women football
-
ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా..
సిడ్నీ: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీల్లో మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కురాలిగా దక్షిణ కొరియా అమ్మాయి కేసీ పెయిర్ (16 ఏళ్ల 26 రోజులు) రికార్డు సృష్టించింది. కొలంబియాతో మంగళవారం జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లో కేసీ పెయిర్ కొరియా తరఫున 78వ నిమిషంలో బరిలోకి దిగింది. గతంలో ఈ రికార్డు ఐఫెనీ చిజ్నీ (నైజీరియా; 16 ఏళ్ల 34 రోజులు; 1999 ప్రపంచకప్‌లో) పేరిట ఉంది. చదవండి: MLC 2023: విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన క్లాసెన్.. ప్లే ఆఫ్స్‌కు ముంబై -
'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!'
ఫుట్‌బాల్ హెడ్బట్స్ షాట్ ఆడడం కామన్. ఈ క్రమంలో గాయాలు కావడం సహజం. కానీ ఉద్దేశపూర్వకంగా ఆటగాళ్లను గాయపరిచేలా హెడ్బట్స్ షాట్ కొడితే మాత్రం తప్పు కిందే లెక్క. తాజాగా మహిళల ఫుట్‌బాల్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏఎఫ్ఏ మహిళల సాకర్ టోర్నమెంట్లో భాగంగా రేసింగ్, ఎల్ పొర్వినిర్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఎల్ పొర్వినిర్ ఆధిపత్యం చూపిస్తుంది. ఇది తట్టుకోని రేసింగ్ ఢిపెండర్ మారియా బెలెన్ తర్బోడా ఎదురుగా వస్తున్న లుడ్మిలా రమ్రెజ్ ముఖాన్ని తన తలతో ఒక్క గుద్దు గుద్దింది. దీంతో రమ్రెజ్ కిందపడిపోయింది. ఆమె నుదుటి చిట్లి రక్తం కారింది. ఇది గమనించిన రిఫరీ పరిగెత్తుకొచ్చి ఏదో పొరపాటులో జరిగిందేమో అనుకొని ఎల్లో కార్డ్ చూపించింది. ఇదే సమయంలో రమ్రెజ్ మొహం రక్తంతో నిండిపోయింది. ఇది గమనించిన రిఫరీ ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ప్లేయర్ తలను పగులగొట్టినందుకు గాను మారియా బెలెన్కు రెడ్‌కార్డ్ చూపించింది. ఇది సహించని మారియా కాసేపు వాగ్వాదానికి దిగింది. రిఫరీ తన రెడ్కార్డ్కే కట్టుబడి ఉండడంతో చేసేదేం లేక మైదానాన్ని వీడింది. ఆ తర్వాత ఎల్ పొర్వినిర్కు వచ్చిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకొని గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లడమే గాక మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ''ఇది కచ్చితంగా కావాలని చేయలేదు.. మనసులో ఏదో పెట్టుకొనే ఈ పని చేసినట్లుంది'' అని కామెంట్ చేశారు. ¡UFFFF, TREMENDO CHOQUE! 💥 Por este cabezazo a destiempo sobre Ludmila Ramírez fue expulsada María Belén Taborda. 🟨 En primera instancia, la árbitra Estefanía Pinto amonestó, pero luego rectificó su sanción.🟥 Con 10 Racing ante El Porvenir.#FUTBOLenDEPORTV | @YPFoficial pic.twitter.com/rd15TdGQnO — DEPORTV (@canaldeportv) May 23, 2023 ¡SE GRITA EN GERLI! ⚽️ Apareció Karina 'Chicho' Merlo con un potente tiro libre para adelantar a @elporvenirfem 1-0 sobre Racing. #FUTBOLenDEPORTV | @YPFoficial pic.twitter.com/vIqe9i9kTN — DEPORTV (@canaldeportv) May 23, 2023 చదవండి: ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా? -
'కోచ్ ఇబ్బంది పెడుతున్నారు.. తట్టుకోలేకపోతున్నాం'
కోచ్‌తో ఉన్న ఇబ్బంది కారణంగా 15 మంది మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు జట్టు నుంచి వైదొలగడం కలకలం రేపింది. స్పెయిన్ ఫుట్‌బాల్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ కోచ్‌గా జార్జ్ విల్డా వ్యవహరిస్తున్నాడు. తమ ఆరోగ్యంపై, మానసిక పరిస్థితిపై ప్రభావం చూపేలా కోచ్ విల్డా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మహిళా ప్లేయర్లు ఆరోపించారు. తమ సమస్యలకు ప్రధాన కారణం కోచ్ విల్డా అంటూ స్పానిష్ సాకర్ ఫెడరేషన్‌కు ఈ-మెయిల్ పంపారు. కోచ్‌పై వేటు వేయాలని స్పష్టంగా పేర్కొనలేదు కానీ అతని వల్ల ఇబ్బంది కలుగుతుందని మాత్రం లేఖలో వెల్లడించారు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చేంతవరకు జట్టుకు దూరంగా ఉంటామని 15 మంది తేల్చి చెప్పారు. కాగా కోచ్ విల్డా పనితీరుపై సంతృప్తిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిసింది. ఇంతకముందు కూడా మీడియా సమావేశంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు. మరోవైపు తమకు ఎలాంటి లేఖ, ఈ-మెయిల్ అందలేదని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ పేర్కొంది. కోచ్ విల్డా మహిళా ప్లేయర్లను ఇబ్బందికి గురిచేసినట్లు.. లైంగిక వేధింపుల పాల్పడినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. కోచ్ విల్డాకు క్షమాపణ చెప్పేవరకు 15 మంది మహిళా ప్లేయర్లను జట్టులోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కాగా స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు వచ్చే నెల 7న స్వీడన్, 11న అమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లకు ఆడే జట్టును కోచ్ విల్డానే ఎంపిక చేయాల్సి ఉంది. చదవండి: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటి పర్యంతం బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా -
తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్తాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సురక్షితంగా పాకిస్తాన్ చేరుకుంది. తాలిబన్ ప్రభుత్వం నుంచి మహిళా ఫుట్‌బాలర్లకు ముప్పు ఉండటంతో 32 మంది తమ కుటుంబసభ్యులతో సహా పొరుగుదేశం పాక్‌లో అడుగుపెట్టారు. నిజానికి ఈ జట్టు ఖతర్‌కు బయల్దేరాలనుకుంది. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడికి వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో తాలిబన్ల కళ్లుగప్పి పాక్‌కు చేరుకుంది. తాలిబన్ సర్కారు పురుషుల క్రీడలకు అనుమతించినప్పటికీ మహిళలు షరియా చట్టాల ప్రకారం ఆటలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై మహిళా ఫుట్‌బాలర్లు విమర్శలకు దిగడంతో తాలిబన్లు వారిని నిర్బంధించాలనుంది. బ్రిటన్‌కు చెందిన ఎన్జీవో సహకారంతో ఫుట్‌బాలర్లకు పాక్ అత్యవసర వీసాలు జారీ చేసింది. వీరికి పెషావర్ లేదంటే లాహోర్‌లో బస ఏర్పాటు చేసే అవకాశముంది. -
‘మగాళ్లకు, మీకు తేడా ఏంటి.. పెళ్లి ఎలా అవుతుంది’
డోడోమా: ఆఫ్రికన్ దేశం టాంజానియా అధ్యక్షురాలు ఫుట్‌బాల్ క్రీడాకారిణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ‘‘ఫుట్‌బాల్ క్రీడాకారిణులు ట్రోఫీలు గెలవడం సంతోషమే కానీ.. వారి వైవాహిక జీవితాలను పరిశీలిస్తే.. అంత సవ్యంగా ఉండవు. ఛాతీ చిన్నగా ఉండటంతో.. వారు పురుషులను ఆకర్షించలేరు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. ప్రెసిడెంట్ సామియా సులుహు హసన్ గత ఆదివారం జరిగిన ఒక వేడుకలో మాట్లాడుతూ... ‘‘మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు చిన్నదైన వక్షస్థలం కలిగి ఉండటం వల్ల ఆకర్షణను కోల్పోతున్నారు. కనుక వారిని వివాహం చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టు ప్రాంతీయ టోర్నమెంట్ గెలిచిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హసన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. (చదవండి: విధి వెక్కిరిస్తే.. పోర్న్‌స్టార్ అయ్యాడు) ‘‘ఈ ఫుట్‌బాల్ క్రీడాకారిణులు ఓ విషయం ఆలోచించాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేది పురుషులు.. స్త్రీలు కాదు. మీరు వారి ముఖాలను చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు వివాహం చేసుకోవాలని భావిస్తే.. అందంగా ఉన్న వ్యక్తినే కోరుకుంటారు. అలానే పురుషుడు కూడా తాను వివాహం చేసుకోవాలని భావించే అమ్మాయి అంతే అందంగా ఉండాని కోరుకుంటాడు. కానీ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఆ లక్షణాలు అదృశ్యమవుతున్నాయి’’ అన్నారు. (చదవండి: ఏం యాక్టింగ్‌రా బాబు; నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు) ‘‘ఈ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు ట్రోఫీలు తెచ్చి దేశం గర్వపడేలా చేస్తున్నారని, కానీ.. భవిష్యత్తులో వారి జీవితాలను చూస్తే అంత సవ్యంగా ఉండవు. ఆడటం వల్ల అలసిపోయిన శరీరంతో వారు ఎలాంటి జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ మీలో ఎవరైనా ఫుట్‌బాల్ క్రీడాకారిణీని మీ భార్యగా ఇంటికి తీసుకెళ్తే.. మీ అమ్మ.. ఆమెను చూసి.. మీరు వివాహం చేసుకుంది స్త్రీనా.. లేక పురుషుడినా అని ప్రశ్నిస్తుంది’’ అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల వల్ల హసన్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ మహిళవు అయ్యి ఉండి ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో ఆఫ్రికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 🙆🏿🙆🏿🙆🏿🙆🏿 🏃🏿♀️🏃🏿♀️🏃🏿♀️🏃🏿♀️ pic.twitter.com/oU0lOUJ0v3 — Mwanahamisi Singano (@MSalimu) August 22, 2021 -
అమ్మాయిల దుస్తులు బిగుతుగా ఉన్నాయని..
ఔట్‌డోర్ గేమ్స్‌లో అమ్మాయిల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు.. ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత ఉపద్రవం తలెత్తుతుందేమోనని భయపడి ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఉపద్రవమంటే తుఫానో, సునామీనో కాదు.. ఆ మ్యాచ్‌లో మహిళా క్రీడాకారిణుల కోసం సిద్ధం చేసిన దుస్తులు బిగుతుగా ఉండటం! తాలిబన్ పాలనను, ఐఎస్ దుశ్యర్యల్ని తలపించేలా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మల్దా జిల్లాలోని చండీపూర్‌లో స్థానిక క్లబ్ గోల్డెన్ జూబ్లీ(50 ఏళ్ల) వేడుకల్లో భాగంగా కోల్‌కతా, ఉత్తర బెంగాల్ మహిళా ఫుట్‌బాల్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు. తీరా మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు అమ్మాయిల దుస్తులు బిగుతుగా ఉన్నాయని, వాటిని ధరించి ఆడితే పురుషుల్ని రెచ్చగొట్టినట్టవుతుందని నిర్వాహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. 'నిర్వాహకుల తీరు ఆక్షేపణీయం. వాళ్లని అలాగే వదిలేస్తే సానియా మీర్జా కాళ్ల నిండుగా ప్యాంటు ధరించి టెన్నిస్ ఆడాలని డిమాండ్ చేసేలా ఉన్నారు' అని భారత ఫుట్‌బాల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రీడాకారుడొకరు వ్యాఖ్యానించారు. కొన్ని రాజకీయ పక్షాలు సైతం దీనిపై నిరసనను తెలపగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సావిత్రి మిశ్రా మాత్రం దుస్తుల కారణంగా మ్యాచ్ రద్దును సమర్థించారు. మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందునే మ్యాచ్ నిలిచిపోయిందని బ్లాక్ డెవలప్మెట్ అధికారులు చెప్పారు. మతపరంగా తనపై చర్యలు తీసుకుంటామని కొందరు వ్యక్తులు హెచ్చరించడంవల్లే మ్యాచ్‌ను రద్దుచేసినట్లు ప్రధాన నిర్వాహకుడు రేజా రజీర్ పేర్కొన్నారు.