రియో డి జనీరో: వరుసగా మూడు ప్రపంచకప్‌లలో సెమీస్‌కు చేరినా టైటిల్ సాధించలేకపోయిన జర్మనీ ఈసారి మాత్రం ఆఖరి వరకూ పట్టు వదలకూడదని కృతనిశ్చయంతో ఉంది. 2002లో ఫైనల్లో ఓడిన జర్మనీ... 2006, 2010ల్లో మూడోస్థానంలో నిలిచింది. 24 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారి సాధిస్తామని జర్మనీ కెప్టెన్ ఫిలిప్ లామ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
వరుసగా నాలుగుసార్లు సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిన ఈ జట్టుకు అన్నీ కలిసొస్తున్నాయి. మంగళవారం జరిగే సెమీస్‌లో తమ ప్రత్యర్థి బ్రెజిల్ జట్టు నెయ్‌మార్, సిల్వల సేవలు కోల్పోయింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు లామ్ సేన ప్రణాళికలు రచిస్తోంది.
ఈసారి వదలం: లామ్
Published Sun, Jul 6 2014 1:36 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM
Advertisement
Advertisement