క్షమాపణలు చెప్పిన డచ్ గోల్ కీపర్ | Cillessen apologises to Dutch fans | Sakshi
Sakshi News home page

క్షమాపణలు చెప్పిన డచ్ గోల్ కీపర్

Published Mon, Jul 7 2014 6:11 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

క్షమాపణలు చెప్పిన డచ్ గోల్ కీపర్ - Sakshi

క్షమాపణలు చెప్పిన డచ్ గోల్ కీపర్

పాలో:ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గోల్ కీపర్ గా తనను తప్పించడంపై అసహనం వ్యక్తం చేసిన నెదర్లాండ్స్ ప్రధాన గోల్ కీపర్ జాస్పర్ సిల్లెసన్ ఎట్టకేలకు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. మొన్న కోస్టారికా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన క్వార్టర్ప్ పైనల్ మ్యాచ్ లో నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది.  ఆ సమయంలో నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్.. ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్ మార్చి, సబ్ స్టిట్యూట్ కీపర్ టిమ్ క్రూల్ ను బరిలోకి దింపాడు. దీంతో సిల్లెసన్ వాటర్ బాటిల్స్ ను తన్ని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. 'నేను నిజంగా అలా చేయడం తప్పు. అప్పుడు షాక్ గురై మాత్రమే అలా ప్రవర్తించా' అని  టీమ్ కు, అభిమానులకు క్షమాపణలు తెలిపాడు.

 

ఆ మ్యాచ్ లో గోల్ కీపర్ టిమ్ క్రూల్ చలవతో నెదర్లాండ్ 4-3 తేడాతో కోస్టారికాపై విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాతో డచ్ జట్టు తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement