సీఎంగారి కండువా ఖర్చు 5 లక్షలు! | Karnataka CM Siddaramaiah Spend rs 5 lakh for Kanduva | Sakshi

సీఎంగారి కండువా ఖర్చు 5 లక్షలు!

Oct 2 2015 9:39 AM | Updated on Sep 3 2017 10:21 AM

సీఎంగారి కండువా ఖర్చు 5 లక్షలు!

సీఎంగారి కండువా ఖర్చు 5 లక్షలు!

ఆయన భుజంపై అలా సింపుల్‌గా కనిపించే కండువా ఖజానాపై మోపుతున్న భారం వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాదాపు సంప్రదాయ వస్త్రధారణలోనే ఉంటారు. భుజంపై కండువా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన భుజంపై అలా సింపుల్‌గా కనిపించే కండువా ఖజానాపై మోపుతున్న భారం వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి.

సమాచార హక్కు చట్టం ద్వారా మరిలింగె గౌడ అనే ఆర్టీఐ కార్యకర్త సంపాదించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సీఎం కండువాల కోసం రాష్ట్రసర్కారు రూ.4.78 లక్షలు ఖర్చు చేసిం ది. వాటిలో చేతి టవళ్లు, ఫేస్ టవళ్లు, స్నానపు టవళ్లు తదితరాలు ఉన్నాయి.

సిద్ధరామయ్య గారి ఇంట్లో దుప్పట్లు, బెడ్‌షీట్లు మొదలైన అవసరాల కోసం మరో రూ.4.79 లక్షలు సమర్పించుకుంది. మొత్తంమీద సీఎంగారి అధికారిక నివాసంలో కనీసావసరాల కోసం ఆర్నెళ్లలో రూ.39.73 లక్షలు ఖర్చు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement