ఆస్పత్రిలో చేరిన సాకర్ లెజెండ్ | Pele hospitalised with spinal problem | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన సాకర్ లెజెండ్

Published Sun, Jul 19 2015 8:31 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

ఆస్పత్రిలో చేరిన సాకర్ లెజెండ్ - Sakshi

ఆస్పత్రిలో చేరిన సాకర్ లెజెండ్

శావ్ పౌలో: బ్రెజిల్కు చెందిన ప్రముఖ సాకర్ లెజెండ్ పీలే ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది కాలంగా ఆయనను వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న నేపథ్యంలో ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థ స్పష్టం చేసింది. గతంలో చేసిన ఓ శస్త్ర చికిత్స మూలంగా వెన్నుపూసకు చెందిన ప్రధాన నాడీవ్యవస్థపై ఒత్తిడి పడుతోందని ఈ నేపథ్యంలో ఆయన నొప్పిని ఎదుర్కొంటున్నారని తెలిసింది.

అయితే, పరిస్థితి అంత తీవ్రంగా ఏమి లేదని, సోమవారం వరకు మాత్రం ఆయనను వైద్యుల సమక్షంలో పరిశీలనలో ఉంచనున్నట్లు తెలిపారు. గత మే నెలలో ఇలాంటి సమస్యతోనే ఆయన ఆస్పత్రిలో చేరగా బినైన్ వ్రణం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి తరుచు ఆయన వెన్నునొప్పిని ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement