బ్రెజిల్‌ ఆటగాడిపై కుళ్లు జోక్స్‌ | Neymar Trolled Again Despite Heroics vs Mexico | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 3 2018 3:25 PM | Last Updated on Tue, Jul 3 2018 6:59 PM

Neymar Trolled Again Despite Heroics vs Mexico - Sakshi

నెమార్‌ జూనియర్‌

సమారా : ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్‌ను క్వార్టర్‌ ఫైనల్‌కు చేర్చిన ఆ దేశ స్టార్‌ స్ట్రయికర్‌ నెమార్‌ జూనియర్‌పై సోషల్‌ మీడియాలో కుళ్లు జోకులు పేలుతున్నాయి. సోమవారం మెక్సికోతో జరిగిన ప్రి క్వార్టర్‌ ఫైనల్లో   బ్రెజిల్‌ 2-0తో మెక్సికోపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అద్బుత గోల్‌తో ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన నెమార్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే మ్యాచ్‌ 70వ నిమిషంలో మైదానంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మెక్సికో ఆటగాడు మిగెల్ లయన్ కాలు నెమార్‌ మడమకు తగలడంతో అతను కుప్పకూలిపోయాడు. అయితే రిఫరీని గమనించిన నెమార్‌ గాయంతో విలవిలాడుతున్నట్లు ప్రవర్తించాడు. మరికొద్ది సేపటికే అతను మాములు అయిపోవడం మెక్సికోఆటగాళ్లకు, మైదానంలోని అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది. అదంతా సమయాన్ని వృథా చేయడానికి నెమార్‌ ఆడిన నాటకమని అర్థమైపోయింది. అయితే నెమార్‌ ఇలా నటించడం ఇదే తొలిసారి కాదు. గత మ్యాచ్‌లోను ఇలానే ప్రవర్తించాడు. ఈ ఘటనను ఆధారం చేసుకోని నెటిజన్లు తమ ఫొటో షాప్‌ నైపుణ్యానికి పదును పెట్టి మరి ట్రోల్‌ చేస్తున్నారు. ‘ నెమార్‌ నీ నటన ఆస్కార్‌ను మించిందని’, ఒకరంటే.. ‘నెమార్‌ వెంటనే చర్చికెళ్లి పవిత్ర జలాన్ని తీసుకో’ అని ఇంకోకరు కామెంట్‌ చేశారు.

సిగ్గుమాలిన చర్య: మెక్సికో కోచ్‌
మెక్సికో కోచ్‌ జువాన్ కార్లోస్ ఒసోరియో సైతం నెమార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ చర్య ఫుట్‌బాల్‌ ఆటకే తలవంపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని వల్ల చాలా సమయం వృథా అయిందన్నారు. అతని నటన మా జట్టు బలంపై ప్రభావం చూపిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement