
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు నెయ్‌మార్
మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగే పోరుకు బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ హాజరు కానున్నాడు.
టెరెసోపోలిస్: మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగే పోరుకు బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ హాజరు కానున్నాడు. గాయం కారణంగా జర్మనీతో జరిగిన సెమీస్‌కు నెయ్‌మార్ దూరం కావడం జట్టు ఆత్మస్థైరాన్ని దెబ్బతీసింది.
‘శనివారం డచ్‌తో జరిగే మ్యాచ్‌కు నెయ్‌మార్ ఇక్కడికి రానున్నాడు. అతడు జట్టుతో పాటే ఉంటాడు’ అని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య అధికార ప్రతినిధి రోడ్రిగో పైవా తెలిపారు.