కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. 2022లో జరిగిన నిరసనల్లో రోడ్డును బ్లాక్ చేశారంటూ సీఎం సిద్ధరామయ్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఫిర్యాదుదారునికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులపై విచారణకు సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఇదే కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగా రెడ్డి, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాలకు ఈ నెల మొదట్లో కర్ణాటక హైకోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే వారంతా ప్రజాప్రతినిధి కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళతే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బెలగావి నివాసి. ఆయన ఉడిపిలోని ఓ హోటల్‌లో శవమై కనిపించాడు. తన కాంట్రాక్టు పనులలో నాటి మంత్రి ఈశ్వరప్ప కమీషన్ డిమాండ్ చేశారని సంతోష్ పాటిల్ ఆరోపించాడు. ఆ తర్వాత మంత్రి ఈశ్వరప్ప తనపై వస్తున్న ఆరోపణలను తిరస్కరించడమే కాకుండా సంతోష్ పాటిల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఆ తరువాత పాటిల్ వాట్సాప్ మెసేజ్‌లో తన మరణానికి మంత్రి మంత్రి ఈశ్వరప్ప బాధ్యుడని పేర్కొన్న విషయం వెలుగు చూసింది.
ఈ నేపధ్యంలో 2022 ఏప్రిల్‌లో ఇదే కేసులో కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రస్తుత సీఎం సహా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. నాటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇంటిని చుట్టుముట్టడంతోపాటు పలు రహదారులను బ్లాక్ చేశారు. దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment