ఓ కప్పు... పదిలక్షల ఉద్యోగాలను సృష్టించింది!
పుట్ బాల్ ప్రపంచకప్ పోటీలు బ్రెజిల్ లో పదిలక్షల ఉద్యోగాలను సృష్టించింది. ఫిఫా వరల్డ్ కప్ కారణంగా బ్రెజిల్ లో 12 నగరాల్లో పది లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. కేవలం ఉద్యోగాలకు పరిమితం కాకుండా 30 బిలియన్ల రియల్స్(13.4 బిలియన్ డాలర్) ఆదాయాన్ని సృష్టించి బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చిందని ఆర్ధిక పరిశోధక సంస్థ ఫైప్ ఓ నివేదికలో వెల్లడించింది.
పది లక్షల ఉద్యోగాల్లో రెండు లక్షలు శాశ్వత ఉద్యోగాలు కాగా, మిగితావన్ని తాత్కాలికమైనవని నివేదికలో తెలిపారు. పుట్ బాల్ టోర్ని కారణంగా బ్రెజిల్ లోని 12 నగరాల్లో హోటళ్లు 45 మేరకు నిండిపోవడం సానుకూల అంశమన్నారు. ఫుట్ బాల్ పోటీలే కాకుండా 2016 లో బ్రెజిల్ ఒలంపిక్ క్రీడలకు ఆతిధ్యమివ్వడానికి సిద్దమవ్వడం ఆదేశ ప్రజలను ఆకర్షిస్తోంది.