
Brazil Legend Pele Funeral- సాంటోస్: బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. కేవలం కుటుంబసభ్యుల మధ్యే ఈ లాంఛనం ముగించారు. అంతకుముందు విలా బెల్మిరో స్టేడియంలో పీలే భౌతికకాయాన్ని వేల మంది బ్రెజిలియన్లు సందర్శించుకొని కడసారి వీడ్కోలు తెలిపారు.
బ్రెజిల్ దేశాధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా తమ దిగ్గజానికి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించేందుకు అభిమానులు పోటెత్తడంతో అంతిమయాత్ర నిర్ణీత షెడ్యూల్‌కు కాస్త ఆలస్యంగా మొదలైంది. సాంటోస్ వీధుల గుండా పీలే అంతిమయాత్ర సాగుతుండగా ‘పీలే జెర్సీ నంబర్ 10’ను అభిమానులు ప్రముఖంగా ప్రదర్శించారు.
ప్రజలంతా భారమైన హృదయంతో తమ ఆరాధ్య ఫుట్‌బాలర్‌ను తలచుకొని విలపించారు. తమ దేశాన్ని మూడుసార్లు ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిపిన హీరోకు విషణ్ణ వదనంతో వీడ్కోలు పలికారు. అనంతరం మెమోరియల్ నెక్రొపొలె ఎక్యుమెనిక వద్దకు తీసుకొచ్చారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు ముగించారు.
చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?!
IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన