సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి కొంచెం సడలిస్తుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వలసలు మళ్లీ ఆరంభమయ్యాయి. రాష్ట్రంలోని 30 జిల్లాలకు గానూ 11 చోట్ల మాత్రమే మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగిస్తుండగా, మిగతా 19 జిల్లాలకు సోమవారం నుంచి పరిమితంగా సడలింపు లభించింది. ఇందులో బెంగళూరు కూడా ఉంది. దీంతో ఆదివారం బెంగళూరులోని రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి.
వేలాది మంది వలస కూలీలు వచ్చారు. బయటి నుంచి వస్తున్నవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని సీఎం యడియూరప్ప ఆదేశించారు. దీంతో ప్రత్యేక శిబిరాలు పెట్టి నమూనాల సేకరణ చేపట్టారు. కాగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తివేస్తే థర్డ్ వేవ్ తలెత్తుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment