సుధీర్ఘ మంతనాల తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి వ్యవహారం కొలిక్కి వచ్చింది. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఒక్కరే ఉంటారని తెలిపారు. దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.30కు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటున్నారు.
అయితే ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే సిద్ధరామయ్యనే సీఎంగా అవుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానంతోపాటు ఎమ్మెల్యేలు సైతం సినీయారిటీకే మొగ్గుచూపారు. అయితే సీఎం పదవి తప్ప మరే స్థానం అవసరం లేదంటూ డీకే బెట్టు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించేందుకు పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది.
చదవండి: నేను పూర్తి సంతోషంగా లేను: డీకే శివకుమార్
సుధీర మంతనాలు
సీఎంపై ఏకాభిప్రాయం కోసం గత మూడు రోజులుగా సిద్ధరామయ్య, డీకేశివకుమార్‌తో అధిష్టానం మంతనాలు జరిపినప్పటికీ పంచాయితీ ఎటూ తేలలేదు. సీఎం పీఠం నుంచి తగ్గేదేలే అంటూ డీకే తేగేసి కూర్చున్నారు. దీంతో డీకేను సముదాయించేందుకు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ విస్తృతంగా చర్చలు జరిపారు. సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత చివరకు డీకే.. అధిష్ఠానం ప్రతిపాదనలను అంగీకరించారు.
డీకేను బుజ్జగించిన సోనియా
అయితే డిప్యూటీ సీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సోనియా జోక్యంతో ఉప ముఖ్యమంత్రి పదవికి డీకే అయిష్టంగానే అంగీకరించినట్లు వర్గాలు పేర్కొన్నాయి. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా సోనియా డీకేతో మాట్లాడి బుజ్జగించినట్లు తెలిపాయి. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సోదరుడు డీకే సురేష్ తెలిపారు. ‘మా అన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు. ఈ నిర్ణయంతో మేం సంతోషంగా లేము. కేవలం కర్ణాటక, పార్టీ ప్రయోజనాలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాడు’ అని పేర్కొన్నారు.
చదవండి: జల్లికట్టు వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment