
కేరళకు నెయ్‌మార్?
చికిత్స కోసం వస్తాడంటూ కథనాలు
తిరువనంతపురం: బ్రెజిల్ ఫుట్‌బాల్ సంచలనం నెయ్‌మార్ కేరళకు రానున్నాడంటూ మళయాల టీవీ చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. కొలంబియాతో క్వార్టర్ ఫైనల్లో గాయపడ్డ నెయ్‌మార్ ఇక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకుంటాడని తెలిపాయి. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో బ్రెజిల్ ఫుట్‌బాల్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని కథనాలు ప్రసారమయ్యాయి. అయితే చాందీ మాత్రం దీనిని పూర్తిగా నిర్ధారించలేదు.
‘అతడి గాయానికి ఎలాంటి చికిత్స అవసరమో ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైద్యులు గుర్తించారు. ఆ వివరాలను మాకు ఇచ్చారు. ఈ ప్రతిపాదనను నెయ్‌మార్‌తో చర్చించేదీ లేనిదీ బుధవారం చెబుతాం’ అని చాందీ చెప్పారు.