
ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు మారియో జగల్లో (92) తుది శ్వాస్ విడిచారు. వయసు పైబడటంతో పాటు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో మారియో కన్నుమూశారు. నాలుగు సార్లు వరల్డ్‌కప్ విన్నర్ అయిన మారియో.. మునుపటి తరం మేటి ఆటగాళ్లలో చివరివాడు. మారియో మరణవార్త తెలిసి ఫుట్‌బాల్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మారియో అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి.
మారియో బ్రెజిల్ ఫుట్‌బాలర్‌గానే కాకుండా ఆ జట్టుకు కోచ్‌గా కూడా సేవలందించాడు. మరో ఫుట్‌బాల్ దిగ్గజం పీలే సమకాలీకుడైన మారియో.. పీలేతో కలిసి 1958, 1962 ప్రపంచకప్‌లు గెలిచాడు. 1970లో వరల్డ్‌కప్ గెలిచిన బ్రెజిల్ జట్టుకు మారియో మేనేజర్‌గా పని చేశాడు. ఆ జట్టుకు పీలే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే 1994 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టుకు మారియో కో ఆర్డినేటర్‌గా పని చేశాడు. 2002లో వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టుకు మారియో అడ్వైజర్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ ప్రపంచకప్ గెలిచిన ప్రతి సందర్భంలో మారియో ఆ బృందంలో ఏదో ఒక రకంగా భాగమై ఉన్నాడు.