బెంగళూరు: పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఈ ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు. కలబురిగిలో సోమవారం ఆయన మాట్లాడుతూ..‘సామాన్యుడికి భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించాలని తమ జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై అమ్మకం పన్ను 3.25, 3.27% చొప్పున తగ్గనుంది. ఇది ప్రస్తుతం 32%, 21 శాతంగా ఉంది’ అని వివరించారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.80, డీజిల్ రూ.76.21గా ఉంది.
మహారాష్ట్రలో లీటర్ పెట్రోలు రూ.91
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర రూ.90కు చేరుకుంది. ముంబై మినహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోలు ధర దేశంలోనే అత్యధికంగా రూ.91కి ఎగబాకింది. పెట్రోలు, డీజిల్‌లపై సర్‌చార్జితో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా 39% వరకు వ్యాట్ వసూలు చేస్తోంది.
‘పెట్రో’ ధరను రూ.2 తగ్గించిన కర్ణాటక
Published Tue, Sep 18 2018 3:00 AM | Last Updated on Tue, Sep 18 2018 3:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment