
బెంగళూరు: భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నేత ప్రవీణ్ నెట్టార్‌ను పొట్టనబెట్టుకున్న వారిపై కఠిన చర్యలుంటాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. దేశ వ్యతిరేకులు, మతతత్వ శక్తులను ఏరిపారేసేందుకు అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రవీణ్ హత్య కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రవీణ్ హంతకులను ఎన్‌కౌంటర్ చేయాలని కర్ణాటక మంత్రి సీఎన్ అశ్వత్థ నారాయణ్ అన్నారు. ప్రవీణ్‌ను దక్షిణ కన్నడ జిల్లాలోని ఆయన సొంతూరులో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
బైక్‌పై వెంబడించి దారుణ హత్య..
దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు ఈనెల 27న దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ప్రవీణ్ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. కాగా.. ప్రవీణ్ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్నారు. అయితే, మంగళవారం రాత్రి షాప్‌ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి మరీ నరికి చంపారు.
ఇదీ చదవండి: Karnataka BJP Leader Murder: అర్ధరాత్రి టెన్షన్.. టెన్షన్.. బైక్‌పై వెంబడించి మరీ బీజేపీ నేతను చంపారు