గెలిస్తే... ‘అంతరిక్షం’లోకి! | Netherlands steal victory with late goals | Sakshi
Sakshi News home page

గెలిస్తే... ‘అంతరిక్షం’లోకి!

Published Wed, Jul 2 2014 1:44 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

Netherlands steal victory with late goals

 ది హేగ్: క్రికెట్ అయినా ఫుట్‌బాల్ అయినా ప్రపంచ కప్ అనగానే కార్పొరేట్ ప్రపంచంలో ఒక కదలిక వస్తుంది. తమ దేశపు జట్టు గెలిస్తే ఇది ఇస్తాం...అది చేస్తాం అంటూ చాలా సంస్థలు భారీ ప్రకటనలు చేస్తుంటాయి. ఇప్పుడు నెదర్లాండ్స్‌కు చెందిన ఒక ఇంజినీరింగ్ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది.
 
  తమ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిస్తే టీమ్ సభ్యులను ఏకంగా అంతరిక్షంలోకి పంపిస్తామని హామీ ఇస్తోంది! డచ్‌కు చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కంపెనీ ‘ఎస్‌ఎక్స్‌సీ’ ఈ ఆఫర్ ఇచ్చింది. వచ్చే ఏడాదినుంచి అంతరిక్షంలోకి కమర్షియల్ ఫ్లైట్‌లు పంపించేందుకు ఈ కంపెనీ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది.

 మూడు సార్లు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లలో ఓడిన హాలెండ్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు ఇది పనికొస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. ‘మా ఆటగాళ్లు నేలపైనుంచి కాకుండా గాల్లో విన్యాసాలు చేస్తూ గోల్స్ సాధిస్తున్నారు. వారికి అలాంటి కానుకే ఇవ్వాలనేది మా కోరిక. భూమినుంచి దాదాపు 103 కిలో మీటర్ల ఎత్తులోకి జట్టులోని 23 మంది సభ్యులను తీసుకెళతామని హామీ ఇస్తున్నాం’ అని సదరు సంస్థ ప్రతినిధి మోల్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement