
జేపీ నగరలో కుమారస్వామి నివాసం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి నగరంలోని జేపీ నగరలోని తన నివాసం నుంచే పరిపాలన సాగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంలకు ప్రభుత్వం కేటాయించే బంగ్లాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రులు నివాసం ఉండటానికి బెంగళూరులో అనుగ్రహ, కావేరీ బంగ్లాలు ఉన్నాయి. జయనగర్ నివాసం సెంటిమెంట్‌గా కలిసి రావడంతో కుమారస్వామి అక్కడకు వెళ్లేందుకు సుముఖంగా లేరు. అయితే సీఎం అధికారిక నివాసం కృష్ణ బంగ్లాను ప్రజలను కలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
కలిసి వచ్చిన ఇల్లు...
గతంలో 2007లో సీఎం పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి జేపీ నగర్‌లోని ఇంటి నుంచి వేరే నివాసానికి మకాం మార్చారు. అయితే జోతిష్యుల సలహా మేరకు 2018 ఎన్నికల ప్రచారానికి ముందే జేపీ నగర్‌లోని ఇంటికి మరమ్మతులు చేయించి అక్కడికి మారిపోయారు. ఈ ఇంట్లో ఉండగా, ఆయన సినీరగంలో పంపిణిదారుడిగా, నిర్మాతగా రాణించారు. తరువాత సీఎం కూడా అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment