న్యూఢిల్లీ: సాకర్ ప్రపంచ కప్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయిల బెట్టింగ్ జరిగింది. ఈ మెగా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆసియాలోనే 1400 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 60 కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ పోల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
చైనా, హాంకాంగ్, మకావు, మలేసియా, సింగపూర్, వియత్నాం దేశాలకు చెందిన పోలీసులు వెయ్యికిపైగా బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేశారు. చాలా వరకు నేర ముఠాలు బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహించాయి. వెబ్సైట్ల ద్వారా 11 వేల రూపాయిలు చేతులు మారినట్టు అంచనా వేస్తున్నారు. మనీ లాండరింగ్, అక్రమ పద్ధతుల ద్వారా డబ్బును తరలించినట్టు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు జూన్ 1 నుంచి జూలై 13 వరకు ప్రత్యేక నిఘా వేసి దాడులు నిర్వహించారు.
1400 బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
Published Fri, Jul 18 2014 9:35 PM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement