ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆతిథ్య బ్రెజిల్ టీమ్ జైత్రయాత్ర ఆశలకు భారీ గండి పడింది.
ఫోర్టలెజా : ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆతిథ్య బ్రెజిల్ టీమ్ జైత్రయాత్ర ఆశలకు భారీ గండి పడింది. గాయం కారణంగా బ్రెజిల్ స్టార్ స్ట్రయికర్ నయిమార్ టోర్నీ నుండి అవుట్ అయిపోగా, కెప్టెన్ థియాగో సిల్వకు రెండో ఎల్లో కార్డు శిక్షకు గురవడంతో సెమీస్‌లో ఆడే అవకాశం లేకపోయింది. సాకర్ ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో నిన్న రాత్రి కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా ఆటగాడు జాన్ డీకొట్టడంతో నెయ్‌మర్‌కు గాయమైన విషయం తెలిసిందే.
ప్రత్యర్థి ఆటగాడు మోకాలితో వెన్నుపై తన్నడంతో నయిమార్ తీవ్ర నొప్పితో మైదానంలో పడిపోయాడు. దాంతో నయిమార్‌ను స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయానికి కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతో ప్రపంచ కప్‌లోని మిగతా మ్యాచుల్లో నయిమార్ ఆడే అవకాశం లేకపోయింది.