
బ్రెజిల్ వెంటే బాలీవుడ్
న్యూఢిల్లీ: బాలీవుడ్‌కు ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచకప్ మేనియా పట్టుకుంది. సూపర్‌స్టార్లు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ సహా చాలామంది నటీనటులు బ్రెజిల్‌ను తమ ఫేవరెట్‌గా చెప్పుకుంటున్నారు. కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా వీక్షించినట్టే బాలీవుడ్ కూడా అదే స్థాయిలో ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేసింది. మ్యాచ్ ముగియగానే అమితాబ్ ‘బ్రెజిల్...’ అంటూ ట్వీట్ చేయగా మ్యాచ్‌కు ముందు కూడా ‘బ్రెజిల్ , కొలంబియా మ్యాచ్ జరుగబోతోంది.
ఎవరూ నన్ను డిస్ట్రబ్ చేయవద్దు’ అని ట్వీట్ చేశాడు. మ్యాచ్ జరుగుతుంగా బ్రెజిల్ గెలిచే అవకాశాలున్నాయని షారుఖ్ ట్వీట్ చేశాడు. ‘డేవిడ్ లూయిజ్ సూపర్ గోల్ చేశాడు. అలాగే రొడ్రిగ్వేజ్‌కు అందరూ అభినందనలు తెలపాలి’ అంటూ నటుడు రాహుల్ బోస్ ట్విట్టర్‌లో తెలిపాడు. అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్‌లు కూడా తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.