Netherlands Football Team
-
'అలా ప్రవర్తించడం తప్పే.. నేను చేసింది నాకే నచ్చలేదు'
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను గతేడాది అందుకున్న సంగతి తెలిసిందే. నాలుగుసార్లు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందుకోవడంలో విఫలమైన మెస్సీ ఐదో ప్రయత్నంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. జట్టును అంతా తానై నడిపించిన మెస్సీ.. కీలకమైన ఫైనల్లో ఫ్రాన్స్‌పై షూటౌట్ ద్వారా విజేతగా నిలిపాడు. ఫైనల్లో మూడు గోల్స్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ టోర్నీలో మొత్తంగా ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ముగిసిన 45రోజులు కావొస్తున్న వేళ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌లో జరిగిన ఒక సంఘటనపై స్పందించాడు. అదేంటంటే.. నెదర్లాండ్స్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డచ్ బాస్ లూయిస్ వాన్గాల్తో పాటు స్ట్రైకర్ వౌట్ వెగ్రోస్ట్లను హేళన చేస్తున్నట్లుగా తన రెండు చేతులను చెవుల మధ్య పెట్టి కోపంగా చూస్తూ ఫోజివ్వడం సంచలనం కలిగించింది. సౌమ్య హృదయడనుకున్న మెస్సీ నుంచి ఇలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుందని ఎవరు ఊహించలేదు. అందుకే మెస్సీని కొంతమంది తప్పుబట్టారు. అప్పుడే దీనిపై స్పందించిన మెస్సీ..''గేమ్‌లో భాగంగా కంట్రోల్ తప్పాను.. ఆ సమయంలో అలా వచ్చేసింది'' అంటూ వివరణ ఇచ్చాడు. తాజాగా మరోసారి ఇదే అంశంపై స్పందిస్తూ మరింత క్లారిటీ ఇచ్చాడు. ''నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అలా ప్రవర్తించడం తప్పే. నేను చేసింది నాకే నచ్చలేదు. అయితే దానిని మనసులో పెట్టుకొని ముందుకెళ్లడం నాకు సాధ్యం కాదు. అందుకే ఆరోజే ఏదో అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చకున్నాడు. మ్యాచ్ అన్నాకా హైటెన్షన్ ఉండడం సహాజం. ఆ టెన్షన్లో ఒక్కోసారి మనం సహనం కోల్పోతాం. నాకు కూడా అదే జరిగింది. ఇక నేను అందుకున్న ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని దిగ్గజం మారడోనా చెంతకు చేర్చాను'' అంటూ వెల్లడించాడు. Lionel Messi on his celebration vs. Netherlands: "It came out naturally. My team mates told me what van Gaal said before the match. I don't like to leave that image, but it just came out. There was a lot of nervousness." Via @urbanaplayfm. 🇦🇷 pic.twitter.com/DT2w3sAo1D — Roy Nemer (@RoyNemer) January 30, 2023 చదవండి: విషాదం: ప్రపంచ ఛాంపియన్.. మంచు కింద సజీవ సమాధి -
FIFA WC 2022: సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాక్..?
ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022 తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి అనంతరం వరుస విజయాలతో దూసుకుపోతున్న అర్జెంటీనాకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) భారీ షాకిచ్చింది. నిన్న (డిసెంబర్ 10) నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మెస్సీ అండ్ టీమ్ చేసిన ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న ఫిఫా.. వారిపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్యపై డిసిప్లినరీ కేసులను నమోదు చేసింది. దీని ప్రభావం డిసెంబర్ 14న క్రొయేషియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌పై పడే అవకాశం ఉంది. ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ.. అర్జెంటీనా క్రమశిక్షణారాహిత్యానికి కెప్టెన్ మెస్సీని బాధ్యున్ని చేస్తే క్రొయేషియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో అతనిపై వేటు పడే అవకాశం ఉంది. మెస్సీతో పాటు ఆ జట్టు గోల్‌కీపర్, మరికొంత మంది ఆటగాళ్లపై కూడా ఫిఫా నిషేధం విధించవచ్చు. ఇదే జరిగితే అర్జెంటీనాకు భారీ షాక్ తగిలినట్టే. సెమీస్‌లో మెస్సీ, గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ బరిలోకి దిగకపోతే అర్జెంటీనా ఓటమిపాలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని సాకర్ అభిమానులు భావిస్తున్నారు. సెమీఫైనల్లో మెస్సీ ఆడకుండా అడ్డుకుంటే ఫిఫా అంతు చూస్తామని అర్జెంటీనా ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఈ ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో ఫిఫా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా, నిన్న డచ్ టీమ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ ఫైనల్లో అర్జెంటీనా 4-3 (2-2) తేడాతో గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ సమరంలో రిఫరీ అంటోనియో మాథ్యూ ఏకంగా 18 సార్లు ఎల్లో కార్డ్ (ఆటగాళ్లకు మందలింపులో భాగంగా ఎల్లో కార్డులను చూపుతారు) చూపించగా, ఇందులో అర్జెంటీనా ఆటగాళ్లే 16 సార్లు బాధ్యులయ్యారు. క్వార్టర్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మెస్సీ పోస్ట్‌మ్యాచ్ ఇంటర్య్వులోడీ అంశంపై స్పందిస్తూ.. రిఫరీ, నెదర్లాండ్ స్ట్రైకర్ వౌట్ వెఘోర్స్ట్, డచ్ కోచ్ లుయిస్ వాన్ గాల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే, డిసెంబర్ 14న జరిగే తొలి సెమీఫైనల్లో క్రితం వరల్డ్‌కప్‌లో రన్నరప్ క్రొయేషియా-అర్జెంటీనా జట్లు తలపడుతుంటే.. డిసెంబర్ 15న జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు షాకిచ్చిన మొరాకో తలపడనున్నాయి. ఈ రెండు సెమీస్‌లో విన్నర్లు.. డిసెంబర్ 18వ తేదీన జరిగే తుది సమరంలో అమీతుమీ తేల్చుకుంటాయి. -
మెస్సీ మ్యాజిక్.. సెమీఫైనల్లో అర్జెంటీనా
ఫిపా ప్రపంచకప్-2022 సెమీ ఫైనల్లో అర్జెంటీనా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అద్భుతమైన విజయం సాధించిన మెస్సీ బృందం తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. మెస్సీ అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. మ్యాచ్ ఫస్ట్‌హాప్‌లో అద్భుతమైన కిక్‌తో మెస్సీ తొలి గోల్‌ను తన జట్టుకు అందించాడు. దీంతో తొలి అర్ధబాగం ముగిసే సరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అనంతరం సెకెండ్ హాఫ్‌లో మెస్సీ అసిస్ట్ సహాయంతో మరో గోల్‌ను సాధించాడు. దీంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకెండ్ హాఫ్‌లో ఆనూహ్యంగా పుంజుకున్న నెదర్లాండ్స్ రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. దీంతో మ్యాచ్ రిఫరీ ఇరు జట్లకు అదనపు సమయం కెటాయించాడు. అయితే అదనపు సమయంలో ఇరు జట్లు గోల్‌ను సాధించలేకపోయాయి. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు మ్యాచ్ రిఫరీ పెనాల్టీ షూటౌట్‌ను ఎంచుకున్నారు. ఇక పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా పెనాల్టీ షూటౌట్లోనూ మెస్సీ అద్భుతమైన గోల్ సాధించాడు. ఇక డిసెంబర్ 14న క్రోయేషియాతో సెమీఫైనల్లో అర్జెంటీనా తలపడనుంది. చదవండి: FIFA WC: కల చెదిరింది.. హృదయం ముక్కలైంది! గుండెకోత మిగిల్చారు.. అయినా! -
FIFA WC: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఇక గ్రూప్ దశలో ఓటమి ఎరుగని నెదర్లాండ్స్‌ను మెస్సీ సేన ఏ విధంగా ఎదుర్కొంటుందనేది ఆసక్తికంగా మారింది. అయితే 2014 ఫిఫా వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ఈ రెండుజట్లు ఎదురుపడ్డాయి. అప్పటి మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా.. డచ్ జట్టుపై విజయాన్ని అందుకుంది. ఈ విషయం పక్కనబెడితే.. నెదర్లాండ్స్ సీనియర్ స్టార్ ఆటగాడు డేలీ బ్లైండ్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. గుండె సమస్యతో బాధపడుతూ కూడా ధైర్యంగా మైదానంలో ఫుట్‌బాల్ ఆడడం అతనికే చెల్లింది. డేలీ బ్లైండ్ కొంతకాలంగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. ఎక్కువగా పరిగెడితే వచ్చే ఆయాసంతో బ్లైండ్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే డేలీ బ్లైండ్ ఏ మ్యాచ్‌లో బరిలోకి దిగినా తనవెంట డిఫిబ్రిలేషన్(Defibrillation) మెషిన్ ఉంటుంది. డీఫిబ్రిలేషన్ అనేది ప్రాణాంతక కార్డియాక్ అరిథ్మియాలకు చికిత్సగా పనిచేస్తుంది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (V-Fib), నాన్-పెర్ఫ్యూజింగ్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (V-Tach)లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. డీఫిబ్రిలేటర్ ద్వారా గుండెకు కరెంట్‌షాక్ ఇచ్చి ఊపిరి ఆగిపోకుండా ఉంచుతారు.(దీనినే వైద్య భాషలో కౌంటర్-షాక్ అని పిలుస్తారు). డిఫిబ్రిలేటర్(Defibrillator) మరి ఇంత సమస్య పెట్టుకొని డేలీ బ్లైండ్‌ను ఆడించడం అవసరమా అనే డౌట్ రావొచ్చు. కానీ అతను జట్టుకు కీలక ఆటగాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికాతో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో గోల్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే అతన్ని జట్టు నుంచి తప్పించడం పెద్ద సాహసమే అవుతుందని జట్టు మేనేజర్ పేర్కొన్నాడు. అయితే ఇదివరకే డేలీ బ్లైండ్ డిఫిబ్రిలేషన్ను ఉపయోగించారు. 2019లో చాంపియన్స్ లీగ్ సందర్భంగా ఒక మ్యాచ్‌లో బ్లైండ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి డిఫిబ్రిలేషన్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అప్పుడే ఫుట్‌బాల్ ఆటను మానుకోవాలని బ్లైండ్‌ను హెచ్చరించారు. కానీ బ్లైండ్ వారి మాటను లెక్కచేయలేదు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాగైనా పాల్గొనాలని ధ్యేయంగా పెట్టుకున్న డేలీ బ్లైండ్ తన వెంట డిఫిబ్రిలేషన్ మిషన్‌ను తెచ్చుకున్నాడు. చనిపోయేంత సమస్య ఉన్నప్పటికి భయపడకుండా దేశం కోసం బరిలోకి దిగిన అతని గుండె ధైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. నెదర్లాండ్స్ కప్ గెలుస్తుందో లేదో తెలియదు కానీ డేలీ బ్లైండ్ మాత్రం అభిమానుల మనసులను గెలిచేశాడు. 🟠MATCH PREVIEW🤩 🇳🇱 Netherlands v Argentina 🇦🇷 #NEDARG Prepare for a tasty World Cup quarter final with @EredivisieMike speaking with @sebaongarelli! WATCH: 📺https://t.co/2IDySVyqTa pic.twitter.com/6bPweVEiZJ — Dutch Football 🇳🇱 (@FootballOranje_) December 6, 2022 చదవండి: 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన.. బీసీసీఐ షాకింగ్ ట్విస్ట్! ఖతర్‌లో వరల్డ్‌కప్.. ప్రపంచానికి తెలియని మరణాలు! -
క్రికెట్లో ప్రొటీస్.. ఫుట్‌బాల్‌లో డచ్; ఎక్కడికెళ్లినా దరిద్రమే
విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్ కప్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న ఈ మెగాసమరంలో ఇకపై గోల్స్ వర్షం కురవనుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా సాకర్ ఫీవరే కనిపిస్తుంది. ఇక వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 32 జట్లు ఇప్పటికే ఖతార్‌కు చేరుకొని ప్రాక్టీస్‌లో వేగం పెంచాయి. 1974, 1978, 2010లో రన్నరప్.. ఫిఫా ర్యాంక్ చూస్తే 8వ స్థానం..! ఇటీవల వరుసగా 15 మ్యాచ్‌ల్లో పరాజయమే ఎరుగని వైనం. ఇదీ నెదర్లాండ్స్ జట్టు రికార్డు. కానీ ఇప్పటి వరకు ఆ టీమ్ ఫిఫా వరల్డ్‌కప్‌ను ముద్దాడలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. అసలు సిసలైన ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ ఉన్నా.. నిలకడలేమితో కీలక మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ తడబడుతోంది. -సాక్షి, స్పోర్ట్స్ వెబ్‌డెస్క్ ఈ నేపథ్యంలో మరోసారి ఫిఫా కప్‌కు రెడీ అయిన డచ్ టీమ్.. అరబ్ గడ్డ ఖతార్‌లో కత్తిమీద సాముగా ఉండే పరిస్థితుల్లో ఎలా ఆడుతుందన్న ఆసక్తి మొదలైంది. గత పది వరల్డ్‌కప్స్‌లో ఈ టీమ్ గ్రూప్ దశను దాటింది. కానీ నాకౌట్ మొదలవుతుందంటే డచ్ ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది. దీంతో అభిమానులు నెదర్లాండ్స్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో సౌతాఫ్రికాకు దురదృష్టమైన జట్టుగా పేరు ఉంది. నాకౌట్ దశ వచ్చే సరికి ఎక్కడ లేని ఒత్తిడి కొనితెచ్చుకునే సౌతాఫ్రికా ఇంటిబాట పట్టడం అలవాటు చేసుకుంది. అచ్చం ఇదే తరహాలో ఫుట్‌బాల్‌లో నెదర్లాండ్స్ జట్టుకు జరుగుతుంది. ఇప్పటికి మూడుసార్లు రన్నరప్‌గా నిలిచన నెదర్లాండ్స్ ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయింది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఖతర్‌తో పాటు నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వెడార్‌లు పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉంది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్–జిలో అగ్ర స్థానంతో మెగా ఈవెంట్‌కు అర్హత పొందింది. మిడ్‌ఫీల్డర్ ఫ్రెంకీ డి జాంగ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. డిఫెండర్లలో డేలి బ్లిండ్, స్టీఫన్ డి రిజ్ ప్రత్యర్థి స్ట్రయికర్లను చక్కగా నిలువరిస్తున్నారు. దీంతో ఈ సారి ఫైనల్ చేరితే మాత్రం కప్‌ను చేజార్చుకునే ప్రసక్తే లేదనే లక్ష్యంతో ఉంది. ఇక ఖతార్ చేరుకున్న నెదర్లాండ్స్ జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలెపెట్టింది. తమ ట్రైనింగ్ సెషన్‌కు వలస కార్మికులను ఆహ్వానించి వారితో మ్యాచ్ ఆడడం వైరల్‌గా మారింది. ఆ వలస కార్మికులంతా ఖతర్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్న స్టేడియం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. స్టేడియానికి కొత్త హంగులు అద్దడం కోసం వీళ్లు గంటల కొద్దీ కష్టపడ్డారు. వలస కూలీల శ్రమకి గుర్తింపుగా ప్రాక్టీస్ సెషన్‌కి పిలిచిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు వారితో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. The Dutch National Team invited migrant workers who helped building the World Cup stadiums to attend their training session and to play football together. 🧡 pic.twitter.com/kvGor8LJlW — 𝐀𝐅𝐂 𝐀𝐉𝐀𝐗 💎 (@TheEuropeanLad) November 17, 2022 చదవండి: ఫిఫా ఆదాయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం 'నీకేం పోయే కాలం'.. రసెల్‌పై అభిమానుల ఆగ్రహం -
మహిళలకు అసభ్యకర సందేశాలు.. మాజీ ఫుట్‌బాలర్ నిర్వాకం
అజాక్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు డైరెక్టర్ హోదాలో ఉన్న మాజీ ఫుట్‌బాలర్ మార్క్ ఓవర్‌మార్స్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నతస్థానంలో ఉంటూ మహిళలకు అసభ్యకర సందేశాలు పంపాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన డచ్క్లబ్ ఓవర్మార్స్ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించడమే గాక తాత్కాలిక నిషేధం విధించింది. కాగా నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ ఓవర్‌మార్స్ 11 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడడంతో పాటు 1992-97 మధ్య కాలంలో అజాక్స్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు గత కొద్దిరోజులుగా మార్క్.. తనతో ఏకాంతంగా గడపాలంటూ తనతో పాటు పనిచేస్తున్న మహిళలకు అసభ్యరీతిలో సందేశాలు పంపాడు. మొదట ఇందులో నిజం లేదని కొట్టిసారేసినప్పటికి.. మెసేజ్‌లు వచ్చిన మహిళలు వాటిని బయటపెట్టడంతో మార్క్ బాగోతం బయటపడింది. కాగా 2012లో తొలిసారి అజాక్స్‌కు తొలిసారి డైరెక్టర్ అయ్యాడు. ఇటీవలే మరోసారి అజాక్స్ ఫుట్‌బాల్ డైరెక్టర్‌గా తిరిగి ఎంపికయిన మార్క్.. 2026, జూన్ 30 వరకు పదవిలో కొనసాగాల్సింది. తనపై వచ్చిన ఆరోపణలపై మార్క్ ఓవర్‌మార్స్ స్పందించాడు. ''నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా. మహిళలకు అసభ్య సందేశాలు పంపినప్పుడు ఇలా జరుగుతుందని భావించలేదు. ఏది ఏమైనా నేను చేసింది తప్పు. నాపై యాక్షన్ తీసుకోవడం సరైనదే.. ఏ శిక్షకైనా సిద్ధం'' అంటూ క్షమాపణ కోరాడు. చదవండి: Beijing Winter Olympics: 'నరకంలా అనిపిస్తుంది.. పెట్టిందే పెట్టి మమ్మల్ని చంపుతున్నారు' Ajax statement on Marc Overmars 🔴⤵️ #Ajax “Overmars made this decision after discussions in recent days - a series of inappropriate messages sent to several female colleagues over an extended period of time underlies his decision to leave the club”. #Overmars pic.twitter.com/P3x4pisd1x — Fabrizio Romano (@FabrizioRomano) February 6, 2022 -
క్షమాపణలు చెప్పిన డచ్ గోల్ కీపర్
పాలో:ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గోల్ కీపర్ గా తనను తప్పించడంపై అసహనం వ్యక్తం చేసిన నెదర్లాండ్స్ ప్రధాన గోల్ కీపర్ జాస్పర్ సిల్లెసన్ ఎట్టకేలకు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. మొన్న కోస్టారికా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన క్వార్టర్ప్ పైనల్ మ్యాచ్ లో నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. ఆ సమయంలో నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్.. ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్ మార్చి, సబ్ స్టిట్యూట్ కీపర్ టిమ్ క్రూల్ ను బరిలోకి దింపాడు. దీంతో సిల్లెసన్ వాటర్ బాటిల్స్ ను తన్ని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. 'నేను నిజంగా అలా చేయడం తప్పు. అప్పుడు షాక్ గురై మాత్రమే అలా ప్రవర్తించా' అని టీమ్ కు, అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. ఆ మ్యాచ్ లో గోల్ కీపర్ టిమ్ క్రూల్ చలవతో నెదర్లాండ్ 4-3 తేడాతో కోస్టారికాపై విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాతో డచ్ జట్టు తలపడనుంది. -
వాన్ గాల్ 'ఎత్తు' మాస్టర్ పీస్
హాగ్: షూటౌట్లో ‘ఎత్తు’తో కోస్టారికాను చిత్తుచేసిన నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ కోచ్ లూయిస్ వాన్ గాల్ ను డచ్ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. అనూహ్య నిర్ణయంతో జట్టును ఫిఫా ప్రపంచకప్ సెమీస్ ఫైనల్ కు చేర్చిన అతడి వ్యూహచతురతను మీడియా కొనియాడింది. వాన్ గాల్ ది బంగారు పిడికిలి అని డీ టెలిగ్రాఫ్ హెడ్‌లైన్స్ పేర్కొంది. కొన్నిసార్లు అదృష్టం కలిసొస్తుంది. కొన్నిసార్లు సిక్త్ సెన్స్ నిజమవుతుంది అని తెలిపింది. వాన్ గాల్ ప్రయోగాన్ని మాస్టర్ పీస్ గా మరో డచ్ పత్రిక వాల్క్స్క్రాంత్ వర్ణించింది. డచ్ టీవీ స్టేషన్ ఎన్ఓఎస్ కూడా 62 ఏళ్ల వాన్ గాల్ వ్యూహాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యాలు చేసింది. కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎక్స్ట్రా సమయం మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందనగా నెదర్లాండ్స్ కోచ్ తమ ప్రధాన గోల్ కీపర్ సిల్లెసన్ను మార్చి పెనాల్టీ షూటౌట్ కోసం రెండో గోల్ కీపర్ టిమ్ క్రూల్‌ను వాన్ గాల్ బరిలోకి దించాడు. ఎందుకంటే సిల్లెసన్ కంటే టిమ్ క్రూల్ ఎత్తు ఎక్కువ. కోచ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా టిమ్ క్రూల్ రెండు గోల్స్ ను అడ్డుకుని జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో వాన్ గాల్ ప్రయోగానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా, ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ పెనాల్టీ షూటౌట్లో నెగ్గడం ఇదే తొలిసారి.