మ్యాచ్ ను వీక్షించేందుకు నెయమార్.. | Neymar to join Brazil for third place play-off | Sakshi
Sakshi News home page

మ్యాచ్ ను వీక్షించేందుకు నెయమార్..

Published Thu, Jul 10 2014 5:54 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

Neymar to join Brazil for third place play-off

టెరీసొపొలిస్(బ్రెజిల్): ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో భాగంగా కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ మళ్లీ జట్టుతో జాయిన్ కానున్నాడు. కాకపోతే ఆడటానికి కాదు.. మ్యాచ్ ను వీక్షించడానికి నెయమార్ తిరిగి స్టేడియానికి రానున్నాడు. ప్లే ఆఫ్ లో భాగంగా శనివారం మూడో స్థానం కోసం నెదర్లాండ్స్ -బ్రెజిల్ జట్ల మధ్య ఆసక్తికర పోరును నెయమార్ వీక్షించనున్నాడు.

ఈ విషయాన్ని బ్రెజిల్ ఫుట్ బాల్ సమాఖ్య ప్రతినిధి రోడ్రిగో స్పష్టం చేశారు. ఇప్పటికే పేలవమైన ఆట తీరుతో ఫైనల్ ఆశలను నీరుగార్చుకున్న బ్రెజిల్ కనీసం మూడో స్థానంతోనైనా సరిపెట్టుకోవాలని భావిస్తోంది. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ లో  కొలంబియా ఆటగాడు జాన్  ఢీకొట్టడంతో నయమార్ తీవ్రంగా గాయపడిన నెయమార్ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement