migrant workers
-
తిరుగు వలసలు చెబుతున్నదేమిటి?
కోవిడ్ మహమ్మారి కాలంలో లక్షలాది మంది నగరాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. మహమ్మారి ముగిసిన తర్వాత వీరందరూ తిరిగి నగరా లకు చేరుకుంటారన్న అంచనాలకు భిన్నంగా గ్రామాల్లోనే ఉండిపోయారు. 2020–22 మధ్య కాలంలో గ్రామీణ శ్రామిక శక్తికి సుమారు 5 కోట్ల 60 లక్షల మంది కార్మికులు జోడించబడ్డారు. వీళ్లలో ఎక్కువమంది యువత. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివాటిని మినహాయిస్తే, చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ కూడా జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించే ఆర్థిక విధానాలకు బదులుగా, వ్యవసాయాన్ని స్థిరమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చాలి.భారత ప్రజలు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. గత ఐదేళ్లలో, పట్టణ కేంద్రాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, ‘తక్కువ–ఉత్పాదకత’ కలిగిన వ్యవసాయం నుండి కార్మికులను బయటకు నెట్టడానికి సంకల్పించిన విధానం ఇప్పుడు అడ్డం తిరిగింది.కోవిడ్–19 మహమ్మారి కాలంలో మొదటిసారి తిరుగు వలసలు (రివర్స్ మైగ్రేషన్) మొదలయ్యాయి. లక్షలాది మంది పట్టణ పేదలు అనంత దూరాలు, చాలామంది కాలినడకన తమ తమ ఊళ్లకు ప్రయా ణించారు. దేశ విభజన రోజుల తర్వాత ఇది ప్రజల అతిపెద్ద చలనం. కనీవినీ ఎరుగనంత స్థాయిలో సాగిన ఈ అంతర్–రాష్ట్ర వలసలు, రాష్ట్రం లోపలి వలసలు తాత్కాలికమని నమ్మారు. కానీ, మహమ్మారి ముగిసిన తర్వాత శ్రామికశక్తి నగరాలకు తిరిగి వస్తుందనే అంచనాను తోసిపుచ్చుతూ, వాళ్లలో ఎక్కువ మంది తమ ఊళ్లలోనే ఉండడానికి ఇష్టపడటం జరిగింది.వ్యవసాయంలోనే ఉపాధి‘నేషనల్ శాంపిల్ సర్వే’, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ల డేటా ఆధారంగా, ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’, న్యూఢిల్లీకి చెందిన ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్’ రూపొందించిన ఒక నివేదికలో వ్యవసాయ ఉపాధి పెరిగిందని తేలింది. సాధారణ అభి ప్రాయానికి విరుద్ధంగా, 2020–2022 మధ్య గ్రామీణ శ్రామికశక్తికి 5 కోట్ల 60 లక్షలమంది కార్మికులు జోడించబడ్డారు. నిరుద్యోగం వృద్ధి చెందుతున్న సమయంలో, నగరాల్లో లభించే ఉపాధి అవకాశాలు వలస కార్మికులకు అంతగా ఆకర్షణీయంగా లేవని ఇది నిరూపిస్తోంది. తయారీ రంగంలో మందగమనం, నిర్మాణ రంగ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టడం వల్ల నగరాలకు వలస వచ్చినవారు గ్రామాలకు తిరిగి వెళ్లడమే మంచిదని భావించారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2004–05, 2018–19 మధ్య అంటే 13 సంవత్సరాల కాలంలో 6 కోట్ల 60 లక్షల మంది వ్యవసాయ శ్రామికులు పట్టణాలలో చిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లారు. కానీ 2018–19, 2023–24 మధ్య ఐదేళ్లలో 6 కోట్ల 80 లక్షల మంది పైగా ప్రజలు గ్రామాలకు తిరిగి వచ్చారని జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యా లయానికి చెందిన ఆర్థికవేత్త హిమాన్షు అంచనా వేశారు. వ్యవసాయం అకస్మాత్తుగా లాభదాయకంగా మారిందని దీని అర్థం కాదు. ప్రజ లను పొలాల నుండి బయటకు నెట్టడం ఆచరణీయమైన వ్యూహం కాదని ఇది స్పష్టంగా చెబుతోంది.గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయం వాటా 2018–19లో 42.5 శాతం నుండి 2023–24లో 46.1 శాతానికి పెరిగిందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక చెబుతోంది. పైగా ఇందులో గణనీయమైన యువ జనాభా కూడా ఉంది. ఇది విస్మరించలేని సందేశాన్ని ఇస్తోంది. ప్రజలను ఆ రంగం నుండి బయటకు నెట్టాలనే లక్ష్యంతో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకపట్టున ఉంచిన విధానాల మీద మన ఆర్థిక ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సరం పాటు జరిగిన ఆందోళనల తరువాత రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. తమకు సరైన ఆదాయాన్ని నిరంతరం తిరస్కరించడంపై రైతాంగం ఆగ్రహంతో ఉంది.ప్రపంచ బ్యాంకుకు దూరంగా– గాంధీజీకి దగ్గరగా!భారతదేశం తన వ్యవసాయరంగం నుండి 40 కోట్ల మంది ప్రజలను నగరాలకు వలసబాట పట్టించాలని ప్రపంచ బ్యాంకు 1996లో కోరింది. ఇది బ్రిటన్, ఫ్రాన్ ్స, జర్మనీల ఉమ్మడి జనాభా కంటే రెండింతలకు సమానం. అయితే పట్టణ కేంద్రాలకు వలస వెళ్లడానికి వీలుగా ఆర్థిక పరిస్థితులను సృష్టించే బదులు, వ్యవ సాయాన్ని ఆచరణీయమైన వాణిజ్యంగా మార్చడం ద్వారా వ్యవ సాయాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించాలి. మహాత్మా గాంధీ కోరుకున్నది ఇదే. వలస కార్మికులు తిరిగి వచ్చిన రేటు ఆయన అభి ప్రాయం ఎంత సరైనదో చూపిస్తుంది. అందువల్ల, ప్రపంచ బ్యాంకు ఆలోచనను విడనాడి వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం, వ్యవసాయాన్ని స్థిరమైన, ఆచరణీయమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.మీకు ఇంకా నమ్మకం లేకుంటే, ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్’ (నాబార్డ్)కు చెందిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే 2021–22’ నివేదికను చూడండి. దీని ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న జనాభా వాటా సంవత్సరాలుగా గణనీయంగా పెరి గింది. 2016–17లోని 48 శాతం నుండి 2023–24లో గరిష్ఠంగా 57 శాతానికి చేరుకుంది. వ్యవసాయ కుటుంబాల సంఖ్యలో పెను గంతు స్థానికుల తిరిగిరాకను స్పష్టంగా సూచిస్తోంది. వ్యవసాయ కుటుంబాల వాటా 2016–17లో 42 శాతం నుండి 2021–22 నాటికి 36 శాతానికి తగ్గిన పంజాబ్; 70 నుండి 63 శాతానికి తగ్గిన హిమాచల్ ప్రదేశ్, కొంచెం తగ్గుదల చూపిన గుజరాత్, కర్ణాటకలను మినహాయిస్తే... అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల పెరుగుదల గణనీయంగా ఉంది. వ్యవసాయ కుటుంబాలు గోవాలో 3 నుండి 18 శాతానికి, హరియాణాలో 34 నుండి 58 శాతానికి పెరిగాయి. ఉత్తరా ఖండ్‌లో 41 నుంచి 57 శాతం; తమిళనాడులో 13 నుండి 57 శాతం పెరుగుదల కనబడింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పెరుగుదల ధోరణినే చూపుతున్నాయి.కారణాలు ఏమైనప్పటికీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, పీరి యాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నాబార్డ్ చేసిన మూడు అధ్యయనాలు కూడా ఉపాధి, జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను చాటుతున్నాయి. అందుకే గృహ ఆహార భద్రతను నిర్ధారించడంలో వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని విస్మరంచకూడదు.ఆందోళనలో శుభవార్త వ్యవసాయంలో సంఖ్యలను తగ్గించడంపై ఆధారపడిన మును పటి ఆర్థిక విధానాలను రివర్స్ మైగ్రేషన్ తారుమారు చేసినప్పటికీ, వ్యవసాయంలో ఉపాధి పెరుగుదలను ప్రధాన ఆర్థికవేత్తలు ‘ఆందో ళన కలిగించే అంశం’గా చూస్తున్నారు. భారతదేశంలో కనిపిస్తున్న ఈ తిరుగు వలసల ధోరణి తక్కువ మధ్య–ఆదాయ వర్గానికి ప్రత్యే కమైనదిగా చూస్తున్నారు. కానీ వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన ఆర్థిక విధానాలను పునరుజ్జీవింపజేయవలసిన అవస రాన్ని ఇది సూచిస్తుంది. మారుతున్న క్షేత్ర వాస్తవికతను గుర్తించాల్సిన సమయం ఇది.ప్రభుత్వం తగిన వనరులను కల్పించడానికి సిద్ధంగా ఉంటే, వ్యవసాయంపై ఆధారపడటం దాని సొంత ఆచరణీయ మార్గాలను సృష్టిస్తుంది. వ్యవసాయం కోసం కేటాయించే బడ్జెట్ వ్యయంలో ఏదైనా పెరుగుదలను ప్రతిపాదిస్తే, అది ఆర్థిక లోటుకు అదనపు మొత్తంగా పరిగణించడాన్ని ఆర్థికవేత్తలు ఇకనైనా మానేయాలి. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం మాత్రమే రైతుల నష్టాలను బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేయడం లేదు. నేను తరచుగా చెప్పినట్లు, రైతులు దాదాపు 25 సంవత్సరాలుగా ఏటా పంట నష్టపోతున్నారు. రైతులకు ‘దేవుడే దిక్కు’ అయ్యే ఈ లోపభూయిష్ట ఆర్థిక రూపకల్పన ఇకనైనా అంతం కావాలి.ఒక విధంగా తిరుగు వలసలను శుభవార్తగా చూడాలి. వనరులను అత్యంత అవసరమైన చోట ఉంచడానికి ఇది సరైన సమయం. అది చివరకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు దారి తీస్తుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
ఉపాధికి అడ్డ.. భువనగిరి గడ్డ
సాక్షి, యాదాద్రి: ఒకప్పుడు వలసలకు కేంద్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు వలస కార్మికులకు ఉపాధి అడ్డాగా మారింది. ఉపాధి లేక ముంబై, భివండీ, సోలాపూర్, బెంగళూరు, ఆంధ్ర, సూరత్ వంటి పట్టణాలకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి నిరంతరం వలసలు సాగేవి. కానీ ఇప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, గృహనిర్మాణ రంగాలు పుంజుకోవడంతో వివిధ రకాల పనులు ఊపందుకున్నాయి. దీంతో కూలీల కొరత నెలకొనడంతో జిల్లాకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కార్మికులు వలసవచ్చి ఉపాధి పొందుతున్నారు.30 వేల మందికి పైగా.. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన వేలమంది జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యాదాద్రి జిల్లాకు రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండటంతో కార్మికులు నేరుగా చేరుకుంటున్నారు. జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో 30 వేలకు పైగా ఇతర రాష్ట్రాల కార్మికులు పలు రకాల పనులు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రైస్ మిల్లులు, హోటళ్లు, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, టైల్స్, పీవోపీ, పౌల్ట్రీ, ఎయిమ్స్, కంపెనీలు, వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. చౌటుప్పల్, బీబీనగర్ పారిశ్రామిక వాడల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రైస్‌మిల్లులు, భవన నిర్మాణ పనులు, వ్యవసాయంలో నాట్లువేయడం, పత్తి ఏరడం తదితర పనులు చేస్తున్నారు. బార్బర్ పని, హోటళ్లలో మాస్టర్లు, వెయిటర్లు, ఇలా ఒకటేమిటి అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రం కార్మికులది ఒక్కో ప్రత్యేకత బిహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారు జిల్లాలోని రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేస్తుండగా.. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారు భవన నిర్మాణంలో తాపీ మేస్త్రీలుగా, పార కూలీలుగా.. రాజస్తాన్ నుంచి వచ్చిన వారు హోటళ్లు, పీవోపీ, హార్డ్‌వేర్ దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు పత్తి ఏరడం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారు పొలంలో నాట్లు వేయడం లాంటి పనులు చేసి జీవనోపాధి పొందుతున్నారు.అధికంగా రైస్ మిల్లుల్లో.. ఒక్కో రైస్ మిల్లులో 20 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తారు. ఒక గుంపునకు ఒక ముఠామేస్త్రి కార్మికులను సూపర్వైజ్ చేస్తారు. అందరికంటే ముఠామేస్త్రికి కాస్త కూలి ఎక్కువగా ఉంటుంది .రైస్ మిల్లుల్లో మిల్లు డ్రైవర్, ప్లాంటు డ్రైవర్, హమాలీలుగా పని చేస్తారు. మిల్లు ప్లాంటు, డ్రైవర్లకు రోజుకు సుమారు రూ.800 కూలి పడుతుంది. మిల్లుకు వచ్చే లారీల ధాన్యం లోడింగ్, అన్లోడింగ్, హమాలీ కార్మికులు చేస్తారు. వీరికి రోజుకు సుమారు రూ.500 కూలి పడుతుంది. మిల్లు యజమానులు వీరికి భోజనం, వసతి కల్పిస్తారు. అడ్వాన్స్‌లు చెల్లించి మరీ.. పలు గ్రామాల్లో గల ఇటుక బట్టీల్లో సుమారు 6,000కుపైగా ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల పనుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.50 వేల అడ్వాన్స్ చెల్లించి ఇటుక బట్టీ యజమానులు పనులకు తీసుకువస్తారు. ఒక్కో వ్యక్తికి వారానికి రూ.వెయ్యి చొప్పున కిరాణా సరుకుల కోసం ఖర్చులు ఇవ్వడంతో పాటు వారు చేసిన పనులను బట్టి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు అడ్వాన్స్‌లో కటింగ్ చేస్తారు. ఒడిశా కూలీలు తాము తీసుకున్న అడ్వాన్స్‌కు సరిపోను ఈ నాలుగు నెలల కాలంలో పనులు చేస్తారు.చదవండి: రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు.. ఎమ్మెల్యే కాటిపల్లిబెంగాల్ నుంచి వచ్చాను మాది పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా గొసాబా. మా రాష్ట్రంలో పనులు లేవు. ఉపాధికోసం భువనగిరికి వచ్చాం. తిండి, వసతి ఖర్చులు లేకుండా పనిచేసే గ్రామాల్లోనే షెల్టర్ వెతుక్కుంటున్నాం. ఒక్కొక్కరం రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తాం. దాదాపుగా రెండు నెలల పాటు పనులు చేసి తిరిగివెళ్తాం. కుటుంబ పోషణ చూసుకుని మరో సారి వస్తాం. ఇలా సంవత్సరానికి రెండు మూడుసార్లు వస్తాం. ఇక్కడ పనులకు కొరతలేదు. – దాలీమ్షేక్, పశ్చిమబెంగాల్మూడు నెలలు ఇక్కడే మా రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో సరైన ఉపాధి అవకాశాలు లేవు. ఏడాదిలో ఒక సీజన్లో కూడా పని దొరకదు. సాగు అంతంత మాత్రమే. అందుకే మేమంతా తెలంగాణకు వస్తున్నాం. ఇక్కడ మాకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఏడాదిలో మూడు నెలలు ఇక్కడే ఉంటాం ధాన్యం ఎత్తడం, దించడం వంటి హమాలీ కూలి పని చేస్తాం. ఉప్పరి మేస్త్రీ పనికి వెళ్తాం. – మహబూబ్ ఆలమ్, ఛత్తీస్గఢ్ఇక్కడ ఉపాధికి కొదవలేదు ఇక్కడ ఉపాధికి కొదవ లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చాం. రెండు నెలలు ఇక్కడ పని చేసుకుంటాం. రోజుకు ఖర్చులు పోను రూ.500 సంపాదిస్తాం. హమాలీ, మేస్త్రీ, ఇతర పనులు చేస్తాం. పనులు పూర్తి అయిన తర్వాత వెళ్లిపోతాం. మాకు భోజనానికి బియ్యం, ఉండటానికి ఇళ్లు, తాగునీరు, వైద్య సౌకర్యం, వసతులు పని ఇచ్చే వారే చూసుకుంటారు. ఉమ్మడి స్నేహితులతో కలిసి వస్తాం పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం. – అన్వర్, మహారాష్ట్రరోజుకు రూ.1,000 సంపాదిస్తున్న జీవనోపాధి కోసం ఒడిశా నుంచి యాదగిరిగుట్టకు వచ్చాం. దాదాపు సంవత్సరం అవుతోంది. ఇక్కడ బిర్యానీ హోటల్లో పనిచేస్తూ బతుకుతున్నాను. రోజుకి రూ.1,000 సంపాదిస్తున్నాను. ప్రస్తుతం అయితే డబ్బుల కోసం కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.– జాకీర్, ఒడిశాఇక్కడే ఆరు నెలలు ఉపాధి మా రాష్ట్రంలో పనులు దొరకవు. తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయి. జిల్లాకు ఏటా వచ్చి రైసు మిల్లులో పనిచేస్తా. ఆరేడు నెలలపాటు ఇక్కడే ఉంటా. వారానికోసారి సేటు పైసలు ఇస్తరు. నా ఖర్చులకు ఉంచుకొని మిగిలినవి ఇంటికి పంపిస్తాను. ఇక్కడా బాగా వుంది. – బాబులాల్, బిహార్ -
ఉచితాలతో ఇంకెంతకాలం?
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయం నుంచి వలస కార్మికులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఉచితాలను ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగావకాశాల కల్పన, సామర్థ్యాల పెంపుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచిత/సబ్సిడీ రేషన్ అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపగా..దీనర్థం పన్ను చెల్లింపుదార్లను మాత్రమే మినహాయించారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలపై సుమోటోగా దాఖలైన పిటిషన్‌పై ఎన్జీవో తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇ–శ్రమ్ పోర్టల్ నమోదైన వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ‘వలస కార్మికులందరికీ ఉచితంగా రేషనివ్వాలని రాష్ట్రాలను మేం ఆదేశిస్తే ఒక్కరు కూడా ఇక్కడ కనిపించరు. ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రానిదే కాబట్టి, రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తాయి. అసలు సమస్య ఇదే’అని ధర్మాసనం పేర్కొంది. వలస కార్మికుల సమస్యలపై సవివర విచారణ జరపాల్సి ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీన వాయిదా వేసింది. -
18 ఏళ్ల తరువాత.. కన్నీళ్లతో సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు
సాక్షి, సిరిసిల్ల: సుదీర్ఘ కాలం దుబాయ్ జైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో జైలు నుంచి విడుదలైన వీరికి ఆయనే సొంత ఖర్చులతో విమాన టికెట్లు అందజేశారు. రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన సిరిసిల్లకు చెందిన దండుగుల లక్ష్మణ్ రెండు రోజుల క్రితం విడుదలైన రుద్రంగి మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు. పెద్దూరు గ్రామానికి చేరుకున్న శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు కార్మికులు మంగళవారం సిరిసిల్లకు చేరుకున్నారు. వచ్చే నెలలో చందుర్తికి చెందిన మరో కార్మికుడు వెంకటేశ్ జైలు నుంచి విడుదలై తిరిగి రానున్నానడు. కమ్యూనికేషన్ సమస్య వల్ల దుబాయ్ జైల్లో మగ్గిపోయిన వీరిని విడిపించేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దీంతో దుబాయ్‌లో జైలు పక్షులుగా మారిన సిరిసిల్ల వాసులు ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం కనీళ్లు, ఆనంద భాష్పాలతో కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారు. ఇదీ చదవండి.. రాజకీయాలకు రైతులను బలి చేయొద్దు -
Pongal: భాగ్యవంతులొస్తున్నారు..
ఆశలు మూటలు నెత్తిన మోస్తూ గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ భాగ్యవంతులు వస్తున్నారు. ఇంకో వారంపదిరోజుల్లో హైదరాబాద్, బెజవాడ..గుంటూరు..నెల్లూరు..నల్గొండ.. ఈస్ట్..వెస్ట్.. జిల్లాలనుంచి వేలమందిని మోసుకుంటూ రైళ్లు బస్సులు మన్యం జిల్లాకు వస్తుంటాయి. వాళ్లంతా వలసకూలీలని సామాజికవేత్తలు అంటుంటారు కానీ నాలాంటి అల్ప సంతోషులు మాత్రం వాళ్ళను భాగ్యవంతులు అంటారు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదలని మేధావులు అంటారు. నాలాంటి సామాన్యులు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులని అంటాం భోగి ముందురోజు రాత్రి ఐడ్రా బాడ్ నుంచొచ్చిన అప్పలనాయుడు, లక్ష్మీ, నాయుడి వీరకాడు నారాయణ, ఇరుగుపొరుగు వట్టిగడ్డి కుప్పేసి దమట ముట్టించి సుట్టూ కూకుని కవుర్లు మొదలెట్టారు.. మరేటిబావా ఐడ్రాబాడ్లో అంతా బాగున్నట్టేనా అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మీ అందుకుని.. పర్లేదన్నియ్యా ఇద్దరం డూటీకి వెళ్తాం..మాతోబాటే మా మహేసూ వస్తాడు.. ముగ్గురికి బాగానే వస్తాది అదోరం సెలవు.. ఒకలి జీతం అద్దికి.. ఖర్చులకు పోయినా రెండు జీతాలు మిగుల్తాయి.. మరి దాంతోటే కదా ఈ ఇల్లు పునాదులు రేకులు వెయ్యడం.. పెద్దదాని పెళ్లి అప్పు లచ్చన్నర తీర్చడం..చిన్నదాన్ని నర్స్ ట్రైనింగ్.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అంతలోనే లక్ష్మీ మళ్ళీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నియ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు కౌసు ఉండాలి అంటున్నప్పుడు ఆరేడేళ్ళు క్రితం ఇదేఊళ్ళో అడ్డిడు బియ్యం.. తవ్విడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం. మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోన్లేర్రా ఊళ్ళో అయినోళ్ళ ముందు చెడి .. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింది వదిన చేటలో చెత్త పెంటమీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ నచ్చిమొదినా చెవులోవి కొత్తవా ఏటీ అన్నాది. వెంటనే లక్ష్మీ మొహాన్ని సంతోషం కమ్మేయగా..అవును మంగొదినా ఇన్నాళ్లకు ఆర్తులం సెయిను, ఆర్తులం జూకాలూ చేయించాడు మీ అన్నియ్య అని చెబుతూ భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జూకాలు మరింత మెరుస్తూ కనిపించాయి. ఇదిగో ఈ సీర్లన్నీ సీఎమ్మారులో కొనేసామ్ ఒకేసారి అంటున్నప్పుడు అప్పట్లో పాతచీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మీ గొంతులో మాకిప్పుడా అవసరం లేదన్న భరోసా వినిపించింది.. మొన్నామధ్య యాదగిరి వెళ్ళాము. తిరప్తి కన్నా పెద్దది తెలుసా.. ఇంతంత కాదని చెబుతున్నపుడు మేం విహారయాత్రలకూ వెళ్తాం..మేం అప్పట్లా లేం.. అనే ధీమా ముప్పిరిగొంటుంది. పాత్రల పేర్లు మారతాయేమో కానీ పార్వతీపురం డివిజన్లోని ప్రతిగ్రామంలోనూ ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఆరేడేళ్ళ క్రిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు.. కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్..బస్సు ఎక్కి.. ఆ జిల్లాలకు వెళ్లాయి. రైస్ మిల్లులు..నూలు మిల్లులు..టాబ్లెట్స్.. ప్లాస్టిక్ కంపెనీలు..చేపలు..రొయ్యల చెరువులు..ఫామ్ హవుసులు.. కోళ్లఫారాలు..డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయారు.. పాపం అమాయకులు..నిజాయితీగా ఒళ్ళోంచి పనిచేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇష్టులైపోయారు. చాలామందికి..చిన్నపాటి షెడ్.. ఇల్లు..రేషన్ కూడా యజమానులే ఇస్తారు..ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్ళు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్ళకే స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లు లేకపోవచ్చు..లక్షలూ అక్కర్లేదు. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది..తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది. ఓపికున్నన్నాళ్లు చేద్దాం..ఊళ్ళోకొచ్చి మాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం ..ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు. జీవితంలో అన్నీ కోణాలూ..అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచినవాళ్ళు భాగ్యవంతులే... ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ళ జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసిపట్టుకుని అలాక్కాడు.. మా రాత మేం రాసుకుంటాం.. నువ్ పక్కకేళ్లు సామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్ళెవరూ పేదలు కారు...అవును పేదలు కారు...అక్షరాలా శ్రామికులు.. కార్మికులు... కృషి..శ్రమ ఉన్నచోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి..ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు... శ్రమయేవ జయతే కృషితో నాస్తి దుర్భిక్షం. గాంధీ... విజయనగరం -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించడానికి ఏడీఎన్‌హెచ్ కంపాస్ కంపెనీ ఉచిత రిక్రూటింగ్ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ జిల్లాలకు చెందిన 12 వేలమంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీ మరి కొంతమంది కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాటరింగ్ రంగంలో వలస కార్మికులకు ఆరు రకాలైన పనులు కల్పించనున్నారు. ఉచితంగా వీసా, విమాన టికెట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. క్యాటరింగ్ సూపర్వైజర్(హాస్పిటాలిటీ క్యాటరింగ్ అనుభవం ఉన్నవారికి), టీం లీడర్(హాస్టల్ నిర్వహణ అనుభవం), హెవీ వెహికల్ డ్రైవర్(యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి), కిచెన్ స్టీవార్డ్స్, క్లీనర్స్, వెయిటర్లకు ఉపాధి కల్పించడానికి వీసాలను జారీ చేయనున్నారు. ఈ నెల 9న ముంబైలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మూర్, జగిత్యాల్లోని జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీవారిని కలిసి వివరాలను అందించాలని సంస్థ యజమాని చీటి సతీశ్‌రావు ‘సాక్షి’కి వివరించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలవారు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పచ్చ»ొట్టు ఉండకూడదని చెప్పారు. వేతనంతోపాటు ఉచితవసతి, భోజన సదుపాయం కల్పించి ఉపాధి ఇవ్వనున్నారని వెల్లడించారు. ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్లేవారి కోసం తక్కువ ఖర్చుతో బస్సు సౌకర్యం కల్పించామన్నారు. -
లోకల్ టచ్చిస్తారా..నేషనల్ నచ్చేస్తారా?
వేలల్లో పరిశ్రమలు. లక్షలాదిమంది కార్మికులు.. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కార్మిక కుటుంబాలతో సందడి..అన్ని భాషలు, సంస్కృతుల సమ్మేళనం.. వెరసి మినీ ఇండియా పేరుగాంచింది మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా. మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. వారిదే ప్రధాన భూమిక శ్రామికుల రాజధానిగా పేరుగాంచిన మేడ్చల్ జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై శ్రామిక ఓటర్లు ప్రభావం చూపనున్నాయి. ఈ జిల్లా జనాభాలో 40 శాతం మంది శ్రామికులే ఉన్నారు. జిల్లాలో మొత్తం శ్రామికులు 2,26,939 మంది ఉండగా, వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వలస శ్రామికులు 1,80,326 మంది ఉన్నారు. జిల్లాలో రెండు మెగా పరిశ్రమలు, 71 భారీ పరిశ్రమలు, 3,760 మైక్రో , 2320 సూక్ష్మ, 16 మధ్యతరహా పరిశ్రమల్లో 77,862 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. ఇక ఈ ఏడాది కొత్తగా ఏర్పడిన 599 సూక్ష్మ, చిన్న పరిశ్రమలతో 4,609 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లోని నివసిస్తున్న వీరంతా ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరి ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. అయితే వీరు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి. జాతీయ పార్టీలకు మద్దతిస్తారా.. లోకల్‌గా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడి పార్టీ కే పట్టం కడతారా అన్నది చూడాల్సిందే. సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ప్రధానంగా బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, అస్సోం, ప శ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. ఏయే కంపెనీలు ఉన్నాయంటే.. జీడిమెట్ల, బాలానగర్, కూకట్పల్లి, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, శామీర్‌పేట్, మేడ్చల్ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలతోపాటు ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కెమికల్, ఎల్రక్టానిక్స్ తరహా పరిశ్రమలు ఉన్నాయి. బాలానగర్ పారిశ్రామికవాడ పరిధిలో ఫ్యాన్లు తయారు చేసే కంపెనీలు, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, బీర్ మాన్యు ఫాక్చరింగ్ యూనిట్, ఫాబ్రికేషన్, వైర్ మెష్ యూనిట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బీహెచ్ఈఎల్, ఆర్ అండ్ డీ, హెచ్ఎఎల్, ఐడిపిఎల్, ఎన్ఆర్ఎస్ఎ వంటి కంపెనీలూ ఉన్నాయి. ఐడీఏ బాలానగర్, ఐడీఏ కూకట్పల్లి, సీఐఈ గాం«దీనగర్ ఒకే చోట ఉన్నాయి. ఇక శామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లో బయెటెక్, కెమికల్, విత్తన చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. -
బాంబ్ సేఫ్టీ రూంలో తలదాచుకున్నాం
సాక్షి ప్రతినిధి కరీంనగర్/మోర్తాడ్/ఆర్మూర్: ఇజ్రాయెల్‌లో ఉన్న తెలంగాణ వలస కార్మికుల కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాలస్తీనా సరిహద్దుకు సమీప ప్రాంతంలో నివసిస్తున్నవారు ఇబ్బందులు పడుతుండగా, టెల్ అవీవ్ వంటి నగరాల్లో ఉన్నవారు క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి ఏపీ నుంచి ఐదువేల మంది వరకు ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. వీరిలో నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మెదక్, జగిత్యాల తదితర జిల్లాలకు చెందిన సుమారు 1,500 మంది ఉన్నారు. విజిట్ వీసాలపై ఇజ్రాయెల్ వెళ్లిన చాలామంది అక్కడ ఇళ్లలో కార్మికులుగా పనులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని రమద్‌గాన్ పట్టణం తలవిల ప్రాంతంలో చాలామంది తెలంగాణవారు ఉన్నారు. ఈ పట్టణం పాలస్తీనా సరిహద్దుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శనివారం సాయంత్రం నుంచి బాంబుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోందని తెలంగాణవాసులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ప్రభుత్వం బాంబుల దాడి సమయంలో సైరన్ మోగించడంతో వెంటనే ప్రతి అపార్ట్మెంట్లో ఉండే బాంబ్ సేఫ్టీ రూంలో తలదాచుకున్నామని చెప్పారు. తెలంగాణవాసులు కార్మికులుగా పనిచేసే ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగిన బాంబుదాడిలో ఓ భవనం ఆరో అంతస్తు శిథిలమైందని, ఇప్పటివరకు అందరం క్షేమంగానే ఉన్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లికి చెందిన జలపతిరెడ్డి, గుండ సత్తయ్య, అనంతరెడ్డి, హబ్సీపూర్‌కు చెందిన ఏలేటి మల్లారెడ్డి, గుగ్గిల్ల లక్ష్మీనారాయణ, వరికోల నర్సయ్య, ఆదివారం రాత్రి అక్కడి పరిస్థితులను ‘సాక్షి’కి వివరించారు. టెల్అవీవ్లో సురక్షితం తెలంగాణకు చెందిన 600 మంది వలస కార్మికులు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో ఉపాధి పొందుతున్నారు. హమాస్ దాడులతో సరిహద్దు ప్రాంతాల్లోని వారికే ఎక్కువ ముప్పు ఉందని, ఇతర ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేదని నిజామాబాద్ జిల్లానుంచి ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిన కార్మికులు ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. దాడులు మొదలైనప్పుడు కొంత ఆందోళనకు గురయ్యామని, మిలిటెంట్ల ఆగడాలను అరికట్టడానికి ఇజ్రాయెల్ రక్షణ విభాగం రంగంలోకి దిగి సరిహద్దు ప్రాంతాల్లోనే నిలువరించాయని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు. రక్షణ చర్యలు చేపట్టారు ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరుల రక్షణకు చర్యలు చేపట్టింది. దాడులు జరుగుతున్న ప్రాంతం మా నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడం వల్ల తెలంగాణవారు పెద్దగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. – సోమ రవి, తెలంగాణ ఇజ్రాయెల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఉపాధిపై ప్రభావం ఉంటుంది కుటుంబాలను పోషించుకోవడానికి కోసం ఇక్కడకు వలస వచ్చాం. కోవిడ్ సమయంలో పనులు లేక ఇబ్బందిపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది. – ఓంకార్, ఇజ్రాయెల్‌లో ఉన్న ఆర్మూర్ మండలం పిప్రివాసి -
గల్ఫ్.. ప‘రేషన్’
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. రేషన్‌కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్‌డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్‌తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్‌బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. పేర్లు తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు -
లిఫ్ట్ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కుప్పకూలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ సొసైటీలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కార్మికులతో బయలుదేరి వెళ్తూ 14వ ఫ్లోర్ నుంచి అకస్మాత్తుగా జారు కుంటూ వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దీంతో లిఫ్టులోని నలుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధి తులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలసకార్మికులని పోలీసులు తెలిపారు. -
విదేశీయులకు షాకిచ్చిన కువైట్.. 66 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు
మోర్తాడ్ (బాల్కొండ): వలస కార్మికులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించిన కువైట్.. డ్రైవింగ్ లైసెన్స్‌ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి విదేశీయులకు జారీ చేసిన లైసెన్స్‌లలో ఏకంగా 66 వేల లైసెన్స్‌లను రద్దు చేసింది. ఇంకా అనేక మంది లైసెన్స్‌లు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలతో ఇతరులతో పాటు తెలుగు రాష్ట్రాల వలస కారి్మకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన అనేకమంది అరబ్బులకు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అలాగే సేల్స్‌మెన్ కమ్ డ్రైవర్లుగా కూడా అనేక మంది వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారికి జారీ చేసిన లైసెన్స్‌ల విషయంలో కువైట్ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సేల్స్మెన్లు కేవలం అదే పని చేయాలని, డ్రైవింగ్ ఎలా చేస్తారని ప్రశి్నస్తూ గతంలో జారీ చేసిన లైసెన్స్‌లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచారని సమాచారం. మరోవైపు కంపెనీలను నిర్వహిస్తున్నవారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేసి డ్రైవింగ్ లైసెన్స్‌లను పొందారు. వీరి ఆదాయం కూడా పరిగణనలోకి తీసుకుని సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్‌లను కొనసాగించనున్నారు. కొన్నేళ్ల కిందట డ్రైవింగ్ లైసెన్స్‌లను విచ్చలవిడిగా జారీ చేయడంతో కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన కువైట్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుందని అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసులు కొందరు వెల్లడించారు. దిద్దుబాటులో భాగంగా సొంత కారు ఉండి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మన కరెన్సీలో కనీసం రూ.1.50 లక్షల వేతనం ఉండాలనే నిబంధన అమలులోకి తీసుకువచ్చారు. తక్కువ వేతనం అందుకుంటున్నవారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసి ఉంటే దానిని రద్దు చేశారు. కాగా తప్పుడు ఆధారాలతో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందినవారు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చదవండి: అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ -
తెలంగాణ వలస కార్మికుల షాక్! రూ.లక్ష జరిమానా కట్టి మీ దేశం వెళ్లండి!
సాక్షి, నిజామాబాద్: ఉపాధిని వెతుక్కుంటూ ఇరాక్ వెళ్లిన తెలంగాణ వలస కార్మికుల అకామ (రెసిడెన్సీ కార్డు) గడువు ముగిసిపోవడంతో ఇంటికి చేరుకోవాలంటే రూ.లక్ష జరిమానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం నిర్దేశించింది. అకామ లేకపోవడంతో ఎవరూ పనిఇవ్వడం లేదని, పార్కులలో తలదాచుకుంటూ అష్టకష్టాలు పడుతున్న తమకు జరిమానా చెల్లించే స్తోమత లేదని వలస కార్మికులు వాపోతున్నారు. ఎర్బిల్ పట్టణంలో తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు సుమారు 20 మంది వరకు ఉండిపోయారు. గతంలో అకామ లేనివారిని ఇరాక్‌లో మన రాయబార కార్యాలయం అధికారులు జరిమానాను తప్పించి ఇంటికి పంపించారు. అలా వందలాది మంది వలస కార్మికులు సొంతిళ్లకు చేరుకున్నారు. కాగా కొంత మంది మాత్రం ఇంటికి రాకుండా ఇరాక్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇరాక్‌లో చట్టవిరుద్ధంగా ఉన్నవారిపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులు ఇంటికి చేరుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ. వెయ్యి నుంచి 1,500 వరకు అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో రూ. లక్షకు పైగా) జరిమానా చెల్లిస్తేనే విదేశీ కార్మికులను వారి దేశాలకు వెళ్లడానికి అనుమతిస్తామని ఇరాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో ఉన్న తాము జరిమానా చెల్లించి, విమాన టికెట్‌ను కొనేందుకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలని వలస కార్మికులు వాపోతున్నారు. మంచిర్యాల్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు చెందిన వలస కార్మికులు ఇరాక్‌లో ఉండిపోయారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇరాక్‌లోని వలస కార్మికులు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ను ఆశ్రయించగా సదరు సంస్థ ప్రతినిధులు విదేశాంగ శాఖను సంప్రదించారు. వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రవాసీ మిత్ర సంస్థ ప్రతినిధులు సమాచారం అందించారు. ఇంటికి రప్పించడానికి చొరవ తీసుకోవాలి... గడువు ముగిసిపోవడంతో మాకు పనివ్వడం లేదు. కరోనా వల్ల అనేక కంపెనీలు మూతపడ్డాయి. ఇంటికి రావాలంటే జరిమానా చెల్లించడానికి మా వద్ద డబ్బులు లేవు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని వలస కార్మికులను ఇంటికి రప్పించాలి. -
నకిలీ వీడియో కేసు.. పోలీసుల కస్టడీలో యూట్యూబర్!
చెన్నై: తమిళనాడులోని బీహార్ వలస కార్మికులపై దాడులు చేశారంటూ నకిలీ వీడియోలను పోస్ట్ చేసిన కేసులో యూట్యూబర్ మనీష్ కశ్యప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని మధురై కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం న్యాయస్థానం కశ్యప్‌కు మూడు రోజుల కస్టడీని విధించింది. మార్చి 18న జగదీష్పూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన తర్వాత బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) కశ్యప్‌ను అరెస్టు చేసింది. పోలీసుల ప్రత్యేక బృందం ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్ నుంచి తమిళనాడుకు తీసుకువచ్చింది. నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు అతనిపై మధురైలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, అతనిపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటీవల, తమిళనాడులో వలస కార్మికులపై దాడికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్ట్ చెక్ కమిటీ, పోలీసు శాఖ ద్వారా ఈ వీడియోలు ఫేక్ అని తేలింది. దీంతో వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు. వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోల అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవసరమైన అన్ని సహాయాన్ని వలస కార్మికులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
వలస జీవులపై వికృత క్రీడ
అసత్యాల కన్నా అర్ధసత్యాలు ఎక్కువ ప్రమాదం. ఎక్కడో జరిగినదాన్ని మరెక్కడో జరిగినట్టు చూపెట్టి, బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టే ఫేక్ వీడియోల హవా పెరిగాక ఈ ప్రమాదం ఇంకెంతో పెరిగింది. ఉత్తరాది వలస కార్మికులపై తమిళనాట దాడులంటూ సోషల్ మీడియాలో తెగ తిరిగిన ఘటన, దానిపై బిహార్ సహా దేశవ్యాప్తంగా రేగిన రచ్చ అందుకు తాజా నిదర్శనం. తమిళనాడు ప్రభుత్వం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, వేరెక్కడో జరిగిన ఘటనల దృశ్యాల్ని ఇప్పుడు ఇక్కడ జరిగినట్టు వీడియోల్లో చూపారని నిర్ధారించాల్సి వచ్చింది. బిహార్ సీఎం తొందరపాటుతో హడావిడిగా తమిళనాడుకొచ్చిన బిహార్ ప్రభుత్వాధికారులూ నిజం తెలుసుకొని, సంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది. గతంలో మహారాష్ట్ర, ఢిల్లీల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. మొత్తం మీద ఈ వ్యవహారం ఫేక్ న్యూస్‌ల ముప్పుతో పాటు వలసదారులనే గుర్తింపు తీరని కళంకంగా మారి, హింసా ద్వేషాలను ప్రేరేపిస్తున్న వికృత ధోరణిని చర్చకు పెట్టింది. స్వరాష్ట్రం, వలసపోయిన రాష్ట్రం – రెండింటి ఆర్థికాభివృద్ధిలో అంతర్ రాష్ట్ర వలసలది కీలక పాత్ర. అయితే, దేశంలో వలసలపై ప్రభుత్వ గణాంకాలు సమగ్రంగా లేవు. పాత లెక్కలే ఇప్పటికీ ఆధారం. 2011 జనగణన ప్రకారం మన దేశంలోనే అంతర్గత వలసదార్ల సంఖ్య 45.36 కోట్లు. అంటే దేశ జనాభాలో 37 శాతం మంది. ఇక, 2016 – 17 నాటి ఆర్థిక సర్వే ప్రకారం స్వస్థలం వదిలిపోతున్న మొత్తం వలస శ్రామికుల్లో దాదాపు సగం మంది సాపేక్షంగా తక్కువ అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల జనాభాయే. ఈ అభాగ్య సోదరులను గోవా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలు అధికంగా ఆదరిస్తున్నాయి. వెరసి, జీవనోపాధికై వస్తున్న ఉత్తరాది వారిని ఢిల్లీ తర్వాత ఎక్కువగా అక్కున చేర్చుకుంటున్నది దక్షిణ భారతావనే అనుకోవచ్చు. పారిశ్రామిక కేంద్రంగా పేరున్న తమిళనాట 10 లక్షల మందికి పైగా వలస కార్మికులున్నారు. ఇది ఆ రాష్ట్ర కార్మిక విభాగం పక్షాన జరిపిన 2016 సర్వే లెక్క. అధికశాతం మంది బడుగు వేతన జీవులైన నైపుణ్యం లేని శ్రామికులు. ఎక్కువగా బెంగాల్, అస్సామ్, ఒడిశా, బిహార్, జార్ఖండ్‌ల నుంచి వచ్చినవారే. తిరుప్పూర్, ఈరోడ్ లాంటి వస్త్ర కేంద్రాల వృద్ధికి, రాష్ట్ర పురోగతికి వీరు వెన్నెముక. ఈ పరిస్థితుల్లో వలస కార్మికులపై తమిళనాట దాడులంటూ సంబంధం లేని పాత వీడియోలు సోషల్ మీడియాలో తిరగడం తాజా సమస్యకు కారణం. హిందీవారికి వ్యతిరేకంగా తమిళనాట ఏదో జరిగిపోతోందని నమ్మించడానికి ఒక వర్గం వీడియోలను ఆన్లైన్లో తెగతిప్పింది. దాంతో తమిళనాడు ఆ ఘటనలు వేరెక్కడివో, ఎవరెవరి మధ్య జరిగిన ఘటనల తాలూకువో వివరించాల్సి వచ్చింది. నిజం వెల్లడయ్యేలోగా కథ బిహార్ అసెంబ్లీకి ఎక్కింది. నిజం కాళ్ళకు చెప్పులు తొడిగే లోపల అబద్ధం ఊరంతా చుట్టివస్తుందన్నట్టుగా అసత్యప్రచారం దేశం చుట్టింది. అయితే, బీజేపీయేతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఈ తరహా వైరల్ ఫేక్ న్యూస్ వల్ల ఎవరికి, ఏ ప్రయోజనం ఉందనే అనుమానాలూ పైకి వచ్చాయి. సాక్షాత్తూ తమిళనాడు సీఎం సైతం ఘర్షణలు రేపి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రకోణం గురించి ప్రస్తావించడం గమనార్హం. వాస్తవానికి ఏ రాష్ట్రం, ఏ భాషకు చెందినవారినైనా స్థానికులుగా కలుపుకొనే ఆత్మీయ, ఆతిథేయ సంస్కృతి దక్షిణాదిన, అందులోనూ తమిళనాట తరతరాలుగా ఉన్నదే. శాంతిభద్రతల పరిరక్షణలో అక్కడి పోలీసు యంత్రాంగం పేరున్నదే. అక్కడే ఇలా జరిగిందంటే – ఇతర రాష్ట్రాలకిది మేలు కొలుపు. కొందరి తుంటరితనం, స్వార్థ రాజకీయాలు సోదర భారతీయుల మధ్య విభజన గీతలు గీస్తే అది పెను ప్రమాదం. ఐకమత్యం, సౌభ్రాతృత్వాలకు గొడ్డలిపెట్టయ్యే ఏ వికృత ధోరణినీ ఎవరూ సహించకూడదు. సహకరించకూడదు. హోలీకని రద్దీ రైళ్ళలో స్వరాష్ట్రాలకు తరలివెళ్ళిన వలస కార్మికుల్లో ఎందరు తిరిగొస్తారనేది ఇప్పుడు తమిళనాట హోటళ్ళ నుంచి పరిశ్రమల వరకు అన్నిటి ఆందోళన. ఏ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నైనా అంతర్ రాష్ట్ర వలస కార్మికుల వాటా అవిస్మరణీయం. వారికి సౌకర్యాలు, సురక్షిత వాతావ రణం కల్పించడం కీలకమంటున్నది అందుకే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాలకు కానీ పార్లమెంట్ ‘అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం–1979’ చేయలేదు. అయినా ఇప్పటికీ వారి పరిస్థితి పూర్తిగా మారలేదు. వారి స్థితిగతులపై విస్తృత సర్వేలు జరపాలి. కేరళ నమూనా సర్వేలు అందుకు ఆదర్శం. సర్వేల సమాచారంతో సొంత, వలస రాష్ట్రాల్లో మెరుగైన విధానాలు చేపట్టవచ్చు. వలసదార్ల వల్ల స్థానికులకు ఉద్యోగాలు పోతున్నాయనీ, మురికివాడలు, నేరాలు పెరుగుతున్నాయనీ రాజకీయ స్వార్థంతో పేలడం తేలిక. ఇలా ‘బయటివార’నే ముద్ర వేసి స్థానికుల్ని రెచ్చగొడితే, తాత్కాలిక లబ్ధి ఉంటుందేమో కానీ, శాశ్వత నష్టం తథ్యం. భారత పౌరులెవరైనా దేశ భూభాగంలో ఎక్కడికైనా ఉపాధికై స్వేచ్ఛగా వెళ్ళవచ్చు, స్థిరపడవచ్చనేది మన రాజ్యాంగం (ఆర్టికల్ 19) కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ, కరోనా వేళ ‘ఇన్ఫెక్షన్ వాహకులు’ అంటూ కన్న ప్రాంతం, ఉన్న ఊరు వలస కార్మికుల్ని ‘అవాంఛనీయులు’గా చూశారు. వారిపై దాడులూ అనేకసార్లు రికార్డులకెక్కవు. ఈ పరిస్థితుల్లో వలసదార్లు సైతం స్థానికులతో ఏకమయ్యేలా తగిన చర్యలు చేపట్టడం ప్రభుత్వ విధి. అలాగే, సామాజిక న్యాయం, మానవ హక్కులను పరిగణనలోకి తీసుకొని కీలకమైన ఈ శ్రామిక పెట్టుబడిని కాపాడుకొనేలా సమగ్ర, వ్యవస్థీకృత విధానం అవసరం. అప్పుడే తమిళనాట తలెత్తిన తాజా ఫేక్ న్యూస్ రచ్చ లాంటివి నిర్వీర్యమవుతాయి. -
భయం వద్దు..తమిళులు మంచివారు
చెన్నై: తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని, స్నేహభావంతో ప్రవర్తిస్తారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని వారిని కోరారు. అభద్రతా భావానికి, భయాందోళనలకు లోనుకావద్దన్నారు. ఈ మేరకు ఆయన పలు ట్వీట్లు చేశారు. కాగా, వలసకార్మికుల భద్రతపై పుకార్ల నేపథ్యంలో బిహార్ అధికారుల బృందం తిరుపూర్‌లోని దుస్తుల కర్మాగారాలను సందర్శించింది. అక్కడి దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే వలస కార్మికుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చలు జరిపి, సంతృప్తి వ్యక్తం చేసింది. వదంతులకు కారకులుగా హిందీ వార్తా పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై అన్నామలై స్పందించారు. ‘ఉత్తరాది సోదరులకు వ్యతిరేకంగా డీఎంకే 7 దశాబ్దాలుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. చేతనైతే అరెస్ట్ చేయాలి’అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో వలసకార్మికులపై దాడులు వార్తలకు కేంద్రంపై కారణమని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
బిహార్ కార్మికులూ మా కార్మికులే
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వలస కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న కార్మికులంతా తమ వాళ్లేనని, వారికి ఎటువంటి హాని జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగనివ్వమన్నారు. వదంతులు వ్యాప్తి చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమిళనాడులో బిహార్, జార్ఖండ్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో స్టాలిన్ శనివారం నితీశ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవనీయ సోదరుడు నితీశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు అందులో చెప్పారు. బిహార్ సహా ఉత్తరాది వలస కార్మికుల భద్రతపై ఆయనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బిహార్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ తమిళనాడులో వలసకార్మికులపై దాడులపై ఒక ఫేక్ వీడియోను మొదట ఆన్లైన్లో సర్క్యులేట్ చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వలస కార్మికులు పేర్లు నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్మికులకు నచ్చజెప్పిన పోలీసులు ఉత్తరాది వలస కార్మికులపై దాడుల పుకార్ల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు భయంతో స్వస్థలాలకు బయలు దేరారు. దీంతో బస్, రైల్వే స్టేషన్లు నిండిపోయాయి. రిజర్వేషన్ రైలు బోగీల్లో కార్మికులు పెద్దఎత్తున ఎక్కడంతో శనివారం వారికి పోలీసులు నచ్చజెప్పి కిందికి దించివేశారు. కాగా, ఈ వ్యవహారంపై బిహార్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమిళనాడు అధికారులతో సంప్రదింపులు జరిపాయి. అలాగే ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు తమిళనాడుకు శనివారం చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాయి. కాగా, వదంతుల వీడియోలకు సంబంధించి పోలీసులు బీజేపీ అధికార ప్రతినిధులు తదితరులపై కేసులు నమోదు చేశారు. -
మా సోదరులను రక్షిస్తాం!ఎవరైనా బెదిరిస్తే కాల్ చేయండి: స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను రక్షస్తామని హామి ఇచ్చారు. వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా మిమ్మల్ని బెదరిస్తే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి అని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు, మా వలస సోదరులకు రక్షణా నిలుస్తారని అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తమిళనాడు, బిహార్ అధికారులు వలస కార్మికులపై దాడుల గురించి అనవసరమైన పుకార్లు సృష్టించకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పుకార్లే కార్మికులలో భయాందోళనలకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమే బిహార్ అసెంబ్లీలో వాడివేడి చర్చలకు దారితీసింది. వలస కార్మికులను కలుసుకోవడం తోపాటు స్థానిక అధికారులను కూడా సంప్రదిస్తామని స్టాలిన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బిహార్ నుంచి వలస వచ్చిన కార్మికులపై దాడులకు సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి ఇరు రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అలాగే వలస కార్మికులను భయపడవద్దని తమిళనాడు జిల్లా కలెక్టర్లు హిందీలో విజ్ఞప్తి చేశారు.కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ విషయమై అన్ని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైగా వారికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్!ఆ తర్వాత..) -
‘గల్ఫ్’ వలసలపై ఆరా!
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాలకు కార్మికుల వలసలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం వివరాలు సేకరిస్తోంది. 2018 నుంచి ఇప్పటివరకు ఏ సంవత్సరం ఎంతమంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్న తరుణంలో ఈ ప్రక్రియ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అధికంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై గల్ఫ్ వలసలు ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేసింది. ఆయన మరణం తర్వాత గల్ఫ్ వలస కార్మికుల గురించి పట్టించుకున్నవారు లేరని విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ గల్ఫ్ వలస కార్మికుల అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఉద్యమంలో కార్మికుల కుటుంబాలు చురుగ్గా పాల్గొన్నాయి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా గల్ఫ్ వలస కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేరళ తరహాలో ప్రవాసీ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మొదటి నుంచీ వినిపిస్తోంది. కాగా 2019 అక్టోబర్‌లో కూడా పంచాయతీరాజ్ శాఖ ఇదే అంశంపై వివరాలను నమోదు చేసింది. కానీ అప్పట్లో ఆ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. త్వరలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో మరో సారి వలస కార్మికుల లెక్కల విషయంలో సర్కారు దృష్టి సారించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు మంద భీంరెడ్డి తెలిపారు. ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు ఉంటే వలస కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఖతర్‌లో వరల్డ్‌కప్.. ప్రపంచానికి తెలియని మరణాలు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటివరకు గ్రూప్ దశతో పాటు ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక క్వార్టర్స్‌లో టాప్-8 జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్ చేరిన వారిలో అర్జెంటీనా, పోర్చుగల్, బ్రెజిల్, మొరాకో, నెదర్లాండ్స్, క్రొయేషియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌లు ఉన్నాయి. ఈ సంగతి పక్కనబెడితే ఫిఫా వరల్డ్‌కప్‌లో మనకు తెలియని ఒక ఆసక్తికర విషయం బయటపడింది. సాధారణంగా అరబ్ దేశాలకు వలస కార్మికులు ఎక్కువగా వస్తుంటారు. అందులో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. అయితే వీరందరిని వరల్డ్‌కప్ సందర్భంగా స్టేడియాల నిర్వహణకు ఖతర్‌లోని దోహాకు తరలించారు. అప్పటినుంచి 400 నుంచి 500 మంది వలస కార్మికులు మరణించినట్లు సమాచారం. గార్డియన్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఖతర్‌లో ఫిఫా వరల్డ్‌కప్ ప్రాజెక్ట్ కోసం ఏడాది క్రితమే దాదాపు 6500 మంది వలస కార్మికులు తీసుకెళ్లారని తెలిపింది. అప్పటినుంచి అక్కడే పనిచేస్తున్న వలస కార్మికుల్లో చాలా మంది చనిపోయినట్లు తెలిసింది. తాజాగా గురువారం మరో వలస కార్మికుడు మృతి చెందడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఫిలిపినో అనే సంస్థ ఖతర్‌లో వర్క్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించింది. వలస కార్మికుల మరణాలు ఎందుకు జరిగాయదన్న దానిపై నివేదిక అందజేయనుంది. వలస కార్మికుల మృతిపై ఫిఫా విచారం వ్యక్తం చేసింది. వరల్డ్‌కప్ నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన వారందరికి నివాళి అర్పించింది. ఇక ఫుట్‌బాల్ సభ్యత్వం ఉన్న 10 యూరోపియన్ దేశాలతో పాటు ఇంగ్లండ్ , జర్మనీలు వలస కార్మికుల క్షేమమై ఫిఫాకు లేఖ రాశాయి. ఖతర్‌లోని వలస కార్మికుల హక్కులను మెరుగుపరచడానికి ప్రపంచ పాలకమండలి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. అదే విధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO)కు కూడా యూరోపియన్ దేశాలు తమ లేఖను అందజేశాయి. Another DEATH at QATAR 2022 as organisers probing demise of Filipino MIGRANT worker at WC Training site#FIFAWorldCup #Qatar2022 https://t.co/z1McJFJ33Y — InsideSport (@InsideSportIND) December 9, 2022 చదవండి: ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా? FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా? -
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు
మోర్తాడ్: గల్ఫ్ వలస కార్మికులకోసం తెలంగాణలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్వో), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ప్రతినిధులు ముందుకొచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం ఐఎల్వో దక్షిణాసియా దేశాల ఇన్చార్జి, వలస కార్మికుల వ్యవహారాల నిపుణుడు డినో కోరెల్, సాంకేతిక నిపుణుడు అమిష్ కర్కి ఈనెల 22న హైదరాబాద్‌లో సీఎస్ సోమేష్‌కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డితో సమావేశమయ్యారు. గల్ఫ్ దేశాల నుంచి సొంత గడ్డకు చేరుకునే వారికి పునరావాసంతో పాటు, కుటుంబం, సమాజంతో వారు మమేకం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తాము కొన్ని కార్య క్రమాలను చేపట్టనున్నామని, దీనికి తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న గల్ఫ్ వలసల వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి ఐఎల్వో ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతా ధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే వలస కార్మికుల కుటుంబాలు బాగుపడే అవకా శాలు న్నాయి. తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయా లన్న ఐఎల్వో ప్రతిపాదనలపై గల్ఫ్ వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎల్వో ప్రా జెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావాలి.. ఐఎల్వో ప్రతినిధులు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభు త్వం ఆమోదం తెలపాలి. ఇక్కడ అమలు చేయకపోతే పైలట్ ప్రాజెక్టు మరో రాష్ట్రానికి తరలిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చెన్నమనేని శ్రీనివాసరావు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, గల్ఫ్ జేఏసీ నాయకులు -
క్రికెట్లో ప్రొటీస్.. ఫుట్‌బాల్‌లో డచ్; ఎక్కడికెళ్లినా దరిద్రమే
విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్ కప్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న ఈ మెగాసమరంలో ఇకపై గోల్స్ వర్షం కురవనుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా సాకర్ ఫీవరే కనిపిస్తుంది. ఇక వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 32 జట్లు ఇప్పటికే ఖతార్‌కు చేరుకొని ప్రాక్టీస్‌లో వేగం పెంచాయి. 1974, 1978, 2010లో రన్నరప్.. ఫిఫా ర్యాంక్ చూస్తే 8వ స్థానం..! ఇటీవల వరుసగా 15 మ్యాచ్‌ల్లో పరాజయమే ఎరుగని వైనం. ఇదీ నెదర్లాండ్స్ జట్టు రికార్డు. కానీ ఇప్పటి వరకు ఆ టీమ్ ఫిఫా వరల్డ్‌కప్‌ను ముద్దాడలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. అసలు సిసలైన ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ ఉన్నా.. నిలకడలేమితో కీలక మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ తడబడుతోంది. -సాక్షి, స్పోర్ట్స్ వెబ్‌డెస్క్ ఈ నేపథ్యంలో మరోసారి ఫిఫా కప్‌కు రెడీ అయిన డచ్ టీమ్.. అరబ్ గడ్డ ఖతార్‌లో కత్తిమీద సాముగా ఉండే పరిస్థితుల్లో ఎలా ఆడుతుందన్న ఆసక్తి మొదలైంది. గత పది వరల్డ్‌కప్స్‌లో ఈ టీమ్ గ్రూప్ దశను దాటింది. కానీ నాకౌట్ మొదలవుతుందంటే డచ్ ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది. దీంతో అభిమానులు నెదర్లాండ్స్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో సౌతాఫ్రికాకు దురదృష్టమైన జట్టుగా పేరు ఉంది. నాకౌట్ దశ వచ్చే సరికి ఎక్కడ లేని ఒత్తిడి కొనితెచ్చుకునే సౌతాఫ్రికా ఇంటిబాట పట్టడం అలవాటు చేసుకుంది. అచ్చం ఇదే తరహాలో ఫుట్‌బాల్‌లో నెదర్లాండ్స్ జట్టుకు జరుగుతుంది. ఇప్పటికి మూడుసార్లు రన్నరప్‌గా నిలిచన నెదర్లాండ్స్ ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయింది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఖతర్‌తో పాటు నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వెడార్‌లు పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉంది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్–జిలో అగ్ర స్థానంతో మెగా ఈవెంట్‌కు అర్హత పొందింది. మిడ్‌ఫీల్డర్ ఫ్రెంకీ డి జాంగ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. డిఫెండర్లలో డేలి బ్లిండ్, స్టీఫన్ డి రిజ్ ప్రత్యర్థి స్ట్రయికర్లను చక్కగా నిలువరిస్తున్నారు. దీంతో ఈ సారి ఫైనల్ చేరితే మాత్రం కప్‌ను చేజార్చుకునే ప్రసక్తే లేదనే లక్ష్యంతో ఉంది. ఇక ఖతార్ చేరుకున్న నెదర్లాండ్స్ జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలెపెట్టింది. తమ ట్రైనింగ్ సెషన్‌కు వలస కార్మికులను ఆహ్వానించి వారితో మ్యాచ్ ఆడడం వైరల్‌గా మారింది. ఆ వలస కార్మికులంతా ఖతర్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్న స్టేడియం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. స్టేడియానికి కొత్త హంగులు అద్దడం కోసం వీళ్లు గంటల కొద్దీ కష్టపడ్డారు. వలస కూలీల శ్రమకి గుర్తింపుగా ప్రాక్టీస్ సెషన్‌కి పిలిచిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు వారితో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. The Dutch National Team invited migrant workers who helped building the World Cup stadiums to attend their training session and to play football together. 🧡 pic.twitter.com/kvGor8LJlW — 𝐀𝐅𝐂 𝐀𝐉𝐀𝐗 💎 (@TheEuropeanLad) November 17, 2022 చదవండి: ఫిఫా ఆదాయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం 'నీకేం పోయే కాలం'.. రసెల్‌పై అభిమానుల ఆగ్రహం -
వలస కార్మికులకు బహ్రెయిన్ షాక్
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన కొట్టూరి శ్రీకాంత్ రెండు నెలల కిందట విజిట్ వీసాపై బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ ఏదో ఒక కంపెనీలో పని చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ విజిట్ వీసాపై వచ్చిన వారికి పని ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి. ఫలితంగా విజిట్ వీసా గడువు ముగిసేలోపు శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నాడు. బహ్రెయిన్‌కు వెళ్లడానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయగా ఈ డబ్బును శ్రీకాంత్ నష్టపోవాల్సి వచ్చింది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఎండీ ఇబ్రహీం కొన్నేళ్ల నుంచి బహ్రెయిన్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల కిందట ఇంటికి వచ్చి మళ్లీ బహ్రెయిన్ వెళ్లాడు. అతనికి మరో రెండేళ్ల వరకు అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ అక్కడి ప్రభుత్వ ఆధీనంలోని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఏ) అనేక మంది వలస కార్మికుల వీసాలను అర్ధంతరంగా రద్దు చేసింది. ఫలితంగా ఇబ్రహీం ఇంటికి వచ్చేశాడు. విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బహ్రెయిన్‌లో పర్యాటక రంగం వృద్ధి చెందడంతో ఆ దేశానికి వెళితే ఏదో ఒక పని చేసుకోవచ్చని వలస కార్మికులు ఆశిస్తున్నారు. అదే ఆశతో విజిట్ వీసాపై వెళ్లిన శ్రీకాంత్ ఇంటి దారి పట్టగా, వర్క్ వీసాకు గడువున్నా ఇబ్రహీం కూడా బలవంతంగా ఇంటికి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం వందలాది మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. మోర్తాడ్ (బాల్కొండ): బహ్రెయిన్‌లో ఉపాధి పొందవచ్చని భావిస్తున్న ఎంతో మంది వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం షాకిస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమాన్‌ల మాదిరిగానే బహ్రెయిన్ కూడా ఎంతో మంది తెలుగువారికి ఉపాధి అవకాశాలు కల్పించింది. అయితే ఇకనుంచి అది చరిత్రగానే మిగిలిపోనుంది. బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు, వలస కార్మికుల వీసాలను పర్యవేక్షించే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ అనుసరిస్తున్న విధానాలతో బహ్రెయిన్‌లో ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయి. వారం, పది రోజుల వ్యవధిలోనే తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు దాదాపు రెండు వేలమంది బహ్రెయిన్ నుంచి ఇంటిదారి పట్టారని అంచనా. వర్క్ వీసాలను రద్దు చేయడం, విజిట్ వీసాలపై వెళ్లి పని వెతుక్కునేవారికి ఎల్ఎంఆర్ఏ ఇచ్చిన ఆదేశాలతో కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో ఉపాధి కరువైంది. బహ్రెయిన్ ప్రభుత్వం పునరాలోచన చేస్తే తప్పా ఆ దేశంలో వలస కార్మికుల ఉపాధికి అవరోధాలు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బహ్రెయిన్‌కు వెళ్లే ఆలోచన మానుకోవాలని వలస కార్మికుల సంఘాలు సూచిస్తున్నాయి. -
ఎడారి గోసకు.. ఏదీ భరోసా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరువైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబు నిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే దాదాపు పదిహేను లక్షల మంది గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రేయిన్, ఒమన్)కు వెళ్లగా, తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాటపడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళుతుండటంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి కఠినమైన పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్నవారు కొందరైతే.. క్షణికావేశాలతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. ఇలా గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో 1,612 మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందారు. ఇంకా కూలీలుగానే తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా గల్ఫ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేక సాంకేతిక శిక్షణ లేకపోవడంతో అక్కడకు వెళుతున్న వారిలో 90 శాతం కూలీలుగానే పనిచేస్తున్నారు. నిరక్షరాస్యత, ఎడారి దేశాల్లో వ్యవహరించే తీరుపై ముందస్తు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పని ప్రదేశంలో ప్రమాదాలు – వివాదాలు, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుబాయ్ బాధలుండవని నాయకులు హామీ ఇచ్చినా పేద కార్మికులకు భరోసా విషయంలో కార్యాచరణ ఇంకా కార్యరూపం దాల్చలేదు. 2016లో ఎన్నారై పాలసీపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, 2018 –19 బడ్జెట్లో ఎన్నారైల కోసం రూ.100 కోట్లను కేటాయించినా.. పూర్తిస్థాయి విధి విధానాలు ప్రకటించకపోవడంతో వాటి వల్ల ఎవరికీ లబ్ధి చేకూరలేదు. రెండు రోజులకో మృతదేహం.. గల్ఫ్ దేశాల నుంచి రెండు రోజులకొక మృతదేహం తెలంగాణకు చేరుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 1,612 మృతదేహాలు వచ్చాయి. ఇందులో 25 నుంచి 50 ఏళ్ల లోపు వారే అత్యధికం. అక్కడి వాతావరణం, ఆహారం కారణంగా మానసిక ఒత్తిడితో గుండె, మెదడు సంబంధిత వ్యాధుల భారిన పడి మరణిస్తున్నట్లు భారత దౌత్య కార్యాలయం ఇటీవల వెల్లడించింది. కేరళ రాష్ట్రంలో భేష్ గల్ఫ్ దేశాల్లో అత్యధిక ప్రవాసీలున్న రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం వలస కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. గల్ఫ్‌కు వెళ్లే వారికి ముందస్తుగా నైపుణ్య శిక్షణ ఇస్తుండటంతో వాళ్లు వైట్ కాలర్ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అలాగే స్వదేశానికి తిరిగి వచ్చిన వారికోసం విస్తృత స్థాయిలో పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. రిక్రూటింగ్ ఏజెన్సీల నియంత్రణ, కేసుల్లో ఉన్న వారికి న్యాయ సహాయం, వైద్య సహాయం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎన్నార్టీఎస్ ఆధ్వర్యంలో ఎన్నారైల కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌తోపాటు ప్రవాసాంధ్ర భరోసా పేరుతో రూ.10 లక్షల బీమా (18–60 ఏళ్లు)తో పాటు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నారు. ఇవీ కార్మికుల డిమాండ్లు.. ►గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలి. ►గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, జీవిత, ప్రమాదబీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి. ►గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి. ►శిక్షపడ్డ ఖైదీలకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాల నుంచి ఖైదీల మార్పిడి వెంటనే చేయాలి. ►కేంద్రం తరఫున వెంటనే హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి. ►ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన తరహాలో గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ►ప్రవాసి భారతీయ బీమా యోజన కింద రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని కూడా చేర్చాలి. రూ.325 చెల్లిస్తే రెండేళ్ల కాలపరిమితితో ఇన్సూరెన్స్ అమలు చేయాలి. తక్షణ కార్యాచరణ చేపట్టాలి తెలంగాణ వస్తే దుబాయ్ బాధలు తప్పుతాయనుకున్నం. కొత్త వలసలు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మికుల సంక్షేమానికి తక్షణ కార్యాచరణను అమలు చేయాలి. –మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకుడు కాన్సులేట్లు ఏర్పాటు చేయాలి దేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచే అత్యధిక కార్మికులు గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లినవారు మరణాలు, జైలు పాలవుతున్న తీరు ఆందోళనకరంగా ఉంతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి, హైదరాబాద్‌లో సౌదీ, ఇతర ముఖ్య దేశాల కాన్సులేట్లను ఏర్పాటు చేస్తే పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. – పి.బసంత్‌రెడ్డి, గల్ఫ్ సోషల్ వర్కర్ కన్న బిడ్డల కోసం.. కన్నులు కాయలు కాచేలా సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే అన్నదమ్ములిద్దరూ 2004లో దుబాయ్ వెళ్లారు. పని ప్రదేశంలో నేపాల్‌కు చెందిన దిల్ బహుదూర్ అనే గార్డు హత్యకు కారమణంటూ వీరితో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అక్కడి చట్టాల మేరకు బాధితుని కుటుంబ సభ్యులు పరిహారం తీసుకుని క్షమాభిక్ష పత్రాన్ని సమర్పిస్తే శిక్షను తగ్గించటం లేదా రద్దు చేయటం సులువు. ఈ మేరకు మల్లేశం, రవి తల్లి గంగవ్వ 2012లో పరిహారం సొమ్ము కోసం తన కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వాల్సిందిగా హెచ్ఆర్సీని కోరిన అంశం అప్పటి ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టి వచ్చింది. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి రూ.15 లక్షలను నేపాల్ వెళ్లి బాధిత కుటుంబానికి అందించి క్షమాభిక్షపత్రాన్ని తీసుకొచ్చారు. నేర తీవ్రత, చేసిన తీరు ఘోరంగా ఉందంటూ అక్కడి హైకోర్టు యావజ్జీవ శిక్ష(25ఏళ్లు)గా మార్చింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటే కానీ వారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మీరైనా.. జాడ చెప్పండి ‘గల్ఫ్‌కు పోయివస్తే కష్టాలన్నీ తీరుతయన్న డు. పోయినోడు మళ్లీ రాక.. మేము దినదిన నరకం అనుభవిస్తున్నం. మా కొడుకు ఎక్కడున్నడో..ఏం చేస్తున్నడో ఎవరూ చెప్పడం లేదు’ అంటూ జగిత్యాల జిల్లా మన్నెగూడేనికి చెందిన శ్రీరాముల రాజేశ్వరి, రాజేశం తమకు ఎదురైన వారందరినీ అడుగుతున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. శ్రీరాముల ప్రసాద్ (42) రెండేళ్ల క్రితం గల్ఫ్ లోని క్యాంప్‌కు చేరినట్లు ఫోన్ చేశాడు. ‘వారానికి ఒకసారైనా ఫోన్ చేసేవాడు. ఏడాదిగా అది కూడా లేదు. మీరై నా నా కొడుకు జాడ చెప్పాలె’ అంటూ రాజేశం వేడుకుంటున్నారు. -
మాల్దీవుల్లో ఘోరం
మాలె: మాల్దీవుల రాజధాని మాలెలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది భారతీయులు సహా మొత్తం 10 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. నిరుఫెహి ప్రాంతంలోని విదేశీ పనివారు నివసించే ఇరుకైన భవనంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 9 మంది భారతీయులు కాగా, మరొకరిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గ్యారేజీలో మంటలు మొదలై కార్మికులున్న మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ప్రతి కార్మికుడి బెడ్ పక్కన ఒక గ్యాస్ సిలిండర్ ఉంది. ఫ్లోర్ అంతటికీ కలిపి కేవలం ఒకటే కిటికీ ఉంది. దీంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని అధికారులు తెలిపారు. -
వలస కార్మికులకు ఉచిత ప్రయాణం
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కంపెనీ ఏడీఎన్‌హెచ్.. 150 మంది వలస కార్మికులకు దుబాయ్ వెళ్లడానికి ఉచిత వీసాలు, విమాన టికెట్లు సమకూర్చింది. కార్మికులకు క్లీనింగ్, క్యాటరింగ్ సెక్షన్లలో ఉపాధి కల్పిస్తోంది. వలస కార్మికులకు వీసాలను జారీ చేయడానికి లైసెన్స్డ్ ఎజెన్సీలు, సబ్ ఏజెంట్లు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ, వివిధ పట్టణాల్లో బ్రాంచీలు కలిగి ఉన్న జీటీఎం కంపెనీ ద్వారా ఏడీఎన్‌హెచ్ రిక్రూట్ చేసుకుంది. ఉచిత వీసాల వల్ల వలస కార్మికులందరికీ కలిపి దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు తప్పింది. వీసాలు పొందిన కార్మికులు దుబాయ్ వెళ్లేందుకు ముంబైకి బయలుదేరి వెళ్లారు. గతంలో ఇదే కంపెనీ ఖతర్‌లో, అబుదాబీల్లో పనిచేయడానికి 2,200 మందికి ఉచిత వీసాలు అందజేసింది. ‘సాక్షి’కథనం వల్లే.. వలస కార్మికులకు బంపర్ ఆఫర్ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల జీటీఎం నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యాం. ఎలాంటి సొమ్ము చెల్లించకుండానే దుబాయ్‌కు వెళ్లడం సంతోషంగా ఉంది. పేద కార్మికులకు దీని వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది. – పవన్ కళ్యాణ్, పెంబి, నిర్మల్ జిల్లా -
ఏజెంట్ చేతిలో మోసపోయిన వలసకార్మికులు.. ఏపీ ప్రభుత్వ సహకారంతో స్వదేశానికి రాక!
ఒమాన్ లో ఏజెంట్ చేతిలో మోసపోయిన 08 మంది వలసకార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS సహకారంతో స్వదేశానికి రప్పించారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా సక్రమ పద్ధతిలో వెళ్లాలని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 08 మంది వలసదారులు అక్రమ ఏజెంట్ మాయమాటలు నమ్మి ఒమాన్ కు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని రాష్ట్రానికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయంతో ఇమెయిల్ ద్వారా పలుమార్లు సంప్రదించింది. వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని భారతదేశం పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని APNRTS కోరింది. ఎట్టకేలకు ఏపీఎన్ఆర్టీసీ ప్రయత్నాలు ఫలించడంతో ఈ నెల 27న వాళ్లు విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రుల అభివృద్ధి, భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ఏపీఎన్ఆర్టీఎస్ నిరంతరం పనిచేస్తోందన్నారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఒమాన్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ 08 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వీసాలు ఏర్పాటు చేసి ఒమాన్ దేశం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగాలు కల్పించకపోగా, సరైన వసతి, భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై వారు సదరు ఏజెంట్ ని నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఉద్యోగాలు లేవు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని హెచ్చరించి, మమ్మల్ని రోడ్డున పడేశారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో భారతదేశానికి రావడానికి సహాయం కొరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, APNRTS ను సంప్రదించారు. ఈ క్రమంలోనే పశుసంవర్ధక, మత్య్సశాఖాభివృద్ది మంత్రి డా. సీదిరి అప్పలరాజు వలసకార్మికుల క్షేమసమాచారాలు తెలుసుకోవాలని, త్వరితగతిన వారిని స్వదేశానికి రప్పించాలని APNRTS ను కోరారు. తక్షణమే స్పందించిన APNRTS బాధితుల నుంచి మరిన్ని వివరాలను సేకరించి, ఒమాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వారి పరిస్థితిని వివరించారు. సదరు ఏజెంట్ పై చర్య తీసుకోవడంతో పాటు వారిని భారతదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరింది. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు ఈ విషయమై.. విదేశాలకు వెళ్లే వారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికోసం APNRTS సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎవరూ అక్రమ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని, విదేశాంగ వ్యవహారాల శాఖ (MEA) ద్వారా ఆమోదింపబడిన రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్ళాలని సూచించారు. అలాగే విదేశాలకు వెళ్ళే వారు, విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మీకున్న సందేహాలు, సమస్యలు ఉంటే APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను 0863 2340678, +91 8500027678 (వాట్సాప్) సంప్రదించగలరని తెలిపారు. -
ఖతార్‌లో సాక్షి దినపత్రిక 'గల్ఫ్ జిందగీ' సావనీర్
ఖతార్: ఖతార్ లోని సిటీ సెంటర్ రొటానా హోటల్లో బసచేసిన తెలంగాణ వలస కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్లను బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఇ) సంస్థకు ఖతార్‌లో కమ్యూనిటీ లైజన్ ఆఫీసర్ (ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్) గా పనిచేస్తున్న మార్కోపోలో ఫెర్రర్ మర్యాదపూర్వకంగా సోమవారం కలుసుకున్నారు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు వలసలపై ఆసియా-గల్ఫ్ దేశాల చర్చల సమావేశానికి హాజరవడానికి స్వదేశ్ పరికిపండ్ల ఒకరోజు ముందు ఖతార్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్వదేశ్ పరికిపండ్ల వద్ద ఉన్న సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్‌ను చూసి సంతోసం వ్యక్తం చేశారు మార్కో పోలో. తెలుగు రాకపోయినా 88 పేజీల పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని ఫోటోల ద్వారా గల్ఫ్ వలసల గురించి సమాచారం ఉన్న పుస్తకం అని గమనించారు. దీంతో వివరాలను ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసి అతనికి స్వదేశ్ వివరించాడు. దాదాపు గంటన్నర సేపు ముఖ్య కథనాల సారాంశాన్ని ఎంతో ఆసక్తిగా వినడమేకాదు, ఈ సావనీర్‌ను ఇంగ్లీష్‌లోకి అనువదించి ఒక పుస్తక రూపంలో వేయాలని మార్కో పోలో సూచించడం విశేషం. 'గల్ఫ్ జిందగీ' సావనీర్ గురించి... గల్ఫ్ వలసలు - అభివృద్ధి, కష్టాలు, సుఖాలు, హక్కులు, జీవితాలపై, సమాజంపై, ప్రభుత్వాలపై చూపించే ప్రభావం, ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం సాక్షి జిల్లా పేజీల్లో 'గల్ఫ్ జిందగీ' ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన 'గల్ఫ్ జిందగీ' పేజీ 22 నెలలుగా సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా ప్రచురితమైన అన్ని పేజీలను కూర్పు చేసి ఒక సావనీర్ గా రూపొందించారు. వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు 'గల్ఫ్ జిందగీ' వారధిలా ఉపయోగపడుతూ సమగ్ర సమాచారాన్ని అందిస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఒక భరోసానిస్తూ ముందుకెళ్లింది. మొదట్లో ప్రతీ శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరికమేరకు 15 జూన్ 2018 నుండి గల్ఫ్ దేశాలలో సెలవుదినం అయిన శుక్రవారానికి మార్చారు. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి కుటుంబాల జీవనంపై కథనాలు ఇచ్చారు. ఇవే కాకుండా గల్ఫ్‌లో కష్టాలను జయించి మెరుగైన జీవితం గడుపుతున్న కార్మికుల సక్సెస్‌పై కూడా ప్రత్యేక కథనాలు కూడా ప్రచురించారు. 'గల్ఫ్ జిందగీ' పేజీకి కావలసిన సమాచార సేకరణలో సహకరించిన 'మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా' సభ్య సంస్థ 'ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం' అధ్యక్షులు మంద భీంరెడ్డి గారికి కృతఙ్ఞతలు అని ఎడిటర్ సావనీర్ ముందు మాటలో రాశారు. అద్భుతమైన కథనాలు అందించిన సాక్షి గల్ఫ్ డెస్క్, విలేఖరుల బృందానికి అభినందనలు వెల్లువెత్తాయి. తెలంగాణ గల్ఫ్ వలసల చరిత్రలో ఈ 'గల్ఫ్ జిందగీ' సావనీర్ ఆవిష్కరణ గుర్తుండిపోయే ఘట్టంగి నిలిచిపోయింది. సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్ ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. (https://www.sakshi.com/sites/default/files/article_images/2019/10/4/gulf_book.pdf -
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న పాతబస్తీ మహిళలు.. సాయం కోసం..
భవిష్యత్తుపై గంపెడాశలతో గల్ఫ్ బాట పడుతున్న వలస కార్మికులకు నీడలా కష్టాలు వెంటాడుతున్నాయి. అవగాహాన లేమి, ట్రావెల్ ఏంజెట్ల మోసాలు, పనికి పిలిపించుకున్న యజమానుల కక్కుర్తి.. వెరసి వలస కార్మికుల జీవితాలను పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తున్నాయి. తాజాగా పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిలా కార్మికులు పరాయి దేశంలో చిక్కుకుని... యజమానులు చూపించే నరకం నుంచి బయట పడేయాలంటూ మొరపెట్టుకున్నారు. - సౌదీ అరేబియాలో బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఉందంటూ భర్త చెప్పిన మాటలు విని మెహరున్నీసా విమానం ఎక్కింది. నెలకు రూ.35,000ల వరకు వేతనం వస్తుందని చెప్పడంతో సౌదీకి రెడీ అయ్యింది. రియాద్‌కి చేరుకునే సమయానికి తీవ్ర అనారోగ్యం పాలైంది. అక్కడ సరైన ఆశ్రయం, తిండి లభించకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. తనను వదిలేస్తే ఇండియాకి తిరిగి వెళ్తానంటూ చెబితే రూ.2 లక్షలు కడితే కానీ వదిలిపెట్టమంటూ యజమాని హుకుం జారీ చేశారు. దీంతో తనను కాపాడాలంటూ ఆమె వీడియో సందేశాన్ని పంపింది. - రిజ్వానా బేగం అనే మహిళ నెలకు రూ.25 వేల వేతనం మీద మెయిడ్‌గా పని చేసేందుకు గల్ఫ్‌కి వెళ్లింది. కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించడం, సరైన వసతి కల్పించకుండా నిత్యం నరకం చూపిస్తున్నారు యజమానులు. ఇదేంటని ట్రావెల్ ఏజెన్సీని ప్రశ్నిస్తే.. ఇండియాకు తిరిగి వెళ్లాంటే రూ.2.50 లక్షలు చెల్లించాలు చెప్పారు. దీంతో సాయం అర్థిస్తూ ఆమె ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసింది. - హసీనా బేగం వలస కార్మికురాలిగా కువైట్‌కి చేరుకుంది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వెన్నుపూసలో సమస్య తలెత్తింది. దీంతో అక్కడ ఉండలేనంటూ తనను ఇండియాకు తీసుకురావాలంటూ కుటుంబ సభ్యుల ద్వారా మొరపెట్టుకుంది. విదేశాల్లో వలస కార్మికులు పడుతున్న కష్టాలపై కేంద్రం స్పందించింది. ఆయా దేశాలకు చెందిన ఎంబసీ అధికారుకుల సమస్యలను వివరించింది. వారికి ఇబ్బంది రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అవసరం అయితే వారిని ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయాలంది. చదవండి: వలస కార్మికుల మెడపై దేశ బహిష్కరణ కత్తి -
వలస కార్మికులకు ‘ఖతర్’ కంపెనీ ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): వలస కార్మికులకు ఉచితంగా వీసాలు అందించేందుకు ఖతర్‌లోని ఒక క్యాటరింగ్ కంపెనీ ముందుకొచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి తేరుకుంటున్న సమయంలో కార్మికులపై ఆర్థిక భారం పడకుండా వీసాలను ఉచితంగా జారీ చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. తెలంగాణలోని ఒక లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా వీసా ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఖతర్‌లోని వివిధ కంపెనీలు, విమానయాన రంగానికి ఆహారం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సదరు కంపెనీ వలస కార్మికులతో ఖాళీలను భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. కిచెన్ క్లీనింగ్, వెయిటర్స్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకోసం ఈనెల 30న ఆర్మూర్‌లో, 31న సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఆకర్షణీయమైన వేతనంతో పాటు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నారు. 21 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘గతంలో వీసా కావాలంటే కార్మికులు రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కార్మికులపై ఎలాంటి భారం పడకుండా ఖతర్ కంపెనీ ఉచిత వీసాలను జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం’అని జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత సతీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వలస కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. -
వీసాలున్నా వెళ్లలేక..
మోర్తాడ్: విదేశీ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కువైట్ ద్వారాలు తెరచినా రాష్ట్రం నుంచి ఔత్సాహికులు వెళ్లలేకపోతున్నారు. సకాలంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, స్టాంపింగ్ ప్రక్రియ పూర్తవకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసాలు జారీ అయ్యాక మూడు నెలల్లో కువైట్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రక్రియలు అయ్యేలోపే గడువు ముగుస్తోందని ఆందోళన చెందుతున్నారు. రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడిన కువైట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి కువైట్ విదేశాంగ శాఖ వీసాల జారీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన లైసెన్స్డ్ ఏజెంట్ల ద్వారా రిక్రూట్మెంట్ మొదలు పెట్టింది. సెలవు రోజుల్లో మినహా రోజూ 2 వేల వరకు వీసాలు జారీ చేస్తోంది. కువైట్ వీసా పొందిన ప్రతి ఒక్కరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాలి. పాస్‌పోర్టు కార్యాలయం ద్వారానే పీసీసీ పొందాల్సి ఉంటుంది. అయితే పీసీసీల జారీలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. గతంలో 2, 3 రోజుల్లో పీసీసీలను జారీ చేసేవారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి 25 రోజులవుతోంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని తరువాత ముంబై, ఢిల్లీలోని కువైట్ ఎంబసీల్లో ఎక్కడో ఓచోట స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాంపింగ్ ప్రక్రియలోనూ తీవ్ర కాలయాపన జరుగుతోందని వలస కార్మికులు చెబుతున్నారు. 5 రోజుల్లో పూర్తి కావాల్సిన స్టాంపింగ్‌కు 20 రోజులకు మించి పడుతోందని వాపోతున్నారు. పీసీసీ, స్టాంపింగ్‌ల కోసం నెలన్నర పడుతోందని, ఒకవేళ స్లాట్ సకాలంలో బుక్ కాకపోతే మరింత ఎక్కువ సమయం అవుతోందని చెబుతున్నారు. దీంతో వీసా జారీ అయ్యాక 3 నెలల్లో కువైట్‌కు చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రక్రియలు ఆలస్యమై వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసాలను రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. భారీగా పెరిగిన స్టాంపింగ్ ఫీజు కువైట్ ఎంబసీలో స్టాంపింగ్ ఫీజును భారీగాపెంచారు. గతంలో రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.20 వేల వరకు ఖర్చు అవుతోంది. కువైట్ విదేశాంగ శాఖనే భారీగా ఫీజు పెంచిందని, తమ చేతిలో ఏం లేదని మన విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. వీసాల జారీకి అనుగుణంగా పీసీసీ, స్టాంపింగ్ ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించాలని వలస కార్మికులు కోరుతున్నారు. -
వలస కూలీపై సామూహిక అత్యాచారం
సాక్షి, గుంటూరు, రేపల్లె రూరల్, సాక్షి, అమరావతి : బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీ కుటుంబంపై మానవ మృగాలు దాడి చేశాయి. నాలుగు నెలల గర్భిణిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భార్యను కాపాడుకునేందుకు ఆ భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితులు పరారయ్యారు. గంటల వ్యవధిలోనే ఆ మృగాలని పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన ఓ కుటుంబం తాపీ పని నిమిత్తం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు శనివారం రాత్రి గుంటూరు నుంచి రేపల్లె రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు బస్సులు, ఆటోలు లేకపోవటంతో తమ ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై నిద్రించారు. సమయం అడిగి భర్తతో వివాదం.. ఆపై.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్లాట్‌ఫారంపైకి మద్యం మత్తులో వచ్చిన ముగ్గురు దుండగులు నిద్రిస్తున్న బాధితురాలి (25) భర్తను లేపి సమయం ఎంతైందని అడిగారు. తన దగ్గర వాచ్లేదని సమాధానం చెప్పగా, ఆ వ్యక్తి వద్ద ఉన్న రూ.750 లాక్కొని దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న భార్య తన భర్తను కొట్టవద్దని ప్రాధేయపడగా.. వారిలో ఇద్దరు ఆమెను ప్లాట్‌ఫారంపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు. తర్వాత మరో నిందితుడూ వారితో కలిశాడు. ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఆర్పీఎఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. పలుమార్లు తలుపు కొట్టినా ఎవరూ స్పందించలేదు. వెంటనే స్టేషన్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న రిక్షా కార్మికులను ఆశ్రయించాడు. బాధితురాలి కుటుంబసభ్యుడికి రూ.50 వేల సాయం అందజేస్తున్న మోపిదేవి రాజీవ్, మంత్రి మేరుగ తాము సహాయం చేయలేమని, కొంత దూరంలో పోలీసు స్టేషన్ ఉందని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు పరుగు పరుగున చేరుకుని విషయం చెప్పాడు. సర్కిల్ కార్యాలయ పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్ చేరుకునే లోపు జీపు సైరన్ విన్న దుండగులు పరారయ్యారు. లైంగిక దాడికి గురైన బాధితురాలిని తక్షణ వైద్య సేవల నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 4 నెలల గర్భవతి అని వైద్యాధికారులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని, అమె కుటుంబ సభ్యులను ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, బాధితురాలి భర్త ఫిర్యాదుతో రేపల్లె సీఐ వి.సూర్యనారాయణ ఐపీసీ సెక్షన్లు 376(డీ), 394, 307 ఆర్/డబ్యూ 34తో కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎప్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో గంధం రవీందర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితులను గుర్తించారు. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై నిందితులవి రెండు జతల చెప్పులు పడివుండటంతో వాటిని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయగా, అవి కొంతదూరంలో నిందితులలో ఒకరు చొక్కా మార్చుకున్న చోటుకు వెళ్లాయి. అక్కడ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు రేపల్లె పట్టణంలోని 24వ వార్డుకు చెందిన పోలుబోయిన విజయ్‌కృష్ణ, పాలుచూరి నిఖిల్, మరో మైనరు (16) బాలుడిగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వారిని అరెస్ట్ చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. మైనర్ బాలుడు ఇప్పటికే మూడు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నాడన్నారు. వీలైనంత త్వరగా చార్జిషీట్ వేసి, శిక్షపడేలా చూస్తామన్నారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరు పరిచారు. కాగా, రైల్వే పోలీసులు స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే అధికారులెవరూ స్పందించలేదు. ఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అజయ్‌ప్రసాద్ విలేకర్లతో మాట్లాడేందుకు నిరాకరించారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం ఒంగోలు అర్బన్: మహిళలకు సంబంధించిన ఘటనలు సున్నితమైనవి కాబట్టి వాటిని ఎవరైనా సరే సున్నితంగానే చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. రేపల్లె ఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధితురాలిని ఆదివారం ఆమె ఒంగోలు జీజీహెచ్‌లో పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితులు ప్రకాశం జిల్లా వాసులు కావడంతో మెరుగైన వైద్యం, రిహాబిలిటేషన్ కోసంఒంగోలు జీజీహెచ్‌కు తరలించామన్నారు. బాధితురాలి కుటుంబసభ్యుడికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల చెక్కుని అందజేస్తున్న మంత్రి విడదల రజని మహిళా కమిషన్ సీరియస్ అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఘటన సమాచారం తెలియగానే చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌తో ఫోన్లో మాట్లాడారు. కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలన్నారు. రైల్వేస్టేషన్లలో మహిళల భద్రత, రక్షణ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించి పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చారన్నారు. అత్యాచార నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఆదివారం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మోపిదేవి రాజీవ్, మోపిదేవి హరనాధబాబులతో కలసి బాధితురాలిని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. సమాచారం తెలియగానే సీఎం జగన్ తమను అప్రమత్తం చేశారన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు. ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు తనయుడు రాజీవ్.. బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నాయకులు రేపల్లె ప్రభుత్వ వైద్యశాల వద్ద, ఒంగోలు జీజీహెచ్ వద్ద హడావుడి చేశారు. -
ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే) జరుపుకుంటారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం జరిపే ఈ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు ఈ సందర్భాన్ని 'గల్ఫ్ అమరుల దినోత్సవం' (గల్ఫ్ మార్టియర్స్ డే) గా నిర్వహిస్తున్నారు. చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి (రిమెంబర్ ది డెడ్ - ఫైట్ ఫర్ ది లివింగ్) అనే నినాదంతో వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఏర్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 200 శవపేటికలు గల్ఫ్ దేశాల నుండి తెలంగాణకు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఏప్రిల్ 2022 వరకు దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో సుమారు 1,600 మంది తెలంగాణ వలస కార్మికుల శవపేటికలు రాష్ట్రానికి చేరుకున్నాయి. బతుకుదెరువు కోసం ఎడారి బాట పట్టిన 15 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల కన్నీటి గాథ ఇది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎప్పుడు ఏవార్త వినాల్సి వస్తుందో అని ప్రవాసీ కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమిని వదిలి వలస వెళ్లిన అభాగ్యులు గల్ఫ్ దేశాలలో అసువులు బాస్తున్నారు. శవపేటికల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. కొందరిని అక్కడే ఖననం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల ఆసుపత్రుల మార్చురీలలో వందలాది భారతీయుల మృతదేహాలు మగ్గుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయలు.. స్వరాష్ట్రంలో మొండి చేయి ఆమ్నెస్టీ కారణంగా 2007 లో యూఏఈ దేశం నుండి వాపస్ వచ్చి అప్పుల బాధతో ఉత్తర తెలంగాణ కు చెందిన 29 మంది గల్ఫ్ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. ఒక లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ 9 మే 2008 నాడు జీఓ (నెం. 266) ను జారీ చేసింది. ఆ తర్వాతి కాలంలో గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చనిపోయిన పేద కార్మికులకు కూడా ఆర్ధిక సహాయం చేయడం ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట ప్రభుత్వం, ఆనాటి కరీంనగర్ జిల్లాలోని 34 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ జీఓ నెం.1840 ను 24 ఏప్రిల్ 2013 న జారీ చేసింది. గవర్నర్ పాలనలో ఆరు పాత జీఓ లను రీ-వాలిడేట్ చేసి జారీ చేసిన జీఓ ఇది. ఉమ్మడి రాష్ట్రంలో వేలాదిమంది గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. అప్పటి ప్రభుత్వం 100 మందికి లోపే ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. గుండెపోటు మరణాలు అధికం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్నారైలు ఎక్కువగా హృదయ సంబంధిత సమస్యల కారణంగా మరణిస్తున్నారు. పగలు ఎండలో.. రాత్రి ఏసీ వాతావరణంలో నివసించడం, శారీరక, మానసిక ఒత్తిడి, జీవన శైలి, నిద్ర లేమి, ఆహారపు అలవాట్లు, స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం, ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాలు ఆకస్మిక మరణాలకు కారణాలని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. గల్ఫ్ ఆత్మహత్యలు గల్ఫ్ దేశాల్లో భారతీయుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మానసిక, వ్యక్తిగత సమస్యలు, అప్పులు, కలలు కల్లలవడం, పనిలో ఒత్తిడి, అధమ స్థాయిలో జీవన పరిస్థితులు, సరిఅయిన వేతనాలు లేకపోవడం, భౌతిక దోపిడీ, మోసం, ద్రవ్యోల్బణం, ప్రియమైన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఒంటరితనం, సమస్యలను భావాలను పంచుకోవడానికి ఒక సర్కిల్ లేకపోవడం, వైవాహిక జీవితానికి దూరం, నిరాశ, మద్యానికి బానిస అవడము లాంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోవిడ్ కు పూర్వం విదేశాలలో మరణాలు 2014 నుండి 2019 వరకు ఆరు సంవత్సరాల కాలంలో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 33,930 మంది ప్రవాస భారతీయులు మృతి చెందారని ప్రభుత్వం 20 నవంబర్ 2019 న లోక్ సభకు తెలిపింది. ఆరేళ్లలో సౌదీ అరేబియా (15,022), యుఏఈ (9,473), కువైట్ (3,580), ఓమాన్ (3,009), ఖతార్ (1,611), బహరేన్ (1,235) మంది ఎన్నారైలు చనిపోయారు. ఆరు గల్ఫ్ దేశాలలో 89 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా ఇందులో సగటున రోజుకు పదిహేను మంది ఎన్నారైలు మృత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉండగా 2015 నుండి 2019 వరకు అయిదు సంవత్సరాల కాలంలో 125 దేశాలలో మృతి చెందిన 21,930 మంది మృతదేహాల శవపేటికలను భారత్ కు తెప్పించామని ప్రభుత్వం 5 ఫిబ్రవరి 2020 న లోక్ సభకు తెలిపింది. వీటిలో అత్యధికం గల్ఫ్ దేశాలలో సంభవించాయి. కోవిడ్ వలన మరణాలు విదేశాలలో కోవిడ్ వలన 4,048 మంది ఎన్నారైలు మృతి చెందారని ప్రభుత్వం 3 డిసెంబర్ 2021 న లోక్ సభ కు తెలిపింది. సౌదీ అరేబియా (1,154), యుఏఈ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109) ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 3,576 మంది కోవిడ్ తో చనిపోయారు. అన్ని దేశాల మొత్తం మరణాలలో పోలిస్తే గల్ఫ్ లోనే 88 శాతం మంది కోవిడ్ తో మృతి చెందారు. ప్రమాదాల్లో విదేశాలలో ప్రమాదాల్లో మరణించిన భారతీయుల వివరాలను 3 డిసెంబర్ 2021 న ప్రభుత్వం లోక్ సభ లో వెల్లడించింది. గత మూడేళ్లలో 63 దేశాలలో 2,384 మంది ఎన్నారైలు ప్రమాదాలలో మృతి చెందారు. సౌదీ అరేబియా (683), యుఏఈ (370), కువైట్ (195), ఓమాన్ (94), ఖతార్ (60), బహరేన్ (44) ఆరు గల్ఫ్ దేశాలలో 1,446 మంది ప్రమాదాలలో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన భారతీయుల ప్రమాద మరణాలలో గల్ఫ్ లోనే 61 శాతం సంభవించాయి. ఇదిలా ఉండగా గత మూడేళ్లలో నేపాల్ (227), ఫిలిప్పీన్స్ (153), మలేసియా (76), సింగపూర్ (55) మంది ప్రమాదాల్లో మృతి చెందారు. విదేశాల్లో 468 ప్రమాద పరిహార కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కువైట్ (142), ఓమాన్ (127), సౌదీ అరేబియా (85), ఖతార్ (41), యుఏఈ (24) కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎడారిలో ఎండమావులు... కేసీఆర్ గల్ఫ్ హామీలు 14 ఏళ్ళ క్రితం... 2008 లో పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ ప్రసంగం యధాతదంగా (వీడియో ట్రాన్స్క్రిప్ట్): తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన వేలకోట్ల రూపాయల నుండి గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కొరకు వెంటనే ప్రభుత్వం 500 కోట్ల నిధులు ఏర్పాటు చేయాలి, విడుదల చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది. గల్ఫ్ బాధితులై మరణించిన వ్యక్తుల కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో ఉన్న తెలంగాణ ఎన్నారైల పిల్లలను స్థానికులుగా పరిగణించి, కేరళ ప్రభుత్వం ఏవిధంగా సాయం అందిస్తుందో అదే విధంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో చనిపోయిన , ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు ఆదుకోవడంతో పాటు స్వదేశం రావడానికి, గల్ఫ్ లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ సెల్‌ని వెంటనే ఏర్పాటు చేయాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది. మానవ వనరుల ఎగుమతి.. ఇంధనాల దిగుమతి భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు కార్మికులను (మానవ వనరులను) ఎగుమతి చేసి ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నది. ఇది మనుషులను ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే పక్కా ఎగుమతి, దిగుమతి వ్యాపారం. కార్మికులు తమ భార్యా బిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, ఈ దేశాన్ని వదిలి విదేశాల్లో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. వీరి త్యాగాలు మనం వెలకట్టగలమా ? ఈ దేశం కోసం డ్యూటీలో భాగాంగా ఎడారిలో దిక్కులేని వారిగా చనిపోయిన మన గల్ఫ్ ప్రవాసీ కార్మికులను "గల్ఫ్ అమరులు" అని పిలుచుకుందాం అని ప్రవాసీ సంఘాలు అంటున్నాయి. దేశ సరిహద్దులు దాటి అరబ్ గల్ఫ్ దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నారు. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న భారత సైనికుల మాదిరిగా వలస కార్మికులు కూడా దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారు 95% ఒంటరిగానే వెళుతున్నారు. తక్కువ వేతనం వలన కుటుంబాన్ని వెంట తీసుకెళ్ళలేరు. 15 లక్షల మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. వీరు ప్రతి నెలా రూ. 1,500 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కు పంపిస్తున్నారు. ఈ విదేశీ మారకద్రవ్యంతో (ఫారిన్ ఎక్స్చేంజి) కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ (పెట్రోల్, డీజిల్) ఇంధనాలను కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రవాసీ కుటుంబాలు ప్రతి నెల పొందుతున్న 1,500 కోట్ల రూపాయల సొమ్ము వినిమయంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నులు వసూలయినా నెలకు 150 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి జమ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతున్నది. ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏమైంది ? 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయింది. కేరళ, పంజాబ్ తరహా విధానాలను అవలంభిస్తామని తరుచూ చెబుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ప్రత్యేక ప్రవాసి మంత్రిత్వ శాఖ ఏర్పడలేదు. ఇప్పటికీ సాధారణ పరిపాలన శాఖ (జిఏడి) లో ఎన్నారై సెల్ అని ఒక విభాగం మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి. సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ఏర్పాటు చేయాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ప్రమాద బీమా, పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని గల్ఫ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. - మంద భీంరెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు) +91 98494 22622, mbreddy.hyd@gmail.com] చదవండి: లైఫ్ అండ్ డెత్ ఇన్ ద గల్ఫ్ -
పరాయి దేశాల్లో పడరాని పాట్లు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 24 మంది, కేదారిపురం గ్రామానికి చెందిన 13 మంది, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మరో ఏడుగురు నిరుద్యోగులు గత ఏడాది డిసెంబర్లో ఓ ప్రకటన చూసి ‘అరౌండ్ ద వరల్డ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో గాజువాక గ్రాన్ ఆపిల్ హోటల్లో దుబాయ్ డ్రాగన్ కంపెనీ, అబుదాబీ శాంసంగ్ కంపెనీల్లో వెల్డర్, ఫిట్టర్, స్టోర్‌మెన్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీసా, పాస్‌పోర్ట్, విమానం టికెట్ల కోసం రూ.45వేలు నుంచి రూ.55వేలు వరకు వసూలుచేశారు. ఈ ఏడాది జనవరి 24న ముంబై చేరుకోవాలని, అక్కడ నుంచి 28న విమానంలో విదేశాలకు వెళ్లాలంటూ చెప్పిన ట్రావెల్ ఏజెంట్లు ఆ తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి ఉడాయించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: .. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శ్రీకాకుళం జిల్లాలో ఈ తరహా మోసాలు సర్వసాధారణం. ఇక్కడి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో వందలాది మంది యువత తరచూ ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. వివిధ శిక్షణా సంస్థలకు లక్షల్లో ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక చెప్పిన ఉద్యోగం చూపించకపోవడం, టూరిస్ట్ వీసాలంటూ వెనక్కి పంపడం.. నకిలీ ఆర్డర్లతో ఉద్యోగాలే ఇవ్వకపోవడంతో యువకులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. మోసం జరుగుతోందిలా.. సిక్కోలు (శ్రీకాకుళం) జిల్లాకు చివర్లో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి నిరుద్యోగ యువకులకు పలు సంస్థలు విదేశీ ఉద్యోగాల ఎరచూపి దోపిడీకి పాల్పడుతున్నాయి. గ్రామాల్లో ఉద్యోగ ప్రకటనను అతికించి కొంతమంది, మధ్యవర్తుల ద్వారా కార్మికులను మాయమాటలతో నమ్మించి మరికొందరూ మోసాలకు పాల్పడుతుంటే.. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో.. ఆకర్షణీయమైన జీతాలు అందిస్తామంటూ నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ లక్షలాది రూపాయలు లాగేస్తున్నారు. ఏసీ గదుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఫోన్‌చేసి కళ్లెదుటే సినిమా చూపిస్తారు. తీరా డబ్బులు చేతికి అందాక చుక్కలు చూపిస్తున్నారు. మోసపోతున్నదిక్కడే.. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కంచిలి ప్రాంతాలతోపాటు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుర్లారోడ్, బరంపుర్, ఛత్రపూర్ వంటి ప్రాంతాల్లో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటుచేసి, నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి, విదేశాల్లో ప్ల్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రిగ్గర్, టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్రికేటర్ తదితర పోస్టులను బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షలు వసూలుచేస్తున్నారు. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్, అబుదాబి, ఒమెన్, ఇరాక్, సౌదీ అరేబియా, సూడాన్, రష్యా, పోలండ్ తదితర ప్రాంతాలు ఇక్కడి నిరుద్యోగుల యువత కష్టాలకు కేంద్రంగా మారాయి. నా భర్త ఏమయ్యాడో.. నా పేరు పుచ్చ అనుసూయమ్మ. మాది వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీ కొల్లిపాడు గ్రామం. నా భర్త కుర్మారావు 2019లో సౌదీకి ఉపాధి కోసం వెళ్లాడు. అల్ మసాలిక్ కంపెనీలో చేరాడు. రెండు నెలలుగా అచూకీలేదు. నా భర్తకు ఏమైందో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీడంలేదు. ఎస్పీ, జిల్లా కలెక్టర్లను ఆశ్రయించాం. చివరికి నా భర్త పనిచేస్తున్న కంపెనీని మెయిల్ ద్వారా సమాచారం కోరాం. ఎలాంటి సమాచారంలేదు. మన వారిని చూసి కన్నీళ్లొచ్చాయి.. విదేశాల్లో మనవారు పడుతున్న కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయి. టూరిస్ట్ వీసాలతో మోసపోయి సుమారు 60 మంది దుబాయ్‌లో అనేక కష్టాలుపడ్డారు. కడుపు నింపుకోవడం కోసం ప్రతీ శుక్రవారం మసీదుల వద్ద ఉచితంగా అందించే రొట్టెలు, పండ్లు కోసం క్యూ కట్టేవారు. రాత్రి సమయంలో ఇసుక తిన్నెలపై పడుకునేవారు. పోలీసుల కంటపడకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయా.. – హెచ్చర్ల కుమారస్వామి, బాధితుడు, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం. ఉద్యోగాలివ్వకుండా మోసం.. సింగపూర్‌లోని రొమేనియాలో ఉద్యోగాలిప్పిస్తామని కంచిలి మండల పరిధి కత్తివరం రోడ్డులోగల శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని బసవ వెంకటేష్ మోసం చేశాడు. మా వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశాడు. డబ్బులు కట్టినప్పటికీ ఉద్యోగాలకు పంపించలేదు. రెండేళ్లుగా మేం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పటికీ ఇవ్వడంలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. మోసగాడు తప్పించుకు తిరుగుతున్నాడు. – దుంగ తారకేశ, ఇన్నీసుపేట, ఈరోతు తారకేశ్వరరావు, సన్యాసిపుట్టుగ, సంగారు సురేష్, కపాసుకుద్ది మోసాలు అనేకం.. మచ్చుకు కొన్ని.. ► ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఓ ఏజెంట్ 150 మంది నుంచి దాదాపు రూ.2కోట్లు వసూలు చేసి రష్యా స్టాంపుతో నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడు. వాస్తవానికి వీసా అనేది పాస్‌పోర్టుపై అతికించి ఇవ్వాలి. కానీ, ఈ ఏజెంట్ 150 మందిని పట్టుకుని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా అక్కడ భారత ఎంబసీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలుగా తేల్చి వెనక్కి పంపించేశారు. ► కంచిలి మండల పరిధిలోని కత్తివరం రోడ్డులో శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సుమారు 150 మంది నిరుద్యోగ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసంచేసి, ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి 70 వేలు చొప్పున వసూలు చేసి, దుకాణం మూసేశారు. బాధితుల్లో ఇన్నీసుపేట, సన్యాసిపుట్టుగ, కపాసుకుద్ది, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన వారున్నారు. ► అలాగే, ఇదే మండలంలోని డోలగోవిందపురం గ్రామానికి చెందిన మట్ట దున్నయ్య అనే వ్యక్తి డోలగోవిందపురం, గంగాధరపురం, ఒడిశాకు చెందిన నరేంద్రపురం తదితర గ్రామాలకు చెందిన ఆరుగురి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేసి, మరో ఏజెంటు ద్వారా వీరికి శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు, ఓటీ, భోజనం, వసతి సౌకర్యం కల్పించే ఉద్యోగం ఇస్తానని చెప్పి నమ్మబలికి, తీరా యువకులను శ్రీలంక పంపించి, అక్కడ కేవలం రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో ఆయా యువకుల కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. ఒక ఉద్యోగం అని చెప్పి.. వేరే ఉద్యోగం ఇచ్చి.. శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు ఓటీతో కలిపి రూ.25వేలు వరకు వచ్చే ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశారు. తీరా వారం రోజుల క్రితం శ్రీలంకకు వెళ్లి అక్కడి గమేజ్ ట్రేడింగ్ కంపెనీలో నెలకు రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలిచ్చి మోసంచేశారు. ఏజెంట్ చెప్పిన ప్రకారం ఏదిలేదు. మాకు జరిగిన మోసంపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. మేం కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలి. – శ్రీలంక నుంచి బాధితులు పురుషోత్తం, బినోద్ నాయక్, శివ -
‘బూస్టర్’ తీసుకున్న వారికే యూఏఈ అనుమతి
మోర్తాడ్ (బాల్కొండ): కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ దేశానికి వచ్చే విదేశీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కొత్త నిబంధనలను విధించింది. టీకా రెండు డోస్‌లు తీసుకున్న వారు బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన ఈ నెల 10 నుంచి అమలులోకి రానుంది. సాధారణంగా ఎక్కడైనా రెండు డోస్‌ల టీకాలనే ఇస్తున్నారు. మన దేశంలో బూస్టర్ డోస్ కేవలం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కే ఇవ్వాలని నిర్ణయించారు. ఇతరులకు బూస్టర్ డోస్ ఇచ్చే ఆంశం ఇంకా వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనలో ఉంది. దేశంలో కోవిషీల్డ్ టీకా ఎక్కువగా ఇస్తుండగా మొదటి డోస్‌కు, రెండో డోస్‌కు 84 రోజుల కాలపరిమితి విధానాన్ని అమలు చేస్తున్నారు. కేవలం విదేశాలకు వెళ్లే వారికి వీసా ఉంటేనే నెల రోజుల వ్యవధిలో రెండు డోస్‌ల టీకాలను ఇస్తున్నారు. ఇప్పుడు బూస్టర్ డోస్ అంశాన్ని యూఏఈ తెరమీదపైకి తేవడంతో యూఏఈ వెళ్లే వలస కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. వీసా గడువు సమీపించే వారికి కేంద్రం బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరుతున్నారు. డోస్‌ల మీద డోస్‌లు.. దేశంలో 2 డోస్‌ల టీకా కార్యక్రమం ఇంకా సాగుతుండగా యూఏఈలో వలస కార్మికులకు డోస్‌ల మీద డోస్‌ల టీకాలు వేస్తున్నారు. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్‌లను దృష్ట్యా చైనా ఉత్పత్తి చేసిన సినోఫాం టీకా రెండు, మూడు డోస్‌లు ఇచ్చారు. సినోఫాం టీకాతో వైరస్ కట్టడి కావడం లేదని తాజాగా ఆ టీకాలు మూడు డోస్‌లు తీసుకున్నవారికి మళ్లీ ఫైజర్ టీకా ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికీ 3, 4 డోస్‌లకు మించి టీకాలు ఇస్తున్నారు. చదవండి: ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!! -
జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్.. ఊపందుకున్న ఉద్యమం
మానవ వలస అనేది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ప్రక్రియ. వలసలకు, అభివృద్ధికి, మానవ వికాసానికి సంబంధం ఉన్నది. వలస వెళుతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో "అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ" గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ వలసలు ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం వలసలకు ఒక కారణం కాగా, అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం మరొక కారణం. పల్లెల నుండి పట్టణాలకు గాని, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గాని వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. కోవిడ్ మరణాలు కోవిడ్ పరిస్థితుల వలన తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా ఆరు గల్ఫ్ దేశాలలో 3,576 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో 200 కు పైగా తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. సౌదీ అరేబియా (1,154), యుఏఇ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109). వందే భారత్‌లో కోవిడ్ సందర్భంగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు 'వందే భారత్ మిషన్' లో 7,16,662 మంది వాపస్ వచ్చారు. వీరిలో ఒక లక్షమంది తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. యుఏఇ (3,30,058), సౌదీ అరేబియా (1,37,900), కువైట్ (97,802), ఓమాన్ (72,259), ఖతార్ (51,190), బహరేన్ (27,453) వేల మంది భారతీయులు ఇండియాకి తిరిగి వచ్చారు. జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్ కరోనా సమయంలో గల్ఫ్ నుండి హడావిడిగా వెళ్లగొట్టబడిన కార్మికులకు జీతం బకాయిలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) రాబట్టుకోవడం కోసం 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' అనే ఉద్యమం నడుస్తున్నది. వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేసింది. వాపస్ వచ్చినప్పుడు అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ ఖర్చులు తడిసి మోపెడైనాయి. భారంగా మారిన తిరుగు ప్రయాణం కరోనా తగ్గుముఖం పట్టడంతో వాపస్ వచ్చిన వలస కార్మికులు తిరిగి గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. కరోనా టెస్టులు, అధిక విమాన చార్జీలు ఇబ్బంది పెడుతున్నాయి. కొత్తగా ఉద్యోగుల రిక్రూట్మెంట్ కూడా పుంజుకుంటున్నది. కరోనా సందర్భంగా రిక్రూటింగ్ ఏజెన్సీలను ఆదుకోవడానికి సెక్యూరిటీ డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నుంచి రూ. 25 లక్షలకు, రూ. 8 లక్షల నుంచి రూ. 4 లక్షలకు తగ్గించింది. వలస కార్మికులు చెల్లించే సర్వీస్ చార్జీలు రూ.30 వేలు దీనిపై 18 శాతం జీఎస్టీ మాత్రం తగ్గించలేదు. ప్రవాసీ విధానం ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండు చాలాకాలంగా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడున్నర ఏళ్లలో 1500 కు పైగా తెలంగాణ ప్రవాసులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారు. గల్ఫ్ మృతుల కుటుంబాలు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ఎదిరి చూస్తున్నారు. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఆన్లైన్ ఓటింగ్ 38 ఏళ్లనాటి ఎమిగ్రేషన్ యాక్టు, 1983 స్థానంలో నూతన ఎమిగ్రేషన్ యాక్టు, 2021 ను తీసుకరావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఎన్నారైలకు 'ప్రాగ్జీ' ఓటింగు (ప్రతినిధి ద్వారా, పరోక్ష పద్ధతిలో ఓటు వేయడం) లేదా ఆన్ లైన్ ఓటింగు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న 2,183 మంది భారతీయులు న్యాయ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీస వేతనం గల్ఫ్ దేశాలలో పనిచేసి భారతీయ కార్మికులకు భారత ప్రభుత్వం కనీస వేతనాలను తగ్గిస్తూ సర్కులర్లను జారీ చేసింది. అన్నివర్గాల ఒత్తిడితో ఆ తర్వాత ఆ సర్కులర్లను రద్దు చేశారు. భారత విదేశాంగ మంత్రి గల్ఫ్ దేశాలలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విదేశీ భవన్ కావాలి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయి లో ఏర్పాటు చేసిన విధంగా "విదేశ్ భవన్" ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి. ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (సమీకృత సముదాయం) లో పాసు పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్ లు ఉంటాయి. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం 'ప్రవాసీ తెలంగాణ దివస్' ను అధికారికంగా నిర్వహించాలి. విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలంగాణ ప్రవాసి సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వవేదిక ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ప్రవాసులు అందరికీ శుభం జరగాలని ఆశిస్తూ ... - మంద భీంరెడ్డి (+91 98494 22622 ) -
Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం
సౌదీ అరేబియా రెసిడెన్సీ వర్క్ పర్మిట్ల విషయంలో కొత్త చట్టం చేసింది. మూడు నెలలకు ఓసారి అక్కడ పని చేస్తున్న కార్మికులకు రెసిడెన్సీ వర్క్ పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సౌదీ అంతర్గత వ్యవహరాలు, మానవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియాలో పని చేస్తున్న వలస కార్మికులు నివాసం ఉండేందుకు జారీ చేసే పర్మిట్లను ఇకమాగా పేర్కొంటారు. వలస కార్మికులకు పని కల్పించే ఎంప్లాయర్లే ఈ పర్మిట్లకు సంబంధించిన ఫీజులు చెల్లిస్తూంటారు. గతంలో ఏడాదితో పాటు ఆరు నెలలు, తొమ్మిది నెలల కాలానికి ఈ పర్మిట్లు జారీ చేసేవారు. అయితే ఇక్మాల జారీని మరింత సులభతరం చేసే ఉద్దేశంతో కనీస కాలపరిమితి మూడు నెలలకు తీసుకువచ్చారు. అయితే ఇళ్లలో పని చేస్తున్న కార్మికులు కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక్మా రెన్యువల్ చేసుకునేవారు అబ్షేర్ ఇండివిడ్యువల్, అబ్షేర్ బిజినెస్, ముఖీమ్, కివా వంటి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్లను ఉపయోగించుకోవచ్చు. స్వల్పకాలానికి సంబంధించిన పనులకు వలస కార్మికులను రప్పించుకునే విషయంలో కొత్త నిబంధనల వల్ల ఎంప్లాయర్లకు తక్కువ భారం పడుతుందని సౌదీ ప్రభుత్వం అంటోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగానికి ఎంతో ఊతం లభిస్తుందని పేర్కొంది. -
ఉచిత వీసాలతో దళారుల దందా..
మోర్తాడ్ (బాల్కొండ) : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఎం.నర్సయ్య నిర్మల్‌లో ఒక ఎజెన్సీ నిర్వహించిన గల్ఫ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉచిత వీసా అనే ఉద్దేశంతో నర్సయ్య ఇంటర్వ్యూకు వెళ్లగా వీసా కోసం ఏజెంట్ అతనిని రూ.50వేలు డిమాండ్ చేశాడు. ఇది నర్సయ్య ఒక్కనిదే కాదు ఎంతో మంది వలస కార్మికులకు ఎదురవుతున్న సమస్య. తమ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకోవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఆబుదాబి నేషనల్ హోటల్ కంపెనీ(ఏడీఎన్‌హెచ్) ఉచితంగా జారీ చేస్తున్న వీసాలను కొందరు దళారులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. యూఏఈలోని విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు, ఇతరులకు భోజనం సరఫరా చేసే కేటరింగ్‌ను ఏడీఎన్‌హెచ్ సంస్థ నిర్వహిస్తుంది. తమ కేటరింగ్ నిర్వహణ కోసం ఎక్కువ సంఖ్యలో కార్మికులు అవసరం కావడంతో ఏడీఎన్‌హెచ్ సంస్థ భారీ రిక్రూట్మెంట్కు ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో లైసెన్స్డ్ గల్ఫ్ ఎజెన్సీల ద్వారా ఏడీఎన్‌హెచ్ సంస్థ నియామకాలను కొనసాగిస్తోంది. 21 ఏళ్ల వయస్సు నిండి 35 ఏళ్ల లోపువారు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉంటే ఉచిత వసతి, భోజన సదుపాయాలను సదరు సంస్థ కల్పిస్తుంది. క్లీనింగ్ వర్క్ వీసాలను జారీ చేస్తున్న సంస్థ వలస కార్మికులకు నెలకు రూ.18 వేల వరకు వేతనం చెల్లిస్తుంది. ఎలాంటి వీసా చార్జీలు, విమాన టిక్కెట్, మెడికల్ చార్జీలు లేకుండా కార్మికులు యూఏఈలో ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. అయితే కొందరు గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత వీసాలే అయినా వలస కార్మికుల నుంచి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా జగిత్యాల్, పెర్కిట్, నిజామాబాద్‌లలోని ఒక సంస్థ మాత్రం ఉచితంగానే కార్మికులను రిక్రూట్మెంట్ చేసి యూఏఈకి పంపించింది. గల్ఫ్‌కు వలసలు ఆరంభమైన మొదట్లో కొనసాగిన ఉచిత రిక్రూట్మెంట్ కరోనా పరిస్థితుల తరువాత మళ్లీ కొనసాగడం విశేషం. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల రిక్రూట్మెంట్కు సంబంధించి లైసెన్స్డ్ ఏజెంట్లే నియామకాలు చేపట్టాల్సి ఉండగా దళారుల దందా కొనసాగుతుండటం గమనార్హం. కార్మికులకు అవగాహన లేక నష్టపోతున్నారు... ఉచిత వీసాలపై కార్మికులకు అవగాహన లేక నష్టపోతున్నారు. కంపెనీలు జారీ చేసే ఉచిత వీసాలకు ఎవరూ చార్జీలు వసూలు చేయవద్దు. కాని వలస కార్మికుల అవసరాలను కొందరు ఏజెంట్లు ఆసరాగా తీసుకుంటున్నారు. కార్మికులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్ఆర్ఐ సెల్‌పై ఉంది. – దొనికెన కృష్ణ, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కొందరు రెండు విధాలుగా లబ్ధి పొందుతున్నారు... ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఎవరైనా వలస కార్మికులకు వీసా జారీ చేసి గల్ఫ్‌కు పంపిస్తే 45 రోజుల వేతనం లేదా రూ.30 వేలను ఫీజుగా తీసుకోవచ్చు. ఒక వేళ కంపెనీ ఉచిత వీసాలను జారీ చేస్తే కార్మికులను రిక్రూట్మెంట్ చేసే ఎజెన్సీలకు ఆ కంపెనీ ఫీజు చెల్లిస్తుంది. ఏడీఎన్‌హెచ్ కంపెనీ ఉచితంగా వీసాలను జారీ చేసి కార్మికులకు లబ్ధి చేకూరుస్తుంది. అయితే ఈ కంపెనీ వీసాలతో కొందరు ఏజెంట్లు రెండు రకాలుగా లబ్ధి పొందుతున్నారు. కంపెనీ నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందుతూనే వలస కార్మికుల నుంచీ వసూలు చేస్తున్నారు. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు -
వలస కార్మికులకు ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని కొన్ని కంపెనీలు వలస కార్మికులకు తిరిగి స్వాగతం చెబుతున్నాయి. గతంలో వీసాల జారీ కోసం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు చార్జీలు వసూలు చేసిన ఏజెన్సీలు ప్రస్తుతం ఉచిత రిక్రూటింగ్‌ను చేపట్టాయి. కరోనా కారణంగా కంపెనీలు భారీ సంఖ్యలో కార్మికులను ఇళ్లకు పంపించేయడంతో అనేక పోస్టులు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, కంపెనీల కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఇప్పుడు వలస కార్మికుల సేవలు అత్యవసరం అయ్యాయి. దీంతో యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టులలో క్లీనింగ్ పని కోసం పలు ఏజెన్సీలు కార్మికులను తరలిస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల్, ఆర్మూర్‌లలో ఒక ఏజెన్సీ కొన్ని రోజులుగా ఉచిత రిక్రూటింగ్‌ను కొనసాగిస్తోంది. కేవలం రూ.5 వేలను సర్వీస్ చార్జీలుగా వసూలు చేస్తూ ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్లను ఇచ్చి యూఏఈ పంపిస్తోంది. గతంలో గల్ఫ్ దేశాలకు వలసలు మొదలైన ఐదు దశాబ్దాల కింద ఉచిత రిక్రూటింగ్ జరిగింది. ఇదిలాఉండగా ఇక్కడి వారికి ఉచిత నియామకాలపై అవగాహన లేకపోవడంతో మన ప్రాంతంలో కొనసాగుతున్న ఇంటర్వూ్యలకు పొరుగు రాష్ట్రాల కార్మికులు హాజరవుతుండటం విశేషం. ఇప్పటివరకు ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 2వేల మందిని యూఏఈ తరలించినట్లు ఏజెన్సీ నిర్వాహకులు వివరించారు. -
కొత్త వీసాల జారీకి కువైట్ గ్రీన్ సిగ్నల్
మోర్తాడ్ (బాల్కొండ): కొత్తగా వచ్చే వలస కార్మి కులకు వీసాలు జారీ చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి నుంచి కువైట్, కార్మికులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కువైట్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో కువైట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సమయంలో విదేశీ వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం కువైట్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. గతంలో వీసా గడువు ఉన్నా కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులను ఇంటికి పంపించిన కంపెనీలు పాత కార్మికులను మళ్లీ రావాల్సిందిగా కోరుతున్నాయి. కొత్త వీసాల జారీకి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవసరం ఉన్న రంగాల్లో వలస కార్మికులను రప్పించుకోవడానికి ఆయా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కువైట్ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ–శ్రమ్ పోర్టల్‌లోకి 4 కోట్ల అసంఘటిత కార్మికులు
న్యూఢిల్లీ: ప్రారంభించిన రెండు నెలల్లోపే 4 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల పేర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదయ్యాయని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఆదివారం తెలిపింది. నిర్మాణం, దుస్తుల తయారీ, మత్స్య, వ్యవసాయ, రవాణా తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్న వారంతా పేర్లు నమోదు చేయించుకున్నారని పేర్కొంది. చాలా రంగాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు కూడా ఉన్నారని తెలిపింది. వీరిలో అత్యధిక భాగం నిర్మాణ, వ్యవసాయ రంగాలకు చెందిన వారేనని పేర్కొంది. ఈ పోర్టల్ ఆధారంగానే అసంఘటిత రంగ కారి్మకులకు అన్ని రకాల సామాజిక భద్రత, ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలు అందుతాయని వెల్లడించింది. మొత్తం 4.09 కోట్ల అసంఘటిత రంగ కారి్మకుల్లో 50.02% మంది లబి్ధదారులు మహిళలు కాగా 49.98% మంది పురుషులని వివరించింది. వీరి సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని కూడా తెలిపింది. నమోదైన వారిలో ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపింది. నమోదు చేసుకోవాలనుకునే వారు ఈ–శ్రమ్ మొబైల్ అప్లికేషన్‌ను గానీ వెబ్‌సైట్‌ను గాని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంకా, కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీలు), రాష్ట్ర సేవా కేంద్ర, లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, గుర్తించిన పోస్టాఫీసులు, డిజిటల్ సేవా కేంద్రాలకు వెళ్లాలని వివరించింది. నమోదైన వారికి దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే డిజిటల్ ఈ–శ్రమ్ కార్డు అందజేస్తారనీ, వారు తమ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ–శ్రమ్ కార్డు కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవికలత్వం ప్రాపించినా రూ.2 లక్షల పరిహారం అందుతుందనీ, పాక్షిక అంగ వైకల్యమైతే రూ.1 లక్ష సాయం అందుతుందని తెలిపింది. -
బహ్రెయిన్ నుంచి క్షేమంగా తిరిగొస్తున్న వలస కార్మికులు
సాక్షి, అమరావతి: బహ్రెయిన్‌లో ఎన్హెచ్ఎస్ సంస్థలో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను ప్రభుత్వం క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటి వరకు 33 మందిని బహ్రెయిన్ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు భోజనం, వసతి, స్వస్థలాలకు రవాణా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది కార్మికులను వెనక్కి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎన్హెచ్ఎస్ సంస్థ దాష్టీకాలు భరించలేక ఇబ్బందులు పడుతూ అక్కడ ఇరుక్కుపోయిన కార్మికుల విషయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లగానే.. ఆయన తక్షణం స్పందించినట్టు తెలిపారు. వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెప్టెంబర్ 13న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. దీనిపై విదేశాంగ శాఖ తక్షణం స్పందించడంతో కార్మికులను స్వదేశానికి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. -
మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం
సాక్షి, అమరావతి/రేపల్లి: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ అగ్ని ప్రమాదంలో ఒడిశా వలస కూలీలు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందగా.. ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆ మొత్తాలను చెక్కుల రూపంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, కలెక్టర్ వివేక్ యాదవ్ మృతుల కుటుంబాలకు అందజేశారు. ఆక్వా చెరువుల యాజమాన్యం తరఫున రూ.5 లక్షల చొప్పున అందించారు. మరోవైపు ఒడిశా ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఒడిశాలోని గోన్పూర్ ఎమ్మెల్యే రఘునా«థ్ గుమెంగో, ఒడిశా విద్యార్థి నాయకుడు బి.విష్ణుప్రసాద్ పండా తదితరులు పాల్గొన్నారు. -
తోటి వారిని కోల్పోయి.. బరువెక్కిన హృదయాలతో తిరుగు ముఖం
రేపల్లె (గుంటూరు): ఆ వలస కూలీలంతా కలిసే వచ్చారు. అగ్ని కీలల రూపంలో విరుచుకుపడిన ఆ కాళరాత్రి తమలో ఆరుగుర్ని సజీవ దహనం చేయడంతో భయకంపితులయ్యారు. అస్థికలుగా మారిన తోటి వారికి బరువెక్కిన హృదయాలతో అంత్యక్రియలు జరిపించారు. ఘోర ప్రమాదం మిగిల్చిన విషాదాన్ని తట్టుకోలేక.. తమతో వచ్చిన వారు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక విలపిస్తూనే సొంతూళ్లకు పయనమయ్యారు. గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బ గ్రామంలోని బెయిలీ ఆక్వా ఫామ్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర ప్రమాదంలో సజీవ దహనమైన ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన యువకులు నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అíస్థికలకు ఘటనా స్థలంలోనే ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి కూలీలు అదే గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. బావురుమన్న తల్లిదండ్రులు, బంధువులు ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఒడిశా నుంచి శనివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని కీలల్లో కాలిబూడిదైన అస్థికలను చూసి బావురుమన్నారు. మమ్మల్ని పోషించడం కోసం ఇంత దూరం వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ రోదించారు. వారితోపాటు వచ్చిన ఒడిశాలోని గోన్పూర్ ఎమ్మెల్యే రఘునాథ్ గుమెంగో ప్రమాదానికి గల కారణాలను ఇక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన గదిలోంచి బయటపడ్డ నలుగురు కూలీల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అధికారులు, బెయిలీ ఆక్వా ఫామ్ యాజమాన్యాన్ని కోరారు. ఒడిశా నుంచి మొత్తం 25 మంది వలస కూలీలు ఆక్వా ఫామ్‌లో పని చేసేందుకు 15 రోజుల క్రితం రాగా.. గురువారం రాత్రి 10 మంది ఒక గదిలోను, 15 మంది మరో గదిలోను నిద్రించిన విషయం విదితమే. 10 మంది నిద్రించిన గదిలో ఆరుగురు అగ్ని కీలల్లో సజీవ దహనం కాగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందటంతో భయాందోళనకు గురైన మిగిలిన 19 మంది కార్మికులు శనివారం సాయంత్రం తమ వారు లేరన్న బాధతో రోదిస్తూ స్వగ్రామాలకు పయనమయ్యారు. సమగ్ర విచారణకు డిమాండ్ ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. శనివారం లంకెవానిదిబ్బ గ్రామానికి చేరుకున్న సీపీఎం, సీపీఐ (ఎంఎల్) నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఆరుగురి మృతిపై సమగ్ర విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఇదిలావుండగా.. ప్రమాదానికి రొయ్యల చెరువు యజమాని నిర్లక్ష్యమే కారణమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గఫూర్, కార్యదర్శి నరసింగరావు శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. యజమానిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. -
ఒమన్ పొమ్మంటోంది!
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికులకు అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించిన ఒమన్ దేశం.. ఇప్పుడు వారిని వదిలించుకుంటోంది. స్వదే శీయులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బయటవారిని సాగనంపుతోంది. దీంతో వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కొంత కాలంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టా డుతోంది. దీంతో అక్కడివారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచి, వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాలని ఒమన్ నిర్ణయించింది. ఇప్పటికే ఎందరో విదేశీ వలస కార్మికులను స్వదేశాలకు పంపించేసింది. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలలో ఒమనీయులకు పెద్దపీట వేశారు. అలాగే, చిన్న, మధ్య తరహా వాహనాల డ్రైవింగ్‌లోనూ తమ ప్రజలకు అవకాశం కల్పిస్తూ, విదేశీ డ్రైవర్ల లైసెన్స్‌ల రెన్యూవల్‌ను నిలిపి వేశారు. దీనికి తోడు ప్రైవేటు రంగంలోనూ ఒమన్ పౌరులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 20 నుంచి వాణిజ్య రంగాలలో విదేశీ వలస కార్మికుల స్థానంలో ఒమన్ పౌరులకు ఉపాధి కల్పించనున్నారు. తెలంగాణ కార్మికులకు పెద్ద దెబ్బ.. ఒమన్ నిర్ణయం తెలంగాణ వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒమన్‌లో ఇప్పటివరకు ఉపాధి పొందిన విదేశీ వలస కార్మికులలో భారత్‌కు చెందిన వలసదారుల సంఖ్యనే ఎక్కువగా ఉండగా, ఇందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 1.25 లక్షల మంది ఉంటారని అంచనా. తాజా నిర్ణయంతో 80 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని అంచనా. గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం .ఒమన్‌లో కొన్ని నెలల నుంచి భారతీయులే కాకుండా ఇతర దేశాల వ్యాపారులు, ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంతో భారతీయులకు కష్టకాలం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఒమన్‌లో బతకడం కష్టమే. –నరేంద్ర పన్నీరు, ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
వలస కార్మికులకు భద్రత ఏది?
లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల దుఃస్థితిపై సంవత్సరం పైగా విచారించిన సుప్రీంకోర్టు జూన్ 28న తన తీర్పును వెలువరించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ‘ఒకే దేశం, ఒకే రేషన్’ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ 2021 మే 6 నాటికి ఈ పథకం కింద 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని వార్తలు. పైగా వలస కార్మికులకు రేషన్ ఇవ్వడానికి చాలా చోట్ల తిరస్కరించారని కూడా తేలింది. ప్రభుత్వాలు ప్రకటిస్తున్న కార్మిక సంక్షేమ పథకాలన్నీ...అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం తన శక్తిని మొత్తంగా దీనిపై కేంద్రీకరిస్తే యావద్దేశం దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది. వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా... సంఘటిత కార్మికుల్లాగే క్రమబద్ధమైన పని వాతావరణం, కాస్త ప్రాథమిక భద్రత మాత్రమే. వలస కార్మికుల కేసుగా అందరికీ తెలిసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తన తీర్పును తాజాగా వెలువరించింది. గతేడాది లాక్డౌన్ కాలంలో భారీవలసల సందర్భంగా వలస కార్మికుల దుఃస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేసింది. సెకండ్ వేవ్ సమయంలోనూ దీనిపై విచారణ కొనసాగింది. జూన్ 28న ఉన్నత న్యాయస్థానం 7 పాయింట్లతో 80 పేజీల తీర్పును ప్రకటించింది. వీటిలో అయిదు అంశాలు–వలస కార్మికుల ఆహార భద్రతకు హామీ ఇవ్వడానికి సంబంధించినవి. వలస కార్మికులకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఉదారంగా వ్యవహరించి రేషన్ కార్డు లేని వారికి కూడా ఆహారం అందించాలని, సబ్సిడీ ధాన్యం కేటాయింపును పెంచాలని కోర్టు తీర్పు ఆదేశించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. వీటిలో చివరి అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది సుదీర్ఘకాలంగా చేస్తూవస్తున్న డిమాండే. న్యాయస్థానం తన తీర్పును ప్రభుత్వ యంత్రాంగం ఎలా అమలుచేస్తుందనే అంశంపై నిశితంగా పర్యవేక్షించాలని ఎవరైనా కోరుకుంటారు. కాగా వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అనే పథకాన్ని అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి న్యాయస్థానం హామీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం కోవిడ్–19 ఫస్ట్ వేవ్ తర్వాత ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. 2020 జూన్ 6న తన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే గత సంవత్సర కాలంలో ఈ పథకం కింద చాలా కొద్ది మాత్రమే లబ్ధి పొందారని ప్రభుత్వ డేటానే చూపిస్తోంది. 2021 మే 6 నాటికి ఈ పథకంలో భాగంగా 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని ఇంటెగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నివేదించింది. ఈ పథకం కింద వలస కార్మికులకు రేషన్ ఇవ్వడానికి దేశంలో పలుచోట్ల తిరస్కరించిన ఉదంతాలెన్నో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. వలస కార్మికుల నమోదు వీటన్నింటిని పక్కనబెట్టి చూస్తే, వలస కార్మికులకు ఆహార భద్రతపై హామీ ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగినది. పైగా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు వలస కార్మికులు కాస్త ఎక్కువగానే కడుపు నింపుకుని సాధారణ పనులను నిర్వహించవచ్చు. ఇక తీర్పులోని చివరి రెండు అంశాలను ప్రాథమికంగా విమర్శించాల్సి ఉంది. ఈ రెండూ వలస కార్మికుల నమోదుకు సంబంధించినవి. ఇదే చాలా ముఖ్యమైనది.ఎలాంటి లక్ష్య బృందానికైనా ఈ పథకం లబ్ధి్ద కలిగించాలని ఎవరైనా భావిస్తే, ముందుగా ఈ లక్ష్య బృందంలోని అందరినీ గుర్తించాల్సి ఉంది. వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏయే ప్రాంతాల్లో ఉన్నారు అనే అంశంపై ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేనందునే ఫస్ట్ వేవ్ కాలంలో వలస కార్మికులు భారీ స్థాయిలో వలస పోయారు. అందుకే వలస కార్మికుల నమోదు అంశంపై న్యాయస్థానం తీర్పు అధికంగా దృష్టి సారించింది. న్యాయస్థానం తన తీర్పును ఎలా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వాలూ, పౌర సమాజ సంస్థలూ, సంబంధిత పిటిషన్‌తో పాక్షికంగా సంబంధంలో ఉండి కోర్టుకు సహకరించిన న్యాయవాదులూ మొత్తంగా క్షేత్ర వాస్తవికతను పూర్తిగా పట్టించుకోలేదనే చెప్పాలి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తన తొలి తీర్పులో అసంఘటిత కార్మికుల గణన ప్రక్రియను ప్రారంభించడంలో కేంద్ర కార్మిక శాఖ విఫలమైందని దుయ్యబట్టింది. పైగా అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్(ఎన్‌డీయూడబ్ల్యూ)ని ఏర్పాటు చేయడానికి తుది గడువును కూడా నిర్ణయించింది. తర్వాత అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం (ఐఎస్ఎమ్డబ్ల్యూ యాక్ట్)ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసినట్లయితే, అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ రూపంలో ప్రత్యేక నమోదు ప్రక్రియ అవసరమే ఉండదు. అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియకు సంబంధించిన గత చరిత్రను న్యాయస్థానం ఎత్తి చూపలేదు. ప్రస్తుత అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన తొలి అయిదేళ్ల పాలనలో శ్రమయేవ జయతే పేరిట అసంఘటిత కార్మికులను భారీ స్థాయిలో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అసంఘటిత కార్మికులందరి సంఖ్యను గుర్తించి వారికి స్మార్ట్ కార్డులు జారీ చేయడమే దీని లక్ష్యం. అయితే ఈ పథకం వెనుకపట్టు పట్టడానికి ముందు కొంతమందికి కార్డులు జారీ చేశారు. కార్మికుల నమోదు నత్తనడకన సాగుతున్న నిర్మాణ కార్మికుల బోర్డుల నమోదు చరిత్రను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అన్ని కార్మిక చట్టాలు ఆయా పనిస్థలాల్లో కార్మికుల పేర్లు నమోదు చేయాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ఈ చట్టాల పరిధిలోనే పనికోసం ఒక చోటి నుంచి మరో చోటికి తరలి వెళ్లిపోయే వలస కార్మికులను నమోదు చేయడం జరగలేదు. సంక్షేమ పథకాల అమలు లోపం 1948 ఫ్యాక్టరీల చట్టం ద్వారా నిర్వహిస్తున్న పరిశ్రమలలో అనేకమంది వలస కార్మికులను గణనీయంగా నియమించుకున్నారు. ఈ శక్తిమంతమైన చట్టాన్ని పారిశ్రామిక భద్రత, ఆరోగ్య డైరెక్టరేట్ అమలు చేస్తోంది. కానీ వాస్తవానికి ఈ చట్టం కింద చాలా కొద్దిమంది కార్మికుల పేర్లను మాత్రమే నమోదు చేసింది. గుజరాత్‌లోని సూరత్ నగరం వేలాది మరమగ్గాలతో కూడిన అతిపెద్ద వస్త్రపరిశ్రమ కేంద్రాల్లో ఒకటి. ఇక్కడి పనిచేసేవారిలో మెజారిటీ ఒడిశా నుంచి వచ్చిన వలస కార్మికులే. కానీ ఈ నగరంలో ఉన్న పరిశ్రమ యూనిట్ల సంఖ్య ఎంత అని ఎవరైనా డైరెక్టరేట్‌ని అడిగితే సమాధానం శూన్యమే. నగరంలో ఎన్ని మరమగ్గాలు ఉన్నాయి అని తెలిపే కనీస డేటా కూడా దీనివద్ద లేదు. కోర్టు ఈ మొత్తం వ్యవహారంపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలను కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఈ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి అనేకమంది కార్మికులు వేచి చూస్తున్నారని తీర్పులోని 70వ పేజీలో న్యాయస్థానం పేర్కొంది. కానీ, ఇవన్నీ కూడా గుర్తింపులేని అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్న అసంఖ్యాక కార్మిక సంక్షేమ పథకాల సంఖ్యను కుదించి ఒక నమూనా స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.వాస్తవానికి గుజరాత్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా అసంఘటిత రంగ కార్మికులకు 20 పథకాలు అవసరం లేదు. వారికి ప్రాథమిక భద్రత, పీఎఫ్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ వంటివి అవసరం. వీటిని పక్కనబెట్టి వివిధ బోర్డులలో కార్మికుల పేర్లను నమోదు చేసి వివిధ పథకాలను కేటాయించినా అవన్నీ ఆచరణలో విఫలమవుతాయి. దేశంలోని వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా.. కార్మిక చట్టాలు అందించే క్రమబద్ధమైన పని వాతావరణం, ప్రాథమిక భద్రత మాత్రమే. సుప్రీంకోర్ట్ తన శక్తిని దీనిపై కేంద్రీకరిస్తే దేశం దేశమే దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది. సుధీర్ కటియార్ ‘సెంటర్ ఫర్ లేబర్ రీసెర్చ్ అండ్ యాక్షన్’ సభ్యులు. (‘ది వైర్’ సౌజన్యంతో) -
ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. వలస కార్మికుల డాటా బేస్ నిమిత్తం జాతీయ స్థాయిలో వర్కర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. ‘వలస కార్మికుల సమస్యలు, కష్టాలు’పై సుమోటో కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 80 పేజీల తీర్పు వెలువరించింది. ప్రతి వారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు, రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో కేంద్ర కారి్మక శాఖ కనబరుస్తున్న ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కారి్మకులకు రేషన్ సరుకుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకాలన్నీ జూలై 31 కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్ నేషన్–వన్ రేషన్ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలంది. రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగించాలని పేర్కొంది. వలస కార్మికులకు రేషన్ సరఫరా నిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకురావాలి. ఆ మేరకు కేంద్రం అదనపు ఆహారధాన్యాలను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగిన పథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది. చదవండి: ఆకలి మంటల్లో కార్మికులు! -
Lockdown Relaxation: బెంగళూరుకు వలసకూలీల వెల్లువ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి కొంచెం సడలిస్తుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వలసలు మళ్లీ ఆరంభమయ్యాయి. రాష్ట్రంలోని 30 జిల్లాలకు గానూ 11 చోట్ల మాత్రమే మరో వారం రోజుల పాటు లాక్డౌన్ కొనసాగిస్తుండగా, మిగతా 19 జిల్లాలకు సోమవారం నుంచి పరిమితంగా సడలింపు లభించింది. ఇందులో బెంగళూరు కూడా ఉంది. దీంతో ఆదివారం బెంగళూరులోని రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. వేలాది మంది వలస కూలీలు వచ్చారు. బయటి నుంచి వస్తున్నవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని సీఎం యడియూరప్ప ఆదేశించారు. దీంతో ప్రత్యేక శిబిరాలు పెట్టి నమూనాల సేకరణ చేపట్టారు. కాగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేస్తే థర్డ్ వేవ్ తలెత్తుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: ఓ తల్లి దయనీయగాథ.. భుజాలపై పిల్లాడితో -
Deepsikha: ‘అక్కా ఇంట్లోంచి వెళ్లిపోదామా.. అమ్మ ఎలాగ మరి’!
దీపశిఖ ఢిల్లీలో బి.ఏ. చదువుతోంది. త్వరలోనే అక్కడినుంచి కేరళ వలస కూలీల పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు తీసుకోబోతోంది. కేరళ ప్రభుత్వం అందుకు ఆమెను ఎంపిక చేసుకుంది. దీపశిఖ కూడా వలస కూలీల కుటుంబంలోని అమ్మాయే. పేదరికం, తాగుడుకు బానిసైన తండ్రి, తండ్రి పెట్టే హింసకు మానసికంగా జబ్బున పడ్డ తల్లి, ఆలనా లాలన లేని ముగ్గురు తమ్ముళ్లు.. ఇంత అభాగ్యమైన పరిస్థితులలో ధైర్యంగా నిలదొక్కుకుంది. కోవిడ్ రిలీఫ్ వర్కర్‌గా ఇటీవలి వరకు పని చేసింది. ‘ఎవరిదీ అభాగ్యం కాదు. ఎందుకంటే మనకన్నా అభాగ్యులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కనుక..‘ అని అంటోంది ధీశాలి దీపశిఖ. కొన్నాళ్ల క్రితం వరకు ఏచూరులో ఉన్న దీపశిఖ ఈ మధ్యనే ఢిల్లీ వెళ్లింది. కేరళ, కన్నూరు జిల్లాలోని ఎదక్కడ్ బ్లాక్‌లో ఉంటుంది ఏచూరు గ్రామం. అక్కడి ‘హోలీ మౌంట్’ పునరావాస కేంద్రంలో కోవిడ్ రిలీఫ్ వర్కర్‌గా ఆమె పని చేసింది. ఇప్పుడిక ఢిల్లీ యూనివర్సిటీలో క్లాసులు మొదలవడంతో హోలీ మౌంట్ చేయి వదలక తప్పలేదు. బి.ఎ. సంస్కృతం దీపశిఖది. ఆ అమ్మాయికి హిందీ వచ్చు, అస్సామీ వచ్చు. బెంగాలీ వచ్చు. మలయాళం వచ్చు. ఇంగ్లిష్ ఎలాగూ వచ్చే ఉంటుంది. ఇన్ని భాషలు వచ్చిన వారు సాధారణంగా వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలోని సమాచార విభాగంలో పని చేస్తుంటారు. అయితే దీపశిఖను కేరళ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంపిక చేసుకుంది. తను ఢిల్లీలోనే ఉంటుంది. అక్కడి నుంచి కేరళలోని వలస కార్మికుల పిల్లల కోసం ఆన్లైన్లో పాఠాలు చెబుతుంది. ‘కేరిటస్ ఇండియా’ పర్యవేక్షణలోని ‘కైరోస్ కన్నూర్’ ప్రాజెక్టు కింద దీపశిఖ కు ఈ బాధ్యతను అప్పగించారు. వలస కూలీలు తమ పిల్లల్ని చదివించడానికి ఎన్ని తిప్పలు పడతారో దీపఖకు తెలుసు కనుక ఆ ‘ఆఫర్’ను గొప్ప భాగ్యంగా స్వీకరించింది. దీపశిఖ కూడా వలస కూలీల ఇంటి బిడ్డే. ∙∙ పేదరికం ఒక్కటే ఉరుముతుంటే అమ్మ ఒడిలోనో, నాన్న చేతుల్లోనూ తల దాచుకోవచ్చు. దీపశిఖకు, ముగ్గురు తమ్ముళ్లకు నాన్నే ఉరుమయ్యాడు. ఆ ఉరుముకు దంచి అమ్మ మరొక తోబుట్టువు అయిందే తప్ప, అమ్మలా తమను అక్కున చేర్చుకోలేకపోయింది. దీపశిఖ తండ్రి దీపూదేవ్, తల్లి షీలాదేవ్ దీపశిఖకు ఆరు నెలల వయసుండగా ఉపాధి వెతుక్కుంటూ అసోం లోని మార్ఘరిటా నుంచి కేరళలోని కన్నూర్‌కు వలస వచ్చారు. తండ్రి తాగి రావడం, తల్లిని కొట్టడం, అన్నం లేదని పళ్లెం విసిరి కొట్టడం.. అప్పుడప్పుడు తమ్ముళ్లనీ కొట్టడం.. దీపశిఖ చిన్ననాటి జ్ఞాపకాలు. చిన్ననాడనేముందీ.. టెన్త్, ఇంటర్ వరకు కూడా! భర్త కొట్టిన దెబ్బలకు షీల మానసిక ఆరోగ్యం దెబ్బ తినింది! ‘అక్కా ఇంట్లోంచి వెళ్లిపోదామా..’ అని ఎన్నోసార్లు తమ్ముళ్లు అన్నా.. ‘అమ్మెలాగ మరి!’ అనే ప్రశ్నే దీపశిఖను నిలిపేసేది. ఆమెను నిలిపింది ఆ ప్రశ్న ఒక్కటే కాదు. టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడం కూడా. అప్పుడే అనుకుంది ఆ అమ్మాయి.. బాగా చదువుకుని అమ్మను బాగా చూసుకోవాలని. ఇంటర్లో మరింతగా కష్టపడి చదివింది. తెల్లవారు జామున మూడు గంటలకు లేచి చదివిందే ఆమె చదువు. రాత్రి తండ్రి చేసే గొడవతో, పగలు కాలేజీకి వెళ్లి రావడంతో చదవడం కుదిరేది కాదు. ∙∙ దీపశిఖ టెన్త్‌లో ఉండగా ఓ రోజు స్కూలుకు ‘చైల్డ్‌లైన్’ అధికారులు వచ్చారు. ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా అని పిల్లల్ని అడిగారు. దీపశిఖ తన సమస్య గురించి చెప్పింది. నాన్న తాగి రావడం, అమ్మ ఏడుస్తూ ఉండటం, తమ్ముళ్లు ముగ్గురూ తన చుట్టూ చేరడం.. అన్నీ చెప్పింది. ఆ మర్నాడే ‘కేరిటస్ ఇండియా’ వాళ్లు వచ్చి దీపశిఖను, మరికొందరు విద్యార్థినులను తమ ఆధ్వర్యంలోని ‘సాంత్వన భవన్’కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తోటి పిల్లల గురించి ఒక్కోటీ తెలుస్తున్నప్పుడు దీపశిఖకు తన కష్టాలు పెద్ద కష్టంగా కనిపించలేదు. తనకు మించిన అభాగ్యులు కూడా లోకంలో ఉన్నారు అనుకుంది. చేతనైతే వాళ్లకు సహాయం చేయాలని కూడా అప్పుడే నిర్ణయించుకుంది. ఏదో ఒక సహాయం. చదువు సహాయం. సేవల సహాయం. కనీసం మాట సహాయం. ఇప్పుడు ఆమెకు ఆన్లైన్లో పిల్లలకు పాఠాలు చెప్పడం అనే సహాయం చేసే అవకాశం వచ్చింది. డిగ్రీ పూర్తయ్యాక ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థల్లో చేరాలని దీపశిఖ ఆశ. ఆమె తమ్ముళ్లు తల్లి దగ్గరే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చదవండి: ‘మా అమ్మాయికి చదువు అక్కర్లేదని గొడవలకు దిగేవారు’ -
ఆకలి మంటల్లో కార్మికులు!
హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల దైనందిన జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా కూలీలు, కార్మికులు, పేదలు, అనాథల పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారవుతోంది. మహమ్మారి కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ రెక్కాడితేగానీ డొక్కాడని పేదల జీవితాలను ఛిద్రం చేసింది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది జియాగూడలోని మేకలమండీ. జియాగూడ మేకలమండీ నిత్యం మేకలు, గొర్రెల క్రయ విక్రయాలతో కిటకిటలాడేది. లాక్డౌన్ కారణంగా మండీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జీవాల దిగుమతి పూర్తిగా నిలిచిపోంది. దీంతో జియాగూడ మేకలమండీ నిర్మానుష్యంగా మారింది. లాక్డౌన్ సడలింపు ఉన్నా అది కొన్ని గంటలు మాత్రమే కావడంతో జీవాలు మండీకి రాకపోగా వచ్చే 1, 2 లారీలలో 300లకు పైగా జీవాలతో కార్మికులకు పూట గడవడం లేదు. రోజూ 20 వేలకుపైగా కార్మికులు మండీలో వివిధ పనులతో ఉపాధి పొందుతుంటారు. వచ్చే జీవాలు కూడా నాగ్‌పూర్, మహారాష్ట్రాల నుంచి మండీకి దిగుమతి కావాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు మండీకి రావడం లేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే స్వల్ప జీవాల విక్రయాలు కార్మికులకు పొట్ట నిండక పూటగడవడమే గగనమైంది. కార్మికుల ద్వారా శుభ్రపరచిన మటన్ నగరంలోని హోటల్స్, మాల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్, నాన్‌వెజ్ హోటల్స్ తదితర మటన్ దుకాణాలకు మండీ నుంచే ఎగుమతి అవుతుంది. లాక్‌డౌన్‌తో హోటల్స్, మాల్స్, మటన్ దుకాణాలు మూతపడటంతో మండీలో కొనుగోలు చేయడానికి ఎవరూ రావడం లేదు. దిగుమతి అంతంత మాత్రమే, సప్లయ్ అంతమాత్రమే కావడంతో కార్మికులకు ఉపాధి లభించక ఎంతో మంది మండీకి వచ్చి తిరిగి వెళ్తున్నారు. కరోనా, లాక్డౌన్లతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉచితంగా ప్రతి ఆధార్ కార్డుదారునికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేపట్టాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి కాలయాపన చేస్తుండటం దారుణమని జియాగూడ మాజీ కార్పొరేటర్ ఎ.మునేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
Photo Feature: వలసజీవి కష్టం.. పెళ్లిబట్టలుగా పీపీఈ కిట్లు
కరోనా మహమ్మారి దెబ్బకు వలస కార్మికులు జీవితాలు తలక్రిందులయ్యాయి. కరోనా కట్టిడికి విధించిన ఆంక్షలతో నగరాల్లో ఉపాధి కరువై తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. కాగా, కరోనా కాలంలోనూ కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. ఇదిలావుంచితే కరోనా విలయంతో పెళ్లిళ్లు నిరాడంబరంగా జరుగుతున్నాయి. వధూవరులు పీపీఈ కిట్లనే పెళ్లిబట్టలుగా ధరించాల్సిన ఆగత్యం ఏర్పడింది. -
చివరి చూపు అయినా దక్కాలి కదా!
వలస కార్మికులు ఇళ్లు చేరడానికి సహాయపడుతున్నాడు. ఆకలి బాధ తీరుస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఊపిరి (ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సరఫరా) పోస్తున్నాడు. మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో సాయంతో ముందుకు వచ్చాడు.. మనిషి చనిపోతే.. వేరే ఊర్లో ఉండే అయినవాళ్లు వచ్చేలోపు భౌతికకాయాన్ని భద్రపరిచే వీలు లేక అంత్యక్రియలు చేస్తుంటే.. భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్సులు ఇవ్వాలనుకున్నాడు. రీల్ లైఫ్‌లో సోనూ సూద్ విలన్. రియల్ లైఫ్‌లో హీరో. ఇవన్నీ చేయడానికి సోనూ వెనక ఉన్నది ఎవరు? ఏ పొలిటికల్ పార్టీ ఉంది? ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సోనూ సూద్ పలు విషయాలు చెప్పారు. ► మనిషి తన ఇల్లు చేరుకోవడానికి, ప్రాణాపాయంలో ఉంటే బతికి బయటపడటానికి మీకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనిషి కన్నుమూశాక కుటుంబ సభ్యులకు ‘చివరి చూపు’ దక్కాలనే ప్రయత్నం మొదలుపెట్టారు.. ఈ కొత్త సహాయం గురించి? సోనూ సూద్: నేను చిన్న టౌన్ (పంజాబ్‌లోని మోగా) నుంచి వచ్చాను. నగరాలతో పోల్చితే పట్టణాల్లో, గ్రామాల్లో సౌకర్యాలు తక్కువగా ఉంటాయని తెలిసినవాడిని. ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైమ్‌లో ఒకచోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లడం ఎంత ఇబ్బందో తెలిసిందే. గ్రామాల్లో ఉన్నవాళ్లు చనిపోతే సిటీలో ఉంటున్న వాళ్ల దగ్గర బంధువులు వెళ్లడానికి ఆలస్యం అవుతోంది. ఈలోపు భౌతికకాయన్ని భద్రపరిచే సౌకర్యం లేకుండా అల్లాడుతున్నారు. అయినవాళ్లు రాకముందే అంత్యక్రియలు జరిపించేస్తున్నారు. ‘చివరి చూపు’ అయినా దక్కాలి కదా! అది కూడా దక్కకపోతే ఆ బాధ జీవితాంతం ఉండిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది మాకు ఈ విషయం గురించి ఫోన్ చేసి చెప్పారు. అందుకే ‘డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్’లను పంపాలనుకున్నాం. అడిగినవాళ్లకు అడిగినట్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. ► దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందజేయాలనే ఆలోచన గురించి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువమంది కరోనా బాధితులు ఆక్సిజన్ దొరక్క కన్నుమూస్తున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కోసం దేశవ్యాప్తంగా మాకు మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ప్యాన్ ఇండియా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ గురించి ఆలోచించాం. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తగ్గించి కోవిడ్ బాధితులకు సహాయం చేయడానికి దాదాపు 20కి పైగా ఆక్సిజన్ ప్లాంట్స్‌ను ఆరంభించనున్నాం. ► గొప్ప నాయకుడు భగత్ సింగ్ పుట్టిన ప్రాంతానికి చెందిన మీరు హిందీలో తొలి చిత్రం ‘షాహిద్–ఇ–అజామ్’లో భగత్ సింగ్ పాత్ర చేశారు. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా మిమ్మల్ని చాలామంది భగత్ సింగ్‌తో పోల్చడంపై మీ ఫీలింగ్? నన్ను గొప్ప గొప్ప వ్యక్తులతో పోలుస్తున్నారు. దాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. అలాగే ప్రజల నమ్మకం నా బాధ్యతను ఇంకా పెంచుతోంది. నా సాయం కోరుకున్నవారు ఏ మారుమూల ప్రాంతాన ఉన్నా వారిని చేరుకోవాలనే నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ► సహాయ కార్యక్రమాలు చేయడానికి మా అమ్మానాన్న స్ఫూర్తి అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఏ విధంగా వారిని చూసి స్ఫూర్తి పొందారో ఉదాహరణ చెబుతారా? నా చిన్నతనం నుంచే మా అమ్మనాన్నల ద్వారా ఇతరులకు సాయం చేయడాన్ని నేర్చుకున్నాను. ఇతరులకు సహాయపడటానికి ఇద్దరూ ఎప్పుడూ ముందుండేవారు. అలా నా కళ్ల ముందే నాకో మంచి ఉదాహరణ ఉంది. నాలోనే కాదు.. నా భార్య, నా కొడుకులో కూడా పరోపకార గుణం ఉంది. ప్రతి ఒక్కరం మన సామర్థ్యం మేరకు ఇతరులకు సాయం చేయాల్సిన సమయం ఇది. ఈ కరోనా టైమ్‌లో ‘గివింగ్ బ్యాక్ టు సొసైటీ’ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ► ఇతరులకు సహాయపడాలంటే గొప్ప మనసు మాత్రమే కాదు.. ఆర్థిక బలం కూడా ఉండాలి. మీకు ఎక్కడ్నుంచి ఆర్థిక బలం వస్తోంది? తోటివారికి సాయపడాలంటే మనం సంపన్నులమై ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మంచి మనసు ఉంటే చాలు. మనం చేస్తున్న హెల్ప్‌ను చూసి ఎవరైనా స్ఫూర్తి పొంది, సహాయం చేస్తే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఎవరికి సాయం చేయాలో తెలియక? ఎలా చేయాలో తెలియక కొందరు మా ‘సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్’కు డబ్బు అందజేస్తున్నారు. చూపు లేని ఓ అమ్మాయి తన ఐదు నెలల పెన్షన్ 15000 రూపాయలు, రైల్వేస్‌కు చెందిన మరో హ్యాండీకాప్డ్ పర్సన్ 60 వేల రూపాయలను మా ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దీన్నిబట్టి మన చుట్టూ ఎంతమంది మంచివాళ్లు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ► మీ సాయం పొందినవాళ్లల్లో కొందరు వాళ్ల పిల్లలకు మీ పేరు పెట్టుకున్నారు.. ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ (మహాపురుషుడు, దేవుడు, దేవ దూత వంటి అర్థాలు) అని మీరు పుస్తకం రాసినా మీకు కొందరు గుడి కట్టారు. ఎలా ఉంది? నా తల్లిదండ్రులు భౌతికంగా లేరు. వాళ్లు ఎక్కడ ఉన్నా ఇదంతా చూసి, ఆనందపడతారు. నాక్కూడా జీవితంలో ఏదో సాధించాననే ఫీలింగ్ కలిగింది. కానీ ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఇక నా పుస్తకం ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ విషయానికి వస్తే.. అవును.. నేనేం దేవుణ్ని కాదు. ఐయామ్ ఎ కామన్‌మ్యాన్. ఓ సామాన్య వ్యక్తిగా ప్రజలతో నేను కనెక్ట్ అయ్యాను. ► ఇలా విరివిగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికే ఇలా చేస్తారని కొందరు భావిస్తారు. మరి.. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? నిజమే... నేను రాజకీయాల్లోకి రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నానని కొందరు ఊహించుకుంటున్నారు. ఇంకొందరు నేను రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచి చేయగలనని చెబుతున్నారు. కానీ మంచి పనులు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. కానీ భవిష్యత్‌లో ఎవరు ఏం అవుతారో? ఏం జరుగుతుందో అంచనా వేయలేం. చూద్దాం.. రాబోయే రోజుల్లో నా జీవితం ఏ దారిలో వెళుతుందో! ► మీ ఈ సేవల వెనక ఓ రాజకీయ పార్టీ ఉందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.. మీ సేవా కార్యక్రమాలు చూస్తున్న ప్రజలు మీరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు సేవ చేయాలనే గుణం ఉంటే వెనక ఎవరైనా ఉంటారా? వస్తారా? అనే ఆలోచన రాదు. సహాయం చేయడం మొదలుపెట్టేస్తాం. మనం కామన్ మ్యాన్‌గా ఉన్నప్పుడే ఎంతో చేయగలుగుతున్నాం.. అదే రాజకీయాల్లో ఉంటే ఇంకా చేయొచ్చు. కానీ నేను పాలిటిక్స్ గురించి ఇప్పుడేమీ ఆలోచించడంలేదు. అలాగని నాకు రాజకీయాల మీద వ్యతిరేక భావన లేదు. ప్రజలు కోరుకున్నట్లు జరుగుతుందేమో భవిష్యత్ చెబుతుంది. ► అరుంధతి, సీత వంటి సినిమాల్లో ఓ విలన్‌గా హీరోయిన్లను చాలా ఇబ్బందులపాలు చేశారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని సోదరుడిలా భావిస్తున్నారు... నా సోదరీ మణులకు థ్యాంక్స్. ఆ చిత్రాల్లో ఆ పాత్ర లను నాకు ఆ సినిమాల దర్శకులు ఇచ్చారు. కానీ రియల్ లైఫ్‌లో దేవుడు నాకో పవర్ఫుల్ స్క్రిప్ట్ రాశా డు. ఆ పాత్రలో జీవిస్తున్నాను. దేవుడి ఇచ్చిన ‘మోస్ట్ బ్లెస్డ్ రోల్’ ఇది అని భా విస్తున్నా. ► బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఫ్రీజర్ బాక్సుల పంపిణీ.. వలస కార్మికులను ఊళ్లకు పంపించడం.. ఇన్ని చేయడం సులభం కాదు.. మాకు మంచి నెట్వర్క్ ఉంది. మా టీమ్‌లో కొందరికి ట్రైనింగ్ ఇచ్చాం. మరికొందరు నా గైడ్ లైన్స్‌ను ఫాలో అవుతారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి వెంటనే సహాయం అందజేయడంలో వీరి పాత్ర చాలా కీలకం. వారికి ధన్యవాదాలు. అలాగే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు దేశంలోని ప్రజలందరూ ఒక తాటిపైకి రావాలన్నదే మా ఆశయం. సమష్టిగా పోరాడే సమ యం త్వరలో రావాలని కోరుకుంటున్నా. ► మీ బయోపిక్ తీయడానికి కొందరు ఉత్సాహంగా ఉన్నారు. మీకిష్టమేనా? బయోపిక్ గురించి నాతో సంప్రదింపులు జరిపారు. ప్రజలు నా బయోపిక్‌ను చూడాలనుకుంటున్నారని వారు చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి అదేం లేదు. కొన్నేళ్ల తర్వాత ప్రజలు నా గురించి ఏం అనుకుంటారో చూడాలి. ► ఇటీవల మీకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది? పాజిటివ్ వచ్చిన విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఫోన్ ద్వారా చాలామందికి సహాయం చేశాను. సహాయం కావాల్సిన వారు నా ఫోన్‌కు సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. వారికి సహాయం చేయాలనే పట్టుదల నాలో తగ్గలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా ఇరవైగంటలకు పైగా నేను ఫోన్‌తో కనెక్ట్ అయి, మా టీమ్‌తో టచ్‌లో ఉన్నాను. నా ఫోన్‌కి ప్రతిరోజూ దాదాపు 40 వేల మేసేజ్‌లు వస్తుంటాయి. కానీ ప్రతి ఒక్కరికీ మేం సహాయం చేయలేకపోవచ్చు. అయితే ఎవరికి ముందుగా అవసరం ఉందో వారిని గుర్తించి, ముందు వారిని కాంటాక్ట్ అవుతాం. మా సహాయం పొందిన చాలామంది తామంతట తామే ఫోన్ చేసి పక్కవారికి సాయం చేస్తాం అంటున్నారు. అలాగే కొందరు చేశారు కూడా. చాలా మంది వలస కూలీలకు మేం సహాయం చేశాం. వారిలో చాలామంది మాకు టచ్‌లో ఉన్నారు. అవసరమైనప్పుడు మేం వారికి ఫోన్ చేసి ‘మీరు సహాయం పొందారు. ఇప్పుడు మీరు చేయాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పినప్పుడు పాజటివ్‌గా స్పందించారు... స్పందిస్తున్నారు. ఈ మంచి కార్యక్రమాల్లో మా టీమ్ మాత్రమే కాదు.. ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, వార్డ్ బాయ్స్, హాస్పిటల్ యాజమాన్యాలు.. ఇలా అందరికీ భాగం ఉంది. – డి.జి. భవాని -
Photo Feature: వ్యాక్సిన్ వెతలు.. మీకో దండం!
కరోనా వ్యాక్సిన్ కోసం తిప్పలు తప్పడం లేదు. టీకాల కోసం ఆరోగ్య కేంద్రాల ముందు జనం బారులు తీరుతున్నారు. మరోవైపు కోవిడ్ కట్టడికి విధించిన ఆంక్షల కారణంగా వలస కార్మికులు, బడుగుజీవుల బతుకు ఆగమాగమైంది. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు కోరుతున్నారు. -
వలస జీవుల సంక్షోభ పరిష్కారం ఎలా?
దేశంలో అభివృద్ధి జరుగుతున్న తీరు, అది అమలవుతున్న తీరు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలస కార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందుకే పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా మన విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటు లేదు. భారత్‌లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస జీవుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృత స్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది. ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు. బాల్యంలో, మా హౌసింగ్ సొసైటీ తోటలో ఆడుకుంటున్నప్పుడు, మా కాలనీలో పనిమనుషులు, సేవకులు తమ తమ గ్రామాల గురించిన జ్ఞాపకాలను పంచుకునేవారు. కొంకణ్ లేదా మహారాష్ట్ర ఇతర ప్రాంతాల గ్రామాల్లోని మామిడి తోటలు, ఏపుగా పెరిగిన వరి పొలాలు, విశాలమైన గృహాల గురించి వారు రమ్యంగా వర్ణిస్తూ పోయేవారు. పెరిగి పెద్దవుతున్నప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన శ్రామికులను కలిసే అవకాశం తటస్థించినప్పుడు తమ గ్రామాల్లోని ఒకప్పుడు తాము నివసించిన ఇళ్ల గురించి వారు చెప్పేవారు. వారి జ్ఞాపకాలు విన్నప్పుడల్లా నాకు ఒకటే ఆలోచన వచ్చేది. కొంకణ్ లేదా కేరళ లేదా హిమాచల్ ప్రదేశ్ అద్భుతమైన పర్వతప్రాంతాలు, లేక ఉత్తర బెంగాల్‌కి చెందిన సుందరమైన గ్రామాల నుంచి ప్రజలు వలస వచ్చి, అకుపచ్చదనం కానీ, చోటు కానీ, కనీస గౌరవం కానీ ఉండని బాంబే మురికివాడల్లో ఎందుకు కనాకష్టంగా బతుకుతున్నారు అనే ప్రశ్న నాలో రగిలేది. కరోనా తొలివేవ్ ఉధృతమైన 2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో, 2021 ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కాలంలో వలస కార్మికులు భారీ ఎత్తున తమ తమ ఊళ్లకు వెళ్లిపోవడం చూసినప్పుడు జాతీయ రాజధాని సరిహద్దుల్లో భారత రైతులు కొనసాగిస్తున్న నిలకడైన పోరాటంతో వలస కార్మికుల జీవితం ముడిపడి ఉందనిపించక మానదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం, వాటిపై అవిరామంగా పోరాడుతుండటం పూర్తిగా చట్టబద్ధమైనదేననిపిస్తుంది. రైతులు ఈ మూడు చట్టాల వెనుక ఉన్న తర్కాన్ని, అంతరార్థాన్ని, అంతర్జాతీయ కార్పొరేట్ పెట్టుబడితో ఈ చట్టాల అనుసంధానాన్ని చక్కగా అర్థం చేసుకున్నారని బోధపడుతుంది. భారతీయ అసంఘటిత శ్రామికులు భారత శ్రామిక శక్తిలో 90 శాతం వరకు అసంఘటిత రంగంలో ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. వీరిలో 75 శాతం వరకు వలస శ్రామికులే. ఇంతవరకు సంఘటిత రంగంలో ఉన్న కొద్ది శాతం శ్రామికులు కూడా ఇప్పుడు శరవేగంగా అసంఘటి రంగం కోరల్లోకి వెళ్లిపోతున్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న ఈ అసంఘటిత రంగంలోని శ్రామికుల హక్కులు, భద్రత, గౌరవాన్ని పణంగా పెట్టి మరీ దేశంలో పారిశ్రామికీకరణ తొలి దశ నిర్మితమైందని నగరాల్లోని శ్రామికులను చూస్తే అర్థమవుతుంది. అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో శ్రామికులకు ఏమాత్రం భద్రత ఉండదు. ఈ రంగంలోని శ్రామికులు రోజుకు 12 గంటలపాటు నెలపొడవునా పనిచేయాల్సి ఉంటుంది. లేదా కొన్ని రోజులు మాత్రమే పని దొరుకుతుంది. ఏరోజైనా పనిలోకి రాకుండా ఉండే స్వేచ్ఛ శ్రామికులకు ఉంటుంది కానీ అలాంటివారికి ఆరోజు తిండి దొరికే అవకాశం వట్టిమాటే. ఇంత భయంకర వాస్తవం కొట్టొచ్చినట్లు కనబడుతుండగా దేశ పాలనా పగ్గాలు చేపట్టిన వారు 2020 మార్చి నెలలో కేవలం 4 గంటల సమయం మాత్రమే ఇచ్చి దేశ రవాణా వ్యవస్థను సంపూర్ణంగా నిలిపివేస్తూ కఠినాతికఠినమైన లాక్ డౌన్‌ను అంత నిరంకుశంగా ఎలా విధించగలిగారన్నది ప్రశ్నగానే మిగులుతుంది. భారతీయ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగ వాటా 1950 లలో 55.3 శాతంగా ఉండగా, 2000 నాటికి అది 21.8 శాతానికి పడిపోయిందన్నది వాస్తవం. కానీ వ్యవసాయంపై ఆధారపడిన జనాభా, ఇతర కార్యకలాపాలు ఆ స్థాయిలో తగ్గిపోలేదు. 1993–94లో వ్యవసాయంపై ఆధారపడిన వారి జనాభా 62.8 శాతం కాగా, 2015 నాటికి 47 శాతానికి పడిపోయింది. జీడీపీ, ఉపాధి రెండింటి రీత్యా చూస్తే వ్యవసాయం స్తంభనకు గురైందని, ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాన్ని దాటుకుని, పరిశ్రమలు, సేవారంగాలకు తరలిపోతోందనడానికి ఇది కారణం కావచ్చు. దేశంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉందని, ఈ రంగంలో పనిచేస్తున్నవారు కోలుకోలేనంతగా దెబ్బ తింటున్నారనడంలో సందేహమే లేదు. ఈ సంక్షోభమే ప్రత్యేకించి 1990ల నుంచి ఆయా ప్రభుత్వాల రాజకీయ ప్రాధమ్యాలను, విధానాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ప్రభుత్వ విధానాల్లో, బడ్జెట్లలో వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం వ్యవస్థాగతంగానే కొనసాగుతూ వచ్చిందని సులభం గానే బోధపడుతుంది. ఆహార ఉత్పత్తుల ధరలు కాస్త పెరిగితే చాలు దేశంలో కొంపలంటుకు పోయినట్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వాటి ధరలను తగ్గిస్తూ రావడం దశాబ్దాలుగా పాలనా నిర్ణేతలకు, పరిశ్రమ దారులకు అలవాటైపోయింది. అదే సమయంలో వ్యవసాయానికి తప్పనిసరైన ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్లు, డీసెల్, విద్యుత్ వంటి పారి శ్రామిక ఉపకరణాల ధరలు కొండెక్కుతున్నాయి. వ్యవసాయం ప్రాధాన్యతను కోల్పోయిందని సామెత చెబుతున్నా 86 శాతం భూమికి ప్రాధాన్యం వహిస్తున్న సన్నకారు రైతులు తాము వ్యవసాయ భూమికి దూరం కావడం లేదని భావిస్తూ వస్తున్నారు. చివరి క్షణంలో మాత్రమే వారు పొలాలను వదిలి నగరాల బాట పడుతున్నారు. భూమికి రైతు కట్టుబడటం అత్యంత ఉద్వేగాల కారణంగానే జరుగుతోందని తరచుగా చెబుతుంటారు. అందుకే రైతు కుటుంబాలు తరాలుగా సేద్యానికి కట్టుబడి ఉంటారు. అయితే వ్యవసాయాన్ని, భూమిని రైతు ఎందుకు వదిలిపెట్టలేడు అనే అంశాన్ని ప్రస్తుత కిసాన్ అందోళన్ చక్కగా విడమర్చి చెప్పింది. ఎందుకంటే భూమి ఒక ఉత్పత్తి సాధనం. ఇది ఇతర వనరులను సృష్టించిపెట్టే వనరు. పైగా ఇది సజీవ వనరు. నిరంతరం జీవితాలను సృష్టిస్తుంటుంది. పైగా గత ఏడు దశాబ్దాల కాలంలో సాగు భూమికి దూరమైన కోట్లాదిమంది అనుభవాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. మనుగడ కోసం తమ భూమిని అటవీ వనరులను దూరం చేసుకుని వలస వెళ్లినవారు అక్కడ బతకడానికి వనరులు, ఉపాధి లేక అల్లాడుతూ వస్తున్నారు. డబ్బు భూమికి ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదనే అనుభవం డ్యాములు, గనులు, జాతీయ రహదారుల కారణంగా తమ భూములు కోల్పోయి నగరాల బాట పట్టిన లక్షలాది మంది రైతుల వ్యధలు కళ్లారా చూస్తూ ఇప్పటికీ కొద్దిగా భూమిని కలిగి ఉన్న రైతులు భూమికి దూరం కావడమనే ఆలోచననే మదిలోకి రానివ్వడం లేదు. అందుకే కిసాన్ ఆందోళన్‌లో పాల్గొంటున్న రైతులు ఒకే విషయం చెబుతూ వస్తున్నారు. మేం ఈ భూమికి యజమానులం, రైతులం. మాకు మేమే బాస్‌లం. కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలు అమలైనట్లయితే కొద్ది సంవత్సరాల్లోనే మేం సేవకులుగా, కార్పొరేట్ బాస్‌ల పనిమనుషులుగా మారకతప్పదు. మరొకరి భూమిపై మేం పనిచేసి బతకాలనుకోవడం లేదు. దేశంలో అభివృద్ధి జరుగుతున్న తీరు, అది అమలవుతున్న తీరు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలస కార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందుకే పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా మన విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం బైపాస్ చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటు లేదు. 2016–17 నాటికి దేశంలో పది కోట్లమంది వలస కార్మికులున్నారని అంచనా వీరిలో ఎస్సీ, ఎస్టీలకు చెందినవారే ఎక్కువ. 1989 నుంచి అమల్లోకి వచ్చిన అంతర్రాష్ట్ర వలసల చట్టం వలసకార్మికులకు కాస్తంత ఉపశమనం కలిగించినప్పటికీ గత కొన్నేళ్లుగా ఇది పనికిరాకుండా పోయింది. భారత్‌లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. అలాగని అపరిచితమైనదీ కాదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస కార్మికుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృత స్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది. ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు. సుజాతా గొటోస్కర్ శ్రమ, జెండర్, సంస్థాగత ప్రక్రియలపై పరిశోధకురాలు -
చేతులెత్తేసిన కేంద్రం, వలస కార్మికులకు నో ఫ్రీ రేషన్
సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది మాదిరిగా దేశ వ్యాప్త సంపూర్ణ లాక్డౌన్ లేదని, పరిశ్రమలు కూడా నడుస్తున్నందున ఈసారి వలస కార్మికులకు ఉచితంగా ఆహారధాన్యాలను ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై)కింద 80 కోట్ల రేషన్ కార్డుదారులకు రెండు నెలల (మే, జూన్)పాటు అదనంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం అమలు తో బహిరంగ మార్కెట్లో ఆహారధాన్యాల ధరలపై ఎటువంటి ప్రభావం లేదని పేర్కొంది. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. పీఎంజీకెఎవై పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. సోమవారం నాటికి 34 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 15.55 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డిపోల నుంచి తరలించుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు అన్ని రాష్ట్రా లు మే, జూన్ నెలల పీఎంజీకేఏవై ఆహార ధాన్యాల పంపిణీని జూన్ చివరి నాటికి పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సూచించాయన్నారు. ఆహార ధాన్యాల పంపిణీ పురోగతిపై ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్రాల ఆహార కార్యదర్శులు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించినట్లు వివరించారు. అంతేగాక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ప్రారంభించిన 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా ల్లో 69 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. రైతుల ఖాతాలకు నగదు దేశంలో గోధుమల సేకరణతో ఇప్పటివరకు రూ.49,965 కోట్లను నగదు బదిలీ చెల్లింపులో నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేశామని సుధాన్షు పాండే తెలిపారు. ఇందులో పంజాబ్‌లో రూ.21,588 కోట్లు, హరియాణాలో రూ.11,784 కోట్లు నేరుగా బదిలీ చేసినట్లు కార్యదర్శి తెలిపారు. కోవిడ్ కారణంగా గోధుమ, బియ్యం నిల్వలను బహిరంగ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, ప్రభుత్వం 2021–22 సంవత్సరానికి ఓఎంఎస్ఎస్(డి) విధానాన్ని సరళీకృతం చేసిందని పాండే పేర్కొన్నారు. కోవిడ్ –19 మహమ్మారి సమయంలో 928.77 లక్ష మెట్రిక్ టన్నుల(ఎల్ఎమ్టీ) ఆహార ధాన్యాలు, 363.89 ఎల్ఎమ్టీ గోధుమలు, 564.88 ఎల్ఎమ్టీ బియ్యం గతేడాది సెంట్రల్ పూల్ నుంచి పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. చదవండి: డబుల్ మాస్క్‌పై కీలక మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం -
మధుర జ్ఞాపకాలతో కాదు.. చేదు జ్ఞాపకాలతో వీరి బాల్యం
సాక్షి, హైదరాబాద్ (గోల్కొండ) : ముక్కుపచ్చలారని చిన్నారుల బాల్యం ఫుట్‌పాత్‌లపైనే గడిచిపోతున్నది. మధుర జ్ఞాపికాలను మిగిల్చే బాల్యం వీరికి చేదు జ్ఞాపకాలను మిగులుస్తోందనం నిర్వివాదాశం. కరోనా నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలో పని లేక పస్తులుంటున్న కార్మికులు పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చారు. ఇక్కడా వారికి ఉపాధి దొరకడం గగనమైపోయింది. నగరానికి వలస వచ్చిన వీరు ఫుట్‌పాత్‌లు, ఫ్లై ఓవర్ల కింద డివైడర్ల పైనే కాపురం ఉంటున్నారు. ప్లాస్టిక్ ఆట బొమ్మలు, బెలూన్లు అమ్ముకుంటూ వీరు అతి కష్టంగా బతుకీడుస్తున్నారు. రాత్రంతా ఫుట్‌పాత్‌లపై ఉంటూ బెలూన్లు, ఇతర ప్లాస్టిక్ ఆట వస్తువులు తయారు చేసుకుంటారు. ఉదయమే ఫుట్‌పాత్‌లపై రొట్టెలు వేసుకుని వారు తిని, పిల్లలకు తినిపిస్తారు. అనంతరం కుటుంబ పెద్దలంతా ఆట బొమ్మలను అమ్మడానికి వెళ్లిపోతారు. ఒక వ్యక్తిని పిల్లలను చూడటానికి వదిలి వెళ్తారు. పిల్లలు ఫుట్‌పాత్‌ల మీదనే స్నానం చేస్తూ, దానినే ఆడుకుంటూ ఉంటారు. రాత్రి మళ్లీ తమ తల్లిదండ్రుల ముఖాలు చూస్తారు. టోలిచౌకి చౌరాస్తా, షేక్‌పేట్ నాలా, రేతిబౌలి రింగ్ రోడ్డు, మెహిదీపట్నం పీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాంతాలలు వలస కుటుంబాలు ఫుట్‌పాత్‌లపై, ఫ్లై ఓవర్ల కింద డివైడర్లపై నివసిస్తాయి. ( చదవండి: ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. బాలిక కేకలు వేయడంతో! ) -
వాళ్ల విషయంలో స్పందిస్తున్న కార్మికశాఖ
సాక్షి, మేడ్చల్ జిల్లా: వలసజీవుల సమాచారాన్ని కార్మికశాఖ సేకరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లి తిరిగొచ్చిన కార్మికుల వివరాలను ఆరా తీస్తోంది. ఈ మేరకు మున్సిపల్ సర్కిళ్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో కార్మికుల సమాచారాన్ని రాబడుతోంది. బతుకు దెరువు కోసం వెళ్లిన వారిలో ఇప్పటి వరకు ఎంత మంది స్వస్థలాలకు చేరారనే విషయాన్ని క్షేత్రస్థాయి సర్వేలో తెలుసుకుంటోంది. వివరాలను సేకరిస్తున్న కార్మికశాఖ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కార్మిక శాఖ ఈ సమాచారాన్ని సేకరిస్తోంది. జీవనోపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన కార్మికులు, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఏ రాష్ట్రం నుంచి తిరిగి వచ్చారు? తదితర వివరాలను సమీకరిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడలతోపాటు ఎంపిక చేసిన ప్రాంతాలు, బస్తీల్లో కార్మిక శాఖకు చెందిన సిబ్బంది, ఆయా పురపాలక సంఘాలు, జీపీల ఉద్యోగుల సాయంతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు, కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటంతోపాటు ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. భవన నిర్మాణ రంగంతోపాటు వివిధ పరిశ్రమల్లో పనుల కోసం వచ్చిన వలస కార్మికులు, కూలీలు, వారి కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నట్లు కరోనా తరుణంలో అధికార యంత్రాంగం గుర్తించి అన్ని విధాల సహకారాలు అందించింది. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న దశలో వలస కార్మికులు, కూలీల వివరాల నేపథ్యంలో మరోసారి వారికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ( చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ) -
వలస కూలీలకు భరోసా
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించే వలస కూలీలను కాపాడుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది లాక్‌డౌన్‌తో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో అన్ని చోట్లా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా రాష్ట్ర పారిశ్రామిక రంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశాలు లేవని, కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తూ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చంటూ పారిశ్రామికవేత్తలకు భరోసాను కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో ప్రధానంగా టెక్స్టైల్, గ్రానైట్, నిర్మాణ రంగాల కార్యకలాపాల్లో లక్షలాది మంది వలస కూలీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటనలు వస్తుండటంతో రాష్ట్రంలోని యాజమాన్యాలు, వలస కూలీల్లో ఒకరకమైన అభద్రతా భావం నెలకొని ఉన్న విషయం గమనించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. పనిచేసే చోట కోవిడ్ నిబంధనలు ఎలా పాటించాలో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస కూలీలు తరలి వెళ్లిపోతున్నారని, ఏపీలో అలాంటి పరిస్థితులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక క్వారంటైన్లు.. లాక్డౌన్ తర్వాత గత నవంబర్ నెల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం కళకళలాడుతోంది. ఇప్పుడు సెకండ్ వేవ్ దెబ్బతో వలస కూలీలు మారోమారు వెళ్లిపోకుండా ఉండటానికి యాజమాన్యాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం యూనిట్లలో పనిచేసే కూలీలకు ప్రత్యేక వైద్యం, వసతిని ఏర్పాటు చేస్తున్నాయి. కూలీల్లో ఎవరికైనా కోవిడ్ సోకితే వారి నుంచి ఇతరులకు విస్తరించకుండా ఉండటం కోసం పరిశ్రమల్లోనే ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దండ ప్రసాద్ తెలిపారు. మార్చి నెల నుంచి వలస కూలీల్లో ఆందోళన మొదలైనప్పటికీ ఇంత వరకు ఎవ్వరూ వెనక్కి వెళ్లలేదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఏపీ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.కోటేశ్వరరావు తెలిపారు. గత లాక్డౌన్ సమయంలో తిరిగి వెళ్లిపోయిన వలస కూలీల్లో 65 శాతం మంది వెనక్కి వచ్చారని, ఇప్పుడు వారు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
ఉపాధి పనుల్లో... వలస కార్మికులకు కోటా
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పనుల్లో వలస కార్మికులకు కోటా ఏర్పాటు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నియమించిన అధ్యయన బృందం సిఫారసు చేసింది. భారతదేశంలో వలస కార్మకుల సామాజిక భద్రత, ఆరోగ్య హక్కులపై పరిశోధన, అధ్యయనం చేయాలంటూ అక్టోబరు 18, 2019న ఢిల్లీలోని కేరళ డెవలప్మెంట్ సొసైటీకి ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, మహారాష్ట్రల్లోని నాలుగు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన మొత్తం 4,400పై ఈ అధ్యయనం నిర్వహించారు. అనంతరం అధ్యయన బృందం కేంద్ర కార్మికశాఖ, గ్రామీణాభివద్ధిశాఖ, వినియోగదారుల వ్యవహారాలు శాఖలతోపాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పలు సిఫారసులు చేసింది. ఈ అధ్యయనాన్ని ఎన్హెచ్ఆర్సీ ఇటీవల ఆమోదించింది. కార్మికశాఖకు సిఫారసులు జాతీయ స్థాయిలో వలస కార్మికుల సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం నిమిత్తం అంతర్ రాష్ట్రాల వలస మండలి ఏర్పాటు చేయాలి. అంతర్ రాష్ట్ర వలస కార్మికులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాలి. 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలి. గ్రామీణాభివద్ధి శాఖ: ఉపాధి హామీ పథకంలో వలస కార్మికులకు కోటా కేటాయించాలి. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని వలస కార్మికుల కోసం మెరుగుపరచాలి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ వారు వన్ నేషన్–వన్ రేషన్ కార్డు ఫాస్ట్ ట్రాక్‌లో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు: కార్మిక విభాగాలు తప్పనిసరిగా వలస కార్మికుల జాబితా రూపొందించాలి. వలస కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించాలి. వాటిని పనిచేసే చోట ఏర్పాటు చేసేలా చూడాలి. విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం వలస కార్మికుల పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. వలసకార్మికుల నైపుణ్యాన్ని గుర్తించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. వలస కార్మికుల సొంత రాష్ట్రాలు కానీ, పనిచేసే చోట అక్కడి రాష్ట్రాలువారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ వలస కార్మికుల కోసం వారి సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా రిమోట్ ఓటింగ్ హక్కు కల్పించాలి. ( చదవండి: వలసపక్షుల బెంగ ) -
లాక్డౌన్ భయం.. సొంతూళ్లకు తరలుతున్న వలస కూలీలు
సాక్షి, హైదరాబాద్ : అవే రోజులు.. అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చితి.. ఊరు కాని ఊరిలో ఉండటం కంటే సొంతూరికి పోయి బలుసాకు తినైనా బతకొచ్చనే ధీమాతో నగరంలోని వలసజీవులు మరోసారి పల్లెబాట పడుతున్నారు. సొంతూళ్లకు పయనమవుతున్నారు. లారీ, బస్సు, రైలు, కారు, క్యాబ్.. ఏదో ఒకటి దొరికిందాంట్లో బతుకు జీవుడా అంటూ బయలుదేరుతున్నారు. మహమ్మారి మహోగ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ‘నైట్ కర్ఫ్యూ’తో కట్టడి విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు జనం బారులుదీరుతున్నారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ వాహనాల యజమానులు చార్జీల రెట్టింపుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఏ క్షణంలో.. ఏం జరుగుతుందో.. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే జనం ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. ఆకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో రైళ్లు, బస్సులతో పాటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. గత్యంతరం లేక వలస కూలీలు వందలకొద్దీ కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల వలస కూలీలు ప్రాణాలకు తెగించి భార్యా పిల్లలతో మహాపాద యాత్రలు చేశారు. ఈ క్రమంలో కొందరు అసువులు బాశారు. ఆకలి దప్పుల కోసం అలమటించారు. ఈ ఏడాది మరోసారి అలాంటి చేదు అనుభవాలకు గురి కావొద్దనే ఉద్దేశంతోనే చాలా మంది సొంత ఊళ్ల వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా కోవిడ్ ఉద్ధృతి పెరగడంతో పాటు తాజాగా విధించిన రాత్రిపూట కర్ఫ్యూ అందుకు దోహదం చేస్తున్నాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత నగరానికి చేరుకొన్న లక్షలాది మంది కొద్ది నెలల్లోనే తిరిగి సొంత ఊళ్లకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం కావడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ముంబై. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతోనూ రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళతో పయనమవుతున్నారు. ఇళ్లకు చేరేదెలా? ఒకవైపు సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి ఇలా ఉండగా.. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు రాత్రి 9 దాటితే ఇళ్లకు చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ మొదలు కానుంది. అదే సమయానికి సిటీ బస్సులు విధులు ముగించుకొని డిపోలకు చేరుకొనేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా నిలిచిపోనున్నాయి. క్యాబ్‌లు, ఆటోలు కూడా ఆగిపోనున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో సిటీకి వచ్చేవారు గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగా మారనుంది. -
అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో.. వెళ్లిపోతాం సారు
సాక్షి, హైదరాబాద్: అవే రోజులు.. అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చితి.. ఊరు కాని ఊరిలో ఉండటం కంటే సొంతూరికి పోయి బలుసాకు తినైనా బతకొచ్చనే ధీమాతో నగరంలోని వలసజీవులు మరోసారి పల్లెబాట పడుతున్నారు. సొంతూళ్లకు పయనమవుతున్నారు. లారీ, బస్సు, రైలు, కారు, క్యాబ్.. ఏదో ఒకటి దొరికిందాంట్లో బతుకు జీవుడా అంటూ బయలుదేరుతున్నారు. మహమ్మారి మహోగ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ‘నైట్ కర్ఫ్యూ’తో కట్టడి విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు జనం బారులుదీరుతున్నారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ వాహనాల యజమానులు చార్జీల రెట్టింపుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఏ క్షణంలో.. ఏం జరుగుతుందో.. ► గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే జనం ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. ఆకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో రైళ్లు, బస్సు లతో పాటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. గత్యంతరం లేక వలస కూలీలు వందలకొద్దీ కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లారు. ► తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల వలస కూలీలు ప్రాణాలకు తెగించి భార్యా పిల్లలతో మహాపాద యాత్రలు చేశారు. ఈ క్రమంలో కొందరు అసువులు బాశారు. ఆకలి దప్పుల కోసం అలమటించారు. ► ఈ ఏడాది మరోసారి అలాంటి చేదు అనుభవాలకు గురి కావొద్దనే ఉద్దేశంతోనే చాలా మంది సొంత ఊళ్ల వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా కోవిడ్ ఉద్ధృతి పెరగడంతో పాటు తాజాగా విధించిన రాత్రిపూట కర్ఫ్యూ అందుకు దోహదం చేస్తున్నాయి. ► లాక్డౌన్ సడలింపుల తర్వాత నగరానికి చేరుకొన్న లక్షలాది మంది కొద్ది నెలల్లోనే తిరిగి సొంత ఊళ్లకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం కావడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ముంబై, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతోనూ రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళతో పయనమవుతున్నారు. ఇళ్లకు చేరేదెలా? ► ఒకవైపు సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి ఇలా ఉండగా.. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు రాత్రి 9 దాటితే ఇళ్లకు చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ మొదలు కానుంది. అదే సమయానికి సిటీ బస్సులు విధులు ముగించుకొని డిపోలకు చేరుకొనేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా నిలిచిపోనున్నాయి. క్యాబ్‌లు, ఆటోలు కూడా ఆగిపోనున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో సిటీకి వచ్చేవారు గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగా మారనుంది. ( చదవండి: నెగెటివ్‌గా తేలినా మళ్లీ టెస్టు బెటర్: నిపుణులు ) -
వలసపక్షుల బెంగ
నిరుడు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాక కనబడిన దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి క్రమేపీ పెరుగుతున్న జాడలు కనబడటంతో పరిమిత స్థాయిలో కావొచ్చుగానీ... ఒక్కో రాష్ట్రమే లాక్డౌన్లు, రాత్రి పూట కర్ఫ్యూలు విధించటం వైపు అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో అక్కడక్కడ నగరాలు, జిల్లాల్లో కొన్ని పరిమితులతో లాక్డౌన్ విధించారు. కొన్నిచోట్ల రాత్రి పూట కర్ఫ్యూలు విధిస్తున్నారు. పర్యవసానంగా తయారీ రంగ పరిశ్రమలు, దుకాణాలు, నిర్మాణరంగం, చిన్న చిన్న వ్యాపారాలు మూతబడటం లేదా పాక్షి కంగా మాత్రమే పనిచేయవలసివస్తోంది. మహారాష్ట్ర పూర్తి స్థాయి లాక్డౌన్ విషయం ఆలోచిస్తున్న దని చెబుతున్నారు. ఈ పరిణామాలు వలస జీవుల్లో సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది వున్నకొద్దీ తీవ్రమై గతంలో మాదిరే పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తారని భయాందోళనలు ఏర్పడ టంతో వారు స్వస్థలాలకు వెళ్లడం తప్ప మార్గం లేదనుకుంటున్నారు. ఇప్పటికైతే ఈ వలసలు అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కనబడుతున్నాయి. పూర్తి స్థాయి లాక్డౌన్ విధించబోమని... రైళ్లు, బస్సులు యథాప్రకారం నడుస్తాయని ప్రభుత్వాలు వాగ్దానాలిస్తున్నాయి. ఎవరూ రోడ్డున పడే పరిస్థితి వుండదని హామీ ఇస్తున్నాయి. భయపడవద్దని కోరుతున్నాయి. కానీ వాటిని ఎంతవరకూ విశ్వసించవచ్చునో సామాన్యులు తేల్చుకోలేకపోతున్నారు. పరిస్థితి శ్రుతిమించితే ప్రభుత్వాలు మాత్రం ఏం చేయగలవు? పూర్తి స్థాయి కావొచ్చు... పాక్షికంగా కావొచ్చు లాక్డౌన్ విధిస్తే అందరి కన్నా దాని ప్రభావం అధికంగా పడేది దినసరి కూలీలు, కార్మికులు వంటి అట్టడుగు జీవులపైనే. క్రితంసారి ఆకలితోనో, అర్ధాకలితోనో గడపక తప్పని రోజులు వారు మరిచిపోలేదు. అందుకే పలు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసి వుంటున్నాయి. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకెళ్లే రైళ్లు, బస్సులు జనంతో కిటకిటలాడుతున్నాయి. నిరుటితో పోలిస్తే ఇప్పు డున్న పరిస్థితి భిన్నమైనది. అప్పట్లో కేవలం మూడు గంటల సమయం మాత్రమే ఇచ్చి లాక్డౌన్ విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. పైగా అది దేశంలో తొలిసారి కావడంతో దానివల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న అవగాహన చాలామందికి లేదు. పైగా వలసజీవులకు ఇన్నాళ్లూ ఉపాధి కల్పిస్తున్నవారే లాక్డౌన్ ఎత్తేసేవరకూ వారి బాధ్యత తీసుకోవాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. కానీ దాన్ని పాటించినవారు అతి కొద్దిమంది. పర్యవసానంగా వలసజీవులు దిక్కులేని పక్షుల య్యారు. లక్షలాదిమంది రోడ్లమీదికొచ్చారు. వందలాది కిలోమీటర్ల దూరంలోని తమ స్వగ్రామా లకు నడకదారి పట్టారు. పోలీసులు అడ్డుకున్నా, ఎండలు మండిపోతున్నా, ఆకలి బాధిస్తున్నా వెనక్కి తగ్గలేదు. మార్గమధ్యంలో కొందరు అభాగ్యులు ఆకలితో, అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు మరోసారి స్వస్థలాలకు ప్రయాణం కడుతున్న వలసజీవుల్ని తప్పుబట్టడానికి లేదు. అయితే కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వర్తమానంలో ఇది ప్రమాదకరమైన పరిణామం. వారి నిష్క్రమణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ తొమ్మిది పది నెలలుగా పరిస్థితి కాస్త మెరుగుపడినా ఏ రంగమూ ఇంతవరకూ పూర్వ స్థాయికి చేరలేదు. వ్యాపార, వాణిజ్య కార్య కలాపాలు అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. తాజా పరిణామాల వల్ల అవి మరింత కుదేలవు తాయి. ఇటు ప్రజారోగ్య రంగం సైతం ఇబ్బందుల్లో పడుతుంది. శరవేగంతో మహమ్మారి విస్తరి స్తున్న ప్రస్తుత తరుణంలో జనం సరిగా మాస్కులు ధరించకుండా ఇలా పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడితే దాని దుష్ఫలితాలెలా వుంటాయన్నది తెలియనిది కాదు. ఇప్పుడిదే అందరినీ ఆందో ళనలో పడేస్తున్న విషయం. నిరుటితో పోలిస్తే ఇప్పుడు వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. ఇంతవరకూ దాదాపు పది కోట్లమంది జనం టీకాలు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే టీకాలు అందుబాటులోకొచ్చినవారు నిండా 8 శాతంమంది కూడా లేరు. పైగా వీరిలో అనేకులు రెండో డోస్ తీసుకోలేదు. వలస కూలీలకు వారు పనిచేసేచోట పెద్దగా పలుకు బడివుండదు కనుక, వారిలో ఎంతమందికి టీకాలందాయో అంచనా వేయటం కష్టం. దీని సంగతలావుంచి వ్యాక్సిన్ తీసుకున్నంతమాత్రాన వైరస్ నుంచి రక్షణ కలుగుతుందన్న నమ్మకం లేదని, మాస్కులు ధరించటం తప్పనిసరని వైద్య రంగ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ కిటకిటలాడుతూ కనిపిస్తున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు చూస్తుంటే వాటిని ఎవరూ పాటిస్తున్న దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా అందరిలోనూ భరోసా కలిగించాల్సిన అవసరం వుంది. ఆ భరోసా మాటల్లోకన్నా చేతల్లో కనబడాలి. గత అనుభవాలరీత్యా వలస కూలీలకు కావలసిన రేషన్, ఇతర నిత్యావసరాలు సరఫరా అయ్యేలా చూడాలి. నిరుడు విధించిన లాక్డౌన్ ముగిశాక కేంద్ర ప్రభుత్వం వలసజీవుల డేటా సేకరణకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా విధానం రూపొందింది. ఈ విషయంలో ఏమేరకు ముందడుగు పడిందో తెలియదుగానీ... అలాంటి ఏర్పాటుంటే వలస కూలీలను గుర్తించి, వారికి సాయపడటం ఇప్పుడు సులభమయ్యేది. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి అనువుగా వలస కూలీలకు భరోసా కల్పించడం, ఎక్కడివారక్కడ వుండేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి. -
లాక్డౌన్ : వలస కార్మికుల గుండెల్లో ‘రైళ్లు’
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశలో విస్తరిస్తుండటంతో వలస కార్మికులు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అందుకే బతుకుజీవుడా అంటూ మళ్లీ సొంత ఊరి బాటపడుతున్నారు. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా కరోనా విస్తరణ తీవ్ర స్థాయిలో ఉన్న మహారాష్త్రలో మళ్లీ పూర్తి లాక్డౌన్ విధిస్తారన్న భయం వారిని వెన్నాడుతోంది. అందుకే సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నారు. అన్ని రవాణా మార్గాలు మూసుకుపోకముందే తిరిగి సొంత రాష్ట్రాలకు బయల్దేరాలని ఆతృతపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ముంబై రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా కుర్లాలోని లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వద్దకు వలస కార్మికుల భారీగా చేరుకుంటున్నారు. (భారీ ఊరట: మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి) పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య దేశ రాజధాని డిల్లీలో కూడా ఇదే సరిస్థితి నెలకొంది. గత ఏడాది విధించిన లాక్డౌన్ వెతలను తలచుకుని బెంబేలెత్తుతున్న వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు పయన మవుతున్నారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తే, అన్ని రవాణా మార్గాలు మూసివేయడంతోపాటు పని దొరక్క తిండి గడవటం కష్టమని భావిస్తున్న చాలామంది కార్మికులు కుటుంబాలతో సహా దొరకిన వాహనాల్లో ఇళ్లకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు చూస్తోంటే.. లాక్డౌన్ తప్పదు..అందుకే ఊరికి పోతున్నానని, తనకిక వేరే మార్గం లేదని లక్నోకు చెందిన గౌరీ శంకర్ శర్మ వాపోయారు. ఉత్తర ప్రదేశ్ బరేలీకి చెందిన వలస కార్మికుడు సునీల్ గుప్తాకి కూడా ఇదే ఆవేదన. మరోవైపు దేశంలో రెండో దశలో కరోనా వైరస్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య లక్షకు ఎక్కడా తగ్గడంలేదు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి!) Delhi: Amid rising cases of COVID-19, migrant workers start returning to their native places; visuals from ISBT, Anand Vihar. "The rate at which the cases are rising makes it obvious that lockdown would be imposed. That is why I am going home," a labourer said yesterday. pic.twitter.com/8D2kfxQcfN — ANI (@ANI) April 13, 2021 #WATCH | Mumbai: Huge crowd of migrant workers arrive at Lokmanya Tilak Terminus (LTT) in Kurla pic.twitter.com/6zkz8xt0eE — ANI (@ANI) April 13, 2021 -
కర్ఫ్యూల కలవరం: ఊరికాని ఊరిలో ఉండలేం..
సాక్షి, న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, అలాంటి సన్నివేశాలే మళ్లీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. గతేడాది కోవిడ్ సంక్రమణ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో నగరాలు, పట్టణాల్లో ఉన్న బడుగుజీవులు గత్యంతరం లేని పరిస్థితుల్లో సొంతూళ్లకు ఏదో ఒక రకంగా చేరుకోవాలనే తపనతో కష్టాలకోర్చి ప్రయాణాలు చేశారు. కాలినడకన, సైకిళ్లు, సొంత వాహనాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు, స్పెషల్ రైళ్లలో ఎలాగోలా చేరుకున్నారు. పరిస్థితి దాదాపుగా చక్కబడిందనుకొని నాలుగైదు నెలల క్రితం మళ్లీ నగరబాట పట్టిన వారికి తాజా పరిణామాలు ఏమాత్రం మింగుడుపడట్లేదు. కొన్ని రోజులుగా కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో పురోగతి ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ఉండడం, సంక్రమణ రేటు రెట్టింపు కావడంతో రాష్ట్రాలు ఇప్పటికే పలు నగరాల్లో ఆంక్షలు విధించాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందనే స్పష్టత కొరవడింది. నాలుగైదు రోజులుగా రోజుకు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఏరకంగా మారుతుందనే అంశంపై అంచనా వేయడం కష్టమౌతోంది. ఒకవైపు కేసులు పెరుగుతుండడం, మరోవైపు వ్యాక్సినేషన్ చేసేందుకు తమ వద్ద అవసరానికి ఉండాల్సిన స్టాక్ లేదని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువచ్చాయి. మహారాష్ట్రలో స్టాక్ అందుబాటులో లేని కారణంగా పలుచోట్లు వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. మరోవైపు తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శుక్రవారం ప్రధాని రాసిన లేఖలో మరో రెండు రోజుల వ్యాక్సిన్ స్టాక్ మాత్రమే ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరాల్లో జీవించడం కంటే తమ సొంత ఊరుని నమ్ముకుంటేనే మేలని అనేకమంది భావిస్తున్నారు. అందుకే ప్రజలు ప్రయాణాలకు సిద్ధపడడంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీ , ముంబై, బెంగళూరు, పూణే సహా నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అనధికారిక వర్గాలు ప్రకటించాయి. సంక్రమణ భయంతో వలస కార్మికులు అనేకమంది స్వగ్రామాలకు వెళుతున్న నేపథ్యంలో రైలు సర్వీసుల కొనసాగింపుపై శుక్రవారం రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. రైలు సేవలను తగ్గించడానికి కానీ ఆపడానికి ఎటువంటి ప్రణాళిక లేదని, అవసరమైతే పెంచుతామని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ చెప్పారు. దేశరాజధాని ఢిల్లీ దేశ రాజధానిలో ఈనెల 6వ తేదీన ప్రారంభమైన నైట్ కర్ఫ్యూ ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే, గర్భిణీ స్త్రీలు, రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్సు టెర్మినస్ నుండి టిక్కెట్లు చూపించి ప్రయాణించే వారికి మాత్రం ప్రభుత్వం పరిమితుల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయినప్పటికీ ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకుండా, సామాజిక దూరాన్ని పాటించని వారిపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి రూ.2వేలు జరిమానా విధిస్తున్నారు. మహారాష్ట్ర ముంబై, పూణే, నాగ్‌పూర్ సహా మహారాష్ట్రలోని అన్ని నగరాలు, జిల్లాల్లో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కఠినమైన లాక్డౌన్ జరుగనుంది. కోవిడ్ –19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బీఎంసీ ముంబై నగరంలో వీకెండ్ లాక్డౌన్ విధించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. ముంబై అధికారులు నగరానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. పూణే మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో ఈనెల 30వ తేదీ వరకు అన్ని మార్కెట్లు, దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్, అలహాబాద్, మీరట్, ఘజియాబాద్, బరేలీ జిల్లాల్లో ప్రారంభమైన నైట్ కర్ఫ్యూ ఈనెల 17వరకు అమలులో ఉండనుంది. కాన్పూర్, లక్నో ల్లోనూ ఆంక్షలు విధించారు. జమ్మూకశ్మీర్ శుక్రవారం రాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ మొదలైంది. జమ్మూ, ఉధంపూర్, కథువా, శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, అనంతనాగ్, కుప్వారా జిల్లాల్లోని పట్టణప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి. ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దుర్గ్ జిల్లాలో లాక్డౌన్ ప్రకటించింది. ఈనెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పూర్తి లాక్డౌన్ విధించారు. రాయ్‌పూర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి, జిల్లా సరిహద్దులను శుక్రవారం నుంచి ఈనెల 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు సీలు చేశారు. ఈ 10 రోజుల్లో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్‌లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్ ప్రక్రియ సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈనెల 8 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. రాజస్తాన్ రాత్రి కర్ఫ్యూతో పాటు అనేక ఆంక్షలను జైపూర్ సహా రాజస్తాన్‌లోని అన్ని నగరాలు, జిల్లాల్లో ఈనెల 5 నుంచి 19వ తేదీ వరకు కొనసాగించనున్నారు. నైట్ కర్ఫ్యూని రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు విధించారు. పంజాబ్ ఈ నెల 30వ తేదీ వరకు పంజాబ్ అంతటా రాత్రి కర్ఫ్యూను పొడిగించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. చంఢీగఢ్‌లోనూ 7వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. తమిళనాడు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అధికారయంత్రాంగం కఠినమైన నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి అమలులోకి వచ్చిన నిబంధనలతోనైనా వ్యాప్తి రేటు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. -
లాక్డౌన్ భయం: ‘మళ్లీ ఊరెళ్లిపోతా మామ’
న్యూఢిల్లీ: ‘ఊరెళ్లి పోతా మామ.. ఊరెళ్లి పోతా’ అంటూ మళ్లీ వలస కార్మికులు, కూలీలు పల్లె బాట పట్టారు. కరోనా వైరస్ రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభణ కొనసాగడంతో అన్ని రాష్ట్రాలు తీవ్ర ఆంక్షలు విధిస్తున్నాయి. లాక్డౌన్ మినహా అన్ని చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో వలసవెళ్లిన కార్మికులు, కూలీలు ఊరి బాట పడుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండడంతో ఆ రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఆంక్షలు విధించారు. రాత్రిపూట కర్ఫ్యూ.. పగటి పూట పని వేళల మార్పు చేయడం పొట్ట పోసుకోవడానికి వచ్చిన కార్మికులు మళ్లీ తిప్పలు పడుతున్నారు. ఇక్కడ ఉండడం కన్నా ఊర్లో ఉండడం మేలు అనే భావనతో తిరిగి గ్రామాలకు వెళ్తున్నారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే భయంతో ఇప్పుడే ఊరెళ్లడం నయమని భావించి తట్టాబుట్టా సర్దేసుకుని మళ్లీ ఊరి బాట పడుతున్నారు. ఢిల్లీలో రాత్రి 10 నుంచి ఉదయం 5 దాక కర్ఫ్యూ విధించారు. మహారాష్ట్రలో మినీ లాక్డౌన్ విధించారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పూర్తి లాక్డౌన్ కూడా విధించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఆంక్షలు విధించారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు ఆ పట్టణాల్లో ఉండలేక స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో పట్టణ ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు, కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. గతేడాది అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడంతో పడ్డ కష్టాలను తలుచుకుని ఇప్పుడు ముందే జాగ్రత్త పడుతూ ఊరికి వెళ్తున్నారు. -
హైదరాబాద్‌లో అడ్డా కూలీల తీరని వెతలివి!
ఉదయం కాగానే తాజాగా బతుకు మొదలవుతుంది.. చకచకా అడ్డామీదకు చేరుకుంటారు.. పనికోసం ఎదురు చూస్తుంటారు.. పని దొరికినోళ్లు సంతోషంగా వెళ్తారు.. మిగిలిపోయినోళ్లకు ఎదురుచూపులు తప్పవు. ఒక్కో రోజు మధ్యాహ్నం దాటిపోతుంది.. ఆకలి చంపేస్తుంది.. పనిపై ఆశ మాత్రం చావదు. ఇక ఆ రోజు పనిలేక గడపాల్సిందేననుకుంటూ ఆకలి తీర్చుకునేందుకు స్థానికంగా ఉండే రూ.5 భోజన కేంద్రం వద్ద కడుపు నింపుకొని, కేంద్రం లేనిచోట కడుపు మాడ్చుకొని సాయంత్రం ఇంటిబాట పడతారు. ఇదీ నగరవ్యాప్తంగా ఉన్న అడ్డా కూలీల దుస్థితి. కరోనా మహమ్మారి కారణంగా పనులు లేక ఎన్నో కష్టాలు పడుతున్న వలస కూలీల పరిస్థితులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి కథనం.. – సాక్షి, సిటీబ్యూరో ‘ఉప్పల్ గాంధీ బొమ్మ వలస కూలీల అడ్డా.. ఏడాది క్రితం వరకు వందలాది మంది కూలీలతో సందడిగా ఉండేది. ఉదయం 10 గంటల వరకు అంతా పనుల్లోకి వెళ్లేవారు. ఇప్పుడు కూడా సందడిగానే ఉంటుంది. కానీ మధ్యాహ్నం 12 గంటల దాటినా పనుల కోసం పడిగాపులు కాసే కూలీలు కనిపిస్తారు. ఒకప్పుడు అక్కడ కనీసం350 మందికి పైగా వలస కూలీలు పనికోసం ఎదురు చూసేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య 250కి పడిపోయింది. సగం మందికి పని దొరికితే.. మరో సగం మంది ఇళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. యూసుఫ్‌గూడ లేబర్ అడ్డాలో గతేడాది ప్రతిరోజూ సుమారు 500 మంది కూలీలు పనికి వచ్చేవారు. ప్రస్తుతం 300 మంది వరకు వస్తున్నారు. అందరికీ పనులు దొరకడం లేదు. ఉప్పల్, యూసుఫ్‌గూడ వంటి అడ్డాలే కాదు. గ్రేటర్‌లోని వందలాది వలస కూలీల అడ్డాలు ప్రస్తుతం పనుల కోసం పడిగాపులు కాస్తున్నాయి. కోవిడ్‌కు ముందు నెలలో కనీసం 25 రోజులు పని లభించగా.. ప్రస్తుతం 15 రోజులు మాత్రమే పని దొరుకుతోంది. మిగతా 15 రోజులు పనుల్లేక కష్టంగా ఉంటోంది. కొన్నిచోట్ల ఐదు రూపాయల భోజనం ఆదుకుంటోంది. కానీ అడ్డా కూలీలు ఉన్న అన్నిచోట్లా భోజన కేంద్రాలు లేవు. ఎదురు చూపులే... గ్రేటర్ హైదరాబాద్‌లో మేడ్చల్, మేడిపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోలేదు. కోవిడ్‌కు ముందు గ్రేటర్లో సుమారు 10 లక్షల మంది వలస కూలీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 7 లక్షలకు తగ్గింది. లాక్డౌన్ రోజుల్లో సొంతూళ్లకు వెళ్లిన వారిలో మూడొంతుల మంది తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సుమారు 3 లక్షల మంది మాత్రం ఊళ్లలోనే ఉంటున్నారు. నగరంలోని చిక్కడపల్లి, అశోక్‌నగర్, యూసుఫ్‌గూడ, మల్కాజిగిరి, రామంతాపూర్, ఉప్పల్, గౌలిగూడ, అంబర్పేట్, బాలానగర్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, ఎల్బీనగర్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్ తదితర సుమారు 2,500 కూడళ్లు వలస కూలీల అడ్డాలు. ప్రస్తుతం ఈ అడ్డాల్లో ప్రతిరోజూ సుమారు 7 లక్షల మంది పనికోసం ఎదురు చూస్తున్నారు. కానీ 3.5 లక్షల మందికే పనులు లభిస్తున్నట్లు కారి్మక సంఘాల సర్వేలో వెల్లడైంది. సగం మంది పనికోసం ఎదురు చూడాల్సి వస్తోందని సీఐటీయూ నాయకులు ఈశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల చదువులు ఆగినై.. ఒకరోజు పని ఉంటే మరో రోజు ఉంట లేదు. ఇంతకు ముందు లెక్క లేదు. బతుకు కష్టంగా మారింది. తినడానికి తిండి కూడా కష్టమైతుంది. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేదు. చదువులు బంద్ అయినై. మా కష్టాలు ఎవరు తీరుస్తరు సార్? – సుజాత, విజయపురి కాలనీ, ఉప్పల్ పెరిగిన ధరలు–పెరగని కూలీ రేట్లు.. లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇంధనం ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. బియ్యం, వంటనూనె, పప్పులు, కూరగాయల ధరలు పెరిగాయి. రవాణా చార్జీలు రెట్టింపయ్యాయి. అందుకు అనుగుణంగా లేబర్ రేట్లు మాత్రం పెరగలేదు. పురుషులకు రోజుకు రూ.700, మహిళలకు రూ.600, మేస్త్రీలకు రూ.800 చొప్పున కూలీ లభిస్తోంది. నెలలో కేవలం 15 రోజులే పని దొరుకుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది నెలల తరబడి పచ్చడి మెతుకులతోనే గడుపుతున్నారు. కొన్ని చోట్ల రూ.5 భోజనంఆదుకుంటోంది. ఏ పనైనా మంచిదే.. పెయింటింగ్ పని చేస్తాను. కానీ ఇప్పుడు పనుల్లేక ఏది దొరికితే దానికి వెళ్లాల్సి వస్తోంది. ఒకప్పుడు ఆర్డర్లు తీసుకొని ఇళ్లకు రంగులు వేశాను. ఇప్పుడు అడ్డామీదకు వచ్చి పనికోసం ఎదురు చూస్తున్నాను. ఒకరోజు దొరుకుతోంది.. మరోరోజు నిరాశతో వెళ్లిపోతున్నాను. తప్పడం లేదు. – లక్ష్మణ్, సూరారం రూ.5 భోజనం ఆదుకుంటోంది పొద్దున్నే తిన్నా తినకపోయినా.. అడ్డా మీదకు వస్తున్నాను. ఏమాత్రం ఆలస్యమైనా పని దొరకడం లేదు. పని దొరకని రోజు రూ.5 భోజనంతో కడుపు నింపుకుంటున్నాను. దొరకని రోజు మధ్యాహ్నం వరకు ఎదురు చూసి వెళ్లిపోతున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. – కృష్ణ, చింతల్ పని దొరికితేనే తిండి రోజూ అడ్డా మీదకు వస్తున్నా.. పని దొరికిన రోజు సంతోషం. ఆ రోజు ఇంటిళ్లిపాదికి బుక్కెడు బువ్వ దొరుకుతుంది. పనిలేని రోజు పచ్చడితో బువ్వ తినాల్సిందే.. ఇంటి కిరాయిలు బాగా పెంచిండ్రు. గతంలో నెలకు రూ.5 వేలు ఉండె. ఇప్పుడు రూ.6,500 అయ్యింది. చాలా కష్టంగా ఉంది. – సత్తయ్య, ఉప్పల్ పోటీ పెరిగింది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల వల్ల బాగా పోటీ పెరిగింది. రోజుకు రూ.450 నుంచి రూ.500లకే ఒప్పుకుంటున్నారు. వాళ్లకు అపార్టుమెంట్లలోనే ఆశ్రయం ఇచ్చి పనులు అప్పగిస్తున్నారు. అడ్డా కూలీలకు పనులు దొరకడం లేదు. దీంతో కుటుంబమంతా తిప్పలు పడుతున్నారు. – చందు, ఉప్పల్ బిహార్ నుంచి మళ్లీ వచ్చా.. పనికోసం బిహార్ నుంచి ఇక్కడికి వచ్చాను. లాక్డౌన్ రోజుల్లో కష్టంగా ఉండడంతో తిరిగి వెళ్లిపోయాం. తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాం. పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. రోజుకు రూ.600 మాత్రమే కూలీ లభిస్తోంది. ఇప్పుడేమో సెకెండ్ వేవ్ అంటున్నారు. లాక్డౌన్ పెడితే ఏం చేయాలో అర్ధం కాట్లే. – రౌతమ్, మల్లాపూర్ -
పేదింటి మహిళలను భయపెట్టిస్తున్న లాక్డౌన్..
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు మరోమారు లాక్డౌన్ విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా లాక్డౌన్ దిశగా ఆలోచిస్తోందన్న వార్తలు చాలామందిని కలవరపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ధనవంతుల ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగించే ఎందరో పేదింటి మహిళలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతేడాది అమలుచేసిన లాక్డౌన్ వల్ల వారు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. ఉన్న ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లి గవ్వ లేక పస్తులుండాల్సిన పరిస్ధితి వచ్చింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో గత ఆరు నెలలుగా వారికి ఏదో ఒక ఉపాధి దొరికింది. దీంతో వారి కుటుంబాలకు కొంత ఆధారం లభించినట్లు అయింది. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ అంటుండటంతో వారు ఉన్న ఆధారం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ మరోసారి లాక్డౌన్ విధిస్తే తమ కుటుంబ పరిస్ధితి ఏంటని తలచుకుంటూ వారు బాధపడుతున్నారు. 35 లక్షల మంది మహిళా కార్మికులు ముంబై, థానే, నవీ ముంబై పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో పనిచేసే మహిళా కార్మికులు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. వీరిలో కొంత మంది ఇటుక బట్టీలలో పనులు చేసుకుంటుండగా.. మరికొందరు ఇతర కూలీ పనులు చేసుకుంటున్నారు. కానీ, ఎక్కువ మంది మాత్రం ధనవంతుల ఇళ్లలో ఇంటి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అయితే, గత కొంతకాలంగా ముంబైతో పాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో, శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడైనా లాక్డౌన్ అమలు చేసే ఆస్కారముందని ప్రచారం సాగుతోంది. దీంతో గతేడాది పరిస్ధితులు మళ్లీ పునరావృతం అయ్యే ప్రమాదముందని వారు బెంబేలెత్తిపోతున్నారు. తమకు వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చే మహిళలు అధిక శాతం ఉన్నారు. వీరికి సొంత ఇళ్లు కూడా లేకపోవడంతో అద్దె ఇళ్లలో ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ లాక్డౌన్ విధించి వీళ్లు ఉపాధి కోల్పోతే ఇంటి అద్దె కూడా చెల్లించేందుకు డబ్బులు లేని దయనీయ పరిస్థితి వస్తుంది. గతంలో విధించిన లాక్డౌన్ ఇప్పటికే పిల్లల చదువు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలామందికి ఉపాధి పోయింది. అప్పుడు పోగొట్టుకున్న పని ఇంతవరకు దొరకలేదు. ఇక ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ పెడితే తాముంటున్న అద్దె ఇళ్లు ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోవాల్సిందేనని పేద మహిళలు వాపోతున్నారు. చదవండి: (లాక్డౌన్ హెచ్చరికలు.. సొంతూళ్లకు కూలీలు) -
లాక్డౌన్ హెచ్చరికలు.. సొంతూళ్లకు కూలీలు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కరోనా వైరస్ విజృంభణ, దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో బతుకీడుస్తున్న వలస కార్మికులు, కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్లీ లాక్డౌన్ అమలుచేస్తే ముంబై మహానగరంలో ఎలా బతకాలో తెలియక చాలామంది కూలీలు, కార్మికులు మళ్లీ సొంతూళ్ల బాట పట్టారు. ఉపాధి కోసం నగరానికి రావాలనుకున్న వాళ్లు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాకే నగరానికి రావాలని భావిస్తున్నారు. తగ్గినట్టే తగ్గి.. డిసెంబర్, జనవరి మాసాల్లో కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాల్లో కూలీలు, కార్మికులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రతీరోజు వేలాది మంది ఉపాధి కోసం ముంబై నగరానికి వచ్చారు. అయితే, ఫిబ్రవరి చివరి వారం నుంచి కరోనా మళ్లీ విజృంభించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో మరింత కఠినంగా వ్యవహరించింది. రాత్రి పూట కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేసింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజల్లో మార్పు రావాలని, లేని పక్షంలో మరోసారి లాక్డౌన్ విధించక తప్పదని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది. దీంతో లాక్డౌన్ విధిస్తే తమకు ఉపాధి లభించకపోవచ్చని ముందుగానే గ్రహించిన అనేక మంది పేదలు, కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారు స్వగ్రామాలకు వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఒకవేళ మళ్లీ లాక్డౌన్ విధిస్తే ముంబైలోనే చిక్కుకుంటామని వారిలో భయం నాటుకుపోయింది. దీంతో చాలామంది స్వగ్రామాలకు పయనం అవుతున్నారు. పెట్టే బేడ, పిల్లా పాపలతో దొరికిన వాహనంలో బయలుదేరుతున్నారు. అర్ధంతరంగా పనులు వదిలేసి.. రెడీమేడ్ దుస్తులు తయారుచేసే గార్మెంట్లలో, చిన్నా చితకా పరిశ్రమలలో పనిచేసే కూలీలు, కార్మికులు చేతిలో ఉన్న పనిని అర్ధంతరంగా వదిలేసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో వారిని నమ్ముకుని ముందస్తుగా ఆర్డర్లు తీసుకున్న చిన్న, బడా వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సమయానికి ఆర్డర్లు వినియోగదారులకు అందించకపోతే మరింత నష్టం వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. మరోపక్క భవన నిర్మాణ రంగంలో కూలీలకు, కార్మికులకు నిత్యం మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో బిల్డర్లు అయోమయంలో పడిపోయారు. వాహనాల కోసం పడిగాపులు ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు, హైవేలపై ట్రక్కులు, టెంపోలు, ప్రైవేటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు అన్నీ స్వగ్రామాలకు వెళ్లే కూలీలు, కార్మికులతో నిండిపోతున్నాయి. కొందరైతే ఎలాగైనా ఇంటికి వెళ్లాలన్న తపనతో వాహనాల వారు అడిగినంత చార్జీలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా కొందరు చార్జీలు కూడా భారీగా పెంచారు. ఇంకా కొందరు దూరప్రాంతాలకు వెళ్లేవాళ్లు తమ ప్రాంతానికి వెళ్లే వాహనాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వడిగాపులు కాస్తున్నారు. మరికొందరు ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలోనైనా వెళ్లిపోయేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. -
గల్ఫ్ వెళ్లే కార్మికులకు కేంద్రం షాక్!
మోర్తాడ్ (బాల్కొండ) : అవ్వ పెట్టదు అడుక్కు తిననివ్వదు.. అన్నట్లుగా ఉంది వలస కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక దేశం విడిచి గల్ఫ్‌కు వలస వెళుతున్న మన కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన విదేశాంగ శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపణలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారత కార్మికుల శ్రమను గుర్తించి వారికి తగిన వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వాలకు సూచించాల్సిన మన విదేశాంగ శాఖ, కార్మికులకు నష్టం కలిగించేలా ఉత్తర్వులను జారీ చేసిందని చెబుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ దేశాలకు సంబంధించి కార్మికుల ఇమ్మిగ్రేషన్ విధానంలో కనీస వేతనాల కుదింపుపై అక్కడి ప్రభుత్వాలకు భారత్ సమ్మతి తెలిపిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ రహస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు గత సెపె్టంబర్ 8న ఒక ఉత్తర్వును, అదే నెలలో 21వ తేదీన మరో ఉత్తర్వును విదేశాంగ శాఖ జారీ చేసిందని చెబుతున్నారు. గత సెప్టెంబర్‌లోనే ఈ ఉత్తర్వులు వెలువడినా గల్ఫ్ దేశాలకు ఇటీవలే మళ్లీ కార్మికుల వలసలు ప్రారంభం కావడంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో విదేశాంగ శాఖ ఉత్తర్వుల విషయం తెలిసిందని కార్మికులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత కార్మికులకు కనీస వేతనాన్ని కుదించవచ్చని విదేశాంగ శాఖ ఆయా ప్రభుత్వాలకు ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులపై పునరాలోచన చేయాలని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కె.ఆర్. సురేశ్‌రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన మిగతా ఎంపీలు కూడా దీనిపై దృష్టిసారించాలని ఆయన కోరారు. ఖతర్, బహ్రెయిన్, ఒమన్, యునైటెడ్ అర బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు నెలకు 200 అమెరికన్ డాలర్ల వేతనం.. అంటే మన కరెన్సీలో దాదా పు రూ.15 వేలు కార్మికులకు చెల్లించవచ్చని విదేశాంగ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొందని చెబుతున్నారు. అలాగే కువైట్‌లో పనిచేసే కార్మికులకు 245 డాలర్లు, సౌదీ అరేబియాలో పని చేసేవారికి 324 డాలర్ల వేతనం చెల్లించవచ్చ ని మన విదేశాంగ శాఖ అమోదం తెలిపిందని అంటున్నారు. అయితే ఇదింకా ఎక్కువ ఉండాలని కార్మికులు చెబుతున్నారు. ఖతర్‌లో పనిచేసే వలస కార్మికులకు కనీసంగా 1,300 రియాళ్ల వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆయా కంపెనీలకు నిర్దేశించగా మన విదేశాంగ శాఖ దానిని దృష్టిలో ఉంచుకోకుండా తక్కువ వేతనానికే భారతీయ కార్మికులు పనిచేస్తారని హామీ ఇచ్చిందని తెలుస్తోంది. యూఏఈలో కార్మికులకు నెలకు రూ.16వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. విదేశాంగ శాఖ ఉత్తర్వులతో ఆ వేతనం తగ్గుతుందని అంటున్నారు. కార్మిక, కర్షకుల కష్టంతోనే దేశపురోగతి క్యాపిటలిస్టులతో దేశాభివృద్ధి జరగడం లేదని, కార్మికుల, కర్షకుల కష్టంతోనే పురోగతి సాధిస్తోందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, సఫాయి కర్మచారి ఉద్యమకారుడు బెజవాడ విల్సన్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ‘ఆలిండియా కన్వెన్షన్ ఫర్ దళిత్ రైట్స్ అండ్ ఎగైనెస్ట్ అట్రాసిటీస్ ఆన్ దళిత్స్’ కార్యక్రమం జరిగింది. సదస్సుని బెజవాడ విల్సన్ ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో రైతులను, శ్రామికులను చిన్నచూపుతో చూస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 58.9 శాతం దళితులు ఇప్పటికీ భూమి లేకుండా రైతు కూలీలుగా జీవనాన్ని వెళ్లదీస్తున్నారన్నారు. దేశం లో సామాజిక, కుల వివక్షకు బీజేపీ వంటి హిందూత్వ పార్టీలే ప్రధాన కారణమని విమర్శించారు. పేదరికం కారణంగా దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంక ట్ వాపోయారు. కార్యక్రమంలో హన్నన్ మొల్ల (ఏఐకేఎస్), ఏఐఏడబ్ల్యూయూ నేత విక్రమ్ సింగ్, తెలంగాణ కార్మిక సంఘం నేత ఐలయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు, గుల్జార్‌సింగ్ గోరియా (బీకేఎంయూ), అసిత్ గంగూలీ (ఎస్కేఎస్), సంజయ్ శర్మ (ఏఐఏఆర్ఎల్ఏ), సాయి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
మ‘కామ్’ మారింది!
సాక్షి, మెదక్: వారికి పట్నంలో పనిలేదు.. మనీ లేదు. ఉన్నపణంగా ఉపాధి పోయింది. ఉన్నట్టుండి రోడ్డున పడ్డారు. కుటుంబ పోషణ గగనమైంది. కరోనా కాటుకు వలసకూలీలు విలవిలలాడారు. కట్టుబట్టలతో, ఖాళీకడుపులతో ఊరిబాటపట్టారు. హైదరాబాద్ నగరంలో విపత్కర పరిస్థితులను తట్టుకోలేక సొంతూళ్లకు వచ్చిన చాలామంది స్థానికుల అండతో కొత్త ఉపాధిని వెతుక్కుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గినా పట్టణాలకు తరలిపోకుండా సొంత గ్రామం లేదా జిల్లాలో స్థిర నివాసం ఏర్పరచుకొని తోచిన వ్యాపారం చేస్తూ, కూలిపని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యావంతులైన నిరుద్యోగులు పలువురు సొంతంగా చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోగా ఇతరులు పలు షాపుల్లో పనులకు వెళ్తూ పొట్టపోసుకుంటున్నట్లు తెలుస్తోంది. రేషన్ పోర్టబిలిటీ లెక్కలే నిదర్శనం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏ రేషన్ దుకాణం నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే(పోర్టబిలిటీ) వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కలిపించని విషయం తెలిసిందే. కరోనాకు ముందు ప్రస్తుతం పోర్టబిలిటీ సేల్‌ను పరిశీలిస్తే అధిక మొత్తంలో ప్రజలు సొంతూళ్లలోనే ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ, వెంటనే లాక్డౌన్ అమల్లోకి రాగా ఆ తర్వాత విడతలవారీగా అన్‌లాక్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్‌లో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌తో పనుల్లేక వలస కూలీలు సొంత జిల్లాలకు తరలివచ్చారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ స్థానికంగానే ఉపాధి పొందుతున్నారు. మెదక్ జిల్లాలో కరోనాకు ముందు ఫిబ్రవరిలో రేషన్ పోర్టబిలిటీ కింద 18,825 మంది ఇతర ప్రాంతాల లబ్ధి దారులు రేషన్ సరుకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30,096కు చేరింది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోనూ గమనించవచ్చు. -
నేను రక్షకుడిని కాదు!
లాక్డౌన్ సమయంలో ఎంతోమంది తమ ప్రాంతాలు చేరుకునేందుకు సహాయపడ్డారు నటుడు సోనూ సూద్. ‘మా పాలిట రక్షకుడిలా వచ్చావు’ అని దీవెనలందించారు వలస కార్మికులు. సూపర్ హీరో అని సోషల్ మీడియాలో ఒకటే పొగడ్తల వర్షం. అయితే ఇప్పుడు సోనూ సూద్ మాత్రం ‘నేను రక్షకుడిని కాను’ అంటున్నారు. ‘ఐయామ్ నో మెసయ్యా’ (నేను రక్షకుడిని/కాపాడేవాడిని కాదు అని అర్థం) అనే టైటిల్‌తో తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ పుస్తకం డిసెంబర్లో విడుదల కానుంది. ‘ఇది నా జీవిత కథ. కేవలం నాది మాత్రమే కాదు. ఎన్నో వేలమంది వలస కార్మికుల కథ’ అన్నారు సోనూ సూద్. -
బతకలేం, తిరిగి పనిలోకి వచ్చేస్తాం
సాక్షి, హైదరాబాద్: తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగొచ్చేందుకు వలసకార్మికులు సంసిద్ధులవుతున్నారు. వివిధ రాష్ట్రా ల్లోని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన వారిలో 70% వరకు మళ్లీ నగరాలు, గతంలో పనిచేసిన చోట్లకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో కొన్నిరోజుల పాటు అనేక కష్టాలు ఎదుర్కొని వలస కార్మికులు తమ సొంతూళ్లకు చేరుకున్న సం గతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒక కోటి 4 లక్షల మంది వలసకార్మికులు తమ ఊళ్లకు చేరుకున్నట్టుగా సర్వేలో వెల్లడైంది. తాము పనిచేస్తున్న చోట్ల ఉపాధి దొరకక, ఎలాంటి ఆదాయం లేకపోవడంతో కుటుంబాలను పోషించలేక, ఇళ్ల అద్దెలు కట్టలేక సొంత గ్రామాలకు వెళ్లిపోయినవారికి తమ నైపుణ్యాలకు తగ్గట్టు పనిదొరకక, ఇంకా కొందరికి సరైన పనులు లభించక లాక్డౌన్ సమయంలోనే 94% ఆదాయాలు తగ్గిపోయినట్టుగా తాజా సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో దాదాపు 70% వలసకార్మికులు తిరిగి పాత పనిప్రాంతాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. మాజీ ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తల ఆధ్వర్యంలో ‘మైగ్రెంట్ వర్కర్స్: ఏ స్టడీ ఆన్ దెర్ లైవ్లీహుడ్ ఆఫ్టర్ రివర్స్ మైగ్రేషన్ డ్యూటు లాక్డౌన్’శీర్షికతో నిర్వహించిన ఇన్ఫెరెన్షియల్ సర్వే స్టాటిస్టిక్స్, రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యయనంలో ఇంకా అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఫౌండేషన్‌ను నేషనల్ శాంపిల్‌సర్వే ఆఫీస్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ బి.బి.సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మాజీ ఆర్థిక సలహాదారు ఎన్కే సాహు తదితరులు స్థాపించారు. కోవిడ్ ప్రభావం వారిపై తీవ్రం వలస కార్మికులపై కోవిడ్ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రంగా పడినట్లు సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచే ఎక్కువ సంఖ్యలో కార్మికులు వలస వస్తున్న నేపథ్యంలో.. ఈ రాష్ట్రాల్లోనే ఈ అధ్యయనం నిర్వహించారు. సొంతూ ళ్లకు వెళ్లిన వారిలో నెల లేదా రోజువారీ వేతనం పొందేవారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉందని, వ్యవసాయేతర రంగాల్లోని క్యాజువల్ కార్మికులపై ఇది తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. సొంతూళ్లకు చేరుకున్న వారి ఆదాయాలను గతంలో పనిచేసిన చోట్ల ఆదాయంతో పోలిస్తే సగటున 85% తగ్గిపోయాయి. ఇక జార్ఖండ్,యూపీల్లో అయితే 94% మేర ఆదాయం తగ్గిపోయింది. గతంలో వివిధ మార్గాల్లో స్వయం ఉపాధి పొందే వలసకార్మికుల్లో ప్రస్తుతం 86% మేర ఆదాయం (ఆరు రాష్ట్రాల్లో కలిపి)కోల్పోయారు. గ్రామాల్లో ఆదాయమార్గాలు లేక పట్టణాలకు వెళితే ఏదో ఒక ఉపాధి దొరుకుతుందనే ఆశాభావంతో 41 శాతం మంది ఉన్నారు. గతంలో పనిచేసిన యజమానుల నుంచి వస్తున్న వేతనం పెంపుదలకు స్పందించి 33 శాతం మంది తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. జార్ఖండ్, యూపీల నుంచే ఎక్కువ నగరాలు, గతంలో తాము పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు 70% వలసకార్మికులు సుముఖంగా ఉండగా, వారిలో జార్ఖండ్ నుంచి 92.31%, యూపీ నుంచి 89.31%, ఒడిశా నుంచి 59 శాతంమంది సిద్ధమౌతున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి మాత్రం 35 శాతంమందే మళ్లీ నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. -
సోనూసూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి, ముంబై: రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును సోనూకు ప్రదానం చేసింది. ఇప్పటివరకు అద్భుత నటనకు అవార్డులు ప్రశంసలు గెలుచుకున్న సోనూ తన గొప్ప మనసుకు, మానవత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతోపాటు తాజాగా యూఎన్డీపీ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్లో చాలాకొద్దిమందికి దక్కిన అరుదైన గౌరవాన్ని సోనూ అందుకోవడం విశేషం. (రియల్ హీరో సోనూ సూద్‌కు గ్రాండ్ వెల్కమ్) నిస్వార్ధంగా, అలుపెరగకుండా లక్షలాది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం, వారిని ఆర్థికంగా ఆదుకున్న సోనూ సూద్ అక్కడితో ఆగిపోలేదు. విదేశాలలో చిక్కుకున్న వేలాదిమంది విద్యార్థులకు సహాయం, చిన్న పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అవసరమైన వారికి ఉచిత ఉపాధి అవకాశాలను కల్పించడం లాంటి అనేక సేవలకుగాను ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఆయనకు ట్విటర్ లో అభినందన వెల్లువ కురుస్తోంది. హాలీవుడ్ నటులు ఏంజెలీనా జోలీ, లియోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, నోబెల్ బహుమతి గ్రహీత ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్హాం, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లాంటి వారిని ఐక్యరాజ్యసమితి పలు అవార్డులతో సత్కరించింది. మరోవైపు ఇది అరుదైన గౌరవమనీ, యూఎన్ఓ గుర్తింపు తనకు చాలా ప్రత్యేకమైందంటూ సోనూ సూద్ సంతోషం వ్యక్తం చేశారు. తన దేశీయుల కోసం తనకున్న దాంట్లో తాను చేసిన చిన్న సాయమని పేర్కొన్నారు. 2030 నాటికి పేదరికం, ఆకలి, లింగ వివక్ష నిర్మూలన లాంటి 17 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధనలో యుఎన్‌డీపీకి తన మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. -
ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఎన్డీఏ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్’ అంటూ ఎద్దేవా చేశారు. వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, కోవిడ్ -19, ఆర్థిక వ్యవస్థపై డాటా లేదు అంటూ శశిథరూర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. (చదవండి: అవి రైతుల పాలిట మరణ శాసనాలే!) ఈ మేరకు ‘ది నేమ్ ఛేంజర్స్’ అనే కార్టూన్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు థరూర్. దీనిలో మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షాలు ‘నో డాటా అవైలబుల్’ అనే ప్లకార్డులు పట్టుకున్నట్లు ఉన్న కార్టూన్ని ట్వీట్ చేశారు. దాంతో పాటు ‘వలస కార్మికులకు సంబంధించి నో డాటా.. రైతు ఆత్మహత్యల గురించి నో డాటా..ఆర్థిక ఉద్దీపనపై తప్పుడు డాటా, కోవిడ్ -19 మరణాలపై సందేహాస్పద డాటా, జీడీపీ వృద్ధిపై మేఘావృత డాటా. ఈ ప్రభుత్వం ఎన్డీఏ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుంది’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) No #data on migrant workers, no data on farmer suicides, wrong data on fiscal stimulus, dubious data on #Covid deaths, cloudy data on GDP growth — this Government gives a whole new meaning to the term #NDA! pic.twitter.com/SDl0z4Hima — Shashi Tharoor (@ShashiTharoor) September 22, 2020 వ్యవసాయ రంగంలో సంభవించే ఆత్మహత్యలు, అందుకు గల కారణాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి డాటా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో శశి థరూర్ ఈ ట్వీట్ చేశారు. అంతేకాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి డాటా లేదని నివేదించాయని తెలిపారు. ఈ పరిమితి కారణంగా, వ్యవసాయ రంగంలో ఆత్మహత్యకు గల కారణాలపై జాతీయ సమాచారం ఆమోదించడం కానీ విడిగా ప్రచురించడం కానీ జరగలేదు’ అని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో మరణించిన వలసదారుల సంఖ్యపై తమ దగ్గర ఎలాటి డాటా లేదని గతంలో పార్లమెంటులో ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. -
శ్రామిక్ రైళ్లలో 97 మంది వలస కార్మికులు మృతి!
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంత ఊర్లకు తరలించేందుకు కేంద్రం శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రామిక్ స్పెషల్ రైళ్లలో సంభవించిన మొత్తం మరణాల వివరాలపై శుక్రవారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. స్వస్థలాలకు వెళ్లే క్రమంలో మొత్తం 97 మంది వలస కార్మికులు శ్రామిక్ రైళ్లలో ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. (గుడ్ న్యూస్ : మరో 40 స్పెషల్ రైళ్లు ) కాగా ఇటీవల వలస కార్మికుల మరణాల గురించి తమ వద్ద ఎలాంటి లెక్కలు లేవని కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై ప్రతిపక్షలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్ర తొలిసారిగా శ్రామిక్ రైళ్లలో సంభవించిన మరణాల లేక్కలను రాజ్యసభలో ప్రకటించింది. అయితే, ఆయా రాష్ట్రాల పోలీసులు వీటిని అసహజ మరణాలుగా పరిగణిస్తూ సెక్షన్ 174 కింద కేసులు నమోదు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. మొత్తం కేసుల్లో 87 కేసులకు సంబంధించి మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించినట్లు వెల్లడించారు. అందులో 51 కేసుల్లో బాధితులు గుండె పోటు, లివర్, ఊపరితిత్తుల సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు లాంటి కారణాలతో మరణించినట్టు తేలింది. (నాడు గాలికి వదిలేసి.. ఇప్పుడు రమ్మంటే) -
సమాచార లోపం సరికాదు
దేశం ఇంకా కరోనా వైరస్ మహమ్మారి గుప్పెటనుంచి బయటపడని వేళ... ఆర్థిక సంక్షోభం పర్యవ సానంగా కోట్లాదిమంది ఉపాధి అవకాశాలు అడుగంటుతున్న వేళ... 18 రోజుల పార్లమెంటు వర్షా కాల సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. పార్లమెంటు లోపలా, వెలుపలా కనబడుతున్న దృశ్యాలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యలు ఎంత పకడ్బందీగా అమలవుతున్నాయో అర్థమవు తుంది. పార్లమెంటు రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆర్నెల్లు మించరాదన్న రాజ్యాంగ నిబంధన వుంది గనుక అది ముగుస్తున్న తరుణంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది సభ్యులు గుమిగూడే పరిస్థితులు తలెత్తకుండా ఉభయ సభలూ చెరో పూట సమావేశమ య్యేలా ఏర్పాట్లు చేశారు. తక్కువ వ్యవధిని కారణంగా చూపి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. అయితే సభ్యులడిగే ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు అందుబాటులో వుంటాయని ఉభయ సభల అధ్యక్షులూ ప్రకటించారు. కానీ తొలిరోజే వలస కార్మికుల మరణాలపై తమ వద్ద ఎలాంటి డేటా లేదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ జవాబివ్వడం దిగ్భ్రాంతి కలిగి స్తుంది. అంతేకాదు... రాష్ట్రాలవారీగా ఎంతమంది వలస కార్మికులకు ఉచిత రేషన్ వగైరాలు అందాయో చెప్పలేమని తెలిపింది. కరోనా విపత్తుతో గత మార్చి 24 నుంచి దేశమంతా లాక్డౌన్ విధించారు. కొన్నాళ్లపాటు పౌరుల కదలికలను పూర్తిగా స్తంభింపజేస్తేనే కరోనా కట్టడి సాధ్యమని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దాన్ని అమల్లో పెట్టేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సక్రమంగా లేకపోవడంతో వలస జీవులు ఒక్కసారిగా కష్టాల్లో పడ్డారు. ఉపాధి పోయి, గూడు చెదిరి ఏం చేయాలో తోచక, ఎలా పొట్ట నింపుకోవాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు. ఉన్నచోటే వుంటే దిక్కులేని చావు చస్తామన్న భయంతో స్వస్థలాలకు పోవడానికి నిర్ణయించుకున్నారు. లాక్డౌన్ వల్ల సమస్త కార్యకలాపాలూ స్తంభించిపోవడంతో వీరంతా నడకదారిని ఎంచుకోక తప్పలేదు. వీరిలో వలస కూలీలు, కార్మికులు, చిన్నా చితకా వ్యాపారులు వున్నారు. ఇలా మొత్తం కోటి నాలుగు లక్షల అరవై ఆరువేలమంది స్వస్థ లాలకు వెళ్లారని కార్మిక శాఖ చెబుతోంది. అధికంగా ఉత్తరప్రదేశ్‌కు 32.5 లక్షలమంది వలస కార్మి కులు తిరిగిరాగా, ఆ తర్వాత స్థానంలో బిహార్(15 లక్షలమంది), పశ్చిమబెంగాల్(13.38 లక్షల మంది) వున్నాయి. 63లక్షలమందికిపైగా వలస జీవుల్ని ప్రత్యేక రైళ్ల ద్వారా చేరేశారని కూడా ఆ శాఖ వివరించింది. అయితే లాక్డౌన్ మొదలైన నెల తర్వాత మాత్రమే ఈ ప్రత్యేక రైళ్లు నడిపారని మరిచిపోకూడదు. అనేకానేక కారణాలవల్ల ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేనివారు కూడా నడవక తప్పలేదు. ఇలాంటివారంతా ఎన్నో యాతనలు పడ్డారు. కొందరు ఆకలిదప్పులకు తట్టుకో లేక మరణించారు. మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుని చనిపోయారు. గాయాలపాల య్యారు. కొన్ని సందర్భాల్లో వారు వెళ్లే దారిలో తారసపడిన వాహనాలెక్కి, అవి ప్రమాదాలపాలవ డంతో మరణించినవారున్నారు. మహారాష్ట్రలో రైల్వే ట్రాక్‌పై ఆదమరిచి నిద్రపోతూ 17మంది వలసకూలీలు చనిపోయారు. సుదూర ప్రాంతం నడిచిన కారణంగా ఒంట్లో సత్తువ కోల్పోయి మృత్యువాత పడిన ఉదంతాలున్నాయి. ఈ వలస జీవులకు పేరూ ఊరూ లేకపోవచ్చు. కానీ మహా నగరాల, పట్టణాల నిర్మాణం, వాటి మనుగడ వీరిపైనే ఆధారపడివుంటుంది. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో, రహదారుల నిర్మాణంలో, పారిశుద్ధ్యంలో, వ్యాపారాల్లో, ఫ్యాక్టరీల్లో, సంపన్నులు, మధ్యతరగతి వర్గాల ఇళ్లల్లో వీరు లేకపోతే అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోతాయి. వలస కార్మి కుల శ్రమ విలువ జీడీపీలో పది శాతమని గణాంకాలు చెబుతున్నాయి. ఏ రిజిస్టర్లోనూ, రికార్డు ల్లోనూ చోటు దొరకని ఈ అభాగ్యులు సంక్షోభం ముంచుకొచ్చేసరికి ఎవరికీ కాకుండా పోయారు. బతికుండగానే ఎవరికీ కానివారు మరణించాక మాత్రం ఏం లెక్కలోకి వస్తారు? అందుకే ప్రభుత్వాల దగ్గర వారి మరణాల గురించిన లెక్కలు లేవనుకోవాలి. కనీసం ఆ వలసజీవుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేసే సంస్థలనైనా ప్రభుత్వాలు సంప్రదించివుంటే ఏదో మేరకు గణాంకాలు లభ్యమయ్యేవి. అలా మరణించినవారిపై ఆధారపడిన కుటుంబాలకు సాయం అందిం చడం సాధ్యమయ్యేది. ఆ ప్రయత్నం చేస్తామని కూడా చెప్పకుండా తమ వద్ద డేటా లేదన్న సమా ధానం ఇవ్వడం కేంద్రానికి భావ్యం కాదు. రహదారి భద్రత గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థ సేవ్ లైఫ్ ఫౌండేషన్ లాక్డౌన్లో రోడ్డు ప్రమాదాల బారినపడి మరణించినవారి వివరాలు సేకరించింది. ఆ సంస్థ గణంకాల ప్రకారం 198మంది వలస జీవులు లాక్డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. మార్చి 25–మే 31మధ్య దేశవ్యాప్తంగా 1,461 ప్రమాదాలు చోటుచేసుకోగా, అందులో 750మంది మరణించారని, మృతుల్లో 198మంది వలసజీవులని సంస్థ డేటా వెల్లడించింది. అయితే ఇది సమగ్రమైన నివేదికని చెప్పలేం. వనరుల రీత్యా స్వచ్ఛంద సంస్థలకు అనేక పరిమితులుం టాయి. కానీ ప్రభుత్వాలకేమైంది? వలసజీవులు పిల్లాపాపలతో స్వస్థలాలకు నడుచుకుంటూ పోవడం దేశ విభజన తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న అతి పెద్ద ఉత్పాతమని సామాజిక రంగ నిపుణులు అభివర్ణించారు. ఎంతమంది వలస కార్మికులు, కూలీలు నడిచిపోయారో చెప్పలేకపో యినా, కనీసం ప్రమాదాల్లో చిక్కుకుని ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో లెక్కలు చెప్పలేని స్థితి వుండకూడదు. ఎందుకంటే చిన్నదో పెద్దదో ప్రతి ప్రమాదమూ సమీప పోలీస్‌స్టేషన్‌లో తప్పని సరిగా నమోదవుతుంది. అందులో చిక్కుకున్నవారు ఎటునుంచి ఎటుపోతున్నారో రికార్డవుతుంది. ఎందరు మరణించారో, గాయపడ్డారో వివరాలుంటాయి. కనీసం ఇప్పుడైనా ఆ డేటాను అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి పార్లమెంటుకు సమర్పించడం, బాధిత కుటుంబాలకు పరిహారం అందిం చడం అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. -
మళ్లీ నగరం బాట పడుతున్న వలసజీవులు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఉపాధిపై భరోసా లేక బతుకుజీవుడా అంటూ సొంతూరు బాటపట్టిన వలస జీవులు తిరిగి నగర బాట పడుతున్నారు. కొన్ని నెలల క్రితం స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులకు ప్రస్తుతం అక్కడ సైతం ఉపాధి కరువైంది. ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. తమ సొంతవారిని కలిశామన్న తృప్తి తప్ప చేసేందుకు తగినంత పని లేకుండా పోయింది. కుటుంబ పోషణ కష్టమైంది. నగరంలో కోవిడ్ ఉద్ధృతి తగ్గకున్నా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ వచ్చేందుకు కొందరు సిద్ధమవుతుండగా.. మరికొందరు కరోనా కేసులు పెరుగుతుండటంతో వెనక్కి రావడానికి ఇష్టపడటం లేదు. కొందరు రావడానికి రెడీ అవుతున్నా వారి కుటుంబ సభ్యులు అడ్టుకుంటున్నారు. అయినా పాత పనులకు సై అంటున్నారు. పరిస్థితులు తారుమారు.. కరోనా మహమ్మారితో పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతం వలస కూలీల కొరత ఏర్పడింది. భవన నిర్మాణ కార్మికుల కొరత కాంట్రాక్టర్లను వేధిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. స్థిరాస్తి రంగం పడిపోయింది. అమ్మకాలు విపరీతంగా తగ్గాయి.. వలస కూలీలు లేకుంటే పనులు జరగవు. దీంతో వెనక్కి రప్పించడానికి కాంట్రాక్టర్లు తీవ్రంగా తంటాలు పడుతున్నారు. మునుపటి కంటే ఎక్కువ జీతం, ఉచిత గది, ఇతర సౌకర్యాలు వంటివి కల్పిస్తామని చెబుతున్నారు. దీంతో కొంతమంది వలస కూలీలు తిరిగి వస్తుండటంతో నిర్మాణ రంగం, సూక్ష్మ పరిశ్రమలకు జీవం వస్తోంది. తాజాగా వివిధ మార్గాల్లో వలసజీవులు తిరిగి వస్తుండటంతో భవన నిర్మాణ రంగం కాంట్రాక్టర్లు, సూక్ష్మ పరిశ్రమల యాజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. -
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేసిన సోనూసూద్ తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. (చదవండి : త్వరలోనే వస్తా.. మిమ్మల్ని కలుస్తా: సోనూసూద్) ‘‘20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలూ కల్పిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రవాసీ రోజ్‌గార్ ద్వారా ఈ మంచి పని కోసం అందరం కష్టపడ్డామని, ఎన్ఏఈసీ అధ్యక్షుడు లలిత్ ఠుక్రాల్ ఎంతో సాయం చేశారని, కార్మికులందరికీ ఆరోగ్యకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తామని సోనూసూద్ హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల పడుతున్న వలస కార్మికుల సాయం కోసం సోనూసూద్ ఓ టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఆయన ఇటీవల ఒక స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను కూడా ప్రారంభించారు. -
నిరుద్యోగ భూతం.. పెరిగిన శాతం
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగభూతం రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో అది 9.1 శాతానికి చేరుకుంది. గత తొమ్మిది వారాల్లో జాతీయస్థాయిలో ఇదే అత్యధికం. ఆగస్ట్ 16తో ముగిసిన వారాంతానికి జాతీయస్థాయిలో చూస్తే... పట్టణాల్లో 9.61 శాతం, గ్రామాల్లో 8.86 శాతం నిరుద్యోగం నమోదైనట్టు సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడైంది. ఆగస్టు 9 తేదీ నాటికి 8.67 శాతమున్న దేశ నిరుద్యోగ శాతం ఆగస్టు 16 నాటికి 9.1 శాతానికి పెరిగింది. ఈ నెలలో వ్యవసాయ కార్యకలాపాలు తగ్గడం, వలస కార్మికులు నగరాలు, పట్టణాల బాట పట్టడం నిరుద్యోగ శాతం పెరగడానికి కారణాలు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్ తగ్గుదలతో ఉద్యోగ అవకాశాల్లో కోత పడినట్టు భావిస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక ట్రెండ్ కావచ్చని మరికొందరు ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ ప్రభావం.. వేతనాలు, ఉద్యోగాల (శాలరీడ్ జాబ్స్)పై అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌తో ముగిసిన నెలకు 6.84 కోట్ల శాలరీడ్ జాబ్స్ తగ్గగా, జూలై మాసాంతానికి 6.72 కోట్లకు చేరుకున్నట్టు సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీల్లో ఏవిధంగా ఉందంటే.. ► తెలంగాణలో 9.1 శాతం నిరుద్యోగం నమోదైంది ► ఛత్తీస్‌గఢ్‌లో 9, తమిళనాడులో 8.1, జార్ఖండ్‌లో 8.8 శాతం ► ఆంధ్రప్రదేశ్‌లో 8.3 శాతం, కేరళలో 6.8 శాతం ► పశ్చిమబెంగాల్లో 6.8 శాతం, యూపీలో 5.5 శాతం నిరుద్యోగం అగ్రస్థానంలో హరియాణా ► హరియాణా 24.5 శాతం నిరుద్యోగంతో టాప్‌ప్లేస్‌లో ఉంది ► పుదుచ్చేరి 21.1, ఢిల్లీ 20.3 శాతంతో రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి ► హిమాచల్ ప్రదేశ్ 18.6 శాతంతో నాలుగోస్థానం, గోవా 17.1 శాతంతో ఐదో ప్లేస్‌లో నిలిచింది. అతి తక్కువ నిరుద్యోగమున్న రాష్ట్రాలివే... ► ఒడిశా, గుజరాత్‌ల్లో 1.9 శాతం చొప్పున అత్యల్ప నిరుద్యోగం ► మేఘాలయ 2.1, అస్సాం 3.2, మధ్యప్రదేశ్, కర్ణాటక 3.6 శాతం చొప్పున ► మహారాష్ట్ర 4.4, సిక్కింలో 4.5 శాతం నిరుద్యోగం 10 శాతానికిపైగా నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► త్రిపురలో 16.4, రాజస్తాన్‌లో 15.2, ఉత్తరాఖండ్‌లో 12.4 శాతం నిరుద్యోగం ► బిహార్‌లో 12.2, జమ్మూ,కశ్మీర్లో 11.2, పంజాబ్‌లో 10.4 శాతం నిరుద్యోగం -
22 రోజులు.. 110 కిలో మీటర్లు..
సాక్షి, హైదరాబాద్: కూటి కోసం.. కూలి కోసం.. కాంట్రాక్టర్ మాటలు నమ్మి.. వెంట వెళ్లిన కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. చేతిలో చిల్లిగవ్వలేక.. కరోనా వేళ కరుణించేవారు లేక.. కళ్లలో ఆశలుడిగి కాలినడకన బయలుదేరిన ఆ కూలీ కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. 22 రోజులుగా నడిచి నడిచి, ఎడతెరిపిలేని వాననీటిధారలోనే ఎడతెగని కన్నీటిధార కలిసిపోయిన ఆ పేద జంటకు ఎంత కష్టం.. ఎంత కష్టం.. చివరికి కూలీని మరో కూ లీ చెంతకు తీసుకొని చింత తీర్చి మానవత్వం ఇంకా కూలిపోలేదని నిరూపించిన ఘటన ఇది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌కు చెందిన భాషబోయిన రమేశ్ దినసరి కూలీ. రెండు నెలల కిందట గుంటూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ మాటలు నమ్మి భార్య లక్ష్మి, కుమారుడు చక్రిని తీసుకుని ఉపాధి కోసం విశాఖపట్నం వెళ్లాడు. తీరా పనిచేయించుకున్న కాంట్రాక్టర్ వారికి చెప్పాపెట్టకుండా ఎటో ఉడాయించాడు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది. ఎన్నిరోజులు ఎదురుచూసినా తిరిగిరాలేదు. తనతోపాటు పలువురు స్థానిక, మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు కూడా ఆ కాంట్రాక్టర్ కూలి డబ్బులు ఎగ్గొట్టాడు. దీంతో మోసపోయామని గ్రహించిన రమేశ్ భార్యాబిడ్డలతో కలసి స్వగ్రామానికి తిరిగి వెళ్లాలనుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చాలామందిని చార్జీ డబ్బుల కోసం బతిమిలాడాడు. కరోనా విజృంభిస్తున్నవేళ ఎవరూ వారిని కరుణించలేదు. కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తుండటంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. రూ.100 చేతిలో పెట్టి వెళ్లిపొమ్మన్నారు. లారీ డ్రైవర్లు కూడా వారిని వాహనంలోకి ఎక్కించుకునేందుకు నిరాకరించారు. 22 రోజులపాటు పట్టాల వెంబడే నడక..! చేసేదేమీ లేక కాలినడకన రైలు పట్టాల వెంట విశాఖపట్నం నుంచి వరంగల్‌కు బయల్దేరింది ఆ కూలీ కుటుంబం. మార్గమధ్యంలోనూ చాలామందిని అర్థించినా ఫలితం లేకుండా పోయింది. సరిగా తిండి లేకపోవడంతో రోజుకు 4–5 కి.మీ. మాత్రమే నడిచేవారు. స్టేషన్లలో ప్రయాణికులను బతిమిలాడుతూ.. పొట్టనింపుకున్నారు. పట్టాల వెంబడే నిద్రపోవడంతో రమేశ్ కుమారుడు చక్రీకి, భార్య లక్ష్మికి పలుమార్లు తేళ్లు కుట్టాయి. అయినా గుండెధైర్యంతో 22 రోజులపాటు పట్టాల వెంట నడక సాగించారు. మధ్యలో ఐదురోజులపాటు ఏకధాటి వాన కురుస్తున్నా నడుస్తూనే ఉన్నారు. దాదాపు 110 కిలోమీటర్ల అనంతరం రాజమండ్రి సమీపంలోని లక్ష్మీనారాయణపురం రైల్వేస్టేషన్ వద్దకు బుధవారం రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ పనులు చేసుకుంటున్న రైల్వే కూలీ డేవిడ్ వారిని గుర్తించి వివరాలు వాకబు చేశాడు. డేవిడ్ ఇటీవల తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్‌గా సెలక్టయ్యాడు. ట్రైనింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో కూలి పనులు చేసుకుంటున్నాడు. రమేశ్ తన పరిస్థితి చెప్పగానే డేవిడ్, అతని మిత్రులంతా కలిసి ఆ కుటుంబాన్ని చేరదీశారు. ఆకలి తీర్చి, ఆ రాత్రికి తమ వద్దే ఆశ్రయమిచ్చారు. మర్నాడు డేవిడ్ తాను పనిచేసే ఎంఎంఆర్ సంస్థ అధికారులకు, తోటి కూలీలకు, తెలంగాణలోని టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు విషయం వివరించాడు. దీంతో వారంతా కలసి రమేశ్ కుటుంబానికి ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్‌చేశారు. కూలీలంతా కలసి రాజమండ్రి వరకు ఆటో మాట్లాడి వారిని అందులో ఎక్కించారు. దారి ఖర్చులకు డబ్బులిచ్చారు. రాజమండ్రిలో వరంగల్ రైలెక్కించి మానవత్వం చాటుకున్నారు. -
‘ఇప్పటికే రూ.10 కోట్లు.. ఇంటికి పంపించండి’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. దాంతో భారత్ నుంచి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఎందరో కార్మికులు తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల నుంచి సుమారు 20 వేల మంది తెలంగాణ వాసులు హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వీరందరిని స్వస్థలాలకు పంపించకుండా హైదరాబాద్‌లోనే క్వారంటైన్లో ఉంచింది ప్రభుత్వం. ఈ క్రమంలో తొలుత వచ్చిన 5,500 మందికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పించింది. అయితే జూన్ 7 ‘వందే భారత్ మిషన్’లో భాగంగా దాదాపు 14,500 వేల మంది తెలంగాణ వాసులు గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చారు. వీరందరికి ఉచిత క్వారంటైన్ కల్పించడం కష్టంగా భావించిన సర్కార్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 8,000 రూపాయలు వసూలు చేసి హోటల్స్‌లో క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ఇలా ప్రభత్వం వీరి దగ్గర నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. (ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?) తాజాగా హోటల్ సిబ్బంది మరోసారి డబ్బులు కట్టాల్సిందిగా వీరిని డిమాండ్ చేస్తున్నారు. అసలే ఉద్యోగాలు కోల్పోయి స్వదేశం వచ్చారు. ఇంకా ఇళ్లకు కూడా వెళ్లలేదు. చేతిలో ఉన్న కొద్ది మొత్తం క్వారంటైన్ పేరుతో హోటల్‌కే ఖర్చయ్యింది. ప్రస్తుతం జేబులో రూపాయి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి హోటల్లో క్వారంటైన్లో ఉండలేము.. మమ్మల్ని హోం ఐసోలేషన్‌కు అనుమతించండి అంటూ గల్ఫ్ కార్మికులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా వలసకార్మికుల సంక్షేమ సంఘం సభ్యుడు ఎం. బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. 14,500 మంది దగ్గర నుంచి ఎనిమిది వేల చొప్పున 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు రావడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి సగటున 1,000 యూఏఈ దిర్హామ్స్, సౌదీ / ఖతారి రియాల్స్ (సుమారు రూ .20,000) ’వసూలు చేశారని తెలిపారు. (క్వారంటైన్ నుంచి భార్యాభర్తల పరార్) ఈ లెక్క ప్రకారం, 20,000 మంది వలసదారులు ఉంటే ఒక వ్యక్తి నుంచి 20,000 రూపాయల చొప్పున మొత్తం 40 కోట్ల రూపాయలు వసూల చేశారని తెలిపారు బాల్‌రెడ్డి. అంతేకాక ‘కేరళ, మహారాష్ట్రల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని ‘హోం క్వారంటైన్’కు అనుమతిస్తున్నారు. ఇక ఏపీ, ఢిల్లీలో గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తోన్న పేద వలస కార్మికుల కోసం ప్రభుత్వాలే ఉచిత క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నాయి’ అని తెలిపారు బాల్‌రెడ్డి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సంక్షోభాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఆగస్టు 13 వరకు 46,488 మంది ప్రయాణికులు వందే భారత్ మిషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వీరంతా 30 దేశాల నుంచి 285 విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నారు.