ప్రపంచకప్ విజేతగా నిలిస్తే.. తన భర్త రొమెరోను రిహన్నాకు వారం రోజులపాటు అరువిస్తానని ప్రకటించేసింది ఎలియానా. విషయమేంటంటే.. నెదర్లాండ్స్‌తో షూటౌట్‌కు దారితీసిన సెమీఫైనల్లో రొమెరో అద్భుత రీతిలో రెండు గోల్స్‌ను అడ్డుకొని అర్జెంటీనాను గెలిపించిన తీరుకు పాప్‌సింగర్ రిహన్నా ముచ్చటపడిపోయింది. రొమరోను మెచ్చుకుంటూ ట్విట్టర్లో అనేక పోస్ట్‌లు పెట్టింది. వీటికి ఎలియానా స్పందించింది. మరి అర్జెంటీనా గెలిస్తే తన మాట నిలబెట్టుకుంటుందో... లేక అమ్మో నా బావనిస్తనా! అంటుందో చూడాలి. -
ఆఖరి సంగ్రామం
ప్రతీకారం కోసం అర్జెంటీనా చరిత్ర కోసం జర్మనీ జీవితంలో ఒక్కసారైనా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని ప్రతి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కలలు కంటాడు. ఆ రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఒకరికి మోదం.... మరొకరికి ఖేదం కలగడానికి రంగం సిద్ధమైంది. 2014 ప్రపంచకప్ ఆఖరి సంగ్రామానికి రియో డి జనీరోలోని విఖ్యాత మరకానా స్టేడియం వేదికగా నిలువనుంది. దక్షిణ అమెరికా గడ్డపై విశ్వవిజేతగా నిలిచిన తొలి యూరోప్ జట్టుగా చరిత్ర సృష్టించేందుకు జర్మనీ... చివరి మూడుసార్లు ప్రపంచకప్‌లో ఏదో ఒక దశలో తమ అవకాశాలకు గండికొట్టిన జర్మనీని ఓడించి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో అర్జెంటీనా... ఆదివారం జరిగే అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి. రియో డి జనీరో: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ జర్మనీ... చాపకింద నీరులా ఎవరూ ఊహించని ఆటతీరుతో అర్జెంటీనా... ప్రపంచకప్‌లో తమ అంతిమ లక్ష్యానికి చేరువయ్యాయి. ఏకవ్యక్తిపై ఆధారపడకుండా కలిసికట్టుగా ఆడుతూ జర్మనీ ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉంది. థామస్ ముల్లర్, మిరోస్లావ్ క్లోజ్, షుర్లె, ఒజిల్, సమీ ఖెదిరా, ష్వాన్‌స్టీగర్, హమెల్స్, టోనీ క్రూస్, మారియో గోట్జీ తదితర ఆటగాళ్లతో జర్మనీ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. గోల్‌కీపర్ మాన్యుయెల్ నెయర్ కూడా అడ్డుగోడ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జర్మనీయే టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్రెజిల్‌తో సెమీఫైనల్లో ఆడిన తుది జట్టే ఫైనల్లోనూ ఆడే అవకాశముంది. మరోవైపు లియోనెల్ మెస్సీ మెరుపులపైనే అర్జెంటీనా ఆధారపడుతోంది. ఆరంభంలో జర్మనీని గోల్ చేయకుండా నిలువరించడమే అర్జెంటీనా ప్రథమ లక్ష్యమనిపిస్తోంది. లీగ్ దశలో ఘనా, అమెరికా జట్లు జర్మనీని తొలి అర్ధభాగంలో గోల్ చేయకుండా నిలువరించాయి. ప్రిక్వార్టర్ ఫైనల్లోనైతే అల్జీరియా 90 నిమిషాలు జర్మనీని గోల్ చేయకుండా ఆపింది. అర్జెంటీనా కూడా పక్కా ప్రణాళికతో ఆడితే జర్మనీ జోరుకు అడ్డకట్ట వేయడం సాధ్యమే. గాయాల బారిన పడ్డ డి మారియో, అగుయెరో కోలుకోవడం అర్జెంటీనాకు ఊరటనిచ్చే అంశం. మెస్సీతో కలిసి ఈ ఇద్దరు జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసే అవకాశముంది. బలం Strength సమష్టి కృషి, సమన్వయం పదాలకు ఈ జట్టు ప్రతిరూపం. ఈ టోర్నీలో ఏ దశలోనూ జర్మనీ వ్యక్తిగతంగా ఒకే ఆటగాడిపై ఆధారపడిన దాఖలాలు కనిపించలేదు. అర్జెంటీనా అంటే మెస్సీ, పోర్చుగల్ అంటే క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ అంటే నెయ్మార్... కానీ జర్మనీ అంటే ఒక జట్టు అనే ట్వీట్ సామాజిక సైట్లలో విశేషంగా ఆకట్టుకుంటోంది. అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ అన్నీ మెస్సీనే. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మెస్సీకే నాలుగుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు దక్కడం అతనికున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ తన సహచరులకు 21 సార్లు గోల్ చేసే అవకాశాలను సృష్టించాడు. బలహీనత Weakness ఎవరూ ఊహించనివిధంగా ఒక్కసారిగా తడబడటం ఆందోళన కలిగించే అంశం. ఘనాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తొమ్మిది నిమిషాల వ్యవధిలో జర్మనీ రెండు గోల్స్ సమర్పించుకొని వెనుకబడింది. పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు మినహా మిగతా నాలుగు జట్లు జర్మనీపై గోల్స్ చేయడం ఆ జట్టు డిఫెన్స్ దుర్బేధ్యం కాదనే విషయం రుజువు చేస్తోంది. మెస్సీపైనే పూర్తిగా ఆధారపడటం. ఒకవేళ మెస్సీకి మ్యాచ్ మధ్యలో గాయమైతే అతని స్థానాన్ని భర్తీచేసే వాళ్లు కనిపించడంలేదు. ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జర్మనీపై ఉన్న రికార్డు బాగోలేదు. ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించి అర్జెంటీనాకు 28 ఏళ్లయింది. అవకాశం Opportunity 84 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అమెరికా గడ్డపై ఇప్పటిదాకా ఏ యూరోప్ జట్టు టైటిల్ సాధించలేదు. 1962 (చిలీ)లో చెకోస్లొవేకియా; 1970 (మెక్సికో)లో ఇటలీ; 1986 (మెక్సికో)లో పశ్చిమ జర్మనీ; 1994 (అమెరికా)లో ఇటలీ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నాయి. ఐదో ప్రయత్నంలోనైనా జర్మనీ ఈ అడ్డంకిని అధిగమిస్తుందో లేదో వేచి చూడాలి. అమెరికా గడ్డపై ఇప్పటివరకు ఆరు ప్రపంచకప్‌లు (1930 ఉరుగ్వే; 1950 బ్రెజిల్; 1962 చిలీ; 1970, 1986 మెక్సికో; 1994 అమెరికా) జరిగాయి. ఆరింట్లోనూ దక్షిణ అమెరికా జట్లకే టైటిల్ లభించింది. ఒకవేళ అర్జెంటీనా నెగ్గితే ఏడోసారీ దక్షిణ అమెరికా జట్టు ఖాతాలోనే టైటిల్ చేరుతుంది. ముప్పు Threat సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు చేరుకోవడం, చివరి మెట్టుపై బోల్తా పడటం జర్మనీకి అలవాటుగా మారింది. గతంలో నాలుగుసార్లు ఫైనల్లో; నాలుగుసార్లు సెమీఫైనల్లో జర్మనీ ఓడిపోయింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే జర్మనీకి గత చరిత్ర అనుకూలంగా లేదనే విషయం సూచిస్తోంది. 24 ఏళ్లుగా టైటిల్ కోసం వేచి చూస్తున్న జర్మనీ ఈ అవకాశాన్ని వదులుకునే ప్రసక్తేలేదు. మెస్సీని ఎలా కట్టడి చేయాలో ఇప్పటికే జర్మనీ ‘పక్కా స్కెచ్’ గీసింది. జర్మనీ ఆరంభంలోనే గోల్ చేసి ఒత్తిడి పెంచితే కష్టం. విశేషాలు అర్జెంటీనా, జర్మనీ జట్ల మధ్య ఇది మూడో ప్రపంచకప్ ఫైనల్. ఇప్పటిదాకా ఏ రెండు జట్లు మూడుసార్లు ప్రపంచకప్ టైటిల్‌పోరులో తలపడలేదు. 1986 ఫైనల్లో అర్జెంటీనా 3-2తో జర్మనీని ఓడించగా... 1990 ఫైనల్లో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై గెలిచింది. 1986 ప్రపంచకప్ ఫైనల్లో విజయం తర్వాత ఇప్పటిదాకా అర్జెంటీనా ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించలేదు. 2006 క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘పెనాల్టీ షూటౌట్’లో 2-4తో; 2010 క్వార్టర్ ఫైనల్లో 0-4తో జర్మనీ చేతిలోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. వరుసగా మూడు ప్రపంచకప్‌లలో నాకౌట్ దశలో ఒకే జట్టు చేతిలో ఓ జట్టు ఓడిపోలేదు. ఏ జట్టుకూ సాధ్యంకాని విధంగా జర్మనీ ఎనిమిదోసారి ప్రపంచకప్ ఫైనల్లో ఆడుతోంది. ఈసారి జర్మనీ గెలిస్తే నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచి ఇటలీ సరసన నిలుస్తుంది. బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్ సాధించింది. త్యధికంగా నాలుగుసార్లు ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీకి గుర్తింపు ఉంది. కానీ చివరి 17 మ్యాచ్‌ల్లో జర్మనీకి ఓటమి ఎదురుకాలేదు. నాకౌట్ దశలో మూడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా నిర్ణీత సమయంలో ప్రత్యర్థికి గోల్ ఇవ్వలేదు. చివరి మూడు మ్యాచ్‌ల్లో మెస్సీ ఒక్క గోల్ (షూటౌట్ మినహాయింపు) కూడా చేయలేదు. 2011లో అలెజాంద్రో సాబెల్లా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మెస్సీ ఇప్పటివరకు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గోల్ చేయకుండా ఉండటం జరుగలేదు. అర్జెంటీనా జట్టు సగటు వయసు 29. ఒకవేళ అర్జెంటీనా గెలిస్తే పెద్ద వయస్సు హోదాలో టైటిల్ నెగ్గిన జట్టుగా రికార్డు నెలకొల్పిన ఇటలీ (2006లో) స్థానాన్ని ఆక్రమిస్తుంది. -
ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ కు భారీ భద్రత
రియో డి జనీరో: 2014 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. గత కొన్ని రోజుల నుంచి బ్రెజిల్ ను హోరెత్తిస్తున్నఫుట్ బాల్ ఫీవర్ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. అర్జెంటీనా-జర్మనీ జట్ల మధ్య జరిగే తుది మ్యాచ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రియోలోని మారకానా స్టేడియంలో జరుగనున్నఈ మ్యాచ్ కు దాదాపు 25వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. 1990 లో జర్మనీ చేతిలో కంగుతిన్న అర్జెంటీనాకు పక్కాప్రణాళికతో బరిలో దిగాలని యోచిస్తోంది. అర్జెంటీనా కు చెందిన మాజీ స్టార్ ప్లేయర్ డిగో మారడోనా టీం సభ్యులకు సలహాలు ఇచ్చేందుకు జట్టుతో భేటీ కానున్నాడు. ఇదిలా ఉండగా రేపు జరిగే మ్యాచ్ లో ఇదిలా ఉండగా సాకర్ ప్రపంచకప్‌ను అట్టహాసంగా ముగించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.50 ని.లకు ముగింపు కార్యక్రమం మొదలవుతుంది. కొలంబియా పాప్ స్టార్ షకీరా ఈ కార్యక్రమంలో బ్రెజిల్ ఆర్టిస్ట్ కార్లినో బ్రౌన్‌తో కలిసి సందడి చేయనుంది. ఫిఫా అధికారిక గీతమైన ‘లా లా లా’తో అభిమానులను అలరించనుంది. ఫిఫా అధికారికంగా ప్రకటించిన ముగింపు కార్యక్రమంలో కార్లోస్ శాంటనా, వెసైల్ఫ్ జీన్ తమ ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. బ్రెజిల్ సూపర్ స్టార్ సాంగాలో.. అలెగ్జాండర్ పెరైస్తో కలిసి హల్చల్ చేయనున్నారు. ఇక ఫైనల్ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు స్పెయిన్ ఫుట్‌బాలర్ కార్లెస్ పుయోల్, బ్రెజిల్ సూపర్ మోడల్ గిసెలీ బుండ్చెన్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. -
బ్రెజిల్.. 'మూడై'నా దక్కాలని..!
-
కొత్త కోచ్ కావలెను
రియో డి జనీరో: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న బ్రెజిల్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. జర్మనీ కొట్టిన చావు దెబ్బ నుంచి ఎలా తేరుకోవాలా? అని తెగ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కోచ్ లూయిజ్ ఫెలిప్ స్కొలారి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ తర్వాత ఆయన స్థానంపై స్పష్టత రానుంది. 2002లో తమను చాంపియన్‌గా నిలిపిన స్కొలారిపై ఇప్పుడు బ్రెజిల్లో ఆ స్థాయిలో అభిమానం కనిపించడం లేదు. ఆయన స్థానంలో విదేశీ కోచ్‌ను తెస్తే ఎలా ఉంటుందని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (సీబీఎఫ్) ఆలోచిస్తోంది. ప్రస్తుతానికికైతే జట్టుతో స్కొలారి ఒప్పందం ముగియలేదు. మరోసారి స్వదేశీ కోచ్‌నే నియమించుకోవాలనుకుంటే కొరిన్థియాన్స్ క్లబ్‌కు గతంలో కోచ్‌గా పనిచేసిన టైట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే విదేశీ కోచ్‌ను నియమించుకునేందుకు ఇదే సరైన సమయమని అక్కడి మీడియా వాదిస్తోంది. కానీ స్కొలారిని కొనసాగిస్తే 2018 వరకు జట్టు పటిష్టమవుతుందని మాజీ కెప్టెన్ కఫు అంటున్నాడు. -
ఒక్కటైన అర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: 12 ఏళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం.. అవినీతి కుంభకోణాలతో సతమతమవుతున్న అర్జెంటీనా ఇప్పుడు ఒక్కటైంది. వారిలో దేశభక్తి మునుపెన్నడూ లేని రీతిలో ఉరకలెత్తుతోంది. దీనికి కారణం వారి ఫుట్‌బాల్ జట్టు. బ్రెజిల్లో జరుగుతున్న ప్రపంచకప్‌లో తుది పోరుకు చేరుకోవడంతో తమ దేశ సమస్యలను మర్చిపోయి సంబరాల్లో మునిగిపోతున్నారు. సెమీస్‌లో నెదర్లాండ్స్‌పై గెలవగానే బ్యూనస్ ఎయిర్స్ వీధులన్నీ హోరెత్తిపోయాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఇంత సంతోషం ఎప్పుడూ కనిపించలేదు. ‘ఫైనల్ యుద్ధంలో మేమంతా ఒక్కటిగా నిలబడనున్నాం. క్రైమ్.. ఆర్థిక సమస్యల వార్తలతో నిండే మా ముఖసంచికలు ఇప్పుడు మెస్సీ, రొమెరో ఫొటోలతో నిండిపోతున్నాయి. ఇప్పుడు మేమంతా అర్జెంటీనియన్లం. మాది ఒక్కటే మాట’ అని కియోస్క్ పత్రిక యజమాని ఓస్వాల్డో డారికా అన్నారు. -
‘చిన్న పాల్’ జర్మనీయే అంటోంది
ఒబెర్హాసన్ (జర్మనీ): ఈసారి ప్రపంచకప్ ఎవరిదంటూ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే... ‘చిన్న పాల్’ (ఆక్టోపస్) మాత్రం జర్మనీదే కప్ అని కుండ బద్దలు కొట్టింది. ఒజెర్హాసన్లో ఉన్న సీ లైఫ్ అక్వేరియంలో ఈ చిన్న పాల్ నివసిస్తోంది. జర్మనీ, అర్జెంటీనా జాతీయ పతాకాలు చుట్టిన రెండు పాత్రల్లో ఆహార పదార్థాలను ఉంచి పాల్ ముందు పెట్టారు. అది ఆహారం కోసం జర్మనీ పాత్ర రంధ్రంలోకి తన టెంటకిల్‌ను దూర్చింది. 2010 దక్షిణాఫ్రికా టోర్నీలో ఇలాంటి ‘ఆక్టోపస్ పాల్’ వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల ఫలితాలను ముందుగానే ఊహించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు దాని వారసుడిగా వచ్చిన ఈ చిన్న పాల్ జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదు మరి! -
ముగింపు ఘనంగా..!
రియో డి జనీరో: సాకర్ ప్రపంచకప్‌ను అట్టహాసంగా ముగించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఆదివారం రియోలోని మారకానా స్టేడియంలో జర్మనీ-అర్జెంటీనా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.50 ని.లకు ముగింపు కార్యక్రమం మొదలవుతుంది. కొలంబియా పాప్ స్టార్ షకీరా ఈ కార్యక్రమంలో బ్రెజిల్ ఆర్టిస్ట్ కార్లినో బ్రౌన్‌తో కలిసి సందడి చేయనుంది. ఫిఫా అధికారిక గీతమైన ‘లా లా లా’తో అభిమానులను అలరించనుంది. ఫిఫా అధికారికంగా ప్రకటించిన ముగింపు కార్యక్రమంలో కార్లోస్ శాంటనా, వెసైల్ఫ్ జీన్ తమ ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. బ్రెజిల్ సూపర్ స్టార్ సాంగాలో.. అలెగ్జాండర్ పెరైస్తో కలిసి హల్చల్ చేయనున్నారు. ఇక ఫైనల్ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు స్పెయిన్ ఫుట్‌బాలర్ కార్లెస్ పుయోల్, బ్రెజిల్ సూపర్ మోడల్ గిసెలీ బుండ్చెన్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. అర్జెంటీనాపై రూ. 2 కోట్ల జరిమానా నిబంధనలు అతిక్రమించినందుకు అర్జెంటీనా జట్టుపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం (ఫిఫా) 3 లక్షల స్విస్ ఫ్రాంక్‌లను (దాదాపు రూ. 2 కోట్లు) జరిమానాగా విధించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ‘ఫిఫా’ నిర్దేశించిన నిబంధనల ప్రకారం.... ప్రతి జట్టు నుంచి మ్యాచ్‌కు ముందు నిర్వహించే మీడియా సమావేశంలో కోచ్‌తోపాటు జట్టులోని ఒక సభ్యుడు తప్పనిసరిగా హాజరుకావాలి. అయితే అర్జెంటీనా ఈ నిబంధనను నాలుగుసార్లు ఉల్లంఘించింది. -
మెస్సీ.... జర్మనీని ఓడించు!
బ్రెజిల్ స్టార్ నెయ్మార్ కోరిక టెరోసోపోలీస్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ... ఆదివారం జరిగే సాకర్ ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ జట్టును ఓడించాలని బ్రెజిల్ స్ట్రయికర్ నెయ్మార్ కోరుకుంటున్నాడు. ఈసారి ట్రోఫీ తన బార్సిలోనా జట్టు సహచరుడు మెస్సీకే దక్కాలన్నాడు. ‘మెస్సీ కెరీర్లో ఇది చాలా ప్రధానమైంది. అతను చాలా రకాల ట్రోఫీలు గెలిచాడు. ఇది కూడా గెలిస్తే బాగుంటుంది. అతను నాకు మంచి స్నేహితుడు, సహచరుడు కూడా. అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా’ అని నెయ్మార్ పేర్కొన్నాడు. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో కొలంబియా డిఫెండర్ కామిల్లో జునిగా గట్టిగా ఢీకొట్టడంతో నెయ్మార్ మూడో వెన్నుపూసలో పగులు ఏర్పడింది. దీంతో అర్ధంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తన గాయం మరో రెండు సెంటిమీటర్లు పైన తగిలి ఉంటే వీల్‌చైర్‌కు పరిమితం కావాల్సి వచ్చేదని స్ట్రయికర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుత గాయం పెద్ద ప్రమాదమైంది కాదని తేలింది. మరో రెండు సెంటిమీటర్లు పైన తగిలితే ఇక నా పని అయిపోయేది. ఊహించడానికే ఇది భయానకంగా ఉంది. నా కెరీర్ కీలక దశలో ఇలా జరిగింది. ఏదేమైనా దీన్ని భరించాల్సిందే. జునిగా దుర్బుద్ధితో చేశాడని నేను అనుకోను. ఎవరైనా వెనుక నుంచి వచ్చి తగిలినప్పుడు మనం కూడా ఏమీ చేయలేం. మనల్ని అదుపు చేసుకోలేం కాబట్టి ఏదో ఓ దెబ్బ తగలాల్సిందే’ అని నెయ్మార్ వ్యాఖ్యానించాడు. -
పరువు కోసం ఆఖరి పోరు...
నెదర్లాండ్స్‌తో బ్రెజిల్ ఢీ గెలిస్తే ఆతిథ్య జట్టుకు కాస్త ఊరట ఓడితే మరింత డీలా చరిత్ర యూరోప్ జట్లకే అనుకూలం అర్ధరాత్రి గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం బ్రెసిలియా: పోయిన పరువును రాబట్టుకోవడానికి... నిస్తేజంగా ఉన్న అభిమానుల్లో మళ్లీ మంచి ‘మూడ్’ తీసుకురావడానికి... భవిష్యత్ కోసం బాటలు పరచడానికి... ఆతిథ్య జట్టు బ్రెజిల్ ముంగిట చివరి అవకాశం మిగిలింది. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగే ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌లో గెలిస్తే బ్రెజిల్‌కు సొంతగడ్డపై మెగా ఈవెంట్‌ను విజయంతో ముగించామన్న కాస్త సంతృప్తి కలుగుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం బ్రెజిల్ ఫుట్‌బాల్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మొత్తానికి ఆతిథ్య జట్టు మరో అగ్నిపరీక్షకు సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు మూడో స్థానం కోసం ఆడిన బ్రెజిల్ రెండుసార్లు (1938లో, 1978లో) గెలిచి, ఒకసారి (1974లో) ఓడిపోయింది. మరోవైపు నెదర్లాండ్స్ ‘మూడో స్థానం’ కోసం రెండోసారి బరిలోకి దిగుతోంది. 1998లో తొలిసారి ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌లో ఆడిన నెదర్లాండ్స్ 1-2తో క్రొయేషియా చేతిలో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గణాంకాలను పరిశీలిస్తే... గత ఎనిమిది ప్రపంచకప్‌లలో మూడో స్థానం యూరోప్ దేశానికే దక్కింది. ఈ నేపథ్యంలో చరిత్ర నెదర్లాండ్స్‌కే అనుకూలంగా ఉంది. అర్థం లేని మ్యాచ్: డచ్ కోచ్ ‘మూడో స్థానం మ్యాచ్ అనేది అర్థంలేనిది. గత 15 సంవత్సరాలుగా ఈ మాట చెబుతున్నాను. ఎందుకంటే బాగా ఆడుతోన్న జట్టుకు వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఓటమితో టోర్నీని ముగించామన్న అప్రతిష్ట వస్తుంది’ అని నెదర్లాండ్స్ కోచ్ లూయిస్ వాన్ గాల్ చేసిన వ్యాఖ్యలు ఆ జట్టు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌పై ఎంత అయోమయంగా ఉందో ఊహించుకోవచ్చు. మరోవైపు బ్రెజిల్ ఈ మ్యాచ్ గెలవాలంటూ సహచరుల్లో నెయ్మార్ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ‘సెమీఫైనల్లో ఓడినతీరు నమ్మశక్యంగా లేదు. చరిత్రలో సువర్ణాక్షరాలతో పేర్లను లిఖించుకునేందుకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాం. అయితేనేం మూడో స్థానం మ్యాచ్‌ను ఫైనల్‌గా భావించి విజయంతో టోర్నీని ముగించాలి. ఈ గెలుపు.. బాధను తగ్గించకపోవచ్చు. అయితే విజయం సాధించడం అత్యంత ముఖ్యం’ అని నెయ్మార్ జట్టు శిబిరానికి హాజరై సహచరులకు చెప్పిన మాటలు చూస్తుంటే ఆతిథ్య జట్టుకు ఆ మ్యాచ్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. సొంతగడ్డపై విశ్వవిజేతగా అవతరించాలని బ్రెజిల్... అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా సొంతం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ తమ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు కనీసం టోర్నీని విజయంతోనైనా ముగించాలనే భావనతో ఉన్నాయి. ఒక మ్యాచ్ సస్పెన్షన్ ముగియడంతో ‘ప్లే ఆఫ్’కు కెప్టెన్ థియాగో సిల్వా అందుబాటులోకి రానుండటంతో బ్రెజిల్ రక్షణపంక్తి బలోపేతం కానుంది. బ్రెజిల్ కోచ్‌గా చివరిసారి బరిలోకి దిగనున్న లూయిజ్ ఫెలిప్ స్కొలారీ ప్రయోగాలకు పెద్దపీట వేసే అవకాశముంది. ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశంరాని మాక్స్‌వెల్‌ను ఆడించే చాన్స్ ఉంది. ఫార్వర్డ్స్ లూయిజ్, ఆస్కార్, డానియెల్ అల్వెస్, ఫెర్నాన్డినో రాణించడంపై బ్రెజిల్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ‘జీవితం ముందుకుసాగిపోతుంది. తదుపరి లక్ష్యంపై మనం దృష్టిసారించాలి. మా తర్వాతి లక్ష్యం ప్లే ఆఫ్ మ్యాచ్‌లో నెగ్గి మూడో స్థానం సంపాదించడం’ అని కోచ్ స్కొలారీ తన ఉద్దేశాన్ని స్పష్టంచేశారు. సెమీఫైనల్లో ‘షూటౌట్’లో ఓడిపోవడం మినహా... నెదర్లాండ్స్ ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచింది. అదే జోరును ‘ప్లే ఆఫ్’లోనూ కొనసాగించి తొలిసారి ‘మూడో స్థానం’ పొందామన్న సంతృప్తితో తిరుగుముఖం పట్టాలనే తపనతో ఉంది. 23 మంది సభ్యులతో కూడిన నెదర్లాండ్స్ జట్టులో 22 మంది ఏదో ఒక మ్యాచ్‌లో కొన్ని నిమిషాలైనా ఆడారు. ఈ అవకాశం దక్కని మూడో గోల్‌కీపర్ మైకేల్ వోర్న్ను కోచ్ వాన్ గాల్ ఈ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది. అర్జెన్ రాబెన్, రాబిన్ వాన్ పెర్సీ, వెస్లీ స్నైడెర్, డిర్క్ క్యుట్, హంటెలార్, మెంఫిస్ మరోసారి చెలరేగితే నెదర్లాండ్స్‌కు మూడో స్థానం దక్కడం ఖాయమనుకోవాలి. ముఖాముఖిగా బ్రెజిల్, నెదర్లాండ్స్ 11 సార్లు తలపడ్డాయి. రెండు జట్లు మూడేసి మ్యాచ్‌ల్లో నెగ్గాయి. మిగతా ఐదు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఈ రెండు జట్లు నాలుగుసార్లు పోటీపడ్డాయి. రెండు జట్లు రెండేసి మ్యాచ్‌ల్లో నెగ్గాయి. చివరిసారి 2010 ప్రపంచకప్‌లో బ్రెజిల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2-1తో గెలిచింది. -
ఒక్క మ్యాచ్‌లో 15.3 కిలోమీటర్లు
సాకర్ మ్యాచ్‌లో ప్రతీ ఆటగాడు అటూ ఇటూ పరిగెత్తడం సాధారణమైన విషయం. కొందరు ప్లేయర్లు వేగంగా... మరికొందరు నెమ్మదిగా పరిగెత్తుతారు. అయితే 90 నిమిషాల పాటు సాగే సాకర్ మ్యాచ్‌లో ఒక ప్లేయర్ అత్యధికంగా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తుతాడో తెలుసా ? స్పోర్ట్స్ వీయూ ట్రాకింగ్ టెక్నాలజీ ప్రకారం సాకర్ ఆటగాడు ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 9.5 మైళ్లు (15.3 కిలోమీటర్లు) పరిగెత్తుతాడు. జట్టులో ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు ఇదే స్థాయిలో పరిగెత్తే అవకాశాల్లేవు. ఆటగాళ్లు తాము ఉన్న పొజిషన్‌ను బట్టి కొందరు ఎక్కువగా.. కొందరు చాలా తక్కువగా పరిగెత్తుతారు. మిడ్ ఫీల్డర్ అత్యధికంగా 15.3 కిలోమీటర్లు పరిగెత్తితే.. అత్యల్పంగా గోల్‌కీపర్ తేలుతాడు. మొత్తానికి ఓ మ్యాచ్‌లో గంటన్నర పాటు 22 మంది ఆటగాళ్లు మైదానంలో పరిగెత్తింది లెక్కేస్తే దాదాపు 155 కిలోమీటర్లుగా తేలింది. -
‘దస్’ కా దమ్!
ఫుట్‌బాల్‌లో ఏ జట్టు ఆడుతున్నా... అభిమానుల చూపు సహజంగా పదో నంబర్ జెర్సీ వైపే వెళుతుంది. మనకు పూర్తిగా తెలియని జట్టు బరిలోకి దిగినా 10వ నంబర్ ధరించిన ఆటగాడు కచ్చితంగా స్టార్ అయి ఉంటాడనేది ఓ నమ్మకం. ఫుట్‌బాల్‌లో ఈ నంబర్‌కు ఉన్న ప్రత్యేకత ఇది. దీనికి తగ్గట్లే... పదో నంబర్ జెర్సీలు ధరించిన వాళ్లంతా సూపర్ స్టార్స్ అయ్యారు. ఒకప్పుడు సాకర్‌లో జెర్సీ నంబర్లకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. అయితే సంఖ్యాశాస్త్రంపై ఆటగాళ్లు ఎక్కువగా దృష్టిపెట్టడంతో జెర్సీ నంబర్లపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఫుట్‌బాల్‌లో 10వ నంబర్ జెర్సీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. సాకర్ దిగ్గజం పీలే దగ్గరి నుంచి నేటి నెయ్మార్ వరకు అంతా పదో నంబర్ జెర్సీపై మనసు పారేసుకున్న వాళ్లే. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కలేదు. పీలే, మారడోనా, జిదానే ‘నం.10’ తో అద్భుతాలు సృష్టించారు. రొనాల్డినో, కాకాతో పాటు లియోనెల్ మెస్సీ, వేన్‌రూనీ ఇదే కోవలోకి వస్తారు. 2014 ప్రపంచకప్‌లో ఆయా జట్లకు చెందిన, పదో నంబర్ జెర్సీ ధరించిన స్టార్ ఆటగాళ్లు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. నెయ్మార్, మెస్సీ, స్నైడర్, కరీం బెంజెమా, పొడోల్‌స్కీ, రోడ్రిగ్వెజ్ లాంటి ఆటగాళ్లు ఈ మెగా టోర్నీలో తమ ప్రతిభతో అభిమానుల్ని కట్టిపడేశారు. బేస్‌బాల్‌తో ఆరంభం సాధారణంగా మైదానంలో జట్లను వారు వేసుకునే జెర్సీ రంగులతో గుర్తిస్తాం. కానీ ఆటగాళ్లను గుర్తించడానికి వారు వేసుకునే జెర్సీలకు నంబర్లే ఆధారం. అయితే ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపైన నంబర్లు ముద్రించడం బేస్‌బాల్‌తో ఆరంభమైంది. ఫుట్‌బాల్‌లో ఇది 1928లో మొదలైంది. ఆర్సెనల్-షెఫీల్డ్ మధ్య జరిగిన క్లబ్ మ్యాచ్‌లో తొలిసారిగా జెర్సీలకు నంబర్ల విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇక ఆటగాళ్లకు నంబర్లను స్టార్టింగ్ ఫార్మేషన్ ఆధారంగా కేటాయించేవాళ్లు. గోల్ కీపర్‌కు 1, రైట్ ఫుల్బ్యాక్కు 2, లెఫ్ట్ ఫుల్బ్యాక్కు 3, ఇలా జట్టులో ప్రతీ ఆటగాడికి వరుస క్రమంలో నంబర్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. 1 నుంచి 23 వరకు ఆటగాళ్లు తమకు నచ్చిన నంబర్లను ఎంచుకుంటున్నారు. అయితే ఇందులో జట్టులోని స్టార్ ప్లేయర్‌కి, సీనియర్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వీళ్లు తమకు నచ్చిన జెర్సీ నంబర్‌ను ఎంపిక చేసుకున్న తర్వాతే మిగిలిన వాళ్లకు అవకాశం దక్కుతుంది. హోదాకు చిహ్నం ! సాకర్‌లో స్టార్ హోదా అంత ఈజీగా రాదు.. ఆటగాడు అద్బుత ప్రతిభ కలిగినవాడై ఉండాలి. మైదానంలో చురుగ్గా కదలాలి.. ప్రత్యర్థి రక్షణశ్రేణిపై దాడులు చేయాలి.. జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాలి. జట్టు బరువు బాధ్యతలను కూడా మోయాలి. ఇదంతా ఓ సాధారణ ఆటగాడి వల్ల కాని పని. అదే స్టార్ ఆటగాడైతే.. ఏదైనా చేయగల సమర్థుడు. అందుకే సాకర్‌లో పదో నంబర్ జెర్సీ ఆ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ‘నం.10’ జెర్సీ ధరించడమంటే హోదాకు చిహ్నంగా భావిస్తారు ఆటగాళ్లు. ఈ జెర్సీ వేసుకునే అవకాశం దక్కిందంటే ఆ ఆటగాడికి జట్టులో గౌరవం ఉన్నట్లే. ఈ నంబర్ దక్కినవాళ్లు తమ స్టేటస్ ఏంటో ప్రత్యేకంగా చాటుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లక్కీ నంబర్ జెర్సీ వేసుకునే అవకాశం అంతకుముందు తామేంటో నిరూపించుకున్న వాళ్లకే దక్కుతుంది. మొత్తానికి జట్టు ఏదైనా చాలా ఏళ్ల నుంచి 10వ నంబర్ జెర్సీ ధరించే అవకాశం స్టార్లకే దక్కుతోంది. సచిన్ ‘10’డూల్కర్ సాకర్‌లో జెర్సీ నంబర్లకు విపరీతమైన క్రేజ్ ఉన్నా.. క్రికెట్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్టార్ క్రికెటర్లు వేసుకునే జెర్సీలు, వారి నంబర్లపైన మాత్రమే అభిమానులకు అమితాసక్తి. క్రికెట్లో ప్రస్తుత, మాజీ క్రికెటర్లలో సచిన్ తన పదో నంబర్ జెర్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. కెరీర్ ఆరంభంలో మాస్టర్ 99 నంబర్ జెర్సీని ధరించేవాడు. అయితే తన పేరులోని టెండూల్కర్లోని ‘10’ను లక్కీ నంబర్‌గా మార్చుకున్నాడు. ప్రారంభం నుంచి కాకపోయినా... రిటైరయ్యే వరకు సచిన్ ఈ నంబర్‌తోనే మైదానంలో అద్భుతాలు సృష్టించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహించిన సచిన్ ఈ లీగ్ నుంచి తప్పుకున్నాక అతను వేసుకున్న పదో నంబర్ జెర్సీని వేరే ఆటగాడికి జట్టు యాజమాన్యం కేటాయించలేదు. సచిన్ గౌరవార్థ్ధం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక క్లబ్ సాకర్‌లోనూ జట్టు యాజమాన్యాలు తమ ఆటగాళ్లు రిటైరైనప్పుడు అతని గౌరవార్థానికి సూచనగా వారు వేసుకునే జెర్సీ నంబర్లను ఎవరికీ కేటాయించడం లేదు. దీన్నిబట్టి స్పోర్ట్స్‌లో జెర్సీ నంబర్లకు ఉన్న ప్రాధాన్యం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు -
మన ‘మెస్సీ’ల కోసం...
నెల రోజులుగా ఉదయాన్నే ఏ పేపర్ తీసినా... ఏ టీవీ ఆన్ చేసినా ఫుట్‌బాల్... ఫుట్‌బాల్... ఇదొక్కటే మంత్రం. ఆటలోని మజాను ఆస్వాదిస్తున్న అనేక మంది చిన్నారులు... తామూ మెస్సీలా మెరవాలని తపిస్తున్నారు. అనేకమంది తల్లిదండ్రులు తమ బిడ్డను నెయ్‌మార్‌ను చేసేదెలా అని ఆలోచిస్తున్నారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడుతున్న దేశాలతో పోలిస్తే ఆటలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్ ఉంటుందా అనే భయం కూడా ఉంది. ఫుట్‌బాల్ ఆడాలనే ఆసక్తి ఉన్నా... ఎక్కడ ఎలా ఆడాలో తెలియని వాళ్లు అనేక మంది. వాళ్లందరి కోసం ఈ కథనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, పట్టణాల్లో ఫుట్‌బాల్‌కు ఉన్న అవకాశాలపై కథనం. - మొహమ్మద్ అబ్దుల్ హాది ఫుట్‌బాల్‌కు గతంలో పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్‌తో పాటు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల్లోనూ ఈ ఆట పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దశాబ్ద కాలానికి పైగా కొనసాగుతున్న కోర్టు వివాదాలు సంఘం కార్యకలాపాలకు అడ్డంకిగా మారాయి. ఫలితంగా టోర్నీలు లేక, ఆటగాళ్లు వెలుగులోకి రాక ఫుట్‌బాల్‌ను చరిత్రలోనే చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ఇప్పుడు ఆ కారు చీకట్లు తప్పుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత ఇటీవలే ఆంధ్రప్రదేశ్ (సమైక్య) జట్టు జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో పాల్గొంది. గత వారం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసమే అంటూ రిక్రూట్మెంట్ ప్రకటన ఇచ్చి ఆటను ప్రోత్సహించేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని ఉద్దేశాన్ని చాటి చెప్పింది. ఇవన్నీ ఆటకు సంబంధించి ఇరు రాష్ట్రాల్లో కలిగిన శుభపరిణామాలు. విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో సంఘాలు ప్రత్యేకంగా పని చేయబోతున్న కారణంగా కాస్త మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పరంగా ఫుట్‌బాల్ ఆటకు పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు. చాలా తక్కువ చోట్ల మాత్రమే ప్రాక్టీస్‌కు అవకాశం ఉంది. ఇప్పుడు ఏ మాత్రం శిక్షణ కొనసాగుతున్నా...టోర్నీలు నిర్వహిస్తున్నా అదంతా ఏపీ ఫుట్‌బాల్ సంఘం కార్యకలాపాల్లో భాగంగానే జరుగుతున్నాయి. వివిధ జిల్లా సంఘాలు చొరవ చూపించి ఆటను నడిపించుకుంటున్నాయి. వ్యక్తిగత ప్రతిష్ట, పరిచయాలతో క్లబ్ లీగ్, స్కూల్ లీగ్ టోర్నీలు నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయా ఆటగాళ్లకు గుర్తింపు లభించకపోయినా ఆటపై ఆసక్తితో చాలా మంది ఈ టోర్నీల్లో పాల్గొంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సెలక్షన్స్ ద్వారా పూర్తి స్థాయి రాష్ట్ర జట్లను నిర్మించుకునేందుకు అవకాశం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఫుట్‌బాల్ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ ఎ డివిజన్ స్థాయిలో 27 క్లబ్‌లు, బి డివిజన్ స్థాయిలో 11 క్లబ్‌లు ఉన్నాయి. అండర్-14 మొదలు సీనియర్ స్థాయి వరకు క్యాంప్‌లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే, మున్సిపల్ గ్రౌండ్లలో శిక్షణ లభిస్తుంది. మహిళా ఫుట్‌బాల్ జట్టు కూడా ఇక్కడ ఉంది. విజయవాడలో 12 జట్ల మధ్య రెగ్యులర్‌గా టోర్నీల నిర్వహణ జరుగుతుంది. శ్రీకాకుళంలో 11, విజయనగరంలో 9 జట్ల మధ్య క్లబ్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఇక గుంటూరు జిల్లా కూడా చురుగ్గానే ఉంది. ఇక్కడ కూడా రెగ్యులర్‌గా లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మాత్రం శాప్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. దాదాపు 200 మంది ఇక్కడ శిక్షణ పొందుతుండటం విశేషం. వీరిలో పెద్ద సంఖ్యలో అమ్మాయిలు కూడా ఉండటం విశేషం. జిల్లాలో 16 జట్లతో రెగ్యులర్‌గా టోర్నీలు జరుగుతున్నాయి. ఇతర చోట్ల చూస్తే తూర్పు, పశ్చిమ గోదావరిల్లో మాత్రం పెద్దగా ఫుట్‌బాల్ కనిపించడం లేదు. ఏలూరు, కాకినాడల్లో కొంత మంది ఆటపై ఆసక్తి చూపిస్తున్నా...ఒక క్రమపద్ధతిలో లేదు. అదే విధంగా ప్రకాశం జిల్లా కూడా ఆటలో వెనుకబడే ఉంది. అయితే ఒంగోలులో మాత్రం స్థానిక చర్చి భాగస్వామ్యంతో ఏటా రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం... విశాఖపట్నం - జగన్నాథరావు (99121 82717) శ్రీకాకుళం - రమణ (94406 77121) విజయనగరం - లక్ష్మణ్ రావు (99632 37596) విజయవాడ - కొండా (94411 20228) తూర్పు గోదావరి - కిషోర్ (98480 41486) నెల్లూరు - శాప్ కోచ్ శ్రీనివాస్ (94402 75291) రాయలసీమలో ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఫుట్‌బాల్ సంస్కృతి ఉంది. ముఖ్యంగా రాయలసీమ ఫుట్‌బాల్ టోర్నీ పేరుతో రెగ్యులర్‌గా టోర్నమెంట్ నిర్వహణ కొనసాగుతోంది. ఇక్కడి రెండు జిల్లాల్లో ప్రభుత్వ పరంగా ఆటకు అవకాశం ఉంటే...మరో జిల్లాలో ప్రైవేట్ ఆధ్వర్యంలోనే అయినా అద్భుతమైన సౌకర్యాలు ఉండటం విశేషం. కర్నూల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాయ్ సెంటర్లో ఫుట్‌బాల్ శిక్షణ సాగుతోంది. ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. జిల్లాలో 14 జట్లతో టోర్నీ నిర్వహణ సాగుతోంది. ఇక్కడ రెండు మహిళా జట్లు కూడా ఉన్నాయి. కడప జిల్లాలో 12 జట్లు లీగ్స్‌లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్లో ఇటీవల మెరుగైన సౌకర్యాలతో శిక్షణ అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గతంలో మంచి ఆసక్తి ఉన్నా...ఇప్పుడు కొంత తగ్గింది. ప్రస్తుతం ఎనిమిది జట్లు అక్కడ లీగ్‌ల కోసం నమోదై ఉన్నాయి. అనంతపురం జిల్లాది మాత్రం ఫుట్‌బాల్‌కు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. మాంచూ ఫై స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణనిస్తున్న వేర్వేరు క్రీడాంశాల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. ఇక్కడే దాదాపు వేయిమంది వరకు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉన్న హాస్టల్లో 45 మంది ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఇదే కాకుండా జిల్లాలోని ప్రతీ మండలంలో కనీసం ఒక బాలుర, ఒక బాలికల జట్టు ఉండేలా ప్రణాళికలతో ఫై అకాడమీ ముందుకు సాగుతోంది. గత కొన్నేళ్లలో రాష్ట్ర స్థాయిలో జరిగినవి కొన్ని టోర్నీలే అయినా ప్రతి చోటా అనంతపురం ఆటగాళ్లే అద్భుతంగా రాణించారు. మరిన్ని వివరాల కోసం... అనంతపురం - మాంచూ ఫై అకాడమీ, భాస్కర్ (98667 14822) కర్నూల్ - సాయ్ సెంటర్, రాజు (98852 40365) కడప - హసన్ (93474 10724) చిత్తూరు - జగన్నాథరెడ్డి (91771 42739) తొలి ప్రైవేట్ అకాడమీ... ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 22 మంది కాంట్రాక్ట్ కోచ్‌లు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రౌండ్లు, స్టేడియంలను బట్టి నిర్ణీత సమయం ప్రకారం వారు శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు బేసిక్స్ నేర్చుకునేందుకు ఇది సరిపోతుంది. అయితే ఫుట్‌బాల్‌లో సౌకర్యాలు, శిక్షణకు సంబంధించి ఆయా జిల్లా క్రీడాభివృద్ధి అధికారుల (డీఎస్డీఓ) పాత్ర నామమాత్రంగానే ఉంటోంది. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ (కడప), కర్నూల్ సాయ్ హాస్టల్, ఖమ్మం ట్రైబల్ హాస్టల్లలో మాత్రమే హాస్టల్ సౌకర్యంతో సహా పూర్తి స్థాయిలో ఫుట్‌బాల్‌లో కోచింగ్ లభిస్తోంది. అయితే తొలి సారి నిజామాబాద్‌లో ఒక ప్రైవేట్ ఫుట్‌బాల్ అకాడమీ ఇటీవల ఏర్పాటయింది. హాస్టల్ సౌకర్యంతో సహా పూర్తి స్థాయిలో ఈ అకాడమీ ఫుట్‌బాల్‌పైనే ఫోకస్ పెడుతుండటం విశేషం. తెలంగాణలో ఒకప్పుడు ఒలింపిక్ క్రీడాకారులను అందించిన హైదరాబాద్ మహా నగరంలో ఇప్పుడు ఆనాటి కళ లేదు. అయితే గతంతో పోలిక లేకున్నా...ఇప్పటికీ కొన్ని మైదానాల్లో ఫుట్‌బాల్ ప్రాణంగా భావించే ఆటగాళ్లు, కోచ్‌లు ఉన్నారు. ఎల్బీ స్టేడియం, జింఖానా మైదానం, బొల్లారం, తిరుమలగిరి, అల్వాల్, సీసీఓబీ, బార్కస్ తదితర గ్రౌండ్లలో పాటు కొన్ని జీహెచ్ఎంసీ మైదానాల్లో చురుగ్గా మ్యాచ్‌లు జరుగుతు న్నాయి. ఆసక్తి ఉన్నవారు నేర్చుకునేందుకు, రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకునేందుకు ఆయా చోట్ల మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలోని సైనిక్‌పురి భవాన్స్ కాలేజీ మైదానంలో, అల్వాల్ లయోలా కాలేజీలో ఫుట్‌బాల్ కొనసాగుతోంది. హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ నుంచి కూడా మంచి ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 15 జట్లు ఉన్నాయి. ఇటీవలే ఇక్కడ అంతర్ జిల్లా టోర్నీ భారీ ఎత్తున జరిగింది. వరంగల్‌లో ఒక మహిళా జట్టు సహా 9 టీమ్‌లు ఉన్నాయి. గతంలో చురుగ్గా ఉన్న మెదక్‌లో ప్రస్తుతం ఆ జోరు మందగించింది. నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో కూడా పెద్దగా ఫుట్‌బాల్ మనుగడలో లేదు. ఖమ్మం జిల్లాలో అసోసియేషన్ తరఫున పెద్దగా ఆట లేదు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న గిరిజన హాస్టల్లో ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ కోచ్ ఉన్నారు. నిజామాబాద్‌లో 11 జట్లతో లీగ్ కొనసాగుతోంది. మరిన్ని వివరాల కోసం... రంగారెడ్డి - జాన్ విక్టర్ (77025 36075) ఆదిలాబాద్ - రఘునాథ్ (98494 44744) నిజామాబాద్ - నాగరాజు (98855 17151) వరంగల్ - సురేందర్ (98858 75082) కరీంనగర్ - గణేశ్ (99088 39896) మెదక్ - నాగరాజు (93473 44440) నల్లగొండ - కుమార్ (99129 75877) మహబూబ్‌నగర్ -వెంకట్ (9440075365) హైదరాబాద్ ఎల్బీ స్టేడియం:హరి (90000 90701) జింఖానా మైదానం: అలీముద్దీన్ (99893 35840) తిరుమలగిరి: టోనీ (94927 28100) -
రొనాల్డో ఏం చేశాడంటే..
సెలబ్రిటీ స్టైల్.. కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులకు ఫేవరెట్ స్టార్ అయిన క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్‌కు చెందిన ప్లేయర్. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, పెట్టుబడుల విషయాల్లోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో. జీతం, బోనస్‌లు, ఇతరత్రా అడ్వర్టైజ్మెంట్లు మొదలైన వాటి రూపంలో గడిచిన ఏడాది కాలంలో అతని ఆదాయం దాదాపు రూ. 440 కోట్లుగా ఒక పత్రిక లెక్కగట్టింది. అతని మొత్తం సంపద విలువ రూ. 1,220 కోట్లని అంచనా. లైఫ్స్టయిల్పై విమర్శలు ఎలా ఉన్నా.. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో రొనాల్డోకి మంచి మార్కులే ఉంటాయి. రొనాల్డో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడతాడు. అయిదేళ్ల క్రితం రూ. 80 కోట్లతో పోర్చుగల్‌లో ఒక లగ్జరీ హోటల్ని కొన్నాడు రొనాల్డో. అప్పటికే రాజధాని లిస్బన్లో నాలుగు ఇళ్లని కొనేశాడు. ఇవి కాకుండా ఒక నలభై కోట్ల రూపాయలు పెట్టి ఒక మాన్షన్‌ని, అరవై కోట్లు పెట్టి మరో ప్రాపర్టీని కొన్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఐదంతస్తుల బిల్డింగ్‌ను కొన్నాడు. దాన్ని హోటల్‌గానో డిస్కోగానో మారుద్దామనుకున్నాడు. చివరికి ఆ రెండూ కాకుండా తనకొచ్చిన ట్రోఫీలతో మ్యూజియంగా మార్చేశాడు. సీఆర్ 7 పేరుతో దుస్తులు, కీచెయిన్స్ లాంటివన్నీ కూడా అక్కడి స్టోర్స్ విక్రయిస్తుంటాయి. రొనాల్డో గ్యారేజ్‌లో లాంబోర్గినీ, పోర్షే, మెర్సిడెస్, బెంట్లీ లాంటి లగ్జరీ కార్లు కొలువుదీరి ఉంటాయి. పొదుపు, పెట్టుబడుల విషయం అలా ఉంచితే రొనాల్డో అడపా దడపా ఫ్యాన్స్‌కి ఇతోధికంగా ఆర్థిక సహాయం కూడా చేస్తుంటాడు. మెస్సీ.. అనుకోకుండా రియల్టీలోకి.. రియల్ ఎస్టేట్‌పై ఆసక్తితో రొనాల్డో పెట్టుబడులు పెట్టగా.. మరో సాకర్ స్టార్, అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఊహించని విధంగా ఇందులోకి దిగాల్సి వచ్చింది. పొరుగింటి వారి గోల నుంచి ప్రశాంతత దక్కించుకునేందుకు మెస్సీ బలవంతంగా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. స్పెయిన్‌లోని అతని పొరుగింటి వారు తమ ఇంటికి రిపేర్లు చేసుకుంటూ.. డబ్బులు సరిపోక మధ్యలో ఆపేశారట. ఎంతో కొంతకు దాన్ని కొనమని మెస్సీని అడిగారు. అతను ససేమిరా అనడంతో.. ఆ ఇంట్లో గదులను వాళ్లు లీజుకు ఇచ్చారు. అందులో దిగినవారు రోజూ నానా గోల చేస్తుండటంతో భరించలేక రెండు ఇళ్లకు మధ్య భారీ గోడ కట్టేశాడు మెస్సీ. దీనిపై కోర్టుకెళతామని పొరుగువారు బెదిరించడంతో.. చివరికి గత్యంతరం లేక ఆ ఇంటిని కొనుక్కున్నాడు మెస్సీ. ఆ విధంగా ఇష్టం లేకున్నా రియల్టీలో ఇన్వెస్ట్ చేశాడు. -
పక్కా వ్యూహంతో లాభాల గోల్స్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను నెల రోజుల పాటు అలరించిన ప్రపంచ కప్ తుది దశకి చేరుకుంది. ఈ నెల రోజుల్లోనూ దాదాపు ప్రతి జట్టూ పోటీలో నిల్చేందుకు.. కప్ దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరాడినా కొన్ని సార్లు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలోనే డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నిష్ర్కమించగా.. వరల్డ్ కప్‌కి ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్‌పై సెమీ ఫైన ల్స్‌లో జర్మనీ ఘనంగా గెలిచింది. ఇలాంటి పరిణామాలకు ఆయా టీమ్స్ వ్యూహాలే కారణం. ఎందుకంటే.. మ్యాచ్ జరిగే గంటన్నర సమయంలో సత్తా చాటాలి. గోల్స్ చేయాలి. ప్రత్యర్థిపై గెలుపొందాలి. పటిష్టమైన వ్యూహాలతోనే ఇదంతా సాధ్యపడుతుంది. అలాగే పొదుపు.. పెట్టుబడులైనా పక్కా ప్రణాళిక ఉంటేనే, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ దూసుకెడితేనే లక్ష్యాలను (గోల్స్) సాధించగలిగేది. ఇందుకోసం ఫుట్‌బాల్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అలాంటివే కొన్ని... ఫుట్‌బాల్ టీమ్‌లో ఉండే 11 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్ర పోషిస్తుంటారు. ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి దూసుకెళ్లే బాధ్యత కొందరిదైతే.. వారికి సహాయం అందించే బాధ్యత మరికొందరిది. గోల్‌పోస్ట్‌ను కాపాడుకునే బాధ్యత గోల్కీపర్ది. విజయ సాధనలో వీరందరూ కీలకమే. ఇలా ప్రత్యేకమైన కూర్పుతో.. ప్రత్యర్థి జట్టుపై గెలుపు సాధించేందుకు ఒక్కొక్క టీమ్ ఒక్కొక్క వ్యూహం ప్రకారం ముందుకెడుతుంది. కొన్నిసార్లు దూకుడుగాను.. మరికొన్ని సార్లు రక్షణాత్మకంగాను ఆడుతూ పరిస్థితికి తగ్గట్లు వ్యూహం మార్చుకుంటూ ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక సాధన కూడా ఇలాంటిదే. ఫుట్‌బాల్ టీమ్‌లో రకరకాల ప్లేయర్స్ ఉన్నట్లుగానే మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో కూర్పులో కూడా వైవిధ్యం ఉండాలి. పెట్టుబడులకు సంబంధించి ఫిక్సిడ్ డిపాజిట్లనీ, షేర్లనీ, రియల్ ఎస్టేట్ అనీ వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్డీల్లాంటివి రక్షణాత్మకమైనవి కాగా షేర్లులాంటివి కాస్త రిస్కీ సాధనాలు. లక్ష్యాలను సాధించడంలో ఇవన్నీ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. దేనికదే ప్రత్యేకం. అలాగని పోర్ట్‌ఫోలియోను మరీ షేర్లతో నింపేసినా.. లేదా పూర్తిగా ఎఫ్‌డీలపైనే ఆధారపడినా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేం. కాబట్టి..ఫుట్‌బాల్ టీమ్లాగానే పోర్ట్‌ఫోలియో కూర్పు ముఖ్యం. ఎంత మేర రిస్కు భరించగలం అన్నదాని ఆధారంగా ఏయే సాధనాల్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆధారపడి ఉంటుంది. సమయం కీలకం.. ఫుట్‌బాల్ మ్యాచ్ గంటన్నరలో అయిపోతుంది. ఆ గంటన్నరలో ఫలితం తేలకపోతే.. మరికాస్త సమయం మాత్రమే ఉంటుంది. మొత్తం వరల్డ్ కప్ టోర్నమెంటు ఒక నెలరోజుల్లో ముగిసిపోతుంది. కానీ, ఈ టోర్నమెంటు కోసం టీమ్స్ ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తాయి. ఎన్నెన్నో వ్యూహాలు రూపొందించుకుంటాయి. పెట్టుబడుల తీరు కూడా ఇలాంటిదే. ఉన్న కాస్త సమయంలోనూ రిటైర్మెంట్ వంటి అవసరాలకు కావాల్సిన డబ్బు సమకూర్చుకోవాలంటే దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ధరల పెరుగుదలను మించి సంపదను వృద్ధి చేసే పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. ఇందుకోసం పోర్ట్‌ఫోలియోలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటికి కొంతైనా చోటు కల్పించాలన్నది నిపుణుల సూచన. అయితే, ఎవరో చెప్పారని గుడ్డిగా పోకుండా వాటి గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు కాస్తంత కసరత్తు చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. అనుకోని పరిస్థితులకు సంసిద్ధంగా.. ఎంత కసరత్తు చేసి, ఎంతగా సిద్ధం అయినా.. కొన్ని సార్లు ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటికి తగ ్గట్లుగా అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కోస్టారికా జట్టుతో జరిగిన పోటీలో నెదర్లాండ్స్ కోచ్ చేసినదిదే. నిర్ణీత సమయంలో ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటవుట్ తప్పనిసరైంది. ప్రత్యర్థి దాడుల నుంచి గోల్‌పోస్ట్‌ను రక్షించుకునే క్రమంలో ప్రధాన గోల్‌కీపర్‌ని పక్కనపెట్టి రెండో గోల్‌కీపర్ క్రూల్‌ను రంగంలోకి దింపాడు నెదర్లాండ్స్ కోచ్. ప్రధాన గోల్‌కీపర్ కన్నా క్రూల్ ఎత్తు రెండంగుళాలు ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్‌పాయింట్ అయింది. ఏకంగా 2 గోల్స్‌ని ఆపి నెదర్లాండ్స్‌ను సెమీఫైనల్స్‌కి చేర్చడంలో క్రూల్ కీలకపాత్ర పోషించాడు. పెట్టుబడుల తీరూ అప్పుడప్పుడు ఇలాగే ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చేతిలో లేని అంశాల కారణంగా కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు. కాబట్టి, ఎప్పుడైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అప్పటిదాకా అమలు చేసిన ప్రణాళికను సవరించుకుని, కొత్త వ్యూహం అమలు చేయగలిగేలా సంసిద్ధంగా ఉండాలి. పోర్ట్‌ఫోలియోలు ఇలా.. ఫుట్‌బాల్ టీమ్‌లో స్ట్రైకర్స్, మిడ్ఫీల్డర్స్, డిఫెండర్స్ అని ప్లేయర్స్ ఉంటారు. టీమ్‌లు ఎటాకింగ్ అనీ డిఫెండింగ్ అనీ రకరకాల వ్యూహాలు పాటిస్తుంటాయి. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకి దీన్ని అన్వయించుకుంటే.. యుక్తవయస్సులో వారికి ఒకలాగా .. మధ్యవయస్కులకు ఒకలాగా .. రిటైర్మెంట్కి దగ్గర్లో ఉన్న వారికి ఒకలాగా ఉంటుంది. వయస్సు, ఎంత రిస్కు తీసుకోగలం అన్న దాన్ని బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఆధారపడి ఉంటుంది. యుక్తవయస్సులో ఉన్న వారు కాస్తంత ఎక్కువ రిస్కు తీసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా, మళ్లీ తేరుకుని నిలదొక్కుకునేందుకు వారికి సమయం ఉంటుంది. కాబట్టి యుక్తవయస్సులో ఉన్నవారు.. ఎటాకింగ్ ధోరణిలో తమ పోర్ట్‌ఫోలియోలో సింహభాగం షేర్లు, ఫండ్స్ లాంటి వాటికి కేటాయించవచ్చు. వాటికి ఊతంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని సురక్షితమైన సాధనాలకు కేటాయించవచ్చు. అదే మధ్యవయస్కులూ.. మరీ ఎక్కువ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడని వారూ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉండేలా చూసుకోవచ్చు. షేర్లూ, బాండ్లూ, ప్రావిడెంట్ ఫండ్ లాంటివాటికి తలా కాస్త నిధులు కేటాయించవచ్చు. ఇక రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వారు, రిస్కును అస్సలు ఇష్టపడని వారు సురక్షితమైన సాధనాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు. దీని వల్ల పెట్టుబడులకు పెద్దగా నష్టం ఉండదు. అలాగని భారీ రాబడులూ ఉండవు. -
మైదానంలోనే కాదు.. అంతర్జాలంలోనూ ఆడుకున్నారు!
-
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు నెయ్మార్
టెరెసోపోలిస్: మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగే పోరుకు బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్మార్ హాజరు కానున్నాడు. గాయం కారణంగా జర్మనీతో జరిగిన సెమీస్‌కు నెయ్మార్ దూరం కావడం జట్టు ఆత్మస్థైరాన్ని దెబ్బతీసింది. ‘శనివారం డచ్తో జరిగే మ్యాచ్‌కు నెయ్మార్ ఇక్కడికి రానున్నాడు. అతడు జట్టుతో పాటే ఉంటాడు’ అని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య అధికార ప్రతినిధి రోడ్రిగో పైవా తెలిపారు. -
రొమెరో...ద హీరో
అర్జెంటీనాను గెలిపించిన గోల్ కీపర్ పెనాల్టీ షూటౌట్లో 4-2తో నెదర్లాండ్స్‌పై విజయం ఆదివారం జర్మనీతో ఫైనల్ ప్చ్... ఇదేం ఆట..! జర్మనీ, బ్రెజిల్‌ల సెమీస్‌లో దూకుడు చూసిన తర్వాత నెదర్లాండ్స్, అర్జెంటీనాల సెమీస్ చూసిన అభిమానుల భావన ఇది.రెండు జట్లూ అతి జాగ్రత్తకు పోయాయి.ఇరు జట్లలో కావలసినంత మంది స్టార్స్ ఉన్నా ఆటలో వేగం లేదు.90 నిమిషాల పాటు అత్యంత బోరింగ్ ఆట.ఎక్స్ట్రా టైమ్ 30 నిమిషాల్లోనూ అదే పరిస్థితి.ె పనాల్టీ షూటౌట్లో మాత్రమే మజా వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో షూటౌట్లోనే గట్టెక్కిన డచ్ జట్టు ఈసారి ‘ఢమాల్’ అంది... అర్జెంటీనా గోల్ కీపర్ రొమెరో రెండు సార్లు అద్భుతంగా డైవ్ చేసి... రెండు గోల్స్ ఆపేశాడు.అంతే... అర్జెంటీనా అభిమానుల రెండు పుష్కరాల ‘కల’ సాకారమైంది.మెస్సీ సేన ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.ఇక ఆదివారం జరిగే ఫైనల్లో జర్మనీతో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకుంటుంది. 1990 ఫైనల్లో జర్మనీ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని అర్జెంటీనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అప్పటి జట్టుకు డిగో మారడోనా సారథ్యం వహించాడు. సోమవారం మరణించిన ఫుట్‌బాల్ మాజీ దిగ్గజం అల్ఫ్రెడో డి స్టెఫానో మృతికి సంతాపకంగా మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించారు. అర్జెంటీనా ఆటగాళ్లు చేతికి ఆర్మ్ బ్యాండ్‌ను ధరించి మ్యాచ్ ఆడారు. ఫలించని వ్యూహం క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు ఊహించని ఎత్తులు వేసిన డచ్ కోచ్ వాన్ గాల్ ఈ మ్యాచ్‌లో నిరాశపర్చారు. పటిష్టమైన అర్జెంటీనా రక్షణ శ్రేణిని ఛేదించే ఎత్తుగడలు వేయలేకపోవడంతో మ్యాచ్ బోరింగ్‌గా సాగింది. కేవలం రెండంగుళాల ఎత్తును పరిగణనలోకి తీసుకుని క్వార్టర్స్ మ్యాచ్‌ను గెలిపించిన వాన్ గాల్... మెస్సీసేనను ఆపడానికి ఎలాంటి వ్యూహ రచన చేయలేకపోయారు. పెనాల్టీ షూటౌట్లో తొలి అవకాశం అనుభవజ్ఞుడికి కాకుండా వ్లార్కు ఇవ్వడాన్ని విమర్శకులు తప్పుబట్టారు. అయితే తొలి పెనాల్టీని తీసుకోవడానికి ఇద్దరు ఆటగాళ్లు నిరాకరించడంతో వ్లార్ను పంపామని ఆయన చెప్పారు. సావో పాలో: షూటౌట్లో గోల్ కీపర్ అద్భుత నైపుణ్యం... గురి తప్పని కిక్‌లు... అర్జెంటీనాను 24 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 4-2తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్ట్రా టైమ్‌లో కూడా ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని రాబట్టారు. పెనాల్టీ షూటౌట్లో కెప్టెన్ మెస్సీ, గ్యారె, అగురో, రొడ్రిగ్వేజ్లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. నెదర్లాండ్స్ ప్లేయర్లు రాబెన్, కుయుట్ గోల్స్ చేయగా, వ్లార్, స్నిడెర్ కొట్టిన బంతులను అర్జెంటీనా గోల్ కీపర్ సెర్గియో రొమెరో అద్భుతంగా అడ్డుకున్నాడు. రొమెరోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మొత్తానికి ఓ యూరోపియన్ జట్టు జర్మనీ, దక్షిణ అమెరికా ఖండానికి చెందిన అర్జెంటీనా... ఆదివారం జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. శనివారం మూడోస్థానం కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో బ్రెజిల్... నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. గత ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడిన ‘ఆరెంజ్ సేన’ ఈసారి సెమీస్‌తోనే సరిపెట్టుకుంది. ఆరంభంలో ఇరుజట్లు బంతిపై పట్టు కోసం బాగా పోరాడాయి. క్రమం తప్పకుండా పరస్పరం ఎదురు దాడులు చేసుకున్నా... రెండు జట్లు సమర్థంగా నిలువరించుకున్నాయి. దీంతో గోల్స్ చేసే అవకాశాలు తక్కువగా వచ్చాయి. 6వ నిమిషంలో రాబెన్ (డచ్) కొట్టిన ఓ షాట్‌ను అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా తేల్చారు. 11వ నిమిషంలో స్నిడెర్ (డచ్) సంధించిన బంతి రొమెరోను తగులుతూ దూరంగా వెళ్లింది. 15వ నిమిషంలో మెస్సీ ఎడమ వైపు నుంచి కొట్టిన బంతిని గోల్ పోస్ట్ ముందర డచ్ గోల్ కీపర్ సిలిసెన్ చాలా తెలివిగా అందుకున్నాడు. 20వ నిమిషంలో మెస్సీ కొట్టిన ఫ్రీ కిక్‌ను గోల్ కీపర్ సిల్లెసన్ కుడివైపు డైవ్ చేస్తూ అద్భుతంగా అడ్డుకోవడంతో డచ్ ఊపిరి పీల్చుకుంది. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీని కట్టడి చేయడంలో డచ్ ఆటగాళ్లు సఫలమయ్యారు. ముఖ్యంగా రాన్ వ్లార్.. మెస్సీ వెన్నంటే ఉంటూ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 53 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న అర్జెంటీనా గోల్స్ కోసం మూడు ప్రయత్నాలు చేయగా, నెదర్లాండ్స్‌కు ఒకే ఒక్క అవకాశం వచ్చింది. కడుపు నొప్పితో బాధపడిన వాన్ పెర్సీ సకాలంలో కోలుకోవడంతో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఎక్స్ట్రా టైమ్‌లో బయటకు వెళ్లిపోయాడు. 75వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ హిగుయాన్ గోల్ చేసినంత పని చేశాడు. డచ్ రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ పెరెజ్ ఇచ్చిన పాస్‌ను హిగుయాన్ బలంగా గోల్‌పోస్ట్ వైపు పంపాడు. కానీ అది తృటిలో బయటకు వెళ్లిపోయింది. 87వ నిమిషంలో రాబెన్, స్నిడెర్ (డచ్)లను తప్పిస్తూ రోజో, గ్యారె (అర్జెంటీనా) సమయోచితంగా బంతిని ముందుకు తీసుకెళ్లారు. అయితే గోల్ పోస్ట్ దగ్గర్లో సిల్లెసన్ దాన్ని నిలువరించాడు. 90వ నిమిషంలో స్నిడెర్ (డచ్) ఇచ్చిన బంతిని రాబెన్ అర్జెంటీనా పెనాల్టీ నుంచి గోల్ పోస్ట్ లోకి పంపాడు. కానీ ఈ వింగర్ షాట్‌ను జేవియర్ మస్కరెనో సమర్థంగా కట్టడి చేశాడు. ఎక్స్ట్రా టైమ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా రొడ్రిగో పలాసియో (అర్జెంటీనా) కొట్టిన హెడర్‌ను సిల్లెసన్ సమర్థంగా నిలువరించాడు. -
మ్యాచ్ ను వీక్షించేందుకు నెయమార్..
టెరీసొపొలిస్(బ్రెజిల్): ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో భాగంగా కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మార్ మళ్లీ జట్టుతో జాయిన్ కానున్నాడు. కాకపోతే ఆడటానికి కాదు.. మ్యాచ్ ను వీక్షించడానికి నెయమార్ తిరిగి స్టేడియానికి రానున్నాడు. ప్లే ఆఫ్ లో భాగంగా శనివారం మూడో స్థానం కోసం నెదర్లాండ్స్ -బ్రెజిల్ జట్ల మధ్య ఆసక్తికర పోరును నెయమార్ వీక్షించనున్నాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ ఫుట్ బాల్ సమాఖ్య ప్రతినిధి రోడ్రిగో స్పష్టం చేశారు. ఇప్పటికే పేలవమైన ఆట తీరుతో ఫైనల్ ఆశలను నీరుగార్చుకున్న బ్రెజిల్ కనీసం మూడో స్థానంతోనైనా సరిపెట్టుకోవాలని భావిస్తోంది. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ లో కొలంబియా ఆటగాడు జాన్ ఢీకొట్టడంతో నయమార్ తీవ్రంగా గాయపడిన నెయమార్ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. -
నెదర్లాండ్ పై అర్జెంటినా విజయం!
-
28 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?
బ్రెజిల్: ప్రపంచకప్ గెలవాలన్నది ప్రతీ ఒక్క జట్టు కల. ఎన్ని అంతర్జాతీయ టైటిల్స్ గెలిచానా.. వరల్డ్ కప్ కు వచ్చే సరికి ఆ మజానే వేరుగా ఉంటుంది. అగ్రశ్రేణి జట్లును అధిగమిస్తూ ఫైనల్ రౌండ్ వరకూ నిలవడం అంటే దాని వెనుక కృషి మాత్రం చాలానే ఉంటుంది. అర్జెంటీనా.. ప్రపంచమేటి జట్లలో ఒకటి. 2014 ఫిఫా వరల్డ్ కప్ కు బరిలోకి దిగేముందు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ జట్టు ఫైనల్ కు చేరి ఔరా అనిపించింది. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం టైటిల్ గెలిచిన అర్జెంటీనా తరువాత పెద్దగా ఆకట్టుకోలేదు. 1990 లో సెమీ ఫైనల్ వరకూ చేరిన అర్జెంటీనా.. అంతకుముందు 1978, 1986లో వరల్డ్ కప్ లు గెలిచి తన ప్రస్తానానికి నాంది పలికింది. ఆ తరువాత జట్టు సమిష్టగా వైఫల్యం చెంది ఆ దేశ అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం అర్జెంటీనా ముందన్నది టైటిల్ గెలవాలనే లక్ష్యం మాత్రమే. నిన్న జరిగిన సెమీఫైనల్లో 4-2 తేడాతో గత రన్ రప్ నెదర్లాండ్స్ ను పెనాల్టీ షూటౌట్ లో కంగుతినిపించిన అర్జెంటీనా ఫైనల్ కు చేరుకుని తమ ఎదురులేదని మరోసారి నిరూపించింది. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఫైనల్ ఉన్నది చిన్నా చితకా టీం కాదు. పూర్తి టీం ఎఫెర్ట్ తో దూసుకుపోతున్న జర్మనీ. ఈ విషయం మొన్న బ్రెజిల్ తో జరిగిన మ్యాచ్ ను చూస్తే అర్దమవుతుంది. ఏకంగా ఏడు గోల్స్ చేసి ప్రపంచకప్ సెమీస్ అంకంలో కొత్త భాష్యం చెప్పిన జర్మనీతో పోరంటే అర్జెంటీనాకు కత్తిమీద సామే. ఇరుజట్లు బలాబలాను పరిశీలిస్తే మాత్రం కచ్చితంగా జర్మనీనే ముందువరుసలో ఉంది. ఇప్పటికే మూడు టైటిల్స్ గెలిచిన జర్మనీ చివరిగా 1990 లో ఫిఫా ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ను తమ సొంతచేసుకోవాలని భావిస్తోంది జర్మనీ. ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ..మ్యాచ్ మ్యాచ్ కు వ్యూహాల్ని మారుస్తూ దూసుకుపోతుంది.ఇందుకు ఫ్రాన్స్ తో జరిగిన క్వార్టర్స్ ఫైనల్ పోరు, బ్రెజిల్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చక్కటి ఉదాహరణలు. కాగా, అర్జెంటీనా మాత్రం స్టార్ ప్లేయర్ మెస్సీపైనే ఆధారపడుతూ వస్తోంది.వరుస విజయాలతో జైత్రయాత్రను అర్జెంటీనా బానే ఆకట్టుకుంటున్నా ఒక్క ఆటగాడిపైనే ఆశలు పెట్టుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. అర్జెంటీనా సుదీర్ఘ కలఫలించాలంటే సమిష్టి కృషి ఎంతైనా అవసరం అనడంలో ఎటువంటి సందేహం లేదు. -
అంతులేని శోకంలో బ్రెజిల్ అభిమానులు
-
సాక్షి స్పోర్ట్స్ 10th July 2014
-
నెదర్లాండ్ పై అర్జెంటినా విజయం!
-
పెనాల్టీ షూట్ అవుట్ లో నెదర్లాండ్ పై అర్జెంటినా విజయం!
ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నిలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాపై నెదర్లాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఏజట్టు కూడా నిర్ణీత సమయంలో గోల్ చేయకపోవడంతో అదనపు సమయాన్ని కేటాయించారు. అదనపు సమయంలో కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ధేశించేందుకు సీన్ పెనాల్టీ షూట్ వుట్ కు మారింది. పెనాల్టీ షూటవుట్ లో అర్జెంటీనా 4-2 తేడాతో నెదర్లాండ్ పై విజయం సాధించింది. -
‘బస్సంత’ అభిమానం
సావోపాలో: సాకర్ అంటే అర్జెంటీనా ఫ్యాన్స్‌కు చచ్చేంత అభిమానం. ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడ వాలిపోతారు. ఈసారి ప్రపంచకప్ సందర్భంగా నలుగురు అర్జెంటీనా అభిమానులు కాస్త వెరైటీగా ఒక బస్సు అద్దెకు తీసుకుని జట్టు వెంట తిరిగారు. గతనెల 9న బ్రెజిల్‌కు చేరుకున్న తర్వాత రూ. 9 లక్షలు చెల్లించి బస్సును అద్దెకు తీసుకున్నారు. ఇందులో నాలుగు బెడ్లు, తినడానికి డైనింగ్ టేబుల్.. ఇలా తమకు కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అర్జెంటీనా ఆడిన మూడు మ్యాచ్‌లను స్టేడియాల్లో వీక్షించారు. మరో మూడు మ్యాచ్‌ల టికెట్లు దొరక్కపోయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా స్టేడియాల దగ్గర బిగ్ స్క్రీన్లపై అందరితో కలిసి చూశారు. మొత్తానికి ఇప్పటిదాకా 10వేల కిలోమీటర్లకు పైగా బస్సులోనే ప్రయాణించారు. -
అంతులేని శోకం
చేతికి వచ్చిన పంటను తుపాన్ ముంచెత్తితే.... నోటికాడి ముద్దను ఎదుటోడు తన్నుకుపోతే..ఆ శోకం వర్ణణాతీతం...ఇప్పుడు బ్రెజిల్ అలాంటి శోకాన్నే అనుభవిస్తోంది.సొంతగడ్డపై కచ్చితంగా కప్ గెలుస్తామనే నమ్మకంతో ఉన్న సగటు అభిమానికి ఒకే ఒక్క మ్యాచ్‌తో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓడిన విధానమే దారుణం. మైదానంలో తమ ఆటగాళ్లు స్కూల్ పిల్లల కంటే ఘోరంగా ఆడిన వేళ... ప్రత్యర్థులు ఆరు నిమిషాల వ్యవధిలో తమ ఆశలను ఆవిరి చేసిన సమయాన... బ్రెజిల్ అభిమానుల వేదనకు, రోదనకు అంతేలేకుండా పోయింది. బ్రెజిలియా: సొంతగడ్డపై జర్మనీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోవడాన్ని బ్రెజిల్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవర్ని కదిలించినా.. ఎవరితో మాట్లాడినా.. ఈ ఓటమి గురించే చర్చ. దాదాపు నెల రోజులుగా ఫుట్‌బాల్ మానియాతో ఊగిపోయిన బ్రెజిల్ ప్రస్తుతం నిర్వేదంతో శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఓటమిని తట్టుకోలేక కెప్టెన్ డేవిడ్ లూయిజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేకపోయానని, నిరాశజనకమైన ఈ రోజు నేర్చుకోవడానికి తొలి మెట్టు అని వ్యాఖ్యానించాడు. ఈ ఓటమి చాలా సిగ్గుపడాల్సిన అంశమని బ్రెజిల్ మీడియా దుమ్మెత్తిపోసింది. మరోవైపు మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రధాన కూడళ్లలో కొంత మంది అల్లర్లకు దిగారు. కోపాకబానా బీచ్‌లో అదుపు తప్పిన పరిస్థితిని పోలీసులు చక్కదిద్దారు. ప్రధాన నగరాల్లో అదనపు బలగాలను మోహరించారు. బ్రెజిల్ ఓటమిని తట్టుకోలేక నేపాల్‌లో 15 ఏళ్ల ప్రగ్యా తాపా అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. రికార్డు బద్దలు బ్రెజిల్ ఓటమి ట్విట్టర్, ఫేస్బుక్లో రికార్డు స్థాయిలో ట్వీట్స్, పోస్ట్‌లను నమోదు చేసింది. మ్యాచ్ రోజు ట్విట్టర్లో 35.6 మిలియన్ ట్వీట్స్ నమోదయ్యాయి. గతంలో సూపర్ బౌల్ సందర్భంగా 25 మిలియన్ ట్వీట్స్ మాత్రమే రికార్డయ్యాయి. ఫేస్బుక్లో 200 మిలియన్ పోస్ట్‌లు షేర్ చేసుకున్నారు. ఇందులో 66 మిలియన్ల ప్రజలు నేరుగా భాగం పంచుకోవడం కొత్త రికార్డు. జర్మనీ తరఫున ఐదో గోల్ చేసిన ఖెడిరాపై నిమిషంలో 5 లక్షల 80 వేల ట్వీట్స్ వెల్లువెత్తాయి. ‘బ్రెజిల్‌కు నెయ్మార్ ఒక్కడే, అర్జెంటీనాకు మెస్సీ ఒక్కడే, పోర్చుగల్‌కు రొనాల్డో ఒక్కడే... కానీ జర్మనీ... ఓ జట్టు’ అనే ట్వీట్ హల్చల్ చేసింది. అత్యంత చెత్త రోజు: స్కొలారీ ‘నా జీవితంలోనే ఇది అత్యంత చెత్త రోజు. మా శక్తి మేరకు రాణించాలని ప్రయత్నించాం. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆరు నిమిషాల్లో చేసిన నాలుగు గోల్స్‌తో మ్యాచ్ తారుమారైంది. ఓటమికి పూర్తి బాధ్యత నాదే. నెయ్మార్ ఉన్నా కూడా పెద్ద ప్రభావం ఉండకపోయేదేమో’ - బ్రెజిల్ కోచ్ స్కొలారీ విశేషాలు నిరాశ కలిగించింది: రౌసెఫ్ ‘ఓ బ్రెజిలియన్గా ఈ ఓటమి చాలా నిరాశను కలిగించింది. అభిమానులకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’ అని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓ జట్టు ఏడు గోల్స్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు ఏ జట్టూ ప్రపంచకప్ సెమీఫైనల్లోని తొలి అర్ధభాగంలో ఐదు గోల్స్ సమర్పించుకోలేదు. 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లోని ఒక మ్యాచ్‌లో ఎనిమిది గోల్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. చివరిసారి 2002లో జర్మనీ 8-0తో సౌదీ అరేబియాను ఓడించింది. ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో బ్రెజిల్‌కు ఇదే చెత్త ఓటమి. 1998 ఫైనల్లో బ్రెజిల్ 0-3తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి 29 నిమిషాల్లో 5 గోల్స్ చేసిన తొలి జట్టుగా జర్మనీ నిలిచింది. అంతేకాకుండా మొత్తం ప్రపంచకప్‌లలో ఓవరాల్‌గా అత్యధిక గోల్స్ (223) చేసిన జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. 220 గోల్స్‌తో ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న బ్రెజిల్ రెండో స్థానానికి పడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరుకున్న తొలి జట్టుగా జర్మనీ రికార్డు సృష్టించింది. 7 సార్లు ఫైనల్ చేరుకున్న బ్రెజిల్‌ను జర్మనీ వెనక్కినెట్టింది. 1975 తర్వాత బ్రెజిల్ సొంతగడ్డపై అధికారిక మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. చివరిసారి బ్రెజిల్ 1975 ‘కోపా అమెరికా కప్’ టోర్నీ సెమీఫైనల్లో పెరూ చేతిలో ఓడిపోయింది. ఫ్రెండ్లీ మ్యాచ్‌ల విషయానికొస్తే 2002లో చివరిసారి బ్రెజిల్ జట్టు సొంతగడ్డపై ఓడింది. బ్రెజిల్ కోచ్ హోదాలో స్కొలారీకి ఎదురైన తొలి ఓటమి ఇదే. ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో ఓ ఆతిథ్య దేశం జట్టు ఏడు గోల్స్ సమర్పించుకోవడం ఇది తొలిసారేం కాదు. 1954లో ఆతిథ్య స్విట్జర్లాండ్ జట్టు లీగ్ మ్యాచ్‌లో 5-7 గోల్స్ తేడాతో ఆస్ట్రియా చేతిలో ఓడిపోయింది. -
జర్మనీ జాతర...బ్రెజిల్ పాతర
సెమీస్‌లో జర్మనీ విశ్వరూపం 7-1తో బ్రెజిల్‌పై విజయం 6 నిమిషాల్లో 4 గోల్స్ ఆశ్చర్యమే ఆశ్చర్యపోయింది. ఊచకోతే ఉలిక్కిపడింది. విధ్వంసమే విస్తుపోయింది. కలలో కూడా ఊహించనిది జరిగింది.ఒకటా... రెండా... మూడా... నాలుగా... ఎవ్వరూ ఊహించనివిధంగా ఏకంగా ఏడు గోల్స్ సమర్పించుకొని ఆతిథ్య బ్రెజిల్ జట్టు తమ అభిమానులందరినీ తలదించుకునేలా చేసింది. దూకుడే మంత్రంగా ఆడిన జర్మనీ తమ గోల్స్ జాతరలో బ్రెజిల్‌ను పాతరేసింది. ఆరు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ చేసి బ్రెజిల్‌ను బెంబేలెత్తించింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో జర్మనీ 7-1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తు చేసి ఎనిమిదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘రక్షణశ్రేణి’ అనే పదానికి విలువలేకుండా చేసిన బ్రెజిల్ తొలి 29 నిమిషాల్లోనే ఐదు గోల్స్ అర్పించుకొని తొలి అర్ధభాగంలోనే పరాజయాన్ని ఖాయం చేసుకుంది. తమ దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న బ్రెజిల్ ప్రపంచవ్యాప్తంగా తమను ఆరాధించే, అభిమానించే వారందరినీ శోకసంద్రంలో ముంచేసింది. బెలో హారిజాంట్: అగ్ని పరీక్షలో ఆతిథ్య జట్టు ఆహుతైపోయింది. జర్మనీ జట్టు ‘నభూతో నభవిష్యత్’ అన్నరీతిలో చెలరేగిపోయింది. బ్రెజిల్‌ను ఇప్పట్లో కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ నెయ్మార్... సస్పెన్షన్ కారణంగా కెప్టెన్, డిఫెండర్ థియాగో సిల్వా లేకపోవడంతో డీలా పడిన బ్రెజిల్‌పై సంపూర్ణ ఆధిపత్యం చలాయించిన జర్మనీ చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో జర్మనీ 7-1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మూడో స్థానం కోసం శనివారం జరిగే మ్యాచ్‌లో బ్రెజిల్ ఆడుతుంది. నెయ్మార్ కోసం గెలవాలని, అతనికి ‘కప్’ కానుకగా ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో సెమీఫైనల్ బరిలోకి దిగిన బ్రెజిల్ తొలి 10 నిమిషాలు ‘పట్టు’ కోల్పోకుండా ఆడుతున్నట్లు కనిపించింది. అయితే జర్మనీ 11వ నిమిషంలో సంపాదించిన తొలి కార్నర్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. టోనీ క్రూస్ సంధించిన క్రాస్ షాట్‌ను నేరుగా గోల్‌పోస్ట్ ముందు అందుకున్న థామస్ ముల్లర్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. ముల్లర్‌కు సమీపంలో గోల్‌కీపర్‌తో కలిపి మొత్తం 9 మంది బ్రెజిల్ ఆటగాళ్లు ఉన్నా వారందరూ ప్రేక్షకపాత్ర వహించారు. ఆరంభంలోనే షాక్ తిన్న బ్రెజిల్ తేరుకునేందుకు ప్రయత్నించేలోపు జర్మనీ జోరు పెంచింది. ఒకదశలోనైతే అసలు బ్రెజిల్ జట్టుకు రక్షణశ్రేణి ఆటగాళ్లు ఉన్నారా అనే అనుమానం కలిగింది. 23వ నిమిషంలో క్లోజ్ కొట్టిన షాట్‌ను బ్రెజిల్ గోల్‌కీపర్ సీజర్ నిలువరించగా బంతి తిరిగి క్లోజ్ వద్దకే వచ్చింది. ఈసారి క్లోజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా కీపర్‌ను, డిఫెండర్లను తప్పిస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపి జర్మనీకి 2-0 ఆధిక్యాన్నిచ్చాడు. రెండో గోల్ తర్వాత జర్మనీ ఆటగాళ్లు విశ్వరూపాన్ని ప్రదర్శించారు. బ్రెజిల్ డిఫెండర్లను చెల్లాచెదురు చేస్తూ ఎడతెరిపి లేకుండా దాడులు చేశారు. 24వ నిమిషంలో, 26వ నిమిషంలో టోనీ క్రూస్ రెండు గోల్స్ చేయగా... 29వ నిమిషంలో సమీ ఖెడిరా ఒక గోల్ సాధించాడు. దాంతో జర్మనీ 29 నిమిషాలు పూర్తయ్యే సమయానికి ఎవ్వరూ ఊహించనివిధంగా 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అప్పటికే ఓటమి ఖాయం చేసుకున్న బ్రెజిల్ తొలి అర్ధభాగంలో మరో గోల్ ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ద్వితీయార్ధభాగం తొలి 10 నిమిషాల్లో బ్రెజిల్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. మ్యాచ్‌లోనే తొలిసారిగా 51వ నిమిషంలో జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడి చేశారు. అదే జోరులో నాలుగుసార్లు గోల్ చేసే అవకాశాలను సృష్టించుకున్నా జర్మనీ గోల్‌కీపర్ నెయుర్ అడ్డుగోడలా నిలబడి వారి ఆశలను వమ్ముచేశాడు. కొన్ని నిమిషాలు బ్రెజిల్‌కు ఊరటనిచ్చిన జర్మనీ ద్వితీయార్ధంలో 20 నిమిషాల తర్వాత మళ్లీ జోరు పెంచింది. 69వ నిమిషంలో, 79వ నిమిషంలో షుర్లే రెండు గోల్స్ చేసి జర్మనీ ఆధిక్యాన్ని 7-0కు పెంచాడు. ఇక బ్రెజిల్ ఖాతా తెరవదేమో అని అనుకుంటున్న తరుణంలో ఆట 90వ నిమిషంలో ఆస్కార్ తొలి గోల్ చేశాడు. స్కోరు బోర్డు జర్మనీ: 7 ముల్లర్: 11వ, క్లోజ్: 23వ, క్రూస్: 24వ, 26వ, సమీ ఖెడిరా: 29వ, షుర్లే: 69వ, 79వ ని. బ్రెజిల్: 1 ఆస్కార్: 90వ ని. ‘టాప్’ క్లోజ్... హా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడిగా జర్మనీ వెటరన్ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. బ్రెజిల్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆట 23వ నిమిషంలో క్లోజ్ గోల్ చేయడంతో ఇప్పటిదాకా 15 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో పేరిట ఉన్న ఈ రికార్డు తెరమరుగైంది. రొనాల్డో 19 మ్యాచ్‌ల్లో 15 గోల్స్ చేయగా... క్లోజ్ 23 మ్యాచ్‌ల్లో 16 గోల్స్ సాధించాడు. 35 ఏళ్ల క్లోజ్కిది వరుసగా నాలుగో ప్రపంచకప్ కావడం విశేషం. ఇప్పటిదాకా క్లోజ్ ‘గోల్’ చేసిన ఏ మ్యాచ్‌లోనూ జర్మనీ ఓడిపోలేదు. హా 2002 ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీపై రొనాల్డో రెండు గోల్స్ చేసి అత్యధిక గోల్స్ రికార్డు సాధించాడు. ఆ ఫైనల్లో మిరోస్లావ్ క్లోజ్ సభ్యుడిగా ఉండటం విశేషం. యాదృచ్ఛింగా బ్రెజిల్‌పైనే, వారి దేశంలోనే, రొనాల్డో సమక్షంలోనే అతని రికార్డును క్లోజ్ అధిగమించాడు. క్లోజ్ గోల్ చేస్తున్న సమయంలో రొనాల్డో స్టేడియం గ్యాలరీలో స్థానిక టెలివిజన్ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అత్యధిక గోల్స్ జాబితాలో గెర్డ్ ముల్లర్ (జర్మనీ-14 గోల్స్); జస్ట్ ఫోంటైన్ (ఫ్రాన్స్-13 గోల్స్); పీలే (బ్రెజిల్-12 గోల్స్) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. -
సెమీఫైనల్లో బ్రెజిల్ పై జర్మనీ విజయం
-
సాక్షి స్పోర్ట్స్ 9th July 2014
-
బ్రజిల్.. గాయంతోనే వెనుతిరిగి..!
-
అర్జెంటీనా ఏళ్ల కలను మెస్సీ నెరవేర్చేనా?!
-
మార్కెట్లోకి వాన్ పెర్సీ నాణేలు
ది హేగ్: ప్రపంచకప్ గ్రూప్ దశలో స్పెయిన్‌పై కళ్లు చెదిరే రీతిలో గాల్లోకి డైవ్ చేస్తూ హెడర్ గోల్ చేసిన నెదర్లాండ్స్ స్ట్రయికర్ రాబిన్ వాన్ పెర్సీ చేసిన విన్యాసం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ డైవింగ్ చిత్రాన్ని ఓ నాణెంపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. లిమిటెడ్ ఎడిషన్‌గా మార్కెట్లోకి వచ్చిన 6 వేల నాణేలు కొద్ది గంటల్లోనే హాట్ కేక్‌లా అమ్ముడైపోయాయి. ఈ నాణెం ధర 9.95 యూరో (రూ.809)లు. -
ఫిఫా టిక్కెట్ల కుంభకోణంలో సూత్రధారి అరెస్ట్
రియో డి జనీరో: సాకర్ ప్రపంచకప్‌లో టిక్కెట్ల కుంభకోణానికి పాల్పడిన సూత్రధారిని బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన మ్యాచ్ హాస్పిటాలిటీ డెరైక్టర్ రే వెలన్ను రియో డి జనీరోలోని కోపాకబానా హోటల్లో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచకప్ మ్యాచ్‌ల టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయించి రూ. 650 కోట్ల్లు సంపాదించినట్లు రేపై ఆరోపణలున్నాయి. మరోవైపు రే వెలన్ వీఐపీ టిక్కెట్లను అక్రమంగా అట్లాంటా స్పోర్టిఫ్ అనే కంపెనీకి ఇవ్వగా వాటిని ట్రావెల్ ఏజెన్సీలకు అమ్మి బాగా డబ్బులు సంపాదించారు. దీంతో ఫిఫా.. ఆ కంపెనీ అమ్మిన మ్యాచ్‌ల టిక్కెట్లను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో మరో మూడు కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, జెట్ సెట్ స్పోర్ట్స్, పమోద్జి స్పోర్ట్స్లను ఫిఫా హెచ్చరించింది. రిలయన్స్ రూ. 7.2 కోట్లతో 19 మ్యాచ్‌లకు 304 ప్యాకేజీలను దక్కించుకుంది. గతవారం బ్రెజిల్ పోలీసులు రిలయన్స్ పేరుతో ఉన్న 59 టిక్కెట్లను సీజ్ చేశారు. దీంతో రిలయన్స్ ఈ కుంభకోణంపై విచారణ చేపట్టింది. -
బీరు ఏరులై పారుతోంది!
రియో డి జనీరో: ఈసారి ప్రపంచకప్‌లో బీరు ఏరులై పారుతోంది. గతంలో బ్రెజిల్‌లోని స్టేడియాలలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నా... ఈసారి మెగా టోర్నీ కోసం వీటిని సడలించారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రతి మ్యాచ్‌కూ రెండు గంటల ముందే బీరు కౌంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. పలు దేశాల జెండాల రంగులతో ప్రపంచకప్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కప్ బీర్లకు ఈసారి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. 473 మిల్లీలీటర్ల కప్‌ను రూ.270 నుంచి రూ. 360 వరకు చెల్లించి కొంటున్నారు. అయితే బీర్ తాగిన తర్వాత ఆ కప్‌లను పడేయకుండా... ప్రపంచకప్ జ్ఞాపికగా తీసుకువెళుతున్నారు. అయితే ఈ బీరు అమ్మకాలు పెరిగినట్లే... స్టేడియాల్లో ప్రత్యర్థి దేశాల అభిమానుల మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఏ గొడవా పెద్దది కాకుండా సెక్యూరిటీ సిబ్బంది నిలువరించారు. -
కేరళకు నెయ్మార్?
చికిత్స కోసం వస్తాడంటూ కథనాలు తిరువనంతపురం: బ్రెజిల్ ఫుట్‌బాల్ సంచలనం నెయ్మార్ కేరళకు రానున్నాడంటూ మళయాల టీవీ చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. కొలంబియాతో క్వార్టర్ ఫైనల్లో గాయపడ్డ నెయ్మార్ ఇక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకుంటాడని తెలిపాయి. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో బ్రెజిల్ ఫుట్‌బాల్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని కథనాలు ప్రసారమయ్యాయి. అయితే చాందీ మాత్రం దీనిని పూర్తిగా నిర్ధారించలేదు. ‘అతడి గాయానికి ఎలాంటి చికిత్స అవసరమో ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైద్యులు గుర్తించారు. ఆ వివరాలను మాకు ఇచ్చారు. ఈ ప్రతిపాదనను నెయ్‌మార్‌తో చర్చించేదీ లేనిదీ బుధవారం చెబుతాం’ అని చాందీ చెప్పారు. -
మెస్సీ x ముగ్గురు
అర్జెంటీనా బలం మెస్సీ. ఆ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవడం... తను ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో సూచిస్తోంది. దాదాపు ప్రతి ప్రత్యర్థి జట్టూ తన చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కానీ మెస్సీ తెలివిగా సహచరులకు అవకాశాలు సృష్టిస్తూ జట్టును గెలిపిస్తున్నాడు. ఈసారి ప్రత్యర్థి నెదర్లాండ్స్. ఆ జట్టు కోచ్ వాన్ గాల్ వ్యూహాలు పన్నడంలో దిట్ట. మరి మెస్సీ ఏం చేస్తాడో..? ఒక జట్టులో సాధారణంగా ఒక స్టార్ ఆటగాడు ఉంటాడు. కానీ నెదర్లాండ్స్ జట్టులో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. రాబెన్, వాన్ పెర్సీ, స్నైడర్... ముగ్గురూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒకరు తడబడితే మరొకరు బంతిని అందుకుంటున్నారు. నిజానికి ఇది ప్రత్యర్థులు ఊహించని పరిణామం. అందుకే ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మెస్సీకి, ఆ ముగ్గురికి మధ్య పోరుగా అభివర్ణించాలి. సావో పాలో: అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్‌ను ఈసారి ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో నెదర్లాండ్స్... 24 ఏళ్లుగా ఊరిస్తున్న టైటిల్ వైపు ఆశగా అర్జెంటీనా... ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌కు సిద్ధమయ్యాయి. ఈ టోర్నీలో ఎక్కువగా ఆకట్టుకున్న జట్టేదైనా ఉందంటే అది నెదర్లాండ్సే. ఆధిక్యం కోల్పోయినా... ఏ దశలోనూ మ్యాచ్‌పై ఆశలు వదులుకోని నైజం ఆ జట్టు సొంతం. లీగ్ దశలో స్పెయిన్, ఆస్ట్రేలియా జట్లతో... ప్రిక్వార్టర్ ఫైనల్లో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లే దీనికి మంచి ఉదాహరణ. నెదర్లాండ్స్ జట్టు ఏ క్షణంలోనైనా అనూహ్యంగా తేరుకుంటుందని ఈ మ్యాచ్‌ల్లో ఆ జట్టు ప్రదర్శన నిరూపించింది. అర్జెన్ రాబెన్, రాబిన్ వాన్ పెర్సీ, వెస్లీ స్నైడర్, డిర్క్ క్యుట్, హంటెలార్, లెరాయ్ ఫెర్, డెపె మెంఫిస్, డేలీ బ్లైండ్ తదితరులు సమష్టిగా రాణిస్తున్నారు. మొత్తానికి నెదర్లాండ్స్ ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడలేదు. ఇక కోచ్ లూయిస్ వాన్ గాల్ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ప్రపంచకప్ తర్వాత విఖ్యాత క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్ జట్టు కోచ్‌గా వెళ్లనున్న వాన్ గాల్ ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్‌లోనూ తమ జట్టుకు అనుకూల ఫలితాలు వచ్చేలా వ్యూహాలు రచించారు. మెక్సికోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కీలకదశలో కెప్టెన్ వాన్ పెర్సీని తప్పించి హంటెలార్ను... మరో ప్లేయర్ మెంఫిస్‌ను సబ్స్టిట్యూట్లుగా వాన్ గాల్ బరిలోకి దించారు. ఆ ఇద్దరూ ఒక్కో గోల్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. ఇక కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అదనపు సమయంలోని చివరి క్షణాల్లో రెగ్యులర్ గోల్‌కీపర్ స్థానంలో రెండో గోల్ కీపర్ టిమ్ క్రూల్‌ను బరిలోకి దించారు. చివరకు క్రూల్ ‘షూటౌట్’లో రెండు షాట్స్‌ను నిలువరించి నెదర్లాండ్స్‌ను సెమీస్‌కు చేర్చాడు. కేవలం లియోనెల్ మెస్సీ విన్యాసాలపైనే ఎక్కువగా ఆధారపడిన అర్జెంటీనా కీలకపోరులో ‘ఆరెంజ్’ను ఏ రేంజ్లో అడ్డుకుంటుందో చూడాలి. ప్రత్యర్థి జట్లు మెస్సీని నిలువరించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నా... అతను మాత్రం అద్వితీయ ఆటతీరుతో ప్రత్యర్థి డిఫెండర్లను తప్పిస్తూ, సహచరులకు గోల్ చేసే అవకాశాలను సృష్టిస్తున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏకైక గోల్‌తో అర్జెంటీనాను గెలిపించిన డి మారియో తొడ గాయంతో సెమీఫైనల్‌కు దూరమవ్వడం ఆ జట్టు అవకాశాలపై ప్రభావం చూపనుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పటిష్టంగా ఉన్న నెదర్లాండ్స్‌ను ఓడించాలంటే కేవలం మెస్సీనే కాకుండా ఇతర సభ్యులు శక్తి మేరా రాణించాలి. విశేషాలు ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా జట్టు ఇప్పటివరకు సెమీఫైనల్స్‌లో ఏనాడూ ఓడిపోలేదు. సెమీఫైనల్‌కు చేరుకున్న నాలుగు పర్యాయాల్లో అర్జెంటీనా రెండుసార్లు విజేతగా (1978లో, 1986లో) నిలిచింది. మరో రెండుసార్లు రన్నరప్‌గా (1930లో, 1990లో) నిలిచింది. 1978 ప్రపంచకప్ ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించిన తర్వాత అర్జెంటీనా మరోసారి డచ్ జట్టుపై గెలువలేదు. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి నెదర్లాండ్స్, అర్జెంటీనా ముఖాముఖి పోరులో తలపడుతున్నాయి. అర్జెంటీనా, ఆతిథ్య జట్టు బ్రెజిల్ ఏకకాలంలో ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. అర్జెంటీనా స్టార్ మెస్సీ ఈ ప్రపంచకప్‌లో అందరికంటే ఎక్కువగా 19 సార్లు తన సహచరులకు గోల్ చేసే అవకాశాలను సృష్టించాడు. పెనాల్టీ షూటౌట్లను మినహాయిస్తే గత 16 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. 12 మ్యాచ్‌ల్లో నెగ్గి, 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుత టోర్నీలో అర్జెంటీనా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లపై ఒక గోల్ తేడాతో గెలుపొందడం విశేషం. అంతేకాకుండా ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ అర్జెంటీనాయే తొలుత ఖాతా తెరిచింది. తాము బరిలోకి దిగిన గత నాలుగు ప్రపంచకప్‌లలో నెదర్లాండ్స్ మూడోసారి సెమీఫైనల్‌కు చేరింది. దక్షిణ అమెరికా జట్లతో ఆడిన 12 మ్యాచ్‌ల్లో రెండుసార్లు మాత్రమే (షూటౌట్లను మినహాయిస్తే) నెదర్లాండ్స్ ఓడిపోయింది. కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ తమ జట్టు చరిత్రలోనే తొలిసారి అత్యధికంగా 692 పాస్‌లు పూర్తి చేసింది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్ చేసిన 12 గోల్స్‌లో 10 గోల్స్ ద్వితీయార్ధ భాగంలో రావడం విశేషం. అంతేకాకుండా నెదర్లాండ్స్ తరఫున ఏడుగురు వేర్వేరు క్రీడాకారులు గోల్స్ చేశారు. ఈ టోర్నీలో ఏ జట్టు తరఫున ఇలా జరుగలేదు. -
నెయ్మార్ కోసమైనా గెలవాలి!
-
ఫుట్‌బాల్ అభివృద్ధికి తోడ్పడతా: గంగూలీ
కోల్‌కతా: భారత్‌లో క్రికెట్ గ్లామర్ ముందు ఫుట్‌బాల్ వెనుకబడిందని, ఈ ఆట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. కొత్తగా రాబోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో అట్లెటికో డి కోల్‌కతా ఫ్రాంచైజీకి గంగూలీ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ జట్టు జెర్సీని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ‘ఫుట్‌బాల్‌కు ఏదైనా చేసేందుకు ఇది మాకు దక్కిన అవకాశంగా భావిస్తున్నాం. ఇంత ప్రసిద్ధి చెందిన క్రీడ భారత్‌లో క్రికెట్ హోరులో పడి నిర్లక్ష్యానికి గురైంది. ఫుట్‌బాల్‌ను అమితంగా ఆరాధించే కోల్‌కతా నుంచి కచ్చితంగా జట్టు ఉండాలనే భావనతో రంగంలోకి దిగాం. సీఏం ఆశీస్సులతో తొలి టైటిల్‌ను మేమే గెలవాలని అనుకుంటున్నాం’ అని గంగూలీ అన్నాడు. ప్రతీ బెంగాలీ రక్తంలోనే ఫుట్‌బాల్ ఉందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. -
ప్రతిష్ట కోసం జర్మనీ
గత రెండు ప్రపంచకప్‌లలో వరుసగా సెమీస్‌లో ఓడిన జట్టు జర్మనీ. ఒకవేళ ఈసారి కూడా ఓడిపోతే... చోకర్స్ అనే ముద్ర పడిపోతుంది. నాలుగేళ్ల ఎదురు చూపుల్ని, నాలుగు వారాల కష్టాన్ని ఒక్క మ్యాచ్‌తో పోగొట్టుకునే అలవాటును మార్చుకోవాలి... ఈ సారి ఎలాగైనా గెలవాలి... ప్రతిష్ట నిలుపుకోవాలనేది జర్మనీ తపన. నెయ్మార్ కోసం బ్రెజిల్ ‘ప్రపంచకప్ ఫైనల్ ఆడాలన్న నా కలకు దూరం చేశారేమో... కానీ ప్రపంచకప్ సాధించిన జట్టు సభ్యుడిగా ఉండాలన్న నా కలను దూరం చేయలేరు’.. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న నెయ్మార్ అన్న ఈ ఒక్క మాట తన సహచరులపై అతడికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. అందుకే బ్రెజిల్ ఆటగాళ్లలో, అభిమానుల్లో ఒకటే కసి... నెయ్మార్ కోసమైనా గెలవాలి! బెలో హారిజోంట్: పుష్కరకాలం నుంచి ఊరిస్తున్న ‘టైటిల్ పోరు’కు మరోసారి అర్హత సాధించేందుకు బ్రెజిల్ సమాయత్తమైంది. ఆశాకిరణం నెయ్మార్.... సారథి థియాగో సిల్వా గైర్హాజరీలో బ్రెజిల్ కీలకమైన పోరులో బరిలోకి దిగనుంది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ జర్మనీతో బ్రెజిల్ తలపడనుంది. గత ఐదు మ్యాచ్‌ల్లో ‘యువతార' నెయ్మార్ ‘ప్లే మేకర్’ పాత్ర పోషించడంతో బ్రెజిల్‌కు అంతగా ఇబ్బందులు ఎదురుకాలేదు. అయితే కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ సందర్భంగా నెయ్మార్ గాయపడి మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. మరోవైపు చివరిసారిగా 1990లో విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ నాలుగో ప్రయత్నంలోనూ తడబడితే ఆ జట్టుపై కీలకదశలో చేతులెత్తేస్తోందనే అపవాదు పడిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలు, అవకాశాలు, ముప్పులపై ‘స్వాట్’ విశ్లేషణ. బలం * సొంతగడ్డపై ఆడటం. * టోర్నీలో ప్రతి 8 ప్రయత్నాల్లో ఒకసారి గోల్ చేయడం. * మేటి కోచ్ స్కొలారీ వ్యూహాలు. * స్వదేశంలో గత 41 మ్యాచ్‌లుగా అజేయ రికార్డు. * దూకుడైన ఆటతీరు. ఆటగాళ్ల మధ్య సమన్వయం. * ఈ టోర్నీలో 2,938 పాస్‌లు పూర్తి చేసింది. * ప్రతి 7 ప్రయత్నాలకు, ప్రతి 48 నిమిషాలకు గోల్ చేసింది. బలహీనత * స్టార్ ప్లేయర్ నెయ్మార్, కెప్టెన్ థియాగో సిల్వా సేవలు అందుబాటులో లేకపోవడం. * డిఫెన్స్‌లోనూ లోపాలు కనిపిస్తున్నాయి. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గోల్స్ సమర్పించుకుంది. * గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్లో నిష్ర్కమించిన రికార్డు. * ఆతిథ్య జట్టుతో ఆడుతున్నామనే ఒత్తిడి. అవకాశం * నెయ్మార్ గైర్హాజరీలో ఇతరులు స్టార్ హోదా పొందొచ్చు. * 2002 తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరే అవకాశం. * 1998లో ఫ్రాన్స్ తర్వాత ఫైనల్‌కు చేరిన ఆతిథ్య జట్టుగా రికార్డు. * 2002లో ఫైనల్లో బ్రెజిల్ చేతిలో ఓటమికి ప్రతీకారం. * 1950లో బ్రెజిల్ ప్రపంచకప్‌లో నిషేధం కారణంగా పాల్గొనలేకపోయిన జర్మనీ ఈసారి ఫైనల్‌కు చేరే అవకాశం. ముప్పు * బ్రెజిల్ నెగ్గిన అన్ని మ్యాచ్‌ల్లో ఆ జట్టే తొలుత ఖాతా తెరిచింది. ఒకవేళ సెమీస్‌లో ప్రత్యర్థి జట్టు మొదట ఖాతా తెరిస్తే మొదటికే మోసం రావొచ్చు. * గత రెండు ప్రపంచకప్‌లలో సెమీస్ వరకు జోరుగా ఆడి తడబడింది. * ఓడితే చోకర్స్ ముద్ర పడిపోతుంది. విశేషాలు * బెర్లిన్ గోడ కూల్చివేత తర్వాత జర్మనీతో బ్రెజిల్ జట్టు తొమ్మిదిసార్లు తలపడింది. ఇందులో ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి, రెండింటిని ‘డ్రా' చేసుకొని, మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. * 1966 నుంచి ఇప్పటివరకు ఆడిన 13 ప్రపంచకప్‌లలో జర్మనీ 10 సార్లు సెమీఫైనల్‌కు చేరింది. 10 పర్యాయాల్లో ఆ జట్టు ఆరుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి రెండు సార్లు విజేతగా నిలిచింది. నాలుగుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. * జర్మనీ స్టార్ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ మరో గోల్ సాధిస్తే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడవుతాడు. ప్రస్తుతం క్లోజ్ 15 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో సరసన ఉన్నాడు. * స్వదేశంలో గత 41 మ్యాచ్‌ల్లో బ్రెజిల్‌కు పరాజయం ఎదురుకాలేదు. చివరిసారి ఆ జట్టు 2002లో పరాగ్వే చేతిలో ఓడిపోయింది. * బ్రెజిల్ జట్టు కోచ్ హోదాలో లూయిజ్ ఫెలిప్ స్కొలారీకి ఒక్క ఓటమీ ఎదురుకాలేదు. 2002లో ఆయన కోచ్‌గా ఉన్నపుడే బ్రెజిల్ చివరిసారి విశ్వవిజేతగా నిలిచింది. -
‘ఎత్తు’తో చిత్తు చేశారు
సెమీస్‌లోకి నెదర్లాండ్స్ షూటౌట్లో కోస్టారికాపై 4-3తో గెలుపు ఫలించిన కోచ్ వాన్ గాల్ వ్యూహం ‘హీరో’ అయిన సబ్‌స్టిట్యూట్ గోల్‌కీపర్ క్రూల్ సెమీస్‌లో ఎవరితో ఎవరు 8న బ్రెజిల్ x జర్మనీ రాత్రి.గం 1.30 9న నెదర్లాండ్స్ x అర్జెంటీనా రాత్రి.గం 1.30 రెండు అంగుళాలు... మామూలుగా ఎత్తు విషయంలో ఇది పెద్ద లెక్కేం కాదు. కానీ అదే రెండు అంగుళాలు ఒక దేశాన్ని ప్రపంచకప్ సెమీస్‌కు చేర్చాయి. ఓ కోచ్ సునిశిత దృష్టి... కోట్లాది మంది ఆశలను నిలబెట్టింది. అవును... నెదర్లాండ్స్‌ను ప్రపంచకప్ సెమీస్‌కు చేర్చింది ఆ రెండు అంగుళాలే. 120 నిమిషాల పాటు ఆడిన తమ ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్ను నెదర్లాండ్స్ ఆఖరి క్షణాల్లో తప్పించింది. పెనాల్టీ షూటౌట్ కోసం రెండో గోల్ కీపర్ టిమ్ క్రూల్‌ను తీసుకొచ్చింది. ఫుట్‌బాల్‌ను బాగా చూసేవాళ్లు కూడా ఈ వ్యూహం అర్థం కాక దిమ్మెరపోయారు. కానీ ఈ ‘ఎత్తు’ వేసిన కోచ్ వాన్ గాల్ ఆలోచన మరోలా ఉంది. ప్రధాన గోల్ కీపర్ ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు. రెండో గోల్ కీపర్ క్రూల్ ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు. పెనాల్టీలను అడ్డుకోవాలంటే రెండు అంగుళాలైనా ఎత్తు.. ఎత్తే అనుకున్నారేమో... ఈ ‘కొత్త ఎత్తు’ వేశారు. ఆ ప్లాన్ ఫలించింది. టిమ్ క్రూల్ ఏకంగా రెండుసార్లు కోస్టారికా గోల్ ప్రయత్నాలను అడ్డుకున్నాడు. నెదర్లాండ్స్‌ను సెమీస్‌కు చేర్చి 15 నిమిషాల్లోనే హీరోగా మారాడు. అటు తన ప్లాన్‌తో వాన్ గాల్ ‘వహ్వా’ అనిపించుకున్నారు. సాల్వెడార్: పాపం... కోస్టారికా. టోర్నీ ఆద్యంతం అంచనాలకు అందని రీతిలో ఆడి క్వార్టర్స్‌కు చేరింది. ఇక్కడా అత్యంత పటిష్టమైన నెదర్లాండ్స్ జట్టును వణికించింది. అయితే పెనాల్టీ షూటౌట్లో మాత్రం అదృష్టం వెక్కిరించింది. అంతకుముందు నిర్ణీత, అదనపు సమయంలో ఏకంగా 15 గోల్స్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నా... చిట్ట చివర్లో నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ వ్యూహాలకు కోస్టారికా దెబ్బతింది. అత్యంత నాటకీయ పరిస్థితుల్లో సబ్‌స్టిట్యూట్ గోల్ కీపర్ టిమ్ క్రూల్ షూటౌట్‌కు బరిలోకి దిగడమే కాకుండా సూపర్ సేవర్‌గా మారి తమ జట్టును గట్టెక్కించాడు. ఫలితంగా శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ హోరాహోరీ పోరులో నెదర్లాండ్స్ 4-3తో నెగ్గింది. అదనపు సమయం దాకా ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా రాలేదు. ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ పెనాల్టీ షూటౌట్లో నెగ్గడం ఇదే తొలిసారి. ఆ జట్టు తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ (7) చేసిన రెప్ రికార్డును రాబెన్, స్నైడర్ సమం చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం కోస్టారికా కీపర్ నవాస్‌కు దక్కింది. తొలి నిమిషం నుంచే నెదర్లాండ్స్... కోస్టారికా గోల్ పోస్టుపై దాడులకు దిగింది. అయితే వీటిని కీపర్ నవాస్ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు. 39వ నిమిషంలో స్ట్రయికర్ రాబెన్ షాట్‌ను తక్కువ ఎత్తులో కుడి వైపు డైవ్ చేస్తూ నవాస్ బయటకు పంపాడు. ఇంజ్యూరీ సమయం (90+4)లో గోల్ పోస్టుకు కుడివైపు ఉన్న కుయుట్ బంతిని నెట్లోకి పంపినా గోల్ లైన్‌పై నిలుచున్న మిడ్ ఫీల్డర్ టెజెడా మెరుపు వేగంతో దాన్ని బయటికి తన్నడంతో తృటిలో గోల్ అవకాశం చేజారింది. 82, 117వ నిమిషంలోనూ స్నైడర్ కొట్టిన ఫ్రీ కిక్‌లు గోల్ పోస్టు బార్‌కు తగిలి విఫలమయ్యాయి. ఎక్స్ట్రా సమయం మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందనగా నెదర్లాండ్స్ కోచ్ తమ రెగ్యులర్ కీపర్‌ను మార్చాడు. -
నేను కేకలు పెట్టే పిల్లాడిని కాదు!
బ్రెసిలియా: ఇటలీ రిఫరీ తప్పిదాల వల్లే బెల్జియం ఓడిందని ఆ జట్టు కోచ్ మార్క్ విల్ మోట్స్ మండిపడ్డారు. ఆ రిఫరీ ఎంతసేపు అర్జెంటీనా కు అనుకూలంగా వ్యవహరించారే తప్పా.. ఆటలో నిబద్ధతను విడిచిపెట్టారని విమర్శించారు. మూడుసార్లు అర్జెంటీనా ఆటగాడు మెస్సీ నియమావళిని అధిగమించినా.. ఎల్లో కార్డు చూపించకపోవడం బాధాకరమన్నారు. అర్జెంటీనాకు మ్యాచ్ రిఫరీ అనుకూలంగా వ్యవహరించారనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన విల్ మోట్స్.. ' మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేకలు పెట్టడానికి నేను పిల్లాడిని కాదు. పదే పదే అర్జెంటీనా తప్పిదాలు చేసింది. అయినా వారికి రిఫరీ ఎల్లో కార్డు చూపించలేదు. ఒక తప్పిదం కారణంగా మాకు ప్రతికూలంగా వ్యవహరించి ..ప్రత్యర్ధి జట్టు పట్ల అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. అర్జెంటీనా-బెల్జియం మ్యాచ్ జరుగుతున్నంత సేపూ విల్ మోట్స్ బయట నుంచి పెద్దపెద్దగా అరుస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. -
సెమీస్ కు చేరిన ఆతిథ్య జట్టు
-
స్వారెజ్ ‘ఓపెనర్’
బీజింగ్: ప్రపంచకప్‌లో ఉరుగ్వే స్టార్ ఆటగాడు లూయిస్ స్వారెజ్ ‘కొరుకుడు’ వ్యవహారం ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే స్వారెజ్ అరుస్తున్న ఫొటోల ముందు తమ చేతిని పెట్టి కొరికించుకుంటున్నట్టు ఫోజులు పెడుతూ అభిమానులు సరదా పడుతుంటే... తాజాగా చైనీస్ రిటైల్ వెబ్సైట్ టావో బావో ‘స్వారెజ్ బైట్’ అనే పేరుతో బాటిల్ ఓపెనర్‌ను అమ్మకానికి పెట్టింది. ఆగ్రహంతో పెద్దగా నోరు తెరిచి అరుస్తున్న స్వారెజ్ కార్టూన్‌ను దీనికోసం ఉపయోగించారు. ఈ ఓపెనర్ ఖరీదు 2.70 డాలర్లు (రూ.161). ఇప్పటికే దీనికి విపరీతమైన డిమాండ్ వచ్చిందని ఆ షాప్ యజమాని వాంగ్ లిన్ సంబరపడుతున్నాడు. -
బ్రెజిల్ వెంటే బాలీవుడ్
న్యూఢిల్లీ: బాలీవుడ్‌కు ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచకప్ మేనియా పట్టుకుంది. సూపర్స్టార్లు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ సహా చాలామంది నటీనటులు బ్రెజిల్‌ను తమ ఫేవరెట్‌గా చెప్పుకుంటున్నారు. కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా వీక్షించినట్టే బాలీవుడ్ కూడా అదే స్థాయిలో ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేసింది. మ్యాచ్ ముగియగానే అమితాబ్ ‘బ్రెజిల్...’ అంటూ ట్వీట్ చేయగా మ్యాచ్‌కు ముందు కూడా ‘బ్రెజిల్ , కొలంబియా మ్యాచ్ జరుగబోతోంది. ఎవరూ నన్ను డిస్ట్రబ్ చేయవద్దు’ అని ట్వీట్ చేశాడు. మ్యాచ్ జరుగుతుంగా బ్రెజిల్ గెలిచే అవకాశాలున్నాయని షారుఖ్ ట్వీట్ చేశాడు. ‘డేవిడ్ లూయిజ్ సూపర్ గోల్ చేశాడు. అలాగే రొడ్రిగ్వేజ్కు అందరూ అభినందనలు తెలపాలి’ అంటూ నటుడు రాహుల్ బోస్ ట్విట్టర్లో తెలిపాడు. అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్లు కూడా తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. -
ఈసారి వదలం: లామ్
రియో డి జనీరో: వరుసగా మూడు ప్రపంచకప్‌లలో సెమీస్‌కు చేరినా టైటిల్ సాధించలేకపోయిన జర్మనీ ఈసారి మాత్రం ఆఖరి వరకూ పట్టు వదలకూడదని కృతనిశ్చయంతో ఉంది. 2002లో ఫైనల్లో ఓడిన జర్మనీ... 2006, 2010ల్లో మూడోస్థానంలో నిలిచింది. 24 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారి సాధిస్తామని జర్మనీ కెప్టెన్ ఫిలిప్ లామ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. వరుసగా నాలుగుసార్లు సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిన ఈ జట్టుకు అన్నీ కలిసొస్తున్నాయి. మంగళవారం జరిగే సెమీస్‌లో తమ ప్రత్యర్థి బ్రెజిల్ జట్టు నెయ్మార్, సిల్వల సేవలు కోల్పోయింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు లామ్ సేన ప్రణాళికలు రచిస్తోంది. -
అర్జెంటీనా అలవోకగా
బెల్జియంపై 1-0తో విజయం ప్రపంచకప్‌లో తొలి రెండు క్వార్టర్ ఫైనల్స్‌తో పోలిస్తే... ఈసారి మెరుపుల్లేవ్. ప్రేక్షకులే కాదు... ప్రత్యర్థి డిఫెండర్లు కూడా మెస్సీపైనే దృష్టి పెడితే... అర్జెంటీనా స్ట్రయికర్ హిగుయాన్ కామ్‌గా ఆరంభంలోనే ఓ గోల్ వేసేశాడు. అంతే... ఇక బెల్జియం తేరుకోలేదు. కనీసం పోరాడలేదు. ఫలితంగా అర్జెంటీనా అలవోకగా నెగ్గింది. 1990 తర్వాత ఈ జట్టు తొలిసారి సెమీస్‌కు చేరడం విశేషం. బ్రెజీలియా: ప్రస్తుత ప్రపంచకప్‌లో తమ జట్టు ఆలోచన లేకుండా ఆడుతోందన్న దిగ్గజ ఆటగాడు మారడోనా విమర్శలకు సమాధానమా.. అన్నట్టు అర్జెంటీనా జట్టు చెలరేగింది. మైదానంలోకి దిగిన మరుక్షణం నుంచే అటాకింగ్ గేమ్‌ను ప్రదర్శించి బెల్జియంను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫలితంగా శనివారం రాత్రి జరిగిన ఈ క్వార్టర్స్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో నెగ్గింది. ఇది మెస్సీకి 91వ మ్యాచ్. దీంతో మారడోనా రికార్డును సమం చేశాడు. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హిగుయాన్ సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే అర్జెంటీనా దూకుడు మంత్రం జపించింది. ఫలితంగా ఎనిమిదో నిమిషంలోనే ఫలితం దక్కింది. మిడ్ ఫీల్డ్ నుంచి స్ట్రయికర్ మెస్సీ బంతిని అద్భుతంగా డ్రిబ్లింగ్ చేసుకుంటూ డి మారియాకు పాస్ ఇచ్చాడు. దీన్ని వెంటనే అతను గోల్ పోస్టుకు ఎడమ వైపున్న మరో స్ట్రయికర్ గోంజలో హిగుయాన్కు అందించగా... ఆ బంతిని ఆపకుండా మెరుపు వేగంతో హిగుయాన్ బెల్జియం గోల్ కీపర్ అప్రమత్తం కాకముందే నెట్లోకి పంపాడు. దీంతో జట్టు 1-0 ఆధిక్యం సాధించింది. 13వ నిమిషంలో బెల్జియం మిడ్ ఫీల్డర్ కెవిన్ డి బ్రూనే కొట్టిన షాట్ గోల్ పోస్టు పక్కనుంచి వెళ్లిపోయింది. 28వ నిమిషంలో డి మారియా షాట్‌కు అతి సమీపం నుంచి బెల్జియం కెప్టెన్ కొంపనీ కాలు అడ్డుపెట్టి గోల్ అపాడు. 39వ నిమిషంలో గోల్ కోసం దూసుకొస్తున్న మెస్సీని నలుగురు డిఫెండర్లు అడ్డుకుని కిందపడేయడంతో ఫ్రీ కిక్ ఇచ్చారు. అయితే గోల్ పోస్టుకు మరీ సమీపంలో ఉండడంతో మెస్సీ కొట్టిన షాట్‌కు బంతి బార్ పైనుంచి వెళ్లింది. ద్వితీయార్ధంలో గోల్స్ ఆధిక్యాన్ని పెంచేందుకు ప్రయత్నించిన అర్జెంటీనాకు 55వ నిమిషంలో చక్కటి అవకాశం లభించింది. 25 గజాల దూరం నుంచి బంతిని అదుపులో పెట్టుకుంటూ వచ్చిన హిగుయాన్.. తన షాట్‌ను కాస్త ఎత్తులో కొట్టడంతో బార్‌కు తగిలి పైకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఇరు జట్లకు పలు అవకాశాలు లభించినా లక్షాన్ని సాధించలేకపోయాయి. అర్జెంటీనా సులభంగానే మ్యాచ్ గెలిచి సెమీస్‌కు చేరింది. -
‘గుండె’ కు గాయం...ఐనా బ్రెజిల్ సజీవం
సెమీస్‌కు చేరిన ఆతిథ్య జట్టు ఇక జర్మనీతో అమీతుమీ గాయంతో నెయ్మార్ ప్రపంచకప్‌కు దూరం ఒకే క్షణంలో రెండు రకాల భావోద్వేగాలు... ఓ వైపు గుండెల్లో చెప్పలేని బాధ... మరోవైపు పట్టరాని ఆనందం... ఆ ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆనంద భాష్పాలో... ఆపుకోలేని విషాదమో అర్థం కావడంలేదు... ఇదీ ఇప్పుడు బ్రెజిల్లో పరిస్థితి. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సొంతగడ్డపై కోటి ఆశలతో బరిలోకి దిగిన తమ జట్టు కొలంబియాను ఓడించి సెమీస్‌కు చేరిందనే సంతోషం ఓ వైపు. తమ దేశ ముద్దుబిడ్డ నెయ్మార్ నొప్పితో విలవిల్లాడుతుంటే తట్టుకోలేని ఆవేదన మరోవైపు. పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన. ఇక ఈ స్టార్ ఈ ప్రపంచకప్ ఆడలేడనే వార్త... సగటు బ్రెజిల్ అభిమాని గుండెను బద్దలు చేసింది. దీనికి తోడు కెప్టెన్ సిల్వా కూడా రెడ్‌కార్డ్ బారిన పడి సెమీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అందుకే... బ్రెజిల్ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠతో మంగళవారం జర్మనీతో సెమీస్ కోసం ఎదురు చూస్తోంది. ఆ ఉత్కంఠ ముందు కొలంబియాపై గెలిచిన ఆనందం మరుగునపడిపోయింది. ఫోర్టలెజా: ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లందరూ ఒక్కడినే లక్ష్యంగా చేసుకున్నారు. కానీ ఆ ఒక్కడిని కాపాడేందుకు బ్రెజిల్ జట్టు కోచ్ స్కొలారీ పన్నిన వ్యూహం అద్భుతంగా పని చేసింది. కొలంబియా డిఫెండర్లు నెయ్‌మార్‌ను కట్టడి చేసేందుకు చూస్తే... మిగిలిన బ్రెజిల్ ఫార్వర్డ్స్ బంతిని ఆధీనంలోకి తీసుకుని చెలరేగారు. ఫలితంగా సొంతగడ్డపై జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు బెబ్బులిలా విజృంభించింది. టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో బ్రెజిల్ 2-1తో కొలంబియాపై విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ సిల్వ (7వ ని.), డేవిడ్ లూయిజ్ (69వ ని.) బ్రెజిల్ తరఫున గోల్స్ చేశారు. చివరి వరకు ఒంటరిపోరాటం చేసిన జేమ్స్ రొడ్రిగ్వేజ్ (80వ ని.) కొలంబియాకు ఏకైక గోల్ అందించాడు. ఈ టోర్నీలో ఆరు గోల్స్ చేసిన రొడ్రిగ్వేజ్ ఈ మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. తాజా విజయంతో 12 ఏళ్ల తర్వాత బ్రెజిల్ తొలిసారి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. లూయిజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి బ్రెజిల్ అటాకింగ్‌తో చెలరేగిపోయింది. 7వ నిమిషంలో నెయ్మార్ ఇచ్చిన కార్నర్ కిక్ బ్యాక్‌లైన్ మీద బౌన్స్ కావడంతో అక్కడే ఉన్న సిల్వ చాలా దగ్గరి నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి బ్రెజిల్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. గోల్ షాక్ నుంచి తేరుకున్న కొలంబియా దీటుగా స్పందించింది. 11వ నిమిషంలో కాడ్రాడో (కొలంబియా) కొట్టిన బంతిని మధ్యలోనే సిల్వ అడ్డుకున్నాడు. 20వ నిమిషంలో నెయ్మార్, హల్క్ కలిసి బంతిని కొలంబియా పెనాల్టీ ఏరియా నుంచి నెట్వైపు సంధించారు. దీన్ని గోల్ కీపర్ ఒస్పినా సమర్థంగా నిలువరించాడు. హా ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 59 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న సిల్వాసేన ఐదు ప్రయత్నాల్లో ఒక్క గోల్ సాధించింది. కొలంబియాకు రెండే అవకాశాలు వచ్చాయి. రెండో అర్ధభాగంలో కొలంబియా వ్యూహం మార్చి నెయ్‌మార్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. దీన్ని బ్రెజిల్ చక్కగా సద్వినియోగం చేసుకుంది. 69వ నిమిషంలో లూయిజ్ కళ్లు చెదిరే రీతిలో కొట్టిన ఫ్రీ కిక్ బ్రెజిల్ స్కోరును డబుల్ చేసింది. ఆట మరో పది నిమిషాల్లో ముగుస్తుందనగా (80వ ని.) సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కార్లోస్ బాకాను బ్రెజిల్ కీపర్ సీజర్ కిందపడేశాడు. దీంతో కొలంబియాకు పెనాల్టీ లభించింది. దీన్ని రొడ్రిగ్వేజ్ సమర్థంగా గోల్‌గా మలిచాడు. రిఫరీ కొంప ముంచాడు: రొడ్రిగ్వేజ్ మ్యాచ్ కీలక సమయంలో స్పెయిన్ రిఫరీ కార్లోస్ వెలాస్కో కార్బెల్లో తీసుకున్న నిర్ణయాలు తమ జట్టుపై ప్రభావం చూపాయని కొలంబియా స్టార్ రొడ్రిగ్వేజ్ ఆరోపించాడు. తొలి అర్ధభాగంలో ఫెర్నాండిన్హో (బ్రెజిల్) తనను మూడుసార్లు అటాక్ చేసినా రిఫరీ పట్టించుకోలేదన్నాడు. ఓవరాల్‌గా బ్రెజిల్ ఆటగాళ్లకు అనుకూలంగా వ్యవహరించాడని ఆరోపించాడు. ఆగని కన్నీళ్లు రెండో అర్ధభాగంలో బ్రెజిల్ సూపర్ స్ట్రయికర్ నెయ్మార్ లక్ష్యంగా కొలంబియా ఎదురుదాడులకు దిగింది. ఆట 86వ నిమిషంలో బంతి కోసం వెళ్తున్న నెయ్‌మార్‌ను కొలంబియా డిఫెండర్ కామిల్లో జునిగా వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో కిందపడిపోయి నొప్పితో విలవిలలాడుతున్న అతన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మూడో వెన్నుపూసలో పగులు వచ్చిందని స్కానింగ్‌లో తేలడంతో... ఆసుపత్రికి వచ్చిన అభిమానుల శ్వాస ఆగినంత పని అయ్యింది. ఈ గాయంతో నెయ్మార్ టోర్నీకి దూరమయ్యాడు. మరోవైపు ఈ టోర్నీలో రెండోసారి ఎల్లో కార్డుకు గురికావడంతో బ్రెజిల్ కెప్టెన్ సిల్వ... మంగళవారం జరగబోయే సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఊహకందని అద్భుతం గోల్ పోస్ట్‌కు 35 గజాల దూరం... మధ్యలో నలుగురు కొలంబియా డిఫెండర్లు గోడలా నిలబడ్డారు... ఆ పక్కనే మరో ఇద్దరు ప్రత్యర్థులు ఆపడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రెజిల్ డిఫెండర్ లూయిజ్ వద్ద బంతి. సహచరుడికి పాస్ ఇస్తాడనుకుంటున్న తరుణంలో ఊహించని రీతిలో షాట్ కొట్టాడు. చిన్న పాస్‌తో మొదలుపెట్టి కుడి కాలు మడమను అమాంతం గాల్లోకి లేపి కొట్టిన ఫ్రీ కిక్ దెబ్బకు కొలంబియా గోల్ పోస్ట్ బద్దలైంది. గోల్ కీపర్ డేవిడ్ ఒస్పినా కళ్లు మూసి తెరిచేలోగా కుడివైపు కార్నర్ నుంచి బంతి నెట్లోకి దూసుకుపోయింది. -
ప్రపంచకప్ సెమీస్‌లో జర్మనీ
-
సెమీ ఫైనల్స్ నుంచి నెయిమార్ అవుట్
ఫోర్టలెజా : ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆతిథ్య బ్రెజిల్ టీమ్ జైత్రయాత్ర ఆశలకు భారీ గండి పడింది. గాయం కారణంగా బ్రెజిల్ స్టార్ స్ట్రయికర్ నయిమార్ టోర్నీ నుండి అవుట్ అయిపోగా, కెప్టెన్ థియాగో సిల్వకు రెండో ఎల్లో కార్డు శిక్షకు గురవడంతో సెమీస్‌లో ఆడే అవకాశం లేకపోయింది. సాకర్ ప్రపంచ కప్ సెమీఫైనల్లో నిన్న రాత్రి కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా ఆటగాడు జాన్ డీకొట్టడంతో నెయ్మర్కు గాయమైన విషయం తెలిసిందే. ప్రత్యర్థి ఆటగాడు మోకాలితో వెన్నుపై తన్నడంతో నయిమార్ తీవ్ర నొప్పితో మైదానంలో పడిపోయాడు. దాంతో నయిమార్ను స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయానికి కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతో ప్రపంచ కప్‌లోని మిగతా మ్యాచుల్లో నయిమార్ ఆడే అవకాశం లేకపోయింది. -
సెమీస్‌లో బ్రెజిల్
* కొలంబియాపై 2-1తో గెలుపు ఫోర్టలెజా: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆతిథ్య బ్రెజిల్.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కొలంబియాతో శనివారం తెల్లవారు జామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ 2-1 తేడాతో అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన కొద్ది సేపటికే టియాగో సిల్వ 7వ నిమిషంలో తొలిగోల్ సాధించగా, 69వ నిమిషంలో డేవిడ్ లూయిజ్.. బ్రెజిల్‌కు మరో గోల్ అందించాడు. అయితే ఆ తరువాత కొలంబియా తీవ్రంగా పోరాడింది. ఈ క్రమంలో 78వ నిమిషంలో కొలంబియాకు లభించిన పెనాల్టీని జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్‌గా మలిచి బ్రెజిల్ ఆధిక్యాన్ని తగ్గించాడు. కానీ, ఆ తరువాత మరో గోల్ సాధించలేకపోయిన కొలంబియా.. క్వార్టర్ ఫైనల్‌తోనే తమ పోరాటాన్ని ముగించింది. -
మెస్సీని ఆపితేనే..
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఒంటిచేత్తో అర్జెంటీనాను నడిపిస్తున్న స్టార్ ఆటగాడు మెస్సీ ఒకవైపు.. నాకౌట్లో అమెరికా ‘గోడ’ హొవార్డ్ను అధిగమించిన బెల్జియం జట్టు మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో కోస్టారికా అమీతుమీ తేల్చుకోనుంది. అర్జెంటీనా డీగో మారడోనా సారథ్యంలో 1986లో ప్రపంచకప్ గెలిచాక మళ్లీ అర్జెంటీనా ఎప్పుడూ టైటిల్ నెగ్గలేదు. ఈసారి టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీద ఉంది. ప్రపంచకప్ చరిత్రలో 1982లో స్పెయిన్‌లో జరిగిన టోర్నీలో మాత్రమే బెల్జియం జట్టు అర్జెంటీనాను ఓడించగలిగింది. బలం: ప్రధాన ఆయుధం మెస్సీ. తననే నమ్ముకుని బరిలోకి దిగుతోంది. తనపై జట్టు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లే ఈ సూపర్ స్టార్ రాణిస్తుండటం బలం. స్ట్రయికర్లు లవెజ్జి, పలాసియోతో పాటు మిడ్ ఫీల్డర్లు డి మారియా, పెరెజ్ జట్టుకు ఉపయోగపడే ఆటగాళ్లు. బలహీనత: మెస్సీపైనే అధికంగా ఆధారపడుతుండడం జట్టును ఇబ్బంది పెట్టే అంశం. ఈ విషయం నాకౌట్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై బయటపడింది. ప్రణాళికాబద్ధంగా ఆడిన స్విస్ ఆటగాళ్లు మెస్సీని కట్టడి చేయగలిగారు. స్ట్రయికర్ అగియోరో కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. నెదర్లాండ్స్ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌కు షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్... ఆ తర్వాత ఓటమి లేకుండా క్వార్టర్స్‌కు దూసుకొచ్చింది. మైదానంలో చురుకైన కదలికలతో ప్రత్యర్థులను కట్టిపడేస్తూ అనుకున్న ఫలితాలను సాధిస్తోంది. తొమ్మిది సార్లు టోర్నీలో బరిలోకి దిగినా టైటిల్ వేటలో వెనుకబడింది. ఈసారి మాత్రం ప్రపంచకప్‌ను కొట్టాల్సిందే అనే భావనతో ఆరెంజ్ సేన ఉంది. బలం: స్టార్ స్ట్రయికర్లు రాబిన్ వాన్ పెర్సి, అర్జెన్ రాబెన్లు తమ జట్టుకు పెట్టని కోటగా ఉన్నారు. ముఖ్యంగా మైదానంలో రాబెన్ వేగాన్ని అందుకోకుంటే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. మిడ్ ఫీల్డ్‌లో స్నైడర్ కీలక ఆటగాడు. బలహీనత: హాలెండ్ డిఫెన్స్ విభాగంలో లోపాలున్నాయి. మిడ్ ఫీల్డర్ నెజైల్ డి జోంగ్ గాయం కారణంగా జట్టుకు దూరమవుతున్నాడు. రాత్రి 9.30 గంటలకు సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం బెల్జియం ప్రత్యర్థి అర్జెంటీనాలా ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకుండా సమష్టిగా ముందుకెళుతూ బెల్జియం జట్టు అద్భుత ఫలితాలను సాధిస్తోంది. పేరున్న స్టార్ ఆటగాళ్లెవరూ లేకపోయినా తమ పని తాము చేసుకుపోతోంది. లీగ్, నాకౌట్లో ఆడిన అన్ని మ్యాచ్‌లను గెలుచుకుని ఉత్సాహంతో ఉంది. అలాగే ప్రిక్వార్టర్స్‌లో అమెరికాపై సాధించిన అద్భుత విజయం జట్టు ఆటగాళ్లలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇదే జోరుతో మెస్సీ బృందంపై పైచేయి సాధించాలనే కసితో ఉంది. బలం: జట్టు డిఫెన్స్ పటిష్టంగా ఉంది. అలాగే స్టార్ మిడ్ ఫీల్డర్ ఈడెన్ హజార్డ్ గ్రూప్ దశలో కీలకమయ్యాడు. అయితే తను ఇంకా పూర్తి స్థాయిలో రాణించాల్సి ఉంది. డిఫెండర్ థామస్ వెర్మలెన్ జట్టులో చేరనున్నాడు. మిడ్ ఫీల్డర్ కెవిన్ డి బ్రూనే ఉపయోగపడగలడు. బలహీనత: ఒక్కోసారి కీలక ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరపడుతుండడం జట్టును ఆందోళన పరిచే విషయం. కోస్టారికా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఈ జట్టు లీగ్ దశ కూడా దాటదని అంతా అనుకున్నారు. కానీ సంచలన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ తొలిసారి క్వార్టర్స్‌కు చేరింది. గ్రూప్ డిలో ఇటలీ, ఉరుగ్వే, ఇంగ్లండ్ జట్లను దాటుకుని వచ్చిన ఈ జట్టును ఆరెంజ్ సేన తక్కువ అంచనా వేస్తే ఫలితం అనుభవిస్తుంది. నాకౌట్లో గ్రీస్‌తో గంటకు పైగా పది మంది ఆటగాళ్లతోనే ఆడినా మ్యాచ్‌ను గెలుచుకున్న తీరు అద్భుతం. బలం: స్ట్రయికర్లు జోయెల్ క్యాంప్‌బెల్, బ్రియాన్ రూయిజ్ అటాకింగ్ గేమ్ ప్రత్యర్థికి ఇబ్బందే. గోల్ కీపర్ కీలర్ నవాస్ ఇప్పటికే సూపర్ సేవర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బలహీనత: సెంటర్ బ్యాక్ ఆటగాడు ఆస్కార్ డుయర్టే సస్పెండ్ కావడం, లెఫ్ట్ సైడ్ ఆటగాడు రాయ్ మిల్లర్ గాయం కారణంగా డిఫెన్స్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. రాత్రి 1.30 గంటలకు సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రూ. 600 కోట్ల టిక్కెట్ల కుంభకోణం
ఫిఫా సభ్యుడిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు రియో డి జనీరో: ఈసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ సందర్భంగా టిక్కెట్ల విషయంలో భారీ కుంభకోణం జరిగినట్లు బ్రెజిల్ పోలీసులు తెలిపారు. అంతా ఇంతా కాదు... ఏకంగా రూ. 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వెల్లడించారు. అయితే దీని వెనక ఫిఫా సభ్యుడు ఒకరు ఉన్నాడని గుర్తించి, అతడి కోసం వేట మొదలుపెట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి బ్లాక్ టిక్కెట్ల వ్యవహారం నడుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కు దాదాపు 1000 టిక్కెట్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టిక్కెట్ కనీస ధర 1365 అమెరికన్ డాలర్లు (రూ. 81,900) కాగా.. వీటిని అత్యధిక ధరకు అమ్మినట్లు గుర్తించారు. ఇక ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ రేటు 13600 అమెరికా డాలర్ల (దాదాపు రూ. 8.20 లక్షలు)కు చేరింది. అనుమానితుల ఫోన్ సంభాషణలను పోలీసులు సేకరించారు. అయితే బ్లాక్ దందా వ్యవహారం బయటపడటంపై ఫిఫా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 2022 ప్రపంచకప్ ఆతిథ్యహక్కుల్ని సొంతం చేసుకునేందుకు ఫిఫా పెద్దలకు ‘ఖతర్’ భారీగా లంచాలను ముట్టజెప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ వ్యవహారాన్ని ఫిఫా అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. -
కోడిపుంజును గద్ద..తన్నుకుపోయింది
ప్రపంచకప్ సెమీస్‌లో జర్మనీ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌పై 1-0తో విజయం ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు గుర్తు కోడిపుంజు... జర్మనీ ఫుట్‌బాల్ జట్టు గుర్తు గద్ద... ఈ రెండు జట్ల మధ్య ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోరాటం కూడా మినీ యుద్ధంలాగే సాగింది. ఆఖరి వరకూ రెండు జట్లూ హోరాహోరీ తలపడ్డాయి. కానీ అంతిమంగా కోడిపుంజును గద్ద తన్నుకుపోయింది. ఫ్రాన్స్‌పై గెలిచి జర్మనీ సెమీఫైనల్‌కు చేరింది. అంతేకాదు... ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగు టోర్నీల్లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇక ఈ జట్టును విజేతగా నిలిపిన ఆటగాడి పేరు హమ్మెల్స్... అంటే జర్మనీ భాషలో తేనెటీగ అని అర్థం..! రియో డి జనీరో ఈసారి బ్రెజిల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో నాకౌట్ దశలో అదనపు సమయం దాకా మ్యాచ్ వెళితే... చివర్లో ఆటగాళ్లకు శక్తి కావాలి. అందుకే మ్యాచ్ ప్రారంభంలో అన్ని జట్లు కాస్త నెమ్మదిగా ఆడుతున్నాయి. ప్రపంచకప్ తొలి క్వార్టర్ ఫైనల్లో జర్మనీ, ఫ్రాన్స్ కూడా అలాగే ఆట మొదలుపెట్టాయి. ప్రత్యర్థుల కదలికల్లోని నెమ్మదిని గమనించిన జర్మనీ... నిమిషాల్లో వ్యూహం మార్చింది. ఒక్కసారిగా వేగం పెంచి గోల్ కొట్టింది. అంతే... ఫ్రాన్స్ తేరుకున్నా ఫలితం లేకపోయింది. మ్యాచ్ 13వ నిమిషంలో హమ్మెల్స్ గోల్‌తో ఆధిక్యంలోకి వచ్చిన జర్మనీ... ఆ తర్వాత ఫ్రాన్స్‌కు అవకాశం రాకుండా జాగ్రత్తపడింది. సమయం గడిచే కొద్దీ మరింత వేగం పెంచి ఫ్రాన్స్ దాడులు చేసినా క్వార్టర్స్‌తోనే వెనుదిరగాల్సి వచ్చింది. 13వ నిమిషంలో గోల్ తొలి మూడు నిమిషాల్లో జర్మనీ బంతిని ఒకసారి లక్ష్యం వైపు పంపినా ఫ్రాన్స్ ప్లేయర్ కబాయే సమర్థంగా తిప్పికొట్టాడు. 7వ నిమిషంలో వల్బుయేనా ఇచ్చిన క్రాస్ పాస్‌ను బెంజెమా (ఫ్రాన్స్) గోల్‌పోస్ట్ వైపు పంపినా కాస్త దూరంగా బయటకు వెళ్లింది. తర్వాత స్ట్రయికర్ ముల్లర్, ఒజిల్ (జర్మనీ) సమయోచితంగా కదులుతూ ఫ్రాన్స్ బ్యాక్లైన్పై ఒత్తిడి పెంచారు. ఈ వ్యూహం 13వ నిమిషంలో ఫలించింది. మిడ్‌ఫీల్డర్ టోనీ క్రూస్ ఇచ్చిన ఫ్రీ కిక్‌ను సెంట్రల్ డిఫెండర్ హమ్మెల్స్ హెడర్‌తో అద్భుతమైన గోల్‌గా మలిచి జర్మనీకి 1-0 ఆధిక్యం అందించాడు. మధ్యలో రాపెల్ వరానే (ఫ్రాన్స్)ని అడ్డుపడ్డా హమ్మెల్స్ బంతిని సూపర్బ్‌గా పంపాడు. 23వ నిమిషంలో మటౌడి, బెంజెమా (ఫ్రాన్స్) జర్మనీ రక్షణ శ్రేణిని ఛేదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇదే క్రమంలో బెంజెమా కొట్టిన కిక్‌ను అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా తేల్చారు. 29వ నిమిషంలో ఎవ్రా (ఫ్రాన్స్) ఫౌల్ చేయగా, 31వ నిమిషంలో క్రూస్ (జర్మనీ) కొట్టిన కార్నర్‌ను సహచరులు అందుకోలేకపోయారు. తొలి అరగంటలో జర్మనీ సమయానుకూలంగా ఎదురుదాడులకు దిగితే, ఫ్రాన్స్ ప్రత్యర్థి సర్కిల్‌లోకి చొచ్చుకుపోవడంలో విఫలమైంది. ఒక్క బెంజెమా మాత్రమే నాలుగుసార్లు బంతిని జర్మనీ సర్కిల్‌లోకి తీసుకెళ్లినా గోల్ మాత్రం కొట్టలేకపోయాడు. బెంజెమా ఆకట్టుకున్నా.... 34వ నిమిషంలో వ్యాలీని వల్బుయేనా (ఫ్రాన్స్) బలంగా నెట్లోకి పంపేందుకు ప్రయత్నించినా జర్మనీ గోల్ కీపర్ న్యూయర్ అద్భుతంగా డైవ్ చేస్తూ తిప్పికొట్టాడు. 42, 44వ నిమిషంలో సహచరులు ఇచ్చిన రెండు క్రాస్ పాస్‌లను బెంజెమా ప్రమాదరకర రీతిలో గోల్ పోస్ట్ వైపు పంపాడు. అయితే ఒకదాన్ని హమ్మెల్స్, మరోదాన్ని గోల్ కీపర్ న్యూయర్ నిలువరించారు. ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 55 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న జర్మనీ రెండుసార్లు గోల్స్ కోసం ప్రయత్నించి ఒక్కసారి సఫలమైంది. అయితే ఫ్రాన్స్ చేసిన ఐదు ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆఖరి క్షణాల్లో ఆదుకున్న న్యూయర్ 47వ నిమిషంలో వల్బుయేనా (ఫ్రాన్స్) కొట్టిన కిక్‌ను అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా నిర్దారించారు. ఆ తర్వాత రెండు నిమిషాలకే బెంజెమా, మటౌడి సమయోచితంగా కదులుతూ హమ్మెల్స్ను ఛేదించే ప్రయత్నం చేశారు. కానీ హమ్మెల్స్ కౌంటర్ అటాక్‌కు దిగడంతో వెనక్కు తగ్గారు. స్కెవిన్స్టిగర్, ముల్లర్, ఒజిల్, క్రూస్, లామ్ ఒకరికొకరు బంతిని అందించుకుంటూ 54వ నిమిషంలో ముందుకెళ్లినా...చివర్లో లామ్ కొట్టిన బంతి బయటకు దూసుకుపోవడంతో ఫ్రాన్స్ ఊపిరి పీల్చుకుంది. 60వ నిమిషంలో వల్బుయేనా (ఫ్రాన్స్) కొట్టిన కార్నర్ షాట్‌ను వరానే నెట్లోకి పంపినా జర్మనీ గోల్ కీపర్ న్యూయర్ చక్కగా అందుకున్నాడు. తర్వాతి ఐదు నిమిషాలు పరస్పరం బంతి కోసం పోరాడినా... గోల్స్ అవకాశాన్ని చేజిక్కించుకోలేకపోయారు. 69వ నిమిషంలో ముల్లర్, షుర్లే (జర్మనీ) కొట్టిన రెండు షాట్స్‌ను ఫ్రాన్స్ నిలువరించింది. 78వ నిమిషంలో బెంజెమా గోల్ పోస్ట్ ముందరకు దూసుకొచ్చి బంతిని నేరుగా బలంగా సంధించినా కీపర్ న్యూయర్ అడ్డుకున్నాడు. 82వ నిమిషంలో పిచ్ మధ్య నుంచి షుర్లే (జర్మనీ) నేరుగా కొట్టిన బంతిని ఫ్రాన్స్ కీపర్ లోరిస్ అదుపు చేశాడు. 88వ నిమిషంలో ముల్లర్, ఎవ్రా, షుర్రే చేసిన అటాకింగ్‌ను వరానే ఫ్రాన్స్) నిలువరించాడు. ఎక్స్ట్రా టైమ్‌లో బెంజెమా గోల్ చేసినంత పని చేసినా జర్మనీ కీపర్ న్యూయర్ ఒంటిచేత్తో బంతిని బయటకు పంపడంతో జర్మనీ ఏకైక గోల్‌తో విజయం అందుకుంది. 16 జర్మనీ తమ చివరి పదహారు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. -
ఐఎస్ఎల్ ‘గోల్’ కొడుతుందా?
ఏ దేశంలో అయినా ఓ ఆట పాపులర్ కావాలంటే ఓ స్టార్ ఉండాలి. ఒక్క ఆటగాడు ఆ దేశంలో ఆట స్వరూపాన్నే మారుస్తాడు. భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్ రావడానికి కారణం కపిల్‌దేవ్. 1983 ప్రపంచకప్ గెలిచి దేశంలో క్రికెట్‌కు ఆదరణ పెంచాడు. ఆ తర్వాత సచిన్ దానిని మరింత విస్తృతం చేశాడు. ఇప్పుడు భారత ఫుట్‌బాల్‌కు కూడా అలాంటి ఓ స్టార్ కావాలి. దశాబ్దాలుగా దేశం అలాంటి హీరో కోసం ఎదురు చూస్తోంది. మరో రెండు నెలల్లో మొదలయ్యే భారత సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ద్వారా ఓ ఫుట్‌బాల్ దేవుడు దొరుకుతాడేమో అని కార్పొరేట్ ప్రపంచం ఆశపడుతోంది. మరి ఐఎస్ఎల్ ‘గోల్’ కొడుతుందా? ప్రపంచం అంతా ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. మన దగ్గర కూడా దీనిని బాగానే ఆదరిస్తున్నారు. రాత్రిళ్లు నిద్రలు మాని టీవీలు చూస్తున్న భారతీయుల్లో తరచుగా మెదులుతున్న ప్రశ్న... ‘మన దేశం ఎప్పుడు ఆడుతుంది?’. దీనికి సమాధానం చెప్పేవారు లేరు. అయితే ఐఎస్ఎల్ రూపంలో ఓ కొత్త లీగ్ ద్వారా దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అసలేంటీ ఐఎస్ఎల్? ఎనిమిది జట్లు... 176 మంది ఆటగాళ్లు... కావాల్సినంత గ్లామర్... ఇది ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీ స్వరూపం... దాదాపు మూడు నెలల పాటు భారత్‌లోని పలు నగరాల్లో జరిగే ఈ టోర్నీ మరో 60 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ సాకర్ స్ఫూర్తితో మొదలుకానున్న ఐఎస్ఎల్వైపే ఇప్పుడు అందరి దృష్టి. భారత్‌లో అథఃపాతాళానికి పడిపోయిన ఫుట్‌బాల్ ఆశలన్నీ ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్‌పై ఉండటమే ఇందుకు కారణం. భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధే లక్ష్యంగా ఐఎంజీ, రిలయన్స్ ఆధ్వర్యంలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య సహకారంతో ఈ ఏడాది నుంచి ఐఎస్ఎల్ ప్రారంభం కానుంది. అట్లెటికో డి కోల్‌కతా (కోల్‌కతా), నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఫుట్‌బాల్ క్లబ్ (గువాహటి), కేరళ బ్లాస్టర్స్ (కొచ్చి)తో పాటు ముంబై, పుణే, న్యూఢిల్లీ, బెంగళూరు, గోవానగరాల నుంచి మొత్తం ఎనిమిది జట్లు ఐఎస్ఎల్లో పాల్గొననున్నాయి. ఒక్కో జట్టులో 22 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో 10 మంది విదేశీ ప్లేయర్లు. 8 మంది దేశవాళీ భారత ఫుట్‌బాలర్లు, నలుగురు స్థానిక ఆటగాళ్లు ఉంటారు. ఇప్పటికే 59 మంది భారత ఆటగాళ్లు ఐఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ప్రతీ జట్టులో ఒక విదేశీ స్టార్ ఉంటాడు. డ్వైట్ యార్కే, ఫ్రెడ్రిక్ జంగ్బెర్గ్, రాబర్ట్ పిరెస్, మైకేల్ చోప్రా, లూయిస్ సాహా, హెర్నర్ క్రెస్పో ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు మరికొందరు విదేశీ స్టార్ ఆటగాళ్లు ఐఎస్ఎల్లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపు మూడు నెలల పాటు టోర్నీ జరిగే అవకాశమున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇక టోర్నీలో ప్రతీ జట్టును రూ. 12 కోట్లు (ఏడాదికి) చెల్లించి కొనుగోలు చేశారు. కోల్‌కతా జట్టును రూ. 18 కోట్ల (ఏడాదికి)కు దక్కించుకున్నారు. తొలి ఏడాది ప్రతీ జట్టు స్థాని కంగా ఫుట్‌బాల్ అభివృద్ధికి రూ. 2 కోట్లు ఖర్చుపెడుతుంది. ఇప్పటిదాకా కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, గోవా వంటి ప్రాంతాలకే పరిమితమైన ఫుట్‌బాల్ క్రీడ.. భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందేందుకు ఐఎస్ఎల్ ఉపయోగపడొచ్చు. స్టార్స్ ఉండకపోవచ్చు! అయితే ఈ లీగ్ కోసం మెస్సీలు, నెయ్మార్లు వచ్చి ఆడే అవకాశం లేదు. కాబట్టి ఆట పరంగా స్టార్స్ లేరనే అనుకోవాలి. ఇది ప్రతికూలాంశం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాలర్లను లీగ్‌ల్లో ఆడించాలంటే మాటలు కాదు.. ఆటగాళ్లతో ఒప్పందం చేసుకోవాంటే ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిందే. కానీ ఐఎస్ఎల్ జట్లు ఈ టోర్నీ కోసం అంత సాహసం చేసే అవకాశం కానీ, స్తోమత కానీ లేదు. దీంతో ఐఎస్ఎల్ టోర్నీ స్టార్లు లేకుండానే జరగనుంది. భారత ఆటగాళ్లు, మాజీ విదేశీ ఆటగాళ్లతోనే బండిని లాగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ సూపర్ లీగ్ హిట్టవుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. భవిష్యత్ ఫుట్‌బాల్‌దే(నా)? ఇండియన్ సూపర్ లీగ్‌పై మున్ముందు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 400 కోట్ల రూపాయలు కుమ్మరించబోతున్నారు. సాకర్‌పై ఉన్న అభిమానాన్ని మరింతగా విస్తరించి భారత్‌లో ఫుట్‌బాల్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ఇండియన్ సూపర్ లీగ్ అడుగులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. సాకర్ లీగ్‌ల్లో అత్యంత ఆదరణ ఉన్న టోర్నీ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్)తో ఐఎస్ఎల్ నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు. భారత్‌లో సాకర్ అభివృద్ధికి, ఐఎస్ఎల్లో క్వాలిటీ పెంచేందుకు, ఫ్రాంచైజీలు ఆర్థికంగా బలపడేందుకు సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు అందజేస్తుంది. మొత్తానికి భారీ అంచనాల మధ్య తొలిసారిగా భారత ఫుట్‌బాల్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఐఎస్ఎల్కు ఇప్పటికిప్పుడు ఆదరణ లభించకపోయినా... మున్ముందు విజయవంతమయ్యే అవకాశాలున్నాయి. అందుకే మాజీ క్రికెటర్లు, బాలీవుడ్ తారలు తమవంతు ప్రయత్నంగా ఇందులో భాగమయ్యారు. ఎవరు చూస్తారు? మన దగ్గర ఎవరైనా క్లబ్ ఫుట్‌బాల్‌ను ఆసక్తిగా చూశారంటే వాళ్లు కచ్చితంగా టీవీల్లో ఈపీఎల్, లా లిగా వంటి పెద్ద టోర్నీలు చూస్తున్నట్లే లెక్క. ఆ టోర్నీల్లో స్టార్ ఆటగాళ్ల విన్యాసాలు చూసిన తర్వాత... ఐఎస్ఎల్ వాళ్ల కంటికి ఆనకపోవచ్చు. ఈ విషయంలో ఐఎస్ఎల్ ముందు నుంచి జాగ్రత్త పడాలి. ఒక్కసారి లీగ్ చూసిన వ్యక్తి మళ్లీ ఈ మ్యాచ్‌ల కోసం ఎదురుచూడాలి. ఒకవేళ నాణ్యమైన ఆటగాళ్లు లేక లీగ్‌లో ఆట పరంగా నాణ్యత లేకపోయినా... ఏదో ఓ రూపంలో అభిమానిని ఆపాలి. ఇదే ఐఎస్ఎల్ బృందానికి పెద్ద సవాల్. సక్సెస్ అయ్యేదెలా ? క్రికెట్ అంటే పడిచచ్చే భారత్‌లో అభిమానులను మరో క్రీడవైపు మళ్లించడం అంత సులువైన విషయం కాదు. ఇందుకు లీగ్‌ల రేటింగ్సే సరైన ఉదాహరణలు. లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ హిట్ కాగా.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్) ఫర్యాలేదనిపించింది. అది కూడా ఐబీఎల్‌లో స్టార్ ప్లేయర్లు పాల్గొనడం వల్లే సాధ్యమైంది. ఐఎస్ఎల్ విజయవంతం కావాలంటే అభిమానులను టోర్నీ ఆకట్టుకోవాలి. అయితే స్టార్లు లేకపోవడంతో టోర్నీని విజయవంతం చేయడం మాటలు కాదు. ఐఎస్ఎల్ గురించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. టోర్నీ దగ్గర పడుతున్నా... ఇప్పటిదాకా ఆ దిశగా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ప్రముఖులు జట్లను కొనుగోలు చేయడంతో అభిమానుల దృష్టి ఈ ఫుట్‌బాల్ టోర్నీపై నిలిచినా.. ఐఎస్ఎల్ పూర్తయ్యే వరకు మ్యాచ్‌లు వీక్షించేలా చేయడం అంత సులభం కాదు. గ్లామర్ కిక్ భారత్‌లో అన్ని లీగ్‌ల కన్నా ఐఎస్ఎల్పై అభిమానులు దృష్టి కేంద్రీకరించడానికి కారణం క్రికెట్ దిగ్గజాలు ఫుట్‌బాల్ వైపు ఆసక్తి చూపడమే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. పొట్లూరి వరప్రసాద్‌తో కలసి కేరళ బ్లాస్టర్స్ జట్టును, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ జట్టు అట్లెటికో మాడ్రిడ్‌తో పాటు మరికొందరితో కలసి అట్లెటికో డి కోల్‌కతా జట్టును కొనుగోలు చేశారు. ఇక బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్ (పుణే), రణ్‌బీర్ కపూర్ (ముంబై), జాన్ అబ్రహం (నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ) ఐఎస్ఎల్లో జట్లకు ఓనర్లుగా ఉన్నారు. దీంతో ఈ ఫుట్‌బాల్ టోర్నీకి ఎక్కడాలేని గ్లామర్ కిక్ వచ్చింది. -
మట్టిలో మాణిక్యం ‘మెస్సీ’
రియోలో డాక్యుమెంటరీ ప్రదర్శన రియో డి జనీరో: అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ స్టార్‌గా మారడం వెనక చాలా కష్టం ఉంది. పెరుగుదలలో ఉన్న లోపాలని అధిగమించి ఆటగాడిగా ఎదిగాడు... ఈ అంశాలను ప్రస్తావిస్తూ ‘ది వర్క్ - మెస్సీ’ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ రియో డి జనీరోలో ప్రదర్శించారు. స్పెయిన్‌కు చెందిన అలెక్స్ ఇగ్లేసియా దీనికి దర్శకత్వం వహించగా.. అర్జెంటీనా మాజీ ఆటగాడు వాల్డనో స్క్రిప్ట్ అందించాడు. మట్టిలో మాణిక్యమైన మెస్సీ స్టార్‌గా ఎదగడానికి పడ్డ కష్టం, రోసారో వీధుల్లో తన ఆటతో మెస్సీ చేసిన సందడిని ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీ ప్రతీ ఒక్కరికిస్ఫూర్తినిస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. -
‘క్వార్టర్’ కిక్ రెడీ
ఇకపై... బంతిని అందుకోవాలంటే కాళ్లు అరగాల్సిందే.. గోల్ చేయాలంటే తాతలు దిగి రావాల్సిందే... గెలవాలంటే చుక్కలు చూపించాల్సిందే.. ఇకపై... చిన్న పొరపాటు చేసినా ఫలితం తారుమారవుతుంది.. క్షణ కాలం ఏమారినా ఓ దేశం అల్లాడుతుంది... అప్రమత్తంగా లేకుంటే అభిమాని గుండె పగులుతుంది... ...గెలిపించినోడు హీరో... ఓడించినోడో పెద్ద విలన్... విజేతగా నిలవాలంటే సర్వం ఒడ్డాల్సిందే. ఇక బరిలో మిగిలింది ఉద్దండపిండాలే. ఏ మ్యాచ్‌లో ఎవరైనా గెలవొచ్చు. ప్రతి జట్టూ ఆఖరి క్షణం దాకా పోరాడుతుంది. ఇక సగటు ఫుట్‌బాల్ అభిమానికి కావాల్సినంత కిక్. ఇక రెండు రోజుల పాటు ఎనిమిది జట్ల ‘క్వార్టర్స్’ సమరం. శుక్రవారం జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో యూరప్ జట్లు జర్మనీ, ఫ్రాన్స్ తలపడుతుంటే... రెండో క్వార్టర్ ఫైనల్లో దక్షిణ అమెరికా జట్లు బ్రెజిల్ , కొలంబియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. జర్మనీXఫ్రాన్స్ రాత్రి గం. 9.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం బ్రెజిల్ Xకొలంబియా అర్ధరాత్రి గం. 1.30 నుంచి ముఖాముఖి తలపడిన మ్యాచ్‌లు: 25 ఫ్రాన్స్: 11, జర్మనీ: 6 డ్రా: 8 జర్మనీ యూరప్ ఖండంలో అత్యంత శక్తివంతమైన జట్లలో జర్మనీ ఒకటి. 1954, 74, 90లలో విజేతగా నిలిచింది. అయితే ఈసారి కప్ గెలుచుకునే స్థాయి ఉన్న జట్లలో ఒకటిగా నిలిచినా ఇప్పటిదాకా ఆ స్థాయిలో ప్రదర్శన కనబరచలేదని విమర్శలు ఉన్నాయి. లీగ్ దశ తొలి మ్యాచ్‌లో పోర్చుగల్‌ను 4-0తో ఓడించినా ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టు ఆటగాళ్లతో పాటు కోచ్ జోచిమ్ లోపై ఒత్తిడి బాగానే ఉంది. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు చివరిసారి 1986లో ఆడాయి. బలం: స్ట్రయికర్లు ముల్లర్, క్లోజ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. దీనికి తగ్గట్టుగానే ముల్లర్ నాలుగు గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో ఉండగా, ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ (16) రికార్డు సాధించేందుకు మరో గోల్ దూరంలో క్లోజ్ ఉన్నాడు. ప్రపంచ నంబర్ వన్ కీపర్ మాన్యువల్ న్యూయర్ తమ అమ్ముల పొదిలో ఉండడం బలాన్నివ్వనుంది. బలహీనత: అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో జట్టు డిఫెన్స్ లోపాలు బయటపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒజిల్, బోటెంగ్, హోవెడెస్లను కోచ్ ఆడించిన తీరుపై మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. సెంటర్లో ఆడుతున్న కెప్టెన్ లామ్ ఫుల్ బ్యాక్‌లో రావాల్సి ఉంది. ఫ్రాన్స్ ఈ ప్రపంచకప్‌లో అందరి అంచనాలకు అందని రీతిలో దూసుకుపోతున్న జట్టు ఫ్రాన్స్. ఇప్పటిదాకా 10 గోల్స్ చేసి సత్తా చాటుకుంది. 1998లో తొలిసారిగా చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఈసారి మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. సమష్టి మంత్రంతో దూసుకుపోతుంది. అలాగే 1982 సెమీస్‌లో పెనాల్టీ షూటవుట్‌లో జర్మనీ చేతిలో ఎదురైన ఓటమికి ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. బలం: ఇప్పటిదాకా జర్మనీతో పోలిస్తే ఫ్రాన్స్ కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. స్ట్రయికర్ కరీం బెంజెమా సూపర్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశం. డిఫెన్సివ్ పరంగా ఈ జట్టు చురుగ్గా కదులుతోంది. యువ మిడ్ ఫీల్డర్ పాల్ పోగ్బా నాకౌట్లో జట్టును గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లోనూ తను కీలకం కానున్నాడు. వల్బుయేనా, మటౌడి, కబాయేలతో ఈ విభాగం పటిష్టంగా ఉంది. బలహీనత: డిఫెండర్లు వరానే, సఖో గాయాలతో బాధపడుతున్నారు. స్ట్రయికర్ గిరౌడ్ ఫామ్‌లేమితో తంటాలు పడుతున్నాడు. గోల్ కీపర్ హ్యూగో లారిస్ నుంచి మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది. క్వార్టర్స్‌కు చేరిందిలా..: లీగ్ దశలో: క్రొయేషియాపై 3-1తో గెలుపు మెక్సికోతో 0-0తో డ్రా కామెరూన్‌పై 4-1తో గెలుపు నాకౌట్లో: చిలీపై 3-2(పెనాల్టీ)తో గెలుపు బ్రెజిల్ ప్రస్తుత టోర్నీలో ఈ జట్టుపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కచ్చితంగా కప్ గెలుచుకోవాలనే భావనలో స్వదేశీ అభిమానులు ఉండడంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అందుకే వారి కోచ్ స్కోలారి క్వార్టర్స్‌కు ముందు తమ ఆటగాళ్లకు సైకాలజిస్ట్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చారు. అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఈ జట్టు తమకే మాత్రం సమ ఉజ్జీకాని కొలంబియాతో జరిగే మ్యాచ్‌లో అలసత్వం ప్రదర్శించకుండా ఆడాల్సి ఉంది. బలం: సంచలన ఆటగాడు నెయ్మార్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు. చిలీతో మ్యాచ్‌లో గాయానికి గురైన తను క్వార్టర్స్‌కు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుండడం అటు జట్టుకే కాకుండా అభిమానులకు కూడా ఊరటనిచ్చే అంశం. స్ట్రయికర్ హల్క్ అదరగొడుతున్నాడు. డేవిడ్ లూయిజ్, థియాగో సిల్వ, మార్సెలోతో డిఫెండింగ్ విభాగం ప్రత్యర్థికి ఆందోళన కలిగించనుంది. బలహీనత: నెయ్‌మార్‌పై విపరీతంగా ఒత్తిడి ఉండడం. అతడితో పాటు మరో స్ట్రయికర్ ఫ్రెడ్ కూడా ఇతర జట్లకు లక్ష్యంగా ఉన్నాడు. మిడ్ ఫీల్డ్‌లో ఆస్కార్ అంచనాలను అందుకోవడం లేదు. ముఖాముఖి: తలపడిన మ్యాచ్‌లు: 25 బ్రెజిల్: 15 కొలంబియా: 2. డ్రా: 8 కొలంబియా ఈ జట్టు ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా క్వార్టర్స్‌కు చేరింది. తమ గ్రూప్‌లో పెద్దగా పేరున్న జట్లు లేకపోవడం కలిసొచ్చింది. ఇప్పుడు ఓడినా పోయేదేమీ లేదు కాబట్టి కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొడదామనే జోష్‌లో ఉంది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండి ఉండడంతో మైదానంలో పాదరసంలా కదులుతూ పటిష్ట బ్రెజిల్‌కు చుక్కలు చూపించాలని అనుకుంటోంది. బలం: ఉరుగ్వేపై రెండు గోల్స్ సాధించి జట్టును తొలిసారిగా క్వార్టర్స్‌కు చేర్చిన స్ట్రయికర్ జేమ్స్రోడ్రిగెజ్ ఈ జట్టుకు ప్రధాన ఆకర్షణగా మారాడు. ఇతడిని అడ్డుకోవడంపైనే బ్రెజిల్ విజయం ఆధారపడి ఉంది. వేగవంతమైన పాస్‌లతో ఇప్పటికే కొలంబియా మంచి పేరు తెచ్చుకుంది. బలహీనత: డిఫెండర్ మారియో యోప్స్ నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది. డిఫెన్స్ విభాగం కూడా పూర్తి స్థాయిలో సత్తా నిరూపించుకుంటేనే ఫలితం దక్కుతుంది. క్వార్టర్స్‌కు చేరిందిలా..: లీగ్ దశలో.. గ్రీస్‌పై 3-0తో గెలుపు ఐవరీ కోస్ట్‌పై 2-1తో గెలుపు జపాన్‌పై 4-1తో గెలుపు నాకౌట్లో.. ఉరుగ్వేపై 2-0తో గెలుపు -
అమెరికాపై బెల్జియం విజయం
-
అన్న చనిపోయిన బాధను దిగమింగి...
సావోపాలో: మరికొద్ది గంటల్లో అర్జెంటీనాతో నాకౌట్ పోరు... స్విట్జర్లాండ్ కోచ్ హిడ్జ్ఫెల్డ్ ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలా అని ఆలోచిస్తున్నారు. అంతలోనే పిడుగులాంటి వార్త... ఆయన అన్న చనిపోయారని సమాచారం. కానీ ఆయన బాధను దిగమింగారు. జట్టును నడిపించారు. తన విషాదం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడి ఆటగాళ్లకు సూచనలు ఇచ్చారు. అర్జెంటీనాపై పోరాడినా స్విట్జర్లాండ్ ఓడిపోయింది. ఓ వైపు అన్న మరణం... మరోవైపు స్విస్ జట్టుతో అదే ఆయన ఆఖరి మ్యాచ్... మ్యాచ్ ముగిశాక జట్టు సభ్యులంతా కలిసి కోచ్‌ను ఓదార్చారు. రెండేళ్ల క్రితం జట్టు కోచ్‌గా హిడ్జ్ఫెల్డ్ బాధ్యతలు తీసుకున్నాకే... స్విస్ బలమైన జట్టుగా తయారయింది. -
సీక్రెట్ ఆఫ్ ‘సెక్స్’స్
బ్రెజీలియా: ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. ఎనిమిది జట్లు టైటిల్ రేసులో నిలిచాయి. అయితే ఈ టోర్నీలో ఆయా జట్ల విజయానికి కారణాలేంటి ? ఈ ప్రశ్నకు ఆటగాళ్ల నుంచి వచ్చే సమాధానం ‘శృంగారం’. ఆటకు, శృంగారానికి సంబంధం ఏంటనే అనుమానం రావొచ్చు. కానీ ఈ రెండింటికి సంబంధం ఉందని ఫిఫా ప్రపంచకప్ నిరూపించింది. ఆటగాళ్లు సెక్స్ చేయకుండా నిషేధం విధించిన జట్లు ఈ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టాయి. రష్యా, మెక్సికో, చిలీ, బోస్నియాతో పాటు ఇప్పటిదాకా చిత్తయిన జట్లు ఇదే కోవలోకి వస్తాయి. అదే సమయంలో ‘శృంగారం’ విషయంలో ప్లేయర్లపై ఆంక్షలు విధించని జట్ల ఆటగాళ్లు మైదానంలో రెట్టించిన ఉత్సాహంతో చెలరేగిపోతున్నారు. ఆతిథ్య బ్రెజిల్‌తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, కోస్టారికా జట్ల విజయ రహస్యం సెక్సేనని చాలామంది నమ్ముతున్నారు. మ్యాచ్‌కి మ్యాచ్‌కి మధ్య విరామం వచ్చినప్పుడు ఆటగాళ్లను తమ భార్యలతో కానీ, గర్ల్‌ఫ్రెండ్స్‌తో కానీ గడిపేందుకు కోచ్‌లు అనుమతిస్తున్నారు. జర్మనీ, నెదర్లాండ్స్ కోచ్‌లు ‘గో ఎహెడ్’ అని ప్రోత్సహిస్తున్నారట. ఫలితంగా ఆటగాళ్లు మరో ఆలోచన లేకుండా ఆటపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారట. ఫ్రాన్స్, బ్రెజిల్, కోస్టారికా జట్ల కోచ్‌లు పరిమిత ఆంక్షలతో కూడిన శృంగారానికి అనుమతిస్తున్నారట. అయితే ఈ జట్ల ఆటగాళ్లు మాత్రం ఆంక్షలున్నా.. లక్ష్యం పూర్తవుతోందని తెగ సంబరపడిపోతున్నారు. ఇక అమెరికా, స్విట్జర్లాండ్, ఉరుగ్వే, నైజీరియా కోచ్‌లు సెక్స్‌కు అనుమతిస్తూనే సవాలక్ష ఆంక్షలు పెట్టారట. ఇది తమపై తీవ్ర ప్రభావం చూపిందని వీళ్లు గుసగుసలాడుకున్నారు. అన్నట్టు... డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ గ్రూప్ దశలోనే వెనుదిరగడానికి కారణం ఆ జట్టు ఆటగాళ్లను శృంగారానికి దూరంగా ఉంచడమేనని ప్రచారం నడుస్తోంది. -
హోవార్డ్ గోడను దాటి..క్వార్టర్స్ కు బెల్జియం
క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ జులై 4:శుక్రవారం ఫ్రాన్స్ x జర్మనీ రాత్రి గం. 9.30 నుంచి బ్రెజిల్ xకొలంబియా అర్ధరాత్రి గం. 1.30 నుంచి జులై 5: శనివారం అర్జెంటీనా xబెల్జియం రాత్రి గం. 9.30 నుంచి నెదర్లాండ్స్ xకోస్టారికా అర్ధరాత్రి గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ఎటాకింగ్‌తో గుక్క తిప్పుకోనివ్వని ప్రత్యర్థులు.. అడ్డుకోలేక చేతులెత్తేసిన తమ డిఫెండర్లు.. గోల్‌పోస్ట్ పైకి బుల్లెట్లా దూసుకొచ్చిన బంతి.. అయినా అడ్డుగోడలా నిలిచాడు అమెరికా గోల్‌కీపర్ టిమ్ హోవార్డ్. ఒకటి, రెండుసార్లు కాదు.. ఏకంగా 16 సార్లు! ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్‌ను నిలువరించిన కీపర్‌గా రికార్డునూ నెలకొల్పాడు. కానీ... హోవార్డ్ శ్రమకు ఫలితం దక్కలేదు. అతడు కట్టిన అడ్డుగోడను బద్దలు కొడుతూ బెల్జియం విజయభేరి మోగించింది. అదనపు సమయంలో డి బ్రూనే, లుకాకు అందించిన అద్భుత గోల్స్‌తో అమెరికాపై గెలుపొంది క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.పోరాడినా.. అమెరికాకు మరోసారి నిరాశే ఎదురైంది. సాల్వడార్: హోరాహోరీ పోరాటాలకు వేదికగా నిలిచిన ప్రపంచకప్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసే పోరులో బెల్జియం చెలరేగి ఆడింది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడు ప్రదర్శిస్తూ అమెరికాపై 2-1 గోల్స్‌తో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. కానీ అదనపు సమయంలో అదిరిపోయే ఆటతీరు కనబరిచాయి. బెల్జియం ఆటగాళ్లు కెవిన్ డి బ్రూనే (93వ నిమిషం), రుమేలు లుకాకు (105వ నిమిషం)లు వరుస గోల్స్‌తో తమ జట్టుకు ఆధిక్యాన్నందించారు. అయితే 107వ నిమిషంలో జులియన్ గ్రీన్ సాధించిన ఏకైక గోల్‌కే పరిమితమైన అమెరికా.. టోర్నీ నుంచి నిష్ర్కమించింది. అమెరికా ఓడినా.. బెల్జియం దాడుల్ని సంచలన రీతిలో తిప్పికొట్టిన గోల్‌కీపర్ హోవార్డ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. 1986లో సెమీఫైనల్‌కు చేరిన తరువాత ప్రపంచకప్‌లో బెల్జియంకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అమెరికా వరుసగా రెండో సారి ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగింది. మ్యాచ్ తొలి నిమిషంలోనే హోవార్డ్‌కు సవాలు ఎదురైంది. బెల్జియం ఫార్వర్డ్ ఒరిజి అందించిన పాస్‌ను డి బ్రూనే వేగంగా గోల్‌పోస్ట్‌లోకి పంపేందుకు చేసిన ప్రయత్నాన్ని హోవార్డ్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. 21వ నిమిషంలో బెల్జియం గోల్‌కీపర్ కోర్టయిస్ కూడా ఈ సవాలును విజయవంతంగా అధిగమించాడు. అమెరికా కెప్టెన్ డెంప్సీ గోల్‌పోస్ట్ దిశగా పంపిన బంతిని కోర్టయిస్ అంతే వేగంగా వెనక్కి పంపించాడు. 29వ, 45వ నిమిషాల్లోనూ బెల్జియం ప్రయత్నాలకు హోవార్డ్ అడ్డుగోడగా నిలవగా మ్యాచ్ ప్రథమార్ధం గోల్హ్రితంగా ముగిసింది. ద్వితీయార్ధంలో దూకుడు పెంచిన బెల్జియం బంతిని ఎక్కువగా తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ గోల్‌పోస్ట్‌పై పదే పదే దాడులు చేసింది. ప్రత్యర్థిని నిలువరించడంలో తమ డిఫెండర్లు విఫలమవుతున్నా.. ప్రతిసారీ అడ్డుగోడగా నిలిచిన హోవార్డ్ 71వ నిమిషంలో ఒంటికాలిపై డైవ్ చేస్తూ బంతిని ఆపిన తీరు మ్యాచ్‌కే హైలైట్. నిర్ణీత సమయం ముగిసినా గోల్ కాలేదు. అదనపు సమయంలో మూడో (93వ) నిమిషంలోనే డి బ్రూనే.. అమెరికా రక్షణశ్రేణిని చాకచక్యంగా ఛేదించుకుంటూ హోవార్డ్‌కు అందకుండా బంతిని నెట్లోకి పంపించాడు. బెల్జియం శిబిరంలో ఆనందోత్సాహాలు నింపాడు.హోవార్డ్ వీరోచిత పోరాటం కొనసాగించినా.. అదనపు సమయంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లుకాకు 105వ నిమిషంలో గోల్ చేశాడు. రెండో అదనపు సమయంలో బరిలోకి దిగిన గ్రీన్ 107వ నిమిషంలో అమెరికాకు గోల్‌ను అందించినా అప్పటికే ఆలస్యమైంది. -
ఢీ అంటే ఢీ
యూరప్ 4 - అమెరికా 4 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అన్ని దేశాలూ ఆడినా... నిజానికి ఇది అమెరికా ఖండంలోని దేశాలు, యూరప్ ఖండంలోని దేశాల మధ్య పోరాటం. ఎవరికి వారికి సొంత ఖండంలో ప్రతిష్టాత్మక టోర్నీలు ఉన్నాయి. దీంతో ప్రపంచంలో ఆధిపత్యం ఎవరిదో తేల్చుకోవాలని ఈ రెండు ఖండాల్లోని జట్లు తహతహలాడుతూ ఉంటాయి. ఇప్పటివరకు జరిగిన 19 ప్రపంచకప్‌లలోనూ ఇదే జరిగింది. ఇందులో 10 సార్లు యూరప్ జట్లు గెలిస్తే... 9 సార్లు అమెరికా జట్లు నెగ్గాయి. కాకతాళీయమే అయినా ఈసారి కూడా క్వార్టర్స్ దశకు ఈ రెండు ఖండాలకు చెందిన ఎనిమిదే జట్లే వచ్చాయి. యూరప్ నుంచి నాలుగు, అమెరికా నుంచి నాలుగు జట్లు రేసులో నిలిచాయి. సాక్షి క్రీడా విభాగం ఫిఫా ప్రపంచకప్ మొదలై 22 రోజులవుతోంది. ఆరు ఖండాల నుంచి 32 జట్లు బరిలోకి దిగాయి. కొన్ని లీగ్ దశలోనే వెనుదిరిగితే... మరికొన్ని ప్రిక్వార్టర్స్ అడ్డంకిని అధిగమించలేకపోయాయి. చివరకు యూరప్, అమెరికా ఖండాలకు చెందిన ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, కోస్టారికా, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన 19 ప్రపంచకప్‌ల్లో 10సార్లు యూరప్ జట్లు విజేతగా నిలిస్తే... 9 సార్లు అమెరికా టీమ్‌లు ట్రోఫీని చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఈ టోర్నీ కూడా అమెరికా, యూరప్ ఆధిపత్యానికి సవాలుగా నిలుస్తోంది. మరి ఏ ఖండం జట్లు సెమీస్ రేసులో నిలుస్తాయో చూడాలి. ఓవరాల్‌గా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో కొన్ని ఖండాల జట్లు సరైన ముద్ర వేయలేకపోయాయి. మరోవైపు టాప్ జట్లు కూడా కొంత తడబాటుకు గురైనా... నాకౌట్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. ఇక నాకౌట్లో పరిస్థితి ఏంటనేది ఆసక్తికరం. సెమీస్‌లోనూ ఇద్దరికీ... ఈసారి సెమీఫైనల్లోనూ రెండు ఖండాలకు చెందిన జట్లకు అవకాశం ఉంటుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఆయా ఖండాలకు చెందిన జట్లే పరస్పరం తలపడుతున్నాయి. ఫ్రాన్స్‌తో జర్మనీ; బ్రెజిల్‌తో కొలంబియా ఆడతాయి. కాబట్టి మిగిన రెండు మ్యాచ్‌ల్లో ఒకే ఖండానికి చెందిన జట్లు గెలిచినా... ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాల వల్ల కచ్చితంగా రెండో ఖండానికి చెందిన జట్టుకు కూడా సెమీస్‌లో చోటు ఉంటుంది. ఆసియా ఊసే లేదు ప్రపంచకప్‌లో ఆసియా నుంచి 4, ఆఫ్రికా నుంచి 5 జట్లు బరిలోకి దిగాయి. అయితే ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం, పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆసియా జట్లు లీగ్ దశలోనే వెనుదిరిగాయి. కానీ హోరాహోరీ పోటీ తర్వాత ఆఫ్రికా నుంచి కేవలం అల్జీరియా, నైజీరియా మాత్రమే నాకౌట్‌కు అర్హత సాధించాయి. అయితే ప్రిక్వార్టర్స్‌లో అల్జీరియా 1-2తో జర్మనీ చేతిలో; నైజీరియా 0-2తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయాయి. దీంతో ప్రపంచకప్‌లో ఆఫ్రికా జట్లు ప్రిక్వార్టర్స్ వరకే పరిమితమయ్యాయి. టాప్ జట్ల తడబాటు ఈ టోర్నీలో నెదర్లాండ్స్, అర్జెంటీనా, బ్రెజిల్ జట్లు టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగినా ఆటతీరు మాత్రం ఆ స్థాయిలో లేదు. లీగ్ దశలో నెదర్లాండ్స్, అర్జెంటీనా ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంటే.. బ్రెజిల్ మాత్రం కాస్త శ్రమించింది. అయితే నాకౌట్ దశకు వచ్చేసరికి టాప్ జట్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. జట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదవలేకున్నా నిర్ణీత సమయంలో గోల్స్ చేయలేకపోయారు. ప్రత్యర్థిగా చిన్న జట్లే ఉన్నా వాళ్లను కూడా నిలువరించలేకపోయారు. దీంతో చిలీతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ పెనాల్టీ షుటౌట్లో బయటపడి ఊపిరి పీల్చుకుంటే... జర్మనీ, అర్జెంటీనా, బెల్జియం ఎక్స్ట్రా టైమ్‌లో గోల్స్‌తో గట్టెక్కాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, కొలంబియా మాత్రమే నిర్ణీత సమయంలో మ్యాచ్‌ను ముగించాయి. ఓవరాల్‌గా ఈ టోర్నీలో టాప్ జట్లు అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నాయి. కనీసం క్వార్టర్ఫైనల్లోనైనా ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే ఫేవరెట్స్ అనుకుంటున్న జట్లన్నీ ఇంటి దారి పట్టే ప్రమాదం ఉంది. -
క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
-
‘ఫిక్సింగ్’ సైరన్!
-
గెలిస్తే... ‘అంతరిక్షం’లోకి!
ది హేగ్: క్రికెట్ అయినా ఫుట్‌బాల్ అయినా ప్రపంచ కప్ అనగానే కార్పొరేట్ ప్రపంచంలో ఒక కదలిక వస్తుంది. తమ దేశపు జట్టు గెలిస్తే ఇది ఇస్తాం...అది చేస్తాం అంటూ చాలా సంస్థలు భారీ ప్రకటనలు చేస్తుంటాయి. ఇప్పుడు నెదర్లాండ్స్‌కు చెందిన ఒక ఇంజినీరింగ్ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. తమ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిస్తే టీమ్ సభ్యులను ఏకంగా అంతరిక్షంలోకి పంపిస్తామని హామీ ఇస్తోంది! డచ్‌కు చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కంపెనీ ‘ఎస్ఎక్స్సీ’ ఈ ఆఫర్ ఇచ్చింది. వచ్చే ఏడాదినుంచి అంతరిక్షంలోకి కమర్షియల్ ఫ్లైట్లు పంపించేందుకు ఈ కంపెనీ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. మూడు సార్లు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లలో ఓడిన హాలెండ్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు ఇది పనికొస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. ‘మా ఆటగాళ్లు నేలపైనుంచి కాకుండా గాల్లో విన్యాసాలు చేస్తూ గోల్స్ సాధిస్తున్నారు. వారికి అలాంటి కానుకే ఇవ్వాలనేది మా కోరిక. భూమినుంచి దాదాపు 103 కిలో మీటర్ల ఎత్తులోకి జట్టులోని 23 మంది సభ్యులను తీసుకెళతామని హామీ ఇస్తున్నాం’ అని సదరు సంస్థ ప్రతినిధి మోల్ వెల్లడించారు. -
‘ఫిక్సింగ్’ సైరన్!
కామెరూన్ జట్టుపై నీలినీడలు జట్టులో ఏడుగురు ఆటగాళ్లపై అనుమానం... విచారణకు ఆదేశం యావోఉందె (కామెరూన్): ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో లీగ్ దశలోనే నిష్ర్కమించిన కామెరూన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు కామెరూన్ ఫుట్‌బాల్ సంఘం అనుమానిస్తోంది. ఈ మేరకు ఫిక్సింగ్ ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు విచారణకు కూడా ఆదేశించింది. ‘లీగ్ దశలో కామెరూన్ ఆడిన మూడు మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌పై ఎక్కువ అనుమానం ఉంది. జాతీయ జట్టులో ఉన్న ఏడుగురు ఆటగాళ్లు నీతి నియమాలకు, విలువలకు విరుద్ధంగా వ్యవహరించారు’ అని కామెరూన్ ఫుట్‌బాల్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. క్రొయేషియాతో జరిగే మ్యాచ్‌లో కామెరూన్ 0-4 గోల్స్ తేడాతో ఓడిపోతుందని... తొలి అర్ధభాగంలో కామెరూన్ జట్టు నుంచి ఒకరు రెడ్ కార్డుకు గురై మైదానం నుంచి నిష్ర్కమిస్తాడని... సింగపూర్‌కు చెందిన మ్యాచ్ ఫిక్సర్ విల్సన్ రాజ్ పెరుమాళ్ మ్యాచ్‌కు ముందు జర్మనీ మేగజైన్ డెర్ స్పైజెల్తో ఇంటర్వ్యూలో తెలిపాడు. మ్యాచ్ ఫిక్సర్ ముందుగా ఊహించినట్టే క్రొయేషియాతో మ్యాచ్‌లో కామెరూన్ 0-4తో ఓడింది. తొలి అర్ధభాగం 40వ నిమిషంలో కామెరూన్ ఆటగాడు అలెక్స్ సాంగ్ ప్రత్యర్థి జట్టు సభ్యుడు మాంద్జుకిక్ను మోచేతితో ఢీకొట్టి ‘రెడ్ కార్డు’కు గురయ్యాడు. కామెరూన్‌పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరుగుతున్నందున ఈ సమయంలో తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని ‘ఫిఫా’ తెలిపింది. ప్రపంచకప్‌కు అత్యధికంగా ఏడుసార్లు అర్హత సాధించిన ఆఫ్రికా జట్టు కామెరూన్. 1990లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా ఘనత సాధించింది. ఈసారి ప్రపంచకప్‌లో కామెరూన్‌కు ఆది నుంచి ఇబ్బందులే ఎదురయ్యాయి. బోనస్ వ్యవహారం పరిష్కరించేవరకు బ్రెజిల్ విమానం ఎక్కేదిలేదని ఆటగాళ్లు భీష్మించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కామెరూన్ మేటి ఆటగాడు శామ్యూల్ ఎటో పూర్తిస్థాయిలో నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో 0-1తో మెక్సికో చేతిలో ఓడిన కామెరూన్... రెండో మ్యాచ్‌లో 0-4తో క్రొయేషియా చేతిలో... మూడో మ్యాచ్‌లో 1-4తో బ్రెజిల్ చేతిలో ఓడిపోయింది. -
తడబడ్డా... నిలబడ్డారు
క్వార్టర్ ఫైనల్లో జర్మనీ అల్జీరియాపై 2-1తో విజయం ఓ వైపు మాజీ ప్రపంచ చాంపియన్ జర్మనీ... మరోవైపు చిన్న జట్టు అల్జీరియా... జర్మనీ ఆటగాళ్ల ఫామ్ ప్రకారం మామూలుగా అయితే నిర్ణీత సమయంలో మ్యాచ్ అయిపోవాలి. కానీ అల్జీరియా ఎదిరించింది. మ్యాచ్ ప్రారంభంలో 25 నిమిషాల పాటు జర్మనీని వణికించింది. కాస్త ఆలస్యంగా కోలుకున్న జర్మనీ స్టార్ ఆటగాళ్లంతా కలిసి కట్టుగా దాడులు ప్రారంభించారు. కానీ అల్జీరియా గోల్ కీపర్ రైజ్‌ను మాత్రం అధిగమించలేకపోయారు. దీంతో నిర్ణీత సమయంలో గోల్స్ రాలేదు. విరామంలో ఏం వ్యూహం మార్చారోగానీ... అదనపు సమయంలో చాంపియన్ స్థాయి ఆటతీరుతో జర్మనీ చెలరేగింది. 2-1తో అల్జీరియాను ఓడించి ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పోర్ట్ అలెగ్రా: ఆరంభంలో తడబడినా... ఇంజ్యూరీ టైమ్‌లో కలిసికట్టుగా ఆడిన జర్మనీ ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జర్మనీ 2-1తో అల్జీరియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు దారితీసింది. ఎక్స్ట్రా టైమ్‌లో షుర్లే (92వ ని.), మీసట్ ఓజిల్ (120వ ని.) జర్మనీకి రెండు గోల్స్ అందిస్తే... అల్జీరియా తరఫున ఏకైక గోల్ జబోవ్ (120+1వ ని.) చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి నాకౌట్ మ్యాచ్ ఆడిన అల్జీరియా ఆకట్టుకుంది. అల్జీరియా కీపర్ రైజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆట 3వ నిమిషంలో ముస్తాఫీ (జర్మనీ) కొట్టిన బంతిని అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా నిర్ణయించారు. అల్జీరియా బ్యాక్‌లైన్ నుంచి ఈ బంతిని కొట్టినట్లు తేల్చారు. 9వ నిమిషంలో జర్మనీ డిఫెన్స్‌ను ఛేదిస్తూ స్లిమాని (అల్జీరియా) ఊహించని రీతిలో బంతిని గోల్‌పోస్ట్ వైపు పంపాడు. అయితే జర్మనీ గోల్ కీపర్ మ్యాన్యుయేల్ న్యూయర్ సమర్థంగా నిలువరించాడు. 17వ నిమిషంలో జర్మనీ ఏరియాలో బంతిని డ్రిబ్లింగ్ చేసిన ఫెగోలి (అల్జీరియా) ఓ బలమైన షాట్‌తో నెట్వైపు పంపినా బంతి ఎక్కువ ఎత్తులో బయటకు వెళ్లింది. ఆ వెంటనే డైవ్ చేస్తూ స్లిమాని కొట్టిన హెడర్‌ను ఆఫ్‌సైడ్‌గా తేల్చారు. 25వ నిమిషంలో కార్నర్ నుంచి క్రూస్ ఇచ్చిన బంతి రీ బౌండ్ అయ్యింది. అక్కడే ఉన్న గోయెట్జీ గోల్ పోస్ట్‌లోకి పంపబోయినా అల్జీరియా కీపర్ రైజ్ నిలువరించాడు. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు పరస్పరం దాడులు చేసుకున్నా.. గోల్స్ మాత్రం రాలేదు. రెండో అర్ధభాగంలో వచ్చిన షుర్లే ప్రభావం చూపాడు. 48వ నిమిషంలో అతను కొట్టిన కిక్ తృటిలో తప్పిపోయింది. 51వ నిమిషంలో ఫిలిప్ లామ్ (జర్మనీ) షాట్‌ను కీపర్ రైజ్ చేతి వేళ్లతో అడ్డుకోవడంతో అల్జీరియా ఊపిరి పీల్చుకుంది. నిర్ణీత సమయం మరో 10 నిమిషాలు ముగుస్తుందనగా థామస్ ముల్లర్ కొట్టిన హెడర్‌ను మరోసారి రైజ్ నిలువరించాడు. ఆ తర్వాత కూడా గోల్స్ రాకపోవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు దారి తీసింది. ఎక్స్ట్రా టైమ్ రెండో నిమిషంల్లోనే ముల్లర్ ఇచ్చిన పాస్‌ను షుర్లే (92వ ని.) తన కాళ్ల మధ్యలో అదుపు చేస్తూ చాలా దగ్గరి నుంచి గోల్ పోస్ట్‌లోకి పంపి జర్మనీ శిబిరంలో ఆనందం నింపాడు. ఎక్స్ట్రా టైమ్ చివర్లో జబోవ్ నుంచి బంతిని దొరకబుచ్చుకున్న ఓజిల్ నేర్పుగా నెట్లోకి పంపి స్కోరును డబుల్ చేశాడు. జబోవ్ (అల్జీరియా) తర్వాతి నిమిషంలోనే గోల్ చేసి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. -
మెస్సీని మూసేసినా... స్విస్‌కు నిరాశే
స్విట్జర్లాండ్ బ్రహ్మాండమైన స్కెచ్ గీసింది. అర్జెంటీనా బలం మెస్సీని కదలనీయకుండా ఉచ్చు బిగించింది. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు డిఫెండర్లు మ్యాచ్ ఆసాంతం మెస్సీని చుట్టు ముట్టి ఊపిరి ఆడనీయకుండా నిలువరించారు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. ఈసారీ అదే వ్యూహంతో స్విస్ జాగ్రత్తపడింది. అయినా మెస్సీ పాదరసంలా కదిలాడు. తనకు అవకాశం లేదని తెలుసుకుని... తెలివిగా సహచరులకు పాస్‌లు ఇస్తూ నడిపించాడు. ఇదే క్రమంలో తను వ్యూహాత్మకంగా అందించిన పాస్‌ను డి మారియా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఫలితం... ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా క్వార్టర్స్‌కు చేరింది. సావో పాలో: లియోనల్ మెస్సీ మాయతో ఈసారి కచ్చితంగా ఫిఫా ప్రపంచకప్‌ను సాధిద్దామనుకుంటున్న అర్జెంటీనా అందుకు తగినట్టుగానే ముందుకెళుతోంది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ శాయశక్తులా పోరాడి అర్జెంటీనాను అడ్డుకున్నా... గోల్ కీపర్ బెనగ్లియో గోడలా నిలబడ్డా... చివరి క్షణాల్లో తేలిపోయింది. ఇప్పటిదాకా ప్రతీ మ్యాచ్‌లో గోల్ చేసి జట్టును గెలిపించిన మెస్సీ.. ఈసారి తన అద్భుత పాస్‌తో జట్టును గట్టెక్కించాడు. ఫలితంగా 1-0తో నెగ్గి అర్జెంటీనా క్వార్టర్స్‌కు చేరింది. మ్యాచ్ 118వ నిమిషం (అదనపు సమయం)లో డి మారియా అర్జెంటీనా తరఫున గోల్ చేశాడు. మొత్తానికి ప్రపంచకప్ నాకౌట్లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ అభిమానులకు కనువిందు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మెస్సీకి దక్కింది. * ఆరంభంలో ఇరు జట్లు నెమ్మదిగానే కదిలాయి. 25 నిమిషాల దాకా ఒక్క జట్టు కూడా లక్ష్యం దిశగా సాగలేదు. * 28వ నిమిషంలో స్విస్ తొలిసారి దాడికి దిగింది. స్టార్ మిడ్‌ఫీల్డర్ షాకిరి బంతిని డ్రిబుల్ చేసుకుంటూ అందించిన పాస్‌ను పెనాల్టీ ఏరియా దగ్గరి నుంచి మరో మిడ్ ఫీల్డర్ హాకా గోల్ పోస్టులోకి షాట్ కొట్టగా అర్జెంటీనా గోల్ కీపర్ రొమెరో అడ్డుకున్నాడు. * 31వ నిమిషంలో అర్జెంటీనా స్ట్రయికర్ లవెజ్జి పది గజాల దూరం నుంచి తక్కువ ఎత్తులో కొట్టిన షాట్ అంత బలంగా రాకపోవడంతో స్విస్ కీపర్ బెనగ్లియో సులువుగానే పట్టేశాడు. * 36వ నిమిషంలో లవెజ్జిని అడ్డుకున్నందుకు స్విస్ మిడ్‌ఫీల్డర్ హాకా మ్యాచ్‌లో తొలి ఎల్లో కార్డుకు గురయ్యాడు. * 39వ నిమిషంలో స్విస్‌కు మంచి అవకాశం లభించినా విఫలమైంది. స్ట్రయికర్ జోసెఫ్ డ్రిమ్క్ నేరుగా కొట్టిన షాట్.. కీపర్ రొమెరో చేతుల్లోకి వెళ్లింది. * ఆ తర్వాత కూడా ఎలాంటి ఫలితం రాకపోవడంతో 0-0తో ప్రథమార్ధం ముగిసింది. 60 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా అర్జెంటీనా గోల్ చేయలేకపోయింది. మరోవైపు స్విస్ డిఫెండర్లు మెస్సీని నియంత్రించడంలో విజయం సాధించారు. * 50వ నిమిషంలో స్విస్ ఆటగాడు షాకిరి ఫ్రీకిక్‌ను నేరుగా గోల్ కీపర్ పట్టుకున్నాడు. * 59వ నిమిషంలో అర్జెంటీనా డిఫెండర్ మార్కోస్ రోజో కొట్టిన షాట్ గోల్ కీపర్ చేతుల్లోకి వెళ్లి బయటికి వచ్చినప్పటికీ అక్కడ తమ ఆటగాళ్లు ఎవరూ లేకపోవడంతో చాన్స్ మిస్ అయ్యింది. * 62వ నిమిషంలోనూ అర్జెంటీనా స్ట్రయికర్ గోంజలో హిగువాన్ హెడర్ షాట్‌ను చివరి నిమిషంలో కీపర్ ఎగిరి చేత్తో అడ్డుకోవడంతో బంతి బార్ పైనుంచి వెళ్లిపోయింది. * 67వ నిమిషంలో బంతిని మెస్సీ తన చాతీతో నియంత్రించుకుని నేరుగా కొట్టిన వ్యాలీ స్వల్ప తేడాతో గోల్ పోస్టుపై నుంచి వెళ్లింది. * 78వ నిమిషంలోనూ మెస్సీ పరిగెత్తుతూ స్విస్ ఏరియాలోకి వచ్చి కొట్టిన షాట్ కూడా విఫలమైంది. ఆ తర్వాత కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. * 94వ నిమిషంలో పలాసియో హెడర్‌ను స్విస్ గోల్ కీపర్ వ మ్ము చేశాడు. * 109వ నిమిషంలో డి మారియా షాట్‌ను ఎడమవైపు డైవ్ చేస్తూ స్విస్ కీపర్ పైకి నెట్టాడు. * 118వ నిమిషంలో మెస్సీ పిచ్ మధ్యలో నుంచి పరిగెత్తుతూ కుడి వైపు ఇచ్చిన పాస్‌ను డి మారియా గురి తప్పకుండా నెట్లోకి కొట్టి అర్జెంటీనా శిబిరాన్ని ఆనందంలో నింపాడు. * ఇంజ్యూరీ సమయంలో స్విస్ ఆటగాడు జెమాలీ హెడర్ షాట్ గోల్ పోస్ట్ ఎడమ బార్‌ను తగిలి బయటకు వచ్చింది. చివర్లో తమకు లభించిన ఫ్రీకిక్ కూడా విఫలం కావడంతో అర్జెంటీనా విజయం ఖాయమైంది. ప్రపంచకప్‌లో బుధ, గురువారాలు మ్యాచ్‌లు లేవు. శుక్ర, శనివారాల్లో క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. -
ఈగిల్స్ కు ఫ్రెంచ్ 'కిక్'
-
ఈగిల్స్‌కు ఫ్రెంచ్ ‘కిక్’
ప్రత్యర్థిని 70 నిమిషాల పాటు వణికించిన జట్టు... గోడలా నిలబడి దాడులను అడ్డుకున్న డిఫెండర్లు... బంతిపై ఇంత పట్టు సాధించారా అని ఆశ్చర్యపరచిన ఆటగాళ్లు... ఆఖరి 20 నిమిషాల్లో చేతులెత్తేశారు. ఆఫ్రికా ఆశలను మోస్తున్న నైజీరియా చివర్లో చతికిలపడింది. తొలుత సాధారణంగా ఆడిన ఫ్రాన్స్.. మ్యాచ్ చివరి దశలో చెలరేగి ఈగిల్స్‌ను ఇంటికి పంపించింది. 21 ఏళ్ల యువ పోగ్బా అద్భుతమైన హెడర్‌తో ఫ్రెంచ్ తడాఖా రుచి చూపించాడు. - క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ - నైజీరియాకు నిరాశ బ్రెజీలియా: మాజీ చాంపియన్ ఫ్రాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే రాణించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. సోమవారం రాత్రి నైజీరియాతో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో 2-0తో నెగ్గింది. ద్వితీయార్ధం చివర్లో ఫ్రాన్స్ తమ అసలైన ఆటతీరును ప్రదర్శించింది. పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడులకి దిగి ఫలితం రాబట్టింది. నైజీరియా గోల్ కీపర్ ఎన్యీమా చాలా వాటిని సమర్థవంతంగానే అడ్డుకున్నా... 79వ నిమిషంలో యువ సంచలనం పోగ్బా హెడర్ గోల్ ముందు చేష్టలుడిగి పోవాల్సి వచ్చింది. ఇంజ్యూరీ సమయంలో యోబో (నైజీరియా) సెల్ఫ్ గోల్ చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పోగ్బాకి దక్కింది. మ్యాచ్ ఆరంభంలో నైజీరియా చురుగ్గా కదిలింది. 19వ నిమిషంలో నైజీరియా స్ట్రయికర్ ఎమెనికే గోల్ చేసినా ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. 22వ నిమిషంలో ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ వల్బుయేన ఇచ్చిన క్రాస్ షాట్‌ను యువ స్ట్రయికర్ పాల్ పోగ్బా సూపర్ వాలీతో గోల్ ప్రయత్నం చేసినా నైజీరియా కీపర్ ఎన్యీమా దాన్ని వమ్ము చేశాడు. 30వ నిమిషంలో ఒడెమ్వింగీ ఫ్రాన్స్ పెనాల్టీ ఏరియా వైపు తీసుకెళుతున్న బంతిని డిఫెండర్ వరానే తప్పించి నైజీరియా గోల్ అవకాశాన్ని దెబ్బతీశాడు. 40వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని ఫ్రాన్స్ జారవిడుచుకుంది. వల్బుయేనా పాస్‌ను సరిగ్గా అంచనా వేయకుండా డిఫెండర్ డెబుచీ బంతిని వైడ్‌గా పంపాడు. అటు 44వ నిమిషంలోనూ నైజీరియా ఆటగాడు ఎమినెకే ఫ్రాన్స్ పెనాల్టీ ఏరియా వైపు దూసుకొచ్చాడు. గోల్ పోస్టు దగ్గరిదాకా వెళ్లే అవకాశం లేకపోవడంతో దూరం నుంచే ఆడిన షాట్‌ను ఫ్రాన్స్ కీపర్ లోరిస్ ఒడిసిపట్టుకున్నాడు. పథమార్ధంలో 53 శాతం బంతి నైజీరియా ఆధిపత్యంలో ఉండడంతో పాటు నాలుగు సార్లు గోల్ పోస్టుపై దాడికి దిగారు. అయినా ఖాతా తెరువలేకపోయారు. దీంతో గోల్స్ లేకుండా విరామానికి వెళ్లారు. ద్వితీయార్ధం 54వ నిమిషంలో నైజీరియా మిడ్‌ఫీల్డర్ ఒనజిని మొరటుగా అడ్డుకున్నందుకు ఫ్రాన్స్ స్టార్ మిడ్‌ఫీల్డర్ మటౌడీ ఎల్లో కార్డుకు గురయ్యాడు. 64వ నిమిషంలో ఒడెమ్వింగీ గోల్ ప్రయత్నాన్ని ఫ్రాన్స్ కీపర్ విఫలం చేశాడు. 69వ నిమిషంలో ఫ్రాన్స్ గోల్ అవకాశాన్ని వెంట్రుకవాసిలో నైజీరియా ఆటగాడు మోసెస్ తప్పించాడు గోల్ పోస్టుకు ముందే బెంజెమా కొట్టిన షాట్ నేరుగా లోనికి వెళ్లబోతుండగా మోసెస్ చురుగ్గా ముందుకు కదిలి బంతి లైన్ దాటకముందే కాలితో బయటికి తన్నాడు. 78వ నిమిషంలో బెంజెమా హెడర్ విఫలమైంది. అయితే మరో నిమిషం (79వ)లోనే ఫ్రాన్స్ సంబరాలు చేసుకుంది. వల్బుయేనా కార్నర్‌ను గాల్లోకి ఎగిరి అందుకున్న పోగ్బా హెడర్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ సమయంలో నైజీరియా గోల్ కీపర్ మరీ ముందుకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. - 84వ నిమిషంలో ఫ్రాన్స్ మరో ప్రయత్నాన్ని నైజీరియా గోల్ కీపర్ గాల్లోకి ఎగిరి అడ్డుకున్నాడు. అయితే ఇంజ్యూరీ సమయంలో నైజీరియా ఆటగాడు యోబో సెల్ఫ్ గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. తమ జట్టు విజయాన్ని స్వదేశంలో ఆస్వాదిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ''ఫ్రాంకోయిస్ హాలెండె'' -
అతడే ఒక ‘సైన్యం’
మధ్య అమెరికాలో కేవలం 45 లక్షల జనాభా ఉన్న దేశం కోస్టారికా. రక్షణ కోసం సైన్యం లేకపోవడం ఈ దేశం ప్రత్యేకత. ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఆ దేశ గోల్‌కీపర్ నవాస్ చూపించిన తెగువ చూస్తే... ఈ దేశానికి సైన్యం అవసరం లేదేమో అనిపిస్తుంది. మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా గ్రీస్ స్ట్రయికర్స్‌ను అడ్డుకున్న నవాస్... పెనాల్టీ షూటౌట్లోనూ ప్రత్యర్థి కిక్‌ను అడ్డుకుని కోస్టారికాను తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చాడు. - కోస్టారికాను క్వార్టర్స్‌కు చేర్చిన నవాస్ - పెనాల్టీ షూటౌట్లో గ్రీస్‌పై గెలుపు రెసిఫె: ఫుట్‌బాల్ ప్రపంచకప్ నాకౌట్ దశలో మరో ఫలితం పెనాల్టీ షూటౌట్ ద్వారానే తేలింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో 5-3 తేడాతో కోస్టారికా జట్టు గ్రీస్‌ను ఓడించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో తొలిసారిగా ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అలాగే ప్రి క్వార్టర్స్ దశలో రెండు మ్యాచ్ ల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం రావడం ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి. బ్రెజిల్, చిలీ జట్ల మధ్య ఫలితం కూడా ఇలాగే రావడం తెలిసిందే. అంతకుముందు మ్యాచ్ నిర్ణీత సమయంలో రెండు జట్లు 1-1 స్కోరుతో సమంగా నిలిచాయి. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోస్టారికా ఇంజ్యూరీ సమయం (90+1)లో గ్రీస్‌కు గోల్‌ను సమర్పించుకుంది. దీంతో ఎక్స్ట్రా సమయం అనివార్యమైంది. ఇక్కడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. ఇందులో కోస్టారికా తరఫున బోర్జెస్, రూయిజ్, గోంజలెజ్, క్యాంప్‌బెల్, ఉమానా గురి తప్పకుండా గోల్స్ సాధించారు. ఇక గ్రీస్ తరఫున మిట్రోగ్లూ, లేజరస్, కోలెవస్ వరుసగా గోల్స్ చేయగా కీలకమైన తరుణంలో గేకాస్ షాట్‌ను గోల్ కీపర్ నవాస్ అడ్డుకున్నాడు. దీంతో పరాజయం ఖాయమైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోస్టారికా గోల్ కీపర్ నవాస్‌కు దక్కింది. క్వార్టర్స్‌లో ఈనెల 5న కోస్టారికా.. నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. - తొలిసారిగా నాకౌట్ దశలో ఆడిన గ్రీస్ ప్రారంభంలో కాస్త పైచేయి సాధించింది. 37వ నిమిషంలో స్ట్రయికర్ దిమిత్రియోస్ సల్పింగిడి అతి సమీపం నుంచి కొట్టిన షాట్‌ను కోస్టారికా గోల్ కీపర్ కీలర్ నవాస్ గాల్లో రెండు కాళ్లు చాపుతూ అద్భుతంగా అడ్డుకున్నాడు. - ఇప్పటిదాకా ప్రపంచకప్‌లో కోస్టారికా సాధించిన 16 గోల్స్‌లో 12 ద్వితీయార్ధంలోనే వచ్చాయి. ఈ ఆనవాయితీ కొనసాగింపుగా అన్నట్టు 52వ నిమిషంలో కోస్టారికా తమ గోల్ ఖాతాను తె రిచింది. - డిఫెన్స్‌ను ఛేదిస్తూ క్రిస్టియన్ బొలనాస్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న స్ట్రయికర్ బ్రియాన్ రూయిజ్ ఎడమ కాలితో నేర్పుగా గోల్ పోస్టు కుడివైపు చివరకు నెట్టి జట్టును ఆనందంలో నింపాడు. - 66వ నిమిషంలో కోస్టారికా ఆటగాడు ఆస్కార్ డుయర్టెకు రెండో సారి ఎల్లో కార్డు చూపడంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఈ జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. - చివర్లో గ్రీస్ తమ గోల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఇంజ్యూరీ సమయం ప్రారంభమైన నిమిషానికే కోస్టారికాకు షాక్ తగిలింది. ముందుగా గెకాస్ కొట్టిన షాట్ కీపర్ నవాస్‌కు తగిలి వెనక్కి వచ్చింది. గోల్ పోస్టుకు ఎదురుగా ఉన్న సోక్రటీస్ దీన్ని మెరుపు వేగంతో అందుకుని నెట్లోకి పంపాడు. దీంతో అప్పటిదాకా సంబరాల్లో మునిగిన కోస్టారికా అభిమానులు ఒక్కసారిగా నిరాశ కు గురయ్యారు. - ఎక్స్ట్రా సమయంలోనూ గ్రీస్ ప్రయత్నాలను కీపర్ నవాస్ వమ్ము చేసి మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. షూటౌట్లో తమ జట్టే గెలవడంతో ఆటగాళ్లతో పాటు కోస్టారికా అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. -
ఉరుగ్వేపై కొలంబియా సంచలన విజయం
-
ఆఖర్లో అద్భుతం చేసిన నెదర్లాండ్స్
-
కొలంబియా కొత్త చరిత్ర
తొలిసారి క్వార్టర్స్‌లోకి ప్రవేశం ఉరుగ్వేపై 2-0తో సంచలన విజయం జేమ్స్ ‘డబుల్’ ధమాకా రియో డి జనీరో: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో కొలంబియా చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసిన ఈ దక్షిణ అమెరికా జట్టు అదే జోరును కొనసాగిస్తూ శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వేకు షాక్ ఇచ్చింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ జేమ్స్ రోడ్రిగ్వెజ్ రెండు అద్భుతమైన గోల్స్ సాధించడంతో కొలంబియా 2-0తో ‘రెండుసార్లు చాంపియన్’ ఉరుగ్వేను చిత్తుచేసి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు సస్పెన్షన్ కారణంగా లూయిస్ స్వారెజ్ జట్టులో లేకపోవడం ఉరుగ్వే ఆటపై ప్రభావం చూపింది. ఫలితంగా గత ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఉరుగ్వే ఈసారి ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. జూలై 4న ఫోర్టలెజాలో జరిగే క్వార్టర్స్‌లో ఆతిథ్య బ్రెజిల్‌తో కొలంబియా తలపడుతుంది. గ్రూప్ దశలో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కొలంబియా నాకౌట్ స్టేజ్‌లోనూ అదే ఊపును కొనసాగించింది. తనకన్నా మెరుగైన ర్యాంకున్న ఉరుగ్వేపై ఆరంభం నుంచే పైచేయి సాధించింది. ఎక్కువ శాతం బంతిని తన ఆధీనంలోనే ఉంచుకున్న కొలంబియా 28వ నిమిషంలో ఖాతా తెరిచింది. గ్రూప్ దశలో మూడు గోల్స్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న జేమ్స్ రోడ్రిగ్వెజ్ పెనాల్టీ ఏరియా బయట బంతిని అందుకుని 20 గజాల దూరం నుంచి ఎడమ కాలితో కిక్ చేశాడు. ఉరుగ్వే గోల్ కీపర్ ముస్లెరా చేతి వేళ్లను తాకుతూ బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. లూయిస్ స్వారెజ్ లేకపోయినా ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఉరుగ్వే ప్రయత్నించింది. అయితే కొలంబియా డిఫెన్స్‌ను మాత్రం ఛేదించడంలో విఫలమైంది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి కొలంబియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో అదే జోరును కొనసాగించిన కొలంబియా ఐదు నిమిషాలకే(50వ నిమిషంలో) రెండో గోల్ నమోదు చేసింది. పాబ్లో అర్మెరో అద్భుతమైన క్రాస్‌ను జ్వాన్ క్వాడ్రడో గోల్‌పోస్ట్ వైపు పంపాడు. అక్కడే పొంచి ఉన్న రోడ్రిగ్వెజ్ బంతిని గోల్‌గా మలచడంతో కొలంబియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కొలంబియా ఆధిక్యాన్ని తగ్గించేందుకు ఉరుగ్వే ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. నిర్ణీత సమయంలో మరో గోల్ నమోదు కాకపోవడంతో ఉరుగ్వేకు ఓటమి తప్పలేదు. రెండు గోల్స్ సాధించి కొలంబియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోడ్రిగ్వెజ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ప్రపంచకప్‌లో రోడ్రిగ్వెజ్ ఐదు గోల్స్‌తో ‘గోల్డెన్ బూట్’ రేసులో దూసుకుపోతున్నాడు. జర్మనీకి చెందిన థామస్ ముల్లర్ నాలుగు గోల్స్‌తో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. -
ఆఖర్లో అద్భుతం
ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు నెదర్లాండ్స్ 2-1తో మెక్సికోపై విజయం ఆరు నిమిషాల తేడాలో రెండు గోల్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం మెక్సికోకు మరోసారి నిరాశ ఫోర్టలెజా: మ్యాచ్ ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన 2010 రన్నరప్ నెదర్లాండ్స్ జట్టు ఆఖర్లో మాత్రం అద్భుతం చేసింది. అప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న మెక్సికోకు అడ్డుకట్ట వేస్తూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ 2-1తో మెక్సికోపై గెలిచి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. స్నిడెర్ (88వ ని.), హంటెల్లార్ (90+4వ ని.) డచ్ జట్టుకు గోల్స్ అందించగా, మెక్సికో తరఫున డాస్ సాంటోస్ (48వ ని.) గోల్ చేశాడు. తొలి అర్ధభాగం వరకు పక్కా ప్రణాళికతో ఆడిన మెక్సికో జట్టు డచ్ అటాకింగ్‌ను సమర్థంగా నిలువరించినా... రెండో అర్ధభాగంలో మాత్రం నిరాశపర్చింది. మెక్సికన్ గోల్ కీపర్ ఓకో మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ ఓటమితో మెక్సికో వరుసగా ఆరో ప్రపంచకప్‌లోనూ ప్రిక్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచే మెక్సికో బంతిపై పట్టు కోసం బాగా పోరాడింది. అయితే డచ్ ఆటగాళ్లు వ్యూహత్మకంగా కదులుతూ ప్రత్యర్థి అటాకింగ్‌ను సమర్థంగా నిలువరించారు. 7వ నిమిషంలో అగులార్ (మెక్సికో) కొట్టిన ఫ్రీ కిక్ గోల్ పోస్ట్‌కు దూరంగా వెళ్లింది. ప్రత్యర్థి అటాకింగ్‌ను అడ్డుకునేందుకు నెదర్లాండ్స్ 9వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ నీజెల్ డీ జోంగ్ స్థానంలో డిఫెండర్ మార్టిన్ ఇండిని బరిలోకి దించి జట్టును సమతుల్యం చేసింది. 17, 20వ నిమిషాల్లో హెరీరా (మెక్సికో) కొట్టిన రెండు కిక్‌లకు డివ్రిజ్ (డచ్) సమర్థంగా అడ్డుకట్ట వేశాడు. ఈ దశలో సాంటోస్ (మెక్సికో) కొట్టిన కార్నర్ కిక్ కూడా వృథా అయ్యింది. 24వ నిమిషంలో చాలా దూరం నుంచి సాల్సిడో (మెక్సికో) కొట్టిన బంతిని డచ్ గోల్ కీపర్ సిలిసెన్ పైకి ఎగురుతూ రెండు చేతులతో పక్కకు నెట్టేశాడు. బంతిని ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇరుజట్లు హోరాహోరీగా తలపడినా గోల్ ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. మెక్సికో డిఫెండర్లను తప్పిస్తూ గోల్ పోస్ట్ వైపు వేగంగా దూసుకొచ్చిన వాన్ పెర్సీ (డచ్) 27వ నిమిషంలో ఎడమ కాలితో కొట్టిన బంతి తృటిలో బయటకు వెళ్లింది. ఫోర్టలెజాలో వేడి, ఉక్కపోత అధికంగా ఉండటంతో రెండు కూలింగ్ బ్రేక్‌లను అమలు చేశారు. 30వ నిమిషం తర్వాత మూడు నిమిషాల పాటు ఈ విరామం ఇచ్చారు. 37వ నిమిషంలో స్నిజ్డెర్ కొట్టిన కిక్ రోడ్రిగ్వెజ్ (మెక్సికో) అడ్డుకున్నాడు. ఆ తర్వాతి నిమిషంలోనే మెక్సికో వలయంలోకి దూసుకుపోయిన డిర్క్.... గోల్ పోస్ట్ ముందర బంతిని కొట్టడంతో కాస్త తడబడ్డాడు. తర్వాత గుర్డాడో, సాంటోస్, పెరాల్టా (మెక్సికో), రాబెన్, మార్టిన్ (డచ్) ఎదురుదాడులు చేసినా ప్రయోజనం లేకపోయింది. తొలి అర్ధభాగం వరకు బంతి ఎక్కువగా డచ్ ఆధీనంలో ఉన్నా... గోల్ కోసం చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు బంతిని ఆధీనంలోకి తీసుకునేందుకు తీవ్రంగా శ్రమించిన మెక్సికో గోల్స్ కోసం చేసిన ఏడు ప్రయత్నాలు వృథా అయ్యాయి. రెండో అర్ధభాగం మొదలైన మూడో నిమిషంలో (48వ) ఫార్వర్డ్ డాస్ సాంటోస్ గోల్ కొట్టి మెక్సికోకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. టాప్ ఏరియా నుంచి డెయిలీ బ్లైండ్ ఇచ్చిన ఆఫ్ వ్యాలీని కచ్చితమైన షాట్‌తో గోల్ కీపర్ సిలిసెన్ను తప్పిస్తూ నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. తర్వాత నెదర్లాండ్స్ వరుసగా దాడులు చేస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా... మెక్సికో రక్షణ శ్రేణి సమర్థంగా అడ్డుకుంది. 57వ నిమిషంలో రాబెన్ కొట్టిన కార్నర్ కిక్‌ను డివ్రిజ్ హెడర్‌గా మల్చే ప్రయత్నం చేసినా మెక్సికో గోల్ కీపర్ ఓకో నిలువరించాడు. 74వ నిమిషంలో మర్క్విజ్ ఇచ్చిన పాస్‌ను రాబెన్ పవర్ఫుల్ షాట్‌గా మల్చిన గోల్ కీపర్ ఓకో మరోసారి అడ్డుకున్నాడు. 76వ నిమిషంలో రెండోసారి కూలింగ్ బ్రేక్ ఇచ్చారు. 88వ నిమిషంలో రాబెన్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను మెంఫిస్ హెడర్‌తో వెనకవైపు పంపాడు. అక్కడే కాచుకుని ఉన్న స్నిడెర్ కొద్ది దూరం నుంచి బలమైన షాట్‌తో నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును సమం చేశాడు. 90+4లో లభించిన పెనాల్టీని హంటెల్లార్ అద్భుత రీతిలో గోల్‌గా మలిచాడు. దీంతో డచ్ 2-1తో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో నేడు (ప్రి క్వార్టర్స్) ఫ్రాన్స్ xనైజీరియా; రాత్రి గం. 9.30 జర్మనీ xఅల్జీరియా; అర్ధరాత్రి గం. 1.30 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
బ్రేజిల్ సాంబా..హో
-
ప్రపంచకప్ హాట్‌హాట్.. సెక్స్ వర్కర్లకు నిరాశ!
ఫోర్టలెజా: మైదానంలో గోల్స్ వర్షంతో బ్రెజిల్లో ప్రపంచకప్ హాట్‌హాట్‌గా సాగుతోంది. నిర్వాహకులూ సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ప్రపంచకప్‌తో తమ జీవితాలు మారిపోతాయని ఆశించిన అక్కడి సెక్స్ వర్కర్లకు మాత్రం నిరాశే మిగిలింది. ఎక్కడ చూసినా విదేశీ పర్యాటకుల సందడి కనిపిస్తున్నా... వాళ్లు శృంగారం గురించి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. విదేశీయుల కోసం ఇంగ్లిష్ కూడా నేర్చుకున్నా... తమ ‘గోల్’ నెరవేరలేదని వాపోతున్నారు. అయితే సెక్స్ వర్కర్లు బాగా ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లే ఇలా జరుగుతోందట. 100 నుంచి 500 డాలర్లు ఖర్చు పెట్టేకంటే... హాయిగా మందుకొట్టి పడుకుంటే మేలని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే కండోమ్స్ వ్యాపారం మాత్రం జోరుగానే సాగుతోంది. అదేంటి అంటే... విదేశాల నుంచి ఈసారి జంటలు ఎక్కువగా వచ్చాయట. -
కోస్టారికా కల నెరవేరేనా!
నెదర్లాండ్స్ xమెక్సికో; రాత్రి గం. 9.30 కోస్టారికా xగ్రీస్; అర్ధరాత్రి గం. 1.30 నేడు గ్రీస్‌తో అమీతుమీ ప్రపంచకప్‌లో కోస్టారికా ఒకేసారి (1990లో) ప్రిక్వార్టర్స్‌కు చేరింది. తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరే అవకాశం ఆ జట్టు ముందుంది. ఈసారి లీగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. డౌర్టె, క్యాంప్‌బెల్, ఉరెనా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ప్రపంచకప్‌లో ఏనాడూ తొలి రౌండ్ దాటని గ్రీస్ ఈసారి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. సమారిస్, సమారస్లు ఫర్వాలేదనిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన డిఫెండర్‌గా పేరు తెచ్చుకుంటున్న మనోలాస్, మిడ్‌ఫీల్డర్ కోన్లు కీలకం కానున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ముఖాముఖిగా తలపడలేదు. -
‘డచ్’ను ఆపతరమా...
నెదర్లాండ్స్‌తో మెక్సికో ‘ఢీ’ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన నెదర్లాండ్స్ ప్రిక్వార్టర్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌ను గడగడలాడించిన వెటరన్ ఆటగాళ్లు రాబెన్, పెర్సీ, డివ్రిజ్లతో పాటు మెంఫిస్, స్నిజ్దెర్ కీలకం కానున్నాడు. క్రితంసారి రన్నరప్‌తో సరి పెట్టుకున్న ‘డచ్’ ఈసారి ట్రోఫీపై గురి పెట్టింది. గత 28 ఏళ్లుగా ప్రిక్వార్టర్స్ దశను దాటలేకపోయిన మెక్సికోకు ఇదో మంచి అవకాశం. పక్కా ప్రణాళికలతో ఆడిన మెక్సికో లీగ్ దశలో ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కీపర్ ఓకో ప్రదర్శన సూపర్బ్. గర్డాడో, మర్క్వెజ్, హెర్నాండేజ్, పెరాల్టాలు నమ్మదగిన ఆటగాళ్లు. ఇప్పటి వరకు నెదర్లాండ్స్, మెక్సికోలు ముఖాముఖిగా ఆరు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. మూడింటిలో నెగ్గిన నెదర్లాండ్స్, రెండింటిలో ఓడి, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఓవరాల్‌గా రెండు జట్లు చెరో 11 గోల్స్ నమోదు చేశాయి. -
ఉరుగ్వే కోచ్ నిరసన...
రియో డి జనీరో: తమ స్టార్ ఆటగాడు లూయిస్ స్వారెజ్ను ప్రపంచకప్ నుంచి బహిష్కరించినందుకు నిరసనగా ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబరెజ్ ‘ఫిఫా’ వ్యూహాత్మక కమిటీ నుంచి తప్పుకున్నారు. ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు చిలిని భుజం కొరికినందుకు స్వారెజ్పై నాలుగు నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. తమ స్టార్ ఆటగాడిపై నిషేధానికి ఇంగ్లిష్ మీడియా ఒత్తిడి తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఉరుగ్వే ఒంటరిదై పోయిందని, మొత్తానికి స్వారెజ్ బలిపశువయ్యాడని ఆవేదన చెందారు. అతడిపై చర్య ఉంటుందని అనుకున్నా... ఫిఫా ఇంత కఠినంగా స్పందిస్తుందని భావించలేదని తబరెజ్ పేర్కొన్నారు. -
మిస్ ‘గోల్’..!
ఫోర్టలెజా: మైదానంలో గోల్స్ వర్షంతో బ్రెజిల్లో ప్రపంచకప్ హాట్‌హాట్‌గా సాగుతోంది. నిర్వాహకులూ సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ప్రపంచకప్‌తో తమ జీవితాలు మారిపోతాయని ఆశించిన అక్కడి సెక్స్ వర్కర్లకు మాత్రం నిరాశే మిగిలింది. ఎక్కడ చూసినా విదేశీ పర్యాటకుల సందడి కనిపిస్తున్నా... వాళ్లు శృంగారం గురించి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. విదేశీయుల కోసం ఇంగ్లిష్ కూడా నేర్చుకున్నా... తమ ‘గోల్’ నెరవేరలేదని వాపోతున్నారు. అయితే సెక్స్ వర్కర్లు బాగా ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లే ఇలా జరుగుతోందట. 100 నుంచి 500 డాలర్లు ఖర్చు పెట్టేకంటే... హాయిగా మందుకొట్టి పడుకుంటే మేలని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే కండోమ్స్ వ్యాపారం మాత్రం జోరుగానే సాగుతోంది. అదేంటి అంటే... విదేశాల నుంచి ఈసారి జంటలు ఎక్కువగా వచ్చాయట. -
‘రోజా’పై రాజీ లేదు!
సాకర్ ఆటగాళ్లకు రంజాన్ పరీక్ష రియో డి జనీరో: సాకర్ ప్రపంచకప్‌లో అసలు సమరం మొదలైంది. టైటిల్‌పై గంపెడాశలు పెట్టుకున్న జట్లకు ఇకపై ప్రతీ మ్యాచ్ అగ్ని పరీక్షే. అయితే పవిత్రమైన రంజాన్ మాసం ఆరంభం కానుండటంతో సాకర్ ఆటగాళ్లలో కొందరు ‘ఉపవాస’ పరీక్షను ఎదుర్కోబోతున్నారు. నాకౌట్ చేరిన జట్లలో ముస్లిం దేశమైన అల్జీరియాతో పాటు నైజీరియా, జర్మనీ, ఫ్రాన్స్... ఇలా ఆయా జట్లలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన వాళ్లు, ఇస్లాంను అనుసరిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో కరీమ్ బెంజెమా, మూసా సిసోకో, బాకరి సాగ్నా, మమదూ సాఖో (ఫ్రాన్స్), సామీ ఖెడిరా (జర్మనీ), జెర్దాన్ షాకిరి (స్విట్జర్లాండ్), అహ్మద్ మూసా (నైజీరియా), మరూని ఫెలైని (బెల్జియం) ప్రముఖులు. అల్జీరియా జట్టులో చాలా మంది ప్లేయర్లు ఉపవాస దీక్ష పాటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ‘రోజా’ పాటిస్తూ మైదానంలో బరిలోకి దిగడం అంత సులువైన విషయం కాదు. ఇప్పటికే బ్రెజిల్లో ఎండ తీవ్రతతో ఆటగాళ్లు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో ఉపవాసం కారణంగా ఆటగాళ్లు డిహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. అయినా అల్జీరియా ఆటగాళ్లు ఉపవాసానికి వెనకాడటం లేదు. ఎంతకష్టమైనా దీనిని పాటిస్తామంటున్నారు. మరోవైపు జర్మనీకి చెందిన మెసట్ ఓజిల్ రంజాన్ మాసం ప్రారంభం కానున్నప్పటికీ... సాకర్ ప్రపంచకప్ కారణంగా ‘రోజా’కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఫ్రాన్స్ కోచ్ డెస్ చాంప్స్ ముస్లిం ఆటగాళ్ల మనోభావాలకు అనుగుణంగా తానూ కూడా వ్యవహరిస్తానని, ‘రోజా’ పాటించడాన్ని తానేమీ అడ్డుకోబోనని స్పష్టం చేశారు. -
సాంబా...హో
క్వార్టర్స్‌లో బ్రెజిల్ పెనాల్టీ షూటౌట్లో చిలీపై గెలుపు నరాలు తెగే ఉత్కంఠ... హిచ్‌కాక్ సినిమాను తలదన్నే సస్పెన్స్... నాకౌట్ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్, చిలీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసిన అభిమాని పరిస్థితి ఇది. నిర్ణీత సమయంలో ఫలితం తేలలేదు. అదనపు సమయంలోనూ మరో గోల్ కాలేదు. దాంతో పెనాల్టీ షూటౌట్‌కు వె ళ్లగా బ్రెజిల్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. గోల్‌కీపర్ జూలియో సీజర్ సూపర్ సేవర్‌గా మారి అభిమానుల దృష్టిలో హీరోగా నిలిచాడు. తద్వారా ప్రపంచకప్ నాకౌట్ దశలో చిలీపై తమకున్న అజేయ రికార్డును ఈ సారి కూడా బ్రెజిల్ జట్టు పునరావృతం చేసింది. అలాగే సొంత గడ్డపై అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న సాంబా సేన సగర్వంగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బెలో హారిజోంట్: ఆరోసారి ప్రపంచకప్ దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న బ్రెజిల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన నాకౌట్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో చిలీపై 3-2 తేడాతో గెలిచింది. నిర్ణీత సమయంలో 1-1తో స్కోరు సమమైంది. బ్రెజిల్ తరఫున డేవిడ్ లూయిజ్ గోల్ చేయగా చిలీ తర ఫున అలెక్సిస్ సాంచెజ్ గోల్ సాధించాడు. నిర్ణీత సమయానికి ఇదే స్కోరు ఉండడంతో 30 నిమిషాల అదనపు సమయం ఆడాల్సి వచ్చింది. దీంట్లోనూ గోల్స్ నమోదు కాకపోవడంతో షూటౌట్‌కు వెళ్లారు. షూటౌట్లో బ్రెజిల్ 3-2 తేడాతో చిలీని చిత్తు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బ్రెజిల్ గోల్ కీపర్ జూలియో సీజర్ నిలిచాడు. చిలీపై తమకు ఘనమైన రికార్డు ఉన్న నేపథ్యంలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన బ్రెజిల్ అదే స్థాయిలో విజృంభించింది. ఆది నుంచే బంతిపైపట్టు సాధించి ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి దాడులు ప్రారంభించింది. దీంతో 6వ నిమిషంలో మార్సెలో 25 గజాల దూరం నుంచి కొట్టిన షాట్ గురి తప్పింది. 9వ నిమిషంలో నెయ్మార్ మోకాలి నొప్పికి చికిత్స తీసుకున్నాడు. 18వ నిమిషంలో నెయ్మార్ కార్నర్ కిక్‌ను థియాగో సిల్వ హెడర్ గోల్‌కు యత్నించినా అది గురి తప్పగా గోల్ పోస్టుకు సమీపంలోనే ఉన్న డేవిడ్ లూయిజ్ తన మోకాలితో నెట్‌లోనికి పంపాడు.అంతే అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. 26వ నిమిషంలో నెయ్మార్ పిచ్ మధ్యలో నుంచి డిఫెండర్లను తప్పిస్తూ గోల్ కోసం ప్రయత్నించినా సరైన షాట్‌ను కొట్టకపోవడంతో వైడ్‌గా వెళ్లింది. అయితే 32వ నిమిషంలో చిలీ షాక్ ఇచ్చింది. వర్గస్ నుంచి అందుకున్న పాస్‌ను స్ట్రయికర్ అలెక్సిస్ సాంచెజ్ పెనాల్టీ ఏరియా నుంచి సులువుగా గోల్ సాధించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. 1998 తర్వాత నాకౌట్ స్టేజిలో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకోవడం బ్రెజిల్‌కు ఇదే తొలిసారి. 36వ నిమిషంలో నెయ్మార్ హెడర్ గోల్ ప్రయత్నం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. 39వ నిమిషంలో ఫ్రెడ్ కొట్టిన షాట్ గోల్‌పోస్టు పైనుంచి వెళ్లిపోయింది. ద్వితీయార్ధంలో ఆధిక్యం సాధించేందుకు బ్రెజిల్ తమ దాడులను తీవ్రం చేసింది. 55వ నిమిషంలో ఈ జట్టు స్ట్రయికర్ హల్క్ గోల్ చేసినా అసిస్టెంట్ రిఫరీ అంగీకరించలేదు. కొంచెం ఎత్తులో వచ్చిన బంతిని హల్క్ తన ఛాతీతో అదుపు చేసి గోల్ పోస్టులోకి తన్ని సంబరాల్లో మునిగాడు. అయితే అది హ్యాండ్బాల్గా రిఫరీ ప్రకటించారు. రీప్లేలో భుజంతో ఆపినట్టుగా తేలింది. చివర్లో చిలీ పూర్తి రక్షణాత్మక ఆటతీరుకు ప్రాధాన్యమిచ్చింది. 80వ నిమిషంలో నెమ్మార్ హెడర్‌ను, 84వ నిమిషంలో హల్క్ ప్రయత్నాన్ని చిలీ గోల్ కీపర్ క్లాడియో బ్రావో సమర్థవంతంగా అడ్డుకున్నాడు. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమానంగా ఉండడంతో ఎక్స్ట్రా సమయం అవసరమైంది. 1998లో చివరిసారిగా నాకౌట్ స్టేజిలో బ్రెజిల్... నెదర్లాండ్స్‌పై ఎక్స్ట్రా సమయం ఆడి నెగ్గింది. తొలి 15 నిమిషాల అదనపు సమయంలో బ్రెజిల్ ప్రమాదకరంగా కనిపించినా గోల్ సాధించలేకపోయింది. 101వ నిమిషంలో ఆస్కార్ హెడర్ నేరుగా కీపర్ బ్రావో చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఇరు జట్ల ప్రయత్నాలు ఫలించకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. -
స్వారెజ్.. మా బాగా కొరికావే!
మోంటోవీడియో: బ్రెజిల్ లో జరుగుతున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లో అవతలి జట్టు ఆటగాడి భుజం కొరికి.. బహిష్కరణకు గురైన ఉరుగ్వే ఆటగాడు లూయిస్ స్వారెజ్ కు అతడి సొంత దేశంలో ఘన స్వాగతం లభించింది. శనివారం మోంటోవీడియో విమానాశ్రయానికి చేరుకున్న ఈ స్టార్ ప్లేయర్ కు అభిమానులు భారీగా ఆహ్వానం పలికారు. స్వదేశానికి చేరుకున్న స్వారెజ్ కు ఆ దేశ అధ్యక్షడు జోస్ ముజైకా కూడా మద్దతు పలికారు. సార్వెజ్ పై తొమ్మిది మ్యాచ్ లతో సహా నాలుగు నెలలు పాటు బహిష్కరణ వేటు వేయడాన్ని ముజైకా తప్పుబట్టారు. 'అది ఒక వ్యక్తి మీద తీసుకున్న నిర్ణయం కాదు. దేశాన్ని అవమానించే సంఘటన. యావత్తు దేశంపై తీసుకున్న ప్రతీకార చర్య 'అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మొన్న ఇటలీతో జరిగిన మ్యాచ్ లో జియార్జియో చిలి భుజాన్ని లూయిస్ స్వారెజ్ కొరికి గాయపరచడంతోఎ ఫిఫా విచారణకు ఆదేశించింది. దీంతో అతనిపై తొమ్మిది మ్యాచ్ ల నిషేధం విధించింది. దీంతో పాటు నాలుగు నెలల పాటు అంతర్జాతీయంగా ఏ మ్యాచ్ లోనూ స్వారెజ్ పాల్గొనకుండా ఉండాలని ఫిఫా ఆదేశించింది. -
డ్రాగా ముగిసిన అల్జీరియా రష్యా మ్యాచ్
-
ముగిసిన ఆసియా పోరాటం
సావో పాలో: శుక్రవారం తెల్లవారుజామున గ్రూప్ ‘హెచ్’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో బెల్జియం 1-0తో కొరియా రిపబ్లిక్‌ను ఓడించింది. ద్వితీయార్ధంలో పది మందితోనే ఆడిన బెల్జియంను కొరియా ప్రతిఘటించలేక పోయింది. వీరి ఓటమితో ఈ ప్రపంచకప్‌లో ఆసియా జట్లు ఒక్క విజయం కూడా లేకుండా వెనుదిరిగినట్టయ్యింది. బెల్జియం గ్రూప్ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్స్‌లో అమెరికాతో తలపడనుంది. మ్యాచ్ 45వ నిమిషంలో కిమ్ షిన్విక్ కాలును ఉద్దేశపూర్వకంగా తొక్కినందుకు బెల్జియం మిడ్ ఫీల్డర్ స్టీవెన్ డెఫోర్ రెడ్‌కార్డుకు గురై మైదానం వీడాడు. ద్వితీయార్ధం 59వ నిమిషంలో మెర్టెన్ షాట్‌ను కొరియా గోల్ కీపర్ కిమ్ సూంగ్యు ఎడమ వైపు డైవ్ చేసి బంతిని పట్టుకున్నాడు. 78వ నిమిషంలో బెల్జియం దాడులు ఫలించాయి. మొదట డివోక్ ఒరిగి కొట్టిన షాట్‌ను కీపర్ కిమ్ పట్టుకున్నా అది మిస్ అయి ముందుకు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న కెప్టెన్ వెర్టోన్‌గెన్ కీపర్‌ను ఏమార్చుతూ గోల్ సాధించాడు. దీంతో బెల్జియం విజయం ఖాయమైంది. -
అల్జీరియా హీరో.. స్లిమాని
కురిటీబా: పై ఫోటోలో గోల్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు అల్జీరియా దేశస్తులకు ఆరాధ్యుడు. ఈ ఒక్క గోల్‌తో అతడిని అల్జీరియన్స్ తమ హీరోగా భావిస్తున్నారు. ఇంత సంబరాలకు కారకుడైన వ్యక్తి.. స్ట్రయికర్ ఇస్లాం స్లిమాని. అల్జీరియా ఇప్పటిదాకా ప్రపంచకప్ చరిత్రలో ఒక్కసారి కూడా నాకౌట్‌కు చేరలేదు. గతంలో మూడు పర్యాయాలు ఈ మెగా టోర్నీలో ఆడినా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం జట్టుకు అద్భుత అవకాశం చిక్కింది. రష్యాతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఒక్క పాయింట్ దక్కించుకున్నా చరిత్ర సృష్టించవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున బరిలోకి దిగిన అల్జీరియాకు ప్రత్యర్థి రష్యా ఆరో నిమిషంలోనే గోల్ చేసి షాక్ ఇచ్చింది. దిమిత్రి కొంబరోవ్ ఎడమ కాలితో ఇచ్చిన పాస్‌ను అలెగ్జాండర్ కొకోరిన్ హెడర్ గోల్ చేశాడు. దీంతో రష్యా ప్రథమార్ధంలో 1-0తో విరామానికి వెళ్లింది. ద్వితీయార్ధంలో మ్యాచ్ సాగుతున్న కొద్దీ అల్జీరియా అభిమానుల్లో ఒకరకమైన నిర్వేదం అలుముకుంటోంది. ఈ సమయంలో ఇస్లామ్ స్లిమాని తమ దేశానికి మధురమైన కానుక ఇచ్చాడు. 60వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ యాసిన్ బ్రహిమి ఫ్రీ కిక్‌ను... గోల్ పోస్టు దగ్గరే ఉన్న స్లిమాని అమాంతం గాల్లోకి ఎగిరి తలతో బంతిని గోల్ పోస్టులోనికి నెట్టాడు. అంతే.. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్న ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. చివరకు మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. తాము అనుకున్న ఫలితం రావడ ంతో అల్జీరియాలోనూ పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అటు రష్యా నాకౌట్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌ను కచ్చితంగా నెగ్గాల్సి ఉన్నా డ్రా కావడంతో నిరాశ తప్పలేదు. -
అదిరే...అదిరే...
కళ్లు చెదిరే గోల్స్... కనువిప్పు కలిగే ఫలితాలు... స్టార్ ఆటగాళ్ల వైఫల్యం... అగ్రశ్రేణి జట్ల తడబాటు... చిన్న జట్ల చిద్విలాసం... మొత్తానికి ఈసారి ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో లీగ్ దశ అభిమానులకు షడ్రుచుల వినోదాన్ని అందించింది. అత్యధిక గోల్స్ రికార్డు ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి లీగ్ దశలో గోల్స్ వర్షం కురిసింది. 48 మ్యాచ్‌ల్లో మొత్తం 136 గోల్స్ వచ్చాయి. దాంతో 130 గోల్స్‌తో ఇప్పటిదాకా 2002 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డు తెరమరుగైంది. ఆసియా జట్లకు నిరాశ వరుసగా మూడో ప్రపంచకప్‌లోనూ ఆసియా జట్లకు నిరాశ ఎదురైంది. 2002 ప్రపంచకప్‌లో నాలుగో స్థానం సంపాదించిన దక్షిణ కొరియాతోపాటు జపాన్, ఇరాన్, ఆస్ట్రేలియా జట్లు ఈసారి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. ఆఫ్రికా ఆశాకిరణాలు గత వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఘనా... దీదీర్ ద్రోగ్బా, శామ్యూల్ ఎటో లాంటి స్టార్ ఆటగాళ్లతో నిండిన ఐవరీకోస్ట్, కామెరూన్ లీగ్ దశలోనే వెనుదిరిగాయి. అయితే అంతగా అంచనాల్లేని అల్జీరియా, నైజీరియా నాకౌట్ దశకు చేరుకొని ఆఫ్రికా ఉనికిని చాటుకున్నాయి. చిన్న జట్లు... గొప్ప ఫలితాలు ఈసారి ప్రపంచకప్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన జట్టు కోస్టారికా. కేవలం 46 లక్షల జనాభా కలిగిన ఈ మధ్య అమెరికా ప్రాంతంలోని దేశం లీగ్ దశలో ‘డబుల్’ వరల్డ్ చాంపియన్ ఉరుగ్వేను... నాలుగుసార్లు విశ్వవిజేత ఇటలీని బోల్తా కొట్టించింది. ప్రపంచ మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని ఔరా అనిపించింది. 4 కోట్ల జనాభా కలిగిన కొలంబియా లీగ్ దశలో అజేయంగా నిలిచి 1990 తర్వాత తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. హ్యాట్రిక్ వీరులు రెండు మ్యాచ్‌ల్లో మినహా లీగ్ దశలో అన్ని జట్లు తమ ప్రత్యర్థి జట్లకు గోల్స్ సమర్పించుకున్నాయి. మొత్తం నమోదైన గోల్స్‌లో రెండు ‘హ్యాట్రిక్’లు ఉన్నాయి. పోర్చుగల్‌పై థామస్ ముల్లర్ (జర్మనీ)... హోండురస్‌పై జెర్దాన్ షాకిరి ఒక్కో ‘హ్యాట్రిక్’ చేశారు. సెల్ఫ్ గోల్‌తో మొదలు... ఆశ్చర్యకరంగా ఈసారి ప్రపంచకప్ ‘సెల్ఫ్ గోల్’తో మొదలైంది. క్రొయేషియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దేశం బ్రెజిల్ ఆటగాడు మార్సెలో 11వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. మార్సెలోతో పాటు మరో ముగ్గురు ‘సెల్ఫ్ గోల్స్’ చేశారు. అర్జెంటీనాపై కొలాసినిక్ (బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా); పోర్చుగల్‌పై జాన్ బోయే (ఘనా); ఫ్రాన్స్‌పై నోయల్ వాలాదారెస్ (హోండురస్) ఒక్కో ‘సెల్ఫ్ గోల్’ చేశారు. అగ్రశ్రేణి జట్లకు షాక్ ఘనమైన నేపథ్యం ఉన్నా... ప్రస్తుత ఆటతీరుపైనే భవితవ్యం ఆధారపడి ఉంటుందని అగ్రశ్రేణి జట్లకు ఈ ప్రపంచకప్ ద్వారా అనుభవమైంది. కనీసం నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయనుకున్న డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ స్పెయిన్, నాలుగుసార్లు విజేత ఇటలీ, మాజీ విశ్వవిజేత ఇంగ్లండ్... పోర్చుగల్ జట్లు లీగ్ దశలోనే నిష్ర్కమించాయి. గీత దాటితే... మైదానంలో హద్దుమీరితే ఎంతటి స్టార్ ఆటగాడిపైనైనా వేటు తప్పదని నిరూపితమైంది. ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు డిఫెండర్ జియార్జియో చిలినిని భుజాన్ని కొరికిన ఉరుగ్వే స్టార్ ప్లేయర్ లూయిస్ స్వారెజ్పై నాలుగు నెలల నిషేధం... తొమ్మిది మ్యాచ్‌ల వేటు... 65 వేల పౌండ్లు (రూ. 66 లక్షలు) జరిమానా వేశారు. లీగ్ దశలో మొత్తం ఆరుగురు ఆటగాళ్లకు (పెపె-పోర్చుగల్; మర్చిసియో-ఇటలీ; అలెక్స్ సాంగ్-కామెరూన్; వాలెన్సియా-ఈక్వెడార్; స్టీవెన్ డెఫోర్-బెల్జియం; రెబిక్-క్రొయేషియా) వారి దుందుడుకు చర్యలకు తక్షణమే ‘రెడ్ కార్డు’ చూపెట్టి మైదానం నుంచి పంపించారు. తారల తళుక్కు... అభిమానులు తమపై పెట్టుకున్న భారీ అంచనాలను పలువురు స్టార్ ఆటగాళ్లు నిజం చేయగా... మరికొందరు నిరాశపరిచారు. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), నెయ్మార్ (బ్రెజిల్), థామస్ ముల్లర్ (జర్మనీ) నాలుగేసి గోల్స్ సాధించి ‘గోల్డెన్ బూట్’ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురితోపాటు రాబిన్ వాన్ పెర్సీ, అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), కరీమ్ బెంజెమా (ఫ్రాన్స్) అభిమానులను అలరించారు. ముఖ్యంగా స్పెయిన్‌పై పెర్సీ సాధించిన గోల్ ఈ వరల్డ్ కప్‌కే హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహంలేదు. మరోవైపు రొనాల్డో (పోర్చుగల్), రూనీ (ఇంగ్లండ్), బలోటెలి, పిర్లో (ఇటలీ), ద్రోగ్బా (ఐవరీకోస్ట్) తమ జట్లను ఆదుకోలేకపోయారు. ఇక అగ్ని పరీక్ష ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో రసవత్తర అంకానికి రంగం సిద్ధమైంది. ఇకపై ఏ జట్టుకూ మరో అవకాశం ఉండదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అదే ఆఖరి మ్యాచ్ అవుతుంది. నేటి నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరగనున్నాయి. తొలి రోజు జరిగే రెండు మ్యాచ్‌ల్లో ఆడే నాలుగు జట్లూ దక్షిణ అమెరికాకు చెందినవే కావడం విశేషం. బ్రెజిల్ ఁ చిలీ హా బ్రెజిల్ ఆశలన్నీ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్‌పైనే ఆధారపడి ఉన్నాయి. మెక్సికోపై నిరాశపరిచినా... మిగతా రెండు మ్యాచ్‌ల్లో నెయ్మార్ రెండేసి గోల్స్ చేశాడు. 1994 నుంచి ప్రతిసారీ బ్రెజిల్ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను అధిగమించింది. హా 1962 ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన తర్వాత చిలీ మరోసారి ఈ మెగా ఈవెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేదు. లీగ్దశలో చిలీ 2-0తో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌ను ఓడించింది. స్టార్ ఫార్వర్డ్స్ అలెక్స్ శాంచెజ్, వర్గాస్లపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. హా ఇప్పటివరకు బ్రెజిల్, చిలీ ముఖాముఖిగా 68 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. బ్రెజిల్ 48 మ్యాచ్‌ల్లో... చిలీ 7 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 13 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. ప్రపంచకప్ చరిత్రలో చిలీతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బ్రెజిల్ గెలిచింది. ఉరుగ్వే ఁ కొలంబియా హా గత ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఉరుగ్వే ఈసారి అతికష్టంమీద ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. స్టార్ ప్లేయర్ లూయిస్ స్వారెజ్ గైర్హాజరీలో ఆ జట్టు ఆశలన్నీ 35 ఏళ్ల డీగో ఫొర్లాన్, 27 ఏళ్ల ఎడిన్సన్ కవానిలపై ఆధారపడి ఉన్నాయి. . హా కొలంబియా గతంలో ఎన్నడూ ప్రిక్వారర్స్ దశను అధిగమించలేదు. ఈసారి ఫార్వర్డ్స్రోడ్రిగెజ్, వాలెన్సియా కీలకం. హా ఇప్పటివరకు ఉరుగ్వే, కొలంబియా 38 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఉరుగ్వే 18 మ్యాచ్‌ల్లో... కొలంబియా 11 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 9 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. -
సెల్ఫ్ గోల్...
రొనాల్డో కోసం రాత్రంతా మేలుకుని ఎదురుచూస్తున్నాం... మెస్సీ మ్యాజిక్ గురించి రోజంతా చర్చిస్తున్నాం... నెయ్మార్ మీద ఎనలేని ఆసక్తి చూపుతున్నాం... ఇన్నాళ్లూ ఏ దేశం వాళ్లో కూడా తెలియని ఆటగాళ్ల మీద ఫుట్‌బాల్ ప్రపంచకప్ పుణ్యమాని విపరీతమైన అభిమానం చూపుతున్నాం. ఎవరో ఎక్కడో ఆడుతుంటేనే ఇలా ఉన్నాం... ఒకవేళ భారత జట్టు ప్రపంచకప్ ఆడితే... ఎవరైనా మనకు తెలిసిన ఆటగాడు ఒకరు ప్రపంచకప్‌లో ఆడుతుంటే... ఆ మజాయే వేరు. ఇప్పటి తరానికి ఈ అదృష్టం లేదు. కానీ ఒక్కసారి చరిత్రలోకి వెళితే... ఒకప్పుడు హైదరాబాద్ ప్రపంచకప్ ఫుట్‌బాల్‌పై తన ముద్ర వేసింది. గోల్కొండ నవాబులు, అసఫ్‌జాహీల తరహాలోనే హైదరాబాద్ ఫుట్‌బాల్‌కు కూడా ఘనమైన రికార్డే ఉంది. వరుసగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతిభ మన సొంతం. ఒకప్పుడు భారత ఒలింపిక్ జట్టులో ఏకంగా తొమ్మిది మంది హైదరాబాదీలే ఉన్నారంటే ఆటపై మన ముద్ర ఏమిటో తెలుస్తుంది. అయితే ఇప్పుడు భాగ్యనగరం ఫుట్‌బాల్ పరిస్థితి మారింది...23 ఏళ్లుగా ఒక్క హైదరాబాదీ కనీసం భారత జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. కనీసం స్కూల్ స్థాయి పోటీలు కూడా నిర్వహించే దిక్కు లేక హైదరాబాద్ చేసుకున్న సెల్ఫ్ గోల్ ఇది. - మొహమ్మద్ అబ్దుల్ హాది స్వర్ణ యుగం... 1950నుంచి 1962 వరకు హైదరాబాద్ ఫుట్‌బాల్‌కు స్వర్ణ యుగం వంటిదేనని చెప్పవచ్చు. ఒకరా...ఇద్దరా... ఏకంగా 16 మంది ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో ధన్‌రాజ్ మొదటి సారి ఆడితే, 1952 హెల్సింకీలో మొయిన్, నూర్, అజీజ్ బరిలోకి దిగారు. ఇక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో అయితే నవరత్నాల్లాంటి 9 మంది హైదరాబాదీలు భారత్ భారాన్ని మోశారు. జుల్ఫిఖరుద్దీన్, బలరామ్, పీటర్ తంగరాజ్, మొహమ్మద్ సలామ్, లతీఫ్, అహ్మద్ హుస్సేన్, అజీజ్, నూర్ మొహమ్మద్‌లు ఆడారు. పైగా ఈ జట్టుకు మరో దిగ్గజం రహీం సాబ్ కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఈ టోర్నీలో జట్టు నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాత 1960 రోమ్‌లో ఇందులోని ఏడుగురు మళ్లీ ఆడారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధించడం వరకు ఈ జోరు కొనసాగింది. ఒలింపిక్స్ మాత్రమే కాకుండా దాదాపు పాతిక మంది హైదరాబాద్ ప్లేయర్లు వేర్వేరు దశలలో అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. పోలీస్ పవర్ అప్పట్లో జాతీయ ఫుట్‌బాల్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టంటే అందరికీ హడల్. కేవలం రెండో స్థానం కోసమే ఇతర జట్లు పోటీ పడాలేమో అని అప్పట్లోనే వినిపించేది. 1950-59 మధ్య జరిగిన 12 జాతీయ స్థాయి పోటీల్లో హైదరాబాద్ పోలీస్ ఆడితే అన్నింటా అదే జట్టుకు విజయం దక్కింది. రహీంసాబ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఎనిమిది సార్లు ప్రతిష్టాత్మక రోవర్స్ కప్, నాలుగు సార్లు డ్యురాండ్ కప్ గెలుచుకుంది. 1964లో భారత కోచ్ ఒకరు బ్రెజిల్లో ప్రత్యేక్ష శిక్షణ కోసం వెళ్లారు. తిరిగి వచ్చాక ఆయన ‘ఎప్పుడో పదేళ్ల క్రితం రహీంసాబ్ చెప్పిన విషయాలు వారూ చెబుతున్నారు. నాకు కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు’ అన్నారు. అలనాటి దిగ్గజాల గొప్పతనం ఈ ఒక్కమాటలో ప్రతిఫలించిందంటే అతిశయోక్తి కాదు. తడబడిన అడుగులు అయితే ఈ దిగ్గజాలు దాదాపు ఒకే సమయంలో రిటైర్ కావడం హైదరాబాద్ ఫుట్‌బాల్‌ను దెబ్బ తీసింది. వారి వారసత్వాన్ని కొనసాగించడంలో చాలా మంది విఫలమయ్యారు. 70వ దశకంలో కొన్ని ఒడిదుడుకులతో పడుతూ, లేస్తూ సాగినా...80లలో మాత్రం పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా తయారైంది. ముఖ్యంగా సిటీ పోలీస్ టీమ్ బాగా బలహీన పడటం జాతీయ జట్టుపై కూడా ప్రభావం చూపించింది. అప్పట్లో వేర్వేరు కారణాలతో చాలా మంది యువకులు పోలీస్ విభాగంలో చేరేందుకు ఆసక్తి కనబర్చలేదు. దీంతో జట్టుగా కాకుండా తమ ఆటను నమ్ముకున్న ఒక్కొక్కరు వ్యక్తిగతంగా తమ ప్రయత్నాల్లో పడిపోయారు. చాలా మంది కోల్‌కతాకు వలస వెళ్లిపోయి అక్కడి లీగ్‌లలో ఆడటం ప్రారంభించారు. వారికి అవకాశం దక్కేందుకు హైదరాబాద్ పేరు సరిపోయేది. దానిని వారు అందిపుచ్చుకొని చాలా వరకు అక్కడే స్థిర పడిపోయారు. నగరంలో అట్టహాసంగా నిర్వహిస్తూ వచ్చిన నిజాం గోల్డ్ కప్ టోర్నీ కూడా ఆ తర్వాత మూలన పడింది. దాంతో ఎన్నో ఏళ్లుగా అభిమానుల మనసుల్లో పదిలంగా ఉన్న ఆట వారినుంచి దూరమవుతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఆటగాళ్లకు ఇచ్చే విషయంలో ఆ సమయంలో కొన్నాళ్ల పాటు వచ్చిన స్తబ్దత, కుర్రాళ్ళ ఆసక్తిని కూడా దూరం చేసింది. పనికి రాని సంఘాలు చరిత్రలో అద్భుతాల తర్వాత కొన్నాళ్లు చురుగ్గా ఆట సాగకపోయినా హైదరాబాద్‌లో ఆట పూర్తిగా ముగిసిపోలేదు. రహీమ్ లీగ్ నిర్వహణ కారణంగా ఎంతో కొంత ఫుట్‌బాల్ కనిపించేది. కానీ 2000 తర్వాత ఏపీ ఫుట్‌బాల్ సంఘంలో వచ్చిన విభేదాలు ఇప్పటికీ ఆటను పట్టి పీడిస్తున్నాయి. రెండు వర్గాలు, వారికి రాజకీయ నాయకులు, అధికారుల అండ. ఇద్దరూ మాదే అసలు సంఘం అంటారు. ఒకరికి అనుకూలంగా కోర్టులో తీర్పు వస్తే, మరొకరు మరో కోర్టులో కొత్త కేసు ఫైలు చేస్తారు. ఒకరు తాత్కాలికంగా ఉత్తర్వులు తెచ్చుకుంటే మరో వర్గం దాన్ని ఛాలెంజ్ చేస్తుంది. దానిపై తుది తీర్పు రాదు. ఎవరూ వెనక్కి తగ్గరు. ఆటకు మేలు చేసేందుకు కూర్చొని మాట్లాడుకోరు. ఆటపై ప్రాణం ఉన్నవారు మధ్యేమార్గంగా పరిష్కారం చూపించేందుకు సిద్ధమైతే వారిని లెక్క చేయరు. రాష్ట్ర విభజన తర్వాత ప్రతీ క్రీడా సంఘం వేర్వేరు శాఖలు ఏర్పాటు చేసుకుంటుంటే వీరు మాత్రం ఇప్పటికీ ఏపీ సంఘం గురించే కోర్టు కేసుల్లో తలమునకలై ఉన్నారు. దీంతో ఫలితమే ఆటకు దశ, దిశ లేకుండా పోయింది. మారేదెలా..? సౌకర్యాల పరిస్థితి ఎలా ఉన్నా...చెప్పుకోదగ్గ మైదానాలు లేకపోయినా... అన్నింటికి మించి ఈ ఆట ఆడితే భవిష్యత్తుపై భరోసా ఏమీ లేకపోయినా... ఇప్పటికీ నగరంలో ఫుట్‌బాల్ క్రేజ్ కొన్ని చోట్ల మిగిలే ఉంది. హైదరాబాద్ స్పోర్టింగ్, హైదరాబాద్ గ్లోబ్, బొల్లారం స్పోర్టింగ్, మైసారం క్లబ్, తిరుమలగిరి క్లబ్, శాస్త్రి క్లబ్, సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ తదితర 20 జట్లు సొంత ఆసక్తితో ఆటను కొనసాగిస్తున్నాయి. ఇక్కడ చిన్న టోర్నీలు, కాదంటే పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ ఆడి వస్తున్నాయి. అయితే ఇది పెద్ద స్థాయిలో ఫలితాలు ఇచ్చేది కాదు. ప్రాథమిక స్థాయిలో, చిన్న వయసులోనే ఆటగాళ్ల నైపుణ్యాన్ని గుర్తించి వారిని శిక్షణా శిబిరాల ద్వారా, టోర్నీల ద్వారా సానబెడితే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. గతంలో సరిగ్గా ఇలాంటి ఆలోచనలతోనే నిర్వహి స్తూ వచ్చిన రహీమ్లీగ్ అద్భుతం గా విజయ వంతమైంది. హైదరా బాద్ ఫుట్‌బాల్ కు చిరు నామా అయిన ఈ లీగ్‌లో ఆడటం అంటే ఆటగాడికి ఒకప్పు డు ప్రతిష్టాత్మకం. తనను తాను నిరూపించుకునేందుకు వారికి ఇంతకంటే మెరుగైన వేదిక లేదు. రహీమ్ లీగ్ ఎ, బి, సి డివిజన్ లీగ్‌ల ద్వారా ఎందరో వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు టోర్నీలే లేవు. ఇక ఆటగాళ్లు ఎలా వెలుగులోకి వస్తారు? కొంత మంది ప్రైవేట్ సంస్థల సహకారంతో అప్పుడప్పుడు టోర్నీలు నిర్వహిస్తున్నా వాటికి ఎలాగూ గుర్తింపు దక్కడం లేదు. బడా కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నా... బాధ్యత తీసుకునే వ్యక్తులు వారికి కనబడటం లేదు. అసోసియేషన్ సరిగ్గా లేనప్పుడు వారెవరూ ముందుకొచ్చే ధైర్యం చేయడం లేదు. అంతా సక్రమ పద్ధతిలో సిస్టమేటిక్‌గా ఉంటే టోర్నీలు నిర్వహించుకోవచ్చు. ‘ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ చాలా మంది ఫుట్‌బాల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తుండటం సంతోషకరమైన విషయం. ఈ ఆటలో హైదరాబాద్ గొప్పతనం గురించి వారికి గుర్తు చేస్తే చాలు. వారిలో ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకొస్తుంది. ప్రస్తుత స్థితిలో ఆటగాళ్లకు సరైన దిశానిర్దేశం చేయడంలో విఫలమవుతున్నాం. వారికి ఆర్ధికపరమైన భరోసా కూడా కల్పించాల్సి ఉంది. నిర్మాణాత్మకంగా ఫుట్‌బాల్‌కు చేయూతనిచ్చేందుకు ఇప్పటికీ చాలా కార్పొరేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అసోసియేషన్ బలంగా ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయి. సదుపాయాలు, కోచింగ్ అకాడమీలు కావాలి. ఒక్కసారి రహీమ్ లీగ్ పునరుద్ధరిస్తే చాలు. ఎంత గొప్ప ఆటగాళ్లు వెలుగులోకి వస్తారో చూడండి. అప్పుడు గత వైభవం గురించి తలచుకోవడమే కాదు... భవిష్యత్తులో కూడా మన హైదరాబాద్ ఫుట్‌బాల్ మెరుపుల గురించి మళ్ళీ మళ్లీ మాట్లాడుకోవచ్చు. - విక్టర్ అమల్‌రాజ్, భారత్ ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ -
కిక్ కాదు...కాంగో కసి
1974 ఫిఫా ప్రపంచకప్...గ్రూప్ 2లో బ్రెజిల్-జైర్ (కాంగో) జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది. అప్పటికే బ్రెజిల్ 3-0 ఆధిక్యంలో ఉంది. మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా బ్రెజిల్‌కు మరో ఫ్రీ కిక్ అవకాశం వచ్చింది. పెనాల్టీ ఏరియా బయట బంతి ఉంచి బ్రెజిల్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. మరో వైపు జైర్ ప్లేయర్లు కూడా గోడ కట్టి డిఫెన్స్ కోసం తమవంతు ప్రయత్నంలో ఉన్నారు. ఇక రిఫరీ విజిల్ మోగించడమే మిగిలింది. అయితే ఈ సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. జైర్ ఆటగాడు అలుంగ ఎంవెపు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాడు. అదేదో తనకే ఫ్రీ కిక్ అవకాశం ఇచ్చినట్లుగా మెరుపులా పరుగెత్తి కిక్ కొట్టాడు. అంతే...అందరికీ ఏం జరిగిందో ఒక్క క్షణం పాటు అర్ధం కాలేదు. ఈ దశలో కల్పించుకున్న రిఫరీ, అలుంగకు ఎల్లో కార్డ్ చూపించి బయటికి పంపించాడు. ఇది అసలు బుద్ధి లేని పనంటూ కామెంటేటర్లు చెలరేగిపోతే, జైర్ ఆటగాళ్లకు ఫుట్‌బాల్ నిబంధనలే తెలియవంటూ మరికొందరు వంత పాడుతూ దాన్నో సరదా సంఘటనగా చెప్పుకున్నారు. ఆ ఏడాది ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ చాంపియన్‌గా నిలిచిన జైర్ జట్టుకు నిజంగా నిబంధనలు తెలియవా...ఈ ఘటనలోని వాస్తవాన్ని ఆ తర్వాత అలుంగ బయట పెట్టాడు. వరల్డ్ కప్‌లో అప్పటికే స్కాట్లాండ్ చేతిలో 0-2తో, యుగొస్లేవియా చేతిలో 0-9తో ఓడిన జైర్‌కు ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్యగా మారింది. ఆ దేశాధ్యక్షుడు మొబుటు అప్పటికే తన సొంత సైనికుల ద్వారా ఆటగాళ్లకు సమాచారం అందించాడు. బ్రెజిల్‌తో గనక 4-0తో ఓడితే ఇక దేశానికి తిరిగి రానవసరం లేదని, కనీసం తిండి ఖర్చులు కూడా ఇవ్వనని హెచ్చరించాడు. ఒక రకమైన భయం ఆవహించిన ఆటగాళ్లకు ఏమీ అర్థం కాలేదు. దాంతో ఏదో రకంగా సమయం వృథా చేసైనా నాలుగో గోల్‌ను ఆపాలని ఎంవెపు అనుకున్నాడు. తన అసహనాన్ని, నిరసనను ఆ రకంగా వ్యక్తం చేశాడు. మా బాధలు, కష్టాలు మీకేం తెలుసంటూ కిక్ కొడుతున్న సమయంలో యూ బాస్టర్డ్స్ అంటూ బ్రెజిల్ ఆటగాళ్ళను తిట్టాడు. ఇంతా చేస్తే ఆ నాలుగో గోల్ అయితే కాలేదు కానీ 0-3తో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత స్వదేశానికి వెళ్లాక దేశాధ్యక్షుడు దాదాపుగా అన్నంత పనీ చేశాడు. వరల్డ్ కప్ ఆడినందుకు ఇవ్వాల్సిన కనీస ఖర్చులు కూడా అందనీయలేదు. చివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో కష్టాలు, పేదరికం మధ్యనే వారి జీవితం గడిచింది. -
అర్జెంటీనా ‘దేవుడు’
అంతా తొండి... చేతితో గోల్ చేశాడు... క్రీడా స్ఫూర్తి లేదు... ఓ ఆటగాడి గురించి ఇలాంటి విమర్శలు మొదలైన నాలుగు నిమిషాలకు... అందరి నోళ్లు మూయించాలంటే... అదీ ఫుట్‌బాల్ లాంటి క్రీడలో నాలుగు నిమిషాల్లో రెండు గోల్స్ చేయాలంటే... కచ్చితంగా అతను ‘మాయ’ చేయాలి లేదా దేవుడై ఉండాలి. అందుకే మారడోనా అర్జెంటీనాకు దేవుడయ్యాడు. 1986 ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, అర్జెంటీనాల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. రెండో అర్ధభాగంలో ఆరో నిమిషంలోనే మారడోనా గోల్ చేసి అర్జెంటీనాను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. విమర్శల కోసం సిద్ధంగా ఉండే ఇంగ్లండ్ మీడియా అంతెత్తున లేచింది. తను చేతితో బంతిని నెట్టాడని అది గోల్ కాదని వాదన మొదలు పెట్టింది. అయితే మైదానంలో మారడోనాకు ఇదేమీ తెలియదు. మరో నాలుగు నిమిషాలు గడిచాయి. 60 మీటర్ల దూరం నుంచి బంతిని డ్రిబుల్ చేసుకుంటూ... ఐదుగురు ఇంగ్లండ్ డిఫెండర్లను బోల్తా కొట్టించి ఎవరూ ఊహించని రీతిలో మారడోనా మరో గోల్ కొట్టాడు. ఈ గోల్‌ను చూసిన వాళ్లెవరూ ఆ తర్వాత తన నైపుణ్యం గురించి జీవితంలో మాట్లాడలేదు. ఇప్పటికీ ఈ శతాబ్దానికి దానినే అత్యుత్తమ గోల్‌గా పరిగణిస్తారు. అంత అద్భుతమైన ఆటగాడు మారడోనా. అందుకే చేతితో చేశాడనే గోల్‌ను కూడా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ అని పిలుస్తారు. పరిచయం అక్కరలేదు డీగో మారడోనా... పరిచయం అక్కర్లేని పేరు. అర్జెంటీనాలో అతనో ఆరాధ్య దైవం. తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సృష్టించుకున్న దిగ్గజం.. 17 ఏళ్ల పాటు అర్జెంటీనా జాతీయ జట్టుకు సేవలందించడమే కాకుండా కెప్టెన్‌గా... కోచ్‌గా... మేనేజర్‌గా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేసిన ఆల్‌టైమ్ గ్రేట్. పీలేతో కలిసి 20వ శతాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన ఘనత డీగోకే దక్కింది. ఎనిమిదేళ్లకే చిచ్చర పిడుగు అర్జెంటీనాలో ఫుట్‌బాల్ అంటే పిచ్చి. తమది పేద కుటుంబమే అయినా పట్టుదలగా ఆడాడు. ఎనిమిదేళ్లకే సాకర్‌లో చిచ్చరపిడుగుగా మారిపోయాడు. ఆ వయసులోనే అద్భుతాలు సృష్టించిన మారడోనా ప్రతిభను ఒడిసి పట్టింది ఫ్రాన్సికో కొర్నియో. ఆయన గనక మారడోనా ప్రతిభను గుర్తించకపోతే ప్రపంచానికి ఓ దిగ్గజం కనిపించేవాడు కాదేమో. కొర్నియా ఆధ్వర్యంలోనే తన ఆట తీరుకు మరింత మెరుగులు దిద్దుకున్న మారడోనా జూనియర్ విభాగంలో సత్తా చాటాడు. తద్వారా 1977లో 17 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 1994 వరకు జాతీయ జట్టుకు సేవలందించాడు. 1982, 86, 90, 94 ప్రపంచకప్‌ల్లో పాల్గొన్నాడు. కెప్టెన్‌గా డీగో మారడోనా తానేంటో నిరూపించుకున్నాడు. 1986లో అర్జెంటీనాను చాంపియన్‌గా నిలిపాడు. గోల్డెన్ బాల్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాతి ప్రపంచకప్ (1990)లో అర్జెంటీనాకు కొద్దిలో టైటిల్ చేజారింది. 1982 ప్రపంచకప్ తర్వాత మారడోనాకు బార్సిలోనా క్లబ్ 7.6 మిలియన్ డాలర్లు ఇచ్చింది. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఫుట్‌బాల్ ద్వారా ఇంత డబ్బు సంపాదించవచ్చని ప్రపంచానికి తెలిసింది అప్పుడే. డ్రగ్స్‌కు బానిసై... తర్వాత బయటపడి... తన ఆటతీరుతో మారడోనా ఎంతగా ప్రాచుర్యం పొందాడో... అంతకంటే ఎక్కువగానే వివాదాల్లో, వార్తల్లో నిలిచాడు. సాకర్‌తో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న డీగో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలోనే డ్రగ్స్‌కు బానిసయ్యాడు. కొకైన్కు అలవాటుపడి 1991లో డ్రగ్ పరీక్షలో విఫలమయ్యాడు. ఫలితంగా 15 నెలల పాటు సస్పెండ్ అయ్యాడు. ఇక 1994 ఫిఫా ప్రపంచకప్‌లో నిషేధిత ఉత్ప్రేరకం ఎపిడ్రిన్‌ను తీసుకోవడంతో అమెరికా నుంచి స్వదేశానికి బలవంతంగా పంపారు. అలా తెరమరుగైన మారడోనా 2005లో డ్రగ్స్ నుంచి బయటపడ్డాడు. అప్పటి నుంచి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. 2008 నుంచి 2010 వరకు అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలోని అర్జెంటీనా 2010 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. ఏమైనా ఆటగాడిగా, కోచ్‌గా కూడా ఫుట్‌బాల్ ప్రపంచంలో మారడోనాది ప్రత్యేక ముద్ర. ఆట బతికున్నంతకాలం అతని పేరూ బతికే ఉంటుంది. నేను మరో మిలియన్ సంవత్సరాల పాటు సాకర్ ఆడినా మారడోనా దరిదాపుల్లోకి కూడా రాలేను. ఆయన చరిత్రలోనే అతి గొప్ప ఆటగాడు. - అర్జెంటీనా స్టార్ మెస్సీ -
ఉరుగ్వే స్టార్ స్వారెజ్ పై 9 గేమ్ లు నిషేధం
-
ఉరుగ్వే స్టార్ స్వారెజ్ పై 9 గేమ్ లు నిషేధం
ఉరుగ్వే స్టార్ స్వారెజ్ పై వేటు తప్పలేదు. మొన్న ఇటలీతో జరిగిన మ్యాచ్ లో జియార్జియో చిలి భుజాన్ని లూయిస్ స్వారెజ్ కొరికి గాయపరచడంతోఎ ఫిఫా విచారణకు ఆదేశించింది. దీంతో అతనిపై ఏకంగా తొమ్మిది మ్యాచ్ లో నిషేధం పడింది. దీంతో పాటు నాలుగు నెలల పాటు అంతర్జాతీయంగా ఏమ్యాచ్ లోనూ స్వారెజ్ పాల్గొనకుండా ఫిఫా నిషేధం విధించింది. అంటే ఈ స్టార్ ఆటగాడి మెరుపులకు అభిమానులు దూరం కావాల్సిందే. ప్రస్తుతం మంచి ఊపుమీద ఉన్న ఉరుగ్వే గెలిచిన మ్యాచ్ ల్లో స్వారెజ్ కీలకపాత్ర పోషించాడు. అపార నైపుణ్యమున్న ఉరుగ్వే ఆటగాడు స్వారెజ్‌కు ఎప్పుడూ వివాదాలనే వెంటబెట్టుకుని తిరుగుతుంటాడు. ఏడుగురు మగపిల్లల సంతానంలో నాలుగోవాడిగా పుట్టిన స్వారెజ్ తన కుటుంబంతో ఏడేళ్ల వయసులో రాజధాని మాంటెవిడియోకు తరలివచ్చాడు. అతనికి తొమ్మిదేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు విడిపోయారు. అప్పుడే ఫుట్‌బాల్‌లో ఓనమాలు నేర్చుకొని 14 ఏళ్ల ప్రాయంలో స్వదేశీ లీగ్ జట్టు నాసియోనల్లో చేరాడు. 16 ఏళ్ల వయసులో తనకు రెడ్‌కార్డు చూపెట్టిన రిఫరీని స్వారెజ్ తలతో ఢీకొట్టి వార్తల్లోకెక్కాడు. -
ఇరాన్ ఆశలు ఆవిరి
సాల్వడార్: ప్రపంచకప్‌లో నాకౌట్‌కు చేరే అవకాశాన్ని ఇరాన్ మళ్లీ కోల్పోయింది. గ్రూప్ ‘ఎఫ్’లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా చేతిలో 1-3తో ఓటమిపాలై నాలుగోసారి గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నైజీరియాతో సమానంగా పాయింట్లు (4) సాధించి నాకౌట్ బెర్తు కోసం పోటీపడే స్థితిలో మ్యాచ్‌ను ప్రారంభించిన ఇరాన్‌ను అదృష్టం వెక్కిరించింది. 23వ నిమిషంలో ఎడిన్ జెకో గోల్ చేసి బోస్నియాను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తరువాత మిరాలెం జానిక్ 59వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దాదాపు ఆశలు ఆవిరైన దశలో 82వ నిమిషంలో ఇరాన్‌కు రెజా తొలి గోల్‌ను అందించినా.. మరుసటి నిమిషంలోనే (83వ) సాజెవిక్ చేసిన గోల్‌తో బోస్నియా మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచినా... తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో మూడు పాయింట్లకే పరిమితమైన బోస్నియా కూడా ఇంటిదారి పట్టింది. -
అజేయంగా కొలంబియా
సియాబా: జపాన్‌తో మ్యాచ్‌కు ముందే నాకౌట్ బెర్తును ఖాయం చేసుకున్నా కొలంబియా అలసత్వం లేకుండా ఆడింది. జపాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 4-1 తేడాతో గెలుపొందింది. 17వ నిమిషంలోనే లభించిన పెనాల్టీని క్వాడ్రడో గోల్‌గా మలిచి కొలంబియాకు ఆధిక్యాన్నందించాడు. 45వ నిమిషంలో ఒకాజకి డైవింగ్ హెడర్‌తో గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. ద్వితీయార్ధంలో కొలంబియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మార్టినెజ్ జాక్సన్ 55వ, 82వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేశాడు. 90వ నిమిషంలో లభించిన పెనాల్టీని రోడ్రిగెజ్ గోల్‌గా మలచి స్కోరును 4-1కి పెంచాడు. -
ఏడాదికి ఒక్క బ్రాండ్‌కే రూ.143 కోట్లు
ప్రపంచకప్‌లో అతని అడుగులు తడబడవచ్చు గాక...అతని జట్టు కూడా అద్భుతాలు చేయలేకపోవచ్చు కానీ క్రిస్టియానో రొనాల్డో విలువ మాత్రం ఇప్పటికీ సూపర్‌గానే ఉంది. ఈ ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లలో ఎండార్స్మెంట్పరంగా అతనే నంబర్‌వన్‌గా నిలిచాడు. ఒక్క డీల్ కోసం రొనాల్డోకు ‘నైకీ’ సంస్థ ఏడాదికి చెల్లిస్తున్న మొత్తం ఎంతో తెలుసా...అక్షరాలా 14.1 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 143 కోట్లు)! వరల్డ్ కప్‌లో చెలరేగిపోతున్న అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి ఈ జాబితాలో రెండో స్థానం దక్కింది. అతనికి అడిడాస్ సంస్థ 13.6 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 137 కోట్లు) ఇస్తోంది. ఇక సొంతగడ్డపై జట్టును చాంపియన్‌గా నిలిపేందుకు శ్రమిస్తున్న బ్రెజిల్ ఆటగాడు నెయ్‌మార్‌కు కూడా నైకీ 9. 5 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 97 కోట్లు) అందజేస్తోంది. ఈ శ్రీమంత ఫుట్‌బాలర్ల టాప్-10 జాబితాలో రూనీ, గెరార్డ్, లాంపా ర్డ్, స్వారెజ్ కూడా ఉన్నారు. -
‘డాన్’ను పట్టించిన ప్రపంచకప్...
సాంచెజ్ అరెలానో...ఎన్నో ఏళ్ల పాటు మెక్సికో దేశాన్ని వణికించిన ‘తిజువానా కార్టెల్’ అనే క్రిమినల్ గ్రూప్ అధినేత. అత్యంత క్రూరమైనదిగా గుర్తింపు ఉన్న ఈ సంస్థ ముఖ్యంగా డ్రగ్స్ ప్రపంచంలో తనదైన ఆధిపత్యం ప్రదర్శించింది. కొన్నాళ్ళుగా మెక్సికోలో డ్రగ్స్ వ్యాపారం తగ్గు ముఖం పట్టినా...దక్షిణ అమెరికా దేశాల్లో అది మళ్లీ విస్తరిస్తోంది. 2013లో యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన ఆరుగురు ‘మోస్ట్ వాంటెడ్ డ్రగ్ ట్రాఫికర్స్’లో అరెలానో ఒకడు. చాలా కాలంగా పోలీసులు వెతుకున్నా అతను పట్టుబడలేదు. అతని గురించి సమాచారం ఇచ్చినవారికి 14 లక్షల పౌండ్లు (దాదాపు రూ. 14 కోట్లు) బహుమతి ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సోమవారం మెక్సికోలోని తిజువానా నగరంలో ప్రపంచ కప్ మ్యాచ్ చూస్తూ అతను నాటకీయంగా పట్టుబడ్డాడు. మెక్సికో- క్రొయేషియా మధ్య మ్యాచ్‌ను టీవీలో చూస్తూ లోకాన్ని మరచిపోయినట్లున్నాడు! పోలీసుల రాకను ఏ మాత్రం అంచనా వేయలేకపోయిన అతను దొరికిపోయాడు. అన్నట్లు పట్టుబడిన సమయంలో అతను మెక్సికో టీమ్ గ్రీన్ ఫుట్‌బాల్ జెర్సీ వేసుకోవడంతో పాటు ముఖంపై ఆ దేశపు జాతీయ పతాకాన్ని కూడా పెయింట్ చేసుకొని ఉండటం విశేషం! -
మెస్సీ మళ్లీ...
అర్జెంటీనా ‘హ్యాట్రిక్’ విజయం నైజీరియాపై 3-2తో గెలుపు గ్రూప్ ‘ఎఫ్’లో అగ్రస్థానం ఓడినా నాకౌట్‌కు నైజీరియా క్లబ్ మ్యాచ్‌ల్లో కళ్లు చెదిరే విన్యాసాలతో గోల్స్ చేస్తాడని... దేశం తరఫున ఆడే సమయంలో మాత్రం అలాంటివేవి కానరావని తనపై ఉన్న విమర్శలకు అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. నైజీరియాపై రెండు కళ్లుచెదిరే గోల్స్‌తో అర్జెంటీనా ఖాతాలో హ్యాట్రిక్ విజయం చేర్చాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మెస్సీ గోల్స్ చేయడం విశేషం. పోర్టో అలెగ్రె: పటిష్టమైన అర్జెంటీనా చేతిలో ఓడిపోయినా... నైజీరియా జట్టు ప్రపంచకప్‌లో నాకౌట్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ముందుకు వెళ్లే స్థితిలో బరిలోకి దిగిన నైజీరియా... అటు ఇదే గ్రూప్‌లో మరో మ్యాచ్‌లో ఇరాన్ ఓడిపోవడంతో గట్టెక్కింది. బుధవారం గ్రూప్ ‘ఎఫ్’లో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2తో నైజీరియాపై నెగ్గింది.ఆట 3వ నిమిషంలో, 45+1వ నిమిషంలో మెస్సీ రెండు గోల్స్ చేశాడు. ఆట 50వ నిమిషంలో రోజో అర్జెంటీనాకు మూడో గోల్ చేశాడు. నైజీరియా తరఫున మూసా (4వ, 47వ) రెండు గోల్స్ సాధించాడు. ఈ గెలుపుతో అర్జెంటీనా 9 పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... 4 పాయింట్లతో నైజీరియా రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా సమర్పించుకోని జట్టుగా నిలిచిన నైజీరియాకు మూడో నిమిషంలోనే షాక్ తగిలింది. ఏంజెల్ డి మారియా కొట్టిన షాట్ నైజీరియా గోల్‌పోస్ట్ స్థంభానికి తగిలి ‘డి’ ఏరియా మధ్యభాగానికి తిరిగి రాగా... దూసుకొచ్చిన అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ శక్తివంతమైన కిక్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. మెస్సీ కెరీర్లోనే ఇది అత్యంత తక్కువ సమయంలో (2 నిమిషాల 26 సెకన్లు) చేసిన తొలి గోల్ కావడం విశేషం. అయితే అర్జెంటీనా ఆనందం తదుపరి నిమిషంలోనే ఆవిరైంది. బాబాతుండే ఇచ్చిన పాస్‌ను అహ్మద్ మూసా గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. ఫలితంగా ప్రపంచకప్ చరిత్రలో తొలి నాలుగు నిమిషాల్లోనే రెండు గోల్స్ నమోదైన మూడో మ్యాచ్‌గా ఇది గుర్తింపు పొందింది. తొలి అర్ధభాగం 1-1తో సమంగా ముగుస్తుందని అనుకుంటున్న తరుణంలో మెస్సీ మాయ చేశాడు. 25 గజాల దూరం నుంచి ఎడమ కాలితో మెస్సీ సంధించిన ఫ్రీకిక్ నేరుగా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. ద్వితీయార్థంలో మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ నమోదయ్యాయి. 47వ నిమిషంలో అహ్మద్ మూసా గోల్‌తో నైజీరియా 2-2తో స్కోరును సమం చేసింది. అయితే 50వ నిమిషంలో రోజో చేసిన గోల్‌తో అర్జెంటీనా 3-2తో ఆధిక్యంలోకి వెళ్లి చివరి వరకు నిలబెట్టుకుంది. -
గ్రీస్‌ను గెలిపించిన సమారస్
ఫోర్టలెజా: తదుపరి దశకు చేరుకోవాలంటే గెలుపు తప్పనిసరి.. మరోవైపు ప్రత్యర్థి జట్టుకు డ్రా చేసుకున్నా ఆ అవకాశం దక్కుతుంది. దీనికి తగ్గట్టుగానే మ్యాచ్ కూడా నిర్ణీత సమయం దాకా 1-1తో డ్రా దిశగానే సాగింది. దీంతో ఇక ఐవరీకోస్ట్ నాకౌట్‌కు చేరడం ఖాయమనే భావనలో ఉన్నారంతా. కానీ, ఇంతలోనే అద్భుతం జరిగింది. ఇంజ్యూరీ టైమ్ (91వ ని.)లో గ్రీస్‌కు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకుంటూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియస్ సమారస్.. ఐవరీ గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ బంతిని నెట్లోకి పంపాడు. ప్రపంచకప్ చరిత్రలో తమ జట్టును తొలిసారి గ్రూప్ దశను దాటించాడు. ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 42వ నిమిషంలో ఆండ్రియాస్ సమారిస్ తొలిగోల్ నమోదు చేసి గ్రీస్‌కు ఆధిక్యాన్నందించాడు. అయితే 74వ నిమిషంలో గెర్విన్హో ఇచ్చిన పాస్‌ను విల్ఫ్రెడ్ నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించి స్కోరును సమం చేశాడు. డ్రాతో నాకౌట్‌కు చేరుతున్నామన్న ఐవరీ ఆశలపై సమారస్ నీళ్లుజల్లాడు. పెనాల్టీని గోల్‌గా మలచి 2-1తో గ్రీస్‌ను గెలిపించాడు. -
నాకౌట్‌కు కొలంబియా, గ్రీస్
జపాన్, ఐవరీకోస్ట్ నిష్ర్కమణ ప్రపంచకప్‌లో గత చరిత్ర ఘనంగా ఏమీలేదు... ఈసారి కూడా పెద్దగా అంచనాలు లేవు... వీలైనంత మేరకు తమ సత్తా ప్రదర్శించడం, అవకాశమొస్తే విజయం సాధించడం... ఇదే అంచనాలతో బరిలోకి దిగాయి కొలంబియా, గ్రీస్ జట్లు. కానీ విశేషంగా రాణించి గ్రూప్ ‘సి’ నుంచి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు చేరుకున్నాయి. కొలంబియా మూడు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించగా, చావో, రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గ్రీస్ సత్తా చాటింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో కొలంబియా 4-1 తేడాతో జపాన్‌పై ఘనవిజయం సాధించగా, గ్రీస్ జట్టు 2-1తో ఐవరీకోస్ట్ను ఓడించి తొలిసారి గ్రూప్ దశను దాటింది. మరోవైపు ఐవరీ కోస్ట్ తమ చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా నాకౌట్ చేరే స్థితిలో... ఆఖరి నిమిషాల్లో ఓడింది. -
స్వారెజ్‌కు తిక్కుంది... దానికి లెక్కేలేదు
ఎంత నైపుణ్యం ఉన్న ఆటగాడైనా హద్దుల్లో ఉండాలి. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడయ్యాడంటే దానికి కారణం తన ప్రవర్తన. కానీ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లూయిస్ స్వారెజ్‌కు ఇది తెలియదేమో..! బంతిని అద్భుతంగా నియంత్రిస్తూ... ఒంటిచేత్తో ఫలితాలను మార్చే స్వారెజ్... తన ప్రవర్తనతో మాత్రం బ్యాడ్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన తిక్క చేష్టలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చీదరించుకునే పరిస్థితిని కల్పించుకుంటున్నాడు. సాక్షి క్రీడావిభాగం అపార నైపుణ్యమున్న ఉరుగ్వే ఆటగాడు స్వారెజ్‌కు వివాదాలు కొత్తేంకాదు. ఏడుగురు మగపిల్లల సంతానంలో నాలుగోవాడిగా పుట్టిన స్వారెజ్ తన కుటుంబంతో ఏడేళ్ల వయసులో రాజధాని మాంటెవిడియోకు తరలివచ్చాడు. అతనికి తొమ్మిదేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు విడిపోయారు. అప్పుడే ఫుట్‌బాల్‌లో ఓనమాలు నేర్చుకొని 14 ఏళ్ల ప్రాయంలో స్వదేశీ లీగ్ జట్టు నాసియోనల్లో చేరాడు. 16 ఏళ్ల వయసులో తనకు రెడ్‌కార్డు చూపెట్టిన రిఫరీని స్వారెజ్ తలతో ఢీకొట్టాడు. ఒకరోజు రాత్రి మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు. ఆటను సీరియస్‌గా తీసుకోకపోతే మరోసారి ఫుట్‌బాల్ జోలికి రావొద్దని కోచ్ హెచ్చరించడంతో అతను గాడిలో పడ్డాడు. 2006 సీజన్లో తన అద్భుత ఆటతీరుతో నాసియోనల్ జట్టుకు ఉరుగ్వే లీగ్ టైటిల్ అందించాడు. 2007లో జాతీయ యూత్ జట్టులో ఎంపికైన స్వారెజ్ అండర్-20 ప్రపంచకప్‌లో ఉరుగ్వే జట్టుకు నాలుగో స్థానం దక్కడంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2007 నుంచి 2011 వరకు నెదర్లాండ్స్‌కు చెందిన విఖ్యాత క్లబ్ అజాక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను 2011 నుంచి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ లో లివర్‌పూల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. విచారణకు ‘ఫిఫా’ ఆదేశం నటాల్ (బ్రెజిల్): క్షణికావేశంలో ఇటలీ డిఫెండర్ జియార్జియో చిలిని భుజాన్ని కొరికిన ఉరుగ్వే స్టార్ లూయిస్ స్వారెజ్ సంఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) విచారణకు ఆదేశించింది. స్వారెజ్తోపాటు ఉరుగ్వే ఫుట్‌బాల్ సంఘం అధికారులు తమ సాక్ష్యాలను ‘ఫిఫా’ క్రమశిక్షణ సంఘానికి భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1.30లోపు సమర్పించాలని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. విచారణ తర్వాత శనివారంలోపే స్వారెజ్పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదే రోజు ఉరుగ్వే ప్రిక్వార్టర్ ఫైనల్లో కొలంబియాతో తలపడాల్సి ఉంది. ఒకవేళ స్వారెజ్ దోషిగా తేలితే అతనిపై రెండేళ్ల నిషేధం లేదా... కనిష్టంగా రెండు మ్యాచ్‌ల నుంచి గరిష్టంగా 24 మ్యాచ్‌ల వేటు పడే అవకాశముంది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 8 మ్యాచ్‌ల నిషేధం ఇటలీ ప్లేయర్ మౌరో తస్సోటిపై 1994లో పడింది. స్వారెజ్ వివాదాల చిట్టా 2010 ప్రపంచకప్‌లో జూలై 2న ఘనాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ అదనపు సమయం చివరి క్షణాల్లో స్వారెజ్ గోల్‌పోస్ట్‌లోనికి వెళ్తున్న బంతిని ఉద్దేశపూర్వకంగా చేతితో నిలువరించాడు. దాంతో రిఫరీ అతనికి రెడ్‌కార్డు చూపెట్టి.. ఘనాకు పెనాల్టీ కిక్ ఇచ్చారు. అయితే పెనాల్టీ కిక్‌ను ఘనా ప్లేయర్ వృథా చేశాడు. ఆ తర్వాత ‘షూట్అవుట్’లో ఉరుగ్వే నెగ్గి సెమీఫైనల్ చేరింది. 2010 నవంబరు 20న నెదర్లాండ్స్ లీగ్‌లో అజాక్స్ జట్టు తరఫున ఆడుతూ స్వారెజ్ తన ప్రత్యర్థి జట్టు పీఎస్వీ ఎందోవెన్స్ మిడ్‌ఫీల్డర్ ఓట్మన్ బక్కాల్ను కొరికాడు. దాంతో అతనిపై ఏడు మ్యాచ్‌ల నిషేధం పడింది. 2011 అక్టోబరు 15న ఈపీఎల్‌లో మాంచెస్టర్ యునెటైడ్ ప్లేయర్ ప్యాట్రిక్ ఎవ్రా పై స్వారెజ్ జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడు. విచారణ అనంతరం స్వారెజ్పై ఎనిమిది మ్యాచ్‌ల నిషేధంతోపాటు 40 వేల పౌండ్ల జరిమానా పడింది. ఈ సంఘటన తర్వాత తదుపరి మ్యాచ్ ప్రారంభ సమయంలో ఫ్రాన్స్ నల్లజాతి ఆటగాడు ప్యాట్రిక్ ఎవ్రాతో కరచాలనం చేసేందుకు స్వారెజ్ నిరాకరించాడు. 2013 ఏప్రిల్ 21న ఈపీఎల్ మ్యాచ్‌లో చెల్సీ డిఫెండర్ బ్రానిస్లావ్ ఇవనోవిచ్‌ను కొరకడంతో స్వారెజ్పై 10 మ్యాచ్‌ల నిషేధం విధించారు. -
జూలు విదిల్చిన బ్రెజిల్
-
ఆఖర్లో అద్భుతం చేసిన ఉరుగ్వే
-
నాకు జ్వరమొచ్చింది...
ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏ కార్యాలయంలో చూసినా ఇదే కారణంతో సెలవు పత్రాలు నిండిపోతున్నాయేమో! ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు అందరూ ఏదో ఒక రోగం పేరు చెప్పి పనులకు డుమ్మా కొడుతున్నారు. అందు కోసం అందరూ దొంగ ‘డాక్టర్ సర్టిఫికెట్ల’ వెంట పడ్డారు. దీనిని అంది పుచ్చుకున్న కొందరు దొంగ సంతకాలు, స్టాంపులతో సిద్ధమైపోయారు. ఏకంగా తమ కేటలాగ్‌లో ఆయా ఆస్పత్రుల వివరాలు, సంతకాలతో కూడిన సర్టిఫికెట్లు ప్రదర్శిస్తూ కావాల్సినవారు సంప్రదించమని కోరుతున్నారు! పారిస్‌లో ఒక రెస్టారెంట్లో పని చేసే తొమ్మిది మందిలో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్ రోజున ఒకే సారి ఐదుగురు డుమ్మా కొట్టారు. ఇక ఆస్ట్రేలియాలో అయితే అభిమానులందరి తరఫున ఒకే ఒక విజ్ఞప్తి ఆఫీసులకు చేరింది. ‘మీ ఉద్యోగుల పట్ల కాస్త ఓపిగ్గా వ్యవహరించండి. వారు రాత్రంతా ఫుట్‌బాల్ చూడటమనే గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు’ అని. -
మందుబాబుల గోల!
పారిస్: సాకర్ వరల్డ్ కప్ వేడి ప్రపంచం మొత్తాన్ని తాకింది. ఆతిథ్య దేశం బ్రెజిల్‌లోనే కాదు...మెక్సికో మొదలు నేపాల్ వరకు ఈ సంబరాలు సాగుతున్నాయి. అయితే అవన్నీ అవధులు దాటి కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. గ్రీస్‌పై 3-0తో కొలంబియా విజయం సాధించిన అనంతరం అక్కడి బొగొటా నగరంలో జరిగిన గొడవలు, కారు ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. దాంతో అక్కడి మేయర్ కొలంబియా మ్యాచ్‌లు ఉన్న రోజున నగరంలో ఆల్కహాల్ అమ్మకాలను నిషేధించారు. ఈ నగరంలో విజయం తర్వాత ఏకంగా 3 వేల వీధి గొడవలు నమోదయ్యాయి! ఫ్రాన్స్లోనైతే సొంత దేశం కాకపోయినా అల్జీరియా అభిమానులు రెచ్చిపోయారు. కొరియాపై ఆ జట్టు గెలిచిన అనంతరం చేసుకున్న సంబరాలు శృతి మించాయి. రాళ్ల దాడి కూడా జరగడంతో పోలీసులు 28 మంది అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో నౌకలో ప్రయాణిస్తున్న ఒక మెక్సికో అభిమాని బాగా తాగిన మత్తులో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవడం కూడా వరల్డ్ కప్ మహిమే! ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్ కప్ సందర్భంగా ‘మందు’ బారిన పడని దేశం ఉండటం లేదు. -
మెక్సికో అలవోకగా...
క్రొయేషియాపై 3-1తో విజయం రెసిఫే: నాకౌట్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మెక్సికో ఆటగాళ్లు చెలరేగారు. ద్వితీయార్ధంలో పది నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ సాధించారు. గూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం అర్ధరాత్రి క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో 3-1తో నెగ్గింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. బెజిల్తో సమానంగా ఏడు పాయింట్లు సాధించినప్పటికీ గోల్స్ తేడాతో వెనుకబడింది. ప్రిక్వార్టర్స్‌లో మెక్సికో జట్టు పటిష్ట నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుంది. కెప్టెన్ మార్కెజ్, గార్డరో, హెర్నాండెజ్ మెక్సికో తరఫున గోల్స్ చేశారు. క్రొయేషియా చేసిన ఏకైక గోల్‌ను పెరిసిక్ సాధించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మార్కెజ్‌కు దక్కింది. మెక్సికోను ప్రథమార్ధంలో క్రొయేషియా బాగానే నిలువరించింది. 16వ నిమిషంలో మెక్సికో మిడ్‌ఫీల్డర్ హెరేరా లాంగ్ షాట్ గోల్ బంతిని గోల్ కీపర్ పట్టుకున్నాడు. అటు క్రొయేషియా కూడా కొన్ని అద్భుత క్రాస్‌లతో గోల్స్ కోసం ప్రయత్నించినా మెక్సికో కీపర్ ఒచోవా ఎప్పటిలాగే అడ్డుగోడలా నిలిచాడు. దీంతో ప్రథమార్ధం గోల్స్ లేకుండానే ముగిసింది. అయితే ద్వితీయార్ధం చివర్లో దూకుడు పెంచిన మెక్సికో స్వల్ప వ్యవధిలోనే మూడు గోల్స్ చేసి సత్తా చాటింది. 72వ నిమిషంలో హెరేరా కార్నర్ కిక్‌ను డిఫెండర్ మార్కెజ్ గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 75వ నిమిషంలో పెరాల్టా పాస్‌ను గెరార్డో లక్ష్యానికి చేర్చి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. 82వ నిమిషంలో గెరార్డో కార్నర్‌ను మార్కెజ్ నుంచి అందుకున్న హెర్నాండెజ్ గోల్ చేసి 3-0 ఆధిక్యాన్ని అందించాడు.అయితే 87వ నిమిషంలో క్రొయేషియాకు పెరిసిక్ గోల్ అందించాడు. -
కోస్టారికా టాప్
బెలో హారిజోంట్: ప్రస్తుత ప్రపంచకప్‌లో సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న కోస్టారికా అదే రీతిన ఆడుతూ గ్రూప్ డిలో అగ్రస్థానం దక్కించుకుంది. మంగళవారం రాత్రి ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గోల్స్ నమోదు కాకపోవడంతో 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో కోస్టారికా మొత్తం ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నాకౌట్‌కు వెళ్లనుంది. దీంతో గ్రూప్ సిలో రెండో స్థానం పొందిన జట్టుతో ప్రిక్వార్టర్స్ ఆడనుంది. గ్రూపులో టాప్ స్థానం దక్కించుకోవాలని కోస్టారికా.. కనీసం ఓ విజయమైనా సాధించాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ జట్టు ప్రథమార్ధంలో హోరాహోరీ ఆటను ప్రదర్శించాయి. 12వ నిమిషంలో ఇంగ్లండ్‌కు గోల్ చేసే అవకాశం లభించింది. జేమ్స్ మిల్నర్ నుంచి షార్ట్ పాస్‌ను తీసుకున్న స్ట్రయికర్ డానియల్ స్టరిడ్జ్ 23 గజాల నుంచి బంతిని తన్నగా అది గోల్ పోస్టు ఎడమవైపు బార్‌ను తాకుతూ పక్కకు వెళ్లింది. 35వ నిమిషంలోనూ స్టరిడ్జ్ కొట్టిన షాట్ గోల్ పోస్టు బార్‌పైనుంచి వెళ్లింది. ద్వితీయార్ధంలో 49వ నిమిషంలోనూ ల్యూక్ షా ఇచ్చిన పాస్‌ను స్టరిడ్జ్ వృథా చేశాడు. 76వ నిమిషంలో వేన్ రూనీ సబ్‌స్టిట్యూట్‌గా అడుగుపెట్టినా ఫలితం లేకపోయింది. కోస్టారికా గోల్‌కీపర్ నవాస్ ఇంగ్లండ్ ప్రయత్నాలను సమర్ధంగా అడ్డుకున్నాడు. -
ఆఖర్లో అద్భుతం
నాకౌట్ దశకు ఉరుగ్వే అర్హత ఇటలీపై 1-0తో గెలుపు కీలకగోల్ చేసిన గోడిన్ లీగ్ దశలోనే నిష్ర్కమించిన మాజీ విజేత నటాల్: మరో తొమ్మిది నిమిషాలు గడిస్తే ఉరుగ్వే ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించేది. గోల్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించినా దుర్బేధ్యంగా ఉన్న ఇటలీ రక్షణశ్రేణిని ఆ జట్టు ఛేదించలేకపోయింది. ఆశలు వదులుకుంటున్న వేళ అద్భుతం జరిగింది. ఆట 81వ నిమిషంలో లభించిన కార్నర్‌ను గాస్టన్ రమిరెజ్ సంధించగా... గోల్‌పోస్ట్ ముందు ఉరుగ్వే కెప్టెన్ గోడిన్ ‘హెడర్’ షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. అంతే ఉరుగ్వే శిబిరంలో ఎక్కడలేని ఆనందం. అప్పటిదాకా ‘డ్రా’ ఖాయమనుకున్న మ్యాచ్ మలుపు తిరిగిం ది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఇటలీ లీగ్ దశలోనే నిష్ర్కమణకు కారణమైంది. చివరిదాకా ఉత్కంఠభరితంగా సాగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 1-0తో ఇటలీని ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలో ఇటలీపై ఉరుగ్వేకిదే తొలి విజయం. గతంలో రెండుసార్లు ఇటలీతో ఆడిన ఉరుగ్వే కనీసం గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. మూడో ప్రయత్నంలో మాత్రం మాజీ చాంపియన్‌కు షాక్ ఇచ్చింది. 1966 ప్రపంచకప్ తర్వాత ఇటలీ జట్టు వరుసగా రెండు ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే వెనుదిరగడం ఇదే ప్రథమం. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఇటలీ 2010 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. రెండు జట్లకు చావోరేవోలాంటి మ్యాచ్ కావడంతో తొలి అర్ధభాగంలో హోరాహోరీగా పోటీపడ్డాయి. నిమిషాలు గడుస్తున్నకొద్దీ ‘ఫౌల్స్’ సంఖ్య కూడా అదేరీతిలో పెరిగింది. ఆట 23వ నిమిషంలో అయితే ఇటలీ స్టార్ ప్లేయర్ బలోటెలి బంతి కోసం గాల్లోకి అమాంతం ఎగిరి నేరుగా ఉరుగ్వే ఆటగాడు అల్వారో పెరీరా మెడభాగంలో పడ్డాడు. బలోటెలి చర్యకు రిఫరీ వెంటనే స్పందించి అతనికి ఎల్లో కార్డు చూపెట్టారు. 60వ నిమిషంలో ఇటలీకి ఎదురుదెబ్బ తగిలింది. బంతితో దూసుకెళ్తున్న క్రమంలో ఇటలీ ఆటగాడు క్లాడియో మర్చిసియో ప్రత్యర్థి ప్లేయర్ అరెవాలో కాళ్లపై మొరటుగా తన్నాడు. రిఫరీ ‘ఫౌల్’ తీవ్రత దృష్ట్యా మర్చిసియోకు ‘రెడ్ కార్డు’ ఇచ్చి మైదానం నుంచి బయటకు పంపించారు. దాంతో ఇటలీ 10 మంది ఆటగాళ్లకే పరిమితమైంది. ఈ సువర్ణావకాశాన్ని ఉరుగ్వే ఆటగాళ్లు చివర్లో సద్వినియోగం చేసుకున్నారు. అద్భుత విజయంతో నాకౌట్‌కు చేరారు. -
బ్రె ‘జూలు’ విదిల్చింది
‘సెంచరీ’ మ్యాచ్‌లో కామెరూన్‌పై 4-1తో విజయం ప్రిక్వార్టర్స్‌కు అర్హత గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానం రెండు గోల్స్‌తో మెరిసిన నెయ్మార్ బ్రెసిలియా: పాయింట్ సాధిస్తేచాలు నాకౌట్ దశకు అర్హత సాధిస్తుందని తెలిసినా బ్రెజిల్ జట్టు భారీ విజయమే లక్ష్యంగా పోరాడింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ అనుకున్నది సాధించింది. వరుసగా రెండు ఓటములతో డీలా పడిన కామెరూన్‌ను ఓ ఆటాడించిన బ్రెజిల్.. లీగ్ దశను విజయంతో ముగించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య బ్రెజిల్ జట్టు 4-1 గోల్స్ తేడాతో కామెరూన్‌ను చిత్తు చేసింది. బెజిల్ తరఫున రైజింగ్ సూపర్‌స్టార్ నెయ్మార్ రెండు గోల్స్ చేయగా... ఫ్రెడ్, ఫెర్నాన్డినో ఒక్కో గోల్ సాధించారు. కామెరూన్‌కు మాటిప్ ఏకైక గోల్‌ను అందించాడు. ఏడు పాయింట్లతో బ్రెజిల్, మెక్సికో సమంగా నిలిచినా... మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా బ్రెజిల్‌కు అగ్రస్థానం దక్కింది. జూన్ 28న జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో చిలీతో బ్రెజిల్; జూన్ 29న జరిగే ప్రిక్వార్స్లో నెదర్లాండ్స్‌తో మెక్సికో తలపడతాయి. ప్రపంచకప్ చరిత్రలో 100వ మ్యాచ్ ఆడిన బ్రెజిల్ కళ్లు చెదిరే ఆటతో అలరించింది. ళి ఆరంభం నుంచి సమన్వయంతో కదిలిన బ్రెజిల్‌కు 17వ నిమిషంలో ఫలితం లభించింది. ఎడమవైపు నుంచి లూయిజ్ గుస్తావో ఇచ్చిన పాస్‌ను ‘డి’ బాక్స్ మధ్యలో ఉన్న నెయ్మార్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో బ్రెజిల్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఎనిమిది నిమిషాలు గడిచాక కామెరూన్ స్కోరును సమం చేసి ఆశ్చర్యపరిచింది. ఎన్యో మ్ క్రాస్ షాట్‌ను మాటిప్ గోల్‌గా మలిచాడు. స్కోరు సమం కావడంతో బ్రెజిల్ ఆటగాళ్లు జోరు పెంచారు. ఆ ఆటగాళ్ల కృషికితోడు కామెరూన్ జట్టు రక్షణపంక్తి బలహీనతలు బ్రెజిల్‌కు కలిసొచ్చాయి. చాలాసార్లు మ్యాచ్‌లో కామెరూన్ ఆటగాళ్లు బ్రెజిల్ ఆటగాళ్లకే పాస్‌లు ఇచ్చారు. బ్రెజిల్ చేసిన రెండో గోల్ ఇలాగే వచ్చింది. ఎన్యోమ్ తమ ఆధీనంలో ఉన్న బంతిపై నియంత్రణ కోల్పోగా... బంతిని అందుకున్న బ్రెజిల్ ప్లేయర్ మార్సెలో.. నెయ్‌మార్‌కు పాస్ ఇచ్చాడు. అతను ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. విరామానికి బ్రెజిల్ 2-1తో ఆధిక్యంలో వెళ్లింది. ద్వితీయార్ధంలోనూ బ్రెజిల్దే ఆధిపత్యం కనిపించింది. 49వ నిమిషంలో లభించిన కార్నర్ కిక్‌ను ఫ్రెడ్ గోల్‌గా మలిచాడు. 84వ నిమిషంలో ఫెర్నాన్డినో నాలుగో గోల్‌ను అందించాడు. -
విజయంతో వీడ్కోలు పలికిన స్పెయిన్
-
నెదర్లాండ్స్ ముచ్చటగా మూడు ...
-
కుక్కలకూ జెర్సీలు!
ఫుట్‌బాల్‌పై అభిమానాన్ని బ్రెజిల్ ప్రజలు రకరకాలుగా చూపిస్తున్నారు. పురుషులు టీ షర్ట్లు, జెర్సీలతో హంగామా చేస్తుంటే, మహిళలు చేతి గోళ్లకు బ్రెజిల్ దేశపు రంగులు పెయింట్ చేయించుకోవడం, చేతి పర్సులపై ఆ దేశపు డిజైన్లు వేయించుకోవడం చేస్తున్నారు. ఇక మరి కొందరు ముందుకెళ్లి తమ కుక్కలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ముఖ్యంగా 10 నంబర్ రాసి ఉన్న పసుపు రంగు జెర్సీ ఇప్పుడు శునక బృందంలోనూ హాట్..! 14 డాలర్ల విలువ గల ఈ హాఫ్ షర్ట్‌ను తమ ఫ్యామిలీ డాగ్‌కు తొడిగి యజమానులు సంతోషపడుతున్నారు. ఇదో రకమైన వింత ధోరణిగా కనిపిస్తున్నా... తమకు లాభిస్తోందని అక్కడి వ్యాపారులు అంటున్నారు. -
పంట పండింది!
ఫుట్‌బాల్ ప్రపంచకప్ సందర్భంగా బ్రెజిల్లో కండోమ్‌లు తయారుచేసే కంపెనీల పంట పండింది. ముఖ్యంగా ప్రుడెన్స్ అనే కంపెనీ దీనిని బాగా సొమ్ము చేసుకుంది. బ్రెజిల్ ప్రజలకు బాగా ఇష్టమైన పానీయం ‘కైపిరిన్హా’ ఫ్లేవర్‌తో ఈ కంపెనీ ఓ కండోమ్‌ను ప్రపంచకప్ సందర్భంగా విడుదల చేసింది. దీని ధర 84 రూపాయలు. ఈ కంపెనీలు మూడు నెలలకు సరిపోతాయని భావించి 8.5 లక్షల కండోమ్స్ ఉత్పత్తి చేసింది. అయితే కేవలం 15 రోజుల్లోనే అన్నీ అమ్ముడయ్యాయి. ప్రపంచకప్‌కు వచ్చిన విదే శీయులు అతి చౌకైన జ్ఞాపికగా ఈ కండోమ్‌ను తీసుకువెళుతున్నారేమో అని బ్రెజిల్ అధికారులు వ్యాఖ్యానించడం విశేషం. -
పోర్చుగల్ ఆశలు సజీవం
అమెరికాతో మ్యాచ్ 2-2తో డ్రా మనౌ: మ్యాచ్ ముగిసేందుకు మరో 25 సెకన్లు మాత్రమే ఉంది... అమెరికా 2-1తో ఆధిక్యంలో ఉంది.... ఈ దశలో క్రిస్టియానో రొనాల్డో లాంటి అత్యుత్తమ ఆటగాడు జట్టులో ఉన్నప్పటికీ పోర్చుగల్ పని అయిపోయిందనే అంతా భావించారు. వరుసగా రెండు పరాజయాలతో ఈ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్ర్కమించడం ఖాయమనే అనుకున్నారు. కానీ ఈ దశలో అద్భుతం జరిగింది. రొనాల్డో ఇచ్చిన నమ్మశక్యంకాని పాస్‌ను అందుకున్న సబ్‌స్టిట్యూట్ సిల్విస్టర్ వరేలా డైవ్ చేస్తూ హెడర్ గోల్ సాధించి తమ శిబిరంలో అంతులేని ఆనందాన్ని నింపాడు. దీంతో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ గ్రూప్ జి మ్యాచ్‌ను పోర్చుగల్ 2-2తో డ్రాగా ముగించి నాకౌట్ ఆశలను నిలుపుకుంది. పోర్చుగల్ తరఫున మరో గోల్ నాని చేయగా... అమెరికా తరఫున జోన్స్, డెంప్సీ గోల్స్ సాధించారు. * మ్యాచ్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే నాని పోర్చుగల్ తరఫున గోల్స్ ఖాతా తెరిచాడు. * 64వ నిమిషంలో అమెరికా స్కోరు సమం చేసింది. గ్రాహం కార్నర్ కిక్‌ను జెర్మైన్ జోన్స్ గురి తప్పకుండా గోల్ పోస్టులోనికి పంపాడు. * ఇదే జోరులో అమెరికా మ్యాచ్‌పై పట్టు సాధించింది. 81వ నిమిషంలో జుసీ షాట్ వెనక్కిరాగా స్ట్రయికర్ క్లింట్ డెంప్సీ తన కడుపు భాగంతో గోల్‌పోస్ట్‌లోనికి పంపాడు. * ఇక అంతా అయిపోయిందనుకున్న తరుణంలో చివరి నిమిషంలో రొనాల్డో తన కుడి కాలితో బంతిని గాల్లోకి లేపి ఇచ్చిన పాస్‌ను వరేలా లక్ష్యానికి చేర్చి అమెరికన్లను షాక్‌కు గురిచేశాడు. పోర్చుగల్ రెచ్చిపోతేనే... పోర్చుగల్ నాకౌట్‌కు వెళ్లేందుకు ద్వారాలు తెరిచే ఉన్నా ఈ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఘనాను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. జర్మనీతో చిత్తుగా ఓడినందుకు ఫలితమిది. అమెరికా తమ చివరి మ్యాచ్‌ను జర్మనీ చేతిలో ఒక్క గోల్ కూడా చేయకుండా ఓడితే... అటు రొనాల్డో బృందం 3-0తో గెలవాల్సి ఉంటుంది. అలాగైతేనే అమెరికాతో సమానంగా నాలుగు పాయింట్లకు చేరి... ఓవరాల్ గోల్స్ తేడాతో పోర్చుగల్ నాకౌట్‌కు వెళుతుంది. ఇదే సమయంలో పోర్చుగల్‌పై గెలిస్తే ఘనాకు కూడా అవకాశం ఉంటుంది. -
అల్జీరియాకు అవకాశం
ఈ గ్రూపులో బెల్జియం ఇప్పటికే నాకౌట్‌కు చేరింది. అల్జీరియా మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా తమ చివరి మ్యాచ్‌లో రష్యాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు రౌండ్ ఆఫ్ 16కు వెళుతుంది. అటు కొరియాకు కూడా అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ జట్టు 3-0తో బెల్జియంను ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో అల్జీరియా, రష్యా మ్యాచ్ 0-0తో డ్రా కావాల్సి ఉంటుంది. అప్పు డే గోల్స్ తేడాతో కొరియాకు అవకాశం ఉంటుంది. -
అల్జీరియా మెరుపులు
కొరియాపై 4-2తో విజయం పోర్టో అలెగ్రే: ప్రపంచకప్‌లో అల్జీరియా తమ నాకౌట్ ఆశలను నిలుపుకుంది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి కొరియా రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆఫ్రికా జట్టు చెలరేగి 4-2 తేడాతోనెగ్గింది. ప్రపంచకప్ చరిత్రలో ఓ ఆఫ్రికా జట్టు నాలుగు గోల్స్ చేయడం ఇదే ప్రథమం. అలాగే ఈ మెగా టోర్నీలో ఇప్పటిదాకా వరుసగా ఈ జట్టుకు ఏడు మ్యాచ్‌ల్లో ఎదురైన పరాజయాలకు బ్రేక్ పడినట్టయ్యింది. స్లిమాని, హలీచే, జబౌ, బ్రహిమి అల్జీరియా తరఫున గోల్స్ చేయగా సన్ హుయాంగ్ మిన్, కూ జాచియోల్ కొరియాకు గోల్స్ అందించారు. స్లిమాని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. • 26వ నిమిషంలో మెడ్జానీ ఇచ్చిన లాంగ్ పాస్‌ను స్లిమాని గోల్ చేసి అల్జీరియాకు ఆధిక్యాన్నిచ్చాడు. • మరో రెండు నిమిషాల(28వ ని.)కే డిఫెండర్ రఫీక్ హలీచే 2-0 ఆధిక్యం అందించగా... 38వ నిమిషంలో జబౌ చేసిన గోల్‌తో అల్జీరియా ప్రథమార్ధాన్ని 3-0తో ముగించింది. • 50వ నిమిషంలో కొరియా తరఫున హుయాంగ్ మిన్ గోల్ చేశాడు. కానీ 62వ నిమిషంలో ఆరు గజాల దూరం నుంచి బ్రహిమి(అల్జీరియా) గోల్ కీపర్ కాళ్ల మధ్యలో నుంచి బంతిని పంపి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. మరో పది నిమిషాల (72వ ని.)కు కొరియాకు కూ జాచియోల్ రూపంలో ఓదార్పు గోల్ దక్కింది. -
విజయంతో వీడ్కోలు
ఆసీస్‌పై 3-0తో స్పెయిన్ గెలుపు కురిటీబా: డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నామమాత్రపు మ్యాచ్‌లో తమ సత్తా ప్రదర్శించి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇప్పటికే రెండు పరాజయాలతో నాకౌట్‌కు దూరమైన ఈ జట్టు ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం చెలరేగి 3-0తో నెగ్గింది. ఈ గెలుపుతో సాధించేదేమీ లేకున్నా తమ మునుపటి ఆటతీరును ప్రదర్శించి అభిమానులను ఆకట్టుకుంది. వేగవంతమైన పాస్‌లతో చురుగ్గా కదిలి ఓదార్పు విజయాన్ని దక్కించుకుని తమ గ్రూప్ ‘బి’లో చిట్టచివర నిలిచే ప్రమాదాన్ని తప్పించుకుంది. విల్లా, టోరెస్, మటా జట్టు తరఫున గోల్స్ సాధించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా డేవిడ్ విల్లా నిలిచాడు. ⇒ ఫలితం ఎలావచ్చినా ఒరిగేదేమీ లేదనుకున్నారేమో కానీ స్పెయిన్ ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభం నుంచే వేగంగా ఆడారు. వరుస దాడులతో ఆసీస్‌ను బెంబేలెత్తించారు. ⇒ 17వ నిమిషంలో గోల్ చేసేందుకు స్పెయిన్‌కు అవకాశమొచ్చింది. ఇనెస్టా పాస్‌ను మిడ్ ఫీల్డర్ సాంటీ కజోర్లా గోల్ పోస్టులోకి పంపినా కీపర్‌కు ముందే ఆసీస్ డిఫెండర్ స్పిరనోవిక్ అడ్డుకున్నాడు. ⇒ ఆ తర్వాత గోల్ పోస్టుకి 30 గజాల దూరం నుంచి ఫ్రీకిక్ లభించినా ఇనెస్టా షాట్ వైడ్‌గా వెళ్లింది. ⇒ వీరి ప్రయత్నాలు 36వ నిమిషంలో ఫలించాయి. ఆసీస్ డిఫెండర ్లను తప్పిస్తూ ఇనెస్టా.. జువాన్ఫ్రాన్కు పాస్ ఇవ్వగా వెంటనే తను బంతిని డేవిడ్ విల్లా వైపు పంపించాడు. దీన్ని విల్లా తన కుడి కాలుతో వెనక నుంచి బంతిని అద్భుత రీతిలో గోల్ పోస్టులోకి పంపాడు. ⇒ ద్వితీయార్ధంలోనూ ఇదే రీతిన చెలరేగిన స్పెయిన్ 69వ నిమిషంలో రెండో గోల్ సాధించి జట్టు ఆధిక్యాన్ని 2-0కి పెంచుకుంది. ఆసీస్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఇనెస్టా ఇచ్చిన సూపర్ పాస్‌ను అందుకున్న ఫెర్నాండో టోరెస్ తడబడకుండా గోల్ చేశాడు. ఇది తనకు 2006 టోర్నీ తర్వాత ఇదే తొలి గోల్. ⇒ 82వ నిమిషంలో జువాన్ మటా గోల్ కీపర్ రియాన్ కాళ్ల మధ్యలో నుంచి కొట్టిన గోల్‌తో జట్టుకు తిరుగులేని ఆధిక్యం లభించింది. -
నెదర్లాండ్స్ హ్యాట్రిక్
వరుసగా మూడో విజయం చిలీపై 2-0తో గెలుపు గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం నెదర్లాండ్స్, చిలీ జట్లు ముఖాముఖిగా చివరిసారి 86 ఏళ్ల క్రితం 1928 అమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్ క్రీడల ఫైనల్లో తలపడ్డాయి. నిర్ణీత సమయానికి రెండు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దాంతో లాటరీ ద్వారా విజేతను నిర్ణయించగా నెదర్లాండ్స్‌ను అదృష్టం వరించింది. సావోపాలో: రెండు దశాబ్దాలుగా నెదర్లాండ్స్ జట్టు ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అదే ఆనవాయితీని బ్రెజిల్‌లోనూ కొనసాగిస్తూ డచ్ బృందం ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది. చిలీతో సోమవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి మ్యాచ్‌లో ఈ ‘ఆరెంజ్’ దళం 2-0తో నెగ్గి లీగ్ దశను గెలుపుతో ముగించింది. తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. ఆరు పాయింట్లతో చిలీ రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ తరఫున చేసిన రెండు గోల్స్ సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు (లెరాయ్ ఫెర్, డెపె మెంఫిస్) చేయడం విశేషం. నెదర్లాండ్స్ కెప్టెన్ అర్జెన్ రాబెన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. తొలి అర్ధభాగంలో రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. చిలీ ఆధీనంలో బంతి 68 శాతం ఉన్నప్పటికీ ఆ జట్టు ఒక్కసారి కూడా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్‌ను సంధించలేకపోయింది. మరోవైపు దూకుడైన ఆటతీరుకు మారుపేరైన నెదర్లాండ్స్ గోల్ చేసే అవకాశాలను సృష్టించుకున్నా సఫలం కాలేకపోయింది. మూడుసార్లు గోల్‌పోస్ట్‌పై షాట్లు సంధించినా అవి లక్ష్యానికి చేరలేదు. రెగ్యులర్ కెప్టెన్ రాబిన్ వాన్ పెర్సీపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ పడటంతో అతని స్థానంలో మరో స్టార్ ప్లేయర్ అర్జెన్ రాబెన్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఫార్వర్డ్ శ్రేణిలో అవకాశం వచ్చినపుడల్లా రాబెన్ బంతితో చిలీ రక్షణశ్రేణిలోకి దూసుకెళ్లాడు. ఆట 40వ నిమిషంలో అతను సంధించిన షాట్ గోల్‌పోస్ట్ పక్క నుంచి బయటకు వెళ్లిపోయింది. రెండో అర్ధభాగంలో నెదర్లాండ్స్ దూకుడు పెంచింది. సమన్వయంతో కదిలి చిలీ రక్షణపంక్తికి ఇబ్బందులు సృష్టించింది. అయితే నెదర్లాండ్స్ దాడులను చిలీ సమర్థంగా నిలువరించింది. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనిపించింది.అయితే 75వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెరాయ్ ఫెర్, 69వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా అడుగుపెట్టిన డెపె మెంఫిస్ చిలీ ఆశలపై నీళ్లు చల్లారు. 77వ నిమిషంలో లభించిన కార్నర్ కిక్‌ను అర్జెన్ రాబెన్ సహచరుడు డారిల్ జన్మాత్కు పాస్ ఇచ్చాడు. అతను కొంచెం ముందుకెళ్లి షాట్ కొట్టగా గోల్‌పోస్ట్ ముందున్న లెరాయ్ ఫెర్ ‘హెడర్’తో బంతిని లక్ష్యానికి చేర్చడంతో నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది.మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా నెదర్లాండ్స్ రెండో గోల్ చేసింది. ఎడమవైపు నుంచి పాదరసంలా కదులుతూ అర్జెన్ రాబెన్ కొట్టిన క్రాస్ షాట్‌ను సబ్‌స్టిట్యూట్ డెపె మెంఫిస్ గోల్‌గా మలిచాడు. -
డ్రగ్ పరీక్షకు జట్టు ఆటగాళ్లంతా సిద్దం!
సాంటో(బ్రెజిల్): డ్రగ్ పరీక్షలకు జట్టు మొత్తమంతా హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కోస్టారికా కోచ్ జోర్జ్ లూయిస్ పింటో తెలిపారు. ప్రపంచకప్ పుట్ బాల్ టోర్నిలో ఇటలీపై 1-0 తేడా గోల్స్ తో విజయం సాధించడంతో ఏడుగురు ఆటగాళ్ల డ్రగ్ పరీక్షలకు హాజరుకావాలంటూ ఫిఫా ఆదేశించిన నేపథ్యంలో కోస్టారికా కోచ్ వ్యాఖ్యానించారు. అయితే ఆటగాళ్ల డ్రగ్ పరీక్షలు కేవలం రోటిన్ వ్యవహారంలో భాగమని ఫిఫా ట్వీట్ చేసింది. ఆటపూర్తయ్యాక సాధారణ నిబంధనల్లో భాగంగానే ఇద్దరు ఆటగాళ్లకు డ్రగ్ పరీక్షలు నిర్వహించాం. మరో ఐదుగురు కోస్టారికా ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహిస్తామని ఫిఫా వెల్లడించింది. -
అత్యధిక గోల్స్ రికార్డును సమం చేసిన క్లోజ్
-
16 ఏళ్ల తర్వాత నైజీరియాకు తొలి విజయం
-
రష్యాపై 1-0తో విజయం
-
16 ఏళ్ల తర్వాత...
నైజీరియాకు తొలి విజయం 1-0తో బోస్నియాపై గెలుపు క్యుఅబా (బ్రెజిల్): ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆఫ్రికన్ దేశం నైజీరియా కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్‌లో నైజీరియా 1-0 తేడాతో బోస్నియా అండ్ హెర్జిగోవినాను ఓడించింది. 1998 ప్రపంచకప్‌లో మ్యాచ్ నెగ్గిన నైజీరియాకు 16 ఏళ్ల తర్వాత మరో గెలుపు దక్కడం విశేషం. మ్యాచ్ 29వ నిమిషంలో పీటర్ ఒడెమ్వింగీ ఏకైక గోల్ నమోదు చేశాడు. ఈ పరాజయంతో బోస్నియా వరల్డ్‌కప్ నుంచి నిష్ర్కమించింది. ఇరాన్‌తో జరిగిన గత మ్యాచ్‌తో పోలిస్తే నైజీరియా ఆటతీరు ఎంతో మెరుగైంది. ఆరంభం నుంచే ఆ జట్టు ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. ముఖ్యంగా ఎమాన్యుటేల్ ఎమినెక్ దూకుడుగా ఆడాడు. చివరకు అతని ద్వారానే గోల్ సాధ్యమైంది. బోస్నియా కెప్టెన్ ఎమిర్ స్పాహిక్ను తప్పిస్తూ దూసుకొచ్చిన అతను ఒడెమ్వింగీకి పాస్ అందించాడు. దానిని చక్కగా అందుకున్న ఒడెమ్ ఎలాంటి తడబాటు లేకుండా గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత బోస్నియా ఆటగాడు ఎడిన్ జెకో గోల్ చేసినా... రిఫరీ దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో జట్టు నివ్వెరపోయింది. మరో రెండుసార్లు ఎడికో గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా నైజీరియా కీపర్ ఎనీమా సమర్థంగా అడ్డుకున్నాడు. దాంతో తొలిసారి వరల్డ్ కప్ ఆడిన బోస్నియా తొలి రౌండ్లోనే నిరాశగా వెనుదిరిగింది. తాజా ఫలితంతో నైజీరియా (4 పాయింట్లు) నాకౌట్ ఆశలు సజీవంగా నిలిచాయి. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆ జట్టు అర్జెంటీనాతో తలపడుతుంది. అర్జెంటీనా ఇప్పటికే నాకౌట్ చేరగా... నైజీరియా కనీసం ‘డ్రా’ చేసుకున్నా ప్రిక్వార్టర్స్ చేరుతుంది. ఒకవేళ ఓడినా... బోస్నియాపై ఇరాన్ (1 పాయింట్) భారీ తేడాతో గెలవకుంటే నైజీరియా ముందుకు వెళుతుంది. -
నాకౌట్‌కు బెల్జియం
రష్యాపై 1-0తో విజయం సూపర్ గోల్‌తో గెలిపించిన ఒరిజి రియో డి జనీరో: పన్నెండేళ్ల తర్వాత ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన బెల్జియం జట్టు నాకౌట్‌కు దశకు దూసుకెళ్లింది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా ఆదివారం రష్యాతో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 1-0తో విజయం సాధించింది. డివోక్ ఒరిజి 88వ నిమిషంలో గోల్ చేసి తమ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. దీంతో గ్రూప్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బెల్జియం ప్రి క్వార్టర్స్‌కు చేరితే... ఓటమితో రష్యా తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో బెల్జియం... అల్జీరియాపై గెలుపొందగా, కొరియాతో మ్యాచ్‌ను రష్యా డ్రాగా ముగించింది. ఇక ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రథమార్ధంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. 10వ నిమిషంలో బెల్జియంకు తొలి చాన్స్ లభించింది. కార్నర్ నుంచి ఫెలైనీ అద్భుత షాట్ సంధించాడు. కానీ, దాన్ని తలతో ఆడిన వెర్మాలెన్.. గోల్‌పోస్ట్‌లోకి పంపించలేకపోయాడు. 12వ నిమిషంలో అది రష్యా వంతయింది. ఆ తరువాత 14వ నిమిషంలో బెల్జియంకు ఫ్రీ కిక్ లభించినా లుకాకు ప్రయత్నాన్ని ఇగ్నషెవిచ్ అడ్డుకున్నాడు. 20వ, 22వ నిమిషాల్లో మెర్టెన్స్ బంతిని చాకచక్యంగా రష్యా రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ లక్ష్యం దిశగా తీసుకెళ్లినా.. రెండుసార్లూ బంతి గోల్‌పోస్ట్‌కు దూరంగానే వెళ్లిపోయింది. 44వ నిమిషంలో గ్లుషకోవ్ అందించిన బంతిని హెడర్ గోల్ చేసేందుకు ప్రయత్నించిన కొకోరిన్ సక్సెస్ కాలేకపోయాడు. అనంతరం 49వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను కూడా రష్యా గోల్‌గా మలచలేకపోయింది. మధ్యలో ఇరుజట్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లపై దాడులు చేసినా కీపర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. దీంతో మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తుందనుకున్న తరుణంలో హజార్డ్ అందించిన బంతిని ఒరిజి.. రష్యా డిఫెండర్లకు, గోల్ కీపర్‌కు అందకుండా నెట్లోకి పంపించి బెల్జియం శిబిరంలో సంబరాలు నింపాడు. మిగిలిన కొద్ది నిమిషాల్లో రష్యా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. -
గట్టెక్కిన జర్మనీ
ఘనాతో మ్యాచ్ 2-2తో డ్రా అత్యధిక గోల్స్ రికార్డును సమం చేసిన క్లోజ్ జర్మనీ: 2 మారియా గోట్జే 51వ, మిరోస్లావ్ క్లోజ్ 71వ ఘనా: 2 ఆండ్రూ అయే 54వ, అసమో గ్యాన్ 63వ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన జర్మనీ వెటరన్ స్ట్రయికర్ మిరోస్లావ్ క్లోజ్ ప్రపంచకప్ చరిత్రలో సంచలనం సష్టించాడు. బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో అత్యధిక గోల్స్ (15) రికార్డు సమం చేయడమే కాకుండా జట్టును పరాజయం నుంచి తప్పించాడు. అటు ఆఫ్రికన్ జట్టు ఘనా అద్భుత రీతిలో చెలరేగి జోరు మీదున్న జర్మనీని నిలువరించగలిగింది. ఫోర్టలెజా: పోర్చుగల్ జట్టుపై ఘనవిజయం సాధించి ఊపులో ఉన్న జర్మనీని తమ రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా ఘనా జట్టు నిలువరించింది. గ్రూప్ ‘జి’లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ థ్రిల్లర్ మ్యాచ్‌లో ఇరు జట్ల పోటాపోటీ ప్రదర్శన కారణంగా 2-2తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే వెటరన్ స్ట్రయికర్ మిరోస్లావ్ క్లోజ్‌కు ఈ మ్యాచ్ చిరస్మరణీయం అయ్యింది. ఇప్పటిదాకా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ సాధించిన రికార్డు రొనాల్డో (బ్రెజిల్) పేరిట ఉండగా 36 ఏళ్ల క్లోజ్ దాన్ని సమం చేశాడు. రొనాల్డో కూడా ఘనాపైనే ఈ ఘనత సాధించగా... ఆ టోర్నీ జర్మనీలో జరిగింది. ఇప్పుడు క్లోజ్ బ్రెజిల్లో జరుగుతున్న టోర్నీలో ఘనాపైనే చేయడం కాకతాళీయం. అలాగే నాలుగు ప్రపంచకప్‌ల్లో గోల్స్ సాధించిన మూడో ఆటగాడి (గతంలో పీలే, ఉవ్ సీలర్)గానూ నిలిచాడు. మ్యాచ్‌లో మరో గోల్‌ను మారియా గోట్జే చేశాడు. ఘనా తరఫున ఆండ్రియా అయే, అసమో గ్యాన్ మెరుపులు మెరిపించారు. అటు ఆఫ్రికా నుంచి అత్యధిక గోల్స్ (5) సాధించిన ఆటగాడిగా రోజర్ మిల్లా (కామెరూన్) రికార్డును గ్యాన్ సమం చేశాడు. మొత్త నాలుగు గోల్స్ కూడా ద్వితీయార్థంలోనే నమోదయ్యాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా గోట్జే నిలిచాడు. మైదానంలో చురుగ్గా కదులుతూ మెరుపు వేగంతో పాస్‌లు ఇచ్చుకుంటూ ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడులు చేయడం జర్మన్లకు అలవాటు. అయితే వీరికి సమ ఉజ్జీయా అన్నట్టు ప్రథమార్ధమంతా ఆఫ్రికన్ సింహాలు కూడా ఇదే రీతిన చెలరేగాయి. వీరికి ఏడో నిమిషంలోనే ఫ్రీ కిక్ అవకాశం లభించినా విఫలమైంది. 32వ నిమిషంలోనూ మిడ్ ఫీల్డర్ ముంతారి కొద్ది దూరం నుంచి కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్ కీపర్ న్యూయర్ వేగంగా స్పందించి అడ్డుకున్నాడు. అయితే 37వ నిమిషంలో గోట్జే హాఫ్ వాలీ నేరుగా ఘనా గోల్ కీపర్ దౌడా చేతుల్లోకి వెళ్లింది. 45వ నిమిషంలో ఆండ్రూ అయే హెడర్ గోల్ కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ద్వితీయార్ధంలో పంథా మార్చిన జర్మనీకి 51వ నిమిషంలో ఫలితం లభించింది. కుడివైపు నుంచి ముల్లర్ అందించిన పాస్‌ను అందుకున్న మారియో గోట్జే ఇద్దరు డిఫెండర్లను తప్పిస్తూ ‘హెడర్’ షాట్‌తో గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. కానీ ఈ సంతోషం జర్మనీకి ఎక్కువ సేపు నిలువలేదు. 54వ నిమిషంలోనే అఫ్ఫుల్ పాస్‌ను అందుకున్న అయే విల్లులా వెనక్కి వంగి హెడర్‌తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఇదే ఉత్సాహంతో కదిలిన ఘనా 63వ నిమిషంలో జర్మనీకి షాక్‌నిస్తూ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. మిడ్ ఫీల్డ్ నుంచి బంతిని అందుకున్న ముంతారి... గ్యాన్కు సూపర్ పాస్‌ను ఇవ్వగా ఎలాంటి పొరపాటుకు తావీయకుండా తను ‘రికార్డు’ గోల్ చేసి ఘనాను ఆనందంలో నింపాడు. ఇక ఘనా సంచలనం తప్పదా అనుకుంటున్న పరిస్థితిలో క్లోజ్ చెలరేగాడు. 69వ నిమిషంలో గోట్జే స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన తను మరో రెండు నిమిషాలకే సత్తా చూపాడు. 71వ నిమిషంలో టోనీ క్రూస్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను హోవెడెస్ ద్వారా అందుకున్న క్లోజ్ గోల్ పోస్టుకు అతి సమీపం నుంచి గోల్ చేశాడు. ఆ తర్వాత కూడా ఇరు జట్ల నుంచి దాడులు జరిగినా గోల్ కీపర్లు సమర్థవంతంగా అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నేటి టాప్ మ్యాచ్ బ్రెజిల్ x కామెరూన్ బ్రెసిలియా (బ్రెజిల్): సాకర్ ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు జరగనున్న గ్రూప్ ‘ఎ’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కామోరూన్తో అమీతుమీ తేల్చుకోనుంది. క్రొయేషియాపై విజయం... మెక్సికోతో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న బ్రెజిల్ 4 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మెక్సికో ఖాతాలో కూడా 4 పాయింట్లే ఉన్నా గోల్స్ సగటులో ఈ జట్టు వెనుకబడి రెండో స్థానంలో ఉంది. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్రిక్వార్టర్స్‌కు చేరుకోవాలంటే కామోరూన్తో మ్యాచ్‌లో బ్రెజిల్ కచ్చితంగా గెలిచి తీరాలి. ఓడితే మాత్రం నాకౌట్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఒకవేళ డ్రాతో నాకౌట్‌కు చేరుకున్నా... రెండో రౌండ్లో నెదర్లాండ్స్ లేదా చిలీతో తలపడాల్సి వస్తుంది. మరోవైపు ఆడిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిన కామోరూన్కు నాకౌట్ అవకాశాలు దూరమయ్యాయి. కొరియాపై అల్జీరియా గెలుపు సాకర్ ప్రపంచకప్‌లో అల్జీరియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాకా జరిగిన గ్రూప్-హెచ్ లీగ్ మ్యాచ్‌లో 4-2 తేడాతో కొరియా రిపబ్లిక్‌పై గెలిచింది. అల్జీరియా తరఫున స్లిమాని (26వ ని.), రఫీక్ హెలిచీ (28వ ని.), జబోవ్ (38వ ని.), బ్రహిమి (62వ ని.) గోల్స్ చేశారు. హెచ్ఎం సన్ (50వ ని.), జేసీ కూ (72వ ని.) కొరియాకు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆరంభం నుంచి మంచి సమన్వయంతో కదిలిన అల్జీరియా తొలి అర్ధభాగంలో 3-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న కొరియా ఆటగాళ్లు అల్జీరియా డిఫెన్స్‌పై పదేపదే దాడులు చేసి రెండు గోల్స్ సాధించారు. కానీ మ్యాచ్ చివరి వరకు ఇదే దూకుడును కనబర్చలేకపోయారు. అల్జీరియా రక్షణాత్మకంగా ఆడటంతో కొరియాకు గోల్స్ చేసే అవకాశం లభించలేదు. రొనాల్డో అభినందన ‘15 గోల్స్ క్లబ్‌లోకి క్లోజ్‌కు స్వాగతం. ప్రస్తుతం నీవెంత సంతోషంగా ఉన్నావో నేనూహించగలను. నిజంగా ఇది గొప్ప ప్రపంచకప్. ఇక రికార్డులున్నవి బద్దలయ్యేందుకే. ఈ విషయంలో నాకెలాంటి విచారంలేదు’ -రొనాల్డో ట్వీట్ -
మెస్సీ మాయా...
-
అభిమానం 'తన్ను'కొచ్చింది!!
-
బోస్నియా-హెర్జెగోవినాపై నైజీరియా విజయం!
మాటో గ్రోసో(బ్రెజిల్): ప్రపంచ పుట్ బాల్ కప్ పోటీల్లో బోస్నియా-హెర్జెగోవినా నైజిరియా 1-0 తేడాతో విజయం సాధించింది. తొలిసారి పుట్ బాల్ ప్రపంచకప్ పోటీల్లో ప్రవేశించిన బోస్నియా ఆశలపై క్వాలిఫైయింగ్ రౌండ్ లో ఆఫ్రికా ఛాంపియన్ గా నిలిచిన నీళ్లు చల్లింది. నైజీరియా ఆటగాడు ఒడెర్న్ వింగీ 29 నిమిషంలో గోల్ సాధించాడు. ఆతర్వాత గోల్ సాధించడానికి బోస్నియా చేసిన ప్రయత్నాలను నైజీరియా ధీటుగా ఎదుర్కొంది. దాంతో విజయం నైజీరియా పక్షాన నిలిచింది. గత రెండు మ్యాచ్ ల్లో నైజీరియా నాలుగు పాయింట్టు సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ఇరాన్ పై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా ప్రథమ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు అర్జెంటినాతో నైజీరియా గురువారం తలపడనుంది. -
మళ్లీ మెస్సీ మాయ...
- అర్జెంటీనాను గెలిపించిన సూపర్‌స్టార్ - ఇంజ్యూరీ టైమ్‌లో గోల్ - ఇరాన్‌పై 1-0తో విజయం - నాకౌట్ దశకు అర్హత బెలో హరిజాంట్: తనపై పెట్టుకున్న అంచనాలను నిజంచేస్తూ అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ మరోసారి మెరిశాడు. ‘డ్రా’ ఖాయమనుకుంటున్న దశలో మాయ చేశాడు. అద్భుత గోల్‌తో అర్జెంటీనాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ చివరి వరకు అర్జెంటీనా ఆధిపత్యాన్ని అద్భుతంగా అడ్డుకున్న ఇరాన్ ఆటగాళ్లకు ఏకైక గోల్‌తో నిరాశ మిగిల్చాడు. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో శనివారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో ఇరాన్‌పై విజయం సాధించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసిన అర్జెంటీనా ప్రిక్వార్టర్స్ దశకు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో బోస్నియాపై కీలకగోల్ చేసి అర్జెంటీనాను 2-1తో గెలిపించిన మెస్సీ ఈ మ్యాచ్‌లోనూ ఫలితాన్ని శాసించాడు. ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో మ్యాచ్ నిర్ణీత సమయానికి ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. కానీ 90+1వ నిమిషంలో ఇరాన్ డిఫెండర్లను, గోల్ కీపర్‌ను ఏమారుస్తూ మెస్సీ ఎడమకాలితో కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌లోనికి దూసుకెళ్లింది. అంతే డ్రాపై ఆశలు పెట్టుకున్న ఇరాన్ ఆటగాళ్లు ఒక్కసారిగా చతికిలపడ్డారు. మెస్సీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. - ఆరంభంలో ఇరాన్ కాసేపు దూకుడును ప్రదర్శించినా మ్యాచ్ సాగేకొద్దీ అర్జెంటీనా వేగంగా ఆడింది. ఎక్కువ భాగం బంతిని ఆధీనంలో పెట్టుకుని పదేపదే దాడులు చేసింది. - 4వ నిమిషంలోనే జెబెల్టా (అర్జెంటీనా) కొట్టిన డేంజర్ ఫ్రీ కిక్ బార్‌ను తాకుతూ పక్కకు దూసుకుపోయింది. - 5వ నిమిషంలో తొలి గోల్ చేసే అవకాశాన్ని అగురో (అర్జెంటీనా) జారవిడిచాడు. అతను కొట్టిన బంతిని ఇరాన్ ఆటగాళ్లు సమర్థంగా నిలువరించారు. - ఇరాన్ ఫార్వర్డ్స్తో వీరోచితంగా పోరాడిన మెస్సీ 11వ నిమిషంలో బంతిని అందుకున్నాడు. కానీ డి సర్కిల్ నుంచి అతను కొట్టిన షాట్‌ను డిజాగ్ అడ్డుకున్నాడు. - ఫెర్నాండో గగో, గోంజాలో సమయోచితంగా కదులుతూ 13వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్ వరకు తీసుకెళ్లినా లక్ష్యాన్ని చేరలేకపోయారు. ఆ తర్వాత ఇరుజట్లు పరస్పరం దాడులు చేసినా గోల్స్ మాత్రం నమోదు కాలేదు. - ఇరాన్ రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ 22వ నిమిషంలో అగురో ఇచ్చిన పాస్‌ను హిగుయాన్ కచ్చితమైన వేగంతో గోల్ పోస్ట్ వైపు పంపాడు. కానీ గోల్ కీపర్ హగిగి (ఇరాన్) అద్భుతంగా డైవ్ చేస్తూ రెండు చేతులతో బంతిని పక్కకు నెట్టేశాడు. దీంతో అర్జెంటీనా రెండో అవకాశం వృథా అయ్యింది. 42వ నిమిషంలో డిజాగ్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను హోసిని (ఇరాన్) హెడర్‌గా మల్చే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఎక్కువ ఎత్తులో బయటకు వెళ్లింది. ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 75 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న అర్జెంటీనా ఐదుసార్లు గోల్స్ కోసం ప్రయత్నం చేసి విఫలమైంది. - చిన్న చిన్న టచ్‌లతో ఇరాన్ డిఫెండర్లను తప్పుకుంటూ రోజో (అర్జెంటీనా) బంతిని గోల్‌పోస్ట్ వరకు తీసుకొచ్చాడు. కానీ సహచరులెవ్వరూ బంతిని అందుకోలేకపోయారు. - 50వ నిమిషంలో మెస్సీ చాలా దూరం నుంచి బంతిని అదుపు చేసుకుంటూ వచ్చినా సెంటర్ బ్యాక్ జబెల్టా (అర్జెంటీనా) టాప్ కార్నర్ నుంచి కొట్టిన షాట్ ఎక్కువ ఎత్తులో వైడ్‌గా వెళ్లింది. - తర్వాతి నిమిషంలో రోజో సంధించిన బంతిని మిడిల్లో అగురో తీసుకుని హెడర్‌గా మార్చే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అర్జెంటీనా వరుసగా దాడులు చేస్తూ ఒత్తిడి పెంచినా ఇరాన్ ఏమాత్రం తడబడలేదు. - 59వ నిమిషంలో సెంటర్ ఫీల్డ్ నుంచి మెస్సీ (అర్జెంటీనా) కొట్టిన షాట్ తక్కువ ఎత్తులో వైడ్‌గా దూసుకుపోతే... 64వ నిమిషంలో హజీ సాఫీ (ఇరాన్)షాట్ వృథా అయ్యింది. - 75వ నిమిషంలో డి మారియా (అర్జెంటీనా) కొట్టిన షాట్ రీ బౌండ్ అయినా హగిగ్ సమర్థంగా నిలువరించాడు. - 84వ నిమిషంలో రోడ్రిగో (అర్జెంటీనా) హెడర్‌ను గోల్ కీపర్ హగిగ్ అడ్డుకున్నాడు. - ఇక డ్రా అనుకుంటున్న సమయంలో మెస్సీ ఓ అద్భుతమైన షాట్‌తో మ్యాచ్‌ను అర్జెంటీనా వైపు తిప్పాడు. -
వాలెన్సియా మ్యాజిక్
హోండురస్‌పై 2-1తో ఈక్వెడార్ విజయం కురిటీబా: మిడ్ ఫీల్డర్ ఎన్నెర్ వాలెన్సియా రెండు గోల్స్‌తో రెచ్చిపోవడంతో ఈక్వెడార్‌కు టోర్నీలో తొలి విజయం దక్కింది. గ్రూప్ ఇలో భాగంగా శనివారం తెల్లవారు జామున హోండురస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈక్వెడార్ 2-1తేడాతో నెగ్గింది. అయితే ప్రపంచకప్ చరిత్రలో గెలుపు బోణీ చేయాలని ఎదురుచూస్తున్న హోండురస్.. 31వ నిమిషంలోనే స్ట్రయికర్ కార్లోస్ కాస్ట్లీ గోల్‌తో 1-0 ఆధిక్యం సాధించింది. కానీ 34వ నిమిషంలోనే ప్రత్యర్థి దూకుడు పెంచి స్కోరును సమం చేసింది. బంతిని ఆపేందుకు బాక్స్‌కు కుడి వైపు గోల్ కీపర్ చాలా ముందుకు వెళ్లగా అతడిని ఏమార్చిన వాలెన్సియా అతి సమీపం నుంచి గోల్ చేశాడు. 65వ నిమిషంలోనూ అయోవి ఫ్రీ కిక్‌ను ఆరు గజాల దూరం నుంచి వాలెన్సియా తీసుకుని రెండో గోల్‌ను చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. -
ఫ్రాన్స్ దూకుడు
నాలుగేళ్లలో ఎంత మార్పు.. ప్రస్తుతం ఫ్రాన్స్ జట్టు ప్రదర్శనను గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆ మెగా ఈవెంట్లో ఫ్రాన్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశలోనే అవమానకర రీతిలో నిష్ర్కమించింది. ఈసారి మాత్రం తమ లోపాలను పూర్తి స్థాయిలో సరిదిద్దుకుని మంచి సమతూకంతో బరిలోకి దిగి ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి దాదాపుగా నాకౌట్ దశకు చేరుకుంది. 5-2తో స్విట్జర్లాండ్‌పై ఘనవిజయం సాల్వెడార్: చాంపియన్ తరహా ఆటతీరుతో అదరగొడుతున్న ఫ్రాన్స్ వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో తమకన్నా మెరుగైన స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించి నాకౌట్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. గ్రూప్ ‘ఇ’ లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 5-2 తేడాతో ఫ్రాన్స్ గెలిచింది. 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మ్యాచ్‌లో ఐదు అంతకన్నా ఎక్కువ గోల్స్ సాధించడం ఫ్రాన్స్‌కు ఇదే తొలిసారి. మరోవైపు ఈ మైదానంలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్స్ వర్షం కురవడం విశేషం. నెదర్లాండ్స్ 5-1తో స్పెయిన్‌ను, జర్మనీ 4-0తో పోర్చుగల్‌ను ఇక్కడే మట్టికరిపించాయి. ఇదే స్థాయిలో ఫ్రాన్స్ కూడా ఆద్యంతం ఆధిపత్యం చూపుతూ స్విస్‌ను తేరుకోనీయలేదు. ఫ్రాన్స్ తరఫున గిరౌడ్, మటౌడి, వాల్బుయేనా, బెంజెమా, సిసోకో గోల్స్ సాధించగా స్విస్ తరఫున జెమైలి, జాకా చెరో గోల్ చేశారు. మ్యాచ్ ప్రారంభమైంది మొదలు ఫ్రాన్స్ ఆటగాళ్లు చెలరేగారు. దీంతో 17వ నిమిషంలోనే ఖాతా తెరిచింది. వాల్బుయేనా కొట్టిన కార్నర్ కిక్‌ను స్ట్రయికర్ ఒలివియర్ గిరౌడ్ అద్భుత రీతిలో హెడర్ గోల్ సాధించి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్‌కు ఇది వందో గోల్ కావడం విశేషం. దీన్నుంచి తేరుకునేలోపే స్విస్‌కు మరో షాక్ తగిలింది. సరిగ్గా 66 సెకన్ల (18వ ని.) అనంతరం స్విస్ పేలవ డిఫెన్స్‌ను సొమ్ము చేసుకుంటూ బెంజెమా అందించిన పాస్‌ను మటౌడీ గోల్ చేసి జట్టును ఆనందంలో ముంచెత్తాడు. ఇప్పటిదాకా ఈ టోర్నీలో అత్యంత స్వల్ప విరామంలో నమోదైన గోల్ ఇదే. 32వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో స్టార్ స్ట్రయికర్ బెంజెమా విఫలమయ్యాడు. స్విస్ గోల్‌కీపర్ బెనగ్లియో కుడి వైపునకు వంగి తక్కవ ఎత్తులో వచ్చిన బంతిని సులువుగానే ఒడిసిపట్టుకున్నాడు. అయితే స్విస్‌కు ఈ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. మరో ఎనిమిది నిమిషాల్లో(40వ ని.)నే గిరౌడ్ ఇచ్చిన పాస్‌ను ఆరు గజాల దూరం నుంచి వాల్బుయేనా గోల్‌గా మలిచి జట్టుకు 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ద్వితీయార్ధంలో స్విస్ ఆటగాళ్లు పోటీనిచ్చినప్పటికీ ఫ్రాన్స్‌ను గోల్స్ చేయకుండా ఆపలేకపోయారు. 67వ నిమిషంలో పోగ్బా ఇచ్చిన పాస్ ను బెంజెమా గోల్‌గా మలిచాడు. ఈ టోర్నీలో ఇది తనకు మూడో గోల్. 72వ నిమిషంలో బెంజెమా ఇచ్చిన పాస్‌ను సిసోకో గోల్ చేశాడు. చివర్లో ఆరు నిమిషాల వ్యవధి (81,87వ ని.)లో స్విట్జర్లాండ్‌కు రెండు గోల్స్ లభించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని కాస్త తగ్గించగలిగింది. -
అప్పుడు 'వాకా వాకా'.. ఇప్పుడు 'లా లా లా'..
-
ఓ కప్పు... పదిలక్షల ఉద్యోగాలను సృష్టించింది!
పుట్ బాల్ ప్రపంచకప్ పోటీలు బ్రెజిల్ లో పదిలక్షల ఉద్యోగాలను సృష్టించింది. ఫిఫా వరల్డ్ కప్ కారణంగా బ్రెజిల్ లో 12 నగరాల్లో పది లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. కేవలం ఉద్యోగాలకు పరిమితం కాకుండా 30 బిలియన్ల రియల్స్(13.4 బిలియన్ డాలర్) ఆదాయాన్ని సృష్టించి బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చిందని ఆర్ధిక పరిశోధక సంస్థ ఫైప్ ఓ నివేదికలో వెల్లడించింది. పది లక్షల ఉద్యోగాల్లో రెండు లక్షలు శాశ్వత ఉద్యోగాలు కాగా, మిగితావన్ని తాత్కాలికమైనవని నివేదికలో తెలిపారు. పుట్ బాల్ టోర్ని కారణంగా బ్రెజిల్ లోని 12 నగరాల్లో హోటళ్లు 45 మేరకు నిండిపోవడం సానుకూల అంశమన్నారు. ఫుట్ బాల్ పోటీలే కాకుండా 2016 లో బ్రెజిల్ ఒలంపిక్ క్రీడలకు ఆతిధ్యమివ్వడానికి సిద్దమవ్వడం ఆదేశ ప్రజలను ఆకర్షిస్తోంది. Follow @sakshinews -
కోస్టారికా జట్టు మరో సంచలన విజయం
-
హ్యాట్సాఫ్..స్వారెజ్
చెలరేగిన ఉరుగ్వే స్టార్ ఇంగ్లండ్‌పై 2-1తో గెలుపు స్కోరు బోర్డు ఉరుగ్వే : 2 స్వారెజ్ : 39వ, 85వ ని ఇంగ్లండ్ : 1 రూనీ: 75వ ని. నాలుగు వారాల క్రితం మోకాలికి ఆపరేషన్ జరిగినా... ప్రపంచకప్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అంతేనా... రెండు సంచలన గోల్స్‌తో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. అది కూడా మహామహులు ఉన్న ఇంగ్లండ్ జట్టుపై. తనెందుకు స్టార్ అయ్యాడో ఆటతోనే నిరూపించిన స్వారెజ్‌కు హ్యాట్సాఫ్..! సావో పాలో: స్టార్ అంటే ఇతడు.. ఆటంటే ఇదీ అన్నట్లుగా సాగిన స్వారెజ్ విజృంభణతో ప్రపంచకప్‌లో ఉరుగ్వే అద్భుత విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా గురువారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో గెలుపొంది నాకౌట్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది. 39వ, 85వ నిమిషాల్లో రెండు గోల్స్ నమోదు చేసిన స్వారెజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోగా, ఇంగ్లండ్ తరపున నమోదైన ఏకైక గోల్‌ను వేన్ రూనీ 75వ నిమిషంలో సాధించాడు. ► గాయంతో కోస్టారికాతో మ్యాచ్‌కు దూరమైన స్వారెజ్ రాకతో సహా మొత్తం ఐదు మార్పులతో ఉరుగ్వే బరిలోకి దిగింది. ► 9వ నిమిషంలో ఇంగ్లండ్‌కు ఫ్రీ కిక్ లభించినా, దాన్ని గోల్‌గా మలచడంలో రూనీ విఫలమయ్యాడు. 14వ నిమిషంలో ఉరుగ్వేకూ ఈ అవకాశం లభించగా సక్సెస్ కాలేకపోయింది. ► అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు పలుమార్లు బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నా గోల్ మాత్రం చేయలేకపోయాయి. 31వ నిమిషంలో గెరార్డ్ ఇచ్చిన పాస్‌ను రూనీ.. హెడర్‌గా మలిచినా బంతి గోల్‌పోస్ట్ పోల్‌కు తగిలి బయటికి వెళ్లింది. ► మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో 39వ నిమిషంలో స్వారెజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ రక్షణ పంక్తిని ఛేదించుకుంటూ కవాని అందించిన బంతిని స్వారెజ్ తలతో గోల్‌పోస్ట్‌లోకి పంపించి ఉరుగ్వే శిబిరంలో ఆనందం నింపాడు. ► 41వ నిమిషంలో రూనీ అందించిన పాస్‌తో స్టరిడ్జ్ షాట్ సంధించినా గోల్‌కీపర్ ముస్లేరా అడ్డుకోవడంతో స్కోరును సమం చేసే అవకాశాన్ని ఇంగ్లండ్ కోల్పోయింది. ఆ తరువాత మరో గోల్ నమోదు కాకపోగా ఉరుగ్వే 1-0 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది. ► 49వ నిమిషంలో ఉరుగ్వేకు మరో అవకాశం లభించింది. అయితే స్వారెజ్ సంధించిన కార్నర్ కిక్ ను ఇంగ్లండ్ గోల్‌కీపర్ హార్ట్ అడ్డుకున్నాడు. ► ఆ తరువాత ఇంగ్లండ్ ఆటగాళ్లు పలుమార్లు ఉరుగ్వే డిఫెన్స్‌ను దాటుకుంటూ గోల్ కోసం చేసిన ప్రయత్నాలను ముస్లేరా వమ్ముచేశాడు. అయితే 75వ నిమిషంలో డిఫెండర్ గ్లెన్ జాన్సన్ పెనాల్టీ ఏరియాలోకి పంపించిన బంతిని రూనీ గోల్‌గా మలచడంతో ఇంగ్లండ్ 1-1తో స్కోరును సమం చేసింది. రూనీకి ఇది తొలి ప్రపంచకప్ గోల్ కాగా, ఇంగ్లండ్ తరపున 40వ గోల్. ► 78వ నిమిషంలో స్టరిడ్జ్ చేసిన మరో ప్రయత్నాన్ని ముస్లేరా అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది. అయితే మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా స్వారెజ్ మళ్లీ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ డిఫెండర్లకు అందకుండా బంతిని వేగంగా తీసుకొచ్చి గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ నెట్లోకి పంపించాడు. ఆ తరువాత ఇంగ్లండ్ పోరాటం వృథా కాగా, ఉరుగ్వే సంబరాల్లో మునిగిపోయింది. ‘సహచరులను’ ఓడించాడు! ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో స్వారెజ్ లివర్‌పూల్‌కు ఆడతాడు. ఈ ఏడాది అత్యధికంగా 31 గోల్స్ చేసి లీగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అదే ప్రపంచకప్‌లోనూ కొనసాగించి ఇంగ్లండ్ ఆశలపై నీళ్ల్లుజల్లాడు. లివర్‌పూల్‌కు ఆడుతున్న 8 మంది అతడి సహచరులు ఇంగ్లండ్ జాతీయ జట్టులో ఉండటం విశేషం. అతను గోల్ చేస్తే గెలిచినట్టే ప్రపంచకప్‌లో స్వారెజ్ గోల్ సాధించాడంటే ఉరుగ్వే జట్టు గెలిచినట్లే. గత ప్రపంచకప్ నుంచి ఇది రుజువవుతూ వస్తోంది. 2010లో ఉరుగ్వే రెండు మ్యాచ్‌ల్లో గెలవగా.. రెండింట్లోనూ స్వారెజ్ గోల్సే గెలిపించాయి. ఉరుగ్వే 1-0తో గెలిచిన మెక్సికోపై ఏకైక గోల్, 2-1తో కొరియాపై నెగ్గిన మ్యాచ్‌లో రెండు గోల్స్ స్వారెజ్ సాధించినవే. తాజా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 2-1తో ఉరుగ్వే గెలిచిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌నూ స్వారెజే సాధించడం విశేషం. నీ వల్లే.. నీ వల్లే... ఇంగ్లండ్‌పై రెండు గోల్స్ సాధించి ఉరుగ్వే విజయానికి కారణమైన స్వారెజ్... తాను మళ్లీ రాణించడానికి భార్య సోఫియానే కారణమంటున్నాడు. వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు తన వెన్నంటే నిలిచిన సోఫియాకు వీడియో చాటింగ్‌లో స్వారెజ్ థాంక్యూ చెప్పాడు. ఈ విజయంలో తన పిల్లలు, తల్లి పాత్ర కూడా ఉందన్నాడు. జూనియర్ రూనీ ఏడ్చాడు... రూనీ తన తొలి ప్రపంచకప్ గోల్ చేసినా అతని కుమారుడు మాత్రం కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంగ్లండ్ ఓడిపోవడంతో జూనియర్ రూనీ వెక్కివెక్కి ఏడ్చాడు. -
జపాన్-గ్రీస్ మ్యాచ్ డ్రా
నాటల్: ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్-గ్రీస్ మధ్య జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాటల్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కీలకమైన ఈ పోరులో 38వ నిమిషంలో రిఫరీ రెడ్ కార్డ్ చూపడంతో గ్రీస్ కెప్టెన్ కోన్స్టాన్టినోస్ మైదానం విడిచి వెళ్లాల్సి వచ్చింది. గ్రీస్ పదిమందితోనే ఆడినా జపాన్ వచ్చిన అవకాశాల్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైంది. జపాన్ 11 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. అయితే వాటిని గ్రీస్ అడ్డుకుంది. మొత్తానికి జపాన్ బంతిని (68 శాతం) తమ ఆధీనంలోనే ఉంచుకున్నా ఆశించిన ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. నాకౌట్‌కు కొలంబియా జపాన్-గ్రీస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడం కొలంబియాకు కలిసొచ్చింది. గ్రీస్, ఐవరీకోస్ట్లపై విజయాలతో ఆరు పాయింట్లను సొంతం చేసుకున్న ఈ దక్షిణ అమెరికా జట్టు గ్రూప్ ‘సి’ నుంచి నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే ఈ గ్రూప్ నుంచి ఐవరీ కోస్ట్ తో పాటు జపాన్, గ్రీస్ జట్లు కూడా నాకౌట్‌కు చేరే అవకాశాలున్నాయి. 24న జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌ల్లో జపాన్ జట్టు కొలంబియాతో, గ్రీస్ జట్టు ఐవరీకోస్ట్‌తో తలపడతాయి. ఇందులో జపాన్, గ్రీస్ గెలిస్తే నాకౌట్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఐవరీ కోస్ట్ గెలిస్తే జపాన్, గ్రీస్ జట్లు గ్రూప్ దశలోనే వెనుదిరుగుతాయి. గ్రూప్ ‘సి’ పాయింట్ల పట్టిక జ. ఆ.మ్యా. గె. ఓ. డ్రా. పా. కొలంబియా 2 2 0 0 6 ఐవరీకోస్ట్ 2 1 0 1 3 జపాన్ 2 0 1 1 1 గ్రీస్ 2 0 1 1 1 నోట్: జ:జట్లు; ఆ.మ్యా: ఆడిన మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి; పా: పాయింట్లు. -
మారథాన్ శృంగారం!
ఈ ఫొటోలో లైన్ చూశారా... వీళ్లంతా సాకర్ టిక్కెట్ల కోసం నిలబడలేదు. ఓ పోర్న్‌స్టార్ ఇచ్చిన ‘ఆఫర్’ కోసం క్యూ కట్టారు. ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌పై తమ జట్టు విజయం సాధిస్తే ట్విట్టర్లో తనను ఫాలో అవుతున్న వారితో 16 గంటల పాటు శృంగారం చేస్తానని చిలీ పోర్న్ స్టార్ మార్లెన్ డాల్ ప్రకటించింది. అంతే 2-0తో స్పెయిన్‌పై విజయం సాధించిన వెంటనే ఆమె ఇంటిముందు జనం ఇలా క్యూ కట్టారు. మారథాన్ శృంగారం సాధ్యమేనా అని చర్చించుకుంటున్న సమయంలోనే ఆమె తన మాటను నిలబెట్టుకుంటూ ర్యాండమ్‌గా శృంగారం చేసింది. ఈ ప్రపంచకప్‌లో డాల్ ఇలా బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇది రెండోసారి. అంతకుముందు తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై చిలీ విజయం తర్వాత తన ఫోలోవర్స్‌తో 12 గంటల పాటు శృంగారంలో పాల్గొంది. ఆమెతో శృంగారం చేసేందుకు మహిళలు కూడా క్యూలో నిల్చోవడం ఈ బంపర్ ఆఫర్లో కొసమెరుపు. -
సావో పాలోలో అల్లర్లు
సావో పాలో: ప్రపంచకప్ మ్యాచ్‌లను తిలకించేందుకు తమకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాలన్న డిమాండ్‌తో తీసిన ర్యాలీలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ‘ఫ్రీ ఫేర్’ అనే నినాదంతో 13 వందల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే కొంత మంది ముసుగులు ధరించిన వ్యక్తులు బ్యాంక్‌లు, జర్నలిస్ట్‌లపై దాడికి దిగారు. గురువారం ఇంగ్లండ్, ఉరుగ్వే మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రశాంతంగా సాగుతున్న ర్యాలీ... ముసుగు వ్యక్తుల కారణంగా అకస్మాత్తుగా అల్లర్లకు దారి తీసిందని నిర్వాహకులు తెలిపారు. అయితే కొంత మంది నిరసనకారులు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఓ బ్రాడ్‌కాస్టింగ్ యూనిట్‌కు సంబంధించిన కెమేరామెన్‌ని ముసుగు వ్యక్తులు పరుగెత్తించడం టీవీ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. -
ఇంగ్లండ్ ఔట్
కోస్టారికా చేతిలో ఇటలీ ఓటమితో గ్రూప్ ‘డి’లో సమీకరణాలు మారిపోయాయి. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన మాజీ చాంపియన్ ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టాల్సివచ్చింది. తొలిమ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలవడంతో ఈజీగా ప్రిక్వార్టర్స్‌కు చేరుతుందనుకున్న ఇటలీ కూడా పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్రూప్ నుంచి రెండో జట్టుగా నాకౌట్‌కు అర్హత పొందేందుకు ఇక ఉరుగ్వేతో 24న జరగనున్న చివరి మ్యాచ్ కీలకం. ఉరుగ్వే కన్నా మెరుగైన గోల్స్ సగటు ఉన్నందున ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ఇటలీ నాకౌట్‌కు చేరుతుంది. ఉరుగ్వే మాత్రం గెలవాల్సిందే. గ్రూప్ ‘డి’ పాయింట్ల పట్టిక జ. ఆ.మ్యా. గె. ఓ. డ్రా. పా. కోస్టారికా 2 2 0 0 6 ఇటలీ 2 1 1 0 3 ఉరుగ్వే 2 1 1 0 3 ఇంగ్లండ్ 2 0 2 0 0 నోట్: జ:జట్లు; ఆ.మ్యా: ఆడిన మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి; పా: పాయింట్లు. -
నాకౌట్‌కు కోస్టారికా
టలీపై 1-0తో సంచలన విజయం రెసిఫే: కోస్టారికా జట్టు ప్రపంచకప్‌లో మరో సంచలన విజయం సాధించింది. ఉరుగ్వేపై తమ తొలి మ్యాచ్‌లో గెలుపు గాలివాటం కాదని నిరూపిస్తూ శుక్రవారం మాజీ చాంపియన్ ఇటలీని 1-0తో మట్టి కరిపించింది. 44వ నిమిషంలో కెప్టెన్ బ్రయాన్ రూయిజ్ చేసిన గోల్‌తో టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలివుండగానే గ్రూప్ ‘డి’ నుంచి మొదటి జట్టుగా నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. 1990లో ప్రి క్వార్టర్స్‌కు చేరడం మినహా ప్రపంచకప్‌లో మరెప్పుడూ గ్రూప్ దశ దాటని కోస్టారికా.. ఈ మ్యాచ్‌లో ఇటలీకి ఆరంభం నుంచీ గట్టిపోటీ ఇచ్చింది. ఇటలీని తొలిమ్యాచ్‌లో గెలిపించిన బలోటెలి, ఆండ్రియా పిర్లో వంటి ఆటగాళ్ల దూకుడుకు కళ్లెం వేస్తూ నిలువరించింది. పలుమార్లు గోల్పోస్ట్పైకి చేసిన దాడుల్ని కోస్టారికా గోల్‌కీపర్ కేలర్ నవాస్ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. మరో నిమిషంలో ప్రథమార్ధం ముగుస్తుందనగా 44వ నిమిషంలో డయాస్ ఇచ్చిన పాస్‌ను రూయిజ్ చాకచక్యంగా హెడర్ గోల్‌గా మలిచి కోస్టారికాకు ఆధిక్యాన్నందించాడు. అనంతరం ద్వితీయార్థంలో 53వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను ఇటలీ ఆటగాడు పిర్లో అద్భుత షాట్‌గా మలిచినా.. నవాస్ మరోసారి దాన్ని తిప్పికొట్టి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ తరువాత ఇటలీకి మరో అవకాశమే రాలేదు.