Kanduva
-
కండువా కథ చాలానే!
‘కండువా మార్చాడు’.. పార్టీ మారితే సాధారణంగా వినిపించే మాటిది. ఒక లీడర్ పార్టీ మారితే అతని వెంట పదులు, వందల సంఖ్యలో వెళ్తారు. వాళ్లంతా కండువాలు మార్చుకోవాల్సిందే. పైకి కనిపించకపోయినా ఈ ఖర్చు ఎక్కువే అంటున్నారు నేతలు. ఆ పార్టీ..ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికలప్పుడు వీటి అవసరం భారీగానే ఉంటోంది. నియోజకవర్గానికి ఈ ఖర్చు రూ.లక్షల్లోనే ఉంటుంది. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వరకూ.. కండువాల తయారీకి ప్రసిద్ధి సిరిసిల్ల. ఈ ప్రాంతంలో 25 కుటుంబాలు ఇదే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు మించి హైదరాబాద్‌లో ఎక్కువగా తయారీ అవుతున్నాయని సిరిసిల్ల నేత కార్మికులు చెబుతున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో నేత కార్మికులు హైదరాబాద్‌లో ప్రింటింగ్ చేయాల్సి వస్తోంది. నేతలు కూడా అనేక రకాలను కోరుకుంటున్నారు. కండువాపై పార్టీ నేతలు, లేదా తన కేడర్‌తో పార్టీ మారాలనుకునే వారి ఫొటోలతో కండువాలు ముద్రించాలని కోరుతున్నారు. ఇందుకు కొంత నాణ్యత అవసరమని, దీనికోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని సిరిసిల్లకు చెందిన భూపాల్ తెలిపారు. ఒక్కో కండువా తయారీకి రూ.3 ఖర్చు అవుతోందని, తాము రూ. 3.50కు అమ్ముతున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు లక్ష కండువాలు అవసరమయ్యే వీలుందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు ముందుగా ఏ పార్టీ గుర్తు లేకుండా తయారు చేస్తున్నట్టు నేత కార్మికుడు నీరజ్ తెలిపారు. కండువాకూ కోడ్ కష్టాలు.. కండువాకూ ఎన్నికల కోడ్ ఇబ్బందులు తప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించే క్రమంలో కండువాలకు బిల్లులు అడుగుతున్నారని చెప్పారు. బిల్లులు లేకుండా తీసుకెళ్లడం కష్టమని రాజకీయ నేతలంటుంటే... ఈ మొత్తం అక్కౌంట్స్‌లో జమ చేస్తే ఎన్నికల సమయంలో ఇతరత్రా కష్టాలు వస్తాయని నేత కార్మికులు అంటున్నారు. ఇక కండువాలకు అవసరమైన సిల్క్, పాలిస్టర్ వ్రస్తాన్ని తీసుకురావడానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయని తయారీదారులు తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లకుండా, అనేక మార్గాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని హైదరాబాద్‌కు చెందిన కండువాల తయారీదారు సంజయ్‌గుప్తా తెలిపారు. ఆర్డర్లే కాదు... ఇబ్బందులూ ఉన్నాయి తెలంగాణ నుంచే కాదు... ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. దీనికోసం కార్మికులను ఎక్కువ సంఖ్యలో నియమించుకోవాల్సి వస్తోంది. ఇదే తరుణంలో ఎన్నికల సమయం కావడంతో కార్మికులు ఎక్కువ అడుగుతున్నారు. కొన్నిసార్లు వారు దొరికే పరిస్థితీ లేదు. నేతలు బిల్లులు కోరడం కూడా వ్యాపారానికి ఇబ్బందిగానే ఉంది. నగదు బదిలీ కష్టమవుతోంది. అయితే కండువాల వల్ల చాలామందికి ఉపాధి మాత్రం లభిస్తోంది. – ద్యావనపల్లి మురళి (కండువాల వ్యాపారి, సిరిసిల్ల) -
అన్నవరంలో కొత్త నిబంధన
అన్నవరం (ప్రత్తిపాడు): తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించే భక్తులు ఇకపై విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎంవీ సురేష్‌బాబు తెలిపారు. స్వామివారి వ్రతం, నిత్య కల్యాణం, ఇతర సేవలలో పాల్గొనేటప్పుడు, స్వామివారి దర్శనం సమయంలో తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అనుమతిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పురుషులు పంచె, కండువా ధరించాల్సి ఉంటుందన్నారు. షర్టు ధరించవచ్చు, ప్యాంటు మాత్రం ధరించకూడదని తెలిపారు. మహిళలు చీర, పంజాబీ డ్రెస్ వంటివి ధరించాలి. ఫ్యాషన్ దుస్తులు ధరించి వస్తే స్వామివారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఈవో వివరించారు. దేవస్థానం సత్రాలలో వసతి గదులు తీసుకునే భక్తులు జూలై ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా గదులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గదులు కావాల్సినవారు తప్పనిసరిగా ఆధార్‌కార్డ్ చూపించాలన్నారు. ఎవరి పేరుపై రూమ్ రిజర్వ్ అయి ఉంటుందో వారికే రూమ్ ఇస్తారన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకున్న భక్తులు వారు రిజర్వేషన్ చేయించుకున్న సమయం దాటాక రెండు గంటల వరకు మాత్రమే గదులు ఇస్తారని, ఆ సమయం దాటితే మరో భక్తునికి ఆ గది కేటాయిస్తామన్నారు. నగదు వాపస్ కూడా ఇవ్వబోమని తెలిపారు. ప్రాకారం, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు రద్దు ఆలయ రక్షణ చర్యలలో భాగంగా జూలై ఒకటో తేదీ నుంచి స్వామివారి ఆలయ ప్రాకారంలో, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు చేసుకోవడం నిషేధించామని ఈవో తెలిపారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ఆలయం తలుపులు మూసేశాక ఆ ప్రదేశంలోకి ఎవరినీ అనుమతించరని వివరించారు. -
సీఎంగారి కండువా ఖర్చు 5 లక్షలు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాదాపు సంప్రదాయ వస్త్రధారణలోనే ఉంటారు. భుజంపై కండువా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన భుజంపై అలా సింపుల్‌గా కనిపించే కండువా ఖజానాపై మోపుతున్న భారం వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. సమాచార హక్కు చట్టం ద్వారా మరిలింగె గౌడ అనే ఆర్టీఐ కార్యకర్త సంపాదించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సీఎం కండువాల కోసం రాష్ట్రసర్కారు రూ.4.78 లక్షలు ఖర్చు చేసిం ది. వాటిలో చేతి టవళ్లు, ఫేస్ టవళ్లు, స్నానపు టవళ్లు తదితరాలు ఉన్నాయి. సిద్ధరామయ్య గారి ఇంట్లో దుప్పట్లు, బెడ్షీట్లు మొదలైన అవసరాల కోసం మరో రూ.4.79 లక్షలు సమర్పించుకుంది. మొత్తంమీద సీఎంగారి అధికారిక నివాసంలో కనీసావసరాల కోసం ఆర్నెళ్లలో రూ.39.73 లక్షలు ఖర్చు చేశారు.