COVID-19 Third Wave Scare: Karnataka To Impose Strict Covid Rules After Aug 15- Sakshi
Sakshi News home page

Covid Third Wave: 2 శాతం పాజిటివిటీ దాటితే మళ్లీ లాక్‌డౌన్‌..?  

Published Sun, Aug 15 2021 8:16 AM | Last Updated on Sun, Aug 15 2021 1:24 PM

COVID19 Third Wave Scare: Karnataka Likely To Impose Stricter Rules After August 15 - Sakshi

సాక్షి, బెంగళూరు: కరోనా మూడో ఉధృతి వ్యాప్తి భయాలు విస్తరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షల వైపు మొగ్గుచూపుతోంది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన నిపుణులు, అధికారులతో కీలక సమావేశం జరిగింది. థర్డ్‌ వేవ్‌ను అడ్డుకోవాలంటే లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను విధించక తప్పదని నిర్ణయించారు.

కఠినతరం చేస్తాం: సీఎం..  
సమావేశ అనంతరం సీఎం బొమ్మై మీడియాతో వివరాలు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ అవసరం లేదు. కొత్త నిబంధనల బదులు ఉన్న వాటినే కఠినతరం చేస్తాం. కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నారులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు కాబట్టి పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని తెలిపారు. తాజా నిబంధనలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండబోవని చెప్పారు.  
ఆంక్షలకే నిపుణుల సిఫార్సు..  

  • కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం దాటిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ చేస్తే బాగుంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణాలను నిషేధించాల్సిందేనని ఈ సమావేశంలో నిపుణులు పేర్కొన్నారు. 
  • పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి సెప్టెంబరు వరకు వేచి ఉంటే మేలు అని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ బదులు వారాంతపు కర్ఫ్యూ అమలు చేయడం ఉత్తమం. పండుగలు, జాతరల్లో జన సమ్మర్దాన్ని నివారించాలి. 
  • ఇతర రాష్ట్రాలవారికి నెగిటివ్‌ రిపోర్టు వస్తేనే అనుమతించాలి. సరిహద్దు జిల్లాల్లో కరోనా పరీక్షలను పెంచడంతో పాటు అందరికీ టీకా అందేలా చూడాలి అని అభిప్రాయపడ్డారు.  

కరోనా తీవ్రత పెరిగిన చోట ఈ నిబంధనలు విధిస్తారు  

  • అంత్యక్రియలకు 10 మందే హాజరు కావాలి.
  • పబ్‌లు, బార్లు, జిమ్‌లు, యోగా సెంటర్లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాల బంద్‌
  • దేవస్థానాల్లో భక్తుల ప్రవేశం నిషేధం.
  • ర్యాలీ, బహిరంగ సమావేశాలకు అనుమతి లేదు.
  • జన రద్దీ మార్కెట్‌లను తాత్కాలికంగా మూసేయాలి.
  • ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల విక్రయాలు
  • వారాంతపు కర్ఫ్యూ శుక్రవారం సాయంత్రం 7 నుంచి మొదలవుతుంది.
  • కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో విద్యాసంస్థలకు అవకాశం. ఒకవేళ పాఠశాలల్లో కేసులు నిర్ధారణ అయితే వారం రోజుల పాటు బంద్‌ చేయాల్సి ఉంటుంది.
  • బెంగళూరులో వారాంతపు కర్ఫ్యూ ఉండదు. పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉంది. దాటితే నిబంధనల్లో మార్పు ఉంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement