‘సాంబా’ గడ్డపై సూపర్‌హిట్ | grand success to football world cup in brazil | Sakshi
Sakshi News home page

‘సాంబా’ గడ్డపై సూపర్‌హిట్

Published Tue, Jul 15 2014 1:03 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

‘సాంబా’ గడ్డపై సూపర్‌హిట్ - Sakshi

‘సాంబా’ గడ్డపై సూపర్‌హిట్

2014 ప్రపంచకప్ విశేషాలు
 
  నమోదైన మొత్తం గోల్స్  -  171
  సెల్ఫ్ గోల్స్      -  5
మొత్తం ఎల్లో కార్డులు  -  187
►  మొత్తం రెడ్ కార్డులు -    10
►  అత్యధిక విజయాలు    -   జర్మనీ (6)
  ‘హ్యాట్రిక్’ల సంఖ్య    -     2  (ముల్లర్-జర్మనీ; జెర్దాన్ షాకిరి-స్విట్జర్లాండ్)
►  ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గని జట్లు  -   9  (ఆస్ట్రేలియా, కామెరూన్, ఇంగ్లండ్, ఘనా, హోండురస్, జపాన్, రష్యా, దక్షిణ కొరియా)
  మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకుల సంఖ్య: 3 కోట్ల 42లక్షల 9వేల 873

 
టోర్నీ ప్రారంభానికి ముందు ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా... టోర్నీ ప్రారంభమయ్యాక అంతా సద్దుమణిగింది. అద్భుతమైన గోల్స్... అచ్చొరువొందే క్షణాలు... అంతుచిక్కని ఫలితాలు... తెరపైకి వచ్చిన కొత్త తారలు... తొలిసారి గోల్ లైన్ టెక్నాలజీ.. ఇలా అన్ని అంశాల మేళవింపుతో ‘సాంబా’ నేలపై జరిగిన 2014-ప్రపంచకప్ సూపర్‌హిట్ అయ్యింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జర్మనీ తుదకు అందరి అంచనాలను నిజంచేసి విజేతగా నిలిచింది.

గోల్స్ వర్షం...

మొత్తం 64 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గోల్స్ నమోదు కాలేదు. మిగతా 59 మ్యాచ్‌ల్లో గోల్స్ కావడం ఈ టోర్నీ విశేషం. ఓవరాల్‌గా మొత్తం 171 గోల్స్‌తో ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ నమోదైన ఈవెంట్ రికార్డు సమమైంది. 1998లో ఫ్రాన్స్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లోనూ 171 గోల్స్ వచ్చాయి.

అగ్రశ్రేణి జట్ల తడబాటు

డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్పెయిన్... నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ... క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్... వేన్ రూనీ, ఫ్రాంక్ లాంపార్డ్, స్టీవెన్ జెరార్డ్ లాంటి స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ జట్లు లీగ్ దశలోనే నిష్ర్కమించి అభిమానులను ఆశ్చర్యపరిచాయి.

కోస్టారికా కేక

ఘనచరిత్ర లేకపోయినా... పట్టుదలతో ఆడితే మేటి జట్లనూ బోల్తా కొట్టించవచ్చని ఈ ప్రపంచకప్‌లో పలు చిన్న జట్లు నిరూపించాయి. కేవలం 45 లక్షలు జనాభా కలిగిన కోస్టారికా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని ‘ఔరా’ అనిపించింది. ఆఫ్రికా జట్టు అల్జీరియా తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లూ నాకౌట్‌కు చేరుకొని తమ సత్తా చాటుకున్నాయి. మరోవైపు ఆసియా జట్లకు ఈ ప్రపంచకప్ నిరాశే మిగిల్చింది.

‘గ్రేట్’ కీపర్స్...

 ఈ ప్రపంచకప్‌లో గోల్ స్కోరర్లే కాకుండా గోల్‌కీపర్లూ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. గిలెర్మో ఒచోవా (మెక్సికో), నూయర్ (జర్మనీ), టిమ్ హోవార్డ్ (అమెరికా), కీలార్ నవాస్ (కోస్టారికా), రొమెరో (అర్జెంటీనా) ఒకే మ్యాచ్‌లో ఎన్నోసార్లు గోల్స్‌ను నిలువరించి తమ జట్టు పాలిట పెట్టని గోడలా నిలిచారు.
 
ఫుల్ పార్టీ’: ప్రపంచకప్ గెలిచిన తర్వాత జర్మనీ ఆటగాళ్లు జట్టు హోటళ్లో రాత్రంతా సంబరాలు చేసుకున్నారు. కోచ్ జోచిమ్ లూ కూడా ఇందులో పాలు పంచుకున్నారు. ఆటగాళ్లు తమ భార్యలు, ప్రియురాళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీకి మద్దతిచ్చిన పాప్ సింగర్ రిహానా పార్టీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్లోజ్, పొడోల్‌స్కీ, స్క్వీన్‌స్టీగర్, గాట్జెలు ప్రపంచకప్‌ను పట్టుకుని ఆమెతో కలిసి ఫొటోలు దిగారు.

ట్విట్టర్‌లో ‘ఫైనల్’ మోత: ఫైనల్ గురించి ట్విట్టర్‌లో రికార్డు స్థాయిలో మోత మోగింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ మ్యాచ్ గురించి విపరీతంగా స్పందించారు. జర్మనీ విజేతగా నిలిచిన మరుక్షణమే... ఒక్క నిమిషంలో 6 లక్షల 18 వేల 725 ట్వీట్స్ నమోదయ్యాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement