విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్ కప్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న ఈ మెగాసమరంలో ఇకపై గోల్స్ వర్షం కురవనుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా సాకర్ ఫీవరే కనిపిస్తుంది. ఇక వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 32 జట్లు ఇప్పటికే ఖతార్‌కు చేరుకొని ప్రాక్టీస్‌లో వేగం పెంచాయి.
1974, 1978, 2010లో రన్నరప్.. ఫిఫా ర్యాంక్ చూస్తే 8వ స్థానం..! ఇటీవల వరుసగా 15 మ్యాచ్‌ల్లో పరాజయమే ఎరుగని వైనం. ఇదీ నెదర్లాండ్స్ జట్టు రికార్డు. కానీ ఇప్పటి వరకు ఆ టీమ్ ఫిఫా వరల్డ్‌కప్‌ను ముద్దాడలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. అసలు సిసలైన ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ ఉన్నా.. నిలకడలేమితో కీలక మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ తడబడుతోంది.
-సాక్షి, స్పోర్ట్స్ వెబ్‌డెస్క్
ఈ నేపథ్యంలో మరోసారి ఫిఫా కప్‌కు రెడీ అయిన డచ్ టీమ్.. అరబ్ గడ్డ ఖతార్‌లో కత్తిమీద సాముగా ఉండే పరిస్థితుల్లో ఎలా ఆడుతుందన్న ఆసక్తి మొదలైంది. గత పది వరల్డ్‌కప్స్‌లో ఈ టీమ్ గ్రూప్ దశను దాటింది. కానీ నాకౌట్ మొదలవుతుందంటే డచ్ ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది. దీంతో అభిమానులు నెదర్లాండ్స్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్రికెట్‌లో సౌతాఫ్రికాకు దురదృష్టమైన జట్టుగా పేరు ఉంది. నాకౌట్ దశ వచ్చే సరికి ఎక్కడ లేని ఒత్తిడి కొనితెచ్చుకునే సౌతాఫ్రికా ఇంటిబాట పట్టడం అలవాటు చేసుకుంది. అచ్చం ఇదే తరహాలో ఫుట్‌బాల్‌లో నెదర్లాండ్స్ జట్టుకు జరుగుతుంది. ఇప్పటికి మూడుసార్లు రన్నరప్‌గా నిలిచన నెదర్లాండ్స్ ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయింది.
ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఖతర్‌తో పాటు నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వెడార్‌లు పోటీ పడుతున్నాయి. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉంది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్–జిలో అగ్ర స్థానంతో మెగా ఈవెంట్‌కు అర్హత పొందింది. మిడ్‌ఫీల్డర్ ఫ్రెంకీ డి జాంగ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. డిఫెండర్లలో డేలి బ్లిండ్, స్టీఫన్ డి రిజ్ ప్రత్యర్థి స్ట్రయికర్లను చక్కగా నిలువరిస్తున్నారు. దీంతో ఈ సారి ఫైనల్ చేరితే మాత్రం కప్‌ను చేజార్చుకునే ప్రసక్తే లేదనే లక్ష్యంతో ఉంది.
ఇక ఖతార్ చేరుకున్న నెదర్లాండ్స్ జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలెపెట్టింది. తమ ట్రైనింగ్ సెషన్‌కు వలస కార్మికులను ఆహ్వానించి వారితో మ్యాచ్ ఆడడం వైరల్‌గా మారింది. ఆ వలస కార్మికులంతా ఖతర్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్న స్టేడియం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. స్టేడియానికి కొత్త హంగులు అద్దడం కోసం వీళ్లు గంటల కొద్దీ కష్టపడ్డారు. వలస కూలీల శ్రమకి గుర్తింపుగా ప్రాక్టీస్ సెషన్‌కి పిలిచిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు వారితో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు.
The Dutch National Team invited migrant workers who helped building the World Cup stadiums to attend their training session and to play football together. 🧡 pic.twitter.com/kvGor8LJlW
— 𝐀𝐅𝐂 𝐀𝐉𝐀𝐗 💎 (@TheEuropeanLad) November 17, 2022
Comments
Please login to add a commentAdd a comment