Karnataka CM
-
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
-
ఈవీఎంల సహాయంతో కాదయ్యా సార్ అన్నది!
-
సాక్షి లేటెస్ట్ కార్టూన్: 27-09-2024
-
కర్నాటక సీఎంకు ‘సుప్రీం’లో ఊరట!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. 2022లో జరిగిన నిరసనల్లో రోడ్డును బ్లాక్ చేశారంటూ సీఎం సిద్ధరామయ్యపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఫిర్యాదుదారునికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులపై విచారణకు సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగా రెడ్డి, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాలకు ఈ నెల మొదట్లో కర్ణాటక హైకోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే వారంతా ప్రజాప్రతినిధి కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళతే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బెలగావి నివాసి. ఆయన ఉడిపిలోని ఓ హోటల్లో శవమై కనిపించాడు. తన కాంట్రాక్టు పనులలో నాటి మంత్రి ఈశ్వరప్ప కమీషన్ డిమాండ్ చేశారని సంతోష్ పాటిల్ ఆరోపించాడు. ఆ తర్వాత మంత్రి ఈశ్వరప్ప తనపై వస్తున్న ఆరోపణలను తిరస్కరించడమే కాకుండా సంతోష్ పాటిల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఆ తరువాత పాటిల్ వాట్సాప్ మెసేజ్‌లో తన మరణానికి మంత్రి మంత్రి ఈశ్వరప్ప బాధ్యుడని పేర్కొన్న విషయం వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో 2022 ఏప్రిల్‌లో ఇదే కేసులో కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రస్తుత సీఎం సహా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. నాటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇంటిని చుట్టుముట్టడంతోపాటు పలు రహదారులను బ్లాక్ చేశారు. దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. -
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ!
సుధీర్ఘ మంతనాల తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి వ్యవహారం కొలిక్కి వచ్చింది. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఒక్కరే ఉంటారని తెలిపారు. దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.30కు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే సిద్ధరామయ్యనే సీఎంగా అవుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానంతోపాటు ఎమ్మెల్యేలు సైతం సినీయారిటీకే మొగ్గుచూపారు. అయితే సీఎం పదవి తప్ప మరే స్థానం అవసరం లేదంటూ డీకే బెట్టు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించేందుకు పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. చదవండి: నేను పూర్తి సంతోషంగా లేను: డీకే శివకుమార్ సుధీర మంతనాలు సీఎంపై ఏకాభిప్రాయం కోసం గత మూడు రోజులుగా సిద్ధరామయ్య, డీకేశివకుమార్తో అధిష్టానం మంతనాలు జరిపినప్పటికీ పంచాయితీ ఎటూ తేలలేదు. సీఎం పీఠం నుంచి తగ్గేదేలే అంటూ డీకే తేగేసి కూర్చున్నారు. దీంతో డీకేను సముదాయించేందుకు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ విస్తృతంగా చర్చలు జరిపారు. సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత చివరకు డీకే.. అధిష్ఠానం ప్రతిపాదనలను అంగీకరించారు. డీకేను బుజ్జగించిన సోనియా అయితే డిప్యూటీ సీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సోనియా జోక్యంతో ఉప ముఖ్యమంత్రి పదవికి డీకే అయిష్టంగానే అంగీకరించినట్లు వర్గాలు పేర్కొన్నాయి. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా సోనియా డీకేతో మాట్లాడి బుజ్జగించినట్లు తెలిపాయి. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సోదరుడు డీకే సురేష్ తెలిపారు. ‘మా అన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు. ఈ నిర్ణయంతో మేం సంతోషంగా లేము. కేవలం కర్ణాటక, పార్టీ ప్రయోజనాలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాడు’ అని పేర్కొన్నారు. చదవండి: జల్లికట్టు వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు -
ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం పదవి ఎవరికి దక్కుతుందా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపైనే అధిష్టానంతో చర్చలు జరిపేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు హస్తిన వెళ్లారు. సిద్ధరామయ్య, డీకేలు సీఎం పదవి చెరో రెండేళ్లు చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించిందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ డీకే కీలకవ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. అసలు ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమీ తమ ముందుకు రాలేదని చెప్పారు. అలాగే సిద్ధరామయ్యకు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దీంతో ఆయనకే అవకాశం లభిస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా డీకే స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని, దీన్ని ఎవరు విడగొట్టలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్దతు గురించి అసలు అంత కచ్చితంగా సంఖ్య ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో డీకే పక్కనే ఉన్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేల మద్దతుపై ఇంకా కౌంటింగ్ జరాగాల్సి ఉందని జోకులు పేల్చారు. మరోవైపు కర్ణాటక సీఎం ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం బేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకేతోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపనుంది. ఇద్దరిని బుజ్జగించి సాయంత్రం వరకు సీఎం ఎవరనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. కాగా.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని డీకే అంతకుముందే స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేలను విడగొట్టనని, వెన్నుపొటు పొడవనని స్పష్టం చేశారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని తేల్చిచెప్పారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న తదుపరి సవాల్ అని డీకే తెలిపారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. -
నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతయుతంగా ఉంటానని స్పష్టం చేశారు. తాము 135 సీట్లు గెలిచామని, ఎవరినీ విడగొట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని డీకే స్పష్టం చేశారు. వెన్నుపోటు పొడవనని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయనని గాంధీ కుటుంబం పట్ల తన విధేయతను చాటుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తము ముందున్న సవాల్ అని డీకే తెలిపారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. సీఎం ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లడానికి ముందు ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. రెండున్నరేళ్లు వద్దు..! కాగా.. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్యీ తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అంతిమ నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడిదేనని సీఎల్పీ ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే సీఎంగా ఇద్దరికీ చెరో రెండేళ్లు ఇస్తామని హైకమండ్ చేసిన ప్రతిపాదనకు డికే ససేమిరా అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలో రెండు రోజులుగా ఈ విషయంపై అదిష్ఠానం మంతనాలు జరుపుతోంది. సిద్ధరామయ్య కూడా ఢిల్లీలోనే ఉన్నారు. డీకే శివకుమార్‌ను కూడా సోమవారమే ఢిల్లీకి పిలిచినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ఆయన వెళ్లలేదు. ఒక రోజు ఆలస్యంగా మంగళవారం వెళ్తున్నారు. సాయంత్రంలోగా కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై స్పష్టత అవకాశం ఉంది. నూతన సీఎం ప్రమాణస్వీకారం గురువారం జరగనుంది. మంత్రులు కూడా ఆరోజే ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. మే 10 జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 135 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. అధికార బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19 సీట్లతో సరిపెట్టకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. చదవండి: గహ్లోత్‌కు సచిన్ పైలట్ అల్టిమేటం -
‘రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. మళ్లీ ప్రయోగిస్తారేంటి?’
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. రాహుల్ గాంధీ ఓ విఫలమైన క్షిపణిగా అభివర్ణించారు. భారత్ జోడో యాత్ర పేరుతో మరోమారు ఫెయిల్డ్ మిసైల్‌ను కాంగ్రెస్ ప్రయోగిస్తోందని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం ఏకమైందని, ఫెడరలిజాన్ని నమ్ముతున్న తరుణంలో ఇలాంటి యాత్రలు అర్థరహితమని దుయ్యబట్టారు. ‘దేశం బలమైన స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతంలోనే రాహుల్ గాంధీ అనే మిసైల్ విఫలమైందని నేను చెప్పాను. ఇప్పుడు, మళ్లీ ఆయన్నే కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. దానిని పక్కనబెడితే.. అసలు ఈ యాత్రకు అర్థమే లేదు.’ అని పేర్కొన్నారు బొమ్మై. దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతున్న తరుణంలో క్రమంలో దేశాన్ని ఏకం చేస్తామనేందుకు అసలు అవకాశమేలేదన్నారు బొమ్మై. జీ7తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటే.. భారత్ 7 శాతం వృద్ధి నమోదు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ చేపట్టిన జన సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. ఇదీ చదవండి: బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని విభజిస్తున్నాయి.. అందుకే పాదయాత్రకు ఆ పేరు.. -
పేటీఎం తరహాలో ‘పేసీఎం’.. క్యూఆర్ కోడ్‌తో నేరుగా..!
బెంగళూరు: కర్ణాటక అధికార పార్టీ బీజేపీపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖచిత్రం, క్యూఆర్ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్లను బెంగళూరు మొత్తం ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్ ప్రారంభించింది. కొద్ది రోజులుగా బీజేపీ పాలనలో 40 శాతం కమిషన్ తప్పనిసరిగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. 40 శాతం కమిషన్‌ను ఎత్తిచూపేలా ఈ వెబ్సైట్, పోస్టర్లను డిజైన్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టేందుకు గత వారమే ప్రచారం మొదలు పెట్టింది కాంగ్రెస్. 40percentsarkara.com ద్వారా ప్రభుత్వ అవినీతిని నివేదించాలని, వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు సూచిస్తోంది. రాష్ట్ర పరిపాలన విభాగం 40శాతం కమిషన్‌తో నడుస్తోందని, దోపిడీదారులతో నిండిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కొద్ది రోజుల క్రితమే ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నోరు విప్పే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్ -
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవారంతా తక్షణమే ఐసోలేషన్లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించాకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తనకు కరోనా సోకడంతో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. I have tested positive for Covid-19 with Mild symptoms and have isolated myself at home. Those who came in touch with me in last few days, kindly isolate yourself and get urself tested. My trip to Delhi stands cancelled. — Basavaraj S Bommai (@BSBommai) August 6, 2022 అయితే బొమ్మై జులై 25, 26న ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన వివిధ శాఖల ప్రతినిధులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఆయనకు పాజిటివ్‌గా తేలడం వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. చదవండి: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు జాతీయ జెండా పంపిన.. మోహన్ మార్కం, ఎందుకంటే? -
‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక!
బెంగళూరు: భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నేత ప్రవీణ్ నెట్టార్‌ను పొట్టనబెట్టుకున్న వారిపై కఠిన చర్యలుంటాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. దేశ వ్యతిరేకులు, మతతత్వ శక్తులను ఏరిపారేసేందుకు అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రవీణ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రవీణ్ హంతకులను ఎన్కౌంటర్ చేయాలని కర్ణాటక మంత్రి సీఎన్ అశ్వత్థ నారాయణ్ అన్నారు. ప్రవీణ్‌ను దక్షిణ కన్నడ జిల్లాలోని ఆయన సొంతూరులో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బైక్‌పై వెంబడించి దారుణ హత్య.. దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు ఈనెల 27న దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ప్రవీణ్ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. కాగా.. ప్రవీణ్ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్నారు. అయితే, మంగళవారం రాత్రి షాప్‌ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి మరీ నరికి చంపారు. ఇదీ చదవండి: Karnataka BJP Leader Murder: అర్ధరాత్రి టెన్షన్.. టెన్షన్.. బైక్‌పై వెంబడించి మరీ బీజేపీ నేతను చంపారు -
Sakshi Cartoon: సారు.. ఇలా లైవ్‌లో స్పందించరు!
సారు.. ఇలా లైవ్‌లో స్పందించరు! -
లైవ్ లోనే అందరి ముందు కంటతడి పెట్టిన బీజేపీ సీఎం
-
Sakshi Cartoon: ఆయన ఎన్నికైన సీఎం కాదు, డబ్బిచ్చి సీఎం అయ్యారు-కాంగ్రెస్
ఆయన ఎన్నికైన సీఎం కాదు, డబ్బిచ్చి సీఎం అయ్యారు-కాంగ్రెస్ -
Sakshi Cartoon: అదేదో తనే ఇస్తారట మార్చోద్దంటున్నారు!
అదేదో తనే ఇస్తారట మార్చోద్దంటున్నారు! -
ఫోర్త్ వేవ్‌లో అనవసర ఆంక్షలు ఉండవు
బనశంకరి: కోవిడ్ నాలుగో దాడి పేరుతో అనవసరంగా ఎలాంటి ఆంక్షల్ని విధించరాదని, అవసరమైనంత వరకే నిబంధనలు ఉండాలని ప్రధాని మోదీ సూచించారు, ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకున్నామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. బుధవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో జరిగిన సీఎంల వీడియో సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి గురించి చర్చించాను. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంది. ఈ నెల 9 తరువాత బెంగళూరులో పాజిటివ్ రేటు పెరిగింది అని చెప్పారు. ప్రతిరోజు 30 వేల కోవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేలకు పైగా పడకలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షకు పైగా బెడ్లు అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్‌ను సిద్ధం చేశామన్నారు. 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం అనుమతించిందన్నారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని, అలాగే వసతులను పెంచాల్సి ఉందన్నారు. జూన్ మొదటివారం నుంచి కేసులు పెరగవచ్చు కరోనా కేసులు పెరిగితే లాక్‌డౌన్‌తో పాటు కొన్ని కఠిన నియమాలను తెస్తారనే వార్తలను ఆరోగ్య మంత్రి సుధాకర్ తిరస్కరించారు. జూన్ మొదటి వారంలో కోవిడ్ వేవ్ రావచ్చునని నిపుణులు తెలిపారు, ముందు జాగ్రత్తలు చేపట్టామన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వేస్తామని, 18 ఏళ్లు దాటినవారు వారికి రెండోడోస్ తీసుకున్న 9 నెలల తరువాత మూడో టీకాను వేసుకోవచ్చన్నారు. కోవిడ్ కాంట్రాక్టు వైద్య సిబ్బంది సేవలను 18 నెలల వరకు పొడించాలని ఆర్థికశాఖను కోరినట్లు తెలిపారు. నాలుగో వేవ్‌కు బీబీఎంపీ సిద్ధం కోవిడ్ నాలుగో వేవ్ పంజా విసిరితే సమర్థంగా ఎదుర్కొనేందుకు బీబీఎంపీ సిద్ధమైంది. సిబ్బంది, ఆరోగ్యచికిత్స పరికరాలను సమకూర్చుకోవడంలో పాలికె అధికారులు నిమగ్నమయ్యారు. బెంగళూరులో నిత్యం 60 నుంచి 80 కేసులు వెలుగుచూస్తున్నాయి. బెళందూరు, గసంద్ర, కోరమంగల, హెచ్ఎస్ఆర్.లేఔట్, వర్తూరు, హూడి, కాడుగోడితోపాటు మొత్తం 10 వార్డుల్లో కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ చికిత్సకు నాలుగు ఆసుపత్రుల్లో 1,365 సాధారణ పడకలు, ఐసీయు, వెంటిలేటర్ తో పాటు మొత్తం 2392 పడకలు సిద్ధం చేశారు. కరోనా వ్యాక్సిన్ రెండోడోస్ వేసుకోనివారి ఆచూకీ కనిపెట్టి పోలీసుల సాయంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలని యోచిస్తున్నారు. 60 ఏళ్లు లోపు వారికి బూస్టర్ డోస్ అందించడం పట్ల సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ విరుచుకుపడితే అధికంగా నష్టపోయేది బెంగళూరేనని మూడుసార్లు స్పష్టమైంది. (చదవండి: ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదంటున్న నిపుణులు..) -
పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. అప్పు ( పునీత్ రాజ్ కుమార్) మరణాంతరం 'కర్ణాటక రత్న' అవార్డుతో సత్కరించనున్నారు. కర్ణాటక రత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. "State Government has decided to honour late Sri Puneet Rajkumar with Karnataka Ratna award posthumously": Chief Minister @BSBommai. — CM of Karnataka (@CMofKarnataka) November 16, 2021 రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ అని అందరూ ఒప్పుకునే స్థాయికి ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లో నటించడమే కాదు. పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టం. పునీత్ ఆరేళ్ల వయసు నుంచే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించారు. సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. కేవలం తన సినిమాలే కాక ఆయన అన్న శివరాజ్ కుమార్ సినిమాలు, ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడారు. ఇప్పటివరకూ వందకు పైగా పాటలు పాడిన పునీత్ రాజ్ కుమార్, గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. సినిమాలే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాలన్నా పునీత్‌కు మక్కువ ఎక్కువ. తన తల్లి పార్వతమ్మతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు. కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్‌కు మంచి డిమాండ్ ఉండేది. తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ అడుగుజాడల్లో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. పునీత్ KMF ఉత్పత్తులను ఎలాంటి ఒప్పందం లేకుండా ప్రమోట్ చేశారు. -
Covid Third Wave: 2 శాతం పాజిటివిటీ దాటితే మళ్లీ లాక్డౌన్..?
సాక్షి, బెంగళూరు: కరోనా మూడో ఉధృతి వ్యాప్తి భయాలు విస్తరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షల వైపు మొగ్గుచూపుతోంది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన నిపుణులు, అధికారులతో కీలక సమావేశం జరిగింది. థర్డ్ వేవ్‌ను అడ్డుకోవాలంటే లాక్డౌన్ తరహా ఆంక్షలను విధించక తప్పదని నిర్ణయించారు. కఠినతరం చేస్తాం: సీఎం.. సమావేశ అనంతరం సీఎం బొమ్మై మీడియాతో వివరాలు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ అవసరం లేదు. కొత్త నిబంధనల బదులు ఉన్న వాటినే కఠినతరం చేస్తాం. కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు కాబట్టి పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని తెలిపారు. తాజా నిబంధనలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండబోవని చెప్పారు. ఆంక్షలకే నిపుణుల సిఫార్సు.. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం దాటిన ప్రాంతాల్లో లాక్డౌన్ చేస్తే బాగుంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణాలను నిషేధించాల్సిందేనని ఈ సమావేశంలో నిపుణులు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి సెప్టెంబరు వరకు వేచి ఉంటే మేలు అని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ బదులు వారాంతపు కర్ఫ్యూ అమలు చేయడం ఉత్తమం. పండుగలు, జాతరల్లో జన సమ్మర్దాన్ని నివారించాలి. ఇతర రాష్ట్రాలవారికి నెగిటివ్ రిపోర్టు వస్తేనే అనుమతించాలి. సరిహద్దు జిల్లాల్లో కరోనా పరీక్షలను పెంచడంతో పాటు అందరికీ టీకా అందేలా చూడాలి అని అభిప్రాయపడ్డారు. కరోనా తీవ్రత పెరిగిన చోట ఈ నిబంధనలు విధిస్తారు అంత్యక్రియలకు 10 మందే హాజరు కావాలి. పబ్‌లు, బార్లు, జిమ్‌లు, యోగా సెంటర్లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాల బంద్ దేవస్థానాల్లో భక్తుల ప్రవేశం నిషేధం. ర్యాలీ, బహిరంగ సమావేశాలకు అనుమతి లేదు. జన రద్దీ మార్కెట్లను తాత్కాలికంగా మూసేయాలి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల విక్రయాలు వారాంతపు కర్ఫ్యూ శుక్రవారం సాయంత్రం 7 నుంచి మొదలవుతుంది. కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో విద్యాసంస్థలకు అవకాశం. ఒకవేళ పాఠశాలల్లో కేసులు నిర్ధారణ అయితే వారం రోజుల పాటు బంద్ చేయాల్సి ఉంటుంది. బెంగళూరులో వారాంతపు కర్ఫ్యూ ఉండదు. పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉంది. దాటితే నిబంధనల్లో మార్పు ఉంటుంది. -
కర్ణాటక సీఎంకు రెండోసారి కరోనా.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, బెంగళూరు : భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరు కోవిడ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కూడా చేరారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మళ్లీ కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. నాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. స్వల్పంగా జ్వరం ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు ఈ రోజు(శుక్రవారం) ఆసుపత్రిలో చేరాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నాకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఇటీవల నన్ను కలిసిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి’ అని సూచించారు. అయితే బెంగళూరులోని రామయ్య ఆస్పత్రిలో చేరిన సీఎంకు పాజిటివ్ రావడంతో మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. గత ఏడాది ఫస్ట్ వేవ్ సందర్భంగా ఆయనకు, తన కుమార్తె పద్మావతి ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. చదవండి: బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్ బెంగళూరులో వైరస్ బీభత్సం.. ఒకేరోజు 10 వేల కేసులు Karnataka CM BS Yediyurappa tests positive for #COVID19. He'll be shifted to Manipal hospital from Ramaiah Memorial hospital where he was admitted earlier today: Karnataka Chief Minister's Office (CMO) He had held an emergency meeting over COVID, at his residence earlier today. pic.twitter.com/i5fPumgIIl — ANI (@ANI) April 16, 2021 -
ఖండాంతరాలకు భారత్ ఖ్యాతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని యలహంకలో ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు రోజులుగా కొనసాగుతున్న 13వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. చివరి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరై, వైమానిక ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనతో భారత ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించిందని అన్నారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ వైమానిక ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను ప్రశంసించారు. సుమారు 530 కంపెనీలు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్నట్లు చెప్పారు. హైబ్రిడ్ ఫార్మాట్లో తొలిరోజు ఏరో షో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. తేజస్ యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్తో రూ.48 వేల కోట్ల ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అబ్బురపరిచిన విన్యాసాలు అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో భాగంగా స్వదేశీ నిర్మిత తేజస్, భారత వాయుసేనకు చెందిన సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్, సారంగ్ హెలికాప్టర్ల విన్యాసాలు అలరించాయి. ఈసారి వైమానిక ప్రదర్శనలో అమెరికాకు చెందిన బీఐఓ బాంబర్ విమానం మినహా విదేశీ విమానాలన్నీ పాల్గొన్నాయి. కాగా, కోవిడ్–19 కారణంగా బ్రిటన్, ఐరోపా దేశాలు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెనుకడుగు వేశాయి. కానీ, ఆయా దేశాల రక్షణ శాఖ అధికారులు హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన బోయింగ్, ఎయిర్‌బస్, లుఫ్తాన్సా, లాక్టిన్‌హెడ్ తదితర కంపెనీలు భారత కంపెనీలతో ఒప్పందం చేసుకుని రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రక్షణ శాఖ అధికారులు వివరించారు. -
రాజీనామా చేస్తా.. వద్దు వద్దు..!
బెంగళూరు: ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం, నమ్మకం ఉన్నాయని కర్ణాటక కేబినెట్ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో శుక్రవారం మంత్రివర్గం సమావేశమై సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిపింది. ‘కుమారస్వామి నాయకత్వంపై మేం విశ్వాసం, నమ్మకం వ్యక్తం చేశాం. ప్రభుత్వ మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదు’ అని శుక్రవారం కేబినెట్ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర మీడియాకు తెలిపారు. ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని అంటూ ఆయన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సాగనీయబోమని పరమేశ్వర ప్రకటించారు. మీడియాను బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సీఎం కుమారస్వామి పరమేశ్వరతోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్నప్పటికీ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఓటమికి కారణం జేడీఎస్‌తో పొత్తేనంటూ కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు రావడంతో రాజీనామాకు సిద్ధమంటూ సీఎం కుమారస్వామి గురువారం ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఆయనకు సర్దిచెప్పడంతో వెనక్కి తగ్గారని సమాచారం. గురువారం వెలువడిన ఫలితాల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 1, జేడీఎస్ 1 స్థానం మాత్రమే దక్కించుకోగా 25 చోట్ల బీజేపీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఎంపీ సీటును దేవెగౌడకు త్యాగం చేస్తా ఎంపీ, మనవడు ప్రజ్వల్ ప్రకటన సాక్షి బెంగళూరు: తుమకూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ సంచలన ప్రకటన చేశారు. హసన్ లోక్‌సభ స్థానాన్ని తాతయ్య దేవెగౌడ కోసం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.ఈ విషయమై ఇంకా తాతయ్యతో చర్చించలేదు. కానీ హసన్ నుంచి పోటీచేసే విషయమై ఆయన్ను ఒప్పిస్తా’ అని బెంగళూరులో మీడియాతో అన్నారు. -
మీడియాను బహిష్కరిస్తున్నా: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాపై అలిగారు. మీడియాను తాను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కుమారస్వామి ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం బయటకురాగానే కుమారస్వామిని చుట్టుముట్టిన మీడియా, సమావేశంలో ఏం చర్చించారని ప్రశ్నించింది. ఒక్కసారిగా సహనం కోల్పోయిన కుమారస్వామి..‘మీరంతా(మీడియా) వార్తల కోసం ఏది కావాలంటే అది చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేయండి. ఇష్టమొచ్చినట్లు రాసుకోండి. ఎంజాయ్ చేయండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. తన కుమారుడు నిఖిల్, సినీనటి సుమలత బరిలో ఉన్న మాండ్యలో మీడియా సుమలతకే ప్రాధాన్యత ఇవ్వడంపై సీఎం అలకబూనినట్లు్ల తెలుస్తోంది. -
మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
-
రుజువులతో సహా నిరూపిస్తాం: కుమారస్వామి
బెంగళూరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజలతో పాటు, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం కుమారస్వామి శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..దేశానికి తనకు తాను రక్షకుడుగా మోదీ చెప్పుకుంటునే మరోవైపు తనవారిని రక్షించుకునేందుకు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని కుమారస్వామి ఈ సందర్భంగా విపక్ష పార్టీలను కోరారు. ప్రధానమంత్రి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా.. సమాఖ్య వ్యవస్థను దెబ్బదీసే ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నింటిపై రుజువులతో సహా నిరూపిస్తామన్నారు. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కునేందుకు చూస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలో ఉన్నారన్నారు. అలాగే బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, బల నిరూపణ చేసుకుంటామని కుమారస్వామి స్పష్టం చేశారు. విప్ జారీ చేసిన జేడీఎస్, కాంగ్రెస్ బడ్జెట్ సందర్భంగా జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాయి. కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, అసంతృప్తులకు బీజేపీ గాలయం వేస్తోందని ఆరోపణలతో రెండు పార్టీల పెద్దలు అప్రమత్తమయ్యారు. సమావేశాలకు ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాలని విప్ జారీ చేశారు. ఏ ఒక్కరు రాకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సమావేశాలకు దూరంగా ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి కుమారస్వామి ఇవాళ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
‘పెట్రో’ ధరను రూ.2 తగ్గించిన కర్ణాటక
బెంగళూరు: పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఈ ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు. కలబురిగిలో సోమవారం ఆయన మాట్లాడుతూ..‘సామాన్యుడికి భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించాలని తమ జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై అమ్మకం పన్ను 3.25, 3.27% చొప్పున తగ్గనుంది. ఇది ప్రస్తుతం 32%, 21 శాతంగా ఉంది’ అని వివరించారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.80, డీజిల్ రూ.76.21గా ఉంది. మహారాష్ట్రలో లీటర్ పెట్రోలు రూ.91 ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర రూ.90కు చేరుకుంది. ముంబై మినహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోలు ధర దేశంలోనే అత్యధికంగా రూ.91కి ఎగబాకింది. పెట్రోలు, డీజిల్‌లపై సర్‌చార్జితో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా 39% వరకు వ్యాట్ వసూలు చేస్తోంది. -
దుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక సీఎం
-
మళ్లీ నేనే సీఎం అవుతానేమో? : సిద్దరామయ్య
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తన భవిష్యత్ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే మరోసారి సీఎం అవుతానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇవే తన చివరి ఎన్నికలని, అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఊహించని ఓటమి అనంతరం ఆయన మనసు మార్చుకొని యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోసారి సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్నారు. తాజాగా ఓ సమావేశంలో ‘ప్రజల ఆశీస్సులు ఉంటే రెండో పర్యాయం రాష్ట్రానికి సీఎం అవుతాను. ప్రతిపక్షాలన్నీ కలిసి నన్ను గెలవకుండా అడ్డుకున్నాయి. నాకు నమ్మకం ఉంది. ప్రజలు మరోసారి సీఎం పీఠంపై నన్ను కూర్చోబెడతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం బాధ కలిగించింది. అయితే అవే నా చివరి ఎన్నికలు కావు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణం.’ అంటూ సిద్ద రామయ్య పేర్కొనడం విశేషం. కుమారస్వామి పాలనపై అసంతృప్తి ఈ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురాలేకపోయిన ఆయనకు బద్దశత్రువులతో కలసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి కంటే యడ్యూరప్ప అయితేనే సిద్ధరామయ్య ఇష్టపడేవారని గతంలో సన్నిహితులు పేర్కొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జేడీఎస్‌తో కూటమిని కొనసాగించాలని ఆయన్ను ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వాస్తవాలను తెలుసుకుని మసులుకోవాలని సిద్ధరామయ్యకు హితబోధ చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో దేవెగౌడ కుటుంబం పాలన చేయడం సిద్ధరామయ్యకు సహించడం లేదు. కుమారస్వామి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం కూడా నచ్చక అధిష్టానంతో కొంత అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ వెనుక పాలనలో నడవడం మరీ రుచించడం లేదు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందా అన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కుమారస్వామి వివాదాస్పద నిర్ణయం
-
‘నేను సీఎం కావడం నాన్నకు ఇష్టం లేదు’
బెంగళూరు: తనను సీఎంను చేయడం తన తండ్రి హెచ్డీ దేవెగౌడకు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు.ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు సీఎం పదవిని మీరే ఉంచుకోండని దేవగౌడ కాంగ్రెస్ నేతలకు సూచించారని పేర్కొన్నారు. అయితే, వారు మాత్రం సీఎంగా తనకే ఓటు వేశారని తెలిపారు. ‘ నాకు ఆరోగ్యం పరంగా సమస్యలు ఉన్నాయి. గతంలో రెండు సార్లు గుండె ఆపరేషన్ అయింది. ఇదే విషయాన్ని మా తండ్రి కాంగ్రెస్ నేతలకు చెప్పారు. సీఎం పదవిని మీ వద్దే ఉంచుకోండని కాంగ్రెస్ నేతలను కోరారు. కానీ వారు మాత్రం నన్ను సీఎంను చేశారు’ అని కుమారస్వామి చెప్పుకొచ్చారు. ‘ఒక్కొసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపగలనా అని భయమేస్తోంది. ఎందుకంటే విధానసభలో ఓ మధ్యవర్తి అధికారుల బదిలీల కోసం రూ.10 కోట్లు అడుగుతున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపగలనా అనే అనుమానం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. కాగా తనకు డబ్బు అవసరంలేదని, ఇతరవాటిపై ఆశలు లేవని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కుమారస్వామి పేర్కొన్నారు -
ప్రధాని మోదీతో కుమారస్వామి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం సాయంత్రం కలిశారు. కర్ణాటక సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీని కుమరస్వామి కలుసుకోవడం ఇదే మొదటిసారి. అయితే కేవలం మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలిశానని కుమారస్వామి పేర్కొన్నారు. మోదీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కుమారస్వామి కలుసుకుని, కొత్త మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపు తదితర కీలక విషయాలపై చర్చించారు. సోనియా గాంధీ వైద్యపరీక్షలకోసం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడంతో వారిని కుమారస్వామి కలుసుకోలేకపోయారు . కాగా ఆదివారం మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ..రెండు మూడు రోజుల్లో మంత్రిపదవులను కేటాయిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హామి ఇచ్చారు. మరో వైపు కుమారస్వామి కాంగ్రెస్ పట్ల తనకున్న నిబద్దతను మరోసారి చాటుకున్నారు. కాంగ్రెస్ వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. ‘ స్పష్టమైన తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరాను, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వల్లే నేను ఇవాళ సీఎం పదవిలో ఉన్నాను.6 కోట్ల రాష్ట్ర ప్రజల తీర్పు వల్ల కాదు. ఇది నా స్వతంత్ర ప్రభుత్వం కాదు. నన్ను సీఎం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేతలకు రుణపడి ఉంటాను' అని వ్యాఖ్యానించారు. -
కుమారస్వామికి కలిసివచ్చిన ఇల్లు..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి నగరంలోని జేపీ నగరలోని తన నివాసం నుంచే పరిపాలన సాగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంలకు ప్రభుత్వం కేటాయించే బంగ్లాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రులు నివాసం ఉండటానికి బెంగళూరులో అనుగ్రహ, కావేరీ బంగ్లాలు ఉన్నాయి. జయనగర్ నివాసం సెంటిమెంట్‌గా కలిసి రావడంతో కుమారస్వామి అక్కడకు వెళ్లేందుకు సుముఖంగా లేరు. అయితే సీఎం అధికారిక నివాసం కృష్ణ బంగ్లాను ప్రజలను కలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కలిసి వచ్చిన ఇల్లు... గతంలో 2007లో సీఎం పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి జేపీ నగర్‌లోని ఇంటి నుంచి వేరే నివాసానికి మకాం మార్చారు. అయితే జోతిష్యుల సలహా మేరకు 2018 ఎన్నికల ప్రచారానికి ముందే జేపీ నగర్‌లోని ఇంటికి మరమ్మతులు చేయించి అక్కడికి మారిపోయారు. ఈ ఇంట్లో ఉండగా, ఆయన సినీరగంలో పంపిణిదారుడిగా, నిర్మాతగా రాణించారు. తరువాత సీఎం కూడా అయ్యారు. -
యడ్యూరప్ప ఏలుబడి
కర్ణాటక ఓటర్లు నికరమైన తీర్పు ఇవ్వని పర్యవసానంగా అక్కడ కొనసాగుతున్న ఉత్కంఠభరిత డ్రామాలో తొలి అంకం బీజేపీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. బల నిరూపణ కోసం గవర్నర్ వాజూభాయ్ వాలా ఆయనకు పక్షం రోజుల వ్యవధి ఇచ్చారు గనుక మున్ముందు ఈ డ్రామాలో మరిన్ని మలుపులు ఉండటం ఖాయం. ఈ పదిహేను రోజుల్లో ప్రతిపక్ష శిబిరం నుంచి ఎందరు కొత్త కండువాలు కప్పుకుని సరికొత్త మాటలు మాట్లాడతారో చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు నోట్ల కట్టలు పంపి ప్రలోభపెట్టిన ఉదంతాల వంటివి కర్ణాటకలో చోటుచేసుకోకూడదని ప్రజాస్వామ్యవాదులు గట్టిగా కోరుకుంటారు. అలాంటి మరక పడకుండా యడ్యూరప్ప గట్టెక్కగలరా అన్నది చూడాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం సుస్థిరంగా నిలబడటానికి బీజేపీకి ఇప్పుడున్న 104మంది ఎమ్మెల్యేలు సరిపోరు. అదనంగా కనీసం 9మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. కనుకనే బేరసారాలు మొదలయ్యాయన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని పిలవాలన్న అంశంలో బుధవారమంతా వాదోపవా దాలు జోరుగా సాగాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని పిలవాలా లేక జేడీ(ఎస్)– కాంగ్రెస్‌లు ఏర్పాటుచేసుకున్న ఎన్నికల అనంతర కూటమికి అవకాశమివ్వాలా అన్న విషయం చుట్టూ ఇవి తిరిగాయి. తమ కూటమికి మొత్తంగా 116మంది మద్దతు ఉంది గనుక ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని జేడీ(ఎస్)–కాంగ్రెస్... తమది అతి పెద్ద పార్టీ గనుక అవకాశమీయాలని బీజేపీ వాదించాయి. రాజ్యాంగ నిపుణులు సైతం ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. రాత్రి 11 గంటల వేళ కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అప్పటికప్పుడు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను ఏర్పాటైంది. ఆ బెంచ్ దాదాపు మూడున్నర గంటలపాటు వాదప్రతివాదాలు విని గవర్నర్ ఉత్తర్వుపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని రాత్రి 2 దాటాక తేల్చింది. అయితే శుక్రవారం కొనసాగే వాదనల తర్వాత యడ్యూరప్పకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల వ్యవధి యధాతథంగా ఉంటుందా, మారుతుందా అన్న విషయం తేలుతుంది. గవర్నర్ల వ్యవస్థ తటస్థంగా ఉండి ఉంటే అసలు ఈ వివాదమంతా వచ్చేదే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు గవర్నర్లను నియమించడం, కీలక సమయాల్లో ఆ గవర్నర్లు కేంద్ర పాలకుల అభీష్టాన్ని నెరవేర్చడం ఒక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. నిరుడు గోవా, మణిపూర్, మేఘా లయల్లో అక్కడి గవర్నర్లు ఎన్నికల అనంతర కూటములను గుర్తించి అధికారం కట్టబెట్టకుండా అతి పెద్ద పార్టీనే పిలిచి ఉన్నా తాజా వివాదం ఏర్పడేది కాదు. ఆ రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరించిన విధానం కర్ణాటకలో ఎందుకు మాయమైందన్న జేడీ(ఎస్)–కాంగ్రెస్‌ల ప్రశ్న సమంజసమైనదే. అయితే గోవా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గమనించదగ్గది. అతిపెద్ద పార్టీగా అవ తరించిన తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమీయకుండా గోవా గవర్నర్ అన్యాయం చేశా రంటూ కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు గవర్నర్‌కు విచక్షణాయుత అధికారాలుంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పేంత స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి లేన ప్పుడు అతి పెద్ద పార్టీని కాదని కొత్తగా ఏర్పడిన కూటమికి అవకాశమీయడంలో తప్పులేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఇదే సూత్రం వర్తింపజేయాలని ఇప్పుడు కాంగ్రెస్ వాదిస్తోంది. గోవా, మణిపూర్, మేఘాలయల్లో గతంలో కాంగ్రెస్ చేసిన వాదనను కర్ణాటకలో బీజేపీ నెత్తికెత్తుకుంటే... ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అప్పట్లో చేసిన తర్కాన్ని ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ సమర్థిస్తోంది. అయితే ఈ నాలుగుచోట్లా లబ్ధి పొందిన ఏకైక పార్టీ మాత్రం బీజేపీయే! అయితే ఈ పరిణామాలపై నిర్ద్వంద్వంగా, నిజాయితీగా స్పందించగల నైతిక స్థైర్యం ఉన్న పార్టీల, నేతల సంఖ్య అరుదుగా మారడం ఆందోళన కలిగించే అంశం. కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి లోపాయికారీగా, బాహా టంగా కృషి చేసిన చంద్రబాబు ఇందుకు ఉదాహరణ. కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై ఆయన బహి రంగంగా మాట్లాడలేక కేబినెట్ సమావేశంలో అభిప్రాయాలు వెల్లడించి, వాటిని లీక్ చేయించి సరిపెట్టుకున్నారు. బీజేపీకి మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు దాన్ని ఆహ్వానించడం సరి కాదని ఆయన కేబినెట్ సమావేశంలో అన్నారట! పైగా అవి ప్రమాదకర రాజకీయాలట!! ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన 23మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అంతటితో ఊరుకోక పొరుగునున్న తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారు. బాబుకు కర్ణాటక గవర్నర్‌ను తప్పుబట్టే నైతిక అర్హత ఉంటుందా? రాజకీయ వాతావరణం వేడెక్కి ఉన్నప్పుడు జాగ్రత్తగా అడుగేయాలి. కానీ కర్ణాటక బీజేపీ ఎందుకనో తొట్రుపాటుకు లోనయింది. యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించడాన్ని మొదటగా బీజేపీ ట్వీటర్ ద్వారా వెల్లడించడం, ఆ తర్వాత దాన్ని తొలగించడం, మళ్లీ కొత్తగా పెట్టడం వంటివి ఉన్న సవాలక్ష సందేహాలను మరింత పెంచాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇక ఏడాదే గడువున్నది గనుక ఇప్పుడు కర్ణాటకను చేజిక్కించుకోవడం మాత్రమే కాదు...జేడీ(ఎస్)ను మచ్చిక చేసుకో వడం కూడా మున్ముందు బీజేపీకి చాలా అవసరం. రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తుంటే తప్ప అధిక స్థానాలు సంపాదించలేమని కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఈ ఎన్నికలతో అర్ధమై ఉంటుంది. అయితే జేడీ(ఎస్) నేత కుమారస్వామికి రావలసిన సీఎం పదవిని కాస్తా తన్నుకుపోయిన బీజేపీకి అది అంత సులభమేమీ కాదు. ఏదేమైనా కర్ణాటక పరిణామాలు మరిన్నిరోజులపాటు పతాక శీర్షిక లకు ఎక్కుతూనే ఉంటాయి. ఇవన్నీ త్వరగా కొలిక్కి వచ్చి రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందా లని అందరూ ఆశిస్తారు. -
ముఖ్యమంత్రికి మహిళా మేయర్ పంచ్
-
హడావుడిగా ఢిల్లీకి సీఎం
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ అనంతరం పార్టీలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చేందుకు పూనుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ఇతర పెద్దలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మొరపెట్టుకోనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం హడావుడిగా ఢిల్లీకి చేరుకున్నారు. కేబినెట్ విస్తరణ తరువాత కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్, సీఎం సిద్ధరామయ్య మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం పాల్గొనే కార్యక్రమాలకు పరమేశ్వర్ ముఖం చాటేస్తున్నారు. ఏవేవో కారణాలను పరమేశ్వర్ చెబుతున్నప్పటికీ, ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలే ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఐకమత్యంగా ఎదుర్కొనలేక పోతే ఓటమి పాలవుతామన్న విషయాన్ని హైకమాండ్‌కు తెలియజేసేందుకే సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ పయనమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆదివారం సోనియాగాంధీని కలిసి పరమేశ్వర్ విషయంలో జోక్యం చేసుకోవాలని సిద్ధరామయ్య కోరనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా మేడంకి నివేదిక ఇవ్వనున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన గౌరి లంకేష్ హత్య ఉదంతం పై సోనియాగాంధీ నివేదిక కోరడం తెలిసిందే. ఈ పరిణామాలను కూడా సిద్ధరామయ్య, సోనియాగాంధీకి వివరించనున్నారు. కాగా, సీఎం సిద్ధరామయ్య రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఐటీ తనిఖీలు చేసుకోవచ్చు: సీఎం
సాక్షి, బెంగళూరు: ‘అబద్ధపు ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు. ఐటీ అధికారులు తనిఖీలు చేసుకోనివ్వండి, ఆ తర్వాత చూద్దామ’ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనదైన శైలిలో స్పందించారు. ఆర్టీఐ కార్యకర్త రామమూర్తి సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై గవర్నర్‌తో పాటు ఐటీ శాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందించారు. ‘ఈ ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి అబద్ధపు ఆరోపణలు, ఫిర్యాదులకు నేను భయపడబోను. ఇలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం కూడా లేద’ ని పేర్కొన్నారు. బీజేపీ తలపెట్టిన ‘మంగళూరు చలో’ కార్యక్రమంపై స్పందిస్తూ.. ప్రజా ప్రభుత్వ వ్యవస్థలో తమ నిరసనను తెలియజేసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని సిద్ధరామయ్య అన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, కర్ణాటక ఇంధన శాఖ మంత్రి డాక్టర్ డీకె శివకుమార్, ఆయన సన్నిహితుల నివాసాల్లో ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ముందస్తు ఎన్నికల్లేవు: సీఎం
మైసూరు: రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ఏ చెరువులను కూడా డినోటిఫికేషన్ చేయాలన్న ప్రతిపాదన లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తెలిపారు. మైసూరు నగరంలో లలిత మహాల్ హెలిప్యాడ్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగవని సీఎం చెప్పారు. గుజరాత్ అసెంబ్లీతో పాటు ఇక్కడా ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో మాత్రమే జరుగుతాయని, త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని సీఎం తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత లేదని, అధికారం నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. డీనోటిఫైపై తప్పుడు ప్రచారం ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న చెరువులను డీనోటిఫై చేస్తోందని తప్పుడు వార్తలు వస్తున్నాయని, ఇందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపయోగంగా ఉన్న చెరువుల డీనోటిఫై పై మంత్రిమండలిలో చర్చ జరిగిందని, ప్రస్తుతం బెంగళూరులో ఉన్న బస్టాండు గతంలో చెరువుగా ఉండేది. అనేక మురికివాడలు కూడా చెరువులుగా ఉండేవన్నారు. అయితే రెవెన్యూ శాఖ రికార్డుల్లో ఇప్పటికీ కూడా ఈ స్థలం చెరువు అని ఉందని, దానిని మార్చాలని సూచించడం జరిగింది తప్ప డీనోటిఫై చేయాలని తాము చెప్పలేదన్నారు. ఐటీ దాడులకు బెదరం బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులను వెతికి పట్టుకుని మరీ ఐటీ దాడులు చేయిస్తున్నారని, ఎన్ని దాడులు చేసినా తాము భయపడేది లేదని చెప్పారు. లింగాయతలకు ప్రత్యేక మతం విషయంలో తనపై ఆరోపణల తగదని, ఒక వర్గాన్ని కూలదోయడం బీజేపీ నాయకులు చేసే పని అని ఆరోపించారు. -
సీఎం సంచలన వ్యాఖ్యలు
కన్నడ రాకుంటే కర్ణాటకలో ఉండొద్దు అధికారులకు సీఎం సిద్ధరామయ్య స్పష్టీకరణ బనశంకరి (బెంగళూరు): కన్నడ భాష రాని అధికారులకు కర్ణాటకలో ఉండేహక్కు లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకర్ కేఆర్ నందిని సహా 59 మంది కర్ణాటక ర్యాంకర్లను సిద్ధరామయ్య సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఇక్కడ పనిచేసే ఏ అధికారి అయినా కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో ఓ ఐఏఎస్ అధికారి కన్నడ నేర్చుకునేది లేదని అన్నప్పుడు, మీ సేవలు అవసరం లేదని అధికారిని కేంద్రానికి తిప్పిపంపించినట్లు గుర్తు చేశారు. సివిల్స్ ర్యాంకర్లందరూ ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహించేటప్పుడు ఆ స్థానిక భాషను నేర్చుకుని మంచి పరిపాలన అందించాలని సూచించారు. మొదటి ర్యాంకర్ నందిని కర్ణాటక సర్వీసునే ఎంచుకోవాలని సీఎం కోరారు. మరోవైపు హిందీ భాషకు వ్యతిరేకంగా కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. హిందీ భాషలో రాసిన ప్రకటనలపై నల్ల రంగు పూశారు. యశ్వంత్‌పూర్ మెట్రో స్టేషన్ వెలుపల ఉన్న హిందీ అక్షరాలతో రాసిన పేరు కనిపించకుండా బుధవారం రాత్రి నల్లరంగు వేశారు. ఇందిరా నగర్ మెట్రోస్టేషన్ వెలుపల హిందీ ప్రకటనలు కనిపించకుండా పోస్టర్లు అతికించారు. కేంద్రంపై తమపై హిందీని రుద్దుతోందని కర్ణాటక రక్షణ వేదిక ఆరోపిస్తోంది. కాగా, తమ రాష్ట్రానికి ప్రత్యేక జెండా తేవడం కోసం సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. బీజేపీ హిందుత్వ అజెండాకు కౌంటర్‌గానే ఆయనీ కార్యం తలపెట్టారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ఇవన్ని చేస్తున్నారని ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి. -
సీఎం హెలికాప్టర్ ఎమర్జన్సీ ల్యాండింగ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రమాదం తప్పింది. సోమవారం సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కర్ణాటక సీఎం.. హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురితో కలసి శ్రావణబెళగలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హెలికాప్టర్లో బయల్దేరారు. కాగా హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో పైలట్ వెంటనే బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పక్షి ఢీకొనడం వల్ల హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్ది నిమిషాల తర్వాత సీఎం బృందం అదే హెలికాప్టర్లో శ్రావణబెళగలకు బయల్దేరి వెళ్లింది. -
‘ట్వీట్’లో కాలేసిన సీఎం కార్యాలయ సిబ్బంది
న్యూఢిల్లీ: ఓ వాక్యములో చిన్న పదం తప్పు దొర్లితే అర్థం మారిపోతుంది. బాధ్యత గల హోదాలో ఉన్నవారు ఇలాంటి పొరపాట్లు చేస్తే వివాదం అవుతుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం సిబ్బంది పొరపాటుగా చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చైనాకు చెందిన ప్రతినిధి బృందం కర్ణాటక సీఎంను కలిసింది. బెంగళూరు అభివృద్ధి ఇతర విషయాల గురించి వారు సిద్ధరామయ్యతో చర్చించారు. అనంతరం కర్ణాటక సీఎం పేరుతో ఆయన కార్యాలయ సిబ్బంది.. ‘చైనాలోని సియాచిన్ ప్రావిన్స్ నుంచి లీ జోంగ్ సారథ్యంలో వచ్చిన బృందంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పలు విషయాలు చర్చించారు’ అని ట్వీట్ చేసింది. విషయం ఏంటంటే సియాచిన్ అనేది వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో గల హిమాలయ పర్వత శ్రేణి. చైనాలో సిచువాన్ అనే ప్రావిన్స్ ఉంది. కర్ణాటకకు వచ్చిన బృందం ఈ ప్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు. కాగా కర్ణాటక సీఎం కార్యాలయం చేసిన ట్వీట్లో సియాచిన్ ప్రాంతం చైనాలో ఉన్నట్టుగా అర్థం వచ్చేలా ఉంది. ఈ ట్వీట్ చూడగానే రాజకీయ వర్గాలు, నెటిజన్లు విమర్శలకు పదును పెట్టారు. ‘సియాచిన్ చైనాలో ఉందా? ప్రతినిధి బృందం సిచువాన్ ప్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు’ అని కొందరు ట్వీట్ చేశారు. ‘ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సియాచిన్‌కు, సిచువాన్‌కు గల తేడా చెప్పేవారు లేరా?’ అని మరికొందరు విమర్శించారు. -
‘పాత నోట్లపై గడువు పెంచండి’
బెంగళూరు: పాత పెద్ద నోట్ల చెలామణి గడువును డిసెంబర్ 30 వరకు పెంచాలని కేంద్రాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కోపరేటివ్ బ్యాంకులకు సరిపడా కరెన్సీ నోట్లు సరఫరా చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ లాబ్స్, బ్లడ్ బ్యాంకుల్లో కూడా పాతనోట్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పాత రూ.500, రూ. వెయ్యి నోట్ల చెలామణిని నవంబర్ 24 వరకు కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రులు, పెట్రోలు బంకులతో పాటు రైల్వే, విమాన టిక్కెట్ల కొనుగోలుకు, ప్రజా రవాణా కోసం, పాల కేంద్రాలు, శ్మశాన వాటికల్లో పాత నోట్లు వాడుకోవడానికి కేంద్రం సడలింపు నిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశముంది. -
కావేరి వివాదంలో మరో మలుపు
బెంగళూరు: కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య ఏర్పడిన కావేరి జలాల వివాదం మరో మలుపు తిరిగింది. కావేరి జలాశయాల్లో నీటిమట్టం బాగా పడిపోవడంతో తమిళనాడుకు ఇక నీటిని విడుదల చేయలేమని శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తద్వారా సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం సాధ్యంకాదని ఆయన చేతులేత్తేశారు.ఈ నెల 27 వరకు కావేరి నది నుంచి తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కావేరి నదిలో తగినంత నీటివనరులు లేకపోవడంతో తమిళనాడుకు నీటిని వదలబోమని సిద్ధరామయ్య చెప్పారు. కర్ణాటకలో ప్రస్తుత పరిణామాల వల్ల రాజ్యంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కర్ణాటక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కావేరి జలాలను విడుదల చేయడం సాధ్యంకాదని ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేయవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల ఎన్నోవివాదాలు ఏర్పడుతాయని న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. నదీజలాల పంపకాల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందని, అంతేగాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు. కాగా కావేరి జలాల విడుదలపై కర్ణాటక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు. -
మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది
-
మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది
బెంగళూరు: కావేరి జలాల విషయంలో తమకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు ఆరు రోజుల పాటు కావేరి జలాలను విడుదల చేశామని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాన్ని పాటించడం ఇబ్బందికరమైనా, తాము ఇప్పటికీ తీర్పుకు కట్టుబడిఉన్నామని తెలిపారు. కర్ణాటకలో తాగునీటికి సమస్య ఏర్పడినా, కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేశామని చెప్పారు. కావేరి జలాల వివాదంతో కర్ణాటక, తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సిద్ధరామయ్య మంగళవారం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని సిద్ధరామయ్య చెప్పారు. ప్రజలందరూ సంయమనంతో ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. 'కావేరి వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాను. ప్రధానిని కలిసేందుకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరాను. రేపు నేను ఆయనతో కలిసే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా పిలిచి చర్చించాల్సిందిగా మోదీనికి విజ్ఞప్తి చేశా. ఏ సమస్యకైనా హింసే పరిష్కారం కాదు. న్యాయ వ్యవస్థపై నమ్మకముంది' అని సిద్ధరామయ్య అన్నారు. కావేరి వివాదం కారణంగా తమిళనాడులో కన్నడిగులపై, కర్ణాటకలో తమిళులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు మైసూర్, మండ్యా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగళూరులో తమిళనాడుకు చెందిన బస్సులు, లారీలు, ఇతర వాహనాలను ఆందోళనకారులు దహనం చేశారు. బస్సు డిపోలో ఆపిన 40 ఓల్వో బస్సులకు నిప్పంటించారు. సరిహద్దుల్లో తమిళనాడుకు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. తమిళుల ఆస్తులపైనా దాడికి పాల్పడ్డారు. పోలీసుల కాల్పుల్లో బెంగళూరులో ఓ వ్యక్తి మరణించాడు. -
మోసం చేశారంటూ సీఎంపై ఫిర్యాదు
కావేరీ నదీ జలాల సంక్షోభం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కష్టాలను తెచ్చిపెడుతోంది. కొందరు బీజేపీ కార్యకర్తలు సీఎంపై మాండ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. రాష్ట్రానికి ఓ వైపు అవసరమైన నీళ్లు లేని సమయంలో ఇతర రాష్ట్రాలకు నీళ్లు వదిలి కర్ణాటక రైతులను సిద్ధరామయ్య మోసం చేస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కావేరి జలాలను క్రిష్ణ రాజ సాగర రిజర్వాయర్ నుంచి తమిళనాడుకు విడుదల చేయడంపై ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలసిందే. పొరుగు రాష్ట్రానికి నీళ్లు ఇస్తూ తనను నమ్ముకున్న కర్ణాటక రైతులను మోసం చేశారని ఆ కార్యకర్త ఆరోపించాడు. నీటి విడుదల కారణంగా మాండ్య జిల్లాలోని పంటలకు నీటి కష్టాలు తప్పవు. సిద్దరామయ్య చర్య వల్ల ఆ జిల్లా రైతులు మోసపోతున్నారని ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు. తమిళనాడుకు ప్రతిరోజూ 15వేల క్యూసెక్కుల నీళ్లు ఇస్తూనే ఉంటే.. ఇక మీదట బెంగళూరు నగర వాసులకు తాగడానికి నీళ్లుండవని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించడానికి మాత్రమే నీటిని విడుదల చేశామని, వాస్తవానికి తమిళనాడు పరిస్థితి కర్ణాటక కంటే చాలా మెరుగ్గా ఉందని కూడా ప్రధానికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. -
మాకు తాగేందుకు కూడా నీళ్లుండవు: సీఎం
తమిళనాడుకు ప్రతిరోజూ 15వేల క్యూసెక్కుల నీళ్లు ఇస్తూనే ఉంటే.. ఇక మీదట బెంగళూరు నగర వాసులకు తాగడానికి నీళ్లుండవని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. కావేరీ నదీ జలాల సంక్షోభంపై ఆయన ప్రధానికి రెండు పేజీల లేఖ రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, తనకు మీ సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటుచేయాలని అందులో కోరారు. తమిళనాడుకు నీటి విడుదల వల్ల కావేరీ పరివాహక ప్రాంతంలో రైతులకు కూడా తీవ్ర కష్టాలు తప్పవన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితి కొనసాగితే.. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుందని, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయొద్దని బీజేపీ రాష్ట్ర శాఖ చెబుతోందని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు. అయితే.. రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందువల్ల తాను మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తున్నానని అన్నారు. తమిళనాడు పరిస్థితి కర్ణాటక కంటే చాలా మెరుగ్గా ఉందని, మెట్టూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు బాగున్నాయని, ఆ రాష్ట్ర ఈశాన్య ప్రాంతంలో కూడా వర్షాలు బాగున్నాయని చెప్పారు. ఆ నీళ్లు వరి పంటకు సరిపోతాయని తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేసి.. సమస్యను పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరారు. -
సిద్ధు ఘాటు వ్యాఖ్యలు
బెంగళూరు: 'శవాలతో రాజకీయం చేయొద్దు. ఇలాంటి రాజకీయాల పట్ల మాకు నమ్మకం లేద'ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి కేజే జార్జి రాజీనామా అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో స్వచ్ఛందంగా మంత్రి పదవికి జార్జి రాజీనామా చేశారని చెప్పారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై కేసులు నమోదైనా ఎందుకు రాజీనామా చేయించలేదని బీజేపీని ప్రశ్నించారు. 'మాథుర వైద్యుడి మృతి కేసులో స్మృతి ఇరానీపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఆమెకు మంత్రిగా కొనసాగే హక్కు ఉందా? నరేంద్ర మోదీ కొత్తగా తీసుకున్న 19 మంత్రుల్లో ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. దీనిపై బీజేపీ పార్టీ నోరు మెదపదు. జార్జి రాజీనామా చేయాలని మాత్రం డిమాండ్ చేస్తుంద'ని సిద్ధరామయ్య మండిపడ్డారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జ్‌కు ఎలాంటి సంబంధం లేదని, విపక్షాలు తమ స్వార్థం కోసం ఆయన్ను బలిపశువును చేశాయని వాపోయారు. -
సీఎం పదవికి ముప్పు తప్పదా ?
నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తున్న అసమ్మతి నేతలు సోనియా, రాహుల్‌తో భేటీ అయ్యేందుకు సమాలోచనలు సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణను సారథ్యం వహించాల్సిందిగా కోరుతున్న వైనం బెంగళూరు : మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ద్వారా అధికార పార్టీ కాంగ్రెస్‌లో రేగిన అసమ్మతి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ ‘జ్వాలలు’ సీఎం సిద్ధరామయ్య పదవికి ముప్పులా పరిణమించాయి. సీఎం సిద్ధరామయ్యపై అసంతృప్తితో రగిలిపోతున్న తాజా మాజీ మంత్రులు, మరికొంత మంది ఎమ్మెల్యేలు హైకమాండ్‌ను కలిసి సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించే దిశగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగకపోతే 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం కష్టమంటూ హైకమాండ్‌కు విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ వల్ల పదవిని పోగొట్టుకున్న శ్రీనివాసప్రసాద్, ఖమరుల్ ఇస్లామ్, బాబూరావ్ చించనసూర్, అంబరీష్లతోపాటు మంత్రి మండలిలో స్థానాన్ని ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు మాలకరెడ్డి, ఎస్.టి.సోమశేఖర్ తదితరులు 20 మంది అసంతృప్తులు గ్రూపుగా ఏర్పడి తమకు సారథ్యం వహించాల్సిందిగా పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఎస్.ఎం.కృష్ణ మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ అనంతర పరిణామాలపై అసంతృప్త నేతలతో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. అసంతృప్త నేతల విన్నపాన్ని ఆలకించిన ఎస్.ఎం.కృష్ణ మాత్రం ‘దుందుడుకు నిర్ణయాలు ఏవీ వద్దు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని హైకమాండ్ గమనిస్తోంది. ఈ విషయంపై హైకమాండ్ నిర్ణయమేమిటో వేచి చూద్దాం, అంతవరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వంటి కార్యక్రమాలేవీ చేయబోకండి’ అని పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ అసంతృప్త నేతలంతా వారం రోజుల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీ ఎదుర్కొనే సమస్యలను వివరించేందుకు సమాయత్తమవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటితో పాటు జాఫర్ షరీఫ్ వంటి సీనియర్ నేతలు సైతం సీఎం సిద్ధరామయ్యను ‘ఆయనింకా చిన్నపిల్లాడు’ అంటూ సంబోధిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసమ్మతి జ్వాలలు సీఎం సిద్ధరామయ్య పదవికి ముప్పు తెచ్చిపెట్టే విషయం కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో పదువులను కోల్పోయిన వారితో పాటు అసంతృప్త ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు అటు బీజేపీ, ఇటు జేడీఎస్‌లు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో, అటు తనపై చెలరేగిన అసమ్మతిని చల్లార్చడంతో పాటు పార్టీలోని ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా చూడడంలో సీఎం సిద్ధరామయ్య తలమునకలయ్యారు. ఇక మంత్రి పదవిని పోగొట్టుకొని తనపై విమర్శలకు దిగిన తాజా, మాజీ మంత్రులను బుజ్జగించాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయలను సీఎం సిద్ధరామయ్య కోరినట్లు సమాచారం. -
మూడు టీఎంసీలివ్వండి
నారాయణపూర్ నుంచి విడుదల చేయాలని కర్ణాటక సీఎంను కోరిన టీ కాంగ్రెస్ సాక్షి, బెంగళూరు: తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా కర్ణాటకలోని నారాయణ్‌పూర్ జలాశయం నుంచి జూరాలకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. తెలంగాణ ప్రతిపక్ష నేతల బృందం మంగళవారం బెంగళూరులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిద్ధరామయ్యతో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఏర్పడ్డ తీవ్ర కరువు పరిస్థితుల గురించి తెలంగాణ నేతలు సీఎంకు వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కర్ణాటక నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. కర్ణాటక పరిధిలో జరగాల్సిన రాజోలిబండ మళ్లింపు పథకం ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ ‘కర్ణాటకలో సైతం ప్రస్తుతం తీవ్ర కరువు తాండవిస్తోంది. అయినప్పటికీ మానవతా దృక్పథంతో తెలంగాణకు ఒక టీఎంసీ నీటిని ఇస్తాం’’ అని హామీ ఇచ్చారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన సిద్ధరామయ్యకు తెలంగాణ నేతలు క ృతజ్ఞతలు తెలిపారు. -
కర్ణాటక సీఎంతో టి.కాంగ్రెస్ నేతల భేటీ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం భేటీయ్యారు. ఆర్డీఎస్ పనులను వెంటనే చేపడతామని కర్ణాటక సీఎం చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. తీవ్ర కరవుతో అల్లాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి కోసం ఒక టీఎంసీ నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
సీఎంగారు ఢిల్లీకి రండి
సీఎం సిద్దుకు అధిష్టానం పిలుపు బెంగళూరు : ఇటీవల వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. ఈ నేపథ్యంలో ఈనెల 23న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నింటిపై ఇప్పటికే సమాచారాన్ని క్రోడీకరించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయాలపై సీఎం సిద్ధరామయ్యను వివరణ కోరనుంది. ఇదే సందర్భంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన సైతం సిద్ధరామయ్యలో నెలకొంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో తాను చేపట్టిన పర్యటన వివరాలను సైతం సిద్ధరామయ్య పార్టీ హైకమాండ్‌కు తెలియజేయనున్నారు. అంతేకాక ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు సమాచారం. -
‘సిద్ధు’పై హైకమాండ్ గరం...
కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ను ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం రాష్ట్ర పరిణామాలపై సోనియా ఆరా బెంగళూరు: లక్షల రూపాయల విలువ చేసే లగ్జరీ వాచ్ వ్యవహారంతో ప్రతిపక్షాల విమర్శలకు గురైన సిద్ధరామయ్య ఆ తర్వాత ఏకపక్షంగా ఏసీబీ ఏర్పాటు చేసి అటు విపక్షాలు, వివిధ సంస్థలతో పాటు స్వపక్షంలోని నేతల నుంచిసైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఏకపక్షంగా ఏసీబీ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైతం సీఎం సిద్దరామయ్యను వివరణ కోరింది. ఇక కరువు నిర్వహణలో సైతం సిద్ధరామయ్య విఫలమయ్యారంటూ స్వయానా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ మండిపడిన విషయమూ తెలిసిందే. ఇలా గత కొంతకాలంగా ఏదో ఒక విషయంపై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సీఎం సిద్ధరామయ్య ఇప్పుడేమో పుత్రవ్యామోహంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం రాష్ట్రంలో మరో వివాదాన్ని రేకెత్తించింది. కేవలం ల్యాబ్‌ల ఏర్పాటు విషయమే కాదు తన కుమారుడి స్నేహితుడికి నిబంధనలకు విరుద్ధంగా బీడీఏ స్థలాన్ని కేటాయించడం ద్వారా రూ.150 కోట్ల అక్రమాలకు తెరతీశారని వచ్చిన ఆరోపణలు సిద్ధరామయ్యను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు సిద్ధరామయ్యపై ఉన్న అసహనాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా వివరాలు తెలుసుకున్నారు. పరమేశ్వర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు...... రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బి.ఎస్.యడ్యూరప్ప బాధ్యతలను చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలకలం మొదలైన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో సీఎం సిద్ధరామయ్యపై తలెత్తుతున్న వివాదాలు బీజేపీకి అనుకూలిస్తాయని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన పరమేశ్వర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై దాదాపు అరగంట పాటు చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించి టెండర్లు కేటాయించడంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఏమీ లేదని ఆయన సోనియాగాంధీకి వివరించినట్లు సమాచారం. సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతోనే ప్రతిపక్షాలు ఈ విషయంపై విమర్శలు గుప్పిస్తున్నారని అధినేత్రికి వివరించారు. అయితే సోనియాగాంధీ మాత్రం ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదని సమాచారం. సిద్ధరామయ్యపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీని సైతం చిక్కుల్లోకి నెట్టేస్తాయని సోనియాగాంధీ భావిస్తున్నారు. మే 13 నాటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటిని వివరిస్తూ ఆయన్ను పదవి నుంచి తప్పించే దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
'సీఎం కుమారుడు వైదొలగాలని సూచించా'
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా ఉన్న కంపెనీ మ్యాట్రిక్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు కట్టబెట్టారని వచ్చిన ఆరోపణలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఆ సంస్థ నుంచి వైదొలగమని సిద్ధరామయ్య.. ఆయన కుమారుడికి చెప్పాల్సిందిగా సూచించినట్టు చెప్పారు. కాగా మ్యాట్రిక్స్‌కు కాంట్రాక్టు అప్పగించిన విషయంపై విచారణకు ఆదేశించాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రిని కోరుతారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు దిగ్విజయ్ అవసరంలేదని బదులిచ్చారు. 'కాంట్రాక్టు ఇచ్చే విషయం పూర్తిగా పారదర్శకంగా జరిగింది. ఈ ఫైలు సీఎం దగ్గరకు రాలేదు. విచారణకు ఆదేశించాలని నేను సీఎంను కోరను. కంపెనీ నుంచి సిద్ధరామయ్య కొడుకు వైదొలగాలని మాత్రమే సలహా ఇచ్చాను. ఇది ఆదేశం కాదు. సలహా మాత్రమే' అని దిగ్విజయ్ చెప్పారు. రాజేష్గౌడ డెరైక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్స్ సంస్థలో సిద్ధరామయ్య కుమారుడైన డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా చేరడం, అదే మ్యాట్రిక్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసే కాంట్రాక్టును కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
సీఎంకు ఆ వాచీ ఎలా వచ్చిందో తేల్చండి
ఏసీబీకి తొలి ఫిర్యాదు ఫిర్యాదు చేసిన న్యాయవాదులు బెంగళూరు: స్వపక్షంలోని నేతలతో పాటు విపక్షాలు, సాధారణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా అవినీతిని అరికట్టడానికి అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం గత నెల 14న ఏర్పాటుచేసిన అవినీతి నిరోధక దళం (ఏసీబీ)కు శనివారం మొదటి ఫిర్యాదు అందింది. అయితే ఏసీబీని ఏర్పాటు చేసి పదహేను రోజులైనా ఆ సంస్థకు కార్యాలయం లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోకాయుక్తను మూసివేసే చర్యల్లో భాగంగా ఏసీబీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సీఎం స్థానంలోని ముఖ్యమంత్రికి దాదాపు రూ.75 లక్షల విలువైన వాచ్ గిఫ్ట్‌గా వచ్చిన విషయమై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. దీని వెనక పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దర్యాప్తు చేయాల్సింది.’ అని లిఖిత పూర్వకంగా కోరుతూ న్యాయవాదులైన అమృతేష్, నటరేశ్ శర్మలు ఖనిజభవన్కు వచ్చారు. ఈ విషయమై అమృతేష్ మీడియాతో మాట్లాడుతూ...‘ రాష్ట్ర హైకోర్టు కూడా ఏసీబీ అవసరం ఏమిటని తలంటింది. అసలు ఏసీబీ కార్యాలయం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. బెంగళూరులోని ఖనిజభవన్లో ఏసీబీ కార్యాలయం ఉందని సామాన్య ప్రజలు ఎవరైనా తమ ఫిర్యాదును అందజేయవచ్చునని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొణ్ణన్న సమాధానం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అందువల్లే మేము ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఏసీబీ కార్యాలయమే కాక ఏసీబీ కోసమంటూ ప్రభుత్వం నియమించిన అధికారి ఒక్కరూ లేరు. ఇలా అయితే అవినీ పై దర్యాప్తు ఎలా సాగుతుంది. లోకాయుక్త ఉన్నప్పుడు ఏసీబీ అవసరమేలేదు’ అని పేర్కొన్నారు. అనంతరంనృపతుంగ రోడ్డులోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో తమ ఫిర్యాదును అందజేశారు. -
సీఎం రాజకీయ కార్యదర్శి ఇంట్లో ఐటీ సోదాలు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ గోవిందరాజ్ నివాసంపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. మంగళవారం ఉదయం బెంగళూరు ఇందిరానగర్‌లో ఉన్న గోవిందరాజ్ నివాసంతో పాటు స్వంతంత్ర ఎమ్మెల్సీ మల్లికార్జున ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
రూ.1.38 లక్షల పట్టుచీర కొన్న సీఎం
సాక్షి, బళ్లారి: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. రూ.1.38 లక్షల విలువైన పట్టు చీరను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. మంగళవారం దావణగెరెలోని మహానగర పాలికె పరిధిలో నూతనంగా నిర్మించిన వ్యాపార భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మైసూరు పట్టు చీరల వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడ ప్రదర్శించిన పట్టు చీరలను పరిశీలిస్తూ అద్భుతంగా ఓ చీర కన్పించడంతో దాన్ని కొనుగోలు చేశారు. కొద్ది రోజుల క్రితం బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేశ్ చెంప చెళ్లుమనిపించి సిద్ధరామయ్య పతాక శీర్షికలకు ఎక్కారు. ఇప్పుడు విలువైన చీర కొని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. -
రాహుకాలం, యమగండం వేటిపైనా నమ్మకం లేదు !
బెంగళూరు : రాహుకాలం, యమగండం వంటి విషయాలపై తనకు నమ్మకం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. శనివారం ఉదయం మైసూరులోని తన నివాసంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జంబూ సవారీ యమగండ సమయంలో ప్రారంభించారనే అంశంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు అన్ని సమయాలు మంచివే. కాకపోతే కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయకూడదంటూ జ్యోతిష్యులు చెబుతుంటారు. వీటిపై ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదు. జంబూ సవారి యమగండ సమయంలో ప్రారంభించిన విషయంలో కూడా ఇప్పుడు చర్చ అనవసరం. అన్ని సమయాలు మంచివే, కాకపోతే ఆయా సమయాల్లో ఆపనిని ప్రారంభించే మనిషి మనస్థితిపైనే మిగతా అంశాలు ఆధారపడి ఉంటాయి’ అని పేర్కొన్నారు. తమిళనాడుకు ఇప్పటికే నీరు అందించాం రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేశామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిందని, మైసూరు, మండ్య, బెంగళూరు వాసులకు కేవలం తాగేందుకు మాత్రమే నీరు మిగిలి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక తమిళనాడుకు నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని తమిళనాడు ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలని కోరారు. లేదంటే తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టులోనే ఎదుర్కొంటామని అన్నారు. ఇక కేంద్రమంత్రి వి.కె.సింగ్ దళితులపై చేసిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. ఓ కేంద్రమంత్రి స్థానంలో ఉండి దళితులపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని అన్నారు. ఏదైనా విషయంపై మాట్లాడేటపుడు అందుకు సంబంధించిన సాదక, బాధకాలపై పూర్తిగా తెలుసుకొని మాట్లాడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. బాధ్యతా రహితంగా ఈ తరహా వ్యాఖ్యలు చేసే వారిని ప్రధాని మోదీ తన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
సీఎంగారి కండువా ఖర్చు 5 లక్షలు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాదాపు సంప్రదాయ వస్త్రధారణలోనే ఉంటారు. భుజంపై కండువా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన భుజంపై అలా సింపుల్‌గా కనిపించే కండువా ఖజానాపై మోపుతున్న భారం వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. సమాచార హక్కు చట్టం ద్వారా మరిలింగె గౌడ అనే ఆర్టీఐ కార్యకర్త సంపాదించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సీఎం కండువాల కోసం రాష్ట్రసర్కారు రూ.4.78 లక్షలు ఖర్చు చేసిం ది. వాటిలో చేతి టవళ్లు, ఫేస్ టవళ్లు, స్నానపు టవళ్లు తదితరాలు ఉన్నాయి. సిద్ధరామయ్య గారి ఇంట్లో దుప్పట్లు, బెడ్షీట్లు మొదలైన అవసరాల కోసం మరో రూ.4.79 లక్షలు సమర్పించుకుంది. మొత్తంమీద సీఎంగారి అధికారిక నివాసంలో కనీసావసరాల కోసం ఆర్నెళ్లలో రూ.39.73 లక్షలు ఖర్చు చేశారు. -
ట్రాఫిక్ అంతరాయానికి సీఎం క్షమాపణలు
బెంగళూరు: ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పారు. తన వల్ల బెంగళూరు వాసులకు ట్రాఫిక్ చిక్కులు ఏర్పడినందుకు చింతిస్తున్నానని అన్నారు. త్వరలో జరగబోయే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో బెంగళూరు వాసులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై విమర్శలు రావడంతో సీఎం సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పారు. ఇదిలావుండగా బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో సొంత రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీ తారలను ఉపయోగించుకునేందుకు కేపీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని రమ్యా, భావనతో పాటు చిరంజీవి, ఖుష్భును ఆహ్వానించినట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. -
మోదీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సీఎం
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చైనా పర్యటనకు వెళ్లడం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. పంచాయతీ ఎన్నికల కారణంగా వెళ్లలేకపోతున్నానని చెప్పారు. ప్రధాని నుంచి తనకు ఆహ్వానం ఆలస్యంగా అందిందని అన్నారు. సీఎం పదవి అధిష్టించిన రెండేళ్ల తర్వాత సిద్ధరామయ్య పంచాయతీ ఎన్నికల పరీక్ష ఎదుర్కొబోతున్నారు. మే 29, జూన్ 2న కర్ణాటకలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా మోదీ ఆఫర్ ను సిద్ధరామయ్య కదనడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలో స్వచ్ఛభారత్ అభియాన్ టాస్క్ ఫోర్స్ కు కన్వీనర్ గా ఉండాలని కోరగా ఆయన తిరస్కరించారు. సభ్యుడిగా మాత్రమే ఉంటానని చెప్పారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు మోదీ చైనాలో పర్యటించనున్నారు. -
శ్రీవారి సేవలో సిద్దరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ఉదయం తిరుమల శ్రీనివాసుడిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ఇందుకోసం సోమవారం రాత్రి ఆయన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మంటపంలో సిద్దరామయ్యను వేదపండితులు ఆశీర్వదించారు. అలయ అధికారులు లడ్డూ, ప్రసాదాన్ని కర్ణాటక సీఎంకు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సిద్దరామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.