'ఇప్పటికీ నా హృదయం బ్రెజిల్ తోనే ఉంది' | My heart still belongs to Brazil says Dhanush | Sakshi
Sakshi News home page

'ఇప్పటికీ నా హృదయం బ్రెజిల్ తోనే ఉంది'

Published Wed, Jul 9 2014 4:32 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

'ఇప్పటికీ నా హృదయం బ్రెజిల్ తోనే ఉంది' - Sakshi

'ఇప్పటికీ నా హృదయం బ్రెజిల్ తోనే ఉంది'

చెన్నై: సాకర్ ప్రపంచకప్ లో బ్రెజిల్ ఓడిపోవడం బాధాకరమని తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ వ్యాఖ్యానించాడు. తానెప్పుడూ బ్రెజిల్ జట్టునే అభిమానిస్తానని చెప్పాడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్లో బ్రెజిల్ ఓడిపోవడంతో తన గుండె బద్దలయినంతపనైందని పేర్కొన్నాడు.

'జర్మనీతో జరిగిన బ్రెజిల్ మ్యాచ్ బాధాకరం. ఇది హార్ట్ బ్రేకింగ్ మ్యాచ్. ఇప్పటికీ నా హృదయం బ్రెజిల్తోనే ఉంది. ఈ విషయంలో మరో ప్రశ్నే లేదు' అని ట్వీట్ చేశాడు. ఫుట్బాల్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో బ్రెజిల్ చిత్తుగా ఓడింది.

కాగా, ధనుష్ నటించిన 'వేల్లై ఇల్లా పట్టదారి' సినిమా జూలై 18న విడుదలకానుంది. తన రెండో బాలీవుడ్ చిత్రం 'షమితాబ్' షూటింగ్ ధనుష్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement