FIFA 2014
-
1400 బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
న్యూఢిల్లీ: సాకర్ ప్రపంచ కప్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయిల బెట్టింగ్ జరిగింది. ఈ మెగా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆసియాలోనే 1400 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 60 కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ పోల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా, హాంకాంగ్, మకావు, మలేసియా, సింగపూర్, వియత్నాం దేశాలకు చెందిన పోలీసులు వెయ్యికిపైగా బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేశారు. చాలా వరకు నేర ముఠాలు బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహించాయి. వెబ్సైట్ల ద్వారా 11 వేల రూపాయిలు చేతులు మారినట్టు అంచనా వేస్తున్నారు. మనీ లాండరింగ్, అక్రమ పద్ధతుల ద్వారా డబ్బును తరలించినట్టు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు జూన్ 1 నుంచి జూలై 13 వరకు ప్రత్యేక నిఘా వేసి దాడులు నిర్వహించారు. -
అసలు జర్మనీ ఎలా గెలిచింది?
జర్మనీ ఇప్పుడు ప్రపంచ ఫుట్ బాల్ సామ్రాట్టు. జర్మనీలో సంబరాలు ఇంకా సద్దుమణగలేదు. దేశం దేశమంతా పండగ చేసుకుంటోంది. అయితే 2000 నాటికి జర్మన్ ఫుట్ బాల్ పతనం అంచులకు చేరింది. యూరో లీగ్ ఫుట్ బాల్ పోటీల్లో పాయింట్ల జాబితాల్లో అట్టడుగులో ఉంది. ఫుట్ బాల్ అధోగతికి చేరింది. అందరూ జర్మనీ కథ ఖతం అనుకున్నారు. పతనం అంచులనుంచి అదే జర్మనీ ఇప్పుడు ప్రపంచ విజయం దాకా వచ్చింది. ఇదేలా సాధ్యమైంది? 2000 లోనే జర్మన్ ప్రభుత్వం ఫుట్ బాల్ ప్రతిభను గుర్తించి జర్మన్ టీమ్ కి మళ్లీ పునర్వైభవం తెచ్చేందుకు పూనుకుంది. ప్రణాళికా బద్ధంగా అడుగులు వేసింది. ఈ ప్రణాళిక 2003 లో అమలైంది. * ఎనిమిది నుంచి 14 ఏళ్ల వయసులోనే ఫుట్ బాల్ ప్రతిభలను గుర్తించింది. వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించింది. వీరందరికీ శిక్షణనిచ్చేందుకు దేశవ్యాప్తంగా అకాడెమీలను స్థాపించింది. ఇలా ఎంపికైన పిల్లల్లో ప్రతిభను అనుసరించి వారికి ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని నిర్ధారించింది. * జర్మన్ టీమ్ లోని ఆటగాళ్లలో వయసు మళ్లిన వారి స్థానంలో యువకులను రంగంలోకి దింపింది. కొన్నేళ్లలోనే జర్మన్ టీమ్ ఆటగాళ్లందరూ కోడెవయసు కుర్రాళ్లే ఉండేలా చేశారు. జూలియన్ డ్రాక్స్ లర్, ఆంద్రే ష్కుర్లె, స్వెన్ బెండర్, థామస్ ముల్లర్,టోనీ క్రూస్, మార్కో రియస్ వంటి ఆటగాళ్లందరూ ఈ ప్రణాళిక ద్వారా ఎదిగిన వారే. * ఈ యువ క్రీడాకారుల తయారీ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ కోచ్ లను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. జర్మనీలో బి లైసెన్స్ ఉన్న కోచ్ లు 28000 మంది, ఏ లైసెన్స్ ఉన్న వారు 5500 మంది ఉన్నారు. వీరందరినీ ఉపయోగించుకుని ఆటగాళ్లకు సానపట్టారు. * ఫిఫా కప్ ను గెలిచేందుకు అన్ని ప్రత్యర్థి టీమ్ ల ఆటను నిశితంగా పరిశీలించారు. బ్రెజిల్ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేశారు. బ్రెజిల్ లో ఉండే వేడి, చెమటను తట్టుకునేందుకు ఆటగాళ్లు గత ఆరునెలలుగా హాట్ రూమ్ లలో ఆటలు ఆడేవారు. ఏసీ రూమ్ లలోఉండటం మానేశారు. బ్రెజిల్ వాతావరణాన్ని తట్టుకునేందుకు పూర్తిగా అలవాటు పడేలా చేశారు. ఇంత నిశితమైన అధ్యయనం, నిరంతర ప్రయత్నం వల్లే పదేళ్ల కింద పతనం అంచున ఉన్న జర్మనీ ఈ రోజు ప్రపంచ విజేత అయింది. -
'ఇప్పటికీ నా హృదయం బ్రెజిల్ తోనే ఉంది'
చెన్నై: సాకర్ ప్రపంచకప్ లో బ్రెజిల్ ఓడిపోవడం బాధాకరమని తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ వ్యాఖ్యానించాడు. తానెప్పుడూ బ్రెజిల్ జట్టునే అభిమానిస్తానని చెప్పాడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్లో బ్రెజిల్ ఓడిపోవడంతో తన గుండె బద్దలయినంతపనైందని పేర్కొన్నాడు. 'జర్మనీతో జరిగిన బ్రెజిల్ మ్యాచ్ బాధాకరం. ఇది హార్ట్ బ్రేకింగ్ మ్యాచ్. ఇప్పటికీ నా హృదయం బ్రెజిల్తోనే ఉంది. ఈ విషయంలో మరో ప్రశ్నే లేదు' అని ట్వీట్ చేశాడు. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో బ్రెజిల్ చిత్తుగా ఓడింది. కాగా, ధనుష్ నటించిన 'వేల్లై ఇల్లా పట్టదారి' సినిమా జూలై 18న విడుదలకానుంది. తన రెండో బాలీవుడ్ చిత్రం 'షమితాబ్' షూటింగ్ ధనుష్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. -
జాతికి క్షమాపణలు చెప్పిన లూయిజ్
బెలో హరిజోంటే: ప్రపంచకప్ లో ఓటమిపై తమ దేశానికి బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ డేవిడ్ లూయిజ్ క్షమాపణ చెప్పాడు. 'ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెబుతున్నా. బ్రెజిల్ ప్రజలందరికీ క్షమాపణలు' అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. బ్రెజిల్ ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడాలనుకున్నానని, కానీ దురదృష్టం తమను వెంటాడిందని వాపోయాడు. జర్మనీ జట్టు తమ కంటే మెరుగ్గా ఆడిందని తెలిపాడు. వారు బాగా సన్నద్దం అయ్యారని చెప్పాడు. ఓటమి తననెంతో బాధించిందని తెలిపాడు. ఇది తమకు బాధాకరమైన రోజుని, దీని నుంచి గుణపాఠం నేర్చుకుంటామని చెప్పాడు. సెమీఫైనల్లో జర్మనీ చేతిలో బ్రెజిల్ 7-1 తేడాతో బ్రెజిల్ ఘోరంగా ఓడిపోయింది. వందేళ్ల ప్రపంచకప్ చరిత్రలో బ్రెజిల్ కు ఇది అత్యంత దారుణమైన ఓటమి. -
సౌరబ్ గంగూలీ జోస్యం ఫలిస్తుందా?
ప్రపంచ క్రీడాభిమానులందరికి ఫుట్ బాల్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచ పుట్ బాల్ కప్ టోర్నిలో నాకౌట్ దశ ముగిసి సెమీఫైనల్ పోటీలకు జట్లు సిద్దమవుతున్నాయి. ఇక ఫైనల్ కు ఏ జట్లు చేరుతాయా అని అంచనాలు వేసుకోవడం, జోస్యం చెప్పడం పనిలో పడ్డారు. పుట్ బాల్ అభిమానైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రపంచ కప్ పోటీలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే భారత సిరీస్ కోసం కామెంటేటర్ గా మారిన గంగూలీ ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫైనల్ పోటీల్లో ఏ జట్లు ఆడబోతున్నాయో.. ముందే ఓ అంచనాకు వచ్చాడు. జూలై 13న జరిగే ఫైనల్ మ్యాచ్ లో జర్మనీ, నెదర్లాండ్ జట్టు పోటీ పడుతాయని జోస్యం చెప్పాడు. ఓ ఫుట్ బాల్ అభిమానిగా బ్రెజిల్, అర్జెంటీనా జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటాను. కాని పుట్ బాల్ జట్ల ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే జర్మనీ, నెదర్లాండ్ జట్లు ఫైనల్ పోటీకి అర్హత సాధిస్తాయనిపిస్తోంది అని గంగూలీ అన్నారు. ఇక ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ ను జూలై 9 తేదిన ఆరంభం కానుంది. Follow @sakshinews -
క్షమాపణలు చెప్పిన డచ్ గోల్ కీపర్
పాలో:ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గోల్ కీపర్ గా తనను తప్పించడంపై అసహనం వ్యక్తం చేసిన నెదర్లాండ్స్ ప్రధాన గోల్ కీపర్ జాస్పర్ సిల్లెసన్ ఎట్టకేలకు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. మొన్న కోస్టారికా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన క్వార్టర్ప్ పైనల్ మ్యాచ్ లో నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. ఆ సమయంలో నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్.. ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్ మార్చి, సబ్ స్టిట్యూట్ కీపర్ టిమ్ క్రూల్ ను బరిలోకి దింపాడు. దీంతో సిల్లెసన్ వాటర్ బాటిల్స్ ను తన్ని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. 'నేను నిజంగా అలా చేయడం తప్పు. అప్పుడు షాక్ గురై మాత్రమే అలా ప్రవర్తించా' అని టీమ్ కు, అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. ఆ మ్యాచ్ లో గోల్ కీపర్ టిమ్ క్రూల్ చలవతో నెదర్లాండ్ 4-3 తేడాతో కోస్టారికాపై విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాతో డచ్ జట్టు తలపడనుంది. -
వాన్ గాల్ 'ఎత్తు' మాస్టర్ పీస్
హాగ్: షూటౌట్లో ‘ఎత్తు’తో కోస్టారికాను చిత్తుచేసిన నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ కోచ్ లూయిస్ వాన్ గాల్ ను డచ్ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. అనూహ్య నిర్ణయంతో జట్టును ఫిఫా ప్రపంచకప్ సెమీస్ ఫైనల్ కు చేర్చిన అతడి వ్యూహచతురతను మీడియా కొనియాడింది. వాన్ గాల్ ది బంగారు పిడికిలి అని డీ టెలిగ్రాఫ్ హెడ్‌లైన్స్ పేర్కొంది. కొన్నిసార్లు అదృష్టం కలిసొస్తుంది. కొన్నిసార్లు సిక్త్ సెన్స్ నిజమవుతుంది అని తెలిపింది. వాన్ గాల్ ప్రయోగాన్ని మాస్టర్ పీస్ గా మరో డచ్ పత్రిక వాల్క్స్క్రాంత్ వర్ణించింది. డచ్ టీవీ స్టేషన్ ఎన్ఓఎస్ కూడా 62 ఏళ్ల వాన్ గాల్ వ్యూహాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యాలు చేసింది. కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎక్స్ట్రా సమయం మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందనగా నెదర్లాండ్స్ కోచ్ తమ ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్ను మార్చి పెనాల్టీ షూటౌట్ కోసం రెండో గోల్ కీపర్ టిమ్ క్రూల్‌ను వాన్ గాల్ బరిలోకి దించాడు. ఎందుకంటే సిల్లెసన్ కంటే టిమ్ క్రూల్ ఎత్తు ఎక్కువ. కోచ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా టిమ్ క్రూల్ రెండు గోల్స్ ను అడ్డుకుని జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో వాన్ గాల్ ప్రయోగానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా, ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ పెనాల్టీ షూటౌట్లో నెగ్గడం ఇదే తొలిసారి. -
ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు
-
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో సెమీస్ బెర్తులు ఖరారు
సల్వాదార్(బ్రెజిల్): ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో క్వార్టర్స్ పోరుకు తెరపడింది. ఇక నాలుగు ప్రధాన జట్లు సెమీ ఫైనల్లో ఆమీతూమీకి సిద్ధమయ్యాయి. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ ల్లో భాగంగా శనివారం రాత్రి నెదర్లాండ్స్-కోస్టారికాల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో నెదర్లాండ్స్ జట్టు 4-3 తేడాతో కోస్టారికాను ఓడించి సెమీఫైనల్ కు ప్రవేశించింది. దీంతో సెమీస్ ఫైనల్ రేసులో తలపడే జట్లు ఖరారయ్యాయి. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో జర్మనీ-బ్రెజిల్ లు తలపడుతుండగా, బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో అర్జెంటీనా-నెదర్లాండ్స్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి.గత విజేత స్పెయిన్ తొలి రౌండ్ లోని నిష్కమించగా, రన్నరప్ నెదర్లాండ్స్ మాత్రం టోర్నీలో ఆకట్టుకుంటూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. -
సాక్షి స్పోర్ట్స్ 6th July 2014
-
ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు
సాల్వెడర్(బ్రెజిల్): సాకర్ ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి నెదర్లాండ్స్ దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో కోస్టారికాతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్లో అర్జెంటీనాతో నెదర్లాండ్స్ తలపడనుంది. నెదర్లాండ్స్, కోస్టారికా మధ్య జరిగిన చివరి క్వార్టర్‌ఫైనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. నిర్ణీత 120 నిమిషాల సమయంలో ఇరు జట్లు గోల్ కొట్టకపోవడంతో పెనాల్టీ షూటౌట్ తో ఫలితాన్ని తేల్చారు. కీలకమైన ఈ షూటౌట్స్‌లో డచ్ గోల్‌కీపర్ టిమ్ క్రుల్ రెండు గోల్స్ అడ్డుకొని నెదర్లాండ్స్‌కు విజయం సాధించి పెట్టాడు. ఎక్స్ట్రా టైమ్ చివరి నిమిషంలో గోల్కీపర్ను మార్చడం డచ్ టీమ్‌కు కలిసొచ్చింది. సబ్‌స్టిట్యూట్ గోల్ కీపర్ గా వచ్చి అతడు జట్టుకు విజయాన్ని అందించడం విశేషం. కోస్టారికా ప్లేయర్స్ బ్రియన్ రూయిజ్, మైఖేల్ ఉమానా కొట్టిన రెండు గోల్స్‌ను క్రుల్ అడ్డుకున్నాడు. అదే సమయంలో నెదర్లాండ్స్ తరఫున వాన్పెర్సీ, రాబెన్, స్నైడెర్, కుయ్ట్ గోల్స్ సాధించారు. దీంతో పెనాల్టీ షూటౌట్స్‌లో 4-3 తేడాతో గెలిచి సెమీస్ చేరింది నెదర్లాండ్స్. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్ ట్రా టైమ్‌లో ఎన్నోసార్లు గోల్స్ చేసే అవకాశమొచ్చనా సద్వినియోగం చేసుకోలేని డచ్ టీమ్.. మొత్తానికి షూటౌట్స్‌లో బతికిపోయింది. -
సాక్షి స్పోర్ట్స్ 5th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 4th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 2nd July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 1st July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 30th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 29th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 26th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 25th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 24th June 2014
-
ఫిఫా వరల్డ్ కప్‌లో అతి పెద్ద సంచలనం
-
సాక్షి స్పోర్ట్స్ 20th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 19th June 2014
-
సాక్షి స్పోర్ట్స్ 18th June 2014
-
యంగ్ గన్స్