Louis Van Gaal
-
క్షమాపణలు చెప్పిన డచ్ గోల్ కీపర్
పాలో:ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గోల్ కీపర్ గా తనను తప్పించడంపై అసహనం వ్యక్తం చేసిన నెదర్లాండ్స్ ప్రధాన గోల్ కీపర్ జాస్పర్ సిల్లెసన్ ఎట్టకేలకు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. మొన్న కోస్టారికా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన క్వార్టర్ప్ పైనల్ మ్యాచ్ లో నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. ఆ సమయంలో నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్.. ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్ మార్చి, సబ్ స్టిట్యూట్ కీపర్ టిమ్ క్రూల్ ను బరిలోకి దింపాడు. దీంతో సిల్లెసన్ వాటర్ బాటిల్స్ ను తన్ని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. 'నేను నిజంగా అలా చేయడం తప్పు. అప్పుడు షాక్ గురై మాత్రమే అలా ప్రవర్తించా' అని టీమ్ కు, అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. ఆ మ్యాచ్ లో గోల్ కీపర్ టిమ్ క్రూల్ చలవతో నెదర్లాండ్ 4-3 తేడాతో కోస్టారికాపై విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాతో డచ్ జట్టు తలపడనుంది. -
వాన్ గాల్ 'ఎత్తు' మాస్టర్ పీస్
హాగ్: షూటౌట్లో ‘ఎత్తు’తో కోస్టారికాను చిత్తుచేసిన నెదర్లాండ్స్ ఫుట్బాల్ కోచ్ లూయిస్ వాన్ గాల్ ను డచ్ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. అనూహ్య నిర్ణయంతో జట్టును ఫిఫా ప్రపంచకప్ సెమీస్ ఫైనల్ కు చేర్చిన అతడి వ్యూహచతురతను మీడియా కొనియాడింది. వాన్ గాల్ ది బంగారు పిడికిలి అని డీ టెలిగ్రాఫ్ హెడ్లైన్స్ పేర్కొంది. కొన్నిసార్లు అదృష్టం కలిసొస్తుంది. కొన్నిసార్లు సిక్త్ సెన్స్ నిజమవుతుంది అని తెలిపింది. వాన్ గాల్ ప్రయోగాన్ని మాస్టర్ పీస్ గా మరో డచ్ పత్రిక వాల్క్స్క్రాంత్ వర్ణించింది. డచ్ టీవీ స్టేషన్ ఎన్ఓఎస్ కూడా 62 ఏళ్ల వాన్ గాల్ వ్యూహాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యాలు చేసింది. కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎక్స్ట్రా సమయం మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందనగా నెదర్లాండ్స్ కోచ్ తమ ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్ను మార్చి పెనాల్టీ షూటౌట్ కోసం రెండో గోల్ కీపర్ టిమ్ క్రూల్ను వాన్ గాల్ బరిలోకి దించాడు. ఎందుకంటే సిల్లెసన్ కంటే టిమ్ క్రూల్ ఎత్తు ఎక్కువ. కోచ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా టిమ్ క్రూల్ రెండు గోల్స్ ను అడ్డుకుని జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో వాన్ గాల్ ప్రయోగానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా, ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ పెనాల్టీ షూటౌట్లో నెగ్గడం ఇదే తొలిసారి.