మెక్సిక్:బ్రెజిల్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నీలో మెక్సికో జట్టుకు ప్రి క్వార్టర్స్ లో నిరాశే ఎదురైంది. అయినా ఆ జట్టు ఆటతీరుపై దేశాధ్యక్షుడు ఎన్రిక్యూ పెనా నీటో ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో జట్టు బాగా ఆడిందంటూ అభినందనలతో ముంచెత్తాడు. 'వారి ఆటతీరులో ఏ లోపం లేదు. జట్టు సమిష్టిగా ఆడింది. ప్రత్యేకంగా మెక్సికో కోచ్ మైగ్యూల్ హెర్రీరాకు ధన్యవాదాలు'అంటూ ట్విట్టర్ తన అభిప్రాయాలన్ని పోస్ట్ చేశారు. మెక్సిక్ డాస్ సంటోస్ 48వ నిమిషంలో గోల్ చేసిన తీరును ఆయన ప్రస్తావించారు. ఈ గోల్ ను జట్టు కోచ్ 'గ్రేట్ గోల్' గా లిఖించుకోవచ్చన్నాడు.
2010 రన్నరప్ నెదర్లాండ్స్ జట్టు ఆఖర్లో మాత్రం అద్భుతం చేసింది. అప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న మెక్సికోకు అడ్డుకట్ట వేస్తూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ 2-1తో మెక్సికోపై గెలిచి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. స్నిడెర్ (88వ ని.), హంటెల్లార్ (90+4వ ని.) డచ్ జట్టుకు గోల్స్ అందించి జట్టు గెలుపులో భాగస్వామ్యం అయ్యారు.