soccer
-
మొసలి దాడిలో ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారుడు మృతి
కోస్టారికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్(29) ప్రమాదవశాత్తు మొసలి దాడిలో ప్రాణాల కోల్పోయాడు. కోస్టారికాలోని కానస్ నదిలో ఈ ఘటన జరిగింది. వ్యాయామం చేస్తూ ఫిషింగ్ బ్రిడ్జ్ నుంచి ఓర్టిజ్.. నదిలో దూకాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నదిలో మొసళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ క్రీడాకారుడు నదిలో దూకినట్లు పేర్కొన్నారు. ఓర్టిజ్ కానస్ నదిలో దూకగానే భారీ పరిమాణంలో ఉన్న మొసలి అతన్ని నీటిలోకి లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కోస్టారికా రాజధాని సాన్ జోసెకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓర్టిజ్ని మొసలి నదిలోకి లాక్కెళ్లిన భయానక దృశ్యాలు తమను ఇంకా వెంటడాతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓర్టిడ్ ప్రముఖ డిపోర్టివో రియో కానాస్ క్లబ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కోస్టారికాకు చెందిన అసెన్సో లీగ్‌లో కూడా ఆయన కనిపించారు. సంబంధిత ఫేస్బుక్ పోస్టు ఆధారంగా ఓర్టిజ్ మరణాన్ని ఈ మేరకు జట్టు నిర్దారించింది. జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్ మరణంతో తమ జట్టు శోకసంద్రంలో మునిగినట్లు పేర్కొంది. ఓర్టిజ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరింది. 'ఆటగాడిగా, కోచ్‌గా నీ సేవలు మరవలేనివి. భౌతికంగా లేకపోయినా.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు' అని జట్టు తమ ఫేస్బుక్ పోస్టులో ఓర్టిజ్‌ను ఉద్దేశించి సంతాపం తెలిపింది. ఓర్టిజ్ శరీరాన్ని వెలికితీయడానికి స్థానిక యంత్రాంగం ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. -
'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!'
ఫుట్‌బాల్ హెడ్బట్స్ షాట్ ఆడడం కామన్. ఈ క్రమంలో గాయాలు కావడం సహజం. కానీ ఉద్దేశపూర్వకంగా ఆటగాళ్లను గాయపరిచేలా హెడ్బట్స్ షాట్ కొడితే మాత్రం తప్పు కిందే లెక్క. తాజాగా మహిళల ఫుట్‌బాల్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏఎఫ్ఏ మహిళల సాకర్ టోర్నమెంట్లో భాగంగా రేసింగ్, ఎల్ పొర్వినిర్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఎల్ పొర్వినిర్ ఆధిపత్యం చూపిస్తుంది. ఇది తట్టుకోని రేసింగ్ ఢిపెండర్ మారియా బెలెన్ తర్బోడా ఎదురుగా వస్తున్న లుడ్మిలా రమ్రెజ్ ముఖాన్ని తన తలతో ఒక్క గుద్దు గుద్దింది. దీంతో రమ్రెజ్ కిందపడిపోయింది. ఆమె నుదుటి చిట్లి రక్తం కారింది. ఇది గమనించిన రిఫరీ పరిగెత్తుకొచ్చి ఏదో పొరపాటులో జరిగిందేమో అనుకొని ఎల్లో కార్డ్ చూపించింది. ఇదే సమయంలో రమ్రెజ్ మొహం రక్తంతో నిండిపోయింది. ఇది గమనించిన రిఫరీ ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ప్లేయర్ తలను పగులగొట్టినందుకు గాను మారియా బెలెన్కు రెడ్‌కార్డ్ చూపించింది. ఇది సహించని మారియా కాసేపు వాగ్వాదానికి దిగింది. రిఫరీ తన రెడ్కార్డ్కే కట్టుబడి ఉండడంతో చేసేదేం లేక మైదానాన్ని వీడింది. ఆ తర్వాత ఎల్ పొర్వినిర్కు వచ్చిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకొని గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లడమే గాక మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ''ఇది కచ్చితంగా కావాలని చేయలేదు.. మనసులో ఏదో పెట్టుకొనే ఈ పని చేసినట్లుంది'' అని కామెంట్ చేశారు. ¡UFFFF, TREMENDO CHOQUE! 💥 Por este cabezazo a destiempo sobre Ludmila Ramírez fue expulsada María Belén Taborda. 🟨 En primera instancia, la árbitra Estefanía Pinto amonestó, pero luego rectificó su sanción.🟥 Con 10 Racing ante El Porvenir.#FUTBOLenDEPORTV | @YPFoficial pic.twitter.com/rd15TdGQnO — DEPORTV (@canaldeportv) May 23, 2023 ¡SE GRITA EN GERLI! ⚽️ Apareció Karina 'Chicho' Merlo con un potente tiro libre para adelantar a @elporvenirfem 1-0 sobre Racing. #FUTBOLenDEPORTV | @YPFoficial pic.twitter.com/vIqe9i9kTN — DEPORTV (@canaldeportv) May 23, 2023 చదవండి: ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా? -
Indonesia: మైదానంలో విషాద క్రీడ
మలాంగ్(ఇండోనేషియా): ప్రపంచ క్రీడా చరిత్రలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సాకర్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు పోలీసులు సహా 125 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఓడిపోయిన జట్టు మద్దతుదారులు క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి ఆగ్రహావేశాలతో ఘర్షణకు దిగడం రణరంగానికి దారితీసింది. ఇండోనేషియాలో తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్ సిటీలో కంజురుహాన్ స్టేడియంలో శనివారం ఈ దారుణం జరిగింది. ఇప్పటిదాకా 125 మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా ప్రేక్షకులు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భాష్పవాయువు ప్రయోగంతో అలజడి కంజురుహాన్ స్టేడియంలో తూర్పు జావాకు చెందిన అరెమా ఎఫ్ఎస్ జట్టు, సురబయాకు చెందిన పెర్సిబయా జట్టుకు మధ్య శనివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. 32,000 మంది ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వీరంతా అతిథ్య జట్టు అరెమా ఎఫ్ఎస్ మద్దతుదారులే. పెర్సిబయా జట్టు చేతిలో అరెమా జట్టు 3–2 తేడాలో ఓటమి పాలయ్యింది. ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. క్రీడాకారులపై, సాకర్ అధికారులపై నీళ్ల సీసాలు, చేతిలో ఉన్న వస్తువులు విసిరారు. దాదాపు 3,000 మంది బారికేడ్లు దాటుకొని ప్రధాన మైదానంలోకి ప్రవేశించారు. అరెమా జట్టు మేనేజ్మెంట్తో ఘర్షణకు దిగారు. సొంత గడ్డపై 23 ఏళ్లుగా విజయాలు సాధిస్తున్న అరెమా టీమ్ ఇప్పుడెందుకు ఓడిపోయిందో చెప్పాలంటూ నిలదీశారు. అరుపులు కేకలతో హోరెత్తించారు. మరికొందరు స్టేడియం బయటకువెళ్లి, అక్కడున్న పోలీసు వాహనాలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. భాష్పవాయువు గోళాలు స్టేడియంలోకి సైతం దూసుకెళ్లాయి. స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు భయాందోళనకు గురయ్యారు. బాష్పవాయువును తప్పించుకోవడానికి అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట మొదలయ్యింది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడని పరిస్థితి. స్టేడియంలోనే 34 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రులకు తరలిస్తుండగా కొందరు, చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనతో ఇండోనేషియా సాకర్ అసోసియేషన్ ప్రీమియర్ సాకర్ లీగ్ లిగా–1ను నిరవధికంగా వాయిదా వేశారు. ఇదే చివరి విషాదం కావాలి: జోకో విడోడో ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరగడం, 125 మంది మరణించడం పట్ల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఇదే చివరి క్రీడా విషాదం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాటి దారుణాలు జరగకూడదని కోరుకుంటున్నట్లు వివరించారు. ప్రజలంతా క్రీడాస్ఫూర్తిని పాటించాలని, మానవత్వం, సోదరభావాన్ని కలిగి ఉండాలని కోరారు. మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కీడ్రలు, యువజన శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు జోకో విడోడో ఆదేశాలు జారీ చేశారు. ఇండోనేషియా సాకర్ ప్రతిష్టకు మచ్చ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాకర్ మ్యాచ్‌లకు తాము సన్నద్ధం అవుతున్న తరుణంలో స్టేడియంలో అభిమానులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఇండోనేషియా క్రీడలు, యువజన శాఖ మంత్రి జైనుదిన్ అమాలీ చెప్పారు. ఈ ఘటన తమ దేశ సాకర్ క్రీడా ప్రతిష్టను మసకబార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మే 20 నుంచి జూన్ 11 వరకు జరిగే ఫీఫా యూ–20 ప్రపంచ కప్‌నకు ఇండోనేషియా అతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. నిజానికి ప్రపంచ సాకర్ క్రీడా సమాఖ్య ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం స్టేడియంలో బాష్పవాయువు ప్రయోగించకూడదు. దేశీయంగా జరిగే క్రీడలపై ఫిఫా నియంత్రణ లేకపోవడం కొన్నిసార్లు పరిస్థితి అదుపు తప్పుతోంది. ఆట చూసేందుకు వచ్చి అనంత లోకాలకు.. ప్రపంచ క్రీడాలో చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నో విషాదాలు చోటుచేసుకున్నాయి. మైదానాలు రక్తసిక్తమయ్యాయి. ఆట చూసి ఆనందించేందుకు వచ్చిన అభిమానులు విగతజీవులయ్యారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మారారు. విషాదాలు కొన్ని.. 1979 డిసెంబర్ 3: అమెరికాలోని సిన్సినాటీలో రివర్‌ఫ్రంట్ మైదానంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు. 1980 జనవరి 20: కొలంబియాలోని సిన్సిలెజె పట్టణంలో బుల్‌ఫైట్ కోసం తాత్కాలికంగా కర్రలతో నిర్మించిన నాలుగు అంతస్తుల స్టేడియం కూలిపోయింది. ఈ ఘటనలో 200 మంది బలయ్యారు. 1988 మార్చి 13: నేపాల్‌లోని ఖాట్మాండు స్టేడియంలో సాకర్ మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా వడగళ్ల వాన మొదలయ్యింది. స్టేడియంలో తొక్కిసలాట జరిగి 93 మంది చనిపోయారు. 1989 ఏప్రిల్ 15: ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌లో హిల్స్‌బరో స్టేడియంలో అభిమానుల నడుమ ఘర్షణ జరిగింది. 97 మంది మరణించారు. 1996 అక్టోబర్ 16: గ్వాటెమాలాలోని గ్వాటెమాలా సిటీలో సాకర్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్వాటెమాలా, కోస్టారికా అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 84 మంది విగత జీవులుగా మారారు. 2001 మే 9: ఘనా రాజధాని అక్రాలో స్టేడియంలో ఘర్షణ, అనంతరం తొక్కిసలాట. 120 మందికిపైగా ప్రేక్షకులు బలయ్యారు. -
'కోచ్ ఇబ్బంది పెడుతున్నారు.. తట్టుకోలేకపోతున్నాం'
కోచ్‌తో ఉన్న ఇబ్బంది కారణంగా 15 మంది మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు జట్టు నుంచి వైదొలగడం కలకలం రేపింది. స్పెయిన్ ఫుట్‌బాల్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ కోచ్‌గా జార్జ్ విల్డా వ్యవహరిస్తున్నాడు. తమ ఆరోగ్యంపై, మానసిక పరిస్థితిపై ప్రభావం చూపేలా కోచ్ విల్డా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మహిళా ప్లేయర్లు ఆరోపించారు. తమ సమస్యలకు ప్రధాన కారణం కోచ్ విల్డా అంటూ స్పానిష్ సాకర్ ఫెడరేషన్‌కు ఈ-మెయిల్ పంపారు. కోచ్‌పై వేటు వేయాలని స్పష్టంగా పేర్కొనలేదు కానీ అతని వల్ల ఇబ్బంది కలుగుతుందని మాత్రం లేఖలో వెల్లడించారు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చేంతవరకు జట్టుకు దూరంగా ఉంటామని 15 మంది తేల్చి చెప్పారు. కాగా కోచ్ విల్డా పనితీరుపై సంతృప్తిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిసింది. ఇంతకముందు కూడా మీడియా సమావేశంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు. మరోవైపు తమకు ఎలాంటి లేఖ, ఈ-మెయిల్ అందలేదని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ పేర్కొంది. కోచ్ విల్డా మహిళా ప్లేయర్లను ఇబ్బందికి గురిచేసినట్లు.. లైంగిక వేధింపుల పాల్పడినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. కోచ్ విల్డాకు క్షమాపణ చెప్పేవరకు 15 మంది మహిళా ప్లేయర్లను జట్టులోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కాగా స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు వచ్చే నెల 7న స్వీడన్, 11న అమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లకు ఆడే జట్టును కోచ్ విల్డానే ఎంపిక చేయాల్సి ఉంది. చదవండి: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటి పర్యంతం బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా -
ఈ పిల్లలు మన పిల్లలు కాదా?
మన పిల్లలు స్కూళ్లకు వెళతారు. ఆపై ఉద్యోగాలకు వెళతారు. ఆపై జీవితాల్లో స్థిరపడతారు. కాని సమాజం ఒక కుటుంబం అనుకుంటే ఇవన్నీ దక్కని పిల్లలున్న భారతదేశం ఒకటి ఉంది. అది మురికివాడల భారతదేశం. ‘వాళ్లూ మన పిల్లలే. వాళ్లను ఇలాగే వదిలేస్తామా?’ అంటాడు అమితాబ్ ‘ఝండ్’లో. వ్యసనాలతో బాధ పడుతూ నేరాలు చేస్తూ జైళ్ల పాలవుతూ వీరు పడే సలపరింతకు సమాజానిదే బాధ్యత. వారి కోసం పట్టించుకుందాం అని గట్టిగా చెప్పిన ఝండ్ ఈవారం సండే సినిమా. ‘ప్రపంచ మురికివాడల సాకర్ కప్’కి ఇండియా టీమ్‌కు ఆహ్వానం అందుతుంది. ఆ టీమ్‌లో ఉన్నది ఎవరు? చెత్త ఏరుకుని జీవించే మురికివాడల పిల్లలు, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం వల్ల చదువుకోలేకపోయిన ఆడపిల్లలు, కుటుంబ కష్టాల్లో ఉన్న మైనారిటీలు, రైళ్లలో బొగ్గు దొంగతనం చేసే దొంగలు, సారాయి బానిసలు, వైటనర్‌ను పీల్చే వ్యసనపరులు... వీళ్లంతా మహా అయితే 20 ఏళ్ల లోపు వారు. ఒక రకంగా వారి జీవితం నాశనమైపోయింది. కాని వారికి ఒక్క చాన్స్ ఇవ్వదలిస్తే? ఆ ఒక్క చాన్సే ‘వరల్డ్ హోమ్‌లెస్ సాకర్ కప్’లో పాల్గొనడమే అయితే... ఆహ్వానం అందింది కాని మరి అందుకు పాస్‌పోర్ట్‌లు? పాస్‌పోర్ట్ పొందడం ఈ దేశంలో కొంతమందికి ఎంత కష్టమో దర్శకుడు ఈ సినిమా లో వివరంగా చూపిస్తాడు. కొందరి దగ్గర పాస్‌పోర్ట్‌కు అప్లై చేయడానికి ఏ కాగితమూ ఉండదు. ఒకడికి పాస్‌పోర్ట్ ఇవ్వడానికి వాడి మీద ఉండే పోలీస్కేసు అడ్డంకిగా మారుతుంది. ఆ వంకతో వాడికి పాస్‌పోర్ట్ ఇవ్వడం మానేస్తే వాడు సమాజం మీద మరింత ద్వేషం పెంచుకుంటాడు. తనను తాను మరింతగా ధ్వంసం చేసుకుంటాడు. అందుకే వాడికి పా‹స్పోర్ట్ ఇప్పించేందుకు తానే జడ్జి ముందు మొరపెట్టుకుంటాడు ఫుట్‌బాల్ కోచ్ అయిన అమితాబ్. ‘మన కళ్లెదురుగా ఉన్నదే మనకు తెలిసిన భారతదేశం కాదు. మనం చూడని భారతదేశం ఒకటి ఉంది. దానిని చూడకుండా మన కళ్లకు అడ్డుగా ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడ అవతల ఎంతోమంది బాల బాలికలు దీనమైన బతుకులు బతుకుతున్నారు. సమాజం పట్టించుకోకపోవడం వల్ల అరాచకంగా మారి సమాజం దృష్టిలో మరింత చెడ్డ అవుతున్నారు. ఈ పిల్లలు అద్భుతంగా ఫుట్‌బాల్ ఆడుతున్నారు. వీరు ఇలాంటి ఆటల్లో పడితే, వ్యసనాల నుంచి బయటపడి ఒక అర్థవంతమైన బతుకు బతుకుతారు’ అంటాడు అమితాబ్. ఝండ్ (గొడ్ల గుంపు. స్లమ్ పిల్లల ఫుట్‌బాల్ టీమ్‌ను కనీసం టీమ్ అనైనా పిలవకుండా గొడ్లగుంపు అని పిలుస్తారు డబ్బున్నవాళ్లు ఈ సినిమాలో) మార్చి 4న విడుదలైంది. అమితాబ్ ప్రధాన పాత్రలో నటించాడు. మిగిలిన వాళ్లలో చాలామంది స్లమ్ కుర్రాళ్లు నటించారు. మరాఠీలో ‘సైరాట్’ తీసి భారీ పేరు గడించిన దర్శకుడు నాగరాజ్ మంజులే ఈ సినిమాతో కూడా ప్రశంస లు అందుకుంటున్నాడు. ఈ సినిమాను నాగ్‌పూర్‌కు చెందిన విజయ్ బర్సే అనే టీచర్ జీవితం ఆధారంగా తీశారు. ఆ పాత్రనే అమితాబ్ పోషించాడు. నాగ్‌పూర్‌లో ఒక కాలేజ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసిన విజయ్ బర్సే ఆ పక్కనే ఉండే మురికివాడల్లోని పిల్లలు అద్భుతంగా ఫుట్‌బాల్ ఆడటం చూసి వారికోసం ‘స్లమ్ సాకర్ క్లబ్’లను స్థాపించాడు. వారికి కొత్త జీవితం ప్రసాదించాడు. అందుకు తగ్గట్టుగా ‘ఝండ్’ మొత్తం సినిమాను నాగ్‌పూర్‌లో తీశారు. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఇది నాగ్‌పూర్‌కు చెందినది మాత్రమే కాదని, దేశంలో ఉన్న ఏ మురికివాడకు చెందిన కథేనేమోనని అనిపిస్తుంది. ముఖ్యంగా పాత్రలను మురికివాడల నుంచే తీసుకోవడం వల్ల వారి బతుకు తీవ్రమైన వేదన కలిగిస్తుంది. మర్యాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న మధ్యతరగతి, ధనిక వర్గాలతో పోలిస్తే వారి జీవితంఘోరంగా ఉంటుంది. సమాజపు ఫలాలకు వారూ హక్కుదారులే. వారూ దేశం బిడ్డలే. వారూ అందరిలాంటి పిల్లలే. వారి కోసం ఎందుకు సమాజం ఆలోచించదు? ఎందుకు వారిని ఈసడించుకుని పదే పదే వారిని మరింత నిరాశలోకి తిరుగుబాటులోకి నెడుతుంది అనిపిస్తుంది. ఈ కథలో నాగ్‌పూర్‌లోని ఒక మధ్యతరగతి కాలనీని ఆనుకుని ఉండే మురికివాడలోని పిల్లలకు ఆ మధ్యతరగతి కాలనీలో నివసించే అమితాబ్ దగ్గర అవుతాడు. అప్పటికే వాళ్లు అరాచకంగా ఉంటారు. వారికి జీవితం మీద ఏ ఆశా లేదు. వారికి ఫుట్‌బాల్ ఆడితే డబ్బు ఇస్తూ ఆ ఆట మీద మోజు కలిగిస్తాడు. మెల్లమెల్లగా వారికి ఆ ఆట నిజమైన నషాగా మారుతుంది. అందరూ ఆటగాళ్లు అవుతారు. అప్పుడు అమితాబ్ తన కాలేజీలో దేశంలోని అన్ని మురికివాడల టీమ్‌లను పిలిపించి జాతీయ టోర్నమెంట్ ఆడిస్తాడు. ఆ తర్వాత ఈ టీమ్లన్నింటి నుంచి ఒక టీమ్ తయారు చేసి వరల్డ్‌కప్‌కు తీసుకువెళతాడు. అయితే ఆ మొదలు నుంచి ఈ చివరకు మధ్య ఎన్నో బరువెక్కే సన్నివేశాలు. కన్నీటి గాధలు. నిస్సహాయ క్షణాలు. సామాజిక చైతన్యం కలిగించే ఇటువంటి కథలకు హిందీలో పెద్ద పెద్ద స్టార్లు మద్దతు ఇస్తున్నారు. రణ్వీర్ సింగ్ ‘గల్లీ బాయ్’ చేశాడు. అమితాబ్ ‘ఝండ్’ చేశాడు. దక్షిణాదిలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు బిచ్చమెత్తుతూ కనిపిస్తే తప్పక ‘ఝండ్’ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే అది చూపే ప్రభావం అలా ఉంటుంది. చూడండి. -
ఫ్రాన్స్‌కు షాకిచ్చిన మెక్సికో.. డ్రాతో గట్టెక్కిన స్పెయిన్
టోక్యో: ఒలింపిక్స్ పోటీలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. గ్రూప్-సిలో భాగంగా గురువారం స్పెయిన్-ఈజిప్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా(0-0) కాగా, గ్రూప్-ఏలో భాగంగా మెక్సికో-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో మెక్సికో.. బలమైన ఫ్రెంచ్ జట్టుకు షాకిచ్చింది. ఫ్రాన్స్‌పై మెక్సికో 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సెకండాఫ్‌లో అలెక్సిస్ వెగా, సెబాస్టియన్ కార్డోవా, యూరియల్ ఆంటునా, ఎరిక్ అగిర్లు తలో గోల్ చేయడంతో మెక్సికో ఫ్రాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. మరోవైపు యూరో కప్ 2020 సెమీ ఫైనలిస్ట్ స్పెయిన్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు గాయపడంతో ఆ జట్టు పేలవ ప్రదర్శనతో అతికష్టం మీద డ్రాతో గట్టెక్కింది. కాగా, స్పెయిన్ జట్టు చివరిసారిగా 1992 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఇక గ్రూప్ బిలో న్యూజిలాండ్-దక్షిణ కొరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ వుడ్ గోల్ వేయడంతో ఆ జట్టు 1-0తో విజయం సాధించింది. ఇక తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొనాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోక్యోకు బయలుదేరే ముందు దక్షిణాఫ్రికా జట్టులోని కొందరు కరోనా బారిన పడ్డారు. వారి బృందం టోక్యోకు చేరుకోగానే ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. -
సాకర్ దిగ్గజం
అర్జెంటీనా మురికివాడలోని నిరుపేద కుటుంబంలో పుట్టిన అతి సామాన్యుడు అనన్య సామాన్యుడిగా ఎదగడం... పసి ప్రాయంలోనే తాను మనసు పారేసుకున్న సాకర్ క్రీడకు తన సర్వసాన్నీ అంకితం చేసి ఆ రంగంలో ఆకాశపుటంచుల్ని తాకడం ఊహించలేం. రెప్పపాటులో చేసిన ఒకే ఒక్క గోల్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని మంత్రముగ్ధుల్ని చేసి, వారి హృద యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవటం నమ్మశక్యం అనిపించదు. కానీ బుధవారం కన్ను మూసిన సాకర్ దిగ్గజం డీగో మారడోనా తన జీవితకాలంలో అన్నీ చేసి చూపాడు. నాలుగేళ్ల కొకసారి వచ్చే సాకర్ సంగ్రామం కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. ఆ రంగంలో మారడోనాకు ముందు, తర్వాత దిగ్గజాలనిపించుకున్న క్రీడాకారులు చాలామందే వచ్చారు. వారు కూడా చెరగని ముద్రేశారు. పీలే, లియోనల్ మెసీ, పీటర్ షిల్టన్, గెర్డ్ ముల్లర్, జస్ట్ ఫాంటెయిన్, గెర్డ్ ముల్లర్, జిదాన్... ఇలా ఎందరెందరో తమ తమ జట్టుల్ని గెలిపించడంలో, మంచి ఆటతో మెరిపించడంలో, స్టేడియంలోని ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేయడంలో సిద్ధహస్తులే. కానీ వీరెవరిలోనూ లేని మార్మికత ఏదో మారడోనాలో దాగుంది. అందుకే ప్రపంచం అతని ప్రతిభకు మోకరిల్లింది. మురికివాడలో చిల్లులుపడిన ఇరుకిరుకు రేకుల షెడ్లాంటి కొంపలో ఎనిమిదిమంది సంతానం వున్న ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు ఒకనాడు సాకర్ సామ్రాజ్యాన్ని ఏలుతాడని ఎవరూ అనుకోలేదు. అసలు అతగాడి ఆటను గుర్తించిన ఘనులెవ్వరూ లేరు. తమలో ఒకడిగా వున్నవాడి చతురతను ముందుగా సామాన్యులే కనిపెట్టారు. తాను పుట్టిన బ్యూనస్ ఎయిర్స్లో ఎక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగితే అక్కడల్లా ప్రత్యక్షమై దాని వెలుపల విన్యాసాలు చేసే ఏడెనిమిదేళ్ల మారడోనాలో మొదటగా భవిష్యత్తు దిగ్గజాన్ని దర్శించినవారు సాధారణ ప్రేక్షకులే. మ్యాచ్ జరిగే ప్రతిచోటా గ్రౌండ్ వెలుపల బంతిని కిందపడనీయకుండా కాలితో విన్యాసాలు చేసే కుర్ర మారడోనా వారికి ప్రత్యేక ఆకర్షణ. స్టేడియంలో ఆట విసుగు పుట్టించినప్పుడు బయటికొచ్చి మారడోనా చుట్టూ చేరడం వారికి అలవాటైంది. అది కాస్తా అతనిపై ప్రేమగా మారింది. ఆ తర్వాత వారే ఫుట్‌బాల్ నిర్వాహకులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఎంతసేపూ స్టేడియంలోనేనా...దాని వెలుపల ప్రతిభావంతులు మీకు కనబడరా? అంటూ నిలదీశారు. అలా స్టేడియంలోకి అడుగుపెట్టినవాడు మారడోనా. ఆ తర్వాత అతను ఆడే లిటిల్ ఆనియన్స్ టీం పేరు మార్మోగింది. అతగాడు కొట్టే ప్రతి షాటూ గోల్ అవుతుంటే అందరూ బిత్తరపోయి చూసేవారు. ఆ టీం వరసగా 140 మ్యాచ్‌లు గెలుచుకుని చరిత్ర సృష్టిస్తే అందుకు ఏకైక కారణం మారడోనాయే కావడం యాదృచ్ఛికం కాదు. మెక్సికోలో 1986లో జరిగిన ప్రపంచ కప్ సాకర్‌లో ఇంగ్లండ్ టీంపై వేసిన రెండో గోల్‌తో ఆ టీంను మట్టికరిపించడమే కాదు... ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకున్న మారడోనాకు రాజకీయంగా కొన్ని దృఢమైన విశ్వాసాలున్నాయి. నిజానికి అలాంటి విశ్వాసమే ఆనాడు తనతో గోల్ చేయించిందని ఒక సందర్భంలో మారడోనా చెప్పాడు. ప్రపంచ కప్ సాకర్‌కు సరిగ్గా నాలుగేళ్ల ముందు తమ ఫాక్లాండ్ దీవుల్ని బ్రిటన్ దురాక్రమించిన వైనాన్ని, ఆ దీవుల్ని వల్లకాడుగా మార్చిన వైనాన్ని మారడోనా మరిచిపోలేదు. ఇంగ్లండ్ టీంపై ఆడేటపుడు ఆ యుద్ధం తాలూకు చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవద్దని, ఆటను ఆటలాగే చూసి గెలిచినా, ఓడినా హుందాగా వుండాలని అర్జెంటీనా సాకర్ బాధ్యులు తమ క్రీడాకారులకు నూరిపోశారు. యుద్ధం చేసింది బ్రిటన్ సైనికులే తప్ప, అక్కడి ఆటగాళ్లు కాదని కూడా చెప్పారు. కానీ మారడోనా అంతరాంతరాల్లో అది సరికాదనిపించింది. ‘మైదానంలో ఆడేటపుడు నేను ఒక దేశాన్ని జయించాలనుకున్నాను తప్ప, ఫుట్‌బాల్ టీంని కాదు. అందుకే ప్రతీకారేచ్ఛతో ఆడాను. గెలుపు సొంతం చేసుకున్నాను’ అని అనంతరకాలంలో మారడోనా అన్నాడు. అప్పటికల్లా అతను ఇంగ్లండ్ సాకర్ ప్రేమికుల హృద యాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. అందుకే తమ దేశం గురించి కటువుగా వ్యాఖ్యా నించిన మారడోనాను వారు పల్లెత్తు మాట అనలేదు. ఆనాటి మ్యాచ్‌లో ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’గా నిచిపోయిన గోల్ విషయంలో అది ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలోనే పెద్ద మోసంగా ఒక సర్వేలో ఓటేసిన ఇంగ్లండ్ జనమే... మారడోనా వేసిన ఆ రెండో గోల్ సాకర్ చరిత్రలో అతి విశిష్టమైనదని తీర్పునిచ్చారు. ఆ రెండు గోల్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ద్రవ్య విధానానికి దారి చూపించాయని ఆ బ్యాంక్ చైర్మన్ మెర్విన్ కింగ్ చెప్పారంటే మారడోనా ఎంతటి ఆటగాడో అర్థమవుతుంది. విప్లవ కారుడు చేగువేరాను పచ్చబొట్టుగా చేసుకున్నా... అమెరికా సామ్రాజ్యవాదానికి ఆజన్మాంతం సవా లుగా నిలిచిన క్యూబా అధినేత ఫైడల్ కాస్ట్రోను గుండె నిండా శ్వాసించినా అందుకు మారడోనా లోని సోషలిస్టు భావజాలమే కారణం. లక్షల డాలర్లు ముంచెత్తినా అతనిలోని అతి సామాన్యుడు కనుమరుగుకాలేదు. తొలినాటి వినమ్రత చెక్కుచెదరలేదు. ఏ ఆరంభానికైనా ముగింపు తప్పదు. కానీ క్రీడాకారుడిగా మారడోనా ముగింపు ఎవరూ ఊహించనిది. ఆ విశిష్ట క్రీడాకారుడు ఎక్కడో మాదకద్రవ్యాల అగాధాల్లోకి జారిపోయాడు. పిచ్‌పై అరివీర భయంకరంగా ఆడి ప్రత్యర్థుల్ని హడలెత్తించినవాడే, పిచ్ వెలుపల మాయదారి కొకైన్కు లొంగిపోయాడు. ఇరవయ్యో యేట దాపురించిన ఆ అలవాటు ఇరౖÐð ఏళ్లపాటు మారడోనాను పీడించింది. రెండుసార్లు శస్త్ర చికిత్సలు అవసరమయ్యాయి. అనంతరకాలంలో ఫుట్‌బాల్ కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరించినా మునుపటి మెరుపులు కనుమరుగయ్యాయి. వ్యాధులు చుట్టు ముట్టాయి. ఆరుపదులు దాటకుండానే అవి పొట్టనబెట్టుకున్నాయి. అయితే మెస్సీ అన్నట్టు ‘అతను మనల్ని వదిలివెళ్లాడన్న మాటేగానీ... ఎప్పటికీ మనలోనే వున్నాడు. ఉంటాడు’. -
మారడోనా డిశ్చార్జి
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా సాకర్ దిగ్గజం, 1986 ఫుట్‌బాల్ ప్రపంచకప్ చాంపియన్ కెప్టెన్ డీగో మారడోనా ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జి అయ్యాడు. ఈ విషయాన్ని అతని వ్యక్తిగత వైద్యుడు, న్యూరాలజిస్ట్ లియోపోల్డో లుఖ్ వెల్లడించారు. మెదడులోని నాళాల మధ్య రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తడంతో మారడోనాకు గత వారం ‘సబ్డ్యూరల్ హెమటోమా’ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటికీ అతను కోలుకునేందుకు ఇంటివద్ద చికిత్స కొనసాగిస్తామని లుఖ్ చెప్పారు. ఇటీవలే 60వ పడిలో అడుగుపెట్టిన మారడోనా... తొలుత డిప్రెషన్, ఎనీమియా, డీహైడ్రేషన్ లక్షణాలతో ‘లా ప్లాటా’ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం సబ్డ్యూరల్ హెమటోమా నిర్ధారణ కావడంతో అతన్ని స్థానిక ఓలివోస్ క్లినిక్‌లో చేర్పించి వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించారు. -
కోలుకున్న రొనాల్డో
ట్యూరిన్: సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నాడు. ఇటీవల ఈ దిగ్గజ స్ట్రయికర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ట్యూరిన్‌లోని సొంతింట్లో చికిత్స తీసుకుంటూ ఐసోలేషన్‌కే పరిమితమయ్యాడు. 19 రోజుల తర్వాత పూర్తిగా కోలుకోవడంతో యువెంటస్ క్లబ్ సంతోషం వెలిబుచ్చింది. ‘రొనాల్డో కులుకున్నాడు. ఇక అతని ఐసోలేషన్ ముగిసింది. తాజా స్వాబ్ టెస్టులో నెగెటివ్ రిపోర్టు వచ్చింది’ జట్టు వర్గాలు తెలిపాయి. కోవిడ్ సోకడంతో యువెంటస్ క్లబ్ తరఫున గత మూడు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. సిరీ ‘ఎ’లో క్రొటోన్, వెరోనా జట్లతో, చాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనాతో జరిగిన మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. నేడు యువెంటస్... స్పెజియా క్లబ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో లేదంటే బుధవారం ఫెరెంక్వారోస్తో జరిగే మ్యాచ్‌లోనైనా అతను బరిలోకి దిగే అవకాశలున్నాయి. -
ఇక తేడాలుండవ్, అంతా సమానమే
రియో: ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే బ్రెజిల్ దేశంలో నిర్వహణాపరంగా ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. ఇకపై పురుష ఫుట్‌బాల్ ఆటగాళ్లతో సమానంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే మహిళా ఆటగాళ్లకు వేతనాలు ఇవ్వాలని బ్రెజిల్ ఫుట్‌బాల్ సంఘం (సీబీఎఫ్) నిర్ణయించింది. జాతీయ ఫుట్బాలర్లందరికీ వేతనాలతో పాటు ప్రైజ్‌మనీ కూడా సమానంగా ఇవ్వనున్నట్లు సీబీఎఫ్ అధ్యక్షుడు రోజెరియో కబోల్కో ప్రకటించారు. ‘ఈ ఏడాది మార్చి నుంచి జాతీయ పురుషులు, మహిళల ఫుట్‌బాలర్లకు ప్రతీది సమానంగా ఇవ్వాలని నిర్ణయించాం. ఇక ఏ అంశంలోనూ లింగ వివక్ష ఉండబోదు. పురుషులకు, మహిళలకు సీబీఎఫ్ సమాన ప్రాధాన్యతనిస్తుంది. వరల్డ్‌కప్, ఒలింపిక్స్ వేదికల్లో ప్రదర్శనలకు కూడా సమాన బహుమతులు లభిస్తాయి’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, నార్వే, న్యూజిలాండ్ జట్లు మాత్రమే పురుష, మహిళా క్రీడాకారులకు సమాన వేతనాలు అందజేస్తున్నాయి. ఇప్పుడు వీటి సరసన బ్రెజిల్ చేరింది. 2007 ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరడం బ్రెజిల్ మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత ఏడాది ప్రపంచకప్‌లో గ్రూప్ దశకే పరిమితమైన జట్టు... సొంత గడ్డపై జరిగిన 2016 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. (చదవండి: అయ్యో...ముర్రే) -
అతను ఆడలేదుగా.. డబ్బులు ఇచ్చేయండి!
సియోల్: క్రిస్టియానో రొనాల్డోనా... మజాకా... అతనొస్తే వేలం వెర్రిగా టికెట్లు అమ్ముడవుతాయ్! మరి కోర్టా... మజాకా... అతను ఆడకపోతే ఆ డబ్బులన్నీ తిరిగివ్వాల్సిందే కదా! సియోల్‌లో అప్పుడు జరిగిన మ్యాచ్‌లో సాకర్ స్టార్ ఆడకపోవడంతో ఇప్పుడు తిరిగి డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. గతేడాది జూలైలో ‘ది ఫాస్టా’ సంస్థ కె–లీగ్ ఆల్‌స్టార్స్, యువెంటాస్ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించింది. అయితే ఆ సంస్థ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో యువెంటాస్ తరఫున బరిలోకి దిగుతాడని తెగ ప్రచారం చేసింది. దీంతో 65 వేల టికెట్లు మూడు నిమిషాల్లోపే అమ్ముడయ్యాయి. కొరియా కరెన్సీలో 30,000 వన్ల నుంచి 4,00,000 వన్ల వరకు (రూ.1800–రూ. 24,000) ధరలు వెచ్చింది టికెట్లు కొన్నారు. తీరా మ్యాచ్ వేదికైన సియోల్ వరల్డ్‌కప్ స్టేడియానికి వచ్చాక చూస్తే రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. బరిలోకే దిగలేదు. ఇది అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. కనీసం పది నిమిషాలైనా అతను ఆడి ఉంటే కొరియన్లంతా ఎంతో సంతోషంగా ఇంటికెళ్లేవారు. సాకర్ స్టార్ ఆడకపోవడంతో నిరాశ చెందిన ఇద్దరు అభిమానులు కోర్టుకెళ్లారు. విచారించిన ఇంచ్‌యోన్ జిల్లా కోర్టు ఒక్కొక్కరికి 3,71,000 వన్లు (రూ.22,285) చెల్లించాలని ‘ది ఫాస్టా’ సంస్థను ఆదేశించింది. (ఇక్కడ చదవండి: 20 కోట్ల ఫాలోవర్లు! ) -
మూడే అడుగులు!
-
ఈదుకుంటూ రావాల్సిందే!
మేసాయ్: థాయిలాండ్‌లోని గుహలో చిక్కుకున్న 12 మంది బాలురు, వారి సాకర్ కోచ్‌ను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు వాతావరణం ప్రతికూలంగా మారింది. వరదల ఉధృతి మరింత పెరగడంతో వారు గుహను ఆనుకుని ప్రవహిస్తున్న ఇరుకైన జలాశయం గుండా ఈదుకుంటూ బయటపడటం మినహా, ప్రస్తుతానికి మరో మార్గంలేదని అధికారులు తెలిపారు. అయితే ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని కూడా తేల్చారు. జూన్ 23న మ్యాచ్ ముగిసిన తరువాత వారు చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లో విహార యాత్రకు వెళ్లి, వరదల కారణంగా గుహలో చిక్కుకున్నారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం జరుగుతున్న అన్వేషణ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 11–16 ఏళ్ల మధ్యనున్న ఆటగాళ్లు, 25 ఏళ్ల కోచ్ క్షేమంగానే ఉన్నారని, అయితే ప్రతికూల వాతావరణం వల్లనే బయటికి తీసుకురావడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్న నేవీ సిబ్బంది, వైద్యులు వారికి ఆహారం, అందిస్తున్నారు. -
ట్రంప్ పేరుతో ఇజ్రాయెల్ సాకర్ క్లబ్
జెరూసలేం: ఇజ్రాయెల్‌లోని మేటి సాకర్ క్లబ్ ‘బీటార్ జెరూసలేం’ జట్టు పేరు మార్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఈ సాకర్ క్లబ్ ముస్తాబైంది. ఇప్పుడు ‘బీటార్ ట్రంప్ జెరూసలేం’గా సాకర్ కిక్‌లు ఇవ్వనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూఎస్ రాయబార కార్యాలయాన్ని టెల్ అవివ్ నగరం నుంచి జెరూసలేంకు మార్చడంతో ఆయన గౌరవార్థం ట్రంప్ పేరు చేర్చామని జట్టు వర్గాలు వెల్లడించాయి. ఈ జట్టు యూరోపా లీగ్‌కు అర్హత సంపాదించింది. ఆరుసార్లు ఇజ్రాయెల్ లీగ్ చాంపియన్ అయిన బీటార్ జట్టు అరబ్, ముస్లింలకు బద్ధ వ్యతిరేకి. ఆయా జట్లతో మ్యాచ్‌లు జరిగే సమయంలో బీటార్ జెరూసలేం వీరాభిమానులు వారికి వ్య తిరేకంగా నినదించేవారు. దీంతో పలుమార్లు హెచ్చరికలు, జరిమానాలకు కూడా గురైంది. -
పెట్రా స్పోర్ట్స్ అకాడమీ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: స్ప్రింగ్ సాకర్ టోర్నమెంట్లో పెట్రా స్పోర్ట్స్ అకాడమీ జట్లు విజేతగా నిలిచాయి. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన ఈ టోర్నీలో అండర్–11, అండర్–14 విభాగాల్లో పెట్రా స్పోర్ట్స్ అకాడమీ జట్లు గెలుపొందాయి. అండర్–14 విభాగంలో జీఆర్ఎఫ్ఏతో జరిగిన ఫైనల్లో 2–2తో స్కోర్లు సమం కావడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను ప్రకటించారు. పెనాల్టీ షూటౌట్లో పెట్రా స్పోర్ట్స్ అకాడమీ జట్టు 3–1తో విజయం సాధించింది. అంతకుముందు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన సెమీఫైనల్లో కూడా పెట్రా స్పోర్ట్స్ అకాడమీ షూటౌట్ ద్వారానే 3–1తో గెలుపొందింది. అండర్–11 విభాగంలో హైదరాబాద్ హాట్స్పర్స్తో జరిగిన ఫైనల్లో పెట్రా స్పోర్ట్స్ అకాడమీ 2–0తో పెనాల్టీ షూటౌట్లో గెలిచింది. అంతకుముందు ఆ జట్టు గచ్చి బౌలి గన్నర్స్‌తో జరిగిన సెమీస్‌లో 1–0తో గెలుపొంది ఫైనల్‌కు అర్హత సాధించింది. అండర్–11 విభాగంలో వేద్, వివేక్; అండర్–14 విభాగంలో వరుణ్, సామిక్లు బెస్ట్ ప్లేయర్స్‌గా ఎంపికయ్యారు. విజేతలకు బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ బహుమతులు అందజేశారు. -
సాకర్ స్టార్ మెస్సీకి జైలు శిక్ష
మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్ బాల్ టీమ్ మాజీ కెప్టెన్ లియోనెల్ మెస్సీకి స్పానిష్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రీమియర్ లీగ్స్ లో బార్సిలోనా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మెస్సీ.. ఆదాయపన్ను ఎగవేశారనే నేరం రుజువు కావడంతో స్పెయిన్ కోర్టు అతనికి 21 నెలల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు రెండు మిలియన్ యూరోల జరిమానాను కూడా విధిస్తున్నట్లు కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. మెస్సీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అతని తండ్రి జార్జ్ మెస్సీకి కూడా 21 నెలల జైలు శిక్షతోపాటు 1.5 మిలియన్ యూరోల జరిమాన విధించింది. తీర్పు వెలువడగానే మెస్సీ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. తాను ఏ తప్పూ చేయలేదంటూ మెస్సీ, అతని తండ్రి కోర్టుకు మొరపెట్టుకున్నారు. దీంతో న్యాయమూర్తి.. తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లొచ్చని ఊరడించారు. ప్రపంచంలో భారీగా ఆదాయాన్ని గడిస్తోన్న ఆటగాళ్లలో మెస్సీ ఒకరు. ప్రీమియర్ లీగ్స్ ద్వారా వేలకోట్ల డాలర్లు పోగేసుకుంటోన్న మెస్సీ.. ఆ మేరకు పన్ను చెల్లించడం లేదంటూ స్పెయిన్ ఐటీ శాఖ మూడు కేసులను నమోదు చేసింది. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం కోర్టు తీర్పు చెప్పింది. ఏళ్లుగా అర్జెంటీనా జట్టు సారధిగా, ఫార్వర్డ్ ఆటగాడిగా కొనసాగిన మెస్సీ గత నెలలో జాతీయజట్టు నుంచి తప్పకున్నాడు. కోపా అమెరికా కప్ ఫైనల్స్ లో చిలీ చేతిలో 4-1 తేడాతో ఓడిపోయిన అర్జెంటీనా జట్టును అభిమానులు మొదట తిట్టుకున్నా.. మెస్సీ రాజీనామా ప్రకటనతో కాస్త చల్లబడ్డారు. గత ఫుల్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్స్ లోనూ మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
యూరో కప్-2016 ప్రారంభం
-
అంబాసిడర్’ ప్రతిపాదన రాలేదు: రెహమాన్
ముంబై: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని తనను ఎవరూ కోరలేదని మ్యూజిక్ డెరైక్టర్ ఎ.ఆర్.రెహమాన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదన తన వద్దకు రాలేదన్నారు. ‘గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమిస్తున్నారని నేను వార్తల్లోనే విన్నా. అన్ని చోట్ల ఇదే విషయాన్ని అడుగుతున్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి మెయిల్స్ రాలేదు. ఈ విషయం మేనేజ్మెంట్కు తెలిసుండొచ్చు. నాకు కాదు’ అని సాకర్ దిగ్గజం ‘పీలే’ సినిమా ట్రెయిలర్ విడుదల సందర్భంగా రెహమాన్ వ్యాఖ్యానించారు. -
వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్‌గా సాకర్ వీరుడు!
లాస్ఏజింల్స్: బ్రిటిష్ సాకర్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్ మరో ఘనత సొంతం చేసుకున్నారు. ఆన్ ఫీల్డ్‌లోనూ ఆఫ్ ఫీల్డ్‌లోనూ అంతర్జాతీయ సెలబ్రిటీగా పేరొందిన ఆయనను పీపుల్ మ్యాగజీన్ ప్రపంచంలోనే జీవించి ఉన్న వ్యక్తల్లో సుకుమారుడిగా (సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్) ఎంపిక చేసింది. మ్యాగజీన్ 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ టైటిల్‌ను అందుకున్న 40 ఏళ్ల బెక్‌హామ్ మాట్లాడుతూ ఈ పురస్కారం అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు, ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నట్టు తెలిపాడు. రిటైర్డ్ ఫుట్‌బాల్ ఆటగాడైన డేవిడ్ బెక్‌హామ్ సతీమణి విక్టోరియా బెక్‌హామ్ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్. దీంతో ఆయన అందంగా కనిపించేందుకు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సహజంగా అందగాడు, ప్రముఖ ఆటగాడు అయిన బెక్‌హామ్ పెప్సీ, ఆడిదాస్ వంటి ప్రముఖ వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. జార్జియో ఆర్మానీ అండర్వేర్లకు మోడల్‌గా వ్యవహరించాడు. నలుగురు పిల్లలకు తండ్రి అయిన బెక్‌హామ్ పీపుల్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. తను అందంగా, ఆకర్షణీయంగా, సెక్సీ పర్సన్‌గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపాడు. 41 ఏళ్ల తన భార్య విక్టోరియా మద్దతుతోనే ఈ టైటిల్ లభించిందని అభినందనగా చెప్పాడు. -
ఆస్పత్రిలో చేరిన సాకర్ లెజెండ్
శావ్ పౌలో: బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సాకర్ లెజెండ్ పీలే ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది కాలంగా ఆయనను వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న నేపథ్యంలో ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థ స్పష్టం చేసింది. గతంలో చేసిన ఓ శస్త్ర చికిత్స మూలంగా వెన్నుపూసకు చెందిన ప్రధాన నాడీవ్యవస్థపై ఒత్తిడి పడుతోందని ఈ నేపథ్యంలో ఆయన నొప్పిని ఎదుర్కొంటున్నారని తెలిసింది. అయితే, పరిస్థితి అంత తీవ్రంగా ఏమి లేదని, సోమవారం వరకు మాత్రం ఆయనను వైద్యుల సమక్షంలో పరిశీలనలో ఉంచనున్నట్లు తెలిపారు. గత మే నెలలో ఇలాంటి సమస్యతోనే ఆయన ఆస్పత్రిలో చేరగా బినైన్ వ్రణం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి తరుచు ఆయన వెన్నునొప్పిని ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. -
నాన్న.. మళ్లీ ప్రాణం పోశాడు
మృత్యుంజయుడు.. కిరణ్ పునర్జన్మనిచ్చిన కన్నతండ్రి కవచంలా కాపాడి.. తను మృత్యుఒడిలోకి.. కంబాల చెరువు (రాజమండ్రి): తాను ప్రాణాలు కోల్పోయినా సరే పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలని తపించిపోయాడు ఆ తండ్రి. ప్రమాదం జరుగుతుందని తెలియగానే చివరి నిమిషం వరకు తన పిల్లలను రక్షించేందుకు యత్నించాడు. తన ఒడిలోకి ఇద్దరు పిల్లల్ని తీసుకొని తాను రక్షణ కవచంలా నిలిచాడు ఈగల రాంబాబు. వ్యాను ప్రమాదానికి గురైందని పసిగట్టగానే కూతురు సంధ్యను, కొడుకు కిరణ్ సాయిని గుండెలకు హత్తుకున్నాడు. ఆ తండ్రి ముందుచూపే కిరణ్‌సాయి ప్రాణాలతో బయటపడడానికి కారణమైంది. రాంబాబు సహా 21 మంది అక్కడికక్కడే మరణించినా, గాయపడ్డ సంధ్య తర్వాత మృత్యువాత పడ్డా.. తండ్రి పొదివి పట్టుకోవడం వల్లే సారుు ప్రాణం దక్కింది. ఈ విషయాన్ని సాయి ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. విషాద వదనంతో వివరించే ప్రయత్నం చేశాడు. ‘‘నాన్న గట్టిగా పట్టుకున్నాడు.. వ్యానులో డోరువద్ద కూర్చు న్నా. నా పక్కన మా నాన్న, అక్క సంధ్య ఉన్నారు. బ్రిడ్జిపై మలువు వద్దకు వచ్చేసరికి మా కారుకు పెద్ద శబ్దంతో కూడిన కుదుపు తగిలి గాలిలోకి వెళుతున్నట్టు అనిపించింది. ఇంతలో నాన్న రాంబాబు నన్ను, మా అక్క సంధ్యను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఇంతలో నేను నిద్రలోకి వెళ్లిపోయాను. మా అక్క నన్ను తట్టిలేపింది. యాక్సిడెంటైంది అని చెప్పి ఏడుస్తూ మళ్లీ తను కారులోనే నిద్రలోకి వెళ్లిపోయింది. మా నాన్న, అమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, మా అత్తయ్య వీళ్లంతా నిద్రపోతున్నట్టుగానే ఉండిపోయారు. వాళ్ల ఒంటి నుంచి రక్తం కారుతూ కనిపించింది. ఏం చేయాలో తెలి యక నేను నడుచుకుంటూ పైకి వచ్చాను. అటుగా వెళుతున్న ఒకాయనకు జరిగింది చెప్పాను. అతను వ్యానును చూసి వెంటనే మరి కొంతమందిని పిలి చాడు. తర్వాత పోలీసులు వచ్చారు’’ అని కిరణ్ సాయి విషయాన్ని వివరించాడు. ఒకే ఒక్కడు..: ధవళేశ్వరం బ్యారేజీ నుంచి తూఫా న్ వాహనం గోదావరిలోకి బోల్తాపడిన దుర్ఘటనలో బతికి బయటపడ్డది పదేళ్ల ఈగల కిరణ్‌సాయి ఒక్కడే. 30 అడుగుల ఎత్తు నుంచి వాహనం బోల్తాకొట్టినా కిరణ్‌సాయి ప్రాణాలతో బయటపడ్డాడు. మృత్యుంజయుడిగా నిలిచాడు. తనకు ఏం జరిగిందో.. ఎక్కడ ఉన్నాడో తెలియక రాత్రంతా రోదిస్తూ గడిపిన కిరణ్‌సాయి షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు. ప్రమాదం అర్ధరాత్రి దాటాక జరగగా తెల్లవారుజామున స్థానిక మత్స్యకారులు సారుు రోదనను ఆలకించడంతోనే ఈ దుర్ఘటన వెలుగుచూసింది. సాయి నాలుగో తరగతి చదువుతున్నాడు. తన వారంతా చనిపోయారని తెలియని ఆ బాలుడు ‘అమ్మా..అమ్మా..’ అంటూ ఏడుస్తుంటే అక్కడున్న వారందరి హృదయం చలించిపోయింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆ బాలుడిని అనునరుుంచి, ధైర్యం చెప్పారు. -
సంక్షోభంలో ఫీఫా
క్రీడాభిమానుల్లో నరాలు తెగేంత ఉత్కంఠను కలిగించడంలో సాకర్‌కు ఏదీ సాటి రాదు. విజేతలెవరో, పరాజితులెవరో చివరి క్షణం దాకా ఊహించశక్యం కానంత మలుపులతో అలరించే క్రీడ సాకర్. విశ్వ విజేత కాగలదనుకున్న జట్టు తొలి రౌండ్లోనే బోల్తాపడి నిష్ర్కమించడం... పిపీలకంలా కనబడిన జట్టు ప్రత్యర్థులను మట్టికరిపించడం సాకర్‌లో మామూలే. ఓడలు బళ్లు కావడం...బళ్లు ఓడలవడం అక్కడే చూస్తాం. 1998 సాకర్ పోటీల్లో ఛాంపియన్‌గా కీర్తి కిరీటాన్ని చేజిక్కించుకున్న ఫ్రాన్స్...మరో నాలుగేళ్లకు జరిగిన సాకర్ జాతర నాటికి తొలి అంచెలోనే బోల్తాపడింది. 2006లో సాకర్ విజేత ఇటలీ, అప్పుడు రెండో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ 2010నాటికల్లా తొలి రౌండ్లోనే చతికిలబడ్డాయి. నూటపదకొండేళ్ల నాడు ఆవిర్భవించి 1930నుంచీ సాకర్ ప్రపంచ కప్ పోటీలు నిర్వహిస్తున్న సంస్థ ఫీఫా ఇప్పుడు తానే చతికిలబడింది. పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి కాళ్లూ, చేతులూ ఆడక విలవిల్లాడుతోంది. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సిన సమావేశాలకు ఒకరోజు ముందు ఆ సంస్థ ఉపాధ్యక్షుడితోసహా 9మందిని అరెస్టు చేయడం, మరో అయిదుగురి కోసం గాలించడం క్రీడా ప్రపంచంలో పెను సంచలనం కలిగించింది. లంచాలు మేసి 2018 ప్రపంచకప్ నిర్వహణను రష్యాకూ, 2022 ప్రపంచకప్ నిర్వహణను ఖతార్‌కు కట్టబెట్టారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు సెప్ బ్లాటర్ నాలుగేళ్లకొకసారి జరిగే ఎన్నికల్లో ఇప్పటికి నాలుగు దఫాలు ఆ పదవికి ఎన్నికయ్యారు. అయిదోసారి సైతం ఆ పదవిని చేజిక్కించుకునే పనిలో బ్లాటర్ బిజీగా ఉండగా ఇప్పుడీ అరెస్టులు చోటు చేసుకున్నాయి. స్కాం జరిగి ఉండొచ్చుగానీ దాంతో తనకేమీ సంబంధం లేదని బ్లాటర్ చెబుతున్నారు. అందరిపైనా నిఘా వేయడం తనకెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. సాకర్ నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని...భారీయెత్తున ముడుపులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. నిరుడు జరిగిన ప్రపంచకప్‌లో 480 కోట్ల డాలర్లు ఆదాయం రాబట్టి అందులో 260 కోట్ల డాలర్ల నికరలాభాన్ని పొందిన ఫీఫాలో అంతా సవ్యంగా జరుగుతుందని అనుకోనక్కరలేదని తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. అయితే, ఫీఫా మొదటినుంచీ సంపన్నవంతమైన సంస్థేమీ కాదు. సాకర్‌ను గాఢంగా అభిమానించే కొందరు కలిసి ఏర్పాటుచేసుకున్న ఆ సంస్థ తొలినాళ్లలో చాలా పరిమితుల్లో ఎంతో కష్టపడి పోటీలు నిర్వహించేది. 1974లో తొలిసారి ఫీఫా పగ్గాలు యూరప్ దేశాలవారినుంచి బ్రెజిల్‌కు చెందిన జావో హావ్లాంజ్కు వచ్చాక దాని స్వరూపమే మారిపోయింది. ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థల ఆసరా లభించడంతో... దృశ్య మాధ్యమాలకు ప్రపంచకప్ ప్రసార హక్కులివ్వడంతో భారీయెత్తున డబ్బులొచ్చిపడ్డాయి. దానికి సమాంతరంగా ఫీఫా సభ్యత్వమూ పెరిగింది. దాని కార్యనిర్వాహక వర్గమూ విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 209 ఫుట్‌బాల్ అసోసియేషన్లు ఫీఫాలో సభ్యత్వం కలిగివున్నాయి. సాకర్ ప్రపంచకప్‌కు తళుకుబెళుకులద్దిన తర్వాత దానికి ఎక్కడలేని ఆకర్షణ రావడంతో ఫీఫా సంపన్నవంతమైన సంస్థగా, దాని నిర్వాహకులు శక్తిమంతులుగా మారిపోయారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించడంతో సహజంగానే అవకతవకలు నానాటికీ పెరిగిపోసాగాయి. అధ్యక్ష పదవికి జరిగే పోటీలో ధన ప్రాబల్యం అంతకంతకు విస్తరించింది. ప్రపంచకప్ నిర్వహణను కట్టబెట్టడానికి నిర్వహించే ఓటింగ్ లో సైతం కాసుల గలగలలదే ప్రధాన పాత్ర. ఇందులో రహస్యమేమీ లేదు. స్పాన్సర్ చేస్తున్న సంస్థలకూ, వివిధ దేశాల్లోని రాజకీయ నేతలకూ తెలియనిదేమీ కాదు. కానీ, అందరూ మౌనంగా ఉండిపోయారు. 1991కి ముందునుంచీ సాగుతున్న ముడుపుల వ్యవహారంపై ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. నాటినుంచీ 15 కోట్ల డాలర్లు(దాదాపు 900 కోట్ల రూపాయలు) చేతులు మారి ఉండొచ్చన్నది ప్రాథమిక అంచనా. ఫీఫా కార్యవర్గంనుంచి రెండేళ్ల క్రితం బహిష్కృతుడైన అమెరికాకు చెందిన ఛార్లెస్ బ్లేజర్ ఈ అవకతవకలన్నిటి పైనా ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేయడంతో ఇదంతా బయటికొచ్చింది. ఫీఫా వ్యవహారం బజారున పడటం వెనక అమెరికా-రష్యాల శత్రుత్వానిదే ప్రధాన పాత్ర అని కొట్టిపడేస్తున్నవారూ లేకపోలేదు. 2018 ప్రపంచకప్ నిర్వహణ రష్యాకు దక్కినప్పటినుంచీ అమెరికా కడుపుమంటతో ఉన్నదని...అందువల్లనే ఇప్పుడు రంగంలోకి దిగి అరెస్టులతో హడావుడి చేస్తున్నదని కొందరు విమర్శిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే నేరుగానే అలా ఆరోపిస్తున్నారు. ఇందులో నిజానిజాల సంగతలా ఉంచి రష్యాలో ప్రపంచకప్ నిర్వహణను రద్దు చేయాలంటూ అమెరికా సెనెటర్లు కొందరు ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత గతంలో డిమాండ్ చేశారు. బ్లాటర్ దాన్ని అంగీకరించకపోవడంవల్లే ఆయనను దించి, ఫీఫాను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నదని రష్యా ఆరోపిస్తున్నది. నిజానికి అమెరికాలో సాకర్‌కు అంత ఆకర్షణ లేదు. అక్కడి జనాభాలో 2 శాతంమంది మాత్రమే దాన్ని వీక్షిస్తారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే సాకర్‌కు స్పాన్సర్షిప్ చేసి, భారీయెత్తున లాభాలు గడించే బహుళజాతి సంస్థల్లో అధిక భాగం అమెరికావే. ప్రస్తుత అరెస్టుల్లో అమెరికా-రష్యాల వైరం పాత్ర ఉంటే ఉండొచ్చుగానీ...ఫీఫా పనితీరు సక్రమంగా లేదన్నది నిజం. ఇంతకాలమూ ఫీఫా స్పాన్సర్షిప్ కోసం పాకులాడిన సంస్థలు తాజా పరిణామాల నేపథ్యంలో దాన్ని బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నాయి. తగినంత జవాబుదారీ తనం లేకుండా, పారదర్శకతకు చోటీయకుండా సంస్థలను నిర్వహిస్తే చివరకు ఇలాంటి పర్యవసానాలే దాపురిస్తాయి. ఇప్పటికైనా ఫీఫా సంపూర్ణ ప్రక్షాళనకు పూనుకొని, అందులో నిపుణులకూ, నిజాయితీపరులకూ చోటిస్తే సాకర్ వర్థిల్లుతుంది. -
రెండో రౌండ్‌కు భారత్
ఖాట్మండు: ప్రపంచకప్ ఫుట్‌బాల్ అర్హత మ్యాచ్‌ల్లో భారత జట్టు రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్ రెండో అంచెలో భారత్, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే భారత్‌లో జరిగిన తొలి అంచెలో ఇదే జట్టుపై 2-0 తేడాతో నెగ్గడం కలిసొచ్చింది. దీంతో రెండో రౌండ్‌కు భారత్ అర్హత సాధించింది. దశరథ్ రంగసాల స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ద్వితీయార ్ధంలో నేపాల్ అద్భుత ఆటతీరును చూపింది. అయితే 57వ నిమిషంలో రాబిన్ సింగ్ నెట్లోకి బంతిని పంపినా అది తన చేతిని ఉపయోగించిన ట్టు తేలడంతో రిఫరీ గోల్‌గా అంగీకరించలేదు. రెండో రౌండ్ అర్హత మ్యాచ్‌లు జూన్ 11 నుంచి 2016 మార్చి 29 వరకు జరుగుతాయి. -
గోల్‌కీపర్‌తో మూత్రం తాగించిన అభిమానులు
సాకర్ అంటేనే అభిమానులు చెవి కోసుకుంటారు. ప్రత్యర్థి జట్టులో ఆటగాళ్లను నిజంగానే తమ ప్రత్యర్థులుగా భావిస్తుంటారు. వాళ్లను అవమానించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. స్విట్జర్లండ్కు చెందిన ఓ ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్‌తో అవతలి జట్టు అభిమానులు ఏకంగా మూత్రం తాగించి అతడిని తీవ్రంగా అవమానించి ఆనందించారు. ఎఫ్‌సీ మురీ జట్టు గోల్‌కీపర్ రెటో ఫెల్డర్ ఆట మధ్యలో తన బాటిల్ తీసుకుని అందులోని ద్రవం తాగాడు. అయితే.. అందులో వెచ్చగా ఉన్న పదార్థం తాగాక తాను చాలా ఇబ్బందిపడ్డానని అతడు తెలిపాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, అవతలి జట్టు అభిమానులు బాల్ బోయ్ని పిలిచి, గోల్ కీపర్ వద్ద ఉన్న బాటిల్ తీసుకురమ్మని చెప్పి, అందులో మూత్రం పోశారు. ఇలా తనతో మూత్రం తాగించాలన్న ఆలోచన ఏమాత్రం భరించదగ్గది కాదని ఫెల్డర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో విశ్లేషణ చూసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోడానికి అతడు సిద్ధపడుతున్నాడు. అతడు తాగగానే 'ఇప్పుడు నీకు ఎయిడ్స్ ఉంది' అంటూ అవతలి అభిమానులు గట్టిగా అరిచారు. దీనిపై బాడెన్ అధ్యక్షుడు థోమీ బ్రామ్ క్షమాపణలు చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. -
మహిళా వాలంటీర్‌కు లైంగిక వేధింపులు!
సియోల్: ఆసియూ క్రీడల ఆరంభానికి ముందే ఇంచియూన్‌లో లైంగిక వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఇరాన్‌కు చెందిన ఓ సాకర్ అధికారి, ఓ మహిళా వాలంటీర్‌ను ప్రక్కనే నిలబడి ఫోటో దిగే సమయంలో ఆమెను తాకాడన్న ఆరోపణలు అలజడి సృష్టించాయి. దీనిపై ఓ కాలేజి విద్యార్థిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయుడంతో దక్షిణకొరియా పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. అయితే ఇప్పటిదాకా అతన్ని కస్టడీలోకి తీసుకోకపోయినా... దేశం విడిచి వెళ్లొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును ప్రాసిక్యూటర్స్కు పంపాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయుం తీసుకోలేదని పోలీస్ ఇన్స్పెక్టర్ పార్క్ మిన్ జు చెప్పారు. ఇదిలా ఉండగా 38 ఏళ్ల ఇరాన్ సాకర్ అధికారి మాత్రం తనకే పాపం తెలియుదంటున్నారు. దక్షిణ కొరియూలో అది చట్టవిరుద్ధమన్న సంగతి తనకు తెలియదని ఆ అధికారి లబోదిబోమంటున్నాడు. -
6న తాండవ నీరు విడుదల
నీటిపారుదల శాఖ ఎస్ఈ రాంబాబు ఆయకట్టుదారులతో అత్యవసర సమావేశం నాతవరం : తాండవ ఆయకట్టుదారులు, ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు ఆగస్టు 6వ తేదీన ఖరీఫ్ పంటకు సాగు భూములకు నీరు విడుదల చేయనున్నట్టు నీటిపారుదల శాఖ ఎస్ఈ రాంబాబు చెప్పారు. తాండవ ైరె తుల విశ్రాంతి భవనంలో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఆయకట్టుదారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎంపీపీ సంగంపల్లి సన్యాసి దేముడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్ఈ మాట్లాడుతూ జిల్లాలో తాండవ ఒక్కటే ప్రధాన జలాశయమని తెలిపారు. ఇతర జలాశయాలతో పోల్చుకుంటే తాండవలో మాత్రమే నీటి మట్టం బాగుందన్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 374 అడుగులు ఉందన్నారు. ఖరీఫ్ పంటకు 62 రోజులు మాత్రమే సరాఫరా అవుతుందన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు ఐక్యంగా నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఏటా తాండవ నీరు విడుదల చేసిన వెంటనే వర్షం కురవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దాని ప్రకారం ఏమాత్రం వర్షం కురిసినా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. నీరు విడుదల తేదీని ఖరారు చేయాలని ఆయన కోరగా, 6వ తేదీన విడుదల చేస్తేనే రైతులకు ఉపయోగం ఉంటుందని రెండు జిల్లాల ఆయకట్టుదారులు సూచించారు. వారి కోరిక మేరకు ఆ తేదీన నీటిని విడుదల చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా కొందరు నీటి సంఘాధ్యక్షులు, ైరైతులు కాలువల సమస్యలను ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా శివారు భూములకు నీరందక పోవడం, సిమెంటు లైనింగ్ పనులు కూలిపోవడం తదతర అంశాలను వివరించారు. రైతులు, ప్రజాప్రతినిధులు తెలియజేసిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాతవరం ఎంపీపీ సింగంపల్లి సన్యాసిదేముడు, జెడ్పీటీసీ సభ్యుడు కరక సత్యనారాయణ, నర్సీపట్నం ఎంపీపీ సుకల రమణమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు చదలవాడ సువర్ణలత, డీఈ షణ్ముఖరావు, వ్యవసాయశాఖ ఏడీ శివప్రసాద్ విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
20 ఏళ్ల అనంతరం జర్మనీకి అగ్రస్థానం
జెనీవా: ఫిఫా ప్రపంచకప్‌ను దక్కించుకున్న జర్మనీ జట్టు ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దాదాపు 20 ఏళ్ల అనంతరం ఈ జట్టు టాప్ ర్యాంకుకు చేరడం విశేషం. అలాగే రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానం దక్కించుకుంది. మూడో స్థానంలో హాలెండ్ నిలువగా ఇంగ్లండ్ పదో స్థానం నుంచి ఏకంగా 20వ స్థానానికి దిగజారింది. బ్రెజిల్ ఏడుకు, స్పెయిన్ టాప్ ర్యాంకు నుంచి ఎనిమిదికి పడిపోయాయి. -
సంబరాల్లో జర్మనీ!
-
జగజ్జేతలకు జేజేలు
జర్మనీ హీరోలకు స్వదేశంలో ఘనస్వాగతం విజయోత్సవాల్లో 5 లక్షల మంది ఒకటి కాదు.. రెండు కాదు.. 24 ఏళ్ల కల.. ప్రపంచకప్ నిరీక్షణకు ఫిలిప్ లామ్ సేన ఆదివారం తెరదించడంతో జర్మనీలో ఎటు చూసిన పండగ వాతావరణమే. ఇక ట్రోఫీతో జర్మనీ జట్టు స్వదేశానికి తిరిగి వచ్చిన వేళ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. జగజ్జేతలకు ఎర్రతివాచీతో ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ఆటగాళ్లూ అభిమానుల్లా మారిపోయి సందడి చేశారు. బెర్లిన్: రెండు పుష్కరాల తర్వాత సాకర్ ప్రపంచకప్ సాధించి కోట్ల మంది అభిమానుల ఆశల్ని నిలిపిన జర్మనీ జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. రియో డి జనీరో నుంచి మంగళవారం బెర్లిన్ చేరుకున్న ప్రపంచకప్ హీరోలకు లక్షల మంది అభిమానులు జేజేలు పలికారు. బెర్లిన్‌లోని టెగెల్ ఎయిర్‌పోర్టులో జట్టు విమానం ‘ఫన్హాన్సా’ దిగడమే ఆలస్యం బెర్లిన్‌లో సంబరాలు మొదలయ్యాయి. జర్మనీ జట్టు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓపెన్ టాప్ ట్రక్‌లో ఎయిర్‌పోర్టు నుంచి జర్మనీ ఐక్యతకు గుర్తయిన బ్రాండెన్‌బర్గ్ గేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా అశేష అభిమానులు జయజయధ్వానాలు పలికారు. కెప్టెన్ ఫిలిప్ లామ్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లంతా ప్రపంచకప్ ట్రోఫీని చేతబూని, విజయ సంకేతాలతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. కొందరు ప్లేయర్లు వినోదాత్మక గీతాలు ఆలపిస్తూ సంబరాల్లో జోష్ పెంచారు. మరికొందరు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, ఫ్యాన్స్‌తో చేతులు కలుపుతూ ఆనందాన్ని పంచుకున్నారు. స్టేజ్‌పై ఆటా పాట ప్రపంచకప్ విజయోత్సవాల్లో జర్మనీ ప్లేయర్లు సందడి చేశారు. వేలాది మంది అభిమానులు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన చోటైన ‘బ్రాండెన్‌బర్గ్ గేట్’ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్‌పై ట్రోఫీని ప్రదర్శించి, ఆ తర్వాత జట్టుగా ఫోటోలకు పోజులిచ్చారు. ఇక కొందరు ఆటగాళ్లు స్టేజ్‌పై ‘దిస్ ఈజ్ హౌ ద జర్మన్స్ విన్’ అంటూ ఆడి పాడారు. చేతిలోని సాకర్ బంతులను అభిమానులకు విసిరారు. వీటిని అందుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇక ప్రపంచకప్ సంబరాల్లో ఆటగాళ్లు ఉద్వేగానికి లోనయ్యారు. చేతిలో ట్రోఫీని పట్టుకున్న కెప్టెన్ ఫిలిప్ లామ్ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘ఇది నా చిన్ననాటి కల. ఇప్పుడిది నెరవేరింది. ప్రపంచకప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని లామ్ చెప్పాడు. ‘ఈ టైటిల్ మీదే. మీరు లేకుంటే ఇక్కడ ఉండేవాళ్లమే కాదు. అందరం చాంపియన్లమే’అని కోచ్ జోకిమ్ అన్నాడు. ప్రపంచకప్ విక్టరీ స్టాంప్ 2014 ప్రపంచకప్ విజయానికి గుర్తుగా జర్మనీ ప్రభుత్వం ప్రత్యేకంగా 50 లక్షల తపాలా బిళ్లలను ముద్రించింది. అయితే ఈ స్టాంప్‌లను ప్రపంచకప్ ఫైనల్‌కు ముందే ముద్రించడం విశేషం. ఈ సారి ఎలాగైనా జర్మనీ విజేతగా నిలుస్తుందన్న నమ్మకంతోనే స్టాంపులను ముందుగానే ముద్రించామని జర్మనీ ఆర్థిక మంత్రి వోల్ఫ్‌గాంగ్ చెప్పారు. జర్మనీ జట్టు తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 60 సెంట్ల విలువైన ఈ స్టాంప్ గురువారం నుంచి అమ్మనున్నారు. అంతకంటే ముందు ఈ స్టాంప్‌లను కోచ్ జోకిమ్తో పాటు ఆటగాళ్లకు అందజేస్తారు. -
‘సాంబా’ గడ్డపై సూపర్‌హిట్
2014 ప్రపంచకప్ విశేషాలు ► నమోదైన మొత్తం గోల్స్ - 171 ► సెల్ఫ్ గోల్స్ - 5 ► మొత్తం ఎల్లో కార్డులు - 187 ► మొత్తం రెడ్ కార్డులు - 10 ► అత్యధిక విజయాలు - జర్మనీ (6) ► ‘హ్యాట్రిక్’ల సంఖ్య - 2 (ముల్లర్-జర్మనీ; జెర్దాన్ షాకిరి-స్విట్జర్లాండ్) ► ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గని జట్లు - 9 (ఆస్ట్రేలియా, కామెరూన్, ఇంగ్లండ్, ఘనా, హోండురస్, జపాన్, రష్యా, దక్షిణ కొరియా) ► మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకుల సంఖ్య: 3 కోట్ల 42లక్షల 9వేల 873 టోర్నీ ప్రారంభానికి ముందు ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా... టోర్నీ ప్రారంభమయ్యాక అంతా సద్దుమణిగింది. అద్భుతమైన గోల్స్... అచ్చొరువొందే క్షణాలు... అంతుచిక్కని ఫలితాలు... తెరపైకి వచ్చిన కొత్త తారలు... తొలిసారి గోల్ లైన్ టెక్నాలజీ.. ఇలా అన్ని అంశాల మేళవింపుతో ‘సాంబా’ నేలపై జరిగిన 2014-ప్రపంచకప్ సూపర్‌హిట్ అయ్యింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జర్మనీ తుదకు అందరి అంచనాలను నిజంచేసి విజేతగా నిలిచింది. గోల్స్ వర్షం... మొత్తం 64 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గోల్స్ నమోదు కాలేదు. మిగతా 59 మ్యాచ్‌ల్లో గోల్స్ కావడం ఈ టోర్నీ విశేషం. ఓవరాల్‌గా మొత్తం 171 గోల్స్‌తో ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ నమోదైన ఈవెంట్ రికార్డు సమమైంది. 1998లో ఫ్రాన్స్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లోనూ 171 గోల్స్ వచ్చాయి. అగ్రశ్రేణి జట్ల తడబాటు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్పెయిన్... నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ... క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్... వేన్ రూనీ, ఫ్రాంక్ లాంపార్డ్, స్టీవెన్ జెరార్డ్ లాంటి స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ జట్లు లీగ్ దశలోనే నిష్ర్కమించి అభిమానులను ఆశ్చర్యపరిచాయి. కోస్టారికా కేక ఘనచరిత్ర లేకపోయినా... పట్టుదలతో ఆడితే మేటి జట్లనూ బోల్తా కొట్టించవచ్చని ఈ ప్రపంచకప్‌లో పలు చిన్న జట్లు నిరూపించాయి. కేవలం 45 లక్షలు జనాభా కలిగిన కోస్టారికా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని ‘ఔరా’ అనిపించింది. ఆఫ్రికా జట్టు అల్జీరియా తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లూ నాకౌట్‌కు చేరుకొని తమ సత్తా చాటుకున్నాయి. మరోవైపు ఆసియా జట్లకు ఈ ప్రపంచకప్ నిరాశే మిగిల్చింది. ‘గ్రేట్’ కీపర్స్... ఈ ప్రపంచకప్‌లో గోల్ స్కోరర్లే కాకుండా గోల్కీపర్లూ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. గిలెర్మో ఒచోవా (మెక్సికో), నూయర్ (జర్మనీ), టిమ్ హోవార్డ్ (అమెరికా), కీలార్ నవాస్ (కోస్టారికా), రొమెరో (అర్జెంటీనా) ఒకే మ్యాచ్‌లో ఎన్నోసార్లు గోల్స్‌ను నిలువరించి తమ జట్టు పాలిట పెట్టని గోడలా నిలిచారు. ‘ఫుల్ పార్టీ’: ప్రపంచకప్ గెలిచిన తర్వాత జర్మనీ ఆటగాళ్లు జట్టు హోటళ్లో రాత్రంతా సంబరాలు చేసుకున్నారు. కోచ్ జోచిమ్ లూ కూడా ఇందులో పాలు పంచుకున్నారు. ఆటగాళ్లు తమ భార్యలు, ప్రియురాళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీకి మద్దతిచ్చిన పాప్ సింగర్ రిహానా పార్టీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్లోజ్, పొడోల్‌స్కీ, స్క్వీన్స్టీగర్, గాట్జెలు ప్రపంచకప్‌ను పట్టుకుని ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. ట్విట్టర్లో ‘ఫైనల్’ మోత: ఫైనల్ గురించి ట్విట్టర్లో రికార్డు స్థాయిలో మోత మోగింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ మ్యాచ్ గురించి విపరీతంగా స్పందించారు. జర్మనీ విజేతగా నిలిచిన మరుక్షణమే... ఒక్క నిమిషంలో 6 లక్షల 18 వేల 725 ట్వీట్స్ నమోదయ్యాయి. -
ఆడినోళ్లదే అందలం
‘ఎన్నిసార్లు విఫలమైనా మరోసారి ప్రయత్నించు. ఆలస్యమైనా... లక్ష్యం తప్పకుండా సిద్ధిస్తుంది’. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు దీనిని అక్షరాలా, ఆటలారా నిరూపించింది. గత మూడు ప్రపంచకప్‌లలో టైటిల్‌కు చేరువైనట్టే కనిపించినా... ఆఖరకు టాప్-3 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే నాలుగో ప్రయత్నంలో ‘సాంబా’ నేలపై జర్మనీ జిగేల్మంది. ఆద్యంతం స్థిరమైన ప్రదర్శనతో 24 ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్ కిరీటాన్ని హస్తగతం చేసుకుంది. ఒకరిద్దరిపై ఆధారపడితేనో, అదృష్టమో, ఎల్లవేళలా అందలం ఎక్కించలేవని... కలసికట్టుగా ఆడితేనే విజయశిఖరాన్ని అధిరోహించవచ్చని జర్మనీ బృందం చాటిచెప్పింది. థామస్ ముల్లర్, టోనీ క్రూస్, ష్వాన్‌స్టీగర్, మిరోస్లావ్ క్లోజ్, ఆండ్రీ షుర్లె, హమెల్స్, మెసుట్ ఒజిల్, సమీ ఖెడిరా, మారియో గాట్జె, గోల్‌కీపర్ నుయెర్... కోచ్ జోచిమ్ లూ... జర్మనీ విజయ సూత్రధారులుగా నిలిచారు. పాదరసంలాంటి కదలికలు... అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం... ఆటగాళ్ల మధ్య స్వార్థంలేని ఆటతీరు... కీలకదశలో ఒత్తిడికి తలొగ్గని నైజం... జర్మనీ జట్టుకు 1990 తర్వాత మరోసారి ప్రపంచకప్‌ను అందించాయి. వరుసగా నాలుగో ప్రపంచకప్ ఆడిన 35 ఏళ్ల మిరోస్లావ్ క్లోజ్ 16 గోల్స్‌తో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. - సాక్షి క్రీడావిభాగం గాట్జె ‘సూపర్ గోల్’ భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఫిలిప్ లామ్ నేతృత్వంలోని జర్మనీ 1-0 గోల్ తేడాతో చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనాపై గెలిచి నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచింది. 88వ నిమిషంలో మిరోస్లావ్ క్లోజ్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మారియో గాట్జె జర్మనీ ‘హీరో’గా అవతరించాడు. అదనపు సమయంలోని 113వ నిమిషంలో 22 ఏళ్ల మారియో గాట్జె కళ్లుచెదిరేరీతిలో గోల్ చేసి జర్మనీ విజయాన్ని ఖాయం చేశాడు. ముగ్గురు డిఫెండర్లను తప్పించుకుంటూ ఎడమ వైపు నుంచి దూసుకెళ్లిన షుర్లె క్రాస్ షాట్ సంధించాడు. ‘డి’ ఏరియాలో ఈ షాట్‌ను తన ఛాతీతో అందుకున్న గాట్జె బంతిని అద్భుతంగా నియంత్రించాడు. బంతి గాల్లో ఉండగానే తన ఎడమకాలితో షాట్ కొట్టి అర్జెంటీనా గోల్‌కీపర్ రొమెరోను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలోనే గోల్‌చేసిన తొలి సబ్‌స్టిట్యూట్ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఏడు నిమిషాలు జర్మనీ జాగ్రత్తగా ఆడి అర్జెంటీనాకు మరోసారి ‘ఏడుపే’ మిగిల్చింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీపైనే ఆధారపడిన అర్జెంటీనా... ఫైనల్లో అతిజాగ్రత్తకు పోయి తగిన మూల్యం చెల్లించుకుంది. -
విషాదంలో అర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: 1986 అనంతరం మరోసారి కప్ గెలుచుకునే సువర్ణావకాశం చేజారిందనే ఆవేదనలో అర్జెంటీనా వాసులు మునిగిపోయారు. అయితే చాలామంది తమ జట్టు ఈ టోర్నీలో చూపిన ప్రతిభపై సంతోషం వ్యక్తం చేసినా ఇంకొందరు మాత్రం తమ కోపాన్ని విధ్వంసకర రీతిలో వ్యక్తం చేశారు. ఫైనల్ అవగానే కొందరు ఫలితంతో సంబంధం లేకుండా తమ దేశ పతాకాలతో తిరుగుతూ సంబరాలు జరుపుకున్నారు. మెస్సీ బృందాన్ని పొగుడుతూ బాణసంచా కాల్చారు. డ్రమ్స్ వాయిస్తూ ట్రాఫిక్ లైట్లు, బస్ స్టాప్స్ పైకి ఎక్కి నృత్యాలు చేశారు. అయితే కొన్ని గంటల అనంతరం అల్లరి మూకలకు పెట్టింది పేరైన ‘బారా బ్రవాస్’ రంగంలోకి దిగింది. సెక్యూరిటీగా ఉన్న పోలీసులపైకి వీరు రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో వెంటనే పోలీసులు రబ్బర్ బుల్లెట్స్, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులు, 40 మంది ఇతరులు గాయపడినట్టు మీడియా పేర్కొంది. జట్టుకు ఘనస్వాగతం: అర్జెంటీనా జట్టుకు స్వదేశంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఇక్కడికి చేరుకున్న మెస్సీ బృందానికి విమానాశ్రయంలో వేలాది మంది శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా దేశాధ్యక్షుడు క్రిస్టినా కిర్చ్నెర్ను కోచ్ సాబెల్లాతో కలిసి ఆటగాళ్లు కలుసుకున్నారు. దారి పొడుగునా అభిమానులు నిలబడి దేశ పతాకాలు ఊపుతూ కనిపించారు. -
ఇటు హోరు... అటు భోరు
సంబరాల్లో జర్మనీ బెర్లిన్: జర్మనీలో ఇప్పుడు ఎటుచూసినా పండగ వాతావరణమే. ఆదివారం రాత్రి ఆ దేశస్థులు అసలు నిద్రపోలేదనడంలో సందేహం లేదు. సమయంతో పాటు వయసుతో సంబంధం లేకుండా వారు తనివి తీరా సంబరాలు చేసుకున్నారు. రాజధాని బెర్లిన్ అయితే బాణసంచా వెలుగులతో నిండిపోయింది. వీధుల్లో అభిమానుల చిందులకు అంతే లేకుండా పోయింది. అదే పనిగా తమ కార్ల హారన్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 25వేలకు పైగా అభిమానులు బెర్లిన్‌కు తరలివెళ్లి దేశ పతాకాన్ని చూపుతూ అంతటా తిరుగాడుతూ కనిపించారు. ప్రముఖ బ్రాండెన్‌బర్గ్ గేట్ దగ్గర సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. స్పేస్ నుంచి శుభాకాంక్షలు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టుకు అంతరిక్షం నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి. స్పేస్ స్టేషన్లో ఉన్న జర్మన్ వాసి అలెగ్జాండర్ గెర్స్ట్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘మనకు మరో నక్షత్రం జత కలిసింది’ అంటూ నాలుగు స్టార్స్‌తో కూడిన జర్మన్ జెర్సీని వేసుకున్న తన ఫొటో పంపాడు. బ్రెజిల్‌లోనూ...: తమ చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనా ఫైనల్లో ఓడిపోవడంతో బ్రెజిల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. రోడ్లపైకి వేలాదిగా వచ్చి అర్జెంటీనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చారు. -
థాంక్యూ బ్రెజిల్
ప్రపంచకప్ అప్పుడే ముగిసిందా..! ఆటగాళ్ల అద్భుత విన్యాసాలు మళ్లీ నాలుగేళ్ల దాకా ఉండవా! ఇదీ... ప్రస్తుతం సగటు సాకర్ అభిమాని మనసులోని భావన. నెలరోజులపాటు ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీల వినోదంలో ఓలలాడిన అభిమానులకు ఈ టోర్నీ ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. వాటిని నెమరు వేసుకోవడమే ఇక మిగిలింది. రొనాల్డో జట్టు నిష్ర్కమిస్తే బాధపడ్డారు.. స్వారెజ్ చేష్టలకు ఛీత్కరించుకున్నారు... నెయ్మార్ ఏడిస్తే తల్లడిల్లారు... మెస్సీ గోల్స్ చేస్తే తామే చేసినంత సంబరపడ్డారు... జర్మనీ కప్ గెలుచుకుంటే తామే చాంపియన్లయినట్లు గర్వపడ్డారు. ఫుట్‌బాల్‌పై అభిమానం.. దేశాలను, ఖండాలను దాటి ప్రపంచాన్ని ఒక్కటి చేసింది. ఎవరు ఏ దేశానికి మద్దతు పలికినా.. ఏ ఆటగాడిని అభిమానించినా.. అంతిమంగా ఫుట్‌బాల్‌ను గెలిపించారు. గతంలో ఎన్నో ప్రపంచకప్‌లు జరిగినా.. అన్నింటినీ తలదన్నే విధంగా నిర్వహించిన బ్రెజిల్ ఆతిథ్యం అమోఘం. ప్రపంచకప్ కోసం తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు ఎదురైనా.. స్వదేశంలో ప్రజలు నిరసన తెలిపినా.. సమర్థవంతమైన నిర్వహణతో చివరికి అదే ప్రజలతో జేజేలు కొట్టించుకుంది. తమ జట్టు ప్రపంచకప్‌ను గెలవకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాలను బ్రెజిల్ గెలుచుకుంది. ఇక మళ్లీ ప్రపంచకప్ వినోదాల సందడి కోసం 2018 దాకా ఎదురు చూడాల్సిందే. వచ్చేసారి రష్యాలో బ్రెజిల్‌ను మించిన ఆనందం లభిస్తుందని ఆశిద్దాం. ఏమైనా ఇంత గొప్పగా ప్రపంచకప్‌ను నిర్వహించినందుకు థాంక్యూ బ్రెజిల్..! -
ఫైనల్లో అర్జెంటీనాపై జర్మనీ విజయం
-
2014 ఫిఫా వరల్డ్ చాంప్ జర్మనీ
-
జగజ్జేత జర్మనీ
ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో గెలుపు ఎక్స్ట్రా టైమ్‌లో గాట్జె అద్భుత గోల్ నిరాశపరచిన అర్జెంటీనా స్టార్ మెస్సీ ప్రైజ్‌మనీ విజేత జర్మనీ- రూ. 210 కోట్లు రన్నరప్ అర్జెంటీనా- రూ. 150 కోట్లు మూడో స్థానం (నెదర్లాండ్స్) - రూ. 132 కోట్లు నాలుగో స్థానం (బ్రెజిల్)- రూ.. 120 కోట్లు జర్మనీ సాధించింది... 24 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.... 8 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ... నాలుగోసారి సాకర్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. గత మూడు ప్రపంచకప్‌లలో సెమీస్‌కు చేరినా టైటిల్‌ను అందుకోలేకపోయిన కరువును ఎట్టకేలకు తీర్చుకుంది. ఫైనల్లో అర్జెంటీనాను ఓడించి జగజ్జేతగా అవిర్భవించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అదనపు సమయంలో గాట్జె గోల్ చేసి జర్మనీకి ‘గాడ్’గా అవతరించాడు. రియో డి జనీరో: ఊహించినట్లుగానే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ హోరాహోరీగా సాగింది. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మారియో గాట్జె ఎక్స్ట్రా టైమ్ (113వ నిమిషం)లో ఏకైక గోల్ చేయడంతో... భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. నాలుగోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సగర్వంగా అందుకుంది. జర్మనీ ఆటగాళ్లు పదేపదే దాడులు చేసినా అర్జెంటీనా డిఫెండర్లు సమర్థంగా నిలువరించడంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి. అయితే రెండో ఎక్స్ట్రా టైమ్‌లో షుర్లే ఇచ్చిన క్రాస్ పాస్‌ను గాట్జె ఎదతో అద్భుతంగా అదుపు చేస్తూ బలమైన కిక్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ప్రత్యర్థి గోల్ కీపర్ రొమెరో నిలువరించే ప్రయత్నం చేసినా బంతి అప్పటికే నెట్లోకి దూసుకుపోయింది. అంతే ఒక్కసారిగా జర్మనీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలితే.. అర్జెంటీనా అభిమానులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. గాట్జెకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సెమీస్‌లో బ్రెజిల్ మీద దాడికి దిగినట్లుగానే జర్మనీ ఆరంభం నుంచే అటాకింగ్ మొదలుపెట్టింది. బంతిని ఎక్కువగా ఆధీనంలోకి తీసుకుంటూ పదేపదే ప్రత్యర్థి రక్షణ శ్రేణి ఛేదించే ప్రయత్నాలు చేసింది. ఫలితంగా 4వ నిమిషంలో ఐదుగురు ఆటగాళ్లు బంతిని అదుపు చేస్తూ తొలి అటాకింగ్‌గా క్రూస్కు పాస్ ఇచ్చారు. అతను నెట్లోకి పంపినా మధ్యలో రోజో (అర్జెంటీనా) అడ్డుకున్నాడు. ఆ వెంటనే రొమెరో ఏరియాలోనే ముల్లర్ (జర్మనీ) ఎదురుదాడులు చేసినా అర్జెంటీనా అడ్డుకుంది. 10 నిమిషంలో క్రామెర్ (జర్మనీ) కొట్టిన ఫ్రీ కిక్ వృథా అయ్యింది. అదే పనిగా దాడులు చేసిన జర్మనీ 16వ నిమిషంలో క్రూస్ (జర్మనీ) కొట్టిన కార్నర్ కిక్కు సహచరులు సరిగా స్పందించలేకపోయారు. అర్జెంటీనాకు గోల్ చేసే అవకాశం 21 నిమిషంలో లభించినా హిగుయాన్ దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యాడు. 28వ నిమిషంలో రొమెరో... ముల్లర్ షాట్‌ను సమర్థంగా తిప్పికొట్టాడు. వెంటనే ముల్లర్ ఎల్లో కార్డుకు గురయ్యాడు. 30వ నిమిషంలో హిగుయాన్ (అర్జెంటీనా) దాదాపుగా గోల్ చేశాడు. జర్మనీ రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ వచ్చి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. కానీ లైన్ అంపైర్ ఆఫ్‌సైడ్‌గా తేల్చడంతో జర్మనీ ఊపిరి పీల్చుకుంది. 37వ నిమిషంలో ముల్లర్ ఇచ్చిన సెంటర్ పాస్‌ను షుర్లే గోల్ కొట్టే ప్రయత్నం చేసినా రొమెరో అడ్డుకున్నాడు. 43వ నిమిషంలో మరో షాట్‌ను ఇదే తరహాలో నిలువరించాడు. 45వ నిమిషంలో క్రూస్ కొట్టిన కార్నర్ కిక్‌ను బెనెడిక్ట్ హోవెడస్ హెడర్‌గా మల్చాడు. అయితే బంతి గోల్‌పోస్ట్‌ను తాకి రీబౌండ్ అయ్యింది. అక్కడే ఉన్న ముల్లర్ వెంటనే బంతిని మళ్లీ నెట్లోకి పంపినా రొమెరో అడ్డుకోవడంతో అర్జెంటీనా సంబరాలు చేసుకుంది. ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 63 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న జర్మనీ గోల్స్ కోసం నాలుగు ప్రయత్నాలు చేసింది. అర్జెంటీనా మూడుసార్లు ప్రయత్నించి విఫలమైంది. దాడుల్లో పదును పెంచేందుకు రెండో అర్ధభాగంలో లావెజ్జీ స్థానంలో అగుయెరో (అర్జెంటీనా)ను రంగంలోకి తెచ్చింది. వెంటనే 47వ నిమిషంలో మెస్సీ చేసిన ప్రయత్నం విఫలమైంది. 59వ నిమిషంలో క్లోజ్ కొట్టిన షాట్‌ను రొమెరో మరోసారి నిలువరించాడు. 64వ నిమిషంలో క్లోజ్ ఫౌల్కు మస్కరెనో ఫ్రీకిక్ సంధించాడు. గోల్స్ చేసే అవకాశాలు రాకపోవడంతో నిరాశ చెందిన అర్జెంటీనా ఆటగాళ్లు ప్రత్యర్థులకు కాస్త దాడులకు దిగారు. దీంతో నిమిషం (64, 65వ నిమిషం) వ్యవధిలో ఇద్దరు ఎల్లో కార్డుకు గురయ్యారు. 75వ నిమిషంలో మెస్సీ కొట్టిన బంతి వైడ్‌గా వెళ్లింది. మరో 2 నిమిషాలకు మస్కరెనో ఫౌల్కు షుర్లే ఫ్రీ కిక్ కొట్టినా ప్రయోజనం లేకపోయింది. లాహిమ్, ఓజిల్ మంచి సమన్వయంతో బంతిని తీసుకొచ్చి 82వ నిమిషంలో క్రూస్కు అందించారు. అంతే వేగంతో స్పందించిన అతను నేర్పుగా నెట్ వైపు పంపినా తృటిలో పక్కకు పోయింది. ఓవరాల్‌గా రెండో అర్ధభాగం కూడా గోల్స్ లేకుండానే ముగిసింది. అదనపు సమయంలో జర్మనీ వ్యూహాన్ని మార్చింది. ఆరంభంలోనే షుర్లే కొట్టిన బలమైన రొమెరో అడ్డుకోవడంతో మరోసారి అర్జెంటీనా గట్టెక్కింది. 97వ నిమిషంలో జర్మనీ గోల్ పోస్ట్ ముందర పలాసియో ఊహించని రీతిలో షాట్ కొట్టాడు. కానీ గోల్ కీపర్ నెయర్ తేరుకునేలోపు బంతి ఎత్తులో బయటకు వెళ్లింది. 105వ నిమిషంలో మెస్సీ, అగుయెరా మద్దతుతో పలాసియో కౌంటర్ అటాక్ చేసిన పెద్దగా పని చేయలేదు. రికార్డులు ప్రపంచకప్‌లో జర్మనీకిది 4వ టైటిల్. నాలుగు ప్రపంచకప్‌లతో జర్మనీ.. ఇటలీ సరసన చేరింది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ బ్రెజిల్(5) గెలిచింది. జర్మనీ 1954, 1974, 1990, 2014లో జగజ్జేతగా నిలిచింది. జర్మనీ తొలిసారి యూరోప్ బయట ప్రపంచకప్ సాధించింది. ఎనిమిదోసారి ఫైనల్ ఆడిన జర్మనీ 4వసారి చాంపియన్ అయింది. అర్జెంటీనాతో ఫైనల్లో మూడోసారి తలపడి రెండుసార్లు నెగ్గింది. యూరోప్, దక్షిణ అమెరికా జట్లు పదోసారి ఫైనల్లో తలపడగా.. యూరోప్ జట్లకిది మూడో టెటిల్. ఓ యూరోప్ జట్టు(జర్మనీ)అమెరికా ఖండాల్లో చాంపియన్‌గా నిలవడం ఇదే మొదటిసారి. వరుసగా మూడో ప్రపంచకప్‌లో జర్మనీ నాకౌట్ దశలో అర్జెంటీనాను చిత్తు చేసింది. జర్మనీ ఏడు దశాబ్దాల్లో ఏడు సార్లు ఫైనల్‌కు చేరి నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచింది. -
సాకర్ ప్రపంచ కప్.. చరిత్ర సృష్టించిన జర్మనీ
జర్మనీ చరిత్ర సృష్టించింది. లాటిన్ అమెరికాలో ప్రపంచ కప్ సాధించిన తొలి యూరప్ జట్టుగా ఘనత సాధించింది. ఉత్కంఠగా సాగిన సాకర్ ప్రపంచ కప్ 2014 ఫైనల్ సమరంలో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. మ్యాచ్ అదనపు సమయంలో మరియా గోయెట్జ్ ఏకైక గోల్ కొట్టి జర్మనీకి కప్ అందించాడు. జర్మనీ ప్రపంచ కప్ సాధించడమిది నాలుగోసారి కావడం విశేషం. అర్జెంటీనా, జర్మనీ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫలితం కోసం మ్యాచ్ ను అదనపు సమయం నిర్వహించారు. ఆట తొలిసగం మాదిరే ద్వితీయార్ధంలోనూ ఇరు జట్లు గోల్ కోసం చెమటోడ్చినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభంలో జర్మనీ దూకుడుగా ఆడగా ఆనక అర్జెంటీనా దూకుడు పెంచింది. జర్మనీ గోల్ పోస్ట్‌పై దాడికి దిగారు. కాగా అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 30 వ నిమిషంలో అర్జెంటీనా గోల్ చేసినా ఆఫ్ సైడ్ కావడంతో రిఫరీ నిరాకరించాడు. జర్మనీ కూడా గోల్ చేసే అవకాశాల్ని చేజార్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన సాకర్ ఫైనల్ పోరు భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటలకు బ్రెజిల్‌లోని రియోలో మొదలైంది. -
‘పీడకల’ ముగిసింది!
బ్రెజిల్‌కు మళ్లీ నిరాశ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 0-3తో పరాజయం నెదర్లాండ్స్‌కు మూడో స్థానం వరుసగా తొమ్మిదోసారి యూరోప్ జట్టుకే ఈ ఘనత ఇలా జరుగుతుందనుకుంటే... బ్రెజిల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చేది కాదేమో! ఇలా ఆడతారనుకుంటే... కోట్లాది మంది నిరసనలను కాదని 90 వేల కోట్లు ఖర్చు చేసేవారు కాదేమో! ఆతిథ్యం పరంగా ప్రపంచంతో శెభాష్ అనిపించుకున్న బ్రెజిల్... ఆట పరంగా అథఃపాతాళానికి పడిపోయింది. కప్ గెలవడం తప్ప మరేం చేసినా తక్కువే అని ఆశించిన బ్రెజిల్ అభిమానికి ‘గుండె’ పగిలింది. సెమీస్‌లో జర్మనీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన దృశ్యం కళ్ల ముందు మెదులుతుండగానే... నెదర్లాండ్స్ చేతిలోనూ చావుదెబ్బ తింది. మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతున్నంతసేపు... ఈ నరకయాతన ఎప్పుడు ముగుస్తుందా? అని చూడాల్సిన స్థితి. ఫుట్‌బాల్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే బ్రెజిల్ కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో..! బ్రెజీలియా: స్వదేశంలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ బ్రెజిల్ జట్టుకు చేదు జ్ఞాపకంగా నిలిచింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అత్యంత చెత్త ఆటతీరును ప్రదర్శించి అభిమానులకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది. కనీసం ఊరట విజయాన్నైనా దక్కించుకుని పరువు నిలబెట్టుకుందామని ఆశించిన బ్రెజిల్‌కు నెదర్లాండ్స్ చేతిలోనూ నగుబాటు తప్పలేదు. శనివారం అర్ధరాత్రి మూడో స్థానం కోసం జరిగిన ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌లో బ్రెజిల్ 0-3తో ఓడి అవమాన భారంతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 1940 తర్వాత సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం బ్రెజిల్కిదే తొలిసారి. ఆట ప్రారంభం నుంచే విరుచుకుపడిన నెదర్లాండ్స్ దూకుడును అడ్డుకోవడంలో ఆతిథ్య జట్టు పూర్తిగా విఫలమైంది. తొలి 17 నిమిషాల్లోనే రెండు గోల్స్ సమర్పించుకోవడంతో మరోసారి జట్టుపై గోల్స్ వర్షం ఖాయమనిపించినా ఎలాగోలా ఆ ‘దారుణాన్ని’ అడ్డుకోగలిగింది. డచ్ తరఫున రాబిన్ వాన్ పెర్సీ, డేలీ బ్లైండ్, జియార్జినో విజ్నాల్డమ్ గోల్స్ సాధించారు. వార్మప్‌లో తొడ కండరాలు పట్టేయడంతో హాలెండ్ మిడ్‌ఫీల్డర్ స్నైడర్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. 2002 అనంతరం అతను లేకుండా ప్రపంచకప్ ఆడడం జట్టుకిదే తొలిసారి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా అర్జెన్ రాబెన్ నిలిచాడు. నెదర్లాండ్స్ విజయంతో వరుసగా తొమ్మిదో ప్రపంచకప్‌లోనూ యూరోప్ జట్టుకే మూడో స్థానం లభించింది. ఏమాత్రం ఆత్మవిశ్వాసం లేకుండా కనిపించిన బ్రెజిల్ ఆటగాళ్లపై ప్రారంభంలోనే నెదర్లాండ్స్ పైచేయి సాధించింది. ఫలితంగా మూడో నిమిషంలోనే ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది. 2వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాడు రాబెన్ నుంచి బంతి తీసుకునే క్రమంలో బ్రెజిల్ కెప్టెన్ థియాగో సిల్వా అతడిని దురుసుగా తోసేశాడు. దీంతో రిఫరీ సిల్వాకు యెల్లో కార్డు చూపించడంతో పాటు డచ్‌కు పెనాల్టీ కిక్ అవకాశం ఇచ్చారు. దీన్ని వాన్ పెర్సీ గోల్‌గా మలిచి జట్టును 1-0 ఆధిక్యంలోకి చేర్చాడు. ఆ తర్వాత 17వ నిమిషంలోనే డచ్‌కు ఆధిక్యం పెంచుకునే అవకాశం దొరికింది. గోల్ పోస్టు ఎడమ వైపు నుంచి నెదర్లాండ్స్ ఆటగాడు కొట్టిన కిక్‌ను గాల్లోకి ఎగిరి డేవిడ్ లూయిజ్ (బ్రెజిల్) హెడర్‌తో దారి మళ్లించినా అది నేరుగా డచ్ డిఫెండర్ డేలీ బ్ల్రైండ్ ముందుకెళ్లింది. వెంటనే దాన్ని అతడు గోల్‌గా మలిచాడు. 21వ నిమిషంలో ఆస్కార్ షాట్‌ను నెదర్లాండ్స్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ద్వితీయార్ధంలో బ్రెజిల్ కాస్త మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. గోల్ కోసం తీవ్రంగానే ప్రయత్నించి ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి పదే పదే దాడులకు దిగినా ఫలితం లేకపోయింది. 59వ నిమిషంలో బ్రెజిల్ మిడ్‌ఫీల్డర్ రామిరెస్ కొట్టిన షాట్ వైడ్‌గా వెళ్లింది. ఆ తర్వాత హల్క్ కొట్టిన బంతి కూడా గోల్ బార్ పై నుంచి వెళ్లింది. ఇక మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా బ్రెజిల్‌పై మరో దెబ్బ పడింది. ఇంజ్యూరీ సమయం (90+1)లో డిఫెండర్ జారిల్ జన్‌మాత్ నుంచి అందుకున్న పాస్‌ను మిడ్‌ఫీల్డర్ విజ్నాల్డమ్ నేరుగా గోల్‌పోస్టులోకి పంపి డచ్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. విశేషాలు 14ఈ ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు సమర్పించుకున్న గోల్స్. ఓ టోర్నీలో ఇన్ని గోల్స్ ఇప్పటిదాకా ఏ జట్టు ఇవ్వలేదు 3 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఐదు సార్లు తలపడగా నెదర్లాండ్స్ మూడు సార్లు నెగ్గింది. 3 మూడో స్థానం కోసం నాలుగు సార్లు ఆడిన బ్రెజిల్ మూడు సార్లు ఓడింది. 9 గత తొమ్మిది ప్రపంచకప్‌ల్లో మూడో స్థానం యూరోప్ జట్టుకే దక్కింది. 3 వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో టాప్-3లో నిలిచిన జట్టుగా హాలెండ్ (గతంలో రన్నరప్). -
బై... బై... బ్రెజిల్!
నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ముగిసింది. బ్రెజిల్ అద్భుతంగా ఆతిథ్యమిచ్చిన టోర్నీకి రియో డి జనీరోలో ఆదివారం ముగింపు కార్యక్రమం జరిగింది. అట్టహాసంగా కాకపోయినా ఫైనల్ మ్యాచ్‌కు ముందు 15 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమం అభిమానులకు ఆహ్లాదాన్ని పంచింది. ఆరంభంలో ఈ ప్రపంచకప్‌లో పాల్గొన్న 32 జట్లకు చెందిన పతాకాలు చేతబూని సాంబా కళాకారిణులు నృత్యంతో అలరించారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరా తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పటికే ఉర్రూతలూగించిన లా.. లా.. లా.. అనే ప్రపంచకప్ గీతాన్ని మరోసారి పాడి బెల్లీ డ్యాన్స్‌తో స్టేడియాన్ని వేడెక్కించింది. అలాగే సింగర్స్ వెక్లైఫ్ జీన్, కార్లోస్ సాంటానా, అలెగ్జాండర్ పైర్స్ (బ్రెజిల్) అధికారిక ప్రపంచకప్ గీతం ‘డార్ ఉమ్ జీటో’ పాడారు. గ్రామీ అవార్డు విజేత ఇవెటో సాంగాలో బ్రెజిల్‌కు సంబంధించిన గీతాలను ఆలపించగా రియో డి జనీరోకు చెందిన స్కూల్ విద్యార్థులు సాంబా నృత్యంతో ఆకట్టుకున్నారు. తర్వాతి ప్రపంచకప్ 2018లో రష్యాలో జరుగుతుంది. -
షకీరా పాట.. ఆరంభమైన సాకర్ వేడుకలు
సాకర్ ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. బ్రెజిల్లో ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పాప్ స్టార్ షకీరా ఆటపాటలతో అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రియోలోని ఆతిథ్య వేదిక అభిమానులతో నిండిపోయింది. ఇతర విశేషాలు.. ఫైనల్ మ్యాచ్‌ను ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లమంది వీక్షిస్తారని అంచనా. అర్జెంటీనా స్టార్ మెస్సీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల అమెరికన్ జట్టు అర్జెంటీనా కప్ గెలుస్తుందని అశాభావం వ్యక్తం చేసింది. -
చిత్తుగా ఓడించినా సరే.. జర్మనీకే బ్రెజిల్ ఓటు
సాకర్ ప్రపంచ కప్ 2014లో ఆతిథ్య బ్రెజిల్ సెమీస్‌లో నిష్ర్ర్కమించింది. జర్మనీ చేతిలో చిత్తుగా ఓడి అభిమానులను కంటతడి పెట్టించింది. బ్రెజిల్ వాసులు ఈ ఓటమి తాలుకు చేదు జ్ఞాపకాలను మరచిపోయి అర్జెంటీనా, జర్మనీ మధ్య జరిగే ఫైనల్ సమరం కోసం ఎదురు చూస్తున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్ రెండూ అమెరికా ఖండపు జట్లు. అయితే ఫైనల్ పోరులో బ్రెజిల్ అభిమానులు ల మద్దతు ఎవరికో తెలుసో? జర్మనీకి. సెమీస్‌లో జర్మనీ తమ జట్టును చిత్తుగా ఓడించినా సరే ఆ జట్టే కప్ అందుకోవాలని బ్రెజిల్ వాసులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కారణమేంటంటే అర్జెంటీనా అమెరికా ఖండపు జట్టే అయినా బ్రెజిల్‌కు ఆ జట్టంటే పడదు. ఉపఖండంలో భారత్, పాకిస్థాన్‌లా వైరమన్నమాట. -
కాసేపట్లో సాకర్ మహా సంగ్రామం
కోట్లాది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సాకర్ ప్రపంచ కప్ 2014 ఫైనల్ సమరం కాసేపట్లో ఆరంభంకానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల నుంచి రియో (బ్రెజిల్)లో జరగనుంది. దక్షిణ అమెరికా జట్టు అర్జెంటీనా, యూరప్ జట్టు జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అమెరికా గడ్డపై ప్రపంచ కప్ గెలిచిన తొలి యూరప్ జట్టుగా చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో జర్మనీ బరిలోకి దిగుతుండగా, చివరి మూడుసార్లు తమ ప్రపంచ కప్ ఆశలకు గండికొట్టిన జర్మనీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో అర్జెంటీనా పట్టుదలతో ఉంది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ జర్మనీ జోరు మీదుండగా.. అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్పీపై ఎక్కువగా ఆధారపడుతోంది. విశేషాలు.. అర్జెంటీనా, జర్మనీ జట్ల మధ్య ఇది మూడో ప్రపంచకప్ ఫైనల్. ఇప్పటిదాకా ఏ రెండు జట్లు మూడుసార్లు ప్రపంచకప్ టైటిల్‌పోరులో తలపడలేదు. 1986 ఫైనల్లో అర్జెంటీనా 3-2తో జర్మనీని ఓడించగా... 1990 ఫైనల్లో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై గెలిచింది. 1986 ప్రపంచకప్ ఫైనల్లో విజయం తర్వాత ఇప్పటిదాకా అర్జెంటీనా ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించలేదు. 2006 క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘పెనాల్టీ షూటౌట్’లో 2-4తో; 2010 క్వార్టర్ ఫైనల్లో 0-4తో జర్మనీ చేతిలోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. వరుసగా మూడు ప్రపంచకప్‌లలో నాకౌట్ దశలో ఒకే జట్టు చేతిలో ఓ జట్టు ఓడిపోలేదు. ఏ జట్టుకూ సాధ్యంకాని విధంగా జర్మనీ ఎనిమిదోసారి ప్రపంచకప్ ఫైనల్లో ఆడుతోంది. ఈసారి జర్మనీ గెలిస్తే నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచి ఇటలీ సరసన నిలుస్తుంది. బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్ సాధించింది. అత్యధికంగా నాలుగుసార్లు ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీకి గుర్తింపు ఉంది. కానీ చివరి 17 మ్యాచ్‌ల్లో జర్మనీకి ఓటమి ఎదురుకాలేదు. నాకౌట్ దశలో మూడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా నిర్ణీత సమయంలో ప్రత్యర్థికి గోల్ ఇవ్వలేదు. చివరి మూడు మ్యాచ్‌ల్లో మెస్సీ ఒక్క గోల్ (షూటౌట్ మినహాయింపు) కూడా చేయలేదు. 2011లో అలెజాంద్రో సాబెల్లా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మెస్సీ ఇప్పటివరకు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గోల్ చేయకుండా ఉండటం జరుగలేదు. అర్జెంటీనా జట్టు సగటు వయసు 29. ఒకవేళ అర్జెంటీనా గెలిస్తే పెద్ద వయస్సు హోదాలో టైటిల్ నెగ్గిన జట్టుగా రికార్డు నెలకొల్పిన ఇటలీ (2006లో) స్థానాన్ని ఆక్రమిస్తుంది. -
విమర్శకుల నోటికి తాళం పడింది!
బ్రెసిలియా: 2014 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీవిజయవంతం కావడంతో విమర్శకులు ఇక నోటికి తాళం వేసుకోవాల్సిందేనని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రస్సెఫ్ స్పష్టం చేశారు. దేశంలో టోర్నీ ఆరంభానికి ముందు ఎన్నో విమర్శలను చవిచూసినా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు. తాజా మీడియా సమావేశంలో రస్సెఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.' బ్రెజిల్ సాంప్రదాయమైన దేశం. పూర్తి పరిపక్వం చెందిన దేశం కూడా. ఫుట్ బాల్ మా దేశంలో ఒక భాగం. ఇక రాజకీయాలు వేరు. రెండింటికి ముడి పెట్టడం సరికాదు' అని తెలిపారు. టోర్నీ ఆరంభంలో ఎన్నో విమర్శలు చవిచూశాం. ఒకసారి రంగంలోకి దిగాక ఏం సంభవించినా సిద్ధంగా ఉండాలన్నారు. ఆ విమర్శలకు టోర్నీ జరిగిన తీరే తగిన సమాధానం అని తెలిపారు. ఈ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో బ్రెజిల్ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినా.. గెలుపు-ఓటములు ఆటలో భాగమని ఆమె తెలిపారు. -
'మూడు' లోనూ మట్టికరిచిన బ్రెజిల్
బ్రసిల్లా: ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో ఆతిథ్య దేశం బ్రెజిల్ కు కలిసిరాలేదు. టైటిల్ రేసులో నిలవలేకపోయిన సాంబ టీమ్ కనీసం మూడో స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. మూడో స్థానం కోసం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఓడిపోయి చేదు అనుభవవాన్ని మూటగట్టుకుంది. సెమీస్ ఫైనల్లో పెనాల్టీ షూట్ తో అర్జెంటీనా చేతిలో ఓడిన నెదర్లాండ్స్ మూడో స్థానాన్ని దక్కించుకుని ఊరట చెందింది. 3-0 గోల్స్ తేడాతో బ్రెజిల్ ను ఓడించింది. ఆట తొలి అర్థభాగంలో రెండు గోల్స్ సాధించిన నెదర్లాండ్స్ ఇంజ్యూరీ సమయంలో మరో గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఆట మూడో నిమిషంలోనే నెదర్లాండ్ కెప్టెన్ రాబిన్ వాన్ పెర్సీ గోల్ కొట్టాడు. 17 నిమిషంలో డెలే బ్లిండ్ మరో గోల్ సాధించాడు. ఆట ద్వితీయార్థంలో గోల్ చేసేందుకు బ్రెజిల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివర్లో ఇంజ్యూరీ సమయంలో నెదర్లాండ్ ఆటగాడు జియార్జినియో విజ్నాల్డమ్ మరో గోల్ చేయడంతో జట్టు ఆధిక్యం 3-0కు పెరిగింది. -
అవార్డు రేస్‌లో నెయ్మార్
రియో డి జనీరో: గాయం కారణంగా ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లకు దూరమైన బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్మార్.. ఈ ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాళ్ల జాబితాలో పేరు దక్కించుకున్నాడు. శుక్రవారం ఫిఫా ఈ ఆటగాళ్ల పేర్లను విడుదల చేసింది. నాలుగు గోల్స్ సాధించిన నెయ్‌మార్‌తో పాటు అర్జెంటీనా నుంచి మెస్సీ, జేవియర్ మస్కెరానో, డి మారియా కూడా జాబితాలో ఉన్నారు. అలాగే జర్మనీ నుంచి కెప్టెన్ ఫిలిప్ లామ్, థామస్ ముల్లర్, టోనీ క్రూస్, మాట్స్ హమ్మెల్, అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), జేమ్స్ రోడ్రిగేజ్(కొలంబియా) ఉన్నారు. వీరిలో ఒకరికి ఉత్తమ ఆటగాడు అవార్డు దక్కుతుంది. గోల్డెన్‌బాల్ రేసులో జేమ్స్ రోడ్రిగేజ్ అందరికంటే ఎక్కువగా ఆరు గోల్స్‌తో ముందున్నాడు. క్రితం సారి ఈ అవార్డును ఉరుగ్వే ఆటగాడు డీగో ఫోర్లాన్ గెలుచుకున్నాడు. టాప్ గోల్ కీపర్ రేసులో నవాస్ (కోస్టారికా), మాన్యువల్ న్యూర్ (జర్మనీ), సెర్గియో రొమెరో (అర్జెంటీనా) ఉన్నారు. ఉత్తమ యువ ఆటగాడి కోసం డిపే (హాలెండ్), పోగ్బా, వరానే (ఫ్రాన్స్) పోటీ పడుతున్నారు. -
పిల్లా.. నా బావనిస్త!
రియో డి జనీరో: ఇది అర్జెంటీనా గోల్‌కీపర్ రొమెరో భార్య ఎలియానా గెర్సియో.. అమెరికా పాప్‌సింగర్ రిహన్నాకు ఇస్తున్న బంపర్ ఆఫర్! అర్జెంటీనా ప్రపంచకప్ విజేతగా నిలిస్తే.. తన భర్త రొమెరోను రిహన్నాకు వారం రోజులపాటు అరువిస్తానని ప్రకటించేసింది ఎలియానా. విషయమేంటంటే.. నెదర్లాండ్స్‌తో షూటౌట్‌కు దారితీసిన సెమీఫైనల్లో రొమెరో అద్భుత రీతిలో రెండు గోల్స్‌ను అడ్డుకొని అర్జెంటీనాను గెలిపించిన తీరుకు పాప్‌సింగర్ రిహన్నా ముచ్చటపడిపోయింది. రొమరోను మెచ్చుకుంటూ ట్విట్టర్లో అనేక పోస్ట్‌లు పెట్టింది. వీటికి ఎలియానా స్పందించింది. మరి అర్జెంటీనా గెలిస్తే తన మాట నిలబెట్టుకుంటుందో... లేక అమ్మో నా బావనిస్తనా! అంటుందో చూడాలి. -
ఆఖరి సంగ్రామం
ప్రతీకారం కోసం అర్జెంటీనా చరిత్ర కోసం జర్మనీ జీవితంలో ఒక్కసారైనా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని ప్రతి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కలలు కంటాడు. ఆ రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఒకరికి మోదం.... మరొకరికి ఖేదం కలగడానికి రంగం సిద్ధమైంది. 2014 ప్రపంచకప్ ఆఖరి సంగ్రామానికి రియో డి జనీరోలోని విఖ్యాత మరకానా స్టేడియం వేదికగా నిలువనుంది. దక్షిణ అమెరికా గడ్డపై విశ్వవిజేతగా నిలిచిన తొలి యూరోప్ జట్టుగా చరిత్ర సృష్టించేందుకు జర్మనీ... చివరి మూడుసార్లు ప్రపంచకప్‌లో ఏదో ఒక దశలో తమ అవకాశాలకు గండికొట్టిన జర్మనీని ఓడించి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో అర్జెంటీనా... ఆదివారం జరిగే అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి. రియో డి జనీరో: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ జర్మనీ... చాపకింద నీరులా ఎవరూ ఊహించని ఆటతీరుతో అర్జెంటీనా... ప్రపంచకప్‌లో తమ అంతిమ లక్ష్యానికి చేరువయ్యాయి. ఏకవ్యక్తిపై ఆధారపడకుండా కలిసికట్టుగా ఆడుతూ జర్మనీ ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉంది. థామస్ ముల్లర్, మిరోస్లావ్ క్లోజ్, షుర్లె, ఒజిల్, సమీ ఖెదిరా, ష్వాన్‌స్టీగర్, హమెల్స్, టోనీ క్రూస్, మారియో గోట్జీ తదితర ఆటగాళ్లతో జర్మనీ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. గోల్‌కీపర్ మాన్యుయెల్ నెయర్ కూడా అడ్డుగోడ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జర్మనీయే టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్రెజిల్‌తో సెమీఫైనల్లో ఆడిన తుది జట్టే ఫైనల్లోనూ ఆడే అవకాశముంది. మరోవైపు లియోనెల్ మెస్సీ మెరుపులపైనే అర్జెంటీనా ఆధారపడుతోంది. ఆరంభంలో జర్మనీని గోల్ చేయకుండా నిలువరించడమే అర్జెంటీనా ప్రథమ లక్ష్యమనిపిస్తోంది. లీగ్ దశలో ఘనా, అమెరికా జట్లు జర్మనీని తొలి అర్ధభాగంలో గోల్ చేయకుండా నిలువరించాయి. ప్రిక్వార్టర్ ఫైనల్లోనైతే అల్జీరియా 90 నిమిషాలు జర్మనీని గోల్ చేయకుండా ఆపింది. అర్జెంటీనా కూడా పక్కా ప్రణాళికతో ఆడితే జర్మనీ జోరుకు అడ్డకట్ట వేయడం సాధ్యమే. గాయాల బారిన పడ్డ డి మారియో, అగుయెరో కోలుకోవడం అర్జెంటీనాకు ఊరటనిచ్చే అంశం. మెస్సీతో కలిసి ఈ ఇద్దరు జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసే అవకాశముంది. బలం Strength సమష్టి కృషి, సమన్వయం పదాలకు ఈ జట్టు ప్రతిరూపం. ఈ టోర్నీలో ఏ దశలోనూ జర్మనీ వ్యక్తిగతంగా ఒకే ఆటగాడిపై ఆధారపడిన దాఖలాలు కనిపించలేదు. అర్జెంటీనా అంటే మెస్సీ, పోర్చుగల్ అంటే క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ అంటే నెయ్మార్... కానీ జర్మనీ అంటే ఒక జట్టు అనే ట్వీట్ సామాజిక సైట్లలో విశేషంగా ఆకట్టుకుంటోంది. అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ అన్నీ మెస్సీనే. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మెస్సీకే నాలుగుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు దక్కడం అతనికున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ తన సహచరులకు 21 సార్లు గోల్ చేసే అవకాశాలను సృష్టించాడు. బలహీనత Weakness ఎవరూ ఊహించనివిధంగా ఒక్కసారిగా తడబడటం ఆందోళన కలిగించే అంశం. ఘనాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తొమ్మిది నిమిషాల వ్యవధిలో జర్మనీ రెండు గోల్స్ సమర్పించుకొని వెనుకబడింది. పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు మినహా మిగతా నాలుగు జట్లు జర్మనీపై గోల్స్ చేయడం ఆ జట్టు డిఫెన్స్ దుర్బేధ్యం కాదనే విషయం రుజువు చేస్తోంది. మెస్సీపైనే పూర్తిగా ఆధారపడటం. ఒకవేళ మెస్సీకి మ్యాచ్ మధ్యలో గాయమైతే అతని స్థానాన్ని భర్తీచేసే వాళ్లు కనిపించడంలేదు. ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జర్మనీపై ఉన్న రికార్డు బాగోలేదు. ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించి అర్జెంటీనాకు 28 ఏళ్లయింది. అవకాశం Opportunity 84 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అమెరికా గడ్డపై ఇప్పటిదాకా ఏ యూరోప్ జట్టు టైటిల్ సాధించలేదు. 1962 (చిలీ)లో చెకోస్లొవేకియా; 1970 (మెక్సికో)లో ఇటలీ; 1986 (మెక్సికో)లో పశ్చిమ జర్మనీ; 1994 (అమెరికా)లో ఇటలీ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నాయి. ఐదో ప్రయత్నంలోనైనా జర్మనీ ఈ అడ్డంకిని అధిగమిస్తుందో లేదో వేచి చూడాలి. అమెరికా గడ్డపై ఇప్పటివరకు ఆరు ప్రపంచకప్‌లు (1930 ఉరుగ్వే; 1950 బ్రెజిల్; 1962 చిలీ; 1970, 1986 మెక్సికో; 1994 అమెరికా) జరిగాయి. ఆరింట్లోనూ దక్షిణ అమెరికా జట్లకే టైటిల్ లభించింది. ఒకవేళ అర్జెంటీనా నెగ్గితే ఏడోసారీ దక్షిణ అమెరికా జట్టు ఖాతాలోనే టైటిల్ చేరుతుంది. ముప్పు Threat సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు చేరుకోవడం, చివరి మెట్టుపై బోల్తా పడటం జర్మనీకి అలవాటుగా మారింది. గతంలో నాలుగుసార్లు ఫైనల్లో; నాలుగుసార్లు సెమీఫైనల్లో జర్మనీ ఓడిపోయింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే జర్మనీకి గత చరిత్ర అనుకూలంగా లేదనే విషయం సూచిస్తోంది. 24 ఏళ్లుగా టైటిల్ కోసం వేచి చూస్తున్న జర్మనీ ఈ అవకాశాన్ని వదులుకునే ప్రసక్తేలేదు. మెస్సీని ఎలా కట్టడి చేయాలో ఇప్పటికే జర్మనీ ‘పక్కా స్కెచ్’ గీసింది. జర్మనీ ఆరంభంలోనే గోల్ చేసి ఒత్తిడి పెంచితే కష్టం. విశేషాలు అర్జెంటీనా, జర్మనీ జట్ల మధ్య ఇది మూడో ప్రపంచకప్ ఫైనల్. ఇప్పటిదాకా ఏ రెండు జట్లు మూడుసార్లు ప్రపంచకప్ టైటిల్‌పోరులో తలపడలేదు. 1986 ఫైనల్లో అర్జెంటీనా 3-2తో జర్మనీని ఓడించగా... 1990 ఫైనల్లో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై గెలిచింది. 1986 ప్రపంచకప్ ఫైనల్లో విజయం తర్వాత ఇప్పటిదాకా అర్జెంటీనా ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించలేదు. 2006 క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘పెనాల్టీ షూటౌట్’లో 2-4తో; 2010 క్వార్టర్ ఫైనల్లో 0-4తో జర్మనీ చేతిలోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. వరుసగా మూడు ప్రపంచకప్‌లలో నాకౌట్ దశలో ఒకే జట్టు చేతిలో ఓ జట్టు ఓడిపోలేదు. ఏ జట్టుకూ సాధ్యంకాని విధంగా జర్మనీ ఎనిమిదోసారి ప్రపంచకప్ ఫైనల్లో ఆడుతోంది. ఈసారి జర్మనీ గెలిస్తే నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచి ఇటలీ సరసన నిలుస్తుంది. బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్ సాధించింది. త్యధికంగా నాలుగుసార్లు ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీకి గుర్తింపు ఉంది. కానీ చివరి 17 మ్యాచ్‌ల్లో జర్మనీకి ఓటమి ఎదురుకాలేదు. నాకౌట్ దశలో మూడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా నిర్ణీత సమయంలో ప్రత్యర్థికి గోల్ ఇవ్వలేదు. చివరి మూడు మ్యాచ్‌ల్లో మెస్సీ ఒక్క గోల్ (షూటౌట్ మినహాయింపు) కూడా చేయలేదు. 2011లో అలెజాంద్రో సాబెల్లా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మెస్సీ ఇప్పటివరకు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గోల్ చేయకుండా ఉండటం జరుగలేదు. అర్జెంటీనా జట్టు సగటు వయసు 29. ఒకవేళ అర్జెంటీనా గెలిస్తే పెద్ద వయస్సు హోదాలో టైటిల్ నెగ్గిన జట్టుగా రికార్డు నెలకొల్పిన ఇటలీ (2006లో) స్థానాన్ని ఆక్రమిస్తుంది. -
సాకర్ కిక్
ఫుట్‌బాల్ అంటే కేవలం ఓ ఆటేనా..! 22 మంది ఆటగాళ్లు ఓ బంతి కోసం చేసే విన్యాసాలేనా..! కాదేమో..! ఫుట్‌బాల్ ఓ ఆటే అయితే నెల రోజులుగా ప్రపంచం ఎందుకు ఊగిపోయింది..? ఇంకా ఏదో ఉంది. ఏంటది..? ఫుట్‌బాల్ అంటే... ప్రపంచాన్ని ఏకం చేసే ఓ మతం. ఫుట్‌బాల్ అంటే... వేల కోట్ల రూపాయలను సృష్టించే ఓ మంత్రదండం. ఫుట్‌బాల్ అంటే.... ప్రపంచానికే ప్రాణం. ఏడాది పొడవునా ప్రపంచంలో ఏదో ఒక మూలన ఏదో ఒక చోట ఓ ఫుట్‌బాల్ లీగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ వాటన్నింటినీ మించిన కిక్ ప్రపంచకప్‌లో ఉంది. అందుకే నెల రోజుల కోసం అభిమానులు నాలుగేళ్ల పాటు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఎందుకంటే ఫుట్‌బాల్ ప్రపంచక ప్ ఓ మైకం.ఒక్కసారి రుచిమరిగితే ఇక దానికి బానిస కావలసిందే. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. ప్రపంచం మొత్తం ఈ నెల రోజుల పాటు బ్రెజిల్ వైపు చూసింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ పుణ్యమాని ఆసియా దేశాల్లో అభిమానులు నిద్రలు మానేశారు. యూరోప్, అమెరికా దేశాల్లో అభిమానులు పనులు మానేశారు. ఆఫ్రికా దేశాల్లో ఆకలిని మరచిపోయారు. మైమరిపించే గోల్స్... కళ్లు చెదిరే కిక్స్... కనికట్టు చేసే పాస్‌లు... ప్రత్యర్థులను మొరటుగా తోసైనా సరే బంతిని అందుకోవాలనే పట్టుదల... మైదానంలో ఆడుతుంది 22 మందే కావచ్చు... ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఆ బంతి కోసం ఆరాటపడ్డారు. నేటితో తెర.. ప్రపంచంలో అత్యధిక ఆదరణ గల క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో ప్రతి నాలుగేళ్లకోసారి ప్రపంచకప్ జరుగుతుంది. ఇందుకోసం మూడేళ్ల ముందు నుంచే ఖండాల వారీగా క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా అదే పద్ధతిన నిర్వహించిన క్వాలిఫయర్స్ నుంచి 31 జట్లు ప్రధాన టోర్నీకి అర్హత సాధించాయి. ఆతిథ్య జట్టుగా బ్రెజిల్ నేరుగా ప్రపంచకప్‌లో ఆడింది. మొత్తంగా 32 జట్లు ఎనిమిది గ్రూఫులుగా తలపడ్డాయి. గ్రూప్ దశలోనే 16 జట్లు వెనుదిరగగా, మిగిలిన జట్లు నాకౌట్ దశల్లో ఆడుతూ వచ్చాయి. ఆదివారం (జూలై 13న) జరగనున్న తుదిపోరుతో నెల రోజులుగా సాగిన సాకర్ సంబరానికి తెరపడనుంది. బ్రెజిల్ ఆతిథ్యం అదరహో... ఎప్పుడో 1950లో తొలిసారి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్.. మళ్లీ ఇన్నాళ్లకు ఆ అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి ప్రపంచకప్ నిర్వహణలో తమదైన ముద్ర వేసేందుకు బ్రెజిల్ భారీగా ఖర్చు చేసింది. ఏకంగా 7 కొత్త స్టేడియాలు నిర్మించింది. అప్పటికే ఉన్న మరో 5 స్టేడియాలకు నూతన హంగుల్ని ఏర్పాటు చేసింది. సకల సౌకర్యాలతో కూడిన స్టేడియాలు, ఆటగాళ్లకు అన్ని వసతులతో కూడిన ఆతిథ్యం, రవాణా సౌకర్యం, బసకు అవసరమైన హోటళ్లు.. ఇలా ప్రతి విషయంలోనూ ‘భారీతనం’ ఉట్టిపడింది. ఇందుకోసం బ్రెజిల్ దాదాపు రూ. 90 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచకప్ చరిత్రలోనే ఇది గతంలో ఎన్నడూ లేనంత భారీ వ్యయం. ఇందులో స్టేడియాల నిర్మాణానికే సుమారు రూ. 22 వేల కోట్లు ఖర్చు చేశారు. దీంతోబ్రెజిల్లో వ్యతిరేకత మొదలైంది. ఓవైపు దేశంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే.. ఫుట్‌బాల్ కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడమేంటంటూ నిరసనలు వెల్లువెత్తాయి. జూన్ 12న రాజధాని బ్రెజిలియాలో ఓవైపు టోర్నీ ప్రారంభ వేడుకలు జరుగుతుండగా, స్టేడియం బయట పెద్ద సంఖ్యలో పౌరులు నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో దేశాధ్యక్షుడితోపాటు ఫిఫా అధ్యక్షుడి ఉపన్యాసం కూడా లేకుండానే వేడుకలు ముగించారు. రూ.3470 కోట్ల ప్రైజ్‌మనీ.. మనవరకైతే నమ్మడానికి కూడా కష్టంగానే ఉంటుంది.. కానీ, నిజం. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ ఇది. టోర్నీ విజేతకు రూ. 210 కోట్లు చెల్లించనుండగా, రన్నరప్‌కు రూ.150 కోట్లు దక్కనున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లతోపాటు గ్రూప్ దశలో నిష్ర్కమించిన జట్ల దాకా ప్రతి జట్టుకూ భారీగానే అందజేయనున్నారు. గతంలో ఎన్నడూ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ అందించిన దాఖలాలు లేవు. గ్రూప్ దశలోనే గోల్స్ వర్షం ఖర్చులోనేగాక గోల్స్ పరంగానూ ఈసారి ప్రపంచకప్ రికార్డులు నమోదు చేసింది. గత 19 ప్రపంచకప్ టోర్నీలను మించి.. గ్రూప్ దశలోనే గోల్స్ వర్షం కురిసింది. టోర్నీ రెండో రోజే నెదర్లాండ్స్ స్ట్రయికర్ రాబిన్ వాన్ పెర్సీ అద్భుతమైన హెడర్ గోల్ సాధించి అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. ముందుకు డైవ్ చేస్తూ గాల్లోనే తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన తీరు టోర్నీపై ఆసక్తిని మరింత పెంచింది. అర్జెంటీనా స్టార్ మెస్సి అద్భుత విన్యాసాలు ఫ్యాన్స్‌ను మైమరపిస్తే, మెక్సికో గోల్‌కీపర్ గిలెర్మో ఓకో.. ఆతిథ్య బ్రెజిల్‌ను గోల్ సాధించకుండా అడ్డుకున్న తీరు అబ్బురపరిచింది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో స్టార్ ఆవిర్భవిస్తూ గోల్స్ పండగ చేశారు. 32 జట్లు కలిసి గ్రూప్ దశలో 48 మ్యాచ్‌లాడగా, మొత్తం 129 గోల్స్ నమోదయ్యాయి. సగటున మ్యాచ్‌కు 2.9 గోల్స్ రికార్డయ్యాయి. గత ప్రపంచకప్ (2010)లో ఈ సగటు 2.3గా నమోదైంది. వ్యక్తుల కంటే జట్టు గొప్పది.. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పలువురు స్టార్ ఆటగాళ్ల పేర్లు మారుమోగాయి. వివిధ లీగ్‌లలో మెరుపులు మెరిపించే ఆయా ఆటగాళ్లు ప్రపంచకప్‌లోనూ తాము ప్రాతినిధ్యం వహించే జట్లకు ఘనవిజయాలు సాధించిపెట్టగలరని అంతా భావించారు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), లియోనెల్ మెస్సి (అర్జెంటీనా), వేన్ రూనీ (ఇంగ్లండ్), లూయిస్ స్వారెజ్ (ఉరుగ్వే), నెయ్మార్ (బ్రెజిల్), ఫెర్నాండో టోరెస్ (స్పెయిన్) వంటి ఆటగాళ్లపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ రూనీని నమ్ముకున్న ఇంగ్లండ్, రొనాల్డోను నమ్ముకున్న పోర్చుగల్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. ప్రపంచంలోనే నంబర్‌వన్ ప్లేయర్‌గా కీర్తించబడుతున్న రొనాల్డో.. తన స్థాయితో పోలిస్తే పూర్తిగా విఫలమయ్యాడు. ఆలస్యంగా టచ్‌లోకి వచ్చి తమ చివరి మ్యాచ్‌ను గెలిపించినా.. ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ స్ట్రయికర్ రూనీదీ అదే కథ. బ్రెజిల్ విజయాల్లో నెయ్మార్ కీలకపాత్రే పోషించినా.. సమష్టి కృషే ఆ జట్టును ముందుకు నడిపించింది. ఇక గత ప్రపంచకప్‌లో ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయిన మెస్సీ మాత్రం ఈసారి చెలరేగాడు. ఉరుగ్వే స్టార్ స్వారెజ్ మూర్ఖపు చర్య కారణంగా ఆ జట్టు తీవ్రంగా నష్టపోయింది. మరోవైపు ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి, సమష్టి కృషినే నమ్ముకున్న మెక్సికో, చిలీ, కోస్టారికా, కొలంబియా, అల్జీరియా వంటి జట్లు తమ స్థాయిని మించిన ప్రదర్శనతో నాకౌట్ దశకు చేరుకున్నాయి. తద్వారా వ్యక్తి కంటే జట్టు గొప్పది అని ఈ ప్రపంచకప్ ద్వారా మరోసారి నిరూపితమయింది. బ్యాడ్ బాయ్ స్వారెజ్ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా ఉన్నా.. మైదానంలో దుష్ర్పవర్తనతో బ్యాడ్ బాయ్‌గా ముద్ర వేయించుకున్న ఉరుగ్వే స్టార్ లూయిస్ స్వారెజ్ ఈ ప్రపంచకప్‌లో మరోసారి తన స్వభావాన్ని బయటపెట్టుకుని భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో స్వారెజ్.. ప్రత్యర్థి జట్టు డిఫెండర్ జియార్జియో చిలిని భుజాన్ని కొరికాడు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఫిఫా.. సంఘటనపై విచారణ జరిపి స్వారెజ్ను ఏకంగా 9 అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు 4 నెలలపాటు ఫుట్‌బాల్ జోలికే వెళ్లకుండా నిషేధం విధించింది. మూర్ఖపు చర్యతో స్వారెజ్ నిషేధానికి గురి కావడం ఇది మూడోసారి. ఫిఫాకు పంటే ఎప్పుడు ఎక్కడ ప్రపంచకప్ జరిగినా ఫిఫాకు కాసుల పంట పండుతుంది. అయితే ఈసారి మాత్రం మునుపెన్నడూ లేనంత భారీ ఆదాయం చేకూరింది. టీవీ ప్రసార హక్కులు, టిక్కెట్ల అమ్మకం, మార్కెటింగ్ వంటి మార్గాల ద్వారా టోర్నీ ముగిసేటప్పటికి ఫిఫాకు మొత్తం రూ. 24 వేల కోట్లు (4 బిలియన్ డాలర్లు) ఆదాయం లభించనున్నట్లు అంచనా. గత ప్రపంచకప్ ద్వారా లభించిన ఆదాయంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా టీవీ ప్రసార హక్కుల ద్వారానే రూ. 10 వేల కోట్లకు పైగా సమకూరింది. భారత్‌లో ఇలాంటి ఈవెంట్..! ఊహించడం కూడా కష్టమేనేమో! క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ గల మన దేశంలో ఫుట్‌బాల్‌ను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే కోల్‌కతా వంటి ఒకటి రెండు నగరాల్లో అభిమానులు ఫుట్‌బాల్ పట్ల బాగానే ఆసక్తి కనబరుస్తుంటారు. పైగా ఇటీవల ఫుట్‌బాల్ లీగ్ ఏర్పాటు కావడం, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, పలువురు బాలీవుడ్ నటులు ఇందులో భాగస్వాములు కావడం వంటి అంశాలు భారత్‌లో ఫుట్‌బాల్‌పై క్రేజ్‌ను పెంచుతున్నాయి. అంతేకాదు... 2017లో జరగనున్న అండర్-17 ప్రపంచకప్‌కు భారతే ఆతిథ్యమివ్వనుంది. భారత్‌లో ఓ అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీ జరగనుండడం ఇదే తొలిసారి. ‘డాన్’ దొరికాడు ప్రపంచకప్.. అభిమానులకు వినోదం పంచడం మాత్రమే కాదు. కరడుగట్టిన నేరస్తుణ్ని పట్టించి పోలీసులకూ సహాయపడింది. డ్రగ్స్ వ్యాపారంతో ఎన్నో ఏళ్లుగా మెక్సికో దేశాన్ని వణికించిన ‘డాన్’ సాంచెజ్ అరెలానో ఫుట్‌బాల్‌పై ఉన్న అభిమానంతో పోలీసుల వలలో చిక్కాడు. తలపై దాదాపు రూ. 14 కోట్ల (14 లక్షల పౌండ్లు) రివార్డున్న అరెలానో.. మెక్సికో-క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్‌ను టీవీలో మైమరచిపోయి చూస్తూ తిజువానా నగరంలో పోలీసులకు దొరికిపోయాడు. ఆసియా స్థాయికే భారత్ పరిమితం కేవలం లక్షల్లో మాత్రమే జనాభా కలిగిన దేశాలు కూడా ప్రపంచకప్ స్థాయిలో సత్తా చాటుతుంటే 120 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం కనీసం దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి. 1948లో జాతీయ జట్టును తీర్చిదిద్దాక భారత్ గొప్పగానే రాణించింది. ఈ క్రమంలో 1950లో క్వాలిఫయర్స్‌లో ప్రత్యర్థి జట్లు పోటీ నుంచి వైదొలగడంతో ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత కూడా సాధించింది. కానీ, బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో పలు కారణాలతో భారత్ పాల్గొనలేదు. సౌకర్యాల లేమి, ప్రయాణ ఖర్చులు భరించేవారు లేకపోవడం వంటి ఆర్థికపరమైన సమస్యలతోపాటు ప్రపంచకప్ కన్నా ఒలింపిక్స్‌కే భారత్ ఎక్కువ ప్రాధాన్యమివ్వడం వంటి అంశాలు ఇందుకు కారణం. ఆ తరువాత ఇంకెప్పుడూ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. అయితే దేశంలో జూనియర్ స్థాయి నుంచి ఫుట్‌బాల్ అభివృద్ధికి చర్యలు చేపడితే ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం రావచ్చు. - కంచర్ల శ్యాంసుందర్ అభిమానులకు కావలసినంత సరదా... బ్రెజిల్ అంటేనే సాకర్, సాంబా, సెక్స్.. అన్నవిధంగా ముద్రపడింది. అందుకు తగ్గట్టుగానే ఫుట్‌బాల్ అంటే ప్రాణమిచ్చే ఈ దేశం నెలరోజులపాటు సాకర్ ఫీవర్‌తో ఊగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు. వ్యభిచారం చట్టబద్ధమైన బ్రెజిల్లో శృంగార రసాస్వాదన మరో ఎత్తు. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే వారిని ఆకర్షించేందుకు, వారితో సంభాషించేందుకు అక్కడి సెక్స్‌వర్కర్లు ప్రత్యేకంగా శిక్షణ తరగతులకు హాజరై ఇంగ్లీష్ నేర్చుకున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. కండోమ్ కంపెనీలు లక్షల సంఖ్యలో కండోమ్‌లను సరఫరా చేసినా సరిపోలేదట! భారత్ నుంచీ వెళ్లారు..! క్రికెట్‌కే తప్ప ఫుట్‌బాల్‌కు అంతగా ఆదరణ లేదని భావించే భారత్‌నూ ఈసారి సాకర్ ఫీవర్ బాగానే పట్టుకుంది. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇక్కడి నుంచి బ్రెజిల్‌కు వెళ్లినవారు, అందులోనూ 81 ఏళ్ల తాతయ్య, బామ్మ ఉండడం విశేషం. కోల్‌కతాకు చెందిన ఈ వృద్ధ దంపతులు పన్నాలాల్ చటర్జీ, చైతాలి బ్రెజిల్‌కు వెళ్లి మరీ మ్యాచ్‌లను వీక్షించారు. సాధారణ మధ్య తరగతికి చెందిన వారే అయినా.. వీరు ప్రపంచకప్ వీక్షించేందుకు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. 1982 నుంచి ఎక్కడ ప్రపంచకప్ జరిగితే అక్కడికి వెళ్తూనే ఉన్నారు. -
ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ కు భారీ భద్రత
రియో డి జనీరో: 2014 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. గత కొన్ని రోజుల నుంచి బ్రెజిల్ ను హోరెత్తిస్తున్నఫుట్ బాల్ ఫీవర్ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. అర్జెంటీనా-జర్మనీ జట్ల మధ్య జరిగే తుది మ్యాచ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రియోలోని మారకానా స్టేడియంలో జరుగనున్నఈ మ్యాచ్ కు దాదాపు 25వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. 1990 లో జర్మనీ చేతిలో కంగుతిన్న అర్జెంటీనాకు పక్కాప్రణాళికతో బరిలో దిగాలని యోచిస్తోంది. అర్జెంటీనా కు చెందిన మాజీ స్టార్ ప్లేయర్ డిగో మారడోనా టీం సభ్యులకు సలహాలు ఇచ్చేందుకు జట్టుతో భేటీ కానున్నాడు. ఇదిలా ఉండగా రేపు జరిగే మ్యాచ్ లో ఇదిలా ఉండగా సాకర్ ప్రపంచకప్‌ను అట్టహాసంగా ముగించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.50 ని.లకు ముగింపు కార్యక్రమం మొదలవుతుంది. కొలంబియా పాప్ స్టార్ షకీరా ఈ కార్యక్రమంలో బ్రెజిల్ ఆర్టిస్ట్ కార్లినో బ్రౌన్‌తో కలిసి సందడి చేయనుంది. ఫిఫా అధికారిక గీతమైన ‘లా లా లా’తో అభిమానులను అలరించనుంది. ఫిఫా అధికారికంగా ప్రకటించిన ముగింపు కార్యక్రమంలో కార్లోస్ శాంటనా, వెసైల్ఫ్ జీన్ తమ ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. బ్రెజిల్ సూపర్ స్టార్ సాంగాలో.. అలెగ్జాండర్ పెరైస్తో కలిసి హల్చల్ చేయనున్నారు. ఇక ఫైనల్ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు స్పెయిన్ ఫుట్‌బాలర్ కార్లెస్ పుయోల్, బ్రెజిల్ సూపర్ మోడల్ గిసెలీ బుండ్చెన్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. -
బ్రెజిల్.. 'మూడై'నా దక్కాలని..!
-
కొత్త కోచ్ కావలెను
రియో డి జనీరో: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న బ్రెజిల్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. జర్మనీ కొట్టిన చావు దెబ్బ నుంచి ఎలా తేరుకోవాలా? అని తెగ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కోచ్ లూయిజ్ ఫెలిప్ స్కొలారి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ తర్వాత ఆయన స్థానంపై స్పష్టత రానుంది. 2002లో తమను చాంపియన్‌గా నిలిపిన స్కొలారిపై ఇప్పుడు బ్రెజిల్లో ఆ స్థాయిలో అభిమానం కనిపించడం లేదు. ఆయన స్థానంలో విదేశీ కోచ్‌ను తెస్తే ఎలా ఉంటుందని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (సీబీఎఫ్) ఆలోచిస్తోంది. ప్రస్తుతానికికైతే జట్టుతో స్కొలారి ఒప్పందం ముగియలేదు. మరోసారి స్వదేశీ కోచ్‌నే నియమించుకోవాలనుకుంటే కొరిన్థియాన్స్ క్లబ్‌కు గతంలో కోచ్‌గా పనిచేసిన టైట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే విదేశీ కోచ్‌ను నియమించుకునేందుకు ఇదే సరైన సమయమని అక్కడి మీడియా వాదిస్తోంది. కానీ స్కొలారిని కొనసాగిస్తే 2018 వరకు జట్టు పటిష్టమవుతుందని మాజీ కెప్టెన్ కఫు అంటున్నాడు. -
ఒక్కటైన అర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: 12 ఏళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం.. అవినీతి కుంభకోణాలతో సతమతమవుతున్న అర్జెంటీనా ఇప్పుడు ఒక్కటైంది. వారిలో దేశభక్తి మునుపెన్నడూ లేని రీతిలో ఉరకలెత్తుతోంది. దీనికి కారణం వారి ఫుట్‌బాల్ జట్టు. బ్రెజిల్లో జరుగుతున్న ప్రపంచకప్‌లో తుది పోరుకు చేరుకోవడంతో తమ దేశ సమస్యలను మర్చిపోయి సంబరాల్లో మునిగిపోతున్నారు. సెమీస్‌లో నెదర్లాండ్స్‌పై గెలవగానే బ్యూనస్ ఎయిర్స్ వీధులన్నీ హోరెత్తిపోయాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఇంత సంతోషం ఎప్పుడూ కనిపించలేదు. ‘ఫైనల్ యుద్ధంలో మేమంతా ఒక్కటిగా నిలబడనున్నాం. క్రైమ్.. ఆర్థిక సమస్యల వార్తలతో నిండే మా ముఖసంచికలు ఇప్పుడు మెస్సీ, రొమెరో ఫొటోలతో నిండిపోతున్నాయి. ఇప్పుడు మేమంతా అర్జెంటీనియన్లం. మాది ఒక్కటే మాట’ అని కియోస్క్ పత్రిక యజమాని ఓస్వాల్డో డారికా అన్నారు. -
‘చిన్న పాల్’ జర్మనీయే అంటోంది
ఒబెర్హాసన్ (జర్మనీ): ఈసారి ప్రపంచకప్ ఎవరిదంటూ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే... ‘చిన్న పాల్’ (ఆక్టోపస్) మాత్రం జర్మనీదే కప్ అని కుండ బద్దలు కొట్టింది. ఒజెర్హాసన్లో ఉన్న సీ లైఫ్ అక్వేరియంలో ఈ చిన్న పాల్ నివసిస్తోంది. జర్మనీ, అర్జెంటీనా జాతీయ పతాకాలు చుట్టిన రెండు పాత్రల్లో ఆహార పదార్థాలను ఉంచి పాల్ ముందు పెట్టారు. అది ఆహారం కోసం జర్మనీ పాత్ర రంధ్రంలోకి తన టెంటకిల్‌ను దూర్చింది. 2010 దక్షిణాఫ్రికా టోర్నీలో ఇలాంటి ‘ఆక్టోపస్ పాల్’ వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల ఫలితాలను ముందుగానే ఊహించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు దాని వారసుడిగా వచ్చిన ఈ చిన్న పాల్ జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదు మరి! -
ముగింపు ఘనంగా..!
రియో డి జనీరో: సాకర్ ప్రపంచకప్‌ను అట్టహాసంగా ముగించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఆదివారం రియోలోని మారకానా స్టేడియంలో జర్మనీ-అర్జెంటీనా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.50 ని.లకు ముగింపు కార్యక్రమం మొదలవుతుంది. కొలంబియా పాప్ స్టార్ షకీరా ఈ కార్యక్రమంలో బ్రెజిల్ ఆర్టిస్ట్ కార్లినో బ్రౌన్‌తో కలిసి సందడి చేయనుంది. ఫిఫా అధికారిక గీతమైన ‘లా లా లా’తో అభిమానులను అలరించనుంది. ఫిఫా అధికారికంగా ప్రకటించిన ముగింపు కార్యక్రమంలో కార్లోస్ శాంటనా, వెసైల్ఫ్ జీన్ తమ ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. బ్రెజిల్ సూపర్ స్టార్ సాంగాలో.. అలెగ్జాండర్ పెరైస్తో కలిసి హల్చల్ చేయనున్నారు. ఇక ఫైనల్ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు స్పెయిన్ ఫుట్‌బాలర్ కార్లెస్ పుయోల్, బ్రెజిల్ సూపర్ మోడల్ గిసెలీ బుండ్చెన్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. అర్జెంటీనాపై రూ. 2 కోట్ల జరిమానా నిబంధనలు అతిక్రమించినందుకు అర్జెంటీనా జట్టుపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం (ఫిఫా) 3 లక్షల స్విస్ ఫ్రాంక్‌లను (దాదాపు రూ. 2 కోట్లు) జరిమానాగా విధించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ‘ఫిఫా’ నిర్దేశించిన నిబంధనల ప్రకారం.... ప్రతి జట్టు నుంచి మ్యాచ్‌కు ముందు నిర్వహించే మీడియా సమావేశంలో కోచ్‌తోపాటు జట్టులోని ఒక సభ్యుడు తప్పనిసరిగా హాజరుకావాలి. అయితే అర్జెంటీనా ఈ నిబంధనను నాలుగుసార్లు ఉల్లంఘించింది. -
మెస్సీ.... జర్మనీని ఓడించు!
బ్రెజిల్ స్టార్ నెయ్మార్ కోరిక టెరోసోపోలీస్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ... ఆదివారం జరిగే సాకర్ ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ జట్టును ఓడించాలని బ్రెజిల్ స్ట్రయికర్ నెయ్మార్ కోరుకుంటున్నాడు. ఈసారి ట్రోఫీ తన బార్సిలోనా జట్టు సహచరుడు మెస్సీకే దక్కాలన్నాడు. ‘మెస్సీ కెరీర్లో ఇది చాలా ప్రధానమైంది. అతను చాలా రకాల ట్రోఫీలు గెలిచాడు. ఇది కూడా గెలిస్తే బాగుంటుంది. అతను నాకు మంచి స్నేహితుడు, సహచరుడు కూడా. అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా’ అని నెయ్మార్ పేర్కొన్నాడు. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో కొలంబియా డిఫెండర్ కామిల్లో జునిగా గట్టిగా ఢీకొట్టడంతో నెయ్మార్ మూడో వెన్నుపూసలో పగులు ఏర్పడింది. దీంతో అర్ధంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తన గాయం మరో రెండు సెంటిమీటర్లు పైన తగిలి ఉంటే వీల్‌చైర్‌కు పరిమితం కావాల్సి వచ్చేదని స్ట్రయికర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుత గాయం పెద్ద ప్రమాదమైంది కాదని తేలింది. మరో రెండు సెంటిమీటర్లు పైన తగిలితే ఇక నా పని అయిపోయేది. ఊహించడానికే ఇది భయానకంగా ఉంది. నా కెరీర్ కీలక దశలో ఇలా జరిగింది. ఏదేమైనా దీన్ని భరించాల్సిందే. జునిగా దుర్బుద్ధితో చేశాడని నేను అనుకోను. ఎవరైనా వెనుక నుంచి వచ్చి తగిలినప్పుడు మనం కూడా ఏమీ చేయలేం. మనల్ని అదుపు చేసుకోలేం కాబట్టి ఏదో ఓ దెబ్బ తగలాల్సిందే’ అని నెయ్మార్ వ్యాఖ్యానించాడు. -
పరువు కోసం ఆఖరి పోరు...
నెదర్లాండ్స్‌తో బ్రెజిల్ ఢీ గెలిస్తే ఆతిథ్య జట్టుకు కాస్త ఊరట ఓడితే మరింత డీలా చరిత్ర యూరోప్ జట్లకే అనుకూలం అర్ధరాత్రి గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం బ్రెసిలియా: పోయిన పరువును రాబట్టుకోవడానికి... నిస్తేజంగా ఉన్న అభిమానుల్లో మళ్లీ మంచి ‘మూడ్’ తీసుకురావడానికి... భవిష్యత్ కోసం బాటలు పరచడానికి... ఆతిథ్య జట్టు బ్రెజిల్ ముంగిట చివరి అవకాశం మిగిలింది. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగే ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌లో గెలిస్తే బ్రెజిల్‌కు సొంతగడ్డపై మెగా ఈవెంట్‌ను విజయంతో ముగించామన్న కాస్త సంతృప్తి కలుగుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం బ్రెజిల్ ఫుట్‌బాల్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మొత్తానికి ఆతిథ్య జట్టు మరో అగ్నిపరీక్షకు సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు మూడో స్థానం కోసం ఆడిన బ్రెజిల్ రెండుసార్లు (1938లో, 1978లో) గెలిచి, ఒకసారి (1974లో) ఓడిపోయింది. మరోవైపు నెదర్లాండ్స్ ‘మూడో స్థానం’ కోసం రెండోసారి బరిలోకి దిగుతోంది. 1998లో తొలిసారి ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌లో ఆడిన నెదర్లాండ్స్ 1-2తో క్రొయేషియా చేతిలో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గణాంకాలను పరిశీలిస్తే... గత ఎనిమిది ప్రపంచకప్‌లలో మూడో స్థానం యూరోప్ దేశానికే దక్కింది. ఈ నేపథ్యంలో చరిత్ర నెదర్లాండ్స్‌కే అనుకూలంగా ఉంది. అర్థం లేని మ్యాచ్: డచ్ కోచ్ ‘మూడో స్థానం మ్యాచ్ అనేది అర్థంలేనిది. గత 15 సంవత్సరాలుగా ఈ మాట చెబుతున్నాను. ఎందుకంటే బాగా ఆడుతోన్న జట్టుకు వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఓటమితో టోర్నీని ముగించామన్న అప్రతిష్ట వస్తుంది’ అని నెదర్లాండ్స్ కోచ్ లూయిస్ వాన్ గాల్ చేసిన వ్యాఖ్యలు ఆ జట్టు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌పై ఎంత అయోమయంగా ఉందో ఊహించుకోవచ్చు. మరోవైపు బ్రెజిల్ ఈ మ్యాచ్ గెలవాలంటూ సహచరుల్లో నెయ్మార్ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ‘సెమీఫైనల్లో ఓడినతీరు నమ్మశక్యంగా లేదు. చరిత్రలో సువర్ణాక్షరాలతో పేర్లను లిఖించుకునేందుకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాం. అయితేనేం మూడో స్థానం మ్యాచ్‌ను ఫైనల్‌గా భావించి విజయంతో టోర్నీని ముగించాలి. ఈ గెలుపు.. బాధను తగ్గించకపోవచ్చు. అయితే విజయం సాధించడం అత్యంత ముఖ్యం’ అని నెయ్మార్ జట్టు శిబిరానికి హాజరై సహచరులకు చెప్పిన మాటలు చూస్తుంటే ఆతిథ్య జట్టుకు ఆ మ్యాచ్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. సొంతగడ్డపై విశ్వవిజేతగా అవతరించాలని బ్రెజిల్... అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా సొంతం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ తమ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు కనీసం టోర్నీని విజయంతోనైనా ముగించాలనే భావనతో ఉన్నాయి. ఒక మ్యాచ్ సస్పెన్షన్ ముగియడంతో ‘ప్లే ఆఫ్’కు కెప్టెన్ థియాగో సిల్వా అందుబాటులోకి రానుండటంతో బ్రెజిల్ రక్షణపంక్తి బలోపేతం కానుంది. బ్రెజిల్ కోచ్‌గా చివరిసారి బరిలోకి దిగనున్న లూయిజ్ ఫెలిప్ స్కొలారీ ప్రయోగాలకు పెద్దపీట వేసే అవకాశముంది. ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశంరాని మాక్స్‌వెల్‌ను ఆడించే చాన్స్ ఉంది. ఫార్వర్డ్స్ లూయిజ్, ఆస్కార్, డానియెల్ అల్వెస్, ఫెర్నాన్డినో రాణించడంపై బ్రెజిల్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ‘జీవితం ముందుకుసాగిపోతుంది. తదుపరి లక్ష్యంపై మనం దృష్టిసారించాలి. మా తర్వాతి లక్ష్యం ప్లే ఆఫ్ మ్యాచ్‌లో నెగ్గి మూడో స్థానం సంపాదించడం’ అని కోచ్ స్కొలారీ తన ఉద్దేశాన్ని స్పష్టంచేశారు. సెమీఫైనల్లో ‘షూటౌట్’లో ఓడిపోవడం మినహా... నెదర్లాండ్స్ ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచింది. అదే జోరును ‘ప్లే ఆఫ్’లోనూ కొనసాగించి తొలిసారి ‘మూడో స్థానం’ పొందామన్న సంతృప్తితో తిరుగుముఖం పట్టాలనే తపనతో ఉంది. 23 మంది సభ్యులతో కూడిన నెదర్లాండ్స్ జట్టులో 22 మంది ఏదో ఒక మ్యాచ్‌లో కొన్ని నిమిషాలైనా ఆడారు. ఈ అవకాశం దక్కని మూడో గోల్‌కీపర్ మైకేల్ వోర్న్ను కోచ్ వాన్ గాల్ ఈ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది. అర్జెన్ రాబెన్, రాబిన్ వాన్ పెర్సీ, వెస్లీ స్నైడెర్, డిర్క్ క్యుట్, హంటెలార్, మెంఫిస్ మరోసారి చెలరేగితే నెదర్లాండ్స్‌కు మూడో స్థానం దక్కడం ఖాయమనుకోవాలి. ముఖాముఖిగా బ్రెజిల్, నెదర్లాండ్స్ 11 సార్లు తలపడ్డాయి. రెండు జట్లు మూడేసి మ్యాచ్‌ల్లో నెగ్గాయి. మిగతా ఐదు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఈ రెండు జట్లు నాలుగుసార్లు పోటీపడ్డాయి. రెండు జట్లు రెండేసి మ్యాచ్‌ల్లో నెగ్గాయి. చివరిసారి 2010 ప్రపంచకప్‌లో బ్రెజిల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2-1తో గెలిచింది. -
ఒక్క మ్యాచ్‌లో 15.3 కిలోమీటర్లు
సాకర్ మ్యాచ్‌లో ప్రతీ ఆటగాడు అటూ ఇటూ పరిగెత్తడం సాధారణమైన విషయం. కొందరు ప్లేయర్లు వేగంగా... మరికొందరు నెమ్మదిగా పరిగెత్తుతారు. అయితే 90 నిమిషాల పాటు సాగే సాకర్ మ్యాచ్‌లో ఒక ప్లేయర్ అత్యధికంగా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తుతాడో తెలుసా ? స్పోర్ట్స్ వీయూ ట్రాకింగ్ టెక్నాలజీ ప్రకారం సాకర్ ఆటగాడు ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 9.5 మైళ్లు (15.3 కిలోమీటర్లు) పరిగెత్తుతాడు. జట్టులో ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు ఇదే స్థాయిలో పరిగెత్తే అవకాశాల్లేవు. ఆటగాళ్లు తాము ఉన్న పొజిషన్‌ను బట్టి కొందరు ఎక్కువగా.. కొందరు చాలా తక్కువగా పరిగెత్తుతారు. మిడ్ ఫీల్డర్ అత్యధికంగా 15.3 కిలోమీటర్లు పరిగెత్తితే.. అత్యల్పంగా గోల్‌కీపర్ తేలుతాడు. మొత్తానికి ఓ మ్యాచ్‌లో గంటన్నర పాటు 22 మంది ఆటగాళ్లు మైదానంలో పరిగెత్తింది లెక్కేస్తే దాదాపు 155 కిలోమీటర్లుగా తేలింది. -
‘దస్’ కా దమ్!
ఫుట్‌బాల్‌లో ఏ జట్టు ఆడుతున్నా... అభిమానుల చూపు సహజంగా పదో నంబర్ జెర్సీ వైపే వెళుతుంది. మనకు పూర్తిగా తెలియని జట్టు బరిలోకి దిగినా 10వ నంబర్ ధరించిన ఆటగాడు కచ్చితంగా స్టార్ అయి ఉంటాడనేది ఓ నమ్మకం. ఫుట్‌బాల్‌లో ఈ నంబర్‌కు ఉన్న ప్రత్యేకత ఇది. దీనికి తగ్గట్లే... పదో నంబర్ జెర్సీలు ధరించిన వాళ్లంతా సూపర్ స్టార్స్ అయ్యారు. ఒకప్పుడు సాకర్‌లో జెర్సీ నంబర్లకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. అయితే సంఖ్యాశాస్త్రంపై ఆటగాళ్లు ఎక్కువగా దృష్టిపెట్టడంతో జెర్సీ నంబర్లపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఫుట్‌బాల్‌లో 10వ నంబర్ జెర్సీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. సాకర్ దిగ్గజం పీలే దగ్గరి నుంచి నేటి నెయ్మార్ వరకు అంతా పదో నంబర్ జెర్సీపై మనసు పారేసుకున్న వాళ్లే. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కలేదు. పీలే, మారడోనా, జిదానే ‘నం.10’ తో అద్భుతాలు సృష్టించారు. రొనాల్డినో, కాకాతో పాటు లియోనెల్ మెస్సీ, వేన్‌రూనీ ఇదే కోవలోకి వస్తారు. 2014 ప్రపంచకప్‌లో ఆయా జట్లకు చెందిన, పదో నంబర్ జెర్సీ ధరించిన స్టార్ ఆటగాళ్లు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. నెయ్మార్, మెస్సీ, స్నైడర్, కరీం బెంజెమా, పొడోల్‌స్కీ, రోడ్రిగ్వెజ్ లాంటి ఆటగాళ్లు ఈ మెగా టోర్నీలో తమ ప్రతిభతో అభిమానుల్ని కట్టిపడేశారు. బేస్‌బాల్‌తో ఆరంభం సాధారణంగా మైదానంలో జట్లను వారు వేసుకునే జెర్సీ రంగులతో గుర్తిస్తాం. కానీ ఆటగాళ్లను గుర్తించడానికి వారు వేసుకునే జెర్సీలకు నంబర్లే ఆధారం. అయితే ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపైన నంబర్లు ముద్రించడం బేస్‌బాల్‌తో ఆరంభమైంది. ఫుట్‌బాల్‌లో ఇది 1928లో మొదలైంది. ఆర్సెనల్-షెఫీల్డ్ మధ్య జరిగిన క్లబ్ మ్యాచ్‌లో తొలిసారిగా జెర్సీలకు నంబర్ల విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇక ఆటగాళ్లకు నంబర్లను స్టార్టింగ్ ఫార్మేషన్ ఆధారంగా కేటాయించేవాళ్లు. గోల్ కీపర్‌కు 1, రైట్ ఫుల్బ్యాక్కు 2, లెఫ్ట్ ఫుల్బ్యాక్కు 3, ఇలా జట్టులో ప్రతీ ఆటగాడికి వరుస క్రమంలో నంబర్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. 1 నుంచి 23 వరకు ఆటగాళ్లు తమకు నచ్చిన నంబర్లను ఎంచుకుంటున్నారు. అయితే ఇందులో జట్టులోని స్టార్ ప్లేయర్‌కి, సీనియర్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వీళ్లు తమకు నచ్చిన జెర్సీ నంబర్‌ను ఎంపిక చేసుకున్న తర్వాతే మిగిలిన వాళ్లకు అవకాశం దక్కుతుంది. హోదాకు చిహ్నం ! సాకర్‌లో స్టార్ హోదా అంత ఈజీగా రాదు.. ఆటగాడు అద్బుత ప్రతిభ కలిగినవాడై ఉండాలి. మైదానంలో చురుగ్గా కదలాలి.. ప్రత్యర్థి రక్షణశ్రేణిపై దాడులు చేయాలి.. జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాలి. జట్టు బరువు బాధ్యతలను కూడా మోయాలి. ఇదంతా ఓ సాధారణ ఆటగాడి వల్ల కాని పని. అదే స్టార్ ఆటగాడైతే.. ఏదైనా చేయగల సమర్థుడు. అందుకే సాకర్‌లో పదో నంబర్ జెర్సీ ఆ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ‘నం.10’ జెర్సీ ధరించడమంటే హోదాకు చిహ్నంగా భావిస్తారు ఆటగాళ్లు. ఈ జెర్సీ వేసుకునే అవకాశం దక్కిందంటే ఆ ఆటగాడికి జట్టులో గౌరవం ఉన్నట్లే. ఈ నంబర్ దక్కినవాళ్లు తమ స్టేటస్ ఏంటో ప్రత్యేకంగా చాటుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లక్కీ నంబర్ జెర్సీ వేసుకునే అవకాశం అంతకుముందు తామేంటో నిరూపించుకున్న వాళ్లకే దక్కుతుంది. మొత్తానికి జట్టు ఏదైనా చాలా ఏళ్ల నుంచి 10వ నంబర్ జెర్సీ ధరించే అవకాశం స్టార్లకే దక్కుతోంది. సచిన్ ‘10’డూల్కర్ సాకర్‌లో జెర్సీ నంబర్లకు విపరీతమైన క్రేజ్ ఉన్నా.. క్రికెట్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్టార్ క్రికెటర్లు వేసుకునే జెర్సీలు, వారి నంబర్లపైన మాత్రమే అభిమానులకు అమితాసక్తి. క్రికెట్లో ప్రస్తుత, మాజీ క్రికెటర్లలో సచిన్ తన పదో నంబర్ జెర్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. కెరీర్ ఆరంభంలో మాస్టర్ 99 నంబర్ జెర్సీని ధరించేవాడు. అయితే తన పేరులోని టెండూల్కర్లోని ‘10’ను లక్కీ నంబర్‌గా మార్చుకున్నాడు. ప్రారంభం నుంచి కాకపోయినా... రిటైరయ్యే వరకు సచిన్ ఈ నంబర్‌తోనే మైదానంలో అద్భుతాలు సృష్టించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహించిన సచిన్ ఈ లీగ్ నుంచి తప్పుకున్నాక అతను వేసుకున్న పదో నంబర్ జెర్సీని వేరే ఆటగాడికి జట్టు యాజమాన్యం కేటాయించలేదు. సచిన్ గౌరవార్థ్ధం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక క్లబ్ సాకర్‌లోనూ జట్టు యాజమాన్యాలు తమ ఆటగాళ్లు రిటైరైనప్పుడు అతని గౌరవార్థానికి సూచనగా వారు వేసుకునే జెర్సీ నంబర్లను ఎవరికీ కేటాయించడం లేదు. దీన్నిబట్టి స్పోర్ట్స్‌లో జెర్సీ నంబర్లకు ఉన్న ప్రాధాన్యం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు -
మన ‘మెస్సీ’ల కోసం...
నెల రోజులుగా ఉదయాన్నే ఏ పేపర్ తీసినా... ఏ టీవీ ఆన్ చేసినా ఫుట్‌బాల్... ఫుట్‌బాల్... ఇదొక్కటే మంత్రం. ఆటలోని మజాను ఆస్వాదిస్తున్న అనేక మంది చిన్నారులు... తామూ మెస్సీలా మెరవాలని తపిస్తున్నారు. అనేకమంది తల్లిదండ్రులు తమ బిడ్డను నెయ్‌మార్‌ను చేసేదెలా అని ఆలోచిస్తున్నారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడుతున్న దేశాలతో పోలిస్తే ఆటలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్ ఉంటుందా అనే భయం కూడా ఉంది. ఫుట్‌బాల్ ఆడాలనే ఆసక్తి ఉన్నా... ఎక్కడ ఎలా ఆడాలో తెలియని వాళ్లు అనేక మంది. వాళ్లందరి కోసం ఈ కథనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, పట్టణాల్లో ఫుట్‌బాల్‌కు ఉన్న అవకాశాలపై కథనం. - మొహమ్మద్ అబ్దుల్ హాది ఫుట్‌బాల్‌కు గతంలో పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్‌తో పాటు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల్లోనూ ఈ ఆట పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దశాబ్ద కాలానికి పైగా కొనసాగుతున్న కోర్టు వివాదాలు సంఘం కార్యకలాపాలకు అడ్డంకిగా మారాయి. ఫలితంగా టోర్నీలు లేక, ఆటగాళ్లు వెలుగులోకి రాక ఫుట్‌బాల్‌ను చరిత్రలోనే చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ఇప్పుడు ఆ కారు చీకట్లు తప్పుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత ఇటీవలే ఆంధ్రప్రదేశ్ (సమైక్య) జట్టు జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో పాల్గొంది. గత వారం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసమే అంటూ రిక్రూట్మెంట్ ప్రకటన ఇచ్చి ఆటను ప్రోత్సహించేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని ఉద్దేశాన్ని చాటి చెప్పింది. ఇవన్నీ ఆటకు సంబంధించి ఇరు రాష్ట్రాల్లో కలిగిన శుభపరిణామాలు. విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో సంఘాలు ప్రత్యేకంగా పని చేయబోతున్న కారణంగా కాస్త మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పరంగా ఫుట్‌బాల్ ఆటకు పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు. చాలా తక్కువ చోట్ల మాత్రమే ప్రాక్టీస్‌కు అవకాశం ఉంది. ఇప్పుడు ఏ మాత్రం శిక్షణ కొనసాగుతున్నా...టోర్నీలు నిర్వహిస్తున్నా అదంతా ఏపీ ఫుట్‌బాల్ సంఘం కార్యకలాపాల్లో భాగంగానే జరుగుతున్నాయి. వివిధ జిల్లా సంఘాలు చొరవ చూపించి ఆటను నడిపించుకుంటున్నాయి. వ్యక్తిగత ప్రతిష్ట, పరిచయాలతో క్లబ్ లీగ్, స్కూల్ లీగ్ టోర్నీలు నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయా ఆటగాళ్లకు గుర్తింపు లభించకపోయినా ఆటపై ఆసక్తితో చాలా మంది ఈ టోర్నీల్లో పాల్గొంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సెలక్షన్స్ ద్వారా పూర్తి స్థాయి రాష్ట్ర జట్లను నిర్మించుకునేందుకు అవకాశం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఫుట్‌బాల్ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ ఎ డివిజన్ స్థాయిలో 27 క్లబ్‌లు, బి డివిజన్ స్థాయిలో 11 క్లబ్‌లు ఉన్నాయి. అండర్-14 మొదలు సీనియర్ స్థాయి వరకు క్యాంప్‌లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే, మున్సిపల్ గ్రౌండ్లలో శిక్షణ లభిస్తుంది. మహిళా ఫుట్‌బాల్ జట్టు కూడా ఇక్కడ ఉంది. విజయవాడలో 12 జట్ల మధ్య రెగ్యులర్‌గా టోర్నీల నిర్వహణ జరుగుతుంది. శ్రీకాకుళంలో 11, విజయనగరంలో 9 జట్ల మధ్య క్లబ్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఇక గుంటూరు జిల్లా కూడా చురుగ్గానే ఉంది. ఇక్కడ కూడా రెగ్యులర్‌గా లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మాత్రం శాప్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. దాదాపు 200 మంది ఇక్కడ శిక్షణ పొందుతుండటం విశేషం. వీరిలో పెద్ద సంఖ్యలో అమ్మాయిలు కూడా ఉండటం విశేషం. జిల్లాలో 16 జట్లతో రెగ్యులర్‌గా టోర్నీలు జరుగుతున్నాయి. ఇతర చోట్ల చూస్తే తూర్పు, పశ్చిమ గోదావరిల్లో మాత్రం పెద్దగా ఫుట్‌బాల్ కనిపించడం లేదు. ఏలూరు, కాకినాడల్లో కొంత మంది ఆటపై ఆసక్తి చూపిస్తున్నా...ఒక క్రమపద్ధతిలో లేదు. అదే విధంగా ప్రకాశం జిల్లా కూడా ఆటలో వెనుకబడే ఉంది. అయితే ఒంగోలులో మాత్రం స్థానిక చర్చి భాగస్వామ్యంతో ఏటా రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం... విశాఖపట్నం - జగన్నాథరావు (99121 82717) శ్రీకాకుళం - రమణ (94406 77121) విజయనగరం - లక్ష్మణ్ రావు (99632 37596) విజయవాడ - కొండా (94411 20228) తూర్పు గోదావరి - కిషోర్ (98480 41486) నెల్లూరు - శాప్ కోచ్ శ్రీనివాస్ (94402 75291) రాయలసీమలో ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఫుట్‌బాల్ సంస్కృతి ఉంది. ముఖ్యంగా రాయలసీమ ఫుట్‌బాల్ టోర్నీ పేరుతో రెగ్యులర్‌గా టోర్నమెంట్ నిర్వహణ కొనసాగుతోంది. ఇక్కడి రెండు జిల్లాల్లో ప్రభుత్వ పరంగా ఆటకు అవకాశం ఉంటే...మరో జిల్లాలో ప్రైవేట్ ఆధ్వర్యంలోనే అయినా అద్భుతమైన సౌకర్యాలు ఉండటం విశేషం. కర్నూల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాయ్ సెంటర్లో ఫుట్‌బాల్ శిక్షణ సాగుతోంది. ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. జిల్లాలో 14 జట్లతో టోర్నీ నిర్వహణ సాగుతోంది. ఇక్కడ రెండు మహిళా జట్లు కూడా ఉన్నాయి. కడప జిల్లాలో 12 జట్లు లీగ్స్‌లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్లో ఇటీవల మెరుగైన సౌకర్యాలతో శిక్షణ అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గతంలో మంచి ఆసక్తి ఉన్నా...ఇప్పుడు కొంత తగ్గింది. ప్రస్తుతం ఎనిమిది జట్లు అక్కడ లీగ్‌ల కోసం నమోదై ఉన్నాయి. అనంతపురం జిల్లాది మాత్రం ఫుట్‌బాల్‌కు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. మాంచూ ఫై స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణనిస్తున్న వేర్వేరు క్రీడాంశాల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. ఇక్కడే దాదాపు వేయిమంది వరకు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉన్న హాస్టల్లో 45 మంది ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఇదే కాకుండా జిల్లాలోని ప్రతీ మండలంలో కనీసం ఒక బాలుర, ఒక బాలికల జట్టు ఉండేలా ప్రణాళికలతో ఫై అకాడమీ ముందుకు సాగుతోంది. గత కొన్నేళ్లలో రాష్ట్ర స్థాయిలో జరిగినవి కొన్ని టోర్నీలే అయినా ప్రతి చోటా అనంతపురం ఆటగాళ్లే అద్భుతంగా రాణించారు. మరిన్ని వివరాల కోసం... అనంతపురం - మాంచూ ఫై అకాడమీ, భాస్కర్ (98667 14822) కర్నూల్ - సాయ్ సెంటర్, రాజు (98852 40365) కడప - హసన్ (93474 10724) చిత్తూరు - జగన్నాథరెడ్డి (91771 42739) తొలి ప్రైవేట్ అకాడమీ... ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 22 మంది కాంట్రాక్ట్ కోచ్‌లు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రౌండ్లు, స్టేడియంలను బట్టి నిర్ణీత సమయం ప్రకారం వారు శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు బేసిక్స్ నేర్చుకునేందుకు ఇది సరిపోతుంది. అయితే ఫుట్‌బాల్‌లో సౌకర్యాలు, శిక్షణకు సంబంధించి ఆయా జిల్లా క్రీడాభివృద్ధి అధికారుల (డీఎస్డీఓ) పాత్ర నామమాత్రంగానే ఉంటోంది. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ (కడప), కర్నూల్ సాయ్ హాస్టల్, ఖమ్మం ట్రైబల్ హాస్టల్లలో మాత్రమే హాస్టల్ సౌకర్యంతో సహా పూర్తి స్థాయిలో ఫుట్‌బాల్‌లో కోచింగ్ లభిస్తోంది. అయితే తొలి సారి నిజామాబాద్‌లో ఒక ప్రైవేట్ ఫుట్‌బాల్ అకాడమీ ఇటీవల ఏర్పాటయింది. హాస్టల్ సౌకర్యంతో సహా పూర్తి స్థాయిలో ఈ అకాడమీ ఫుట్‌బాల్‌పైనే ఫోకస్ పెడుతుండటం విశేషం. తెలంగాణలో ఒకప్పుడు ఒలింపిక్ క్రీడాకారులను అందించిన హైదరాబాద్ మహా నగరంలో ఇప్పుడు ఆనాటి కళ లేదు. అయితే గతంతో పోలిక లేకున్నా...ఇప్పటికీ కొన్ని మైదానాల్లో ఫుట్‌బాల్ ప్రాణంగా భావించే ఆటగాళ్లు, కోచ్‌లు ఉన్నారు. ఎల్బీ స్టేడియం, జింఖానా మైదానం, బొల్లారం, తిరుమలగిరి, అల్వాల్, సీసీఓబీ, బార్కస్ తదితర గ్రౌండ్లలో పాటు కొన్ని జీహెచ్ఎంసీ మైదానాల్లో చురుగ్గా మ్యాచ్‌లు జరుగుతు న్నాయి. ఆసక్తి ఉన్నవారు నేర్చుకునేందుకు, రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకునేందుకు ఆయా చోట్ల మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలోని సైనిక్‌పురి భవాన్స్ కాలేజీ మైదానంలో, అల్వాల్ లయోలా కాలేజీలో ఫుట్‌బాల్ కొనసాగుతోంది. హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ నుంచి కూడా మంచి ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 15 జట్లు ఉన్నాయి. ఇటీవలే ఇక్కడ అంతర్ జిల్లా టోర్నీ భారీ ఎత్తున జరిగింది. వరంగల్‌లో ఒక మహిళా జట్టు సహా 9 టీమ్‌లు ఉన్నాయి. గతంలో చురుగ్గా ఉన్న మెదక్‌లో ప్రస్తుతం ఆ జోరు మందగించింది. నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో కూడా పెద్దగా ఫుట్‌బాల్ మనుగడలో లేదు. ఖమ్మం జిల్లాలో అసోసియేషన్ తరఫున పెద్దగా ఆట లేదు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న గిరిజన హాస్టల్లో ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ కోచ్ ఉన్నారు. నిజామాబాద్‌లో 11 జట్లతో లీగ్ కొనసాగుతోంది. మరిన్ని వివరాల కోసం... రంగారెడ్డి - జాన్ విక్టర్ (77025 36075) ఆదిలాబాద్ - రఘునాథ్ (98494 44744) నిజామాబాద్ - నాగరాజు (98855 17151) వరంగల్ - సురేందర్ (98858 75082) కరీంనగర్ - గణేశ్ (99088 39896) మెదక్ - నాగరాజు (93473 44440) నల్లగొండ - కుమార్ (99129 75877) మహబూబ్‌నగర్ -వెంకట్ (9440075365) హైదరాబాద్ ఎల్బీ స్టేడియం:హరి (90000 90701) జింఖానా మైదానం: అలీముద్దీన్ (99893 35840) తిరుమలగిరి: టోనీ (94927 28100) -
రొనాల్డో ఏం చేశాడంటే..
సెలబ్రిటీ స్టైల్.. కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులకు ఫేవరెట్ స్టార్ అయిన క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్‌కు చెందిన ప్లేయర్. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, పెట్టుబడుల విషయాల్లోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో. జీతం, బోనస్‌లు, ఇతరత్రా అడ్వర్టైజ్మెంట్లు మొదలైన వాటి రూపంలో గడిచిన ఏడాది కాలంలో అతని ఆదాయం దాదాపు రూ. 440 కోట్లుగా ఒక పత్రిక లెక్కగట్టింది. అతని మొత్తం సంపద విలువ రూ. 1,220 కోట్లని అంచనా. లైఫ్స్టయిల్పై విమర్శలు ఎలా ఉన్నా.. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో రొనాల్డోకి మంచి మార్కులే ఉంటాయి. రొనాల్డో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడతాడు. అయిదేళ్ల క్రితం రూ. 80 కోట్లతో పోర్చుగల్‌లో ఒక లగ్జరీ హోటల్ని కొన్నాడు రొనాల్డో. అప్పటికే రాజధాని లిస్బన్లో నాలుగు ఇళ్లని కొనేశాడు. ఇవి కాకుండా ఒక నలభై కోట్ల రూపాయలు పెట్టి ఒక మాన్షన్‌ని, అరవై కోట్లు పెట్టి మరో ప్రాపర్టీని కొన్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఐదంతస్తుల బిల్డింగ్‌ను కొన్నాడు. దాన్ని హోటల్‌గానో డిస్కోగానో మారుద్దామనుకున్నాడు. చివరికి ఆ రెండూ కాకుండా తనకొచ్చిన ట్రోఫీలతో మ్యూజియంగా మార్చేశాడు. సీఆర్ 7 పేరుతో దుస్తులు, కీచెయిన్స్ లాంటివన్నీ కూడా అక్కడి స్టోర్స్ విక్రయిస్తుంటాయి. రొనాల్డో గ్యారేజ్‌లో లాంబోర్గినీ, పోర్షే, మెర్సిడెస్, బెంట్లీ లాంటి లగ్జరీ కార్లు కొలువుదీరి ఉంటాయి. పొదుపు, పెట్టుబడుల విషయం అలా ఉంచితే రొనాల్డో అడపా దడపా ఫ్యాన్స్‌కి ఇతోధికంగా ఆర్థిక సహాయం కూడా చేస్తుంటాడు. మెస్సీ.. అనుకోకుండా రియల్టీలోకి.. రియల్ ఎస్టేట్‌పై ఆసక్తితో రొనాల్డో పెట్టుబడులు పెట్టగా.. మరో సాకర్ స్టార్, అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఊహించని విధంగా ఇందులోకి దిగాల్సి వచ్చింది. పొరుగింటి వారి గోల నుంచి ప్రశాంతత దక్కించుకునేందుకు మెస్సీ బలవంతంగా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. స్పెయిన్‌లోని అతని పొరుగింటి వారు తమ ఇంటికి రిపేర్లు చేసుకుంటూ.. డబ్బులు సరిపోక మధ్యలో ఆపేశారట. ఎంతో కొంతకు దాన్ని కొనమని మెస్సీని అడిగారు. అతను ససేమిరా అనడంతో.. ఆ ఇంట్లో గదులను వాళ్లు లీజుకు ఇచ్చారు. అందులో దిగినవారు రోజూ నానా గోల చేస్తుండటంతో భరించలేక రెండు ఇళ్లకు మధ్య భారీ గోడ కట్టేశాడు మెస్సీ. దీనిపై కోర్టుకెళతామని పొరుగువారు బెదిరించడంతో.. చివరికి గత్యంతరం లేక ఆ ఇంటిని కొనుక్కున్నాడు మెస్సీ. ఆ విధంగా ఇష్టం లేకున్నా రియల్టీలో ఇన్వెస్ట్ చేశాడు. -
పక్కా వ్యూహంతో లాభాల గోల్స్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను నెల రోజుల పాటు అలరించిన ప్రపంచ కప్ తుది దశకి చేరుకుంది. ఈ నెల రోజుల్లోనూ దాదాపు ప్రతి జట్టూ పోటీలో నిల్చేందుకు.. కప్ దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరాడినా కొన్ని సార్లు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలోనే డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నిష్ర్కమించగా.. వరల్డ్ కప్‌కి ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్‌పై సెమీ ఫైన ల్స్‌లో జర్మనీ ఘనంగా గెలిచింది. ఇలాంటి పరిణామాలకు ఆయా టీమ్స్ వ్యూహాలే కారణం. ఎందుకంటే.. మ్యాచ్ జరిగే గంటన్నర సమయంలో సత్తా చాటాలి. గోల్స్ చేయాలి. ప్రత్యర్థిపై గెలుపొందాలి. పటిష్టమైన వ్యూహాలతోనే ఇదంతా సాధ్యపడుతుంది. అలాగే పొదుపు.. పెట్టుబడులైనా పక్కా ప్రణాళిక ఉంటేనే, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ దూసుకెడితేనే లక్ష్యాలను (గోల్స్) సాధించగలిగేది. ఇందుకోసం ఫుట్‌బాల్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అలాంటివే కొన్ని... ఫుట్‌బాల్ టీమ్‌లో ఉండే 11 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్ర పోషిస్తుంటారు. ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి దూసుకెళ్లే బాధ్యత కొందరిదైతే.. వారికి సహాయం అందించే బాధ్యత మరికొందరిది. గోల్‌పోస్ట్‌ను కాపాడుకునే బాధ్యత గోల్కీపర్ది. విజయ సాధనలో వీరందరూ కీలకమే. ఇలా ప్రత్యేకమైన కూర్పుతో.. ప్రత్యర్థి జట్టుపై గెలుపు సాధించేందుకు ఒక్కొక్క టీమ్ ఒక్కొక్క వ్యూహం ప్రకారం ముందుకెడుతుంది. కొన్నిసార్లు దూకుడుగాను.. మరికొన్ని సార్లు రక్షణాత్మకంగాను ఆడుతూ పరిస్థితికి తగ్గట్లు వ్యూహం మార్చుకుంటూ ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక సాధన కూడా ఇలాంటిదే. ఫుట్‌బాల్ టీమ్‌లో రకరకాల ప్లేయర్స్ ఉన్నట్లుగానే మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో కూర్పులో కూడా వైవిధ్యం ఉండాలి. పెట్టుబడులకు సంబంధించి ఫిక్సిడ్ డిపాజిట్లనీ, షేర్లనీ, రియల్ ఎస్టేట్ అనీ వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్డీల్లాంటివి రక్షణాత్మకమైనవి కాగా షేర్లులాంటివి కాస్త రిస్కీ సాధనాలు. లక్ష్యాలను సాధించడంలో ఇవన్నీ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. దేనికదే ప్రత్యేకం. అలాగని పోర్ట్‌ఫోలియోను మరీ షేర్లతో నింపేసినా.. లేదా పూర్తిగా ఎఫ్‌డీలపైనే ఆధారపడినా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేం. కాబట్టి..ఫుట్‌బాల్ టీమ్లాగానే పోర్ట్‌ఫోలియో కూర్పు ముఖ్యం. ఎంత మేర రిస్కు భరించగలం అన్నదాని ఆధారంగా ఏయే సాధనాల్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆధారపడి ఉంటుంది. సమయం కీలకం.. ఫుట్‌బాల్ మ్యాచ్ గంటన్నరలో అయిపోతుంది. ఆ గంటన్నరలో ఫలితం తేలకపోతే.. మరికాస్త సమయం మాత్రమే ఉంటుంది. మొత్తం వరల్డ్ కప్ టోర్నమెంటు ఒక నెలరోజుల్లో ముగిసిపోతుంది. కానీ, ఈ టోర్నమెంటు కోసం టీమ్స్ ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తాయి. ఎన్నెన్నో వ్యూహాలు రూపొందించుకుంటాయి. పెట్టుబడుల తీరు కూడా ఇలాంటిదే. ఉన్న కాస్త సమయంలోనూ రిటైర్మెంట్ వంటి అవసరాలకు కావాల్సిన డబ్బు సమకూర్చుకోవాలంటే దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ధరల పెరుగుదలను మించి సంపదను వృద్ధి చేసే పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. ఇందుకోసం పోర్ట్‌ఫోలియోలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటికి కొంతైనా చోటు కల్పించాలన్నది నిపుణుల సూచన. అయితే, ఎవరో చెప్పారని గుడ్డిగా పోకుండా వాటి గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు కాస్తంత కసరత్తు చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. అనుకోని పరిస్థితులకు సంసిద్ధంగా.. ఎంత కసరత్తు చేసి, ఎంతగా సిద్ధం అయినా.. కొన్ని సార్లు ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటికి తగ ్గట్లుగా అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కోస్టారికా జట్టుతో జరిగిన పోటీలో నెదర్లాండ్స్ కోచ్ చేసినదిదే. నిర్ణీత సమయంలో ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటవుట్ తప్పనిసరైంది. ప్రత్యర్థి దాడుల నుంచి గోల్‌పోస్ట్‌ను రక్షించుకునే క్రమంలో ప్రధాన గోల్‌కీపర్‌ని పక్కనపెట్టి రెండో గోల్‌కీపర్ క్రూల్‌ను రంగంలోకి దింపాడు నెదర్లాండ్స్ కోచ్. ప్రధాన గోల్‌కీపర్ కన్నా క్రూల్ ఎత్తు రెండంగుళాలు ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్‌పాయింట్ అయింది. ఏకంగా 2 గోల్స్‌ని ఆపి నెదర్లాండ్స్‌ను సెమీఫైనల్స్‌కి చేర్చడంలో క్రూల్ కీలకపాత్ర పోషించాడు. పెట్టుబడుల తీరూ అప్పుడప్పుడు ఇలాగే ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చేతిలో లేని అంశాల కారణంగా కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు. కాబట్టి, ఎప్పుడైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అప్పటిదాకా అమలు చేసిన ప్రణాళికను సవరించుకుని, కొత్త వ్యూహం అమలు చేయగలిగేలా సంసిద్ధంగా ఉండాలి. పోర్ట్‌ఫోలియోలు ఇలా.. ఫుట్‌బాల్ టీమ్‌లో స్ట్రైకర్స్, మిడ్ఫీల్డర్స్, డిఫెండర్స్ అని ప్లేయర్స్ ఉంటారు. టీమ్‌లు ఎటాకింగ్ అనీ డిఫెండింగ్ అనీ రకరకాల వ్యూహాలు పాటిస్తుంటాయి. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకి దీన్ని అన్వయించుకుంటే.. యుక్తవయస్సులో వారికి ఒకలాగా .. మధ్యవయస్కులకు ఒకలాగా .. రిటైర్మెంట్కి దగ్గర్లో ఉన్న వారికి ఒకలాగా ఉంటుంది. వయస్సు, ఎంత రిస్కు తీసుకోగలం అన్న దాన్ని బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఆధారపడి ఉంటుంది. యుక్తవయస్సులో ఉన్న వారు కాస్తంత ఎక్కువ రిస్కు తీసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా, మళ్లీ తేరుకుని నిలదొక్కుకునేందుకు వారికి సమయం ఉంటుంది. కాబట్టి యుక్తవయస్సులో ఉన్నవారు.. ఎటాకింగ్ ధోరణిలో తమ పోర్ట్‌ఫోలియోలో సింహభాగం షేర్లు, ఫండ్స్ లాంటి వాటికి కేటాయించవచ్చు. వాటికి ఊతంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని సురక్షితమైన సాధనాలకు కేటాయించవచ్చు. అదే మధ్యవయస్కులూ.. మరీ ఎక్కువ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడని వారూ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉండేలా చూసుకోవచ్చు. షేర్లూ, బాండ్లూ, ప్రావిడెంట్ ఫండ్ లాంటివాటికి తలా కాస్త నిధులు కేటాయించవచ్చు. ఇక రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వారు, రిస్కును అస్సలు ఇష్టపడని వారు సురక్షితమైన సాధనాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు. దీని వల్ల పెట్టుబడులకు పెద్దగా నష్టం ఉండదు. అలాగని భారీ రాబడులూ ఉండవు. -
మైదానంలోనే కాదు.. అంతర్జాలంలోనూ ఆడుకున్నారు!
-
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు నెయ్మార్
టెరెసోపోలిస్: మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగే పోరుకు బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్మార్ హాజరు కానున్నాడు. గాయం కారణంగా జర్మనీతో జరిగిన సెమీస్‌కు నెయ్మార్ దూరం కావడం జట్టు ఆత్మస్థైరాన్ని దెబ్బతీసింది. ‘శనివారం డచ్తో జరిగే మ్యాచ్‌కు నెయ్మార్ ఇక్కడికి రానున్నాడు. అతడు జట్టుతో పాటే ఉంటాడు’ అని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య అధికార ప్రతినిధి రోడ్రిగో పైవా తెలిపారు. -
రొమెరో...ద హీరో
అర్జెంటీనాను గెలిపించిన గోల్ కీపర్ పెనాల్టీ షూటౌట్లో 4-2తో నెదర్లాండ్స్‌పై విజయం ఆదివారం జర్మనీతో ఫైనల్ ప్చ్... ఇదేం ఆట..! జర్మనీ, బ్రెజిల్‌ల సెమీస్‌లో దూకుడు చూసిన తర్వాత నెదర్లాండ్స్, అర్జెంటీనాల సెమీస్ చూసిన అభిమానుల భావన ఇది.రెండు జట్లూ అతి జాగ్రత్తకు పోయాయి.ఇరు జట్లలో కావలసినంత మంది స్టార్స్ ఉన్నా ఆటలో వేగం లేదు.90 నిమిషాల పాటు అత్యంత బోరింగ్ ఆట.ఎక్స్ట్రా టైమ్ 30 నిమిషాల్లోనూ అదే పరిస్థితి.ె పనాల్టీ షూటౌట్లో మాత్రమే మజా వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో షూటౌట్లోనే గట్టెక్కిన డచ్ జట్టు ఈసారి ‘ఢమాల్’ అంది... అర్జెంటీనా గోల్ కీపర్ రొమెరో రెండు సార్లు అద్భుతంగా డైవ్ చేసి... రెండు గోల్స్ ఆపేశాడు.అంతే... అర్జెంటీనా అభిమానుల రెండు పుష్కరాల ‘కల’ సాకారమైంది.మెస్సీ సేన ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.ఇక ఆదివారం జరిగే ఫైనల్లో జర్మనీతో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకుంటుంది. 1990 ఫైనల్లో జర్మనీ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని అర్జెంటీనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అప్పటి జట్టుకు డిగో మారడోనా సారథ్యం వహించాడు. సోమవారం మరణించిన ఫుట్‌బాల్ మాజీ దిగ్గజం అల్ఫ్రెడో డి స్టెఫానో మృతికి సంతాపకంగా మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించారు. అర్జెంటీనా ఆటగాళ్లు చేతికి ఆర్మ్ బ్యాండ్‌ను ధరించి మ్యాచ్ ఆడారు. ఫలించని వ్యూహం క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు ఊహించని ఎత్తులు వేసిన డచ్ కోచ్ వాన్ గాల్ ఈ మ్యాచ్‌లో నిరాశపర్చారు. పటిష్టమైన అర్జెంటీనా రక్షణ శ్రేణిని ఛేదించే ఎత్తుగడలు వేయలేకపోవడంతో మ్యాచ్ బోరింగ్‌గా సాగింది. కేవలం రెండంగుళాల ఎత్తును పరిగణనలోకి తీసుకుని క్వార్టర్స్ మ్యాచ్‌ను గెలిపించిన వాన్ గాల్... మెస్సీసేనను ఆపడానికి ఎలాంటి వ్యూహ రచన చేయలేకపోయారు. పెనాల్టీ షూటౌట్లో తొలి అవకాశం అనుభవజ్ఞుడికి కాకుండా వ్లార్కు ఇవ్వడాన్ని విమర్శకులు తప్పుబట్టారు. అయితే తొలి పెనాల్టీని తీసుకోవడానికి ఇద్దరు ఆటగాళ్లు నిరాకరించడంతో వ్లార్ను పంపామని ఆయన చెప్పారు. సావో పాలో: షూటౌట్లో గోల్ కీపర్ అద్భుత నైపుణ్యం... గురి తప్పని కిక్‌లు... అర్జెంటీనాను 24 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 4-2తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్ట్రా టైమ్‌లో కూడా ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని రాబట్టారు. పెనాల్టీ షూటౌట్లో కెప్టెన్ మెస్సీ, గ్యారె, అగురో, రొడ్రిగ్వేజ్లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. నెదర్లాండ్స్ ప్లేయర్లు రాబెన్, కుయుట్ గోల్స్ చేయగా, వ్లార్, స్నిడెర్ కొట్టిన బంతులను అర్జెంటీనా గోల్ కీపర్ సెర్గియో రొమెరో అద్భుతంగా అడ్డుకున్నాడు. రొమెరోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మొత్తానికి ఓ యూరోపియన్ జట్టు జర్మనీ, దక్షిణ అమెరికా ఖండానికి చెందిన అర్జెంటీనా... ఆదివారం జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. శనివారం మూడోస్థానం కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో బ్రెజిల్... నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. గత ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడిన ‘ఆరెంజ్ సేన’ ఈసారి సెమీస్‌తోనే సరిపెట్టుకుంది. ఆరంభంలో ఇరుజట్లు బంతిపై పట్టు కోసం బాగా పోరాడాయి. క్రమం తప్పకుండా పరస్పరం ఎదురు దాడులు చేసుకున్నా... రెండు జట్లు సమర్థంగా నిలువరించుకున్నాయి. దీంతో గోల్స్ చేసే అవకాశాలు తక్కువగా వచ్చాయి. 6వ నిమిషంలో రాబెన్ (డచ్) కొట్టిన ఓ షాట్‌ను అంపైర్లు ఆఫ్‌సైడ్‌గా తేల్చారు. 11వ నిమిషంలో స్నిడెర్ (డచ్) సంధించిన బంతి రొమెరోను తగులుతూ దూరంగా వెళ్లింది. 15వ నిమిషంలో మెస్సీ ఎడమ వైపు నుంచి కొట్టిన బంతిని గోల్ పోస్ట్ ముందర డచ్ గోల్ కీపర్ సిలిసెన్ చాలా తెలివిగా అందుకున్నాడు. 20వ నిమిషంలో మెస్సీ కొట్టిన ఫ్రీ కిక్‌ను గోల్ కీపర్ సిల్లెసన్ కుడివైపు డైవ్ చేస్తూ అద్భుతంగా అడ్డుకోవడంతో డచ్ ఊపిరి పీల్చుకుంది. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీని కట్టడి చేయడంలో డచ్ ఆటగాళ్లు సఫలమయ్యారు. ముఖ్యంగా రాన్ వ్లార్.. మెస్సీ వెన్నంటే ఉంటూ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 53 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న అర్జెంటీనా గోల్స్ కోసం మూడు ప్రయత్నాలు చేయగా, నెదర్లాండ్స్‌కు ఒకే ఒక్క అవకాశం వచ్చింది. కడుపు నొప్పితో బాధపడిన వాన్ పెర్సీ సకాలంలో కోలుకోవడంతో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఎక్స్ట్రా టైమ్‌లో బయటకు వెళ్లిపోయాడు. 75వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ హిగుయాన్ గోల్ చేసినంత పని చేశాడు. డచ్ రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ పెరెజ్ ఇచ్చిన పాస్‌ను హిగుయాన్ బలంగా గోల్‌పోస్ట్ వైపు పంపాడు. కానీ అది తృటిలో బయటకు వెళ్లిపోయింది. 87వ నిమిషంలో రాబెన్, స్నిడెర్ (డచ్)లను తప్పిస్తూ రోజో, గ్యారె (అర్జెంటీనా) సమయోచితంగా బంతిని ముందుకు తీసుకెళ్లారు. అయితే గోల్ పోస్ట్ దగ్గర్లో సిల్లెసన్ దాన్ని నిలువరించాడు. 90వ నిమిషంలో స్నిడెర్ (డచ్) ఇచ్చిన బంతిని రాబెన్ అర్జెంటీనా పెనాల్టీ నుంచి గోల్ పోస్ట్ లోకి పంపాడు. కానీ ఈ వింగర్ షాట్‌ను జేవియర్ మస్కరెనో సమర్థంగా కట్టడి చేశాడు. ఎక్స్ట్రా టైమ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా రొడ్రిగో పలాసియో (అర్జెంటీనా) కొట్టిన హెడర్‌ను సిల్లెసన్ సమర్థంగా నిలువరించాడు. -
మ్యాచ్ ను వీక్షించేందుకు నెయమార్..
టెరీసొపొలిస్(బ్రెజిల్): ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో భాగంగా కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మార్ మళ్లీ జట్టుతో జాయిన్ కానున్నాడు. కాకపోతే ఆడటానికి కాదు.. మ్యాచ్ ను వీక్షించడానికి నెయమార్ తిరిగి స్టేడియానికి రానున్నాడు. ప్లే ఆఫ్ లో భాగంగా శనివారం మూడో స్థానం కోసం నెదర్లాండ్స్ -బ్రెజిల్ జట్ల మధ్య ఆసక్తికర పోరును నెయమార్ వీక్షించనున్నాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ ఫుట్ బాల్ సమాఖ్య ప్రతినిధి రోడ్రిగో స్పష్టం చేశారు. ఇప్పటికే పేలవమైన ఆట తీరుతో ఫైనల్ ఆశలను నీరుగార్చుకున్న బ్రెజిల్ కనీసం మూడో స్థానంతోనైనా సరిపెట్టుకోవాలని భావిస్తోంది. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ లో కొలంబియా ఆటగాడు జాన్ ఢీకొట్టడంతో నయమార్ తీవ్రంగా గాయపడిన నెయమార్ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. -
నెదర్లాండ్ పై అర్జెంటినా విజయం!
-
28 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?
బ్రెజిల్: ప్రపంచకప్ గెలవాలన్నది ప్రతీ ఒక్క జట్టు కల. ఎన్ని అంతర్జాతీయ టైటిల్స్ గెలిచానా.. వరల్డ్ కప్ కు వచ్చే సరికి ఆ మజానే వేరుగా ఉంటుంది. అగ్రశ్రేణి జట్లును అధిగమిస్తూ ఫైనల్ రౌండ్ వరకూ నిలవడం అంటే దాని వెనుక కృషి మాత్రం చాలానే ఉంటుంది. అర్జెంటీనా.. ప్రపంచమేటి జట్లలో ఒకటి. 2014 ఫిఫా వరల్డ్ కప్ కు బరిలోకి దిగేముందు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ జట్టు ఫైనల్ కు చేరి ఔరా అనిపించింది. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం టైటిల్ గెలిచిన అర్జెంటీనా తరువాత పెద్దగా ఆకట్టుకోలేదు. 1990 లో సెమీ ఫైనల్ వరకూ చేరిన అర్జెంటీనా.. అంతకుముందు 1978, 1986లో వరల్డ్ కప్ లు గెలిచి తన ప్రస్తానానికి నాంది పలికింది. ఆ తరువాత జట్టు సమిష్టగా వైఫల్యం చెంది ఆ దేశ అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం అర్జెంటీనా ముందన్నది టైటిల్ గెలవాలనే లక్ష్యం మాత్రమే. నిన్న జరిగిన సెమీఫైనల్లో 4-2 తేడాతో గత రన్ రప్ నెదర్లాండ్స్ ను పెనాల్టీ షూటౌట్ లో కంగుతినిపించిన అర్జెంటీనా ఫైనల్ కు చేరుకుని తమ ఎదురులేదని మరోసారి నిరూపించింది. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఫైనల్ ఉన్నది చిన్నా చితకా టీం కాదు. పూర్తి టీం ఎఫెర్ట్ తో దూసుకుపోతున్న జర్మనీ. ఈ విషయం మొన్న బ్రెజిల్ తో జరిగిన మ్యాచ్ ను చూస్తే అర్దమవుతుంది. ఏకంగా ఏడు గోల్స్ చేసి ప్రపంచకప్ సెమీస్ అంకంలో కొత్త భాష్యం చెప్పిన జర్మనీతో పోరంటే అర్జెంటీనాకు కత్తిమీద సామే. ఇరుజట్లు బలాబలాను పరిశీలిస్తే మాత్రం కచ్చితంగా జర్మనీనే ముందువరుసలో ఉంది. ఇప్పటికే మూడు టైటిల్స్ గెలిచిన జర్మనీ చివరిగా 1990 లో ఫిఫా ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ను తమ సొంతచేసుకోవాలని భావిస్తోంది జర్మనీ. ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ..మ్యాచ్ మ్యాచ్ కు వ్యూహాల్ని మారుస్తూ దూసుకుపోతుంది.ఇందుకు ఫ్రాన్స్ తో జరిగిన క్వార్టర్స్ ఫైనల్ పోరు, బ్రెజిల్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చక్కటి ఉదాహరణలు. కాగా, అర్జెంటీనా మాత్రం స్టార్ ప్లేయర్ మెస్సీపైనే ఆధారపడుతూ వస్తోంది.వరుస విజయాలతో జైత్రయాత్రను అర్జెంటీనా బానే ఆకట్టుకుంటున్నా ఒక్క ఆటగాడిపైనే ఆశలు పెట్టుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. అర్జెంటీనా సుదీర్ఘ కలఫలించాలంటే సమిష్టి కృషి ఎంతైనా అవసరం అనడంలో ఎటువంటి సందేహం లేదు. -
అంతులేని శోకంలో బ్రెజిల్ అభిమానులు
-
సాక్షి స్పోర్ట్స్ 10th July 2014
-
‘బస్సంత’ అభిమానం
సావోపాలో: సాకర్ అంటే అర్జెంటీనా ఫ్యాన్స్‌కు చచ్చేంత అభిమానం. ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడ వాలిపోతారు. ఈసారి ప్రపంచకప్ సందర్భంగా నలుగురు అర్జెంటీనా అభిమానులు కాస్త వెరైటీగా ఒక బస్సు అద్దెకు తీసుకుని జట్టు వెంట తిరిగారు. గతనెల 9న బ్రెజిల్‌కు చేరుకున్న తర్వాత రూ. 9 లక్షలు చెల్లించి బస్సును అద్దెకు తీసుకున్నారు. ఇందులో నాలుగు బెడ్లు, తినడానికి డైనింగ్ టేబుల్.. ఇలా తమకు కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అర్జెంటీనా ఆడిన మూడు మ్యాచ్‌లను స్టేడియాల్లో వీక్షించారు. మరో మూడు మ్యాచ్‌ల టికెట్లు దొరక్కపోయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా స్టేడియాల దగ్గర బిగ్ స్క్రీన్లపై అందరితో కలిసి చూశారు. మొత్తానికి ఇప్పటిదాకా 10వేల కిలోమీటర్లకు పైగా బస్సులోనే ప్రయాణించారు. -
అంతులేని శోకం
చేతికి వచ్చిన పంటను తుపాన్ ముంచెత్తితే.... నోటికాడి ముద్దను ఎదుటోడు తన్నుకుపోతే..ఆ శోకం వర్ణణాతీతం...ఇప్పుడు బ్రెజిల్ అలాంటి శోకాన్నే అనుభవిస్తోంది.సొంతగడ్డపై కచ్చితంగా కప్ గెలుస్తామనే నమ్మకంతో ఉన్న సగటు అభిమానికి ఒకే ఒక్క మ్యాచ్‌తో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓడిన విధానమే దారుణం. మైదానంలో తమ ఆటగాళ్లు స్కూల్ పిల్లల కంటే ఘోరంగా ఆడిన వేళ... ప్రత్యర్థులు ఆరు నిమిషాల వ్యవధిలో తమ ఆశలను ఆవిరి చేసిన సమయాన... బ్రెజిల్ అభిమానుల వేదనకు, రోదనకు అంతేలేకుండా పోయింది. బ్రెజిలియా: సొంతగడ్డపై జర్మనీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోవడాన్ని బ్రెజిల్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవర్ని కదిలించినా.. ఎవరితో మాట్లాడినా.. ఈ ఓటమి గురించే చర్చ. దాదాపు నెల రోజులుగా ఫుట్‌బాల్ మానియాతో ఊగిపోయిన బ్రెజిల్ ప్రస్తుతం నిర్వేదంతో శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఓటమిని తట్టుకోలేక కెప్టెన్ డేవిడ్ లూయిజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేకపోయానని, నిరాశజనకమైన ఈ రోజు నేర్చుకోవడానికి తొలి మెట్టు అని వ్యాఖ్యానించాడు. ఈ ఓటమి చాలా సిగ్గుపడాల్సిన అంశమని బ్రెజిల్ మీడియా దుమ్మెత్తిపోసింది. మరోవైపు మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రధాన కూడళ్లలో కొంత మంది అల్లర్లకు దిగారు. కోపాకబానా బీచ్‌లో అదుపు తప్పిన పరిస్థితిని పోలీసులు చక్కదిద్దారు. ప్రధాన నగరాల్లో అదనపు బలగాలను మోహరించారు. బ్రెజిల్ ఓటమిని తట్టుకోలేక నేపాల్‌లో 15 ఏళ్ల ప్రగ్యా తాపా అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. రికార్డు బద్దలు బ్రెజిల్ ఓటమి ట్విట్టర్, ఫేస్బుక్లో రికార్డు స్థాయిలో ట్వీట్స్, పోస్ట్‌లను నమోదు చేసింది. మ్యాచ్ రోజు ట్విట్టర్లో 35.6 మిలియన్ ట్వీట్స్ నమోదయ్యాయి. గతంలో సూపర్ బౌల్ సందర్భంగా 25 మిలియన్ ట్వీట్స్ మాత్రమే రికార్డయ్యాయి. ఫేస్బుక్లో 200 మిలియన్ పోస్ట్‌లు షేర్ చేసుకున్నారు. ఇందులో 66 మిలియన్ల ప్రజలు నేరుగా భాగం పంచుకోవడం కొత్త రికార్డు. జర్మనీ తరఫున ఐదో గోల్ చేసిన ఖెడిరాపై నిమిషంలో 5 లక్షల 80 వేల ట్వీట్స్ వెల్లువెత్తాయి. ‘బ్రెజిల్‌కు నెయ్మార్ ఒక్కడే, అర్జెంటీనాకు మెస్సీ ఒక్కడే, పోర్చుగల్‌కు రొనాల్డో ఒక్కడే... కానీ జర్మనీ... ఓ జట్టు’ అనే ట్వీట్ హల్చల్ చేసింది. అత్యంత చెత్త రోజు: స్కొలారీ ‘నా జీవితంలోనే ఇది అత్యంత చెత్త రోజు. మా శక్తి మేరకు రాణించాలని ప్రయత్నించాం. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆరు నిమిషాల్లో చేసిన నాలుగు గోల్స్‌తో మ్యాచ్ తారుమారైంది. ఓటమికి పూర్తి బాధ్యత నాదే. నెయ్మార్ ఉన్నా కూడా పెద్ద ప్రభావం ఉండకపోయేదేమో’ - బ్రెజిల్ కోచ్ స్కొలారీ విశేషాలు నిరాశ కలిగించింది: రౌసెఫ్ ‘ఓ బ్రెజిలియన్గా ఈ ఓటమి చాలా నిరాశను కలిగించింది. అభిమానులకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’ అని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓ జట్టు ఏడు గోల్స్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు ఏ జట్టూ ప్రపంచకప్ సెమీఫైనల్లోని తొలి అర్ధభాగంలో ఐదు గోల్స్ సమర్పించుకోలేదు. 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లోని ఒక మ్యాచ్‌లో ఎనిమిది గోల్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. చివరిసారి 2002లో జర్మనీ 8-0తో సౌదీ అరేబియాను ఓడించింది. ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో బ్రెజిల్‌కు ఇదే చెత్త ఓటమి. 1998 ఫైనల్లో బ్రెజిల్ 0-3తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి 29 నిమిషాల్లో 5 గోల్స్ చేసిన తొలి జట్టుగా జర్మనీ నిలిచింది. అంతేకాకుండా మొత్తం ప్రపంచకప్‌లలో ఓవరాల్‌గా అత్యధిక గోల్స్ (223) చేసిన జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. 220 గోల్స్‌తో ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న బ్రెజిల్ రెండో స్థానానికి పడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరుకున్న తొలి జట్టుగా జర్మనీ రికార్డు సృష్టించింది. 7 సార్లు ఫైనల్ చేరుకున్న బ్రెజిల్‌ను జర్మనీ వెనక్కినెట్టింది. 1975 తర్వాత బ్రెజిల్ సొంతగడ్డపై అధికారిక మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. చివరిసారి బ్రెజిల్ 1975 ‘కోపా అమెరికా కప్’ టోర్నీ సెమీఫైనల్లో పెరూ చేతిలో ఓడిపోయింది. ఫ్రెండ్లీ మ్యాచ్‌ల విషయానికొస్తే 2002లో చివరిసారి బ్రెజిల్ జట్టు సొంతగడ్డపై ఓడింది. బ్రెజిల్ కోచ్ హోదాలో స్కొలారీకి ఎదురైన తొలి ఓటమి ఇదే. ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో ఓ ఆతిథ్య దేశం జట్టు ఏడు గోల్స్ సమర్పించుకోవడం ఇది తొలిసారేం కాదు. 1954లో ఆతిథ్య స్విట్జర్లాండ్ జట్టు లీగ్ మ్యాచ్‌లో 5-7 గోల్స్ తేడాతో ఆస్ట్రియా చేతిలో ఓడిపోయింది. -
జర్మనీ జాతర...బ్రెజిల్ పాతర
సెమీస్‌లో జర్మనీ విశ్వరూపం 7-1తో బ్రెజిల్‌పై విజయం 6 నిమిషాల్లో 4 గోల్స్ ఆశ్చర్యమే ఆశ్చర్యపోయింది. ఊచకోతే ఉలిక్కిపడింది. విధ్వంసమే విస్తుపోయింది. కలలో కూడా ఊహించనిది జరిగింది.ఒకటా... రెండా... మూడా... నాలుగా... ఎవ్వరూ ఊహించనివిధంగా ఏకంగా ఏడు గోల్స్ సమర్పించుకొని ఆతిథ్య బ్రెజిల్ జట్టు తమ అభిమానులందరినీ తలదించుకునేలా చేసింది. దూకుడే మంత్రంగా ఆడిన జర్మనీ తమ గోల్స్ జాతరలో బ్రెజిల్‌ను పాతరేసింది. ఆరు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ చేసి బ్రెజిల్‌ను బెంబేలెత్తించింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో జర్మనీ 7-1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తు చేసి ఎనిమిదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘రక్షణశ్రేణి’ అనే పదానికి విలువలేకుండా చేసిన బ్రెజిల్ తొలి 29 నిమిషాల్లోనే ఐదు గోల్స్ అర్పించుకొని తొలి అర్ధభాగంలోనే పరాజయాన్ని ఖాయం చేసుకుంది. తమ దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న బ్రెజిల్ ప్రపంచవ్యాప్తంగా తమను ఆరాధించే, అభిమానించే వారందరినీ శోకసంద్రంలో ముంచేసింది. బెలో హారిజాంట్: అగ్ని పరీక్షలో ఆతిథ్య జట్టు ఆహుతైపోయింది. జర్మనీ జట్టు ‘నభూతో నభవిష్యత్’ అన్నరీతిలో చెలరేగిపోయింది. బ్రెజిల్‌ను ఇప్పట్లో కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ నెయ్మార్... సస్పెన్షన్ కారణంగా కెప్టెన్, డిఫెండర్ థియాగో సిల్వా లేకపోవడంతో డీలా పడిన బ్రెజిల్‌పై సంపూర్ణ ఆధిపత్యం చలాయించిన జర్మనీ చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో జర్మనీ 7-1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మూడో స్థానం కోసం శనివారం జరిగే మ్యాచ్‌లో బ్రెజిల్ ఆడుతుంది. నెయ్మార్ కోసం గెలవాలని, అతనికి ‘కప్’ కానుకగా ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో సెమీఫైనల్ బరిలోకి దిగిన బ్రెజిల్ తొలి 10 నిమిషాలు ‘పట్టు’ కోల్పోకుండా ఆడుతున్నట్లు కనిపించింది. అయితే జర్మనీ 11వ నిమిషంలో సంపాదించిన తొలి కార్నర్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. టోనీ క్రూస్ సంధించిన క్రాస్ షాట్‌ను నేరుగా గోల్‌పోస్ట్ ముందు అందుకున్న థామస్ ముల్లర్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. ముల్లర్‌కు సమీపంలో గోల్‌కీపర్‌తో కలిపి మొత్తం 9 మంది బ్రెజిల్ ఆటగాళ్లు ఉన్నా వారందరూ ప్రేక్షకపాత్ర వహించారు. ఆరంభంలోనే షాక్ తిన్న బ్రెజిల్ తేరుకునేందుకు ప్రయత్నించేలోపు జర్మనీ జోరు పెంచింది. ఒకదశలోనైతే అసలు బ్రెజిల్ జట్టుకు రక్షణశ్రేణి ఆటగాళ్లు ఉన్నారా అనే అనుమానం కలిగింది. 23వ నిమిషంలో క్లోజ్ కొట్టిన షాట్‌ను బ్రెజిల్ గోల్‌కీపర్ సీజర్ నిలువరించగా బంతి తిరిగి క్లోజ్ వద్దకే వచ్చింది. ఈసారి క్లోజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా కీపర్‌ను, డిఫెండర్లను తప్పిస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపి జర్మనీకి 2-0 ఆధిక్యాన్నిచ్చాడు. రెండో గోల్ తర్వాత జర్మనీ ఆటగాళ్లు విశ్వరూపాన్ని ప్రదర్శించారు. బ్రెజిల్ డిఫెండర్లను చెల్లాచెదురు చేస్తూ ఎడతెరిపి లేకుండా దాడులు చేశారు. 24వ నిమిషంలో, 26వ నిమిషంలో టోనీ క్రూస్ రెండు గోల్స్ చేయగా... 29వ నిమిషంలో సమీ ఖెడిరా ఒక గోల్ సాధించాడు. దాంతో జర్మనీ 29 నిమిషాలు పూర్తయ్యే సమయానికి ఎవ్వరూ ఊహించనివిధంగా 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అప్పటికే ఓటమి ఖాయం చేసుకున్న బ్రెజిల్ తొలి అర్ధభాగంలో మరో గోల్ ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ద్వితీయార్ధభాగం తొలి 10 నిమిషాల్లో బ్రెజిల్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. మ్యాచ్‌లోనే తొలిసారిగా 51వ నిమిషంలో జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడి చేశారు. అదే జోరులో నాలుగుసార్లు గోల్ చేసే అవకాశాలను సృష్టించుకున్నా జర్మనీ గోల్‌కీపర్ నెయుర్ అడ్డుగోడలా నిలబడి వారి ఆశలను వమ్ముచేశాడు. కొన్ని నిమిషాలు బ్రెజిల్‌కు ఊరటనిచ్చిన జర్మనీ ద్వితీయార్ధంలో 20 నిమిషాల తర్వాత మళ్లీ జోరు పెంచింది. 69వ నిమిషంలో, 79వ నిమిషంలో షుర్లే రెండు గోల్స్ చేసి జర్మనీ ఆధిక్యాన్ని 7-0కు పెంచాడు. ఇక బ్రెజిల్ ఖాతా తెరవదేమో అని అనుకుంటున్న తరుణంలో ఆట 90వ నిమిషంలో ఆస్కార్ తొలి గోల్ చేశాడు. స్కోరు బోర్డు జర్మనీ: 7 ముల్లర్: 11వ, క్లోజ్: 23వ, క్రూస్: 24వ, 26వ, సమీ ఖెడిరా: 29వ, షుర్లే: 69వ, 79వ ని. బ్రెజిల్: 1 ఆస్కార్: 90వ ని. ‘టాప్’ క్లోజ్... హా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడిగా జర్మనీ వెటరన్ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. బ్రెజిల్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆట 23వ నిమిషంలో క్లోజ్ గోల్ చేయడంతో ఇప్పటిదాకా 15 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో పేరిట ఉన్న ఈ రికార్డు తెరమరుగైంది. రొనాల్డో 19 మ్యాచ్‌ల్లో 15 గోల్స్ చేయగా... క్లోజ్ 23 మ్యాచ్‌ల్లో 16 గోల్స్ సాధించాడు. 35 ఏళ్ల క్లోజ్కిది వరుసగా నాలుగో ప్రపంచకప్ కావడం విశేషం. ఇప్పటిదాకా క్లోజ్ ‘గోల్’ చేసిన ఏ మ్యాచ్‌లోనూ జర్మనీ ఓడిపోలేదు. హా 2002 ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీపై రొనాల్డో రెండు గోల్స్ చేసి అత్యధిక గోల్స్ రికార్డు సాధించాడు. ఆ ఫైనల్లో మిరోస్లావ్ క్లోజ్ సభ్యుడిగా ఉండటం విశేషం. యాదృచ్ఛింగా బ్రెజిల్‌పైనే, వారి దేశంలోనే, రొనాల్డో సమక్షంలోనే అతని రికార్డును క్లోజ్ అధిగమించాడు. క్లోజ్ గోల్ చేస్తున్న సమయంలో రొనాల్డో స్టేడియం గ్యాలరీలో స్థానిక టెలివిజన్ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అత్యధిక గోల్స్ జాబితాలో గెర్డ్ ముల్లర్ (జర్మనీ-14 గోల్స్); జస్ట్ ఫోంటైన్ (ఫ్రాన్స్-13 గోల్స్); పీలే (బ్రెజిల్-12 గోల్స్) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. -
'ఇప్పటికీ నా హృదయం బ్రెజిల్ తోనే ఉంది'
చెన్నై: సాకర్ ప్రపంచకప్ లో బ్రెజిల్ ఓడిపోవడం బాధాకరమని తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ వ్యాఖ్యానించాడు. తానెప్పుడూ బ్రెజిల్ జట్టునే అభిమానిస్తానని చెప్పాడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్లో బ్రెజిల్ ఓడిపోవడంతో తన గుండె బద్దలయినంతపనైందని పేర్కొన్నాడు. 'జర్మనీతో జరిగిన బ్రెజిల్ మ్యాచ్ బాధాకరం. ఇది హార్ట్ బ్రేకింగ్ మ్యాచ్. ఇప్పటికీ నా హృదయం బ్రెజిల్తోనే ఉంది. ఈ విషయంలో మరో ప్రశ్నే లేదు' అని ట్వీట్ చేశాడు. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో బ్రెజిల్ చిత్తుగా ఓడింది. కాగా, ధనుష్ నటించిన 'వేల్లై ఇల్లా పట్టదారి' సినిమా జూలై 18న విడుదలకానుంది. తన రెండో బాలీవుడ్ చిత్రం 'షమితాబ్' షూటింగ్ ధనుష్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. -
సెమీఫైనల్లో బ్రెజిల్ పై జర్మనీ విజయం
-
జాతికి క్షమాపణలు చెప్పిన లూయిజ్
బెలో హరిజోంటే: ప్రపంచకప్ లో ఓటమిపై తమ దేశానికి బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ డేవిడ్ లూయిజ్ క్షమాపణ చెప్పాడు. 'ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెబుతున్నా. బ్రెజిల్ ప్రజలందరికీ క్షమాపణలు' అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. బ్రెజిల్ ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడాలనుకున్నానని, కానీ దురదృష్టం తమను వెంటాడిందని వాపోయాడు. జర్మనీ జట్టు తమ కంటే మెరుగ్గా ఆడిందని తెలిపాడు. వారు బాగా సన్నద్దం అయ్యారని చెప్పాడు. ఓటమి తననెంతో బాధించిందని తెలిపాడు. ఇది తమకు బాధాకరమైన రోజుని, దీని నుంచి గుణపాఠం నేర్చుకుంటామని చెప్పాడు. సెమీఫైనల్లో జర్మనీ చేతిలో బ్రెజిల్ 7-1 తేడాతో బ్రెజిల్ ఘోరంగా ఓడిపోయింది. వందేళ్ల ప్రపంచకప్ చరిత్రలో బ్రెజిల్ కు ఇది అత్యంత దారుణమైన ఓటమి. -
సాక్షి స్పోర్ట్స్ 9th July 2014
-
బ్రజిల్.. గాయంతోనే వెనుతిరిగి..!
-
అర్జెంటీనా ఏళ్ల కలను మెస్సీ నెరవేర్చేనా?!
-
మార్కెట్లోకి వాన్ పెర్సీ నాణేలు
ది హేగ్: ప్రపంచకప్ గ్రూప్ దశలో స్పెయిన్‌పై కళ్లు చెదిరే రీతిలో గాల్లోకి డైవ్ చేస్తూ హెడర్ గోల్ చేసిన నెదర్లాండ్స్ స్ట్రయికర్ రాబిన్ వాన్ పెర్సీ చేసిన విన్యాసం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ డైవింగ్ చిత్రాన్ని ఓ నాణెంపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. లిమిటెడ్ ఎడిషన్‌గా మార్కెట్లోకి వచ్చిన 6 వేల నాణేలు కొద్ది గంటల్లోనే హాట్ కేక్‌లా అమ్ముడైపోయాయి. ఈ నాణెం ధర 9.95 యూరో (రూ.809)లు.