తల్లి సెలెస్టెతో పీలే (PC: Pele Instagram)
Pele Funeral: ప్రపంచానికి తన సత్తా చాటిన విలా బెల్మిరా స్టేడియంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే పార్థీవదేహాన్ని ఉంచుతారు. సావోపాలో శివారులో ఉన్న ఈ స్టేడియంలో సోమవారం అభిమానులు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత సాంటోస్‌లోని మెమోరియల్ నెక్రొపోలె ఎక్యుమెనికలో జనవరి 3న అంత్యక్రియలు పూర్తవుతాయి. కేవలం పీలే కుటుంబసభ్యులే దీనికి హాజరవుతారు.
మాతృమూర్తి చూసేందుకు వీలుగా
ఇక మంచానికి పరిమితమైన పీలే మాతృమూర్తి సెలెస్టె అరాంట్స్ చూసేందుకు వీలుగా ఆయన అంతిమయాత్రను పీలే ఇంటిముందు నుంచి తీసుకెళ్తారు. కాగా ఈ ఏడాది నవంబరు 20లో తల్లి 100వ పడిలో అడుగుపెట్టిన సందర్భంగా పీలే భావోద్వేగ నోట్ షేర్ చేస్తూ ఆమెకు విషెస్ తెలియజేశాడు. కానీ.. ఆమెను ఒంటరిని చేస్తూ తల్లి కంటే పీలే నిష్క్రమించడం బాధాకరం.
ఇదిలా ఉంటే.. పీలే మరణం నేపథ్యంలో ఈ దిగ్గజానికి నివాళిగా బ్రెజిల్ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
అవయవాలన్నీ పాడైపోయి
మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్‌ను గెలిపించిన బ్రెజిలియన్ సాకర్ కింగ్ పీలే గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సావోపాలోలోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌లో 82 ఏళ్ల పీలే కన్నుమూశాడు. గతేడాది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడిన అతను అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడు.
గతనెల ఆరోగ్యం విషమించడంతో అతన్ని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అవయవాలన్నీ క్రమంగా పాడైపోవడంతో అతని శరీరం చికిత్సకు స్పందించ లేదు. చివరకు గురువారం క్యాన్సర్‌తో పోరాటాన్ని విరమించి లోకాన్ని వీడాడు.
పీలే అసలు పేరు ఇదే
పీలే అసలు పేరు: ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో.
తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్ నాసిమియాంటో.
పెళ్లిళ్లు 3: రోజ్‌మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి)
సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె.
చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం..
Rishabh Pant: తల్లిని సర్‌ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment