మెస్సీ మ్యాజిక్‌.. సెమీఫైనల్లో అర్జెంటీనా | Messis Argentina beat Netherlands 43 on penalties to reach semis | Sakshi
Sakshi News home page

FIFA WC 2022: మెస్సీ మ్యాజిక్‌.. సెమీఫైనల్లో అర్జెంటీనా

Published Sat, Dec 10 2022 12:20 PM | Last Updated on Sat, Dec 10 2022 12:21 PM

Messis Argentina beat Netherlands 43 on penalties to reach semis - Sakshi

ఫిపా ప్రపంచకప్‌-2022 సెమీ ఫైనల్లో అర్జెంటీనా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అద్భుతమైన విజయం సాధించిన మెస్సీ బృందం తమ సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో..  మెస్సీ అసాధార‌ణ ఆట‌తీరును ప్రదర్శించాడు. మ్యాచ్‌ ఫస్ట్‌హాప్‌లో అద్భుతమైన కిక్‌తో మెస్సీ తొలి గోల్‌ను తన జట్టుకు అందించాడు.

దీంతో తొలి అర్ధబాగం ముగిసే సరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అనంతరం సెకెండ్‌ హాఫ్‌లో మెస్సీ అసిస్ట్ సహాయంతో మరో గోల్‌ను సాధించాడు. దీంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకెండ్‌ హాఫ్‌లో ఆనూహ్యంగా పుంజుకున్న నెద‌ర్లాండ్స్ రెండు గోల్స్ చేసి స్కోరును స‌మం చేసింది. దీంతో మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్లకు అదనపు సమయం కెటాయించాడు. అయితే అదనపు సమయంలో ఇరు జట్లు గోల్‌ను సాధించలేకపోయాయి.

 ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు మ్యాచ్‌ రిఫరీ పెనాల్టీ షూటౌట్‌ను ఎంచుకున్నారు. ఇక పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా  పెనాల్టీ షూటౌట్‌లోనూ మెస్సీ అద్భుతమైన గోల్‌ సాధించాడు. ఇక డిసెంబర్‌ 14న క్రోయేషియాతో సెమీఫైనల్లో అర్జెంటీనా తలపడనుంది.
చదవండి: FIFA WC: కల చెదిరింది.. హృదయం ముక్కలైంది! గుండెకోత మిగిల్చారు.. అయినా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement