కోచ్‌తో ఉన్న ఇబ్బంది కారణంగా 15 మంది మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు జట్టు నుంచి వైదొలగడం కలకలం రేపింది. స్పెయిన్ ఫుట్‌బాల్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ కోచ్‌గా జార్జ్ విల్డా వ్యవహరిస్తున్నాడు. తమ ఆరోగ్యంపై, మానసిక పరిస్థితిపై ప్రభావం చూపేలా కోచ్ విల్డా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మహిళా ప్లేయర్లు ఆరోపించారు.
తమ సమస్యలకు ప్రధాన కారణం కోచ్ విల్డా అంటూ స్పానిష్ సాకర్ ఫెడరేషన్‌కు ఈ-మెయిల్ పంపారు. కోచ్‌పై వేటు వేయాలని స్పష్టంగా పేర్కొనలేదు కానీ అతని వల్ల ఇబ్బంది కలుగుతుందని మాత్రం లేఖలో వెల్లడించారు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చేంతవరకు జట్టుకు దూరంగా ఉంటామని 15 మంది తేల్చి చెప్పారు. కాగా కోచ్ విల్డా పనితీరుపై సంతృప్తిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిసింది. ఇంతకముందు కూడా మీడియా సమావేశంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు తమకు ఎలాంటి లేఖ, ఈ-మెయిల్ అందలేదని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ పేర్కొంది. కోచ్ విల్డా మహిళా ప్లేయర్లను ఇబ్బందికి గురిచేసినట్లు.. లైంగిక వేధింపుల పాల్పడినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. కోచ్ విల్డాకు క్షమాపణ చెప్పేవరకు 15 మంది మహిళా ప్లేయర్లను జట్టులోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కాగా స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు వచ్చే నెల 7న స్వీడన్, 11న అమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లకు ఆడే జట్టును కోచ్ విల్డానే ఎంపిక చేయాల్సి ఉంది.
చదవండి: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటి పర్యంతం
Comments
Please login to add a commentAdd a comment