ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫుట్‌బాల్ ఆటకే వన్నె తెచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పీలే 82 ఏళ్ల వయసులో డిసెంబర్ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. అసమాన ఆటతీరుతో బ్రెజిల్‌కు ఎన్నో అద్భుత విజయాల్ని అందించాడు పీలే. సుదీర్ఘ కెరీర్‌లో పీలే సాధించిన కొన్ని రికార్డులు ఇవి...
► బ్రెజిల్‌కు మూడు వరల్డ్ కప్‌లను పీలే అందించాడు. 1958, 1962, 1970 మూడు సార్లు బ్రెజిల్ వరల్డ్ కప్ గెలవడంతో పీలే కీలక పాత్ర పోషించాడు. అత్యధిక సార్లు వరల్డ్ కప్ అందుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డులెక్కాడు.
► 1958 వరల్డ్ కప్ తో పీలే ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభమైంది. అప్పటికీ పీలే వయసు 17 ఏళ్లు మాత్రమే. వరల్డ్ కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా పీలే రికార్డ్ సృష్టించాడు.
► 1958 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో పీలే ఫ్రాన్స్‌పై హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. కేవలం 23 మూడు నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేసి బ్రెజిల్‌ను విజేతగా నిలిపాడు. వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ చేసిన యంగెస్ట్ ప్లేయర్ అతడే కావడం గమనార్హం.
► వరల్డ్ కప్‌లో గోల్ చేసిన 18 కంటే తక్కువ వయసున్న ఏకైక ఆటగాడు కూడా పీలే కావడం విశేషం.
► బ్రెజిలియన్ క్లబ్ సాంటోస్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు పీలే కావడం గమనార్హం. 659 మ్యాచ్‌లలో 643 గోల్స్ చేశాడు పీలే. కెరీర్ మొత్తంగా 1363 మ్యాచ్‌లు ఆడిన పీలే 1283 గోల్స్ చేశాడు.
► బ్రెజిల్ తరఫున 92 మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. వరల్డ్ కప్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన పీలే 12 గోల్స్ చేశాడు.
► పీలే బ్రెజిల్ తరుఫున ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పీలే ఒలింపిక్స్‌లో మాత్రం ఒక్కసారి కూడా బరిలో దిగలేదు.
► ఒక ఏడాదిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్ పీలేనే. 1959వ ఏడాదిలో పీలే 127 గోల్స్ చేశాడు.
► పీలే కెరీర్‌లో మొత్తం 92 రెండు సార్లు హ్యాట్రిక్ గోల్స్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment