డ్రగ్ పరీక్షకు జట్టు ఆటగాళ్లంతా సిద్దం!
సాంటో(బ్రెజిల్): డ్రగ్ పరీక్షలకు జట్టు మొత్తమంతా హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కోస్టారికా కోచ్ జోర్జ్ లూయిస్ పింటో తెలిపారు. ప్రపంచకప్ పుట్ బాల్ టోర్నిలో ఇటలీపై 1-0 తేడా గోల్స్ తో విజయం సాధించడంతో ఏడుగురు ఆటగాళ్ల డ్రగ్ పరీక్షలకు హాజరుకావాలంటూ ఫిఫా ఆదేశించిన నేపథ్యంలో కోస్టారికా కోచ్ వ్యాఖ్యానించారు. అయితే ఆటగాళ్ల డ్రగ్ పరీక్షలు కేవలం రోటిన్ వ్యవహారంలో భాగమని ఫిఫా ట్వీట్ చేసింది.
ఆటపూర్తయ్యాక సాధారణ నిబంధనల్లో భాగంగానే ఇద్దరు ఆటగాళ్లకు డ్రగ్ పరీక్షలు నిర్వహించాం. మరో ఐదుగురు కోస్టారికా ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహిస్తామని ఫిఫా వెల్లడించింది.